Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్‌రాజ్‌సిన్హ్ దోడియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది.
కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment