Ranji Trophy: సెంచరీతో చెలరేగిన ధ్రువ్‌ షోరే... | Ranji Trophy Del Vs AP: Dhruv Unbeaten Century Delhi Strong Reply | Sakshi
Sakshi News home page

Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్‌ షోరే... ఢిల్లీ దీటైన జవాబు

Published Fri, Jan 13 2023 8:39 AM | Last Updated on Fri, Jan 13 2023 8:50 AM

Ranji Trophy Del Vs AP: Dhruv Unbeaten Century Delhi Strong Reply - Sakshi

Ranji Trophy 2022-23 - Delhi vs Andhra- ఢిల్లీ: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ దీటైన రీతిలో జవాబిచ్చింది. ఓపెనర్‌ ధ్రువ్‌ షోరే (261 బంతుల్లో 142 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. హిమ్మత్‌ సింగ్‌ (45 బ్యాటింగ్‌), హృతిక్‌ షోకీన్‌ (45) అతడికి సహకరించారు.

దీంతో.. మ్యాచ్‌ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో షోయబ్‌ ఖాన్‌కు 2, నితీశ్‌ రెడ్డికి ఒక వికెట్‌ దక్కాయి. ప్రస్తుతం ఢిల్లీ మరో 159 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం చివరి రోజు కావడంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఎవరికి ఆధిక్యం లభిస్తుందనేది చూడాలి.

చదవండి: IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. సిరీస్‌ చిక్కింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement