Ranji Trophy 2022-23
-
బీసీసీఐని ఒప్పించాడు.. సౌ'స్వ'రాష్ట్రను గెలిపించాడు
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు అవతరించింది. గత 3 సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2019-20 సీజన్లో సైతం ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర తొలిసారి 1935-37 సీజన్లో.. ఆతర్వాత 1943-44 సీజన్లో రంజీ టైటిల్‌ను సాధించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్ట్‌ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా రెండు మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ మధ్యలో తన సొంత జట్టు సౌరాష్ట్ర రంజీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మూడో థాట్ పెట్టుకోని ఉనద్కత్.. తనను టీమిండియా నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బీసీసీఐ పెద్దలను అభ్యర్ధించాడు. తనను రిలీవ్ చేస్తే, తన సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొంటానని కోరాడు. ఉనద్కత్ విన్నపాన్ని మన్నించిన బీసీసీఐ.. అతను కోరిన విధంగానే టీమిండియా నుంచి రిలీవ్ చేసింది. దీంతో సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు ఉనద్కత్. తన సారధ్యంలో సౌరాష్ట్రను రెండోసారి ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతను.. అనుకున్న విధంగానే అన్నీ తానై సౌరాష్ట్రను గెలిపించుకున్నాడు. ఫైనల్లో ఏకంగా 9 వికెట్లు (3/44, 6/85) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం గెలిచాడు. ఉనద్కత్‌కు తన జట్టును గెలిపించుకోవాలన్న తపన, ఆకాంక్షను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోతేనేం, తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జట్టుకు ఆడాలన్న అతని కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉనద్కత్.. 13.88 సగటున 26 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. బెంగాల్: 174 & 241 సౌరాష్ట్ర: 404 & 14/1 9 వికెట్ తేడాతో సౌరాష్ట్ర విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జయదేవ్ ఉనద్కత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: అర్పిత్ వసవద (ఉనద్కత్ గైర్హాజరీలో సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఈ సీజన్లో రెండో లీడింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, 10 మ్యాచ్‌ల్లో 75.58 సగటున 3 సెంచరీల సాయంతో 907 పరుగులు చేశాడు, ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు, మయాంక్ 9 మ్యాచ్‌ల్లో 82.50 సగటున 3 సెంచరీల సాయంతో 990 పరుగులు చేశాడు) -
ఉనద్కత్ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. లోకల్ టీమ్ బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్ హీరో, బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG — BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023 ఉనద్కత్ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్ టీమ్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌కు జతగా చేతన్ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్ (0) వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్‌ను ఆకాశ్‌దీప్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. -
రంజీ ఫైనల్.. బెంగాల్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్‌సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
సమిష్టిగా చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ 174 ఆలౌట్
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర, వెస్ట్ బెంగాల్ మధ్య ప్రారంభమైన ఫైనల్ తొలిరోజే ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో బెంగాల్ జట్టు తక్కువస్కోరుకే పరిమితమైంది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైనప్పటికి.. లోయర్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ 69, అభిషేక్ పొరెల్ 50 పరుగులు చేయడంతో బెంగాల్ స్కోరు 170 అయినా దాటింది. ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, డీఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ 38, చేతన్ సకారియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
Ranji Trophy: 306 పరుగుల తేడాతో భారీ విజయం.. ఫైనల్లో బెంగాల్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో బెంగాల్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. 547 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 241 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటిదార్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. బెంగాల్ బౌలర్లలో ప్రదీప్తా ప్రమానిక్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ముఖేష్ కుమార్ రెండు వికెట్లు, షాబాజ్ అహ్మద్, ఆకాశ్ దీప్ చెరొక వికెట్ తీశారు. కాగా రంజీల్లో బెంగాల్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి. ఇంతకముందు 14సార్లు ఫైనల్ చేరినప్పటికి రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచిన బెంగాల్.. మిగతా 12సార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అంతకముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌట్ అయింది. మజుందార్ 120 పరుగులు, సుదీప్ ఘరామి 112 పరుగులు సెంచరీలతో చెలరేగారు. అభిషేక్ పొరెల్ 51 పరుగులతో రాణించాడు. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు 170 పరుగులకు కుప్పకూలింది. దీంతో బెంగాల్‌కు 268 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 279 పరుగులకు ఆలౌటై మధ్యప్రదేశ్ ముందు 547 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక కర్ణాటక, సౌరాష్ట్రల మధ్య జరుగుతన్న మరో సెమీఫైనల్ విజేతతో బెంగాల్ జట్టు ఫైనల్లో తలపడనుంది. 𝙄𝙣𝙩𝙤 𝙩𝙝𝙚 𝙁𝙞𝙣𝙖𝙡𝙨! 👏🏻👏🏻 Bengal register a 306-run victory over Madhya Pradesh in #SF1 of the @mastercardindia #RanjiTrophy and seal their position in the finals! Scorecard ▶️ https://t.co/ZaeuZQqC3Y #MPvBEN pic.twitter.com/pOWkc1gD41 — BCCI Domestic (@BCCIdomestic) February 12, 2023 -
సూపర్ ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసినా..!
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి కేవలం 3 పరుగుల ఆధిక్యంలో ఉంది. నికిన్ జోస్ (54) అజేయమైన హాఫ్‌సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మ్యాచ్ చివరి రోజు కర్ణాటక వేగంగా ఆడి కనీసం 250 పరుగుల టార్గెట్ సౌరాష్ట్రకు నిర్ధేశిస్తే కానీ గెలిచే అవకాశాలు లేవు. ఇలా జరగక మ్యాచ్ డ్రాగా ముగిస్తే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరుతుంది. మయాంక్ డబుల్ సెంచరీ, శ్రీనివాస్ శరత్ (66) హాఫ్ సెంచరీతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే ఆలౌట్ కాగా.. కెప్టెన్ వసవద (202) డబుల్ హండ్రెడ్, షెల్డన్ జాక్సన్ (160) భారీ శతకంతో చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులకు ఆలౌటైంది. తొలి సెమీస్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 547 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 279/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 438 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 170 పరుగులకే చేతులెత్తేసింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో సుదీప్ ఘర్మానీ (112), మజుందార్ (120) సెంచరీలతో చెలరేగగా.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సరాన్ష్ జైన్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుతుంది. -
జాక్సన్, అర్పిత్ సెంచరీలు.. కర్ణాటకకు ధీటుగా బదులిస్తున్న సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కర్ణాటక-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ అగర్వాల్ (249) డబుల్ సెంచరీతో విజృంభించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా బదులిస్తుంది. షెల్డన్ జాక్సన్ (160) భారీ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ అర్పిత్ వసవద (112 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. వీరిద్దరూ శతకాలతో విరుచుకుపడటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. అర్పిత్ వసవదకు జతగా చిరగ్ జానీ (19) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికి సౌరాష్ట్ర.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 43 పరుగులు వెనుకపడి ఉంది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (33), విశ్వరాజ్ జడేజా (22) పర్వాలేదనిపించగా.. స్నెల్ పటేల్ (0) నిరాశపరిచాడు. కర్ణాటక బౌలర్లలో విద్వత్ కావేరప్ప 2 వికెట్లు పడగొట్టగా.. వాసుకి కౌశిక్, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్ డబుల్ సెంచరీతో రెచ్చిపోగా.. శ్రీనివాస్ శరత్ (66) అర్ధసెంచరీతో అలరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కే పటేల్ చెరి 3 వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక, బెంగాల్-మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ 327 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 59 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలిన మధ్యప్రదేశ్.. ఈ మ్యాచ్‌లో ఓటమి దిశగా పయనిస్తుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్
టీమిండియాకు దూరమైన మయాంక్ అగర్వాల్ రంజీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ కర్ణాటక కెప్టెన్ గురువారం డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 626 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మయాంక్ 429 బంతులెదుర్కొని 249 పరుగులు చేశాడు. మయాంక్ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ కాగా అందులో మయాంక్వే 249 పరుగులు ఉండడం విశేషం. ఒక రకంగా అతనిది వన్‌మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇక శ్రీనివాస్ శరత్ 66 పరుగులతో సహకరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కె పటేల్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. బెంగాల్ వర్సెస్ మధ్యప్రదేశ్, రంజీ రెండో సెమీఫైనల్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనుస్తుప్ మజుందార్ (120 పరుగులు), సుదీప్ గరామీ(112 పరుగులు) శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 51 పరుగులు చేశాడు. అనంతరం మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది. Mayank Agarwal's celebration when he completed his double hundred in Ranji trophy semi-final. pic.twitter.com/ckG0ez5ebh — CricketMAN2 (@ImTanujSingh) February 9, 2023 చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా -
అజేయ సెంచరీతో కదం తొక్కిన మయాంక్ అగర్వాల్
Mayank Agarwal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (ఫిబ్రవరి 8) మొదలైన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మయాంక్‌తో పాటు వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ (58) అజేయ అర్ధసెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. చేతన్ సకారియా, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిప శ్రేయస్ గోపాల్ (15) రనౌటయ్యాడు. సెంచరీతో ఆదుకున్న మయాంక్.. ఈ మ్యాచ్‌లో మయాంక్ చేసిన సెంచరీ చాలా కీలకమైంది. 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా మయాంక్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీనివాస్ శరత్‌తో కలిసి మయాంక్ ఆరో వికెట్‌కు అజేయమైన 117 పరుగులు సమకూర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 246 బంతులు ఆడిన మయాంక్ 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 110 పరుగులు చేశాడు. సెంచరీ చేసేందుకు మయాంక్ ఇన్ని బంతులు ఆడటం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. మరోవైపు ఇవాలే మొదలైన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్, బెంగాల్ జట్లు తలపడ్డాయి. తొలి రోజు ఆటలో బెంగాల్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. -
స్పోర్ట్స్ మినిస్టర్ సారధ్యంలో శతకాలతో విరుచుకుపడిన ప్లేయర్లు
Ranji Trophy 2022-23 Semi Finals MP VS Bengal: రంజీ ట్రోఫీ-2022-23 సీజన్ చివరి అంకానికి చేరింది. ఈ దేశవాలీ టోర్నీలో ఇవాల్టి (ఫిబ్రవరి 8) నుంచే సెమీఫైనల్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. తొలి సెమీస్‌లో బెంగాల్.. మధ్యప్రదేశ్‌ను ఢీకొంటుంటే, రెండో సెమీస్‌లో కర్ణాటక, సౌరాష్ట్ర జట్లు పోటీ పడుతున్నాయి. తొలి సెమీస్ విషయానికొస్తే.. స్పోర్ట్స్ మినిస్టర్ మనోజ్ తివారి సారధ్యంలో బెంగాల్ జట్టు తొలి రోజు ఆటలో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. -
మళ్లీ ఆడతానో లేదోనన్న సందేహాలు! వాళ్ల వల్లే ఇదంతా.. ఆదివారాలు కూడా!
India Vs Australia - Ravindra Jadeja: ‘‘వరల్డ్‌కప్ ఈవెంట్.. టీవీలో చూస్తున్నపుడల్లా... ‘‘అరెరె.. నేనూ అక్కడ ఉండి ఉంటే బాగుండేదే’’ అని ఎన్నిసార్లు అనుకున్నానో! ఇలాంటి మరెన్నో ఆలోచనలు నా మదిని చుట్టుముట్టేవి. అవే నన్ను రిహాబ్ సెంటర్లో కఠినంగా శ్రమించేలా.. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేలా ముందుకు నడిపాయి’’ అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. రంజీ ట్రోఫీ ద్వారా మళ్లీ ఆసియా కప్ టీ20 టోర్నీ-2022 మధ్యలోనే మోకాలి గాయం కారణంగా జడ్డూ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్-2022 ఈవెంట్లో కూడా పాల్గొనలేకపోయాడు. దీంతో బెంగళూరులోని పునరావాస కేంద్రంలో శిక్షణ పొందిన జడేజా రంజీ ట్రోఫీ టోర్నీ ద్వారా తిరిగి మైదానంలో దిగాడు. తమిళనాడుతో మ్యాచ్‌లో సౌరాష్ట్రకు సారథిగా వ్యహరించిన జడ్డూ.. ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న కీలక టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో గాయం కారణంగా తనకు ఎదురైన చేదు అనుభవాలు, పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడంలో సిబ్బంది తోడ్పడిన విధానం గురించి చెప్పుకొచ్చాడు. PC: BCCI ఆదివారం కూడా నాకోసం.. ‘బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్న సమయంలో ఫిజియోలు, ట్రెయినర్లు పూర్తిస్థాయిలో నా గాయంపై దృష్టి సారించారు. నాకోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయించారు. ఆదివారం సెలవైనా కూడా నాకోసం ప్రత్యేకంగా వచ్చి నన్ను ట్రెయిన్ చేసేవారు. నా కోసం వాళ్లు చాలా కష్టపడ్డారు. సర్జరీ తర్వాత నేనింత త్వరగా కోలుకోవడానికి వాళ్లే కారణం. కనీస అవసరాలకు కూడా ఏదేమైనా గాయం తర్వాతి రెండు నెలల కాలం ఎంతో కష్టంగా గడిచింది. నాకు నేనుగా ఎక్కడికి నడిచి వెళ్లే అవకాశం ఉండేది కాదు. కనీస అవసరాల కోసం ఇతరుల సహాయం తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి కఠిన దశలో నా కుటుంబం, నా స్నేహితులు పూర్తిగా అండగా నిలబడ్డారు. నిజానికి కోలుకున్న తర్వాత మొదటిసారి గ్రౌండ్లో అడుగుపెట్టినపుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. చెన్నైలో మొదటి రోజు కాస్త కష్టంగా అంతకుముందు దాదాపు ఐదు నెలల పాటు నేను ఇండోర్‌లో జిమ్‌లోనే ఉన్నాను. అసలు నేను కోలుకోగలనా లేదా అన్న సందేహాలు కలిగాయి. 90 గంటల పాటు మ్యాచ్‌లో గడపగలనా అని భయపడ్డాను. ఏదైమైనా చెన్నైలో రంజీ మ్యాచ్ మొదటి రోజు కాస్త కష్టంగానే తోచింది. వేడిమిని తట్టుకోలేకపోయాను’’ అని జడ్డూ పేర్కొన్నాడు. తిరిగి భారత్ తరఫున బరిలోకి దిగనుండటం సంతోషంగా ఉందన్నాడు. కాగా ఆసీస్‌తో సిరీస్‌లో రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ కీలకం కానున్నారు. చదవండి: Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు.. వైట్‌వాష్ ఎన్నిసార్లంటే! ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ బ్రేక్ చేస్తా? నీకు అంత సీన్ లేదులే.. Excitement of comeback 👌 Story behind recovery 👍 Happiness to wear #TeamIndia jersey once again 😊 All-rounder @imjadeja shares it all as India gear up for the 1⃣st #INDvAUS Test 👏 👏 - By @RajalArora FULL INTERVIEW 🎥 🔽https://t.co/wLDodmTGQK pic.twitter.com/F2XtdSMpTv — BCCI (@BCCI) February 5, 2023 -
Ranji Trophy: పంజాబ్‌ను చిత్తు చేసి.. సెమీస్‌కు దూసుకెళ్లిన సౌరాష్ట్ర
Ranji Trophy 2022-23 - Saurashtra vs Punjab: రంజీ ట్రోఫీ 2022-2023 సీజన్లో ఆఖరి సెమీ ఫైనలిస్టు ఖరారైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ , బెంగాల్, కర్ణాటక సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. తాజాగా సౌరాష్ట్ర ఫైనల్ ఫోర్ జాబితాలో చేరింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-2లో పంజాబ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. పార్థ్ భట్ అద్భుత ఇన్నింగ్స్ సొంత మైదానం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్‌తో తలపడింది అర్పిత్ వసవాడ సేన. జనవరి 31న మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్నెల్ పటేల్ 70 పరుగులతో రాణించగా.. పార్థ్ భట్ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేసినా ఒంటరి పోరాటం చేశాడు. దీంతో 303 పరుగుల వద్ద సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ముగిసింది. పంజాబ్ బౌలర్లలో మార్కండే నాలుగు, బల్జీత్ సింగ్ 3, సిద్దార్థ్ కౌల్ 2, నామన్ ధిర్ ఒక వికెట్ పడగొట్టారు. అదరగొట్టారు.. అయినా ఇక పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్(126), నామన్ ధిర్(131) అదిరిపోయే ఆరంభం అందించారు. నాలుగో స్థానంలో వచ్చిన మన్దీప్ (91) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అన్మోల్ మల్హోత్రా 41 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 431 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. సౌరాష్ట్రపై తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగుల పైచిలుకు ఆధిక్యం సాధించగలిగింది. 5 వికెట్లతో చెలరేగిన పార్థ్ భట్ ఈ క్రమంలో సౌరాష్ట్ర 379 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది. దీంతో పంజాబ్‌ను కట్టడి చేయాలని భావించిన సౌరాష్ట్రకు బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్థ్ భట్ ఊతంగా నిలిచాడు. ఏకంగా 5 వికెట్లతో(33 ఓవర్లలో 89 పరుగులు) చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ధర్మేంద్ర జడేజా మూడు, యువరాజ్‌సిన్హ్ దోడియా రెండు వికెట్లతో రాణించారు. కర్ణాటకతో అమీతుమీ సౌరాష్ట్ర బౌలర్ల విజృంభణతో పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం 71 పరుగుల తేడాతో విజయఢంకా మోగించిన సౌరాష్ట్ర.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ చేరే క్రమంలో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి సౌరాష్ట్రను గెలిచిన పార్థ్ భట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-2 సౌరాష్ట్ర వర్సెస్ పంజాబ్ స్కోర్లు సౌరాష్ట్ర- 303 & 379 పంజాబ్- 431 & 180 చదవండి: షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్ వైరల్ Gill-Kohli: 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా' -
బౌలర్ల విజృంభణ.. శ్రేయస్ అజేయ శతకం.. సెమీస్‌లో మయాంక్ జట్టు
Karnataka won by an innings and 281 runs: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో కర్ణాటక సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఉత్తరాఖండ్‌ను ఇన్నింగ్స్ మీద 281 పరుగులతో చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెంచరీ హీరో శ్రేయస్ గోపాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మయాంక్ నమ్మకాన్ని నిలబెట్టి బెంగళూరు వేదికగా ఉత్తరాఖండ్‌తో జనవరి 31న మొదలైన క్వార్టర్ ఫైనల్-3లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నమ్మకాన్ని నిలబెడుతూ.. కర్ణాటక బౌలర్లు సొంతమైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. రైట్ ఆర్మ్ పేసర్, 22 ఏళ్లమురళీధర వెంకటేశ్ ఐదు వికెట్లతో ఉత్తరాఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. విద్వత్ కవెరప్ప, క్రిష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీశారు. విజయ్ కుమార్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 116 పరుగులకే ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. రెచ్చిపోయిన కర్ణాటక బ్యాటర్లు.. బౌలర్లకు చుక్కలే ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక బ్యాటర్లు ఉత్తరాఖండ్ బౌలర్లకు పగలే చుక్కలు చూపించారు. ఓపెనర్లు సమర్థ్(82), మయాంక్ అగర్వాల్(83) అర్థ శతకాలతో చెలరేగగా.. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 69 పరుగులతో రాణించాడు. శ్రేయస్ గోపాల్ అద్భుత సెంచరీ నాలుగో స్థానంలో వచ్చిన నికిన్ జోస్ 62 రన్స్ సాధించగా.. మనీశ్ పాండే 39 పరుగులతో ఫర్వాలేదనపించాడు. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ గోపాల్ బ్యాట్ ఝలిపించడంతో కర్ణాటక భారీ స్కోరు చేయగలిగింది. మొత్తంగా 288 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 161 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో శరత్ 33, గౌతం 39, వెంకటేశ్ 15 పరుగులు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక 606 పరుగులకు ఆలౌట్ అయింది. సెమీస్‌లో అడుగు ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఉత్తరాఖండ్ కథ 209 పరుగులకే ముగిసింది. దీంతో శుక్రవారం నాటి(ఫిబ్రవరి 3) ఆఖరి రోజు ఆటలో కర్ణాటక జయకేతనం ఎగురవేసింది. ఇప్పటి వరకు ఎనిమిది సార్లు చాంపియన్‌గా నిలిచిన కన్నడ జట్టు తాజా సీజన్లో సెమీస్‌కు చేరుకుంది. చదవండి: Ranji Trophy 2022-23: విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్స్‌లో ఓటమిపాలైన ఆంధ్ర BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
విహారి ఒంటి చేతి పోరాటం వృధా.. క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైన ఆంధ్ర
Hanuma Vihari: ఆంధ్రప్రదేశ్ కెప్టెన్ హనుమ విహారి ఒంటి చేతి పోరాటం వృధా అయ్యింది. మణకట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా విహారి ఆడిన ఇన్నింగ్స్‌లు, చేసిన పరుగులకు విలువ లేకుండా పోయింది. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు మధ్యప్రదేశ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. విహారి విరోచితంగా ఒంటి చేత్తో, అది కూడా తన సహజ శైలికి భిన్నంగా ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి అతి మూల్యమైన పరుగులు సమకూర్చినప్పటికీ ఆంధ్ర టీమ్ గెలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేని ఆంధ్ర జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలి విహారి పోరాటానికి అర్ధం లేకుండా చేసింది. ప్రస్తుత సీజన్లో విహారి నేతృత్వంలో ఆంధ్ర జట్టు వరుస విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్ వరకు జైత్రయాత్ర కొనసాగించింది. అయితే క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో విహారి గాయపడి మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో ఆంధ్ర టీమ్ ఒక్కసారిగా తేలిపోయింది. @Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM — Teja Tanush (@Tejatanush1) February 2, 2023 తొలి ఇన్నింగ్స్‌లో రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో కదం తొక్కినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా చేతులెత్తేశారు. గాయపడ్డప్పటికీ బరిలోకి దిగి విహారి చేసిన పరుగులు (27, 15) కూడా సహచరుల్లో స్పూర్తి నింపలేకపోయాయి. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 151 పరుగుల లీడ్ కలుపుకుని ఆంధ్ర నిర్ధేశించిన 245 పరుగుల టార్గెట్‌ను మధ్యప్రదేశ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. యశ్ దూబే (58), రజత్ పాటిదార్ (55) అర్ధసెంచరీలతో రాణించగా.. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్, పృథ్వీ రాజ్ తలో 2 వికెట్లు, నితీశ్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 228 పరుగులకు ఆలౌటైంది. శుభమ్ శర్మ (51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కోర్ వివరాలు.. ఆంధ్రప్రదేశ్: 379 & 93 మధ్యప్రదేశ్: 228 & 245/5 (5 వికెట్ల తేడాతో విజయం) ఈ విజయంతో మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరుకోగా.. మరోవైపు జార్ఖండ్‌పై బెంగాల్ (9 వికెట్ల తేడాతో), ఉత్తరాఖండ్‌పై కర్ణాటక (ఇన్నింగ్స్ 281 పరుగుల తేడాతో) విజయాలు సాధించి ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. సౌరాష్ట్ర-పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఫలితం తేలాల్సి ఉంది. -
విహారి నువ్వు సూపరయ్యా.. మరోసారి ఒంటి చేత్తో, ఈసారి కత్తి పట్టిన యోధుడిలా..!
Ranji Trophy 2022-23: టీమిండియా టెస్ట్ క్రికెటర్, ఆంధ్ర జట్టు కెప్టెన్ హనుమ విహారి ప్రస్తుతం మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-4 మ్యాచ్‌లో ఒంటిచేత్తో పోరాటం చేస్తున్న యోధుడిలా మారిపోయాడు. తొలి రోజు (జనవరి 31) ఆటలో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడి, మణికట్టు ఫ్రాక్చర్‌కు గురైన విహారి.. జట్టు కష్టాల్లో ఉండగా ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా, నొప్పిని భరిస్తూ, ఒంటిచేత్తో అది కూడా తన బ్యాటింగ్ శైలికి భిన్నంగా లెఫ్ట్ హ్యాండ్‌తో (రెండో రోజు) బ్యాటింగ్ చేశాడు. @Hanumavihari 🧎💥🔥#HanumaVihari #RanjiTrophy2023 pic.twitter.com/O1reQglKMM — Teja Tanush (@Tejatanush1) February 2, 2023 తొలి ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద బ్యాటింగ్ చేసి 27 పరుగులు చేసిన విహారి తన జట్టుకు కొన్ని ఉపయోగకరమైన పరుగులు సమకూర్చి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే ఆట మూడో రోజు కష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్ర జట్టుకు మరోసారి విహారి అవసరం పడింది. ఆ జట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి బరిలోకి దిగిన విహారి.. ఈసారి కత్తి పట్టిన యోధుడిలా కనిపించాడు. లెఫ్ట్ హ్యాండ్‌తో, అది కూడా సింగిల్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తూ తన జట్టుకు ఎంతో ముఖ్యమైన 15 పరుగులు జోడించిన విహారి.. ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న ఆంధ్ర కెప్టెన్.. ఒంటి చేత్తో బ్యాట్‌ను కత్తిలా దూస్తూ 3 బౌండరీలు బాదడం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, విహారికి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలా యోధుడిలా పోరాటం చేయడం కొత్తేమీ కాదు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో (సిడ్నీ టెస్ట్) టీమిండియా కష్టాల్లో ఉండగా.. ఆసీస్ బౌలర్లు బాడీని టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తున్నప్పుడు దెబ్బలు భరిస్తూ ఇంచుమించూ ఇలాంటి పోరాటమే చేశాడు. తాజాగా తన జట్టును గెలిపించుకునేందుకు విహారి పడుతున్న తాపత్రయం చూసి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. సాహో వీరుడా అంటూ కితాబునిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 379, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకే ఆలౌటైన మధ్యప్రదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్ గెలవాలంటే మరో 187 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. -
శ్రేయస్ గోపాల్ సెంచరీ.. విహారి వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్‌లో జార్ఖండ్-బెంగాల్, రెండో మ్యాచ్‌లో సౌరాష్ట్ర-పంజాబ్, మూడో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్-కర్ణాటక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్ అయినా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్‌కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్ గోపాల్ సూపర్ సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. తొలి క్వార్టర్ ఫైనల్ జార్ఖండ్ వర్సెస్ బెంగాల్.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్ జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 173 ఆలౌట్ (కుమార్ సూరజ్ 89 నాటౌట్, ఆకాశదీప్ 4/46) బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 238/5 (అభిమన్యు ఈశ్వరన్ 77, సుప్రయో చక్రవర్తి 2/68) రెండో క్వార్టర్ ఫైనల్ సౌరాష్ట్ర-పంజాబ్.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 303 ఆలౌట్ (పార్థ భట్ 111 నాటౌట్, మార్కండే 4/84) పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 327/5 (ప్రభ్‌సిమ్రన్ సింగ్ 126, నమన్ ధీర్ 131, యువ్‌రాజ్ సింగ్ 2/63) మూడో క్వార్టర్ ఫైనల్ ఉత్తరాఖండ్-కర్ణాటక.. 358 పరుగుల లీడ్‌లో కర్ణాటక ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ 116 ఆలౌట్ (కునాల్ చండీలా 31, ఎం వెంకటేశ్ 5/36) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 474/5 (శ్రేయస్ గోపాల్ 103 నాటౌట్, మయాంక్ మిశ్రా 3/98) నాలుగో క్వార్టర్ ఫైనల్ ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 379 ఆలౌట్ (రికీ భుయ్ 149, కరణ్ షిండే 110, అనుభవ్ అగర్వాల్ 4/72) మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 144/4 (శుభమ్ శర్మ 51, శశికాంత్ 2/37) -
శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, నిన్న (జనవరి 31) మధ్యప్రదేశ్‌తో మొదలైన క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) అద్భుత శతకాలతో రెచ్చిపోగా.. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆంధ్ర టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి, ఏపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 327 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్ దూబే (20), హిమాన్షు మంత్రి (22) ఔట్ కాగా.. శుభమ్ శర్మ (5), రజత్ పాటిదార్ క్రీజ్‌లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, పృథ్వీ రాజ్ యర్రాకు తలో వికెట్ పడింది. కాగా, రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) కనబర్చిన వీరోచిత పోరాటం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. తొలి రోజు ఆటలో 16 పరుగుల వద్ద ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గాయపడిన విహారి.. మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయితే రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల తర్వాత వెనువెంటనే ఔట్ అయ్యాక.. ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు. ఏపీ టీమ్.. 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో (353/9) మణికట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన విహారి.. గతంలో సిడ్నీ టెస్ట్‌లో చేసిన వీరోచిత పోరాటాన్ని మళ్లీ గుర్తు చేశాడు. Hanuma vihari batting with left hand due to the fracture of his wrist pic.twitter.com/qywEd31S5o — cric_mawa (@cric_mawa_twts) February 1, 2023 కుడి చేయికి ఫ్రాక్చర్ కావడంతో ఎడమ చేత్తో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన విహారి జట్టు స్కోర్‌కు అతిమూల్యమైన 26 పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి, జట్టు మనిషివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నొప్పిని భరిస్తూ.. ఎడమ చేతిని కాపాడుకుంటూ విహారి చేసిన బ్యాటింగ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. గాయపడ్డాక బరిలోకి దిగిన విహారి రెండు బౌండరీలు బాదడం, అందులో ఒకటి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో కావడం మరో విశేషం. -
తొమ్మిదో నంబర్లో వచ్చి సెంచరీతో ఇరగదీసిన సౌరాష్ట్ర బౌలర్
Ranji Trophy 2022-23 2nd Quarter Final: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. తొమ్మిదో నంబర్ ఆటగాడు, బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్థ్ భట్ (111 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (70) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం మూకుమ్మడిగా విఫలమైంది. రవీంద్ర జడేజా గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్రకు అర్పిత్ వసవద సారధ్యం వహిస్తున్నాడు. పంజాబ్ బౌలర్లలో మార్కండే 4, బల్తేజ్ సింగ్ 2, సిద్ధార్థ్ కౌల్ 2, నమన్ ధిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3), నమన్ ధిర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రికీ భుయ్ సూపర్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆంధ్ర.. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్‌కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. 173 పరుగులకే చాపచుట్టేసిన జార్ఖండ్.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. రెచ్చిపోయిన కర్ణాటక బౌలర్లు.. రాణించిన మయాంక్ అగర్వాల్.. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. -
రికీ భుయ్ సూపర్ సెంచరీ.. కొనసాగుతున్న ఆంధ్రపద్రేశ్ జోరు
Ranji Trophy 2022-23 4th Quarter Final: ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్‌కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. -
రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. రాణించిన మయాంక్ అగర్వాల్
Ranji Trophy 2022-23 1st Quarter Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
రెచ్చిపోయిన కర్ణాటక బౌలర్లు, 116 పరుగులకే కుప్పకూలిన ఉత్తరాఖండ్
Ranji Trophy 2022-23 3rd Quarter Final: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (జనవరి 31) ప్రారంభమయ్యాయి. మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్-కర్ణాటక జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కర్ణాటక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే ఆలౌటైంది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. 6 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (4), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో బెంగాల్-జార్ఖండ్ జట్లు.. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
ఆంధ్ర సెమీస్ చేరేనా! .. క్వార్టర్స్‌లో మధ్యప్రదేశ్‌తో ఢీ
ఇండోర్: ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బోనస్ పాయింట్‌తో గెలిచి... ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలూ కలిసి రావడంతో... రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన ఆంధ్ర జట్టు... డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో నేటి నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. గతంలో ఏనాడూ రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయిన ఆంధ్ర జట్టుకు కొత్త చరిత్ర లిఖించాలని పట్టుదలతో ఉంది. అయితే పటిష్టంగా ఉన్న మధ్యప్రదేశ్‌పై ఆంధ్ర జట్టు గెలవాలంటే మాత్రం సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లో ఆంధ్ర తరఫున బ్యాటింగ్‌లో రికీ భుయ్ (461), కెప్టెన్ హనుమ విహారి (448), అభిషేక్ రెడ్డి (384), కరణ్ షిండే (439) నిలకడగా రాణించారు. ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (23 వికెట్లు, 146 పరుగులు), షోయబ్ ఖాన్ (21 వికెట్లు, 300 పరుగులు)లతోపాటు బౌలర్లు శశికాంత్ (26 వికెట్లు), లలిత్ మోహన్ (25 వికెట్లు), మాధవ్ రాయుడు (11 వికెట్లు) కూడా మెరిస్తే ఆంధ్ర సంచలన ఫలితం సాధించే అవకాశముంది. బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్, హిమాన్షు మంత్రి, శుభమ్ శర్మ... బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ, గౌరవ్ యాదవ్ నిలకడగా రాణిస్తూ మధ్యప్రదేశ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. మంగళవారమే మొదలయ్యే ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో జార్ఖండ్‌తో బెంగాల్; ఉత్తరాఖండ్‌తో కర్ణాటక; పంజాబ్‌తో సౌరాష్ట్ర తలపడతాయి. చదవండి: Marnus Labuschagne: కాఫీ బ్యాగులతో భారత్‌కు ఆసీస్ క్రికెటర్; తాగడానికా.. అమ్మడానికా? -
Ind Vs Aus: అతడు సెలక్షన్ కమిటీ డోర్లు బాదడం కాదు.. ఏకంగా..: అశ్విన్
India Vs Australia- Sarfaraz Khan: ‘‘ఈ బ్యాటర్ గురించి ఏమని, ఎక్కడని మొదలుపెట్టను? సర్ఫరాజ్ ఖాన్... అతడు టీమిండియాకు సెలక్ట్ అవుతాడా కాడా అన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, తనకు ఇవేమీ పట్టవు. మీకు తెలుసా.. తను 2019-20 సీజన్లో 900 పరుగులు చేశాడు. 2020-21 సీజన్లోనూ 900 పరుగులు. ఇక ఈసారి సుమారుగా 600 రన్స్. తన అత్యద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు’’ అంటూ టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు కురిపించాడు. రంజీల్లో అతడి ఆటతీరును కొనియాడుతూ ఆకాశానికెత్తాడు. వాళ్లకు కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. కోపం కూడా తెప్పిస్తున్నాడంటూ తనదైన శైలిలో బీసీసీఐ సెలక్టర్లపై సెటైర్లు వేశాడు. సర్ఫరాజ్ ఖాన్ విమర్శల వర్షం దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని ఆశలు పెట్టుకుంటే.. ఇషాన్ కిషన్ అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెలక్టర్లు.. సర్ఫరాజ్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తలనొప్పిలా తయారయ్యాడు ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన జట్టులో ఉన్న స్పిన్నర్ అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించాడు. ‘‘గత మూడు రంజీ సీజన్లలో అతడి స్ట్రైక్‌రేటు బాగుంది. సగటు 100కి పైగా ఉంది. ప్రతి సీజన్లోనూ మెరుస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం సెలక్షన్ కమిటీ డోర్లను బాదడం కాదు.. సెలక్టర్లకు ఓ రకంగా కోపం తెప్పించేలా తలనొప్పిలా తయారయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి కూడా తను జట్టుకు ఎంపిక కాలేదు. అయితేనేం, తన ఆట తనది. దేనికి కుంగిపోకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ తన పని తాను చేసుకుపోయాడు. ముఖ్యంగా ఢిల్లీ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ అద్భుతం. ముంబై ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మర్చిపోలేం’’ అని అశూ సర్ఫరాజ్‌ను ప్రశంసించాడు. చదవండి: IND VS NZ 2nd T20: ఆసీస్‌తో టెస్ట్ సిరీస్.. పని మొదలుపెట్టిన సూర్యకుమార్ యాదవ్ పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్ 1 బౌలర్ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం.. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి కారణమిదేనన్న బీసీసీఐ సెలక్టర్ -
ముంబై- మహారాష్ట్ర మ్యాచ్ డ్రా.. క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర
Ranji Trophy 2022-23 : రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా గ్రూప్ ‘బి’లో మహారాష్ట్ర, ముంబై మ్యాచ్ ‘డ్రా’ అయింది. దీంతో హనుమ విహారి సారథ్యంలోని ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో క్వార్టర్ ఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర తలపడుతుంది. ముంబై మ్యాచ్‌లో కాగా బ్రబౌర్న్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై సైతం 384 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించడం విశేషం. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మహారాష్ట్ర 252 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆట ముగిసే సమయానికి ముంబై 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అసోంపై ఇదిలా ఉంటే.. అంతకుముందు అసోంపై ఆంధ్ర జట్టు గెలుపొందిన విషయం తెలిసిందే. అభిషేక్‌రెడ్డి (75), కెప్టెన్ హనుమ విహారీ(80), కరణ్ షిండే(నాటౌట్) రాణించడంతో 361 పరుగులు స్కోరు చేసింది. ఇక ఆంధ్ర బౌలర్లు మాధవ్ రాయుడు (4/12), శశికాంత్ (3/34), నితీశ్ రెడ్డి (1/29), మోహన్ (1/24) చెలరేగడంతో అసోం 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టు ఘన విజయం సాధించి క్వార్టర్ రేసులో నిలవగా.. ముంబై- మహారాష్ట్ర ఫలితంతో క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆరో ఓటమితో అధోగతి.. ‘ప్లేట్’ డివిజన్‌కు హైదరాబాద్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన చివరి మ్యాచ్ వరకూ కొనసాగింది. శుక్రవారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఢిల్లీ 9 వికెట్ల తేడాతో తన్మయ్ అగర్వాల్ సారథ్యంలోని హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 90/5తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 47 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ వికెట్ నష్టపోయి ఛేదించింది. దీంతో సీజన్లో ఆడిన 7 మ్యాచ్‌లలో వరుసగా ఆరో ఓటమితో హైదరాబాద్ ఒక పాయింట్‌తో చివరి స్థానంలో నిలిచి ‘ప్లేట్’ గ్రూప్‌నకు పడిపోయింది. చదవండి: Arshdeep Singh: ఒకే ఓవర్లో 27 పరుగులు; అర్ష్‌దీప్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు IND Vs NZ: తొలి టి20లో టీమిండియా ఓటమి.. -
జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోపీ ద్వారా సూపర్ రీఎంట్రీ ఇచ్చినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఏడు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. అయితే బౌలింగ్‌లో మెరిసిన జడేజా బ్యాటింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు జడేజా ఎంపికైన సంగతి తెలిసిందే. హార్విక్ దేశాయ్, సౌరాష్ట్ర క్రికెటర్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే 266 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర 206 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (205 బంతుల్లో 101 పరుగులు) సెంచరీ వృదాగా మారింది. చివర్లో అర్పిత్ వసవాడ(45 పరుగులు), రవీంద్ర జడేజా(25 పరుగులు) ఆశలు కలిగించినప్పటికి.. ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. అంతకముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ దాటికి 133 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్ అయింది. -
హైదరాబాద్ రాత మారలేదంతే! ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ ఘోర ఓటమి
Ranji Trophy 2022-23 - Hyderabad vs Delhi: రంజీ ట్రోఫీ 2022-23ని హైదరాబాద్ క్రికెట్ జట్టు మరో ఓటమితో ముగించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఢిల్లీ జట్టుతో ఉప్పల్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆట మూడో రోజు(గురువారం) ఓవర్‌నైట్ స్కోరు 223/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు ఆయుశ్ బదోని వీరోచిత సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసింది. అదరగొట్టిన ఆయుశ్ బదోని నిజానికి 277 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల్లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే ఆయుశ్ బదోని (191; 24 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణరీతిలో ఆడి భారీ సెంచరీ సాధించాడు. పదో నంబర్ బ్యాటర్ హర్షిత్ రాణా (58; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆయుశ్ ఢిల్లీ జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. ఆయుశ్, హర్షిత్ తొమ్మిదో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. ‘డబుల్ సెంచరీ’కి చేరువైన దశలో.. అనికేత్ రెడ్డి బౌలింగ్‌లో ఆయుశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దివిజ్ మెహ్రా (8 నాటౌట్)తో కలిసి హర్షిత్ చివరి వికెట్‌కు 34 పరుగులు జత చేశాడు. అజయ్‌దేవ్ గౌడ్ బౌలింగ్‌లో హర్షిత్ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 143 పరుగులిచ్చి 5 వికెట్లు, అజయ్‌దేవ్ గౌడ్ 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ భారీ స్కోరు ఈ నేపథ్యంలో 433 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ 78 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి కేవలం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 124 వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా ఇక తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్ రాయుడు.. రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో హైదరాబాద్ బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లలో తోల్కంటి గౌడ్ (21), ప్రణీత్ రాజ్ మాత్రమే (27) 20 పైగా పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్ హర్షిత్ రాణా ధాటికి బెంబేలెత్తి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 124 పరుగులకే హైదరాబాద్ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. కాగా 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కూల్చి హైదరాబాద్ జట్టు పతనాన్ని శాసించిన హర్షిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరో ఢిల్లీ బౌలర్ దివిజ్ మెహ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్ హైదరాబాద్ కేవలం ఒక్క పాయింట్‌తో గ్రూప్ ‘బి’లోనే కాకుండా ఎలైట్ లీగ్‌లోని నాలుగు గ్రూప్‌ల్లో కలిపి చివరి స్థానంలో నిలిచింది. కాగా ఎలైట్ గ్రూప్‌ల్లో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోతాయి. రంజీ ట్రోఫీ 2022-23 హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ స్కోర్లు హైదరాబాద్- 355 & 124 ఢిల్లీ- 433 & 47/1 చదవండి: Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్.. ఫొటోలు వైరల్ -
రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. 8 వికెట్లతో రెచ్చిపోయిన స్టార్ ఆల్‌రౌండర్
Ranji Trophy 2022-23: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడ్డూ భాయ్.. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చాటాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడ్డూ.. రంజీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. తదనుగుణంగానే సెలెక్టర్లు సైతం అతనికి రంజీల్లో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో జడేజా వచ్చీ రాగానే బంతితో తన ప్రతాపం చూపాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించిన జడ్డూ (35 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు).. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 7 వికెట్లు తీసి తమిళనాడు వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. జడేజాకు జతగా మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) 3 వికెట్లతో రాణించడంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన తమిళనాడు తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. తమిళనాడు సెకెండ్ ఇన్నంగ్స్‌లో సాయ్ సుదర్శన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌరాష్ట్ర 192 పరుగులకే చాపచుట్టేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. సౌరాష్ట్ర గెలవాలంటే ఆఖరి రోజు మరో 262 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. క్వార్టర్స్‌కు చేరాలంటే సౌరాష్ట్రకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. జడేజా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తన జట్టును క్వార్టర్స్‌కు చేరుస్తాడేమో వేచి చూడాలి. ఏదిఏమైనా ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు జడేజా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం -
రాణించిన విహారి, రాయుడు.. ఆంధ్ర ఖాతాలో మరో విజయం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్ దశలో (ఎలైట్ గ్రూప్-బి) ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 2 పరాజయాలు, ఓ డ్రాతో 26 పాయింట్లు ఖాతాలో వేసుకుని, ప్రస్తుతానికి గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర టీమ్.. అస్సాంపై ఇన్నింగ్స్ 95 పరుగుల తేడాతో గెలుపొంది, క్వార్టర్స్ రేసులో ముందుంది. ఈ మ్యాచ్‌ను ఆంధ్ర టీమ్ కేవలం రెండున్నర రోజుల్లో ముగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర.. అభిషేక్ రెడ్డి (75), కెప్టెన్ హనుమ విహారీ (80), కరణ్ షిండే (90 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 361 పరుగులకు ఆలౌటైంది. అస్సాం బౌలర్లలో పుర్ఖాయస్తా 4, రియాన్ పరాగ్, సిద్దార్థ్ సర్మా తలో 2, ముఖ్తార్ హుస్సేన్, హ్రిదీప్ దేకా చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం టీమ్.. మాధవ్ రాయుడు (4/12), శశికాంత్ (3/34), నితీశ్ రెడ్డి (1/29), మోహన్ (1/24) ధాటికి 113 పరుగులకే కుప్పకూలి, ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ అస్సాం ఆటతీరు ఏమాత్రం మారలేదు. లలిత్ మోహన్ (5/40), షోయబ్ ఖాన్ (2/30), మాధవ్ రాయుడు (2/34) దెబ్బకు అస్సాం రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలై, సీజన్‌ను ముగించింది. 6 వికెట్లతో సత్తా చాటిన మాధవ్ రాయుడుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, ప్రస్తుత సీజన్లో బెంగాల్, కర్ణాటక జట్లు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకోగా మిగిలిన 6 బెర్తుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. -
శతక్కొట్టిన దేవదత్ పడిక్కల్
Devdutt Padikkal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (175 బంతుల్లో 114; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్.. కే గౌతమ్ (4/61), శ్రేయస్ గోపాల్ (3/18), కావేరప్ప (2/34), శుభంగ్ హేగ్డే (1/16) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. పడిక్కల్ సెంచరీ, వికెట్‌కీపర్ శరత్ (60) అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో 300 పరుగులకు ఆలౌటైంది. జార్ఖండ్ బౌలర్లలో షాబాజ్ నదీమ్ 5 వికెట్లతో చెలరేగగా.. అనుకుల్ రాయ్ 3, వినాయక్ విక్రమ్ ఓ వికెట్ పడగొట్టారు. 146 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. కుమార్ (20), ఆర్యమాన్ సేన్ (0) ఔట్ కాగా.. కుమార్ సూరజ్ (34), కుమార్ కుషాగ్రా (24) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం జార్ఖండ్ కర్ణాటక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 51 పరుగులు వెనుకపడి ఉంది. గ్రూప్-సిలో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక ఇదివరకే క్వార్టర్స్ బెర్తు ఖరారు చేసుకుంది. కాగా, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సంచలన ఇన్నింగ్స్‌లతో పడిక్కల్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2020లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్.. ఆ సీజన్లో 473 పరుగులు, ఆతర్వాతి సీజన్లలో వరుసగా 411, 376 పరుగులు చేశాడు. గతేడాదే పడిక్కల్ రాజస్థాన్ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021 సీజన్లో వరుసగా నాలుగు శతకాలు బాదిన పడిక్కల్.. లిస్ట్-ఏ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
అన్న బాటలో.. ట్రిపుల్ సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్
Sarfaraz Khan Brother Musheer Khan: దేశవాలీ టోర్నీల్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తూ, అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడుతున్న ముంబై చిచ్చరపిడుగు సర్ఫరాజ్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే అతను ఈసారి వార్తల్లోకెక్కింది తన వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించి కాదు. తన తమ్ముడు ముషీర్ ఖాన్ కారణంగా. రంజీల్లో ముంబైకే ప్రాతినిధ్యం వహించే 17 ఏళ్ల ముషీర్ ఖాన్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ-2023లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. Sarfaraz Khan's younger brother Musheer Khan has smashed a triple century for Mumbai in CK Nayudu Trophy against Hyderabad.#CricTracker #SarfarazKhan #MusheerKhan pic.twitter.com/b7C6VtJoTp— CricTracker (@Cricketracker) January 23, 2023 ఈ మ్యాచ్‌లో 367 బంతులు ఎదుర్కొన్న ముషీర్.. 34 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 339 పరుగులు స్కోర్ చేశాడు. ముషీర్ కళాత్మకమైన ఇన్నింగ్స్‌లో 190 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో రావడం విశేషం. ట్రిపుల్ హండ్రెడ్‌తో ముషీర్ చెలరేగడంతో ముంబై తమ ఇన్నింగ్స్‌ను 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ముషీర్ గత నెలలోనే రంజీల్లోకి అరంగేట్రం చేసి ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేక జట్టులో స్థానం కోల్పోయాడు. సౌరాష్ట్రతో జరిగిన తన డెబ్యూ మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టకుండా కేవలం 35 (12, 23) పరుగులు చేసిన ముషీర్.. అస్సాంతో జరిగిన రెండో మ్యాచ్‌లో 42 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే అతికష్టం మీద లభించిన మూడో అవకాశంలోనూ ముషీర్ తనను తాను నిరూపించుకోలేకపోవడంతో వేటు తప్పలేదు. తన మూడో మ్యాచ్‌లో ఢిల్లీపై ముషీర్ వికెట్లు లేకుండా కేవలం 19 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. తద్వారా ముంబై యాజమాన్యం అతన్ని మరుసటి మ్యాచ్ నుంచి తప్పించింది. అయితే, అన్న సర్ఫరాజ్ లాగే పట్టువదలని ముషీర్.. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో హైదరాబాద్‌పై ట్రిపుల్ సెంచరీ బాది, ముంబై యాజమాన్యం తిరిగి తనవైపు చూసేలా చేశాడు. మరోపక్క రంజీల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ మీద సెంచరీలు బాదుతూ, టీమిండియాలో చోటు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 92.66 సగటున 556 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు సీజన్లలోనూ ఇదే తరహాలో రెచ్చిపోయిన సర్ఫరాజ్.. వరుసగా 928 (9 ఇన్నింగ్స్‌ల్లో 154.66 సగటున), 982 (9 ఇన్నింగ్స్‌ల్లో 122.75 సగటున) పరుగులు చేసి టీమిండియా నుంచి పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. తన ప్రదర్శన కారణంగా సర్ఫరాజ్ ఇండియా-ఏ టీమ్‌లో అయితే చోటు దక్కించుకోగలిగాడు కానీ, జాతీయ సెలెక్టర్లు మాత్రం ఈ ముంబై కుర్రాన్ని కరుణించడం లేదు. ఆసీస్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన టీమిండియాలో చోటు ఆశించి భంగపడ్డ సర్ఫరాజ్‌కు శ్రేయస్ అయ్యర్ రూపంలో అదృష్టం కలిసొస్తుందేమో వేచి చూడాలి. గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రేయస్.. ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ సమయానికి కోలుకోలేకపోతే, సెలెక్టర్లు సర్ఫరాజ్‌ను కటాక్షించే అవకాశాలు లేకపోలేదు. -
లేటు వయసులో రెచ్చిపోతున్న ధోని ఫ్రెండ్.. మొన్న డబుల్ సెంచరీ, ఇప్పుడు సెంచరీ
Ranji Trophy 2022-23: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సహచరుడు, ఐపీఎల్లో సీఎస్కే మాజీ సభ్యుడు, మహారాష్ట్ర వెటరన్ ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ లేటు వయసులో అబ్బురపరిచే ప్రదర్శనతో చెలరేగిపోతున్నాడు. 37 ఏళ్ల కేదార్ జాదవ్ ప్రస్తుత రంజీ సీజన్లో (2022-23) వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. కొద్ది రోజుల కిందట అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతకంతో (283 బంతుల్లో 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు) విరుచుకుపడిన కేదార్.. ఇవాళ (జనవరి 24) ముంబైతో ప్రారంభమైన కీలకమైన మ్యాచ్‌లో సెంచరీతో (168 బంతుల్లో 128; 18 ఫోర్లు, సిక్స్) కదం తొక్కాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కేదార్ సెంచరీతో ఆదుకోకపోయుంటే మహారాష్ట్ర కనీసం 200 పరుగులు చేయడం కూడా కష్టమయ్యేది. సౌరభ్ నవాలే (56), అశయ్ పాల్కర్ (32) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు పడగొట్టారు. కాగా, ముంబై జట్టు భీకర ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించకపోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఎలైట్ గ్రూప్-బిలో పోటీపడుతున్న మహారాష్ట్ర, ముంబై జట్లు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో చెరో 3 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో 2 (మహారాష్ట్ర, 25 పాయింట్లు), 3 (ముంబై, 23 పాయింట్లు) స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌లో సౌరాష్ట్ర (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 26 పాయింట్లు) తొలి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ (6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 19 పాయింట్లు) నాలుగో ప్లేస్‌లో ఉన్నాయి. తమిళనాడు (15 పాయింట్లు), అస్సాం (11 పాయింట్లు), ఢిల్లీ (11 పాయింట్లు), హైదరాబాద్ (1 పాయింట్) వరుసగా 5 నుంచి 8 స్థానాల్లో నిలిచాయి. క్వార్టర్స్ బెర్తు కోసం ఈ గ్రూప్ నుంచి సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ముంబై జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు గ్రూప్-సి నుంచి కర్ణాటక, గ్రూప్-ఏ నుంచి బెంగాల్ ఇదివరకే క్వార్టర్స్ బెర్తును ఖరారు చేసుకున్నాయి. -
రవీంద్ర జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా..
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Saurashtra: మోకాలి గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడుతో పోటీపడుతున్న సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా 34 ఏళ్ల జడేజా గత ఏడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్ కోసం..! ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా సౌరాష్ట్ర జట్టుకు దాదాపుగా నాకౌట్ బెర్త్ ఖరారు కావడంతో చివరి మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్, సీనియర్ స్టార్ చతేశ్వర్ పుజారాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో జడ్డూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో జడేజాకు చోటు ఇచ్చింది బీసీసీఐ. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రంజీ ఆడేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం (జనవరి 24) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: సౌరాష్ట్ర హార్విక్ దేశాయ్(వికెట్ కీపర్), చిరాగ్ జానీ, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవాడ, రవీంద్ర జడేజా(కెప్టెన్), సమర్థ్ వ్యాస్, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, యువరాజ్‌సిన్హ్ దోడియా, జే గోహిల్. తమిళనాడు: సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్(కెప్టెన్), విజయ్ శంకర్, షారుక్ ఖాన్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, త్రిలోక్ నాగ్, మణిమారన్ సిద్ధార్థ్. చదవండి: Australian Open: సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
సునాయాసంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న టీమిండియా ఓపెనర్లు.. గిల్ తర్వాత మరొకరు
Ranji Trophy 2022-23 KAR VS KER: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా కేరళతో జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (208; 17 ఫోర్లు, 5 సిక్సర్) డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. మయాంక్‌కు జతగా నికిన్ జోస్ (54), శరత్ (53), శుభంగ్ హేగ్డే (50 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో కర్ణాటక 485/9 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ సచిన్ బేబీ (141) సెంచరీతో అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. కేరళ స్కోర్ రెండో ఇన్నింగ్స్‌లో 96/4 వద్ద ఉండగా.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. సునాయాసంగా డబుల్ సెంచరీలు.. ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఫార్మాట్లకతీతంగా డబుల్ సెంచరీలు బాదేస్తున్న విషయం విధితమే. రెండు రోజుల కిందట హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో (208) విధ్వంసం సృష్టించగా.. తాజాగా మరో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (208) రంజీల్లో ఈ ఫీట్ సాధించాడు. మయాంక్ టెస్ట్‌ల్లోనూ భారత్ తరఫున డబుల్ సెంచరీ (243) చేశాడు. కాగా, ప్రస్తుత రంజీ సీజన్లో మయాంక్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు పృథ్వీ షా, కేదార్ జాదవ్, మనన్ వోహ్రా, పునిత్ బిస్త్, మహ్మద్ సైఫ్, తరువార్ కోహ్లి డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిలో పృథ్వీ షా ఏకంగా ట్రిపుల్ సెంచరీ (379) చేశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు. తాజాగా గిల్ చేసిన ద్విశతకంతో అంతర్జాతీయ వన్డేల్లో డబుల్ సెంచరీల సంఖ్య 10కి చేరింది. ఈ 10లో 7 భారత ఆటగాళ్లు చేసినవే కాగా, ఈ ఫీట్ సాధించిన వారంతా ఓపెనర్లే కావడం విశేషం. వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు.. సచిన్ టెండూల్కర్ (2010లో సౌతాఫ్రికాపై 200 నాటౌట్), వీరేంద్ర సెహ్వాగ్ (2011లో వెస్టిండీస్‌పై 219), రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), రోహిత్ శర్మ (2014లో శ్రీలంకపై 264), క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై 215), మార్టిన్ గప్తిల్ (2015లో వెస్టిండీస్‌పై 237*), రోహిత్ శర్మ (2017లో శ్రీలంకపై 208*), ఫకర్ జమాన్ (2018లో జింబాబ్వేపై 210*), ఇషాన్ కిషన్ (2022లో బంగ్లాదేశ్‌పై 210), శుభ్‌మన్ గిల్ (2023లో న్యూజిలాండ్‌పై 208) -
43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ఢిల్లీ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. 41సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ముంబైని ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 43 ఏళ్లలో ముంబై జట్టుపై ఢిల్లీకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా మ్యాచ్‌తో కలిపి ఢిల్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లకు గానూ మూడింటిని డ్రా చేసుకొని.. రెండింటిలో ఓటమిపాలైంది. తాజాగా ముంబైపై విజయంతో సీజన్లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 88 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబై, ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. గ్రూప్-బిలో ఉన్న ఢిల్లీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప టార్గెట్ ఉండడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై తరపున సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్ అయ్యాడు.ముంబై కెప్టెన్ అజింక్యా రహానే సహా ఓపెనర్ పృథ్వీ షాలు మ్యాచ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఢిల్లీ బ్యాటర్ వైభవ్ రవాల్ నిలిచాడు. Delhi successfully chase down the target in the fourth innings and complete a clinical 8️⃣-wicket win over Mumbai 👏👏#RanjiTrophy | #DELvMUM | @mastercardindia pic.twitter.com/NCyK8kn9zU — BCCI Domestic (@BCCIdomestic) January 20, 2023 చదవండి: స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ కౌంటీల్లో ఆడనున్న స్మిత్! ద్రోహులు అంటూ ఫైర్! తప్పేముంది? -
జట్టులో చోటెక్కడుంది?! మీరేం మనిషి.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా?
Mumbai- Sarfaraz Khan: ‘‘ఆటను కొనసాగిస్తూ ఉండు. మెరుగైన ప్రదర్శన చేస్తూ ఉండాలి. అంతేగానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఇప్పటికైనా సర్ఫరాజ్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి’’ అని ముంబై మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ మిలింద్ రేగె మండిపడ్డాడు. దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా సెలక్షన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే సహించేది లేదన్నాడు. అనవసర విషయాలపై కాకుండా బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని హితవు పలికాడు. పరుగులు సాధిస్తూ ఉండటమే బ్యాటర్ పని, ఎవరి పని వాళ్లు చేసుకుంటే బాగుంటుందంటూ సర్ఫరాజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్ని సెంచరీలు చేసినా.. రంజీ ట్రోఫీ 2022-23 టోర్నీలో వరుస సెంచరీలతో దుమ్ము రేపుతున్న సర్ఫరాజ్ ఖాన్‌కు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనైనా అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ మరోసారి అతడికి మొండిచేయే ఎదురైంది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన సర్ఫరాజ్ ఖాన్ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో తన ఆవేదన పంచుకున్నాడు. అప్పుడేమో అలా.. తానూ మనిషేనని, తనకూ భావోద్వేగాలు ఉంటాయని ఉద్వేగభరితంగా మాట్లాడాడు. గతంలో టీమిండియా చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తనను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సర్ఫరాజ్ పేర్కొన్నాడు. అదే విధంగా రంజీ టోర్నీలో భాగంగా అసోంతో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీలో ఉన్నపుడు తన తండ్రితో కలిసి ప్రాక్టీసు చేశానని పేర్కొన్నాడు. చోటు లేదు ఏం చేస్తాం? ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ వ్యాఖ్యలపై స్పందించిన మిలింద్ అతడిని విమర్శించాడు. ముంబై కోచ్ అమోల్ మజుందార్‌తో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘సర్ఫరాజ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో అతడికి చోటు లేదు. తను అత్యద్భుతంగా ఆడుతున్నాడనే నిజం. అయితే, ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. అప్పుడు తనను తాను నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడు జాతీయ జట్టులో అసలు చోటెక్కడిది? అయినా, ఈ విషయంలో సర్ఫరాజ్ వ్యాఖ్యలు సరికావు. తన దృష్టి బ్యాటింగ్‌పై మాత్రమే ఉండాలి. అమోల్ నీ కోచ్‌గా ఉండగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 11 వేల పరుగులు సాధించిన అమోల్‌కు ఒక్కసారి కూడా జాతీయ జట్టు నుంచి పిలుపు రాలేదు. అప్పటికి టీమిండియాలో చోటు లేకపోవడంతో తనకు నిరాశే ఎదురైంది. అయినా తను ఆటను కొనసాగించాడు. అమోల్‌ను చూసి సర్ఫరాజ్ నేర్చుకోవాల్సి ఉంది. అయినా, అమోల్ నీ కోచ్‌గా ఉండగా.. మీ నాన్నతో ఏం పని? ఆయన నీకు కోచింగ్ ఇస్తున్నారని ఓ పత్రికలో చదివా! అసలు ఏంటిది?’’ అంటూ మిడ్- డేతో మాట్లాడుతూ 73 ఏళ్ల మిలింద్ అసహనం వ్యక్తం చేశాడు. అంటే ఎప్పటికీ టీమిండియాకు సెలక్ట్ కాడా? కాగా సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ వంటి మేటి ఆటగాళ్లు జట్టులో వరుస అవకాశాలు దక్కించుకున్న తరుణంలో అమోల్‌కు భంగపాటు తప్పలేదు. ఇక మిలింద్ రేగె వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘‘ఎంత గొప్పగా ఆడినా సరైన గుర్తింపు లేకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అయినా నువ్వేంటి.. అమోల్ మజూందార్ లాగే సర్ఫరాజ్ ఖాన్ ఎప్పటికీ టీమిండియాకు సెలక్ట్ కాడని అంటున్నావా? లేదంటే సెలక్ట్ కాకూడదని కోరుకుంటున్నావా? ఇదేం పద్ధతి? మీరేం మనిషి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్రోల్ చేస్తున్నారు. చదవండి: Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. Ind Vs NZ: రాయ్‌పూర్‌లో రోహిత్ సేనకు ఘన స్వాగతం.. వీడియో వైరల్ -
హ్యాట్రిక్ సెంచరీలతో అదరగొట్టిన త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో త్రీడీ ప్లేయర్‌గా పిలువబడే టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ అదరగొడుతున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ చేసిన శంకర్ (187 బంతుల్లో 112; 7 ఫోర్లు, సిక్సర్).. ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు మహారాష్ట్రపై 214 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 107 పరుగులు, అంతకుముందు ముంబైపై 174 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసిన శంకర్ వరుసగా మూడు సెంచరీలు చేసి రంజీల్లో తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. 2019 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన శంకర్.. తాజా ప్రదర్శనతో భారత టెస్ట్ జట్టులోకి రావాలని ఆశిస్తున్నాడు. భారత టెస్ట్ టీమ్‌లో ఎలాగూ హార్ధిక్ పాండ్యా ప్లేస్ ఖాళీగా ఉండటంతో ఆ స్థానంపై శంకర్ కన్నేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన శంకర్.. 2018-19 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20లు ఆడినప్పటికీ, ఆశించినంత ప్రభావం చూపలేక జట్టులో స్థానం కోల్పోయాడు. 2019 వరల్డ్‌కప్ సందర్భంగా నాటి భారత జట్టు ప్రధాన సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ శంకర్‌కు త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణిస్తూ టీమిండియాకు ఎంపిక చేశాడు. అప్పట్లో అంబటి రాయుడును తప్పించి శంకర్‌కు జట్టులోకి తీసుకోవడంతో పెద్ద దుమారమే రేగింది. తనను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయకపోవడం పట్ల రాయుడు అసహనం వ్యక్తం చేస్తూ.. వరల్డ్‌కప్‌ను త్రీడీ కళ్లజోడుతో చూస్తానని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. రాయుడును కాదని నాడు జట్టులో వచ్చిన శంకర్ కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడి గాయంతో టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు. నాటి నుంచి జట్టుకు దూరంగా ఉన్న శంకర్ తాజాగా హ్యాట్రిక్ సెంచరీలు బాది తిరిగి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు జట్టు విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు మూడో సెషన్ సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న అస్సాం తమిళనాడు తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 247 పరుగులు వెనుకపడి ఉంది. 17 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగులకు ఆలౌటైంది. శంకర్‌తో పాటు జగదీశన్ (125), ప్రదోశ్ పాల్ (153) శతకాలు బాదారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం 266 పరుగులకే ఆలౌటైంది. మరో రోజు ఆట మిగిలి ఉండటంతో ఫలితంగా తేలడం ఖాయంగా కనిపిస్తుంది. -
చెలరేగిన ఆదిత్య.. 74 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన విదర్భ! రంజీ చరిత్రలో తొలిసారి
Ranji Trophy 2022-23 - Vidarbha vs Gujarat: రంజీ చరిత్రలో విదర్భ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ స్కోరును డిఫెండ్ చేసుకుని ప్రత్యర్థిపై విజయం సాధించిన జట్టుగా ఘనత సాధించింది. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23 సీజన్లో భాగంగా ఎలైట్ గ్రూపు డిలో ఉన్న విదర్భ- గుజరాత్ మధ్య నాగ్‌పూర్ వేదికగా మంగళవారం టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులకే ఆలౌట్ అయి మొదటి రోజే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో గుజరాత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా 256ల వద్ద మొదటి ఇన్నింగ్స్ ముగించి 182 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇందుకు సమాధానంగా, విదర్భ వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ 69 పరుగులతో రాణించడం సహా.. వన్‌డౌన్ బ్యాటర్ అథర్వ టైడే 44, నచికేత్ బూటే 42 పరుగులతో పర్వాలేదనిపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆదిత్య విశ్వరూపం దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 254 పరగులు స్కోర్ చేయగలిగింది విదర్భ. ఈ క్రమంలో ఓవర్ నైట్ 6/1తో మూడో రోజు ఆట మొదలుపెట్టిన గుజరాత్‌ను విదర్భ బౌలర్ ఆదిత్య సర్వాటే కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొత్తంగా 15.3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఆదిత్యకు తోడు హర్ష్ దూబే 3 వికెట్లతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే గుజరాత్ కుప్పకూలింది. దీంతో 18 పరుగుల తేడాతో విదర్భ విజయం సాధించింది. గ్రూప్-డిలో పంజాబ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. బిహార్ పేరిట ఉన్న రికార్డు బద్దలు ఈ క్రమంలో రంజీల్లో ఓ ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు బిహార్ పేరిట ఉండేది. 1948- 49 సీజన్లో 78 పరుగులు మాత్రమే చేసిన బిహార్.. ఢిల్లీని 48 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో 74 ఏళ్లుగా బిహార్ పేరిట ఉన్న రికార్డును విదర్భ తాజాగా బద్దలు కొట్టింది. ఇక ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో లార్డ్స్ ఓల్డ్ గ్రౌండ్లో 1794నాటి మ్యాచ్‌లో 41 పరుగులు చేసిన ఓల్డ్‌ఫీల్డ్.. ఎంసీసీని 34 పరుగులకు ఆలౌట్ చేసింది. విదర్భ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ స్కోర్లు విదర్భ- 74 & 254 గుజరాత్- 256 & 54 చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే! Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్.. కోహ్లితో పోటీపడి పరుగులు -
'ఎంత బరువుంటే అన్ని సెంచరీలు చేస్తాడు'
దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. ఈ ఏడాది రంజీ సీజన్లో ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా ఆడుతున్నప్పటికి జాతీయ జట్టు నుంచి పిలుపు మాత్రం రావడం లేదు. వయసు రిత్యా 25 ఏళ్లు అయినప్పటికి బారీ కాయంగా కనిపించే సర్ఫరాజ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం ది బెస్ట్ అనిపిస్తున్నాడు. రంజీల్లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ బరువున్నా బ్యాటింగ్ మాత్రం సులువుగా చేస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ పరుగుల ప్రవాహం సృష్టిస్తున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం పట్ల సెలెక్టర్లను మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ సర్ఫరాజ్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''దేశవాళీ క్రికెట్లో వరుసగా మూడో సీజన్లో కూడా సర్ఫరాజ్ బెంబేలెత్తిస్తున్నాడు. అలాంటి బ్యాటర్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేయకపోవడం శోచనీయం. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవడం దేశవాలీ క్రికెట్‌ను అవమానించడమేనని.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్లాట్‌ఫామ్‌ను పట్టించుకోకపోవడమే అవుతుంది. పరుగులు సాధించేందుకు సర్ఫరాజ్ ఫిట్‌గా ఉన్నాడు. అతను ఎంత బరువున్నాడో.. అన్ని సెంచరీలు కొట్టగలడు '' అని ప్రసాద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. Not having him in the Test Team despite 3 blockbuster domestic seasons is not only unfair on Sarfaraz Khan, but it’s an abuse to domestic cricket,almost as if this platform doesn’t matter. And he is FIT to score those runs. As far as body weight goes, there are many with more kgs https://t.co/kenO5uOlSp — Venkatesh Prasad (@venkateshprasad) January 17, 2023 చదవండి: ఓర్వలేనితనం అంటే ఇదే.. దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్.. సీజన్లో మూడో సెంచరీ -
సౌరాష్ట్రతో రంజీ పోరు.. అర్ధ సెంచరీతో రాణించిన రికీ భుయ్
రాజ్‌కోట్: ఆంధ్ర బ్యాటర్ రికీ భుయ్ (155 బంతు ల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ లో సౌరాష్ట్రతో జరుగుతు న్న మ్యాచ్‌లో తొలిరోజు ఆట నిలిచే సమయానికి ఆంధ్ర జట్టు 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (34; 6 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (46; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమే ఇచ్చారు. అయితే సౌరాష్ట్ర స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా (3/80) తన వరుస ఓవర్లలో అభిషేక్, జ్ఞానేశ్వర్లను పెవిలియన్ చేర్చాడు. అనంతరం కెప్టెన్ హనుమ విహారి (38; 7 ఫోర్లు), రికీ భుయ్ మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో విహారిని కూడా జడేజా బౌల్డ్ చేశాడు. తర్వాత కరణ్ షిండే (31; 5 ఫోర్లు) అండతో రికీ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగిసే దశలో చేతన్ సకారియా బౌలింగ్‌లో రికీ భుయ్ వెనుదిరిగాడు. చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్కు చోటు! చాహల్‌కు నో చాన్స్ -
శతకాల మోత.. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 17) మొదలైన మ్యాచ్‌ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది తొలి రోజు ఆటలో సెంచరీలు బాదారు. సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మేఘాలయతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో బిహార్ ఆటగాడు బిపిన్ సౌరభ్ (177) కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు సచిన్ బేబి (116 నాటౌట్) ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒడిశా ఓపెనర్ శాంతాను మిశ్రా (107 నాటౌట్) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు నౌషద్ షేక్ (145 నాటౌట్) ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ (125) అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీశన్ (125) చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు సమర్పిత్ జోషి (123) మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అన్మోల్ప్రీత్ సింగ్ (124), నేహల్ వధేరా (123 నాటౌట్) చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాళ్లు వివేక్ సింగ్ (108), ఉపేంద్ర యాదవ్ (113) నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు అంకిత్ కల్సీ (116 నాటౌట్) హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అనుస్తుప్ మజుందార్ (137 నాటౌట్) -
దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్.. సీజన్లో మూడో సెంచరీ
ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. జాతీయ జట్టు నుంచి పిలుపు రాకపోయినప్పటికి తన పరుగుల ప్రవాహం మాత్రం కొనసాగిస్తూనే వస్తున్నాడు. వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ తాజాగా ఈ సీజన్లో మూడో సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు చూసుకుంటే గత 23 రంజీ ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్‌ఖాన్‌కు ఇది పదో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు సర్ఫరాజ్ ఆరు మ్యాచ్‌లాడి 556 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఎలైట్ గ్రూప్-బిలో ఢిల్లీతో మ్యాచ్‌లో మంగళవారం సర్ఫరాజ్ సెంచరీ ఫీట్ సాధించాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఓపికగా నిలబడి బ్యాటింగ్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ 135 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం అందుకున్నాడు. 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ముంబై జట్టును సర్ఫరాజ్ ఆదుకున్నాడు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నప్పటికి తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం ముంబై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ 124, తనుష్ కొటెయిన్ క్రీజులో ఉన్నారు. Yet another 100 for Sarfaraz Khan. In testing conditions too at the Kotla pic.twitter.com/LkUWraNlHD — Vikrant Gupta (@vikrantgupta73) January 17, 2023 Sarfaraz Khan has 10 centuries in his last 23 innings in Ranji Trophy. Crazy run for Sarfaraz, he's insane! pic.twitter.com/xq3bTpnKHs — Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2023 చదవండి: స్టీవ్ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు ఉప్పల్‌లో మ్యాచ్ అంటే కోహ్లికి పూనకాలే! -
నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి: సర్ఫరాజ్ ఖాన్
‘‘నేనెక్కడికి వెళ్లినా.. త్వరలోనే ఈ అబ్బాయి టీమిండియాకు ఆడతాడు అంటూ గుసగుసలు వినిపిస్తాయి. ఇక సోషల్ మీడియాలో అయితే, జట్టులో నా పేరు లేకపోవడం పట్ల విశేష స్పందన. వేలల్లో మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. నీకూ టైమ్ వస్తుంది. వేచి చూడక తప్పదు అని చాలా మంది సలహాలు ఇస్తుంటారు. స్వదేశంలో సిరీస్‌లకు జట్లను ప్రకటించిన సమయంలో.. అసోంతో మ్యాచ్ అనంతరం నేను ఢిల్లీకి వచ్చాను. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నేను ఎందుకు సెలక్ట్కాలేదు? రోజంతా ఇదే ఆలోచన. అయితే, మా నాన్నతో మాట్లాడిన తర్వాతే నార్మల్ అవ్వగలిగాను. ఏదేమైనా, నేను ప్రాక్టీసు వదలను. డిప్రెషన్లోకి వెళ్లను. అవకాశం వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను అని నాకు నేను సర్దిచెప్పుకొన్నాను’’ అంటూ భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాను కూడా మనిషేనని, యంత్రాన్నైతే కాదు కదా అని ఉద్వేగానికి గురయ్యాడు. మరోసారి మొండిచేయి దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు గత కొంతకాలంగా బీసీసీఐ సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. పరుగుల వరద పారిస్తున్నా జాతీయ జట్టులో మాత్రం చోటుదక్కడం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో వరుస సిరీస్‌ల నేపథ్యంలో బీసీసీఐ నుంచి పిలుపు వస్తుందని ఆశించిన అతడికి మరోసారి భంగపాటే ఎదురైంది. నేనూ మనిషినే! ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్ తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘జట్టును ప్రకటించిన సమయంలో అందులో నా పేరు ఉంటుందని ఆశగా ఎదురుచూశాను. కానీ అలా జరగకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాను. నేను కాదు.. నా స్థానంలో ఎవరున్నా అలాగే ఫీల్ అవుతారు. పరుగులు సాధిస్తూనే ఉన్నాను. అయినా, ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. నేనూ మనిషినే కదా! మెషీన్‌ని కాదు. నాకూ భావోద్వేగాలు ఉంటాయి. బంగ్లాదేశ్ సిరీస్‌లో అవకాశం అన్నారు! నిజానికి బెంగళూరులో రంజీ ట్రోఫీ టోర్నీ ఫైనల్లో సెంచరీ బాదిన సమయంలో నేను టీమిండియా సెలక్టర్లను కలిశాను. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నీకు కచ్చితంగా అవకాశం వస్తుంది. సిద్ధంగా ఉండు అని చెప్పారు. ఇటీవలే చేతన్ శర్మ సర్ని కూడా కలిశాను. (PC: sarfarazkhan Instagram) హోటల్ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఆయనను చూశాను. నువ్వేమీ బాధపడొద్దు. నీకూ కచ్చితంగా అవకాశం వస్తుందని ఆయన చెప్పారు. ఏదేమైనా మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురుచూడాల్సిందే! గొప్ప ఇన్నింగ్స్ ఆడినపుడు ఇలాంటి అంచనాలు, ఆశలు సహజమే. డిప్రెషన్లోకి వెళ్లను కానీ ఏం చేస్తాం! ఇప్పటికే జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. ఈ గడ్డుకాలం వెళ్లిపోతుందనే భావిస్తున్నా. నా చేతుల్లో ఏమీలేదు. అయితే, ఇలాంటి వాటి వల్ల డిప్రెషన్లో కూరుకుపోవాల్సిన అవసరం లేదు’’ అని 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుత రంజీ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 431 పరుగులు (2 సెంచరీలు) చేశాడు సర్ఫరాజ్. ఈ నేపథ్యంలో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు అతడిని ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరుగలేదు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! IND vs SL: వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్‌కు ఊహించని షాక్! వీడియో వైరల్ Team India: టెస్టులకు సూర్య.. టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో శ్రీకర్ భరత్ -
ఢిల్లీ బ్యాటర్ల అద్భుత పోరాటం.. ఆంధ్ర జట్టుకు నిరాశ
న్యూఢిల్లీ: చివరి వికెట్ తీయడంలో విఫలమైన ఆంధ్ర జట్టు బౌలర్లు ఢిల్లీ జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయారు. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా 29 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించినందుకు ఢిల్లీ జట్టుకు మూడు పాయింట్లు లభించగా... ఆంధ్ర ఖాతాలో ఒక పాయింట్ మాత్రమే చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 300/4తో ఆట చివరిరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఢిల్లీ జట్టు 9 వికెట్లకు 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో ధ్రువ్ షోరే మరో 43 పరుగులు జోడించి వ్యక్తిగత స్కోరు 185 వద్ద అవుటవ్వగా... హిమ్మత్ సింగ్ (104; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హిమ్మత్ సింగ్ అవుటైనపుడు ఢిల్లీ స్కోరు 423/9. చివరి వికెట్ తీసిఉంటే ఆంధ్ర జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోపాటు మూడు పాయింట్లు లభించేవి. కానీ ఢిల్లీ బ్యాటర్లు హర్షిత్ రాణా (46 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), దివిజ్ మెహ్రా (38 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) మొండి పట్టుదలతో ఆడి చివరి వికెట్‌కు అజేయంగా 65 పరుగులు జోడించారు. ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘బి’ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. -
Ranji Trophy: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే...
Ranji Trophy 2022-23 - Delhi vs Andhra- ఢిల్లీ: ఆంధ్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఢిల్లీ దీటైన రీతిలో జవాబిచ్చింది. ఓపెనర్ ధ్రువ్ షోరే (261 బంతుల్లో 142 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. హిమ్మత్ సింగ్ (45 బ్యాటింగ్), హృతిక్ షోకీన్ (45) అతడికి సహకరించారు. దీంతో.. మ్యాచ్ మూడో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్‌కు 2, నితీశ్ రెడ్డికి ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం ఢిల్లీ మరో 159 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం చివరి రోజు కావడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఎవరికి ఆధిక్యం లభిస్తుందనేది చూడాలి. చదవండి: IND vs SL: టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది -
ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే!
Ranji Trophy 2022-23- Prithvi Shaw అమిన్‌గావ్ (అస్సాం): జాతీయ జట్టులో పునరాగమనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విషయం విదితమే. అస్సాం జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో పృథ్వీ షా (383 బంతుల్లో 379; 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల పృథ్వీ షా 89 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ చరిత్రలో మహారాష్ట్ర క్రికెటర్ బి.బి.నింబాల్కర్ (443 నాటౌట్; 1948లో కతియావార్ జట్టుపై) తర్వాత రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. అదే విధంగా ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో దేశవాళీ క్రికెట్లో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఏకైక భారత ఆటగాడిగా రికార్డు రంజీ ట్రోఫీలో ‘ట్రిపుల్ సెంచరీ’... విజయ్ హజారే వన్డే టోర్నీలో ‘డబుల్ సెంచరీ’... ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు. రియాన్ బౌలింగ్‌లో.. ఇక ఈ రంజీ సీజన్లో పృథ్వీ ఇప్పటివరకు 539 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు పృథ్వీ షాను జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారా లేదంటే అన్యాయం చేస్తూనే ఉంటారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా 2021 శ్రీలంక పర్యటన తర్వాత పృథ్వీ షాకు ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 240తో బ్యాటింగ్ కొనసాగించిన పృథ్వీ మరో 139 పరుగులు సాధించి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 397/2తో ఆట కొనసాగించిన ముంబై ... కెప్టెన్ అజింక్య రహానే (191; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటవ్వగానే తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 129 పరుగులు చేసింది. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? IND Vs SL: కోల్‌కతాలోనే సిరీస్ పడతారా? -
24 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత కోసిన రుతురాజ్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా తమిళనాడుతో నిన్న (అక్టోబర్ 10) ప్రారంభమైన ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఉగ్రరూపం దాల్చాడు. తొలి రోజు ఆటలోనే సెంచరీ పూర్తి చేసిన ఈ పూణే కుర్రాడు.. రెండో రోజు ఆటలో మరింత చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 184 బంతులను ఎదుర్కొన్న రుతురాజ్ 24 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 195 పరుగులు చేసి 5 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రుతురాజ్‌కు జతగా గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో కేదార్ జాదవ్ (56), అజిమ్ ఖాజీ (88) అర్ధసెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు పడగొట్టగా.. విఘ్నేశ్, సాయ్ కిషోర్ తలో 2 వికెట్లు, క్రిస్ట్, విజయ్ శంకర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. 49 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. జగదీశన్ (77) అర్ధసెంచరీతో రాణించగా.. బాబా అపరాజిత్ (20), బాబా ఇంద్రజిత్ (47) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఓపెనర్ సాయ్ సుదర్శన్ డకౌటై నిరశపర్చగా.. ప్రస్తుతం ప్రదోశ్ పాల్ (33), విజయ్ శంకర్ (22) క్రీజ్‌లో ఉన్నారు. తమిళనాడు.. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 238 పరుగులు వెనుకపడి ఉంది. మహా బౌలర్లలో ప్రదీప్ దడే 2 వికెట్లు పడగొట్టగా.. రాజవర్ధన్ హంగేర్కర్, సత్యజిత్ బచ్చవ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఆరేసిన ఉనద్కత్.. హైదరాబాద్‌కు మరో ఘోర పరాభవం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో జయదేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది చివర్లో మొదలైన ఈ జట్టు జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2022 డిసెంబర్లో ముంబైపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌరాష్ట్ర.. గత వారం ఢిల్లీని ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతో, తాజాగా హైదరాబాద్‌ను ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (8/39, 70) చెలరేగిన ఉనద్కత్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు (3/28, 3/62) పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉనద్కత్‌కు జతగా ధరేంద్రసిన్హ్ జడేజా (3/8, 4/34, 40 పరుగులు) కూడా రాణించడంతో సౌరాష్ట్ర ప్రస్తుత రంజీ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. చిరాగ్ జానీ (68), హార్విక్ దేశాయ్ (81), షెల్డన్ జాక్సన్ (59) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 7 వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు 2, అబ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ బ్యాటింగ్ తీరు రెండో ఇన్నింగ్స్‌లోనూ మారలేదు. జడేజా (4/34), ఉనద్కత్ (3/62), దోడియా (2/76), సకారియా (1/13) విజృంభించడంతో ఆ జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. సంతోష్ గౌడ్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబద్ సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గతేడాది డిసెంబర్లో ముంబై చేతిలో ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఈ జట్టు.. ఆ తర్వాత అస్సాం చేతిలో (18 పరుగుల తేడాతో), ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ చేతిలో (154 పరుగుల తేడాతో), తాజాగా సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. -
తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్న రహానే
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో ముంబై కెప్టెన్, టీమిండియా ఆటగాడు ఆజింక్య రహానే సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీ (హైదరాబాద్‌పై 204 పరుగులు) నమోదు చేసిన రహానే.. తాజాగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తృటిలో మరో డబుల్ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 302 బంతులను ఎదుర్కొన్న రహానే 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 191 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఎండ్‌లో ఓపెనర్ పృథ్వీ షా రికార్డు స్థాయిలో 379 పరుగులు చేయడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముంబై ఇన్నింగ్స్‌లో ముషీర్ ఖాన్ (42). అర్మాన్ జాఫర్ (27), సర్ఫరాజ్ ఖాన్ (28 నాటౌట్) సైతం ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 2 వికెట్లు పడగొట్టగా.. ముక్తర్ హుస్సేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం 28 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఓపెనర్ శుభమ్ మండల్ (40) మోహిత్ అవస్తి బౌలింగ్‌లో ప్రసాద్ పవార్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మరో ఓపెనర్ రాహుల్ హజారికా (42), రిషవ్ దాస్ (15) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. అస్సాం, ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 587 పరుగులు వెనుకపడి ఉంది. -
రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. అరుదైన రికార్డు! ఎవరికీ అందనంత ఎత్తులో!
Prithvi Shaw Triple Century- Rare Record: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబై బ్యాటర్ తన అభిమాన ఆటగాడని.. అతడే తన రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా అసోంతో మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో భాగంగా ఈ ముంబైకర్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కొద్దిలో క్వాడ్రపుల్ సెంచరీ మిస్ అయినా.. కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రంజీల్లో సరికొత్త చరిత్ర ఈ క్రమంలో రంజీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బాంబే ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్‌ను అధిగమించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అరుదైన ఘనత సాధించి తన సమకాలీన క్రికెటర్లకు అందనంత ఎత్తుకు ఎదిగాడు 23 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనర్. ఈ నేపథ్యంలో పృథ్వీని అభినందిస్తూ.. సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ‘‘377 పరుగులతో నేను సృష్టించిన రికార్డును.. నేను అభిమానించే ఆటగాడు బద్దలు కొట్టడం చూసి థ్రిల్ అయ్యాను. వెల్డన్ పృథ్వీ!’’ అని ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1. బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర) – 443 నాటౌట్ (vs) సౌరాష్ట్ర (1948-49) 2. పృథ్వీ షా (ముంబై) – 379 (vs) అసోం (2022-23) 3. సంజయ్ మంజ్రేకర్ (బాంబే) – 377 (vs)హైదరాబాద్ (1990-91) 4. ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) – 366 (vs) ఆంధ్ర (1993-94) 5. విజయ్ మర్చంట్ (బాంబే) – 359 నాటౌట్(vs) మహారాష్ట్ర (1943-44) చదవండి: Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు IPL 2023-Rishabh Pant: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు Champion player 💪 Too good @PrithviShaw 💯💯💯 👏 pic.twitter.com/5wZ29EasNb — Shreyas Iyer (@ShreyasIyer15) January 11, 2023 Thrilled that my record of 377 was beaten by a batter I adore! Well done Prithvi! 👏🏼👏🏼👏🏼 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 11, 2023 -
టీమిండియా యువ ఓపెనర్ విధ్వంసం.. 400 మిస్! రికార్డులు బద్దలు
Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్‌లో ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. గువహటి వేదికగా మంగళవారం మొదలైన టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఈ యువ బ్యాటర్ 240 పరుగులు సాధించాడు. క్వాడ్రపుల్ సెంచరీ మిస్ ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 379 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో పృథ్వీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్వాడ్రపుల్ సెంచరీ మిస్సయ్యాడు. కాగా ఈ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 383 బంతులు ఎదుర్కొన్న 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టాడు. దిగ్గజాల రికార్డులు బద్దలు తద్వారా ట్రిపుల్ సెంచరీ వీరుడు 23 ఏళ్ల పృథ్వీ షా.. టీమిండియా దిగ్గజాల పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులతో ముంబై టాప్ బ్యాటర్‌గా ఉండగా.. 32 ఏళ్ల తర్వాత యువ ఓపెనర్ పృథ్వీ షా అతడిని అధిగమించాడు. అదే విధంగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (ముంబై తరఫున రంజీల్లో 340 పరుగులు)ను కూడా దాటేశాడు. కాగా గత కొన్నాళ్లుగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. చదవండి: Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్ అయ్యేవాడే! వీడియో వైరల్ IPL 2023: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు -
శతక్కొట్టిన రుతురాజ్.. 16 ఫోర్లు, 3 సిక్సర్లతో..!
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా తమిళనాడుతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో మహారాష్ట్ర ఓపెనర్, టీమిండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 118; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. అతనితో పాటు గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో కేదార్ జాదవ్ (56), అజిమ్ ఖాజీ (87 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ] అజీమ్ ఖాజీకి జతగా సత్యజీత్ బచ్చవ్ క్రీజ్‌లో ఉన్నాడు. మహారాష్ట్ర ఇన్నింగ్స్‌లో సిద్దేశ్ వీర్ (9), రాహుల్ త్రిపాఠి (7), సౌరభ్ నవాలే (5) విఫలం కాగా.. కెప్టెన్ అంకిత్ బావ్నే (45) పర్వాలేదనిపించాడు. తమిళనాడు బౌలర్లలో లక్ష్మీనారాయణన్ విఘ్నేశ్ 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ వారియర్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, విజయ్ శంకర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు అస్సాంతో జరిగిన మ్యాచ్‌ను మహారాష్ట్ర డ్రాగా ముగించగా.. ముంబైతో మ్యాచ్‌ను తమిళనాడు డ్రా చేసుకుంది. -
రాణించిన హనుమ విహారి.. భారీ స్కోర్ దిశగా ఆంధ్రప్రదేశ్
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తుంది. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (81)తో పాటు కెప్టెన్ హనుమ విహారి (76 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (22), రికీ భుయ్ (9) నిరుత్సాహపరచగా విహారికి జతగా శ్రీకర్ భరత్ (7) క్రీజ్‌లో ఉన్నాడు. ఢిల్లీ బౌలర్లలో దివిజ్ మెహ్రా, యోగేశ్ శర్మ, హృతిక్ షోకీన్ తలో వికెట్ పడగొట్టారు. ఇంతకుముందు మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు హైదరాబాద్‌పై 154 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా.. ఢిల్లీ టీమ్ సౌరాష్ట్ర చేతిలో ఇన్నింగ్స్ 214 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. -
విజృంభించిన ఉనద్కత్, జడేజా.. 79 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్రాజ్సిన్హ్ దోడియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. -
చెలరేగిన శశికాంత్.. హైదరాబాద్‌పై ఆంధ్ర భారీ విజయం
Ranji Trophy 2022-23- Andhra vs Hyderabad: రంజీ ట్రోఫీ టోర్నీ 2022- 23లో భాగంగా ఆంధ్ర జట్టు హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది. హనుమ విహారి బృందం 154 పరుగుల భారీ తేడాతో చిరకాల ప్రత్యర్థిపై జయభేరి మోగించింది. సెంచరీతో మెరిసిన రికీ భుయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఎలైట్ గ్రూప్ బిలో భాగమైన ఆంధ్ర- హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర.. తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కడు తప్ప.. అంతా సింగిల్ డిజిట్ స్కోర్లే! ఓపెనర్ అభిషేక్ రెడ్డి (81 పరుగులు( మినహా మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఆంధ్ర బ్యాటర్లు చేసిన స్కోర్లు వరుసగా.. 9 ,2, 6 ,5, 3, 4, 1, 13, 0, 1 నాటౌట్. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 5 వికెట్లతో చెలరేగగా.. రక్షణ్ రెడ్డి ఒకటి, కార్తికేయ మూడు వికెట్లు తీశారు. ఇక హైదరాబాద్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో 197 పరుగులకే ఆ జట్టు కథ ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసింది. సెంచరీలతో మెరిసిన రికీ, కరణ్ ఓపెనర్ జ్ఞానేశ్వర్ 72, కెప్టెన్ హనుమ విహారి 33, రికీ భుయ్ 116, శ్రీకర్ భరత్ 89 పరుగులు సాధించగా.. కరణ్ షిండే 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, హైదరాబాద్ ఆంధ్రకు దీటుగా బదులివ్వలేక చతికిలపడింది. చెలరేగిన శశికాంత్ చందన్ సహాని అర్ధ శతకం(56) సాధించగా రోహిత్ రాయుడు 46 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆంధ్ర బౌలర్ కేవీ శశికాంత్ 5 వికెట్లు కూల్చి హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో కొడవండ్ల సుదర్శన్ మూడు, నితీశ్ రెడ్డి, షోయబ్ మహ్మద్ ఖాన్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో విజయనగరంలో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆంధ్ర 154 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆంధ్ర వర్సెస్ హైదరాబాద్ స్కోర్లు ఆంధ్ర- 135 & 462 హైదరాబాద్- 197 & 246 చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్ Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
శతక్కొట్టిన రికీ భుయ్, కరణ్ షిండే.. విజయంపై ఆంధ్ర గురి
సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు కీలక విజయంపై గురి పెట్టింది. చిరకాల ప్రత్యర్థి హైదరాబాద్‌తో జరుగుతున్న గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆ జట్టు మూడో రోజు గెలుపు అవకాశాలు మెరుగుపర్చుకుంది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (21), ప్రజ్ఞయ్ రెడ్డి (0) అవుట్ కాగా...రోహిత్ రాయుడు (46 నాటౌట్), అలంకృత్ అగర్వాల్ (7 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు హైదరాబాద్ మరో 326 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 230/3తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయింది. రికీ భుయ్ (150 బంతుల్లో 116; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకోగా, కేఎస్ భరత్ (70 బంతుల్లో 89; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆ అవకాశం చేజార్చుకున్నాడు. ఆపై కరణ్ షిండే (180 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) కూడా శతకం బాదాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 3 వికెట్లు పడగొట్టాడు. -
చారిత్రక బౌలింగ్ ప్రదర్శన అనంతరం బ్యాట్‌తోనూ ఇరగదీసిన ఉనద్కత్
Jaydev Unadkat: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్, భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇరగదీస్తున్నాడు. తొలి ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి చారిత్రక ప్రదర్శన కనబర్చిన ఉనద్కత్.. ఆతర్వాత బ్యాట్‌తోనూ విజృంభించి ఆల్‌రౌండర్‌గా, సమర్ధవంత నాయకుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. అప్పటికే (మూడో రోజు ఆటలో) హార్విక్ దేశాయ్ (107), వసవద (152 నాటౌట్) సెంచరీలతో.. చిరాగ్ జానీ (75), సమర్థ్ వ్యాస్ (54), ప్రేరక్ మన్కడ్ (64) అర్ధసెంచరీలతో అలరించగా, 8వ స్థానంలో బరిలోకి దిగిన ఉనద్కత్ తాను సైతం అంటూ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో 68 బంతులు ఎదుర్కొన్న ఉనద్కత్.. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 2 బంతులకే మరో వికెట్ పడటంతో ఉనద్కత్.. 574/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా సౌరాష్ట్రకు 441 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి కేవలం 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో చుక్కలు చూపించిన ఉనద్కత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోవడం విశేషం. యువరాజ్‌సింగ్ దోడియ 4 వికెట్లు పడగొట్టగా.. పార్థ్ బట్, చిరాగ్ జానీ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్సలో 9వ స్థానంలో అర్ధసెంచరీతో ఢిల్లీ పరువు కాపాడిన హృతిక్ షోకీన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి ఆ జట్టు మరోసారి పేకమేడలా కూలకుండా కాపాడాడు. జాంటీ సిద్దు (17), లక్ష్యయ్ తరేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఉనద్కత్ ధాటికి 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ దిశగా సాగిన ఢిల్లీ జట్టు పరువును ప్రాణ్షు విజయరన్ (15), షోకీన్ (68 నాటౌట్), శివాంక్ వశిష్ట్ (38) కాపాడారు. ఈ ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్ చేయడంతో ఢిల్లీ 133 పరుగులు చేసి ఆలౌటైంది. ఉనద్కత్ (8/39)కు జతగా చిరాగ్ జానీ (1/14), ప్రేరక్ మన్కడ్ (1/2) రాణించారు. -
భారీ ద్విశతకం బాదిన ధోని ఫ్రెండ్.. లేటు వయసులో 21 ఫోర్లు, 12 సిక్సర్లతో విధ్వంసం
Kedar Jadhav: టీమిండియా వెటరన్ క్రికెటర్, ఎంఎస్ ధోనికి అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్.. లేటు వయసులో వీర లెవెల్లో రెచ్చిపోయి విధ్వంసం సృష్టించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ ద్విశతకం బాదిన కేదార్ అభిమానులకు టీ20 మజాను అందించి అబ్బురపరిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేజే.. 283 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 283 పరుగులు చేశాడు. 37 ఏళ్ల కేదార్ జాదవ్.. ఈ మ్యాచ్‌లో మరో 17 పరుగులు చేసుంటే కెరీర్లో రెండో ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు లేటు వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కేవాడు. ఇప్పటి వరకు 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కేదార్.. 45.72 సగటున 14 సెంచరీలు, 20 అర్ధసెంచరీ సాయంతో 5166 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 327 పరుగులుగా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు టీమిండియా తరఫున కూడా అదరగొట్టిన కేదార్.. 73 వన్డేల్లో 42.09 సగటున 2 శతకాలు, 6 అర్ధశతకాల సాయంతో 1389 పరుగులు చేశాడు. ఈ మహారాష్ట్ర ఆటగాడు టీ20ల్లో, ఐపీఎల్‌లోనూ ఆల్‌రౌండర్‌గా సత్తా చాటాడు. కొద్దికాలం పాటు టీమిండియాలో ధోనితో ప్రయాణం సాగించిన కేదార్.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడిగా చాలాకాలం పాటు కొనసాగాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అస్సాం.. పురకాయస్త (65), ఆకాశ్‌సేన్ గుప్త (65) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర బౌలర్లలో అశయ్ పాల్కర్, దడే తలో 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ ఇంగలే, బచ్చవ్ చెరో 2 వికెట్లు సాధించారు. అనంతరం బరిలోకి దిగిన మహారాష్ట్ర.. సిద్దేశ్ వీర్ (106) శతకంతో, కేదార్ జాదవ్ (283) భారీ ద్విశతకంతో రెచ్చిపోవడంతో తొలి ఇన్నింగ్స్‌ను 594/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్ 4 వికెట్లు పడగొట్టగా.. ముక్తార్ హుస్సేన్ 2, రంజిత్ మాలి ఓ వికెట్ దక్కించుకున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన మహారాష్ట్ర 320 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. -
నిప్పులు చెరిగిన ఆవేశ్ ఖాన్.. 7 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా బౌలర్
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా జనవరి 3న ప్రారంభమైన గ్రూప్ మ్యాచ్‌ల్లో మిగతా జట్లతో పాటు విదర్భ-మధ్యప్రదేశ్ జట్లు కూడా పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విదర్భ తొలి బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రజత్ పాటిదార్ (121) శతకంతో, సరాన్ష్ జైన్ (61) హాఫ్ సెంచరీతో రాణించడంతో మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4, లలిత్ యాదవ్, సర్వటే చెరో 2 వికెట్లు, భుటే ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ.. మధ్యప్రదేశ్ పేసర్ ఆవేశ్ ఖాన్ ధాటికి చిగురుటాకులా వణికింది. ఆవేశ్.. తాను వేసిన 22 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్ ధాటికి విదర్భ 160 పరుగులకే చేతులెత్తేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో సంజయ్ రఘునాథ్ (58) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అతను మినహా మరో ముగ్గురు రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో ఉగ్రరూపం దాల్చిన ఆవేశ్ ఖాన్ టీమిండియాలో చోటే లక్ష్యంగా సాగాడు. అతనికి జతగా జి యాదవ్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఆవేశ్ ఖాన్.. టీమిండియా తరఫున 5 వన్డేలు, 15 టీ20లు ఆడిన విషయం తెలిసిందే. ఇందులో అతను మొత్తంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోకీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఇండోర్ బౌలర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌లో కొనసాగుతున్నాడు. ఆవేశ్.. తన ఐపీఎల్ కెరీర్లో 38 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు పడగొట్టాడు. -
జ్ఞానేశ్వర్, భరత్ అర్ధ శతకాలు.. కోలుకున్న ఆంధ్ర జట్టు.. ఇక సౌరాష్ట్ర
Ranji Trophy 2022- 23 Andhra vs Hyderabad- సాక్షి, విజయనగరం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 62 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. తద్వారా తమ ఆధిక్యాన్ని 168 పరుగులకు పెంచుకుంది. సీఆర్ జ్ఞానేశ్వర్ (96 బంతుల్లో 72; 15 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (33; 4 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 70 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 43 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఆటతీరుతో ఆంధ్ర జట్టును నిలబెట్టారు. ఆంధ్ర కోల్పోయిన మూడు వికెట్లను హైదరాబాద్ బౌలర్ రక్షణ్ రెడ్డి పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 79/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 118 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులవద్ద ఆలౌటై 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. శశాంక్ (55 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/64), కేవీ శశికాంత్ (3/40), సుదర్శన్ (2/47) విజృంభించి హైదరాబాద్‌ను 200 స్కోరులోపు కట్టడి చేశారు. సౌరాష్ట్ర 503/6 రాజ్‌కోట్: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 370 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 184/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 503 పరుగులు సాధించింది. అర్పిత్ (127 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), హార్విక్ దేశాయ్ (107; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తొలి రోజు జైదేవ్ ఉనాద్కట్ (8/39) ధాటికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్ వైరల్ -
శతకాల మోత మోగించిన టీమిండియా ఆటగాళ్లు
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా నిన్న (జనవరి 3) మొదలైన గ్రూప్ మ్యాచ్‌ల్లో ఇవాళ (రెండో రోజు) కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో రెచ్చిపోయారు. త్రిపురతో జరుగుతున్న మ్యాచ్‌లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా (200) ద్విశతకంతో విజృంభించగా, అదే జట్టు ఆటగాడు కునల్ మహాజన్ (162) అజేయమైన శతకంతో చెలరేగాడు. ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ (129) సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (165) శతకంతో అలరించాడు. మేఘాలయతో జరుగుతున్న మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ (123).. అంతకుముందు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ (128), పునిత్ బిస్త్ (215), తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్) శతకాల మోత మోగించారు. విదర్భతో జరుగుతన్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ (121) సెంచరీ సాధించాడు. జమ్మూ అండ్ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) ద్విశతకంతో రెచ్చిపోయాడు. గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా (123) సెంచరీ సాధించాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా (122) అజేయ శతకంతో రాణించాడు. గోవాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు ఆర్ ప్రేమ్ (112) సెంచరీ సాధించాడు. బరోడా-హిమాచల్ ప్రదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి (178), హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా (111) శతకాలు సాధించారు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ (142 నాటౌట్) శతకొట్టాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ (107), అర్పిత్ వసవద (127 నాటౌట్) సెంచరీలు సాధించారు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) శతకొట్టాడు. చత్తీస్ఘడ్-కర్ణాటక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత చత్తీస్ఘడ్ ఆటగాడు అశుతోష్ (135), ఆతర్వాత కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్) సెంచరీలతో రాణించారు. పుదుచ్ఛేరితో జరుగుతున్న మ్యాచ్‌లో సర్వీసెస్ ఆటగాళ్లు గెహ్లౌత్ రాహుల్ సింగ్ (137), రజత్ పలివాల్ (101) శతకాలతో రాణించారు. -
Ranji Trophy: ఉనాద్కట్ సంచలనం.. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్‌డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు. రంజీ చరిత్రలోనే తొలిసారి కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు. అంతేకాదు.. తద్వారా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్‌కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే! -
మరోసారి రెచ్చిపోయిన సంజూ శాంసన్.. ప్రయోజనం లేదంటున్న ఫ్యాన్స్
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ వరుస హాఫ్ సెంచరీలతో దూసుకుపోతున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్ (108 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆడిన సంజూ.. తాజాగా రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 108 బంతులు ఎదుర్కొన్న అతను.. 14 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూతో పాటు సచిన్ బేబి (67 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో రెండో రోజు రెండో సెషన్ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు (50 ఓవర్లు) చేసింది. ఓపెనర్లు పొన్నన్ రాహుల్ (10), రోహన్ ప్రేమ్ (18) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. షౌన్ రోజర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సచిన్‌కు జతగా అక్షయ్ చంద్రన్ (3) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. దీపక్ హుడా (133) సెంచరీతో, యశ్ కొఠారీ (58), సల్మాన్ ఖాన్ (74) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకే ఆలౌటైంది. కేరళ బౌలర్లలో బాసిల్ థంపి, జలజ్ సక్సేనా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. నిధీశ్, ఫజిల్ ఫనూస్, సిజోమోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ రంజీల్లో వరుస అర్ధశతకాలతో రాణించడంపై అతని ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రాణిస్తేనే చోటివ్వని భారత సెలెక్టర్లు.. రంజీల్లో హాఫ్ సెంచరీలు బాదితే జాతీయ జట్టులో చోటిస్తారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. సంజూ హాఫ్ సెంచరీలు కాదు ట్రిపుల్ సెంచరీలు కొట్టినా టీమిండియా యాజమాన్యం కరుణించదంటూ మరికొందరు వైరాగ్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని పరుగులు చేసినా, అభిమానుల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా సెలెక్టర్లు మాత్రం సంజూను జాతీయ జట్టుకు ఎంపిక చేయరని, కొద్ది రోజుల కిందటి వరకు సంజూకు పంత్ ఒక్కడే అడ్డంగా ఉండేవాడని, కొత్తగా ఇషాన్ కిషన్ కూడా తమ ఫేవరెట్ క్రికెటర్‌కు అడ్డుగా తయారయ్యాడని సంజూ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ వాపోతున్నారు. -
డబుల్ సెంచరీతో విరుచుకుపడిన కోహ్లి
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బంతితో (4/2) మాయ చేసిన కోహ్లి.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో (297 బంతుల్లో 203; 30 ఫోర్లు, సిక్స్) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్.. కోహ్లి, రాల్టే (4/21), నవీన్ (1/22), అవినాశ్ యాదవ్ (1/17) ధాటికి 304 ఓవర్లలో 63 పరుగులకే కుప్పకూలింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్ కాగా.. కుమార్ న్యోంపు (24), కమ్షా (17), నబమ్ అబొ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిజోరం.. తరువార్ కోహ్లి, గోస్వామి (50) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. మిజోరం ఇన్నింగ్స్‌లో కోహ్లి, గోస్వామి, ఆండర్సన్ (28) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. అరుణాచల్ బౌలర్లలో నబమ్ అబొ 4, యబ్ నియా 3, అఖిలేశ్ సహాని 2, చేతన్ ఆనంద్ ఓ వికెట్ పడగొట్టారు. మిజోరం తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 275 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్.. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు (23 ఓవర్లలో) చేసింది. టెకీ నెరీ (27) ఔట్ కాగా.. కుమార్ న్యోంపు (31), కెప్టెన్ సూరజ్ తయమ్ (18) క్రీజ్‌లో ఉన్నారు. టెకీ నెరీ వికెట్ అవినాశ్ యాదవ్‌కు దక్కింది. ప్రస్తుతానికి అరుణాచల్ ప్రదేశ్ ఇంకా 198 పరుగుల వెనకంజలో ఉంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇద్దరూ మంచి మిత్రులు, 2008లో భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యులు అన్న విషయం చాలామందికి తెలీదు. నాటి ప్రపంచకప్‌లో విరాట్‌తో (235) సమానంగా పరుగులు చేసిన తరువార్ (218, 3 వరుస హాఫ్ సెంచరీలు).. ఆతర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. మరోవైపు విరాట్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ క్రికెట్ చరిత్రలోనే మేటి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోగా.. మీడియం ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన తరువార్.. సొంత రాష్ట్రమైన పంజాబ్ తరఫున సరైన అవకాశాలు రాక మిజోరంకు వలస వెళ్లి కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. కాగా, టాలెంట్ పరంగా చూస్తే విరాట్‌కు తరువార్ ఏమాత్రం తీసిపోడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. -
శతక్కొట్టిన దీపక్ హుడా.. 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో..!
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో టీమిండియా పరిమిత ఓవర్ల బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ (80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. కేరళతో ఇవాళే (డిసెంబర్ 20) మొదలైన మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హుడా (187 బంతుల్లో 133; 14 ఫోర్లు, సిక్స్) సెంచరీతో విరుచుకుపడ్డాడు. గత కొంతకాలంగా టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో చెలరేగిపోతున్న ఈ ఇద్దరూ.. రంజీల్లోనూ తమ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. సూర్యకుమార్, దీపక్ హుడా రాణించడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించాయి. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. హూడా సెంచరీతో, యశ్ కొఠారీ (58), సల్మాన్ ఖాన్ (62 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 2 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ థంపి, ఫజిల్ ఫనూస్, సిజోమోన్ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తొలి ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 457 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ (90) పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. యశస్వి జైస్వాల్ (162), కెప్టెన్ అజింక్య రహానే (139 నాటౌట్) సెంచరీలతో విజృంభించారు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు
Ranji Trophy 2022-23: బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లకుండా కొద్ది రోజులు విరామం తీసుకున్న టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా హైదరాబాద్‌తో ఇవాళ (డిసెంబర్ 20) మొదలైన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే తన మార్క్ నాటుకొట్టుడును ప్రారంభించిన స్కై.. మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తూ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు చేశాడు. 112.50 స్ట్రయిక్ రేట్‌తో హైదరాబాద్ బౌలర్లను ఎడాపెడా వాయించిన మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (162), కెప్టెన్ అజింక్య రహానే (108 నాటౌట్)లు శతకాలతో చెలరేగడంతో 75 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 396 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహానేకు జతగా సర్ఫరాజ్ ఖాన్ (10) క్రీజ్‌లో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై.. ఆంధ్రప్రదేశ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందగా.. హైదరాబాద్ తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. -
వరుసగా 5 సెంచరీలు బాదిన జగదీశన్ ఖాతాలో మరో మెరుపు సెంచరీ
Ranji Trohy 2022-23: విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్లో వరుసగా 5 సెంచరీలు (114 నాటౌట్, 107, 168, 128, 277) బాది పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన తమిళనాడు విధ్వంసకర బ్యాటర్ ఎన్ జగదీశన్.. తన భీకర ఫామ్‌ను కొనసాగించాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ సీఎస్కే మాజీ ప్లేయర్ మరోసారి జూలు విదిల్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 277 పరుగులు (141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదిన జగదీశన్.. ఇవాళ హైదరాబాద్‌పై 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జగదీశన్‌కు ఇది ఐదో సెంచరీ. జగదీశన్ పార్ట్నర్, తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్ (179), అపరాజిత్ (115) కూడా సెంచరీలతో కదం తొక్కడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా ఆ జట్టుకు 115 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 87 పరుగులు వెనకంజతో ఉంది. అంతకుముందు తన్మయ్ అగర్వాల్ (135), మికిల్ జైస్వాల్ (137 నాటౌట్) శతకాలతో చెలరేగడంతో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 5 సెంచరీలు బాదిన చిచ్చరపిడుగును వదులుకున్నామా.. ధోని పశ్చాత్తాపం చదవండి: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 5 రోజుల వ్యవధిలో మరోసారి విధ్వంసం
Ranji Trophy 2022-23: పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ 5 రోజుల వ్యవధిలో మరోసారి రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో (డిసెంబర్ 10) డబుల్ సెంచరీతో (131 బంతుల్లో 210; 24 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడిన అతను.. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఆట మూడో రోజు (డిసెంబర్ 15) బరిలోకి దిగిన ఇషాన్ (జార్ఖండ్).. 195 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్‌తో అతనికి సౌరభ్ తివారీ (97) తోడవ్వడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు అక్షయ్ చంద్రన్ (150) భారీ సెంచరీతో చెలరేగడంతో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 475 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్ ప్రేమ్ (79), కున్నుమ్మల్ (50), సంజూ శాంసన్ (72), సిజిమోన్ (83) అర్ధసెంచరీలతో రాణించారు. 135 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహన్ ప్రేమ్ (25), షౌన్ రోజర్ (28) క్రీజ్‌లో ఉన్నారు. కేరళ బౌలర్ జలజ్ సక్సేనా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టగా.. జార్ఖండ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆటలో మరో రోజు మాత్రమే మిగిలి ఉండటంతో ఫలితం తేలేది లేనిది అనుమానంగా మారింది. -
తండ్రికి తగ్గ తనయుడు.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ, మరో రికార్డు కూడా..!
Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు తండ్రి పేరు నిలబెట్టాడు. రంజీల్లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి సచిన్ వారసత్వాన్ని ఘనంగా చాటాడు. 15 ఏళ్ల వయసులో సచిన్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాది క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యాడు. 34 ఏళ్ల కిందట.. 1988 రంజీ సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన సచిన్.. తన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. తాజాగా అతని తనయుడు అర్జున్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే శతక్కొట్టి, తండ్రికి తానే మాత్రం తీసిపోనని క్రికెట్ ప్రపంచానికి చాటాడు. 23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. తన దేశవాలీ కెరీర్ ముంబై తరఫున మొదలు పెట్టినప్పటికీ, అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోవాకు షిఫ్ట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ గ్రూప్-సిలో భాగంగా నిన్న (డిసెంబర్ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో 4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన అర్జున్.. ఇవాళ సెంచరీ పూర్తి చేసుకుని 112 పరుగుల వద్ద అజేయంగా కొనసాగుతున్నాడు. మరో ఎండ్‌లో సుయాశ్ ప్రభుదేశాయ్ (172 నాటౌట్) ఇవాళే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. రెండో రోజు టీ విరామం సమయానికి గోవా 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
ఎట్టకేలకు ఛాన్స్ దొరకబట్టిన సచిన్ తనయుడు
Ranji Trophy 2022-23: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ముంబై తరఫున రంజీల్లో ఆడేందుకు సుదీర్ఘంగా నిరీక్షించిన అర్జున్.. అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో గోవాకు షిష్ట్ అయి రంజీ ఛాన్స్ దొరకబట్టాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 13) రాజస్థాన్‌తో మొదలైన మ్యాచ్‌తో అర్జున్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడిన అర్జున్‌కు ఇది తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 23 ఏళ్ల అర్జున్.. గ్రూప్-సిలో భాగంగా ఇవాళ రాజస్తాన్‌తో మొదలైన మ్యాచ్‌లో బరిలోకి దిగి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోవా.. సుయాశ్ ప్రభుదేశాయ్ (81 నాటౌట్), స్నేహల్ సుహాస్ ఖౌతాంకర్ (59) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. సుయాశ్, అర్జన్ టెండూల్కర్ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్తాన్ బౌలర్లలో అంకిత్ చౌధరీ 2 వికెట్లు పడగొట్టగా.. అరాఫత్ ఖాన్, కమలేశ్ నాగర్‌కోటీ, మానవ్ సుతార తలో వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్.. ముంబై ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం దొరకలేదు. ఎంత సచిన్ కుమారుడైనా టాలెంట్ ఉంటేనే తుది జట్టులో అవకాశం కల్పిస్తామని ముంబై కోచ్ జయవర్ధనే అప్పట్లో ప్రకటించాడు. ఎట్టకేలకు అర్జున్ తన స్వయంకృషితో గోవా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో అర్జున్ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మ్యాచ్‌లో ఆటతీరుపై అతని భవితవ్యం ఆధారపడి ఉంది. -
రెచ్చిపోయిన సంజూ శాంసన్.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో..!
Ranji Trophy 2022-23 Kerala Vs Jharkhand: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 13) జార్ఖండ్‌తో మొదలైన మ్యాచ్‌లో కేరళ కెప్టెన్ సంజూ శాంసన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కేరళ.. శాంసన్ (72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రోహన్ కున్నుమ్మల్ (50), రోహన్ ప్రేమ్ (79) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. అక్షయ్ చంద్రన్ (39), సిజోమోన్ జోసఫ్ (28) క్రీజ్‌లో ఉన్నారు. జార్ఖండ్ బౌలర్లలో షాబాజ్ నదీమ్ 3 వికెట్లు పడగొట్టగా, ఉత్కర్ష్ సింగ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్, జార్ఖండ్ ప్లేయర్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంజీ ట్రోఫీ 2022-23 తొలి రోజు నమోదైన అత్యుత్తమ గణాంకాలు.. తొలి రోజు రంజీ మ్యాచ్‌ల్లో సాదాసీదా గణాంకాలు నమోదయ్యాయి. కర్ణాటకపై సర్వీసెస్ బౌలర్ దివేశ్ పతానియా 5 వికెట్ల ఘనత సాధించగా, రైల్వేస్‌పై విదర్భ కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (112) సెంచరీ, రైల్వేస్ బౌలర్ కర్ణ్ శర్మ 8/38 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. హిమాచల్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా 46 పరుగులకే ఆలౌట్ కాగా.. హిమాచల్ ఓపెనర్ ప్రశాంత్ చోప్రా (137) శతకంతో కదం తొక్కాడు. చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ (100) శతకంతో రాణించగా, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (202) డబుల్ సెంచరీతో మెరిశాడు. మేఘాలయపై మిజోరం కెప్టెన్ తరువార్ కోహ్లి (123) శతకం సాధించగా.. గుజరాత్ కెప్టెన్ ప్రియాంక్ పంచల్ త్రిపురపై 111 సెంచరీ బాదాడు. ఇదే మ్యాచ్‌లో త్రిపుర బౌలర్ మురసింగ్ 5 వికెట్లతో రాణించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ బౌలర్ ఇషాన్ పోరెల్ 5 వికెట్ల ఘనత సాధించగా.. తమిళనాడుపై హైదరాబాద్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (116) అజేయ శతకంతో రాణించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్ మనోజ్ ఇంగలే 5 వికెట్ల ఘనత సాధించాడు.