Saurashtra
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర సీనియర్ ఆటగాడు, దేశవాలీ స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ (Sheldon Jackson)... ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా రాణిస్తున్న 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్... రంజీ ట్రోఫీలో గుజరాత్‌తో క్వార్టర్ ఫైనల్ పరాజయం అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 106 మ్యాచ్‌లాడిన షెల్డన్ 45.80 సగటుతో 7,283 పరుగులు చేశాడు. ఇందులో 21 శతకాలు, 39 అర్ధశతకాలు ఉన్నాయి. కేవలం బ్యాటర్‌గానే కాకుండా... మంచి ఫీల్డర్‌గా, వికెట్ కీపర్‌గానూ షెల్డన్ జాక్సన్ సౌరాష్ట్ర జట్టుకు సేవలందించాడు. 2011లో అరంగేట్రం చేసిన జాక్సన్... 2015–16 సీజన్లో సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షెల్డన్ భారత ‘ఎ’ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. జాక్సన్‌కు ఐపీఎల్‌లోనూ ప్రవేశముంది. 2017-22 ఎడిషన్ల మధ్యలో జాక్సన్ క్యాష్ రిచ్ లీగ్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు. -
రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన పుజారా.. రంజీ క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రపై గుజరాత్ ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ప్లేయర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో చిరాగ్ జానీ (69), రెండో ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (54) మాత్రమే అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 26 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 2 పరుగులకే ఔటయ్యాడు.కలిసికట్టుగా రాణించిన గుజరాత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 216 పరుగులకే ఆలౌటైంది. చింతన్ గజా 4, జయ్‌మీత్ పటేల్, సిద్దార్థ్ దేశాయ్ తలో 2, నగస్వల్లా, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. సౌరాష్ట్ర బ్యాటర్లలో చిరాగ్ జానీ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించగా.. హార్విక్ దేశాయ్ (22), పుజారా, షెల్డన్ జాక్సన్ (14), వసవద (39 నాటౌట్), ధర్మేంద్ర జడేజా (22), ఉనద్కత్ (14) రెండంకెల స్కోర్లు చేశారు.జయ్‌మీత్, ఉర్విల్ సెంచరీలుఅనంతరం బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. జయ్‌మీత్ పటేల్ (103), ఉర్విల్ పటేల్ (140) సెంచరీలతో కదంతొక్కగా.. మనన్ హింగ్రజియా (81) భారీ అర్ద సెంచరీతో రాణించాడు. వీరికి తోడు రవి బిష్ణోయ్ (45), చింతన్ గజా (39), విశాల్ జేస్వాల్ (28), ప్రియాంక్ పంచల్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది. సౌరాష్ట్ర బౌలర్లలో ధర్మేంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ 4, జయదేశ్ ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు.295 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. ఈ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసింది. గుజరాత్ బౌలర్లు పి జడేజా (4 వికెట్లు), నగస్వల్లా (3), బిష్ణోయ్ (2), చింతన్ గజా (1) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా గుజరాత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (54) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చిరాగ్ జానీ (26), షెల్డన్ జాక్సన్ (27), వసవద (11), డి జడేజా (19), ఉనద్కత్ (29) రెండంకెల స్కోర్లు చేశారు.మిగతా మూడు క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబై, హర్యానా.. విదర్భ, తమిళనాడు.. జమ్మూ అండ్ కశ్మీర్, కేరళ జట్లు తలపడుతున్నాయి. ప్రస్తుతం నాలుగో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌ల్లో రేపు ఫలితం తేలే అవకాశం ఉంది. -
పాపం పుజారా.. ఒక్క పరుగు దూరంలో సెంచరీ మిస్
రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర దిగ్గజం ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ను దురదృష్టం వెంటాడింది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా ఒక్క పరుగు దూరంలో 67వ ఫస్ట్ క్లాస్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.పుజారా 99 పరుగుల వద్ద ముక్తర్ హూస్సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఏ బ్యాటర్‌కైనా ఒక్క పరుగు దూరంలో ఔటైతే ఆ బాధ వర్ణనాతీతం. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌లో తన అద్భుత ఇన్నింగ్స్‌తో సౌరాష్ట్రను పటిష్ట స్ధితిలో ఉంచాడు. 167 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 99 పరుగులు చేసి పుజారా పెవిలియన్‌కు చేరాడు.కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 109 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 442 పరుగులు చేసింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హర్విక్ దేశాయ్(130), చిరాగ్ జానీ(80) రాణించారు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అదుర్స్..ఇక ఇప్పటివరకు 276 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 51.89 సగటుతో 21174 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 66 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 103 మ్యాచ్‌లు ఆడిన ఛతేశ్వర్.. 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లలో 19 సెంచరీలు, 35 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. పుజారా చివరగా భారత్ తరపున 2023 ఏడాదిలో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు.పాపం రహానే..మరోవైపు మేఘాలయతో జరుగుతున్న ముంబై కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) కూడా తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో 96 పరుగుల వద్ద రహానే ఔటయ్యాడు. నఫీస్ సిద్ధిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే తన వికెట్‌ను కోల్పోయాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. రహానే టీమ్ ప్రస్తుతం 172 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 86 పరుగులకే కుప్పకూలింది.చదవండి: దినేష్ కార్తీక్ విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స్‌లతో హాఫ్ సెంచరీ! వీడియో -
చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డు
సౌరాష్ట్ర వెటరన్ క్రికెటర్ షెల్డన్ జాక్సన్(Sheldon Jackson) సరికొత్త చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) టోర్నీలో అత్యధిక సిక్సర్లు(Highest Six Hitter) బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అసోంతో మ్యాచ్ సందర్భంగా షెల్డన్ జాక్సన్ ఈ ఘనత సాధించాడు. కాగా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీలు జనవరి 23న మొదలయ్యాయి.ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న సౌరాష్ట్ర.. తొలుత ఢిల్లీతో తలపడి పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో గురువారం అసోంతో రాజ్‌కోట్ వేదికగా రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో ఓపెనర్లు హర్విక్ దేశాయ్, చిరాగ్ జైనీ అదిరిపోయే ఆరంభం అందించారు. వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ శతకంతో చెలరేగాడు. 181 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో రాణించి.. 130 పరుగులు చేశాడు. మరోవైపు.. చిరాగ్ 78 బంతుల్లోనే 80 పరుగులతో సత్తా చాటాడు.144వ సిక్సర్ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా కూడా బ్యాట్ ఝులిపించగా.. నాలుగో స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా కాసేపు అలరించాడు. మొత్తంగా 86 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 48 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లతో పాటు ఒక సిక్సర్ ఉంది. కాగా రంజీల్లో జాక్సన్‌కు ఇది 144వ సిక్సర్.ఆల్‌టైమ్ రికార్డుఈ క్రమంలోనే 38 ఏళ్ల షెల్డన్ జాక్సన్ రంజీల్లో ఆల్‌టైమ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. రంజీ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు బాదిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా పేరిట ఉండేది. అతడు రంజీల్లో 143 సిక్సర్లు కొట్టాడు. తాజాగా షెల్డన్ జాక్సన్ నమన్ ఓజాను అధిగమించాడు.పటిష్ట స్థితిలో సౌరాష్ట్రఇక సౌరాష్ట్ర- అసోం మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 90 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని.. కేవలం మూడు వికెట్ల నష్టానికి 361 పరుగులు సాధించింది. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఛతేశ్వర్ పుజారా 95, అర్పిత్ వసవాడ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో ఉన్న వేళ షెల్డన్ జాక్సన్.. టీమిండియా యువ సంచలనం రియాన్ పరాగ్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం గమనార్హం.అద్బుతమైన రికార్డులు ఉన్నాఇదిలా ఉంటే.. రంజీల్లో షెల్డన్ జాక్సన్‌కు అద్బుతమైన రికార్డు ఉంది. సౌరాష్ట్ర తరఫున ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటి వరకు 6600కు పైగా పరుగులు సాధించాడు. తద్వారా సితాన్షు కొటక్, ఛతేశ్వర్ పుజారా తర్వాత సౌరాష్ట్ర తరఫున ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు.ఇప్పటి వరకు షెల్డన్ జాక్సన్ ఖాతాలో 21 ఫస్ట్‌క్లాస్ సెంచరీలు ఉండటం విశేషం. 2019-20 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. నాటి టోర్నీలో 809 పరుగులతో రాణించి సౌరాష్ట్ర ట్రోఫీ సొంతం చేసుకోవడంలో జాక్సన్ కీలక పాత్ర పోషించాడు. సెమీ ఫైనల్‌తో కలిపి మొత్తంగా నాడు మూడు శతకాలు బాదాడు.ఇటీవలే గుడ్బైఅంతేకాదు.. 2022-23లో రెండోసారి సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలిచినపుడు కూడా.. జాక్సన్ 588 రన్స్ చేశాడు. సెమీస్ మ్యాచ్‌లో ఏకంగా 160 పరుగులతో చెలరేగడం విశేషం. అయితే, అతడికి ఒక్కసారి కూడా టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. ఇక పరిమిత ఓవర్ల ఆటలోనూ మెరుగైన రికార్డు కలిగి ఉన్న షెల్డన్ జాక్సన్ ఇటీవలే వైట్‌బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 86 మ్యాచ్‌లు ఆడిన షెల్డన్ జాక్సన్ 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది శతకాలు, 14 అర్ధ శతకాలు ఉన్నాయి.చదవండి: ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్‌లోకి! -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్
సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. షెల్డన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఇవాళ (జనవరి 3) ప్రకటించాడు. సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ అయిన జాక్సన్ మూడు ఫార్మాట్లలో (ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ,టీ20) కలిపి 11,791 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో తన చివరి మ్యాచ్ ఆడాడు. జాక్సన్ తన చివరి మ్యాచ్‌లో (పంజాబ్) 10 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 13 పరుగులు చేశాడు. జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.జాక్సన్ లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) 84 ఇన్నింగ్స్‌ల్లో 36.25 సగటున 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్‌కు టీ20 ఫార్మాట్లో కూడా మంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో జాక్సన్ 80 మ్యాచ్‌లు ఆడి 1812 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.జాక్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో జాక్సన్ ఆర్సీబీ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. జాక్సన్‌కు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం రానప్పటికీ 2017-2022 మధ్యలో కేకేఆర్‌కు తొమ్మిది మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో మహారాష్ట్రపై చేసిన సెంచరీ (136 బంతుల్లో 133 పరుగులు) జాక్సన్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. నాటి మ్యాచ్‌లో సౌరాష్ట్ర విజేతగా నిలిచి విజయ్ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది.జాక్సన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ ఇటీవలే వందో మ్యాచ్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జాక్సన్ 103 మ్యాచ్‌లు ఆడి 46.36 సగటున 7187 పరుగులు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. జాక్సన్ వికెట్‌కీపింగ్‌లో 75 క్యాచ్‌లు పట్టి, రెండు స్టంపౌట్లు చేశాడు. జాక్సన్‌కు టీమిండియాకు ఆడే అవకాశం రాలేదు. -
Ranji Trophy 2024: ఏడేళ్ల తర్వాత..!
తమిళనాడు క్రికెట్ జట్టు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. ఇవాళ (ఫిబ్రవరి 25) ముగిసిన 2024 సీజన్ మూడో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించడం ద్వారా ఈ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో విజయం సాధించి, ఈ సీజన్లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. కెప్టెన్ సాయికిషోర్ ఆల్‌రౌండ్ షోతో ఇరగదీసి (9/93, 60 పరుగులు) తమిళనాడును సెమీస్‌కు చేర్చాడు. లుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. సాయికిషోర్ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో 183 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (83) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. సాయికిషోర్ (60), ఇంద్రజిత్ (80), భూపతి కుమార్ (65) అర్దసెంచరీలతో రాణించడంతో 338 పరుగులు చేసి ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లలో చిరాగ్ జానీ 3, ఉనద్కత్, పార్థ్ భట్, డి జడేజా తలో 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమైన సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంకా దారుణమైన ప్రదర్శన చేసి 122 పరుగులకే చాపచుట్టేసింది. సాయికిషోర్ (4/27), సందీప్ వారియర్ (3/18), అజిత్ రామ్ (2/35) సౌరాష్ట్ర బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో పుజారా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సమాంతరంగా జరుగుతున్న మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో.. విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా, మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. వీటిలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే విజయపు అంచుల్లో (గెలుపుకు 75 పరుగుల దూరంలో ఉంది, చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి) నిలిచింది. మిగతా రెండు మ్యాచ్‌లు నిదానంగా సాగుతున్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసిన విదర్భ.. కర్ణాటకపై 224 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. వికెట్ నష్టానికి 21 పరుగులు చేసిన ముంబై బరోడాపై 57 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడు మ్యాచ్‌ల్లో మరో రెండు రోజుల ఆట మిగిలింది. -
పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్న పుజారా.. మరో శతకం
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో సౌరాష్ట్ర ఆటగాడు, భారత వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా పరుగుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే ఓ డబుల్ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు (8 ఇన్నింగ్స్‌ల్లో 76.86 సగటున 522 పరుగులు) చేసిన పుజారా తాజాగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో పుజారా 199 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 62వ శతకం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (33/2) బరిలోకి దిగిన పుజారా.. షెల్డన్ జాక్సన్‌తో (70 నాటౌట్) కలిసి నాలుగో వికెట్‌కు భారీ భాగస్వామ్యం (150కి పైగా) నమోదు చేశాడు. తొలి రోజు ఆటలో 80 ఓవర్ల తర్వాత సౌరాష్ట్ర స్కోర్ 224/3గా ఉంది. పుజారా, షెల్డన్ జాక్సన్ క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, మానవ్ సుతార్, అజయ్ కుక్నా తలో వికెట్ పడగొట్టారు. కాగా, పుజారా రంజీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ టీమిండియా సెలెక్టర్లకు సవాలు విసురుతున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్ట్‌లకు భారత జట్టును ఇవాళ (ఫిబ్రవరి 9) ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో పుజారా మరో శతక్కొట్టి సెలక్టర్లను ఆకర్శించాడు. ఇప్పటికే కోహ్లి సేవలు దూరం కావడంతో సెలెక్టర్లు పుజారాను తప్పక ఎంపిక చేయవచ్చు. మరోవైపు మరో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా గాయపడ్డాడని తెలుస్తుంది. ఒకవేళ కోహ్లి మిగతా సిరీస్‌కు అందుబాటులోకి వచ్చినా శ్రేయస్ స్థానంలో అయినా పుజారా జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు.. సునీల్ గవాస్కర్- 81 సచిన్ టెండూల్కర్- 81 రాహుల్ ద్రవిడ్- 68 చతేశ్వర్ పుజారా- 62 -
అరుదైన మైలురాయిని చేరుకున్న పుజారా
నయా వాల్‌గా పేరుగాంచిన టీమిండియా ప్లేయర్ చతేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, దేశవాలీ టోర్నీలు కలిసి మొత్తం 260 మ్యాచ్‌లు ఆడిన పుజారా.. 61 శతకాలు, 77 అర్ధశతకాల సాయంతో 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. పుజారాకు ముందు సునీల్ గవాస్కర్ (25834), సచిన్ టెండూల్కర్ (25396), రాహుల్ ద్రవిడ్ (23794) మాత్రమే భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 20000 పరుగుల మార్కును తాకారు. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జాక్ హాబ్స్ పేరిట ఉంది. హాబ్స్ 1905-34 మధ్యలో 61760 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసిన పుజారా రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసి వ్యక్తిగత మైలురాయిని దాటడంతో పాటు తన జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. మూడో రోజు రెండో సెషన్ సమయానికి విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్‌లో విదర్భ గెలవాలంటే ఇంకా 298 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (4/56), హర్ష్ దూబే (2/15), సర్వటే (2/22), ఆధిత్య థాక్రే (1/51), యశ్ ఠాకూర్ (1/57) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్విక్ దేశాయ్ (68) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విదర్భను చిరాగ్ జానీ (4/14), ఉనద్కత్ (2/46), ప్రేరక్ మన్కడ్ (2/5), ఆదిత్య జడేజా (1/12) చావుదెబ్బ కొట్టారు. వీరి ధాటికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. పుజారాతో పాటు కెవిన్ జివ్‌రజనీ (57), విశ్వరాజ్ జడేజా (79) రాణించడంతో 244 పరుగులు చేసి ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్, ఆదిత్య తారే చెరో 3 వికెట్లు, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే తలో 2 వికెట్లు తీశారు. 373 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి విదర్భ మూడో రోజు రెండో సెషన్ సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో 75 పరుగులు మాత్రమే చేసి సగం వికెట్లు కోల్పోయింది. అథర్వ తైడే (42), హర్ష్ దూబే (0) క్రీజ్‌లో ఉన్నారు. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్ తలో 2 వికెట్లు, ఉనద్కత్ ఓ వికెట్ పడగొట్టారు. -
అతడి ఖేల్ ఖతం?!.. టీమిండియా సెలక్టర్లు ఏమైనా అనుకోని...
Cheteshwar Pujara Gets Huge Praise: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారాపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఓ స్పూర్తిదాయ పాఠంగా నిలుస్తుందని కైఫ్ పేర్కొన్నాడు. కాగా టెస్టు స్పెష్టలిస్టు పుజారా టీమిండియా ‘నయా వాల్’గా ప్రఖ్యాతి గాంచాడు. స్వదేశీ, విదేశీ గడ్డలపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో అతడిది కీలక పాత్ర. శరీరానికి గాయం చేసే డెలివరీలతో బౌలర్లు ఇబ్బంది పెడుతున్నా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో నిలబడి జట్టుకు ప్రయోజనం చేకూర్చగల అంకితభావం అతడి సొంతం. ఇక తన కెరీర్లో వందకు పైగా టెస్టులాడిన పుజారా 7195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే, ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో వైఫల్యం తర్వాత అతడికి టీమిండియాలో చోటు కరువైంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే ఈ వెటరన్ పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో ఈ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజేయ డబుల్ సెంచరీతో తాను ఫామ్‌లోకి వచ్చానని చాటుకున్నాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 17వ డబుల్ సెంచరీతో రికార్డులు సృష్టించాడు. డబుల్ సెంచరీల వీరుడు.. అరుదైన రికార్డులు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో పుజారా ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా; 37), వ్యాలీ హామండ్ (ఇంగ్లండ్; 36), ప్యాట్సీ హెండ్రన్ (ఇంగ్లండ్; 22) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ (ఇంగ్లండ్; 17), మార్క్ రాంప్రకాశ్ (ఇంగ్లండ్; 17)లతో కలిసి పుజారా (17) ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా పుజారా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో తొమ్మిది డబుల్ సెంచరీలతో పారస్ డోగ్రా (హిమాచల్‌ప్రదేశ్) అగ్రస్థానంలో ఉండగా... అజయ్ శర్మ (ఢిల్లీ–7) మూడో స్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో పుజారా అద్భుత ప్రదర్శనపై స్పందిస్తూ మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఎక్స్ వేదికగా అతడిని ప్రశంసించాడు. పరుగుల వరద పారించడమే పని ‘‘జాతీయ జట్టు సెలక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరం. కేవలం పరుగుల వరద పారించడం మాత్రమే అతడికి తెలుసు. క్రికెట్ పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు కచ్చితంగా ఓ పాఠంగా నిలుస్తుంది’’ అని పుజారాను ఉద్దేశించి కైఫ్ పేర్కొన్నాడు. Regardless of what the national selectors think of him, Pujara keeps scoring runs. His commitment should be a lesson for all youngsters playing the game. #pujara pic.twitter.com/Py3cFlJJs5 — Mohammad Kaif (@MohammadKaif) January 8, 2024 కాగా జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ ఆడనునున్న నేపథ్యంలో ఛతేశ్వర్ పుజారాకు సెలక్టర్లు పిలుపునిస్తారా? లేదంటే మళ్లీ పక్కనే పెడతారా అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చదవండి: Ind Vs Afg: అఫ్గన్‌తో టీమిండియా సిరీస్: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
శతక్కొట్టిన పుజారా.. టీమిండియా సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్
Ranji Trophy 2023-24- Saurashtra vs Jharkhand: టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌ను సెంచరీతో ఆరంభించాడు. జార్ఖండ్‌తో శనివారం నాటి ఆటలో ఈ సౌరాష్ట్ర బ్యాటర్ శతక్కొట్టాడు. తద్వారా ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్ జట్టు ప్రకటనకు ముందు తానూ రేసులోనే ఉన్నానంటూ బీసీసీఐ సెలక్టర్లకు గట్టి సందేశం ఇచ్చాడు. కాగా దేశవాళీ క్రికెట్లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లోనూ సెంచరీలు బాదుతూ ఎప్పటికప్పుడు తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత నో ఛాన్స్ ఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న పుజారా.. ఆ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తుదిపోరులో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడి డబ్ల్యూటీసీ టైటిల్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. పుజారా టీమిండియా తరఫున ఆడిన ఆఖరి టెస్టు ఇదే. ఆ తర్వాత సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టులకూ ఎంపిక చేయలేదు. మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టి ఈ క్రమంలో మళ్లీ దేశవాళీ క్రికెట్‌పై దృష్టిపెట్టిన పుజారా.. తాజాగా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు. రాజ్‌కోట్ వేదికగా జార్ఖండ్‌తో శుక్రవారం మొదలైన ఐదు రోజుల మ్యాచ్‌లో భాగంగా శనివారం సెంచరీతో మెరిశాడు. వికెట్ పడకుండా.. ఆచితూచి ఆడుతున్న ఈ ‘నయా వాల్’ తన శతకాన్ని ద్విశతకంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. పుజారా 157 నాటౌట్ జార్ఖండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బౌలింగ్ చేసింది. పేసర్ చిరాగ్ జాని ఐదు వికెట్లతో చెలరేగడంతో జార్ఖండ్‌ను 142 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్ హర్విక్ దేశాయ్ 85 పరుగులు సాధించి శుభారంభం అందించాడు. వన్‌డౌన్ బ్యాటర్ షెల్డన్ జాక్సర్ అర్ధ శతకం(54)తో రాణించగా.. అర్పిత్ వసవాడ కూడా హాఫ్ సెంచరీ(68) చేశాడు. ఇక పుజారా 239 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 157 పరుగులతో క్రీజులో ఉండగా.. అతడికి తోడుగా ప్రేరక్ మన్కడ్ 23 పరుగులతో అజేయంగా ఉన్నాడు. పటిష్ట స్థితిలో ఉనాద్కట్ బృందం ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి సౌరాష్ట్ర 119 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 406 పరుగుల భారీ స్కోరు సాధించింది. పుజారా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా జార్ఖండ్ మీద ఆధిపత్యం కొనసాగిస్తోంది. కాగా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు టీమిండియా పేసర్ జయదేవ్ ఉనాద్కట్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే -
ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా.. ప్రత్యర్ధి 99 పరుగులకు ఆలౌట్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో సౌరాష్ట్ర బౌలర్ ధరేంద్రసిన్హ్ జడేజా ఐదు వికెట్ల ఘనతతో చెలరేగాడు. ఒడిశాతో ఇవాళ (నవంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో 5.1 ఓవర్లలో 16 పరుగులిచ్చి ఈ ఫీట్‌ను సాధించాడు. జడేజా ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా 29.1 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర బౌలర్లలో జడేజాతో పాటు అంకుర్ పన్వార్ (7-1-28-2), ప్రేరక్ మన్కడ్ (5-1-13-2), కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్ (5-0-11-1) కూడా రాణించారు. ఒడిశా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సందీప్ పట్నాయక్ (42), వన్‌డౌన్ బ్యాటర్ సుభ్రాన్షు సేనాపతి (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (11), షెల్డన్ జాక్సన్ (4), జయ్ గోహిల్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. చతేశ్వర్ పుజారా (2), విశ్వరాజ్ జడేజా (13) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా దేశవాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకే ఆడతాడన్న విషయం తెలిసిందే. -
SMAT 2023: మూడో పరాజయం.. క్వార్టర్ ఫైనల్ అవకాశాలు లేనట్లే!
SMAT- 2023- Andhra vs Saurashtra- రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు మూడో పరాజయం చవిచూసింది. సౌరాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. షేక్ రషీద్ (39 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లు జైదేవ్ ఉనాద్కట్ (2/35), చిరాగ్ జానీ (2/35), ధర్మేంద్ర సింగ్ జడేజా (3/14) ఆంధ్ర జట్టును కట్టడి చేశారు. క్వార్టర్ అవకాశాలు గల్లంతు అనంతరం సౌరాష్ట్ర జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. హార్విక్ దేశాయ్ (51 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), తరుణ్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రైల్వేస్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలిచినా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం లేదు. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్‌కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
Irani Trophy 2023: సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్
ఇరానీ ట్రోఫీ 2023లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు స్వల్ప ఆధిక్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్‌కు 96 పరుగులు వెనుకపడి ఉంది. ఐదేసిన పార్థ్ భట్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్ పార్థ్ భట్ 5 వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియాను దెబ్బకొట్టాడు. ధరేంద్ర జడేజా (3/20), యువరాజ్ సింగ్ దోడియా (2/74) తలో చేయి వేశారు. సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్రను విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (3/64) దెబ్బకొట్టారు. వీరిద్దరికి షమ్స్ ములానీ (2/46), పుల్కిత్ నారంగ్ (1/56) తోడవ్వడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. హార్విక్ దేశాయి (0), చిరాగ్ జానీ (2), షెల్డన్ జాక్సన్ (13), జడేజా (11) విఫలం కాగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో అర్పిత్ వసవద (54) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. జడదేవ్ ఉనద్కత్ (17), దోడియా (0) క్రీజ్‌లో ఉన్నారు. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీసిన జయదేవ్ ఉనద్కత్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా బౌలర్, భారత దేశవాలీ స్టార్ జయదేవ్ ఉనద్కత్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో తన రెండో మ్యాచ్‌లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 2-2023 సెకెండ్ లెగ్‌లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్ ప్రదర్శన కారణంగా ససెక్స్ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. హడ్సన్ ప్రెంటిస్ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ కోల్స్ (44), టామ్ హెయిన్స్ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో శాలిస్బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్ కర్రీ, టామ్ స్క్రీవెన్ తలో 2 వికెట్లు, రైట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. "He's bowled him! He's bowled him! Unadkat takes the final wicket and Sussex have won!" 😁 The highlights from a thrilling final day against Leicestershire. 🙌 #GOSBTS pic.twitter.com/KSmW7qFySu — Sussex Cricket (@SussexCCC) September 14, 2023 అనంతరం బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (3/23), కార్వెలాస్ (4/14), హడ్సన్ (2/30), హెయిన్స్ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్ (48) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ససెక్స్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టామ్ క్లార్క్ (69), జేమ్స్ కోల్స్ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో స్క్రీవెన్ 4, రెహాన్ అహ్మద్ 2, రైట్, స్కాట్ కర్రీ తలో వికెట్ దక్కించుకున్నారు. 499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్.. ఉనద్కత్ (6/94), కార్వెలాస్ (2/58), జాక్ కార్సన్ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ జట్టుకు టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్‌తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్‌లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్‌కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్‌లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్‌ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్‌కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్‌కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్‌గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్‌లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్‌లో. మరోవైపు ఇంగ్లండ్‌లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్‌ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్‌తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్‌షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
Saurashtra Tamil Sangamam: అడ్డంకులున్నా ముందడుగే..
సోమనాథ్: మన దేశం వైవిధ్యానికి మారుపేరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విశ్వాసం నుంచి ఆధ్యాత్మిక దాకా.. అన్ని చోట్లా వైవిధ్యం ఉందని తెలిపారు. దేశంలో వేర్వేరు భాషలు, యాసలు, కళలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వైవిధ్యం మనల్ని విడదీయడం లేదని, మన మధ్య అనుబంధాన్ని, సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ‘సౌరాష్ట్ర–తమిళ సంగమం’ వేడుక ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏదైనా కొత్త విజయం సాధించే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయని ఉద్ఘాటించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలన్నదే మన ఆశయమని వివరించారు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, మనల్ని అటంకపరిచే శక్తులకు కొదవలేదని చెప్పారు. అయినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయినా దేశంలో ఇంకా బానిస మనస్తత్వం ఇంకా కొనసాగుతుండడం ఒక సవాలేనని అన్నారు. బానిస మనస్తత్వం నుంచి మనకి మనమే విముక్తి పొందాలని, అప్పుడు మనల్ని మనం చక్కగా అర్థం చేసుకోగలమని, మన ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగమని ఉద్బోధించారు. అన్ని అడ్డంకులను అధిగమించి, మనమంతా కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. ఆరోగ్య సమస్యలను సరిహద్దులు ఆపలేవు న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంలో మన ముందున్న సవాళ్లను దీటుగా ఎదిరించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని మ్రోదీ పిలుపునిచ్చారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్–అడ్వాంటేజ్ హెల్త్‌కేర్ ఇండియా 2023’ సదస్సులో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో సమీకృత కృషిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. మెరుగైన, చౌకైన వైద్య సేవలు అందరికీ అందాలన్నారు. -
టీమిండియాలో గుజరాతీ క్రికెటర్ల హవా.. ఒకప్పటి కర్ణాటకలా..!
క్రికెట్ తొలినాళ్లలో భారత జట్టు మహారాష్ట్ర క్రికెటర్లతో, ప్రత్యేకించి ముంబై క్రికెటర్లతో నిండి ఉండేదన్నది జగమెరిగిన సత్యం. రుస్తొంజీ జంషెడ్జీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, గులాబ్రాయ్ రాంచంద్, ఏక్నాథ్ సోల్కర్, బాపు నాదకర్ణి, ఫరూక్ ఇంజనీర్, దిలీప్ సర్దేశాయ్, పోలీ ఉమ్రిగర్.. ఆతర్వాత 70,80 దశకాల్లో అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, బల్విందర్ సంధూ, రవిశాస్త్రి.. 90వ దశకంలో సంజయ్ మంజ్రేకర్, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ.. 2000 సంవత్సరానికి ముందు ఆతర్వాత జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, వసీం జాఫర్, రోహిత్ శర్మ, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్.. ఇలా దశకానికి కొందరు చొప్పున టీమిండియా తరఫున మెరుపులు మెరిపించారు. వీరిలో గవాస్కర్, సచిన్, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లు విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని దిగ్గజ హోదా పొందారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. భారత క్రికెట్‌కు మహారాష్ట్ర కాంట్రిబ్యూషన్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. క్రికెట్ తొలినాళ్లలో భారత జట్టులో సగం ఉన్న మహా క్రికెటర్ల సంఖ్య రానురాను ఒకటి, రెండుకు పరిమితమైంది. మహారాష్ట్ర తర్వాత టీమిండియాకు అత్యధిక మంది క్రికెటర్లను అందించిన ఘనత ఢిల్లీకి దక్కుతుంది. దేశ రాజధాని ప్రాంతం నుంచి మోహిందర్ అమర్నాథ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి లాంటి ప్లేయర్లు టీమిండియా తరఫున మెరిశారు. వీరిలో కోహ్లి విశ్వవ్యాప్తంగా పాపులారిటీ పొంది క్రికెట్ దిగ్గజంగా కొనసాగుతున్నాడు. మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత టీమిండియాకు అత్యధిక మంది స్టార్ క్రికెటర్లను అందించిన రాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు పొందింది. 90వ దశకంలో ప్రత్యేకించి 1996వ సంవత్సరంలో టీమిండియాలో కర్ణాటక ప్లేయర్ల హవా కొనసాగింది. ఆ ఏడాది ఒకానొక సందర్భంలో ఏడుగురు కర్ణాటక ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, సునీల్ జోషి, దొడ్డ గణేష్, డేవిడ్ జాన్సన్ టీమిండియాకు ఒకే మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించారు. 1996-2004, 2005 వరకు టీమిండియాలో కర్ణాటక ఆటగాళ్ల డామినేషన్ కొనసాగింది. ప్రస్తుతం అదే హవాను గుజరాత్ ఆటగాళ్లు కొనసాగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో కర్ణాటక ఆటగాళ్లు సగానికిపై టీమిండియాను ఆక్రమిస్తే.. ఇంచుమించు అదే రేంజ్లో ప్రస్తుతం గుజరాతీ ఆటగాళ్ల డామినేషన్ నడుస్తోంది. ప్రస్తుత భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్.. టెస్ట్ స్టార్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా, ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్న టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, లిమిటెడ్ ఓవర్స్ స్పెషలిస్ట్ బౌలర్ హర్షల్ పటేల్, లేటు వయసులో సంచలన ప్రదర్శనలతో టీమిండియా తలుపు తట్టిన వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ గుజరాత్ ప్రాంతవాసులే. వీరిలో కొందరు దేశావాలీ టోర్నీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆ ప్రాంతం గుజరాత్ కిందకే వస్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 కోసం, ఆతర్వాత ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం తాజాగా ఎంపిక చేసిన భారత జట్టును ఓసారి పరిశీలిస్తే.. టెస్ట్ జట్టులో నలుగురు (పుజారా, జడేజా, అక్షర్, ఉనద్కత్), వన్డే జట్టులో నలుగురు (హార్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్, ఉనద్కత్) గుజరాతీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో హార్ధిక్ టీమిండియా వైస్ కెప్టెన్ కాగా.. మిగతా ముగ్గురు స్టార్ క్రికెటర్ల హోదా కలిగి ఉన్నారు. -
బీసీసీఐని ఒప్పించాడు.. సౌ'స్వ'రాష్ట్రను గెలిపించాడు
టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు అవతరించింది. గత 3 సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండోసారి. 2019-20 సీజన్లో సైతం ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఓవరాల్‌గా నాలుగోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సౌరాష్ట్ర తొలిసారి 1935-37 సీజన్లో.. ఆతర్వాత 1943-44 సీజన్లో రంజీ టైటిల్‌ను సాధించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్‌తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో తొలి రెండు టెస్ట్‌ల కోసం ఎంపిక చేసిన టీమిండియాలో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కత్‌కు చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా రెండు మ్యాచ్‌ల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ మధ్యలో తన సొంత జట్టు సౌరాష్ట్ర రంజీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మూడో థాట్ పెట్టుకోని ఉనద్కత్.. తనను టీమిండియా నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బీసీసీఐ పెద్దలను అభ్యర్ధించాడు. తనను రిలీవ్ చేస్తే, తన సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్‌లో పాల్గొంటానని కోరాడు. ఉనద్కత్ విన్నపాన్ని మన్నించిన బీసీసీఐ.. అతను కోరిన విధంగానే టీమిండియా నుంచి రిలీవ్ చేసింది. దీంతో సౌరాష్ట్ర తరఫున ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు మ్యాచ్‌కు వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో రెక్కలు కట్టుకుని వాలిపోయాడు ఉనద్కత్. తన సారధ్యంలో సౌరాష్ట్రను రెండోసారి ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంగా బరిలోకి దిగిన అతను.. అనుకున్న విధంగానే అన్నీ తానై సౌరాష్ట్రను గెలిపించుకున్నాడు. ఫైనల్లో ఏకంగా 9 వికెట్లు (3/44, 6/85) పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సైతం గెలిచాడు. ఉనద్కత్‌కు తన జట్టును గెలిపించుకోవాలన్న తపన, ఆకాంక్షను చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం రాకపోతేనేం, తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిన జట్టుకు ఆడాలన్న అతని కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. ఈ సీజన్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఉనద్కత్.. 13.88 సగటున 26 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ స్కోర్ వివరాలు.. బెంగాల్: 174 & 241 సౌరాష్ట్ర: 404 & 14/1 9 వికెట్ తేడాతో సౌరాష్ట్ర విజయం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: జయదేవ్ ఉనద్కత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: అర్పిత్ వసవద (ఉనద్కత్ గైర్హాజరీలో సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఈ సీజన్లో రెండో లీడింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, 10 మ్యాచ్‌ల్లో 75.58 సగటున 3 సెంచరీల సాయంతో 907 పరుగులు చేశాడు, ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా మయాంక్ అగర్వాల్ నిలిచాడు, మయాంక్ 9 మ్యాచ్‌ల్లో 82.50 సగటున 3 సెంచరీల సాయంతో 990 పరుగులు చేశాడు) -
ఉనద్కత్ ఉగ్రరూపం.. రంజీ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఛాంపియన్‌గా సౌరాష్ట్ర అవతరించింది. గత మూడో సీజన్లలో ఈ జట్టు ఛాంపియన్‌గా నిలవడం ఇది రెండో సారి. 2019-20 సీజన్లో సైతం జయదేవ్ ఉనద్కత్ సారధ్యంలో సౌరాష్ట్ర దేశవాలీ ఛాంపియన్‌గా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గత నాలుగు రోజులుగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర.. లోకల్ టీమ్ బెంగాల్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆఖరి రోజు (ఫిబ్రవరి 19) లోకల్ హీరో, బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (68) జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. That Winning Feeling 🏆 😊 Congratulations to the @JUnadkat-led Saurashtra on their #RanjiTrophy title triumph 🙌 🙌 #BENvSAU | #Final | @saucricket | @mastercardindia Scorecard 👉 https://t.co/hwbkaDeBSj pic.twitter.com/m2PQKqsPOG — BCCI Domestic (@BCCIdomestic) February 19, 2023 ఉనద్కత్ ఉగ్రరూపం దాల్చడంతో బెంగాల్ టీమ్ చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరింతగా రెచ్చిపోయి ఏకంగా 6 వికెట్లు పడగొట్టి, ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌కు జతగా చేతన్ సకారియా (3/76) కూడా రాణించడంతో సౌరాష్ట్ర.. బెంగాల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర.. కేవలం 2.4 ఓవర్లలో జై గోహిల్ (0) వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జై వికెట్‌ను ఆకాశ్‌దీప్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర.. తొలుత బెంగాల్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఉనద్కత్ (3/44), చేతన్ సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), డి జడేజా (2/19) చెలరేగడంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ ఆహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వసవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీలతో రాణించడంతో 404 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ తలో 3 వికెట్లు పడగొట్టారు. 230 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 241 పరుగులకే ఆలౌటైంది. మజుందార్ (61), మనోజ్ తివారి (68) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఉనద్కత్ (6/85), సకారియా (3/76) బెంగాల్ పతనాన్ని శాశించారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సౌరాష్ట్ర.. వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. -
రంజీ ఫైనల్.. బెంగాల్‌ను ఆదుకునే ప్రయత్నం చేస్తున్న మంత్రి
బెంగాల్-సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ-2023 ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 61 పరుగులు వెనుకపడి ఉంది. బెంగాల్ కెప్టెన్, ఆ రాష్ట్ర క్రీడా మంత్రి మనోజ్ తివారి (57) షాబాజ్ అహ్మద్ (13) సాయంతో జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. అనుస్తుప్ మజుందార్ (61) హాఫ్‌సెంచరీతో రాణించగా.. సుమంత గుప్తా (1), అభిమన్యు ఈశ్వరన్ (16), సుదీప్ కుమార్ గరామీ (14) నిరాశపరిచారు. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కత్ (2/47), చేతన్ సకారియా (2/50) నిప్పులు చెరుగుతున్నారు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌటైంది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), వనవద (81), చిరాగ్ జానీ (60) అర్ధసెంచరీతో రాణించారు. బెంగాల్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4, ఆకాశ్‌దీప్, ఇషాన్ పోరెల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. దీనికి ముందు బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే చాపచుట్టేసింది. ఉనద్కత్ (3/44), సకారియా (3/33), చిరాగ్ జానీ (2/33), జడేజా (2/19) చెలరేగారు. షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరెల్ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో బెంగాల్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. -
సమిష్టిగా చెలరేగిన సౌరాష్ట్ర బౌలర్లు.. బెంగాల్ 174 ఆలౌట్
రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర, వెస్ట్ బెంగాల్ మధ్య ప్రారంభమైన ఫైనల్ తొలిరోజే ఆసక్తికరంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ జట్టు 174 పరుగులకే ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో బెంగాల్ జట్టు తక్కువస్కోరుకే పరిమితమైంది. టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైనప్పటికి.. లోయర్ ఆర్డర్లో షాబాజ్ అహ్మద్ 69, అభిషేక్ పొరెల్ 50 పరుగులు చేయడంతో బెంగాల్ స్కోరు 170 అయినా దాటింది. ఉనాద్కట్, చేతన్ సకారియా చెరో మూడు వికెట్లు తీయగా.. చిరాగ్ జానీ, డీఏ జడేజాలు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలిరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ 38, చేతన్ సకారియా 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. -
Ranji Trophy: ఫైనల్ కు వేళాయె.. బెంగాల్‌తో సౌరాష్ట్ర ఢీ
భారత దేశవాళీ క్రికెట్ ప్రతిష్టాత్మక టోర్నీ ‘రంజీ ట్రోఫీ’ టైటిల్ కోసం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బెంగాల్, సౌరాష్ట్ర జట్లు నేటి నుంచి అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఉదయం గం. 9:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 1990లో చివరిసారి బెంగాల్ జట్టు రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత నాలుగుసార్లు ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత పదేళ్లలో ఐదోసారి ఈ మెగా టోర్నీ ఫైనల్ ఆడుతున్న సౌరాష్ట్ర 2020లో బెంగాల్‌ను ఓడించి తొలిసారి విజేత అయింది. చదవండి: IND vs AUS: ‘టెస్టు క్రికెట్ పూజారి’..చరిత్ర సృష్టించనున్న 'నయా వాల్' -
రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్
బెంగళూరు: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో మాజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. బెంగళూరులో ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును... ఇండోర్‌లో జరిగిన మరో సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌పై గెలుపొందాయి. ఈనెల 16 నుంచి కోల్‌కతాలో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ తలపడతాయి. ఆట చివరిరోజు ఓవర్‌నైట్ స్కోరు 123/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక 234 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సౌరాష్ట్ర 115 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు బెంగాల్ నిర్దేశించిన 548 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 241 పరుగులకు ఆలౌటైంది. -
పాపం మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ చేసినా గెలిపించలేకపోయాడు
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ మధ్యప్రదేశ్‌కు షాకిచ్చి బెంగాల్ తుది పోరుకు అర్హత సాధించగా.. రెండో సెమీస్‌లో కర్ణాటకను ఖంగుతినిపించి సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో బెంగాల్ 306 పరుగుల తేడాతో భారీ విజయం సాధించగా.. కర్ణాటకతో జరిగిన ఉత్కంఠ పోరులో సౌరాష్ట్ర 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ద్విశతకం (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) సాధించినప్పటికీ మయాంక్ అగర్వాల్ కర్ణాటకను గెలిపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (202), రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత కీలక పరుగులు (47 నాటౌట్) చేసిన అర్పిత్ వసవద సౌరాష్ట్రను గెలిపించాడు. 117 పరుగుల లక్ష్య ఛేదనలో 42 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన సౌరాష్ట్రను వసవద.. చేతన్ సకారియా (24) సహకారంతో విజయతీరాలకు చేర్చాడు. సౌరాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్ స్కోర్ వివరాలు.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 407 ఆలౌట్ (మయాంక్ 249, శ్రీనివాస్ శరత్ 66, చేతన్ సకారియా 3/73) సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 527 ఆలౌట్ (అర్పిత్ వసవద 202, షెల్డన్ జాక్సన్ 160, విధ్వత్ కావేరప్పా 5/83) కర్ణాటక సెకెండ్ ఇన్నింగ్స్: 234 ఆలౌట్ (నికిన్ జోస్ 109, మయాంక్ 55, చేతన్ సకారియా 4/45) సౌరాష్ట్ర సెకెండ్ ఇన్నింగ్స్: 117/6 (వసవద 47 నాటౌట్, కృష్ణప్ప గౌతమ్ 3/38, వాసుకి కౌశిక్ 3/32) -
సూపర్ ఫామ్‌లో మయాంక్ అగర్వాల్.. డబుల్ సెంచరీ, హాఫ్ సెంచరీ చేసినా..!
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ సెమీఫైనల్ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. సౌరాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీస్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (249), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (55) చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి కేవలం 3 పరుగుల ఆధిక్యంలో ఉంది. నికిన్ జోస్ (54) అజేయమైన హాఫ్‌సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మ్యాచ్ చివరి రోజు కర్ణాటక వేగంగా ఆడి కనీసం 250 పరుగుల టార్గెట్ సౌరాష్ట్రకు నిర్ధేశిస్తే కానీ గెలిచే అవకాశాలు లేవు. ఇలా జరగక మ్యాచ్ డ్రాగా ముగిస్తే, తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరుతుంది. మయాంక్ డబుల్ సెంచరీ, శ్రీనివాస్ శరత్ (66) హాఫ్ సెంచరీతో రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకే ఆలౌట్ కాగా.. కెప్టెన్ వసవద (202) డబుల్ హండ్రెడ్, షెల్డన్ జాక్సన్ (160) భారీ శతకంతో చెలరేగడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527 పరుగులకు ఆలౌటైంది. తొలి సెమీస్ విషయానికొస్తే.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బెంగాల్ పూర్తి ఆధిక్యం సంపాదించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 547 పరుగుల లీడ్‌లో కొనసాగుతోంది. బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 279/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 438 పరుగులకు ఆలౌట్ కాగా.. మధ్యప్రదేశ్ 170 పరుగులకే చేతులెత్తేసింది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో సుదీప్ ఘర్మానీ (112), మజుందార్ (120) సెంచరీలతో చెలరేగగా.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్‌లో సరాన్ష్ జైన్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా బెంగాల్ ఫైనల్‌కు చేరుతుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన మయాంక్ అగర్వాల్
టీమిండియాకు దూరమైన మయాంక్ అగర్వాల్ రంజీ క్రికెట్లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న సెమీఫైనల్లో ఈ కర్ణాటక కెప్టెన్ గురువారం డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 626 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మయాంక్ 429 బంతులెదుర్కొని 249 పరుగులు చేశాడు. మయాంక్ ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ కాగా అందులో మయాంక్వే 249 పరుగులు ఉండడం విశేషం. ఒక రకంగా అతనిది వన్‌మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇక శ్రీనివాస్ శరత్ 66 పరుగులతో సహకరించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా, కె పటేల్‌లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. బెంగాల్ వర్సెస్ మధ్యప్రదేశ్, రంజీ రెండో సెమీఫైనల్ బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. అనుస్తుప్ మజుందార్ (120 పరుగులు), సుదీప్ గరామీ(112 పరుగులు) శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 51 పరుగులు చేశాడు. అనంతరం మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేసింది. Mayank Agarwal's celebration when he completed his double hundred in Ranji trophy semi-final. pic.twitter.com/ckG0ez5ebh — CricketMAN2 (@ImTanujSingh) February 9, 2023 చదవండి: Ravindra Jadeja: పాంచ్ పటాకా.. ఆటతో పాటు తీరు కూడా కొత్తగా -
అజేయ సెంచరీతో కదం తొక్కిన మయాంక్ అగర్వాల్
Mayank Agarwal: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్రతో ఇవాళ (ఫిబ్రవరి 8) మొదలైన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. మయాంక్‌తో పాటు వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ (58) అజేయ అర్ధసెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కుశాంగ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా.. చేతన్ సకారియా, ప్రేరక్ మన్కడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిప శ్రేయస్ గోపాల్ (15) రనౌటయ్యాడు. సెంచరీతో ఆదుకున్న మయాంక్.. ఈ మ్యాచ్‌లో మయాంక్ చేసిన సెంచరీ చాలా కీలకమైంది. 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా మయాంక్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీనివాస్ శరత్‌తో కలిసి మయాంక్ ఆరో వికెట్‌కు అజేయమైన 117 పరుగులు సమకూర్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 246 బంతులు ఆడిన మయాంక్ 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 110 పరుగులు చేశాడు. సెంచరీ చేసేందుకు మయాంక్ ఇన్ని బంతులు ఆడటం బహుశా ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు. మరోవైపు ఇవాలే మొదలైన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్, బెంగాల్ జట్లు తలపడ్డాయి. తొలి రోజు ఆటలో బెంగాల్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్.. సుదీప్ కుమార్ ఘరామీ (112), అనుస్తుప్ మజుందార్ (120) శతకాలతో విరుచుకుపడటంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (27), కరణ్ లాల్ (23)లకు మంచి శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మనోజ్ తివారి (5), షాబజ్ అహ్మద్ (6) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, గౌరవ్ యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. -
Ranji Trophy: పంజాబ్‌ను చిత్తు చేసి.. సెమీస్‌కు దూసుకెళ్లిన సౌరాష్ట్ర
Ranji Trophy 2022-23 - Saurashtra vs Punjab: రంజీ ట్రోఫీ 2022-2023 సీజన్లో ఆఖరి సెమీ ఫైనలిస్టు ఖరారైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ , బెంగాల్, కర్ణాటక సెమీస్ బెర్తు ఖరారు చేసుకోగా.. తాజాగా సౌరాష్ట్ర ఫైనల్ ఫోర్ జాబితాలో చేరింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్-2లో పంజాబ్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. పార్థ్ భట్ అద్భుత ఇన్నింగ్స్ సొంత మైదానం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్‌తో తలపడింది అర్పిత్ వసవాడ సేన. జనవరి 31న మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్నెల్ పటేల్ 70 పరుగులతో రాణించగా.. పార్థ్ భట్ 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేసినా ఒంటరి పోరాటం చేశాడు. దీంతో 303 పరుగుల వద్ద సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ముగిసింది. పంజాబ్ బౌలర్లలో మార్కండే నాలుగు, బల్జీత్ సింగ్ 3, సిద్దార్థ్ కౌల్ 2, నామన్ ధిర్ ఒక వికెట్ పడగొట్టారు. అదరగొట్టారు.. అయినా ఇక పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్(126), నామన్ ధిర్(131) అదిరిపోయే ఆరంభం అందించారు. నాలుగో స్థానంలో వచ్చిన మన్దీప్ (91) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ అన్మోల్ మల్హోత్రా 41 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 431 పరుగులకు ఆలౌట్ అయిన పంజాబ్.. సౌరాష్ట్రపై తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగుల పైచిలుకు ఆధిక్యం సాధించగలిగింది. 5 వికెట్లతో చెలరేగిన పార్థ్ భట్ ఈ క్రమంలో సౌరాష్ట్ర 379 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించింది. దీంతో పంజాబ్‌ను కట్టడి చేయాలని భావించిన సౌరాష్ట్రకు బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్థ్ భట్ ఊతంగా నిలిచాడు. ఏకంగా 5 వికెట్లతో(33 ఓవర్లలో 89 పరుగులు) చెలరేగి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ధర్మేంద్ర జడేజా మూడు, యువరాజ్‌సిన్హ్ దోడియా రెండు వికెట్లతో రాణించారు. కర్ణాటకతో అమీతుమీ సౌరాష్ట్ర బౌలర్ల విజృంభణతో పంజాబ్ రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం 71 పరుగుల తేడాతో విజయఢంకా మోగించిన సౌరాష్ట్ర.. సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ చేరే క్రమంలో కర్ణాటకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటి సౌరాష్ట్రను గెలిచిన పార్థ్ భట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-2 సౌరాష్ట్ర వర్సెస్ పంజాబ్ స్కోర్లు సౌరాష్ట్ర- 303 & 379 పంజాబ్- 431 & 180 చదవండి: షాహీన్‌తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్ వైరల్ Gill-Kohli: 'నీకు పదేళ్లు ఇస్తా.. సగం అయినా పట్టగలవేమో చూస్తా' -
తొమ్మిదో నంబర్లో వచ్చి సెంచరీతో ఇరగదీసిన సౌరాష్ట్ర బౌలర్
Ranji Trophy 2022-23 2nd Quarter Final: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర.. తొమ్మిదో నంబర్ ఆటగాడు, బౌలింగ్ ఆల్‌రౌండర్ పార్థ్ భట్ (111 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయమైన శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (70) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం మూకుమ్మడిగా విఫలమైంది. రవీంద్ర జడేజా గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్రకు అర్పిత్ వసవద సారధ్యం వహిస్తున్నాడు. పంజాబ్ బౌలర్లలో మార్కండే 4, బల్తేజ్ సింగ్ 2, సిద్ధార్థ్ కౌల్ 2, నమన్ ధిర్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (3), నమన్ ధిర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రికీ భుయ్ సూపర్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆంధ్ర.. ఇండోర్ వేదికగా మధ్యప్రదేశ్‌తో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ పటిష్ట స్థితికి చేరుకుంది. ప్రస్తుత సీజన్లో వరస విజయాలు నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన ఆంధ్ర టీమ్.. కీలకమైన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చి జోరును కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు.. రికీ భుయ్ (115 నాటౌట్) సూపర్ సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రికీ భుయ్‌కి జతగా కరణ్ షిండే (83 నాటౌట్) రాణించాడు. ఓపెనర్లు జ్ఞానేశ్వర్ (24), అభిషేక్ రెడ్డి (22) తమతమ ఇన్నింగ్స్‌లకు లభించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హనుమ విహారి (16) రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన రెండు వికెట్లు గౌరవ్ యాదవ్ ఖాతాలో చేరాయి. రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. 173 పరుగులకే చాపచుట్టేసిన జార్ఖండ్.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళే (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. రెచ్చిపోయిన కర్ణాటక బౌలర్లు.. రాణించిన మయాంక్ అగర్వాల్.. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. -
జడేజా రాణించినా.. జట్టు మాత్రం ఓటమి
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోపీ ద్వారా సూపర్ రీఎంట్రీ ఇచ్చినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో జడేజా ఏడు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లు తీసి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. అయితే బౌలింగ్‌లో మెరిసిన జడేజా బ్యాటింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు జడేజా ఎంపికైన సంగతి తెలిసిందే. హార్విక్ దేశాయ్, సౌరాష్ట్ర క్రికెటర్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే 266 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర 206 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (205 బంతుల్లో 101 పరుగులు) సెంచరీ వృదాగా మారింది. చివర్లో అర్పిత్ వసవాడ(45 పరుగులు), రవీంద్ర జడేజా(25 పరుగులు) ఆశలు కలిగించినప్పటికి.. ఇద్దరు స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. అంతకముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ దాటికి 133 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు ఆలౌట్ అయింది. -
రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. 8 వికెట్లతో రెచ్చిపోయిన స్టార్ ఆల్‌రౌండర్
Ranji Trophy 2022-23: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రీ ఎంట్రీలో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడ్డూ భాయ్.. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఘనంగా పునరాగమనం చాటాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జడ్డూ.. రంజీల్లో సత్తా చాటి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. తదనుగుణంగానే సెలెక్టర్లు సైతం అతనికి రంజీల్లో ఆడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో జడేజా వచ్చీ రాగానే బంతితో తన ప్రతాపం చూపాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించిన జడ్డూ (35 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు).. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. ఏకంగా 7 వికెట్లు తీసి తమిళనాడు వెన్నువిరిచాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. జడేజాకు జతగా మరో జడేజా (ధర్మేంద్రసిన్హ్) 3 వికెట్లతో రాణించడంతో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన తమిళనాడు తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. తమిళనాడు సెకెండ్ ఇన్నంగ్స్‌లో సాయ్ సుదర్శన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌరాష్ట్ర 192 పరుగులకే చాపచుట్టేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. సౌరాష్ట్ర గెలవాలంటే ఆఖరి రోజు మరో 262 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. క్వార్టర్స్‌కు చేరాలంటే సౌరాష్ట్రకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. జడేజా బ్యాటింగ్‌లోనూ సత్తా చాటి తన జట్టును క్వార్టర్స్‌కు చేరుస్తాడేమో వేచి చూడాలి. ఏదిఏమైనా ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు జడేజా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం -
రవీంద్ర జడేజా వచ్చేశాడు.. చెన్నై మ్యాచ్‌లో కెప్టెన్‌గా..
Ranji Trophy 2022-23 - Tamil Nadu vs Saurashtra: మోకాలి గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనం చేశాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్ మ్యాచ్‌లో భాగంగా తమిళనాడుతో పోటీపడుతున్న సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా 34 ఏళ్ల జడేజా గత ఏడాది ఆగస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్ కోసం..! ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా సౌరాష్ట్ర జట్టుకు దాదాపుగా నాకౌట్ బెర్త్ ఖరారు కావడంతో చివరి మ్యాచ్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్, సీనియర్ స్టార్ చతేశ్వర్ పుజారాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో జడ్డూ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరే క్రమంలో ఆస్ట్రేలియాతో టీమిండియా స్వదేశంలో సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసీస్‌తో తొలి రెండు టెస్టుల్లో జడేజాకు చోటు ఇచ్చింది బీసీసీఐ. అయితే అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రంజీ ఆడేందుకు జడ్డూ సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మంగళవారం (జనవరి 24) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్లు: సౌరాష్ట్ర హార్విక్ దేశాయ్(వికెట్ కీపర్), చిరాగ్ జానీ, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవాడ, రవీంద్ర జడేజా(కెప్టెన్), సమర్థ్ వ్యాస్, ప్రేరక్ మన్కడ్, ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, యువరాజ్‌సిన్హ్ దోడియా, జే గోహిల్. తమిళనాడు: సాయి సుదర్శన్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, ప్రదోష్ పాల్(కెప్టెన్), విజయ్ శంకర్, షారుక్ ఖాన్, ఎస్ అజిత్ రామ్, సందీప్ వారియర్, త్రిలోక్ నాగ్, మణిమారన్ సిద్ధార్థ్. చదవండి: Australian Open: సంచలనం సృష్టించిన అన్‌సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్‌తో పాటు.. Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? -
ఆరేసిన ఉనద్కత్.. హైదరాబాద్‌కు మరో ఘోర పరాభవం
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో జయదేవ్ ఉనద్కత్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది చివర్లో మొదలైన ఈ జట్టు జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2022 డిసెంబర్లో ముంబైపై 48 పరుగుల తేడాతో విజయం సాధించిన సౌరాష్ట్ర.. గత వారం ఢిల్లీని ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతో, తాజాగా హైదరాబాద్‌ను ఇన్నింగ్స్ 57 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (8/39, 70) చెలరేగిన ఉనద్కత్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్లు (3/28, 3/62) పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉనద్కత్‌కు జతగా ధరేంద్రసిన్హ్ జడేజా (3/8, 4/34, 40 పరుగులు) కూడా రాణించడంతో సౌరాష్ట్ర ప్రస్తుత రంజీ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర.. చిరాగ్ జానీ (68), హార్విక్ దేశాయ్ (81), షెల్డన్ జాక్సన్ (59) అర్ధశతకాలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 7 వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు 2, అబ్రార్ ఓ వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్ బ్యాటింగ్ తీరు రెండో ఇన్నింగ్స్‌లోనూ మారలేదు. జడేజా (4/34), ఉనద్కత్ (3/62), దోడియా (2/76), సకారియా (1/13) విజృంభించడంతో ఆ జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. సంతోష్ గౌడ్ (58) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా హైదరాబద్ సీజన్లో వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. గతేడాది డిసెంబర్లో ముంబై చేతిలో ఇన్నింగ్స్ 217 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఈ జట్టు.. ఆ తర్వాత అస్సాం చేతిలో (18 పరుగుల తేడాతో), ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ చేతిలో (154 పరుగుల తేడాతో), తాజాగా సౌరాష్ట్ర చేతిలో ఓటమిపాలైంది. -
విజృంభించిన ఉనద్కత్, జడేజా.. 79 పరుగులకే కుప్పకూలిన హైదరాబాద్
Ranji Trophy 2022-23 SAU VS HYD: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా సౌరాష్ట్ర-హైదరాబాద్ జట్ల మధ్య ఇవాళ (జనవరి 10) మొదలైన మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు రెచ్చిపోయారు. జయదేవ్ ఉనద్కత్ (3/28), డి జడేజా (3/8), యువ్‌రాజ్‌సింగ్ దోడియా (2/23), చేతన్ సకారియా (1/8) చిరాగ్ జానీ (1/7) విజృంభించడంతో హైదరాబాద్ జట్టు కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో రోహిత్ రాయుడు (23), భగత్ వర్మ (11), అనికేత్ రెడ్డి (10 నాటౌట్)లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (2), అలంక్రిత్ అగర్వాల్ (7), తొలకంటి గౌడ్ (4), చందన్ సహాని (2) భవేశ్ సేథ్ (3), టి రవితేజ (8), మెహరోత్ర శశాంక్ (5), మహ్మద్ అబ్రార్ నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. 24 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. ఓపెనర్లు చిరాగ్ జానీ (55), హార్విక్ దేశాయ్ (49) క్రీజ్‌లో ఉన్నారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో ఇంకా చతేశ్వర్ పుజారా, షెల్డన్ జాక్సన్, అర్పిత్ వసవద, ప్రేరక్ మన్కడ్, ధరేంద్రసిన్హ్ జడేజా, చేతన్ సకారియా, సమర్థ్ వ్యాస్, జయదేవ్ ఉనద్కత్, యువ్రాజ్సిన్హ్ దోడియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 214 పరుగుల తేడాతొ ఘన విజయం సాధించింది. ఉనద్కత్ (8/39, 70) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. మరోవైపు హైదరాబాద్ గత మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ చేతిలో 154 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. -
చారిత్రక బౌలింగ్ ప్రదర్శన అనంతరం బ్యాట్‌తోనూ ఇరగదీసిన ఉనద్కత్
Jaydev Unadkat: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్, భారత లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇరగదీస్తున్నాడు. తొలి ఓవర్లో హ్యాట్రిక్‌తో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టి చారిత్రక ప్రదర్శన కనబర్చిన ఉనద్కత్.. ఆతర్వాత బ్యాట్‌తోనూ విజృంభించి ఆల్‌రౌండర్‌గా, సమర్ధవంత నాయకుడిగా తన పాత్రకు న్యాయం చేశాడు. అప్పటికే (మూడో రోజు ఆటలో) హార్విక్ దేశాయ్ (107), వసవద (152 నాటౌట్) సెంచరీలతో.. చిరాగ్ జానీ (75), సమర్థ్ వ్యాస్ (54), ప్రేరక్ మన్కడ్ (64) అర్ధసెంచరీలతో అలరించగా, 8వ స్థానంలో బరిలోకి దిగిన ఉనద్కత్ తాను సైతం అంటూ 52 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తంలో 68 బంతులు ఎదుర్కొన్న ఉనద్కత్.. 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత 2 బంతులకే మరో వికెట్ పడటంతో ఉనద్కత్.. 574/8 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఫలితంగా సౌరాష్ట్రకు 441 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి కేవలం 188 పరుగులు మాత్రమే చేసి ఓటమి అంచుల్లో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో చుక్కలు చూపించిన ఉనద్కత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోవడం విశేషం. యువరాజ్‌సింగ్ దోడియ 4 వికెట్లు పడగొట్టగా.. పార్థ్ బట్, చిరాగ్ జానీ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్సలో 9వ స్థానంలో అర్ధసెంచరీతో ఢిల్లీ పరువు కాపాడిన హృతిక్ షోకీన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి ఆ జట్టు మరోసారి పేకమేడలా కూలకుండా కాపాడాడు. జాంటీ సిద్దు (17), లక్ష్యయ్ తరేజా (0) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఉనద్కత్ ధాటికి 10 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి రంజీ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ దిశగా సాగిన ఢిల్లీ జట్టు పరువును ప్రాణ్షు విజయరన్ (15), షోకీన్ (68 నాటౌట్), శివాంక్ వశిష్ట్ (38) కాపాడారు. ఈ ముగ్గురు అతి కష్టం మీద రెండంకెల స్కోర్ చేయడంతో ఢిల్లీ 133 పరుగులు చేసి ఆలౌటైంది. ఉనద్కత్ (8/39)కు జతగా చిరాగ్ జానీ (1/14), ప్రేరక్ మన్కడ్ (1/2) రాణించారు. -
జ్ఞానేశ్వర్, భరత్ అర్ధ శతకాలు.. కోలుకున్న ఆంధ్ర జట్టు.. ఇక సౌరాష్ట్ర
Ranji Trophy 2022- 23 Andhra vs Hyderabad- సాక్షి, విజయనగరం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 62 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. తద్వారా తమ ఆధిక్యాన్ని 168 పరుగులకు పెంచుకుంది. సీఆర్ జ్ఞానేశ్వర్ (96 బంతుల్లో 72; 15 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (33; 4 ఫోర్లు, 1 సిక్స్), కోన శ్రీకర్ భరత్ (52 బంతుల్లో 70 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 43 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుత ఆటతీరుతో ఆంధ్ర జట్టును నిలబెట్టారు. ఆంధ్ర కోల్పోయిన మూడు వికెట్లను హైదరాబాద్ బౌలర్ రక్షణ్ రెడ్డి పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 79/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ మరో 118 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులవద్ద ఆలౌటై 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. శశాంక్ (55 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/64), కేవీ శశికాంత్ (3/40), సుదర్శన్ (2/47) విజృంభించి హైదరాబాద్‌ను 200 స్కోరులోపు కట్టడి చేశారు. సౌరాష్ట్ర 503/6 రాజ్‌కోట్: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 370 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 184/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 503 పరుగులు సాధించింది. అర్పిత్ (127 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్), హార్విక్ దేశాయ్ (107; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తొలి రోజు జైదేవ్ ఉనాద్కట్ (8/39) ధాటికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్! అక్కడ చెరో విజయం Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్ వైరల్ -
Ranji Trophy: ఉనాద్కట్ సంచలనం.. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా
Ranji Trophy 2022-23- Saurashtra vs Delhi: భారత లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కట్ రంజీ ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో వేసిన మొదటి ఓవర్లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్. మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ధ్రువ్ షోరే, వన్‌డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యశ్ ధుల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ముగ్గురినీ డకౌట్ చేశాడు. రంజీ చరిత్రలోనే తొలిసారి కాగా రంజీ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్.. రెండో ఓవర్లోనూ విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్(0), లక్ష్యయ్ తరేజా(1)లను అవుట్ చేశాడు. అంతేకాదు.. తద్వారా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 21వ సారి.. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనాద్కట్. ఆ తర్వాత జాంటీ సిద్ధు(4)ను కూడా పెవిలియన్‌కు పంపి మొత్తంగా ఆట మొదలైన గంటలోనే ఆరు వికెట్లు(మూడు ఓవర్లలో) తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతలాకుతలం చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో జయదేవ్ ఇటీవలే భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కుదేలైన ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ రంజీ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఎలైట్ గ్రూప్- బిలో ఉన్న సౌరాష్ట్ర- ఢిల్లీ మధ్య మంగళవారం (జనవరి 3) మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ యశ్ ధుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఉనాద్కట్ దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఇందుకు తోడు, చిరాగ్ జానీ ఒక వికెట్, ప్రేరక్ మన్కడ్ ఒక వికెట్ తీశారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి ఢిల్లీ 8 వికెట్లు నష్టపోయి 108 పరుగులు చేసింది. చదవండి: Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. BCCI: బిగ్ ట్విస్ట్.. రేసు నుంచి వెంకటేశ్ ప్రసాద్ అవుట్!? చీఫ్ సెలక్టర్‌గా మళ్లీ అతడే! -
మరోసారి దుమ్మురేపిన సూర్య.. కీలక ఇన్నింగ్స్.. టెస్టులో ఎంట్రీ ఖాయం!
Suryakumar Yadav- Ranji Trophy 2022-23 - Mumbai vs Saurashtra Day 2: అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రమే లక్ష్యంగా రంజీ బరిలో దిగిన టీమిండియా బ్యాటర్ సూర్యకుమర్ యాదవ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా ముంబై తరఫున హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడాడు ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్. ఈ క్రమంలో 80 బంతుల్లోనే 15 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 90 పరుగులు(112 స్ట్రైక్‌రేటు) చేశాడు. ఇక సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ సూర్య రాణించాడు. మొత్తంగా 107 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 95 పరుగులు సాధించాడు. జట్టును ఆదుకున్న సూర్య! కాగా మంగళవారం మొదలైన టెస్టులో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. సౌరాష్ట్రను 289 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగి 230 పరుగులకు తమ తొలి ఇన్నింగ్స్ ముగించింది ముంబై. ఓపెనర్లు పృథ్వీ షా(4), యశస్వి జైశ్వాల్(2) విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చి సూర్య జట్టును ఆదుకున్నాడు. విలువైన 95 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ అజింక్య రహానే(24) నిరాశపరచగా.. సర్ఫరాజ్ ఖాన్ 75 పరుగులతో రాణించాడు. మిగిలిన వాళ్లలో ముషీర్ ఖాన్ 12 పరుగులు తప్ప మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర బ్యాటర్లకు ముంబై బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి సౌరాష్ట్ర 120 పరుగులు చేసింది. టెస్టుల్లో చోటు ఖాయమే! జనవరి 3 నుంచి శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో ఈ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్.. భారత జట్టుతో కలవనున్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ మిస్టర్ 360.. వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రంజీలోనూ తానేంటో మరోసారి నిరూపించుకున్న సూర్య.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో టెస్టుల్లోనూ ఈ ముంబై బ్యాటర్ త్వరలోనే అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యకు ఒక్క అవకాశమిస్తే కచ్చితంగా సత్తా చాటుతాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నేపథ్యంలో ఆసీస్‌తో సిరీస్ కీలకం కానున్న తరుణంలో జట్టు ఎలా ఉండబోతుందో ఇప్పుడే అంచనాకు రాలేం! ఇదిలా ఉంటే.. రంజీ ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్‌లలో మొత్తంగా 185 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండు సందర్భాల్లోనూ శతకం చేజార్చుకోవడం గమనార్హం. చదవండి: Ind Vs SL 2023: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌లు.. శ్రీలంక జట్టు ప్రకటన IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు! -
IND VS BAN 2nd Test: ఉనద్కత్ ఖాతాలో అసాధారణ రికార్డు
Jaydev Unadkat Plays Test Cricket After 12 Years: ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేస్తున్న భారత్.. ఈ మ్యాచ్ కోసం ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఉనద్కత్‌తో పాటు ఉమేశ్ యాదవ్ (3/20), రవిచంద్రన్ అశ్విన్ (2/68) రాణించడంతో బంగ్లాదేశ్ 69 ఓవర్ల తర్వాత 7 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. మొమినుల్ హాక్ (82 నాటౌట్) అజేయమైన అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతని జతగా తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నాడు. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కాగా, అనూహ్య పరిణామాల మధ్య ఈ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఓ అసాధారణ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2010లో తొలి టెస్ట్ (సౌతాఫ్రికా) ఆడిన ఉనద్కత్.. 12 ఏళ్ల తర్వాత రెండో టెస్ట్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పార్థివ్ పటేల్ పేరిట ఉండేది. పార్థివ్.. 8 ఏళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ రికార్డుతో పాటు ఉనద్కత్ ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. అత్యధిక టెస్ట్ మ్యాచ్‌ల గ్యాప్ తర్వాత టెస్ట్‌ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ఉనద్కత్ రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో గారెత్ బ్యాటీ (142 టెస్ట్‌లు, 2005-16) అగ్రస్థానంలో ఉండగా.. ఉనద్కత్ (118 టెస్ట్‌లు, 2010-22) రెండో స్థానంలో ఉన్నాడు. ఆతర్వాత మార్టిన్ బిక్నెల్ (114, 1993-2003), ఫ్లాయిడ్ రీఫర్ (109, 1999-2009), యూనిస్ అహ్మద్ (104, 1969-87), డెరెక్ షాక్లెటన్ (103, 1951-63) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో నిలిచారు. ఇదిలా ఉంటే, బంగ్లా టూర్‌కు తొలుత ఎంపికైన మహ్మద్ షమీ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శన (10 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) ఆధారంగా సెలెక్టర్లు అతనికి అవకాశం కల్పించారు. -
పాపం ఉనద్కత్.. సెలక్టర్లు కరుణించినా, అదృష్టం వెక్కిరించింది..!
Jaydev Unadkat: 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అనూహ్య పరిణామాల నడుమ భారత టెస్ట్ జట్టులో (బంగ్లాతో టెస్ట్ సిరీస్) చోటు దక్కించుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్‌ను విధి దారుణంగా వెక్కిరించింది. సెలెక్టర్లు కరుణించి టీమిండియాకు ఆడే అవకాశం కల్పించినా, ఈ సౌరాష్ట్ర బౌలర్‌తో అదృష్టం బంతాట ఆడుకుంది. ఉనద్కత్ ఎంపిక ఊహించని పరిణామాల మధ్య ఆలస్యంగా చోటు చేసుకోవడంతో వీసా సమస్యలు తలెత్తి బంగ్లాతో తొలి టెస్ట్ సమయానికి అతను భారత జట్టుతో కలవలేని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌తో రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుండగా, వీసా పేపర్లు అందని కారణంగా ఉనద్కత్ భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో 12 ఏళ్ల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడాలనుకున్న అతని కలలు కలలుగానే మిగిలిపోయాయి. బీసీసీఐ లాజిస్టిక్ విభాగం అతన్ని వీలైనంత త్వరగా బంగ్లాదేశ్‌కు పంపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. కనీసం రెండో టెస్ట్ సమయానికైనా ఉనద్కత్‌ను జట్టుతో కలిపేందుకు లాజిస్టిక్ విభాగం శతవిధాల ప్రయత్నిస్తుంది. కాగా, 2010 డిసెంబర్లో చివరిసారిగా భారత టెస్ట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 31 ఏళ్ల ఉనద్కత్.. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని సద్వినియోం చేసుకోలేక జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఉనద్కత్ పట్టువదలని విక్రమార్కుడిలా దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటి సెలెక్టర్లు తనను ఎంపిక చేసేలా చేసుకున్నాడు. అయితే చేతికందిన అదృష్టం వీసా సమస్యల కారణంగా చేజారడంతో అతను వాపోతున్నాడు. బంగ్లా పర్యటనకు ముందు షమీ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా ఉనద్కత్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. విజయ్ హజారే ట్రోఫీ-2022లో అతని అత్యద్భుతమైన ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ టీమిండియాలో స్థానం కల్పించింది. ఉనద్కత్.. టీమిండియా తరఫున ఒక టెస్ట్ మ్యాచ్, 7 వన్డేలు, 10 టీ20 ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. దేశవాళీ టోర్నీల్లో ఈ సౌరాష్ట్ర బౌలర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఉనద్కత్ ఐపీఎల్లో సైతం మెరుగ్గా రాణించాడు. వివిధ ఫ్రాంచైజీల తరఫున 91 మ్యాచ్‌ల్లో 91 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్‌లో కొనసాగుతున్నాడు. -
షెల్డన్ జాక్సన్ వీరోచిత సెంచరీ.. విజయ్ హజారే ట్రోఫీ విజేత సౌరాష్ట్ర
దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ విజేతగా సౌరాష్ట్ర నిలిచింది. శుక్రవారం మహారాష్ట్రతో జరిగిన ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. షెల్డన్ జాక్సన్(136 బంతుల్లో 133 పరుగులు నాటౌట్) చివరి వరకు నిలబడి వీరోచిత సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్విక్ దేశాయ్ 50 పరుగులు చేశాడు. ఆఖర్లో చిరాగ్ జానీ 25 బంతుల్లో 30 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సెంచరీతో జట్టును గెలిపించిన షెల్డన్ జాక్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 2002-03 సీజన్ నుంచి విజయ్ హజారే ట్రోఫీని నిర్వహిస్తుండగా 2007-08 సీజన్లో సౌరాష్ట్ర తొలిసారి ఈ ట్రోపీని గెలుచుకుంది. తర్వాత 2017-18 సీజన్ లో ఫైనల్ చేరినా తుదిపోరులో కర్నాటక చేతిలో ఓడింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన జయదేవ్ ఉనాద్కట్ సారథ్యంలోని సౌరాష్ట్ర.. అన్ని విభాగాల్లో రాణించి లక్ష్యాన్ని అందుకుంది. ఈ ట్రోఫీని గతంలో తమిళనాడు 5 సార్లు గెలుచుకోగా .. ముంబై నాలుగు సార్లు నెగ్గింది. WHAT. A. WIN! 🙌 🙌 Those celebrations! 👏 👏 The @JUnadkat-led Saurashtra beat the spirited Maharashtra side to bag the #VijayHazareTrophy title 🏆 Scorecard 👉 https://t.co/CGhKsFzC4g #Final | #SAUvMAH | @mastercardindia | @saucricket pic.twitter.com/2aPwxHkcPD — BCCI Domestic (@BCCIdomestic) December 2, 2022 చదవండి: Pak Vs Eng: పాక్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు! లిస్టులో భారత క్రికెటర్ కూడా మారడోనా, మెస్సీలను మించినోడు.. జెర్సీ నెంబర్-10 ఆ ఆటగాడిదే -
VHT 2022: ఒకరు బ్యాట్‌తో, మరొకరు బంతితో.. అదరగొట్టిన కెప్టెన్లు!
Vijay Hazare Trophy 2022 Final: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర, సౌరాష్ట్ర జట్లు ఫైనల్లోకి ప్రవేశించాయి. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లలో మహారాష్ట్ర 12 పరుగుల తేడాతో అస్సాంపై గెలవగా.. సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య శుక్రవారం ఫైనల్ జరుగుతుంది. కాగా ఈ సెమీస్ మ్యాచ్‌లలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సౌరాష్ట్ర సారథి జయదేవ్ ఉనాద్కట్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. జట్ల గెలుపులో కీలక పాత్ర పోషించి వీరిద్దరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకోవడం విశేషం. రుతు మరో సెంచరీ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (126 బంతుల్లో 168; 18 ఫోర్లు, 6 సిక్స్‌లు) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీ సాధించగా, అంకిత్ బావ్నే (89 బంతుల్లో 110; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. అనంతరం అస్సాం చివరి వరకు పోరాడి 50 ఓవర్లలో 8 వికెట్లకు 338 పరుగులు చేయగలిగింది. చెలరేగిన ఉనాద్కట్ మరో సెమీస్‌లో ముందుగా కర్ణాటక 49.1 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. జయదేవ్ ఉనాద్కట్ 26 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌరాష్ట్ర 36.2 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. చదవండి: ICC WC Super League: సిరీస్ సమం చేసిన శ్రీలంక.. ఇంకో రెండు మ్యాచ్‌లు గెలిస్తే నేరుగా.. Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే! -
Gujarat Assembly Election 2022: సౌరాష్ట్ర ఎవరికి సై?
సౌరాష్ట్ర.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ప్రాంతం. పటీదార్ల ఉద్యమానికి కేంద్ర బిందువు. ఈ ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఈ ప్రాంతంపై పట్టు కోల్పోయిన బీజేపీ తిరిగి పూర్వవైభవం సాధించడానికి ప్రయత్నిస్తోంది. మరి సౌరాష్ట్ర ఓటర్లు ఎవరకి జై కొడతారు...? సౌరాష్ట్ర కేంద్రంగా 2015లో మొదలైన పటీదార్ (పటేళ్లు) ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రంలో అగ్రకులమైన పటేళ్లను ఒబిసిలో చేర్చాలని, వారికి కూడా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో యువ నాయకుడు హార్థిక్ పటేల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం 2017 ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బ తీసింది. సౌరాష్ట్రలో పటీదార్లు, ఒబీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పటీదార్లు చేసిన ఉద్యమంతో 2017 ఎన్నికల్లో మొత్తం 48 స్థానాలకు గాను 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌కు వెలుపల నుంచి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ఏకంగా 28 స్థానాలను గెలుచుకొని తన పట్టు పెంచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని 99 స్థానాలకే పరిమితం చేయగలిగింది. ఇప్పుడపా మాదిరి భావోద్వేగ పరిస్థితుల్లేవు. పటీదార్ల ఉద్యమం చల్లారింది. హార్దిక్ పటేల్ కాంగ్రెస్‌లో చేరినా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. హార్దిక్ ఇప్పుడు బీజేపీలో చేరారు. విరమ్గమ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా మారేలా ఉన్నాయి. సౌరాష్ట్రలో పటీదార్లు, కొలి జనాభా 40% దాకా ఉంది. 18 అసెంబ్లీ స్థానాల్లో పటీదార్ల ఓట్లు, 10 అసెంబ్లీ స్థానాల్లో కొలి వర్గం ఓట్లు నిర్ణయాత్మకం. ఓబీసీ, క్షత్రియులు, మత్స్యకారులు కూడా ప్రభావం చూపించగలరు. ‘‘సౌరాష్ట్ర యువ ఓటర్లు ఈసారి ఆప్‌వైపు మొగ్గుతున్నారు. పటీదార్లు వ్యాపారాలంతా ఆప్‌కు అవకాశమిద్దామని అనుకుంటున్నారు. కొలి, ఇతర ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌కి ఓటేయొచ్చు’’ అని రాజకీయ విశ్లేషకుడు దిలీప్ గొహ్లి అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓబీసీ మంత్రం సౌరాష్ట్రలో 48 సీట్లలో సగానికిపైగా స్థానాల్లో పటేళ్ల ఆధిక్యం ఉంది. హార్దిక్ వంటి నాయకుల్ని బీజేపీ తమ వైపు తిప్పుకున్నా పటేళ్లలో ఉపకులాల కారణంగా అందరూ బీజేపీ వైపుండే పరిస్థితి లేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు టిక్కెట్లు ఎక్కువ ఇచ్చింది. 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంపయ్యారు. పటీదార్, కొలి, అహిర్ సామాజిక వర్గాలకు చెందిన కున్వర్జీ బవాలియా, బ్రిజేశ్ మెర్జా, చవడ వంటి అగ్రనాయకులూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. సంపన్న సౌరాష్ట్ర సౌరాష్ట్ర ప్రాంతం మొదట్నుంచి సంపన్న ప్రాంతమే. అరేబియా తీరంలో ఉండే ఈ ప్రాంతంలో సహజవనరులు చాలా ఎక్కువ. నీటి లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఇటీవల కాలంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.2019లో సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర నర్మద నది నుంచి నీళ్ల ట్యాంకర్లతో సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ ప్రాంతంలో 11 జిల్లాలున్నాయి. సురేంద్రనగర్, మోర్బీ, రాజ్‌కోట్, జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక, పోర్బందర్, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి, భావనగర్, బోతాడ్.. ఈ 11 జిల్లాలకు గాను బీజేపీ 2017 ఎన్నికల్లో మోర్బీ, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలి జిల్లాల్లో ఒక్క సీటు సాధించలేకపోయింది. ఈ సారి ఎన్నికల్లో అధిక ధరలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, నీటి సమస్య కీలకం కానున్నాయి. – సాక్షి నేషనల్ డెస్క్ -
అమన్ రావు అజేయ శతకం.. డ్రాతో గట్టెక్కిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ అండర్–19 టోర్నీ (కూచ్ బెహర్ ట్రోఫీ)లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, సౌరాష్ట్ర మధ్య జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 422 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ చివరి రోజు ఆట ముగిసే సమయానికి 97 ఓవర్లలో 5 వికెట్లకు 290 పరుగులు చేసింది. అమన్ రావు (217 బంతుల్లో 156 నాటౌట్; 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 290, హైదరాబాద్ 226 పరుగులు చేయగా... సౌరాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 357 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆరు జట్లున్న గ్రూప్ ‘బి’లో ఉన్న హైదరాబాద్ ఒక మ్యాచ్‌లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
Vijay Hazare Trophy: సమర్థ్ 200
న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడి జామియా మిలియా యూనివర్సిటీ మైదానంలో మణిపూర్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు పరుగుల వరద పారించింది. ఏకంగా 282 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సమర్థ్ వ్యాస్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 131 బంతులు ఆడిన సమర్థ్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో సరిగ్గా 200 పరుగులు సాధించి అవుటయ్యాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (107 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 36.3 ఓవర్లలో 282 పరుగులు జోడించడం విశేషం. సమర్థ్, హార్విక్ మెరుపు ఇన్నింగ్స్‌తో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 397 పరుగులు సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మణిపూర్‌ను సౌరాష్ట్ర ఎడంచేతి వాటం స్పిన్నర్ ధర్మేంద్రసింగ్ జడేజా తిప్పేశాడు. 32 ఏళ్ల ధర్మేంద్రసింగ్ 10 ఓవర్లు వేసి కేవలం 10 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దాంతో మణిపూర్ 41.4 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. -
అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ.. రెస్ట్ ఆఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. కోన శ్రీకర్ భరత్ 27 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్(138 పరుగులు) సెంచరీతో మెరవగా.. హనుమ విహారి 82 పరుగులు చేయగా సౌరబ్ కుమార్ 55 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేయగా.. ప్రేరక్ మాన్కడ్ 72 పరుగులతో రాణించాడు. ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 31.5 ఓవర్లలో చేధించి 8 వికెట్ల తేడాతో గెలిచి ఇరానీ కప్‌ను ఒడిసిపట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఓవరాల్‌గా ఎనిమిది వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ కుల్దీప్ సేన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్ కావడం విశేషం. Winners Are Grinners! ☺️ 🙌 Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP — BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022 చదవండి: టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన.. 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం -
మారువేషంలో జడేజా.. అంతా ఉనాద్కట్ మాయ!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలీ సర్జరీతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జడ్డూతో పాటు బుమ్రా కూడా దూరమవ్వడం టీమిండియా అభిమానులకు షాక్ తగిలేలా చేసింది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ప్రపంచకప్‌లో ఆడనుంది. మరి టీమిండియా అంచనాలు అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ విషయం పక్కనబెడితే.. ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా బ్యాటర్‌గా ప్రత్యక్షమైన ఫోటో వైరల్‌గా మారింది. అదేంటి ప్రస్తుతం జడేజా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు కదా.. ఇరానీ కప్‌లో ఆడడమేంటీ అనుకుంటున్నారా. అదంతా సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ మాయ. అతని పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెస్టాఫ్ ఇండియాతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనాద్కట్‌తో పాటు ప్రేరణ్ మన్కడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ప్రేరక్ మన్కడ్‌ను దూరం నుంచి చూస్తే కాస్త రవీంద్ర జడేజాలానే పోలి ఉంటాడు. ఇక్కడే ఉనాద్కట్ తన తెలివిని ఉపయోగించాడు. తనతో బ్యాటింగ్ చేసిన ప్రేరక్ మన్కడ్ ఫోటోకు కాస్త మార్ఫింగ్ చేసి జడేజాను పెట్టాడు. ''జడ్డూ టీమ్‌లో ఉండడం ఆనందంగా ఉంది(మారువేషంలో)'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కేవలం సరదా కోసమే చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జడేజా, ప్రేరక్ మన్కడ్లకు పోలికలు దగ్గరగా ఉండడంతో..'' మరో జడేజా వచ్చేశాడు.. టి20 ప్రపంచకప్‌కు ఈ జడ్డూను పంపిద్దామా'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెస్టాఫ్ ఇండియా ముందు 104 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 25, శ్రకర్ భరత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. Glad to have Jaddu in the team.. (in disguise 😂) @imjadeja = @PrerakMankad46 pic.twitter.com/3URrzEMgD2 — Jaydev Unadkat (@JUnadkat) October 3, 2022 చదవండి: 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్ -
సౌరాష్ట్ర 380 ఆలౌట్.. రెస్టాఫ్ ఇండియా టార్గెట్ 104 పరుగులు
రాజ్‌కోట్: ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండడంతో రెస్టాఫ్ ఇండియా విజయం దాదాపు ఖాయమే. ఇక ఓవర్‌నైట్ స్కోరు 368/8తో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర మరో 12 పరుగులు మాత్రమే చేసి 380 పరుగులకు ఆలౌట్ అయింది. జైదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేసి ఔట్ కాగా.. మిడిలార్డర్లో షెల్డన్ జాక్సన్ (71; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్పిత్ (55; 7 ఫోర్లు, 1 సిక్స్), లోయర్ ఆర్డర్లో ప్రేరక్ మన్కడ్ (72; 9 ఫోర్లు) రాణించారు. దీంతో సౌరాష్ట్రకు 104 పరుగుల ఆధిక్యం లభించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలోకుల్దీప్ సేన్ ఐదు వికెట్లు తీయగా.. సౌరభ్ 3 వికెట్లు తీశాడు. -
సర్ఫరాజ్ ఖాన్.. మొన్న దులీప్ ట్రోపీ.. ఇవాళ ఇరానీ కప్‌లో
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోపీ ఫైనల్లో సెంచరీతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా ఇరానీ కప్‌లోనూ శతకం సాధించి తన జోరు చూపిస్తున్నాడు. కేవలం 92 బంత్లులోనే శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం 125 పరుగులతో ఆడుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సర్ఫారాజ్ ఖాన్ 125 పరుగులు, కెప్టెన్ హనుమ విహారి 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు రెస్టాఫ్ ఇండియా బౌలర్ల దాటికి సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ 4 వికెట్లు,కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. 💯 for Sarfaraz Khan! 🙌 🙌 What a stunning knock this has been by the right-hander! 👏 👏 Follow the match ▶️ https://t.co/u3koKzDR7B#IraniCup | #SAUvROI | @mastercardindia pic.twitter.com/O2XeAZ91RV — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
Irani Cup 2022: కెప్టెన్‌గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కెప్టెన్‌గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్‌జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను సైతం ఈ టీమ్‌కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
తండ్రైన కేకేఆర్ బ్యాటర్.. శుభాకాంక్షల వెల్లువ
సౌరాష్ట్ర వెటరన్ వికెట్ కీపర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ షెల్డన్ జాక్సన్ అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. తమకు మంగళవారం మగ బిడ్డ జన్మించినట్లు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిన్నారి కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు. ఈ సందర్భంగా అభిమానులు షెల్డన్ జాక్సన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేకేఆర్ సైతం లిటిల్ నైట్‌కు క్లబ్‌లోకి స్వాగతం అంటూ జాక్సన్‌ను విష్ చేసింది. కాగా దేశవాళీ క్రికెట్లో రాణించినప్పటికీ 35 ఏళ్ల షెల్డన్ జాక్సన్‌కు ఇంత వరకు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో తాను నిరాశకు గురైనట్లు జాక్సన్ గతంలో పలు సందర్భాల్లో వెల్లడించాడు. ఒకానొక సమయంలో తాను ఈ విషయం గురించి ఒకరిద్దరిని అడుగగా.. తనకు వయసైపోయిందన్నారని, అందుకే బీసీసీఐ నుంచి పిలుపు రావడం లేదన్నారని పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో 30 ఏళ్లు పైబడిన వారిని జట్టుకు ఎంపిక చేయడం చూశానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2011లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షెల్డన్ జాక్సన్ 79 మ్యాచ్‌లు ఆడాడు. 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 67 మ్యాచ్‌లలో 2346 పరుగులు చేశాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో 1534 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు షెల్డన్ జాక్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Surya Kumar Yadav: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే ఎవరూ లేరు! Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్! ఇంకా.. Blessed with a boy❤️😇 pic.twitter.com/Kh5zmBTy43 — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 💜💜 https://t.co/Xr70sHk5eG — Sheldon Jackson (@ShelJackson27) July 12, 2022 -
30 ఏళ్లు దాటిన వారిని టీమిండియాకు ఎంపిక చేయరట..!
ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేసే విధానంపై భారత వెటరన్ ఆటగాడు షెల్డన్ జాక్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో భారత సెలక్లర్లు అవలంభిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా టీమిండియాకు ఎంపిక కాకపోవడంపై స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీమిండియాకు ఎంపిక చేయట్లేదని ఓ సెలక్షన్ అధికారి తనతో చెప్పినట్లు పేర్కొన్న జాక్సన్.. వయసును సాకుగా చూపి భారత సెలక్టర్లు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తాడు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నా తనను టీమిండియాకు ఎందుకు ఎంపిక చేయట్లేదో అర్ధం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 30 ఏళ్లు పైబడిన వారిని టీమిండియాకు ఎంపిక చేయకూడదనే చట్టం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఇలా ఏదైనా ఉంటే ఇటీవల ఓ 32 ఏళ్ల ఆటగాడిని భారత జట్టుకు ఎలా ఎంపిక చేశారని నిలదీశాడు. ప్రతి ఒక్క క్రికెటర్‌కు భారత జట్టుకు ఆడాలన్నది ఓ కల అని, దాన్ని సాకారం చేసుకునేందుకే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని అన్నాడు. సెలక్టర్ల నుంచి పిలుపు అందే వరకు తన ప్రయత్నాలను విరమించేదేలేదని చెప్పుకొచ్చాడు. కాగా, 35 ఏళ్ల జాక్సన్ గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జాక్సన్.. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన జాక్సన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50కి పైగా సగటుతో సత్తా చాటుతున్నాడు. 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 19 సెంచరీలు, 27 అర్ధ సెంచరీల సాయంతో 5634 పరుగులు చేశాడు. చదవండి: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా బౌలర్ -
ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన పుజారా.. టీ20 తరహాలో..!
Cheteshwar Pujara: చాలాకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ.. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటును సైతం కోల్పోయిన నయా వాల్ చతేశ్వర్ పుజారా ఎట్టకేలకు ఫామ్‌ను దొరకబుచ్చుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. తన సహజ శైలికి విరుద్ధంగా భారీ షాట్లతో అలరించాడు. టీ20 తరహాలో 109.64 స్ట్రైక్‌రేట్‌తో రెచ్చిపోయాడు. 83 బంతుల్లో సిక్సర్, 16 ఫోర్ల సాయంతో 91 పరుగులు సాధించి 9 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై నిరాశపర్చిన పుజరా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఫాలో ఆన్ ఆడిన తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (275), రహానే (129) అద్భుత శతకాలతో చెలరేగడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు కుప్పకూలడంతో ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర జట్టును స్నెల్ పటేల్ (98), పుజారా (91), కెప్టెన్ ఉనద్కత్ (32 నాటౌట్) ఆదుకోవడంతో మ్యాచ్ ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసి ఓటమి గండం నుంచి గట్టెక్కింది. చదవండి: చరిత్ర సృష్టించిన యష్ ధుల్... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు! -
ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా!
Ranji Trophy 2021-22: టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ముంబై బౌలర్ మోహిత్ అవస్తీ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పుజారాకి భారత జట్టులో చోటు దక్కడం ఇప్పటికే కష్టంగా మారింది. మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మరి కొద్దిరోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో పుజారా డకౌట్ కావడం.. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలను మరింత దెబ్బతీశాయి. ఇక పుజారా 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన పుజారా 521 పరుగులు చేశాడు. అయితే అప్పటి నుంచి పుజారా తన ఫామ్‌ను కోల్పోయాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 27 టెస్టులాడిన పుజారా కేవలం 1287 పరుగుల మాత్రమే చేశాడు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అత్యధికంగా 91 పరుగులు పుజారా సాధించాడు. చదవండి: Ind Vs Wi 2nd T20: రోహిత్ ఆగ్రహం... అసహనంతో బంతిని తన్నిన హిట్‌మ్యాన్.. పాపం భువీ! -
'సూపర్' వాషింగ్టన్ సుందర్.. ఫైనల్‌కు తమిళనాడు
Tamil Nadu Enters Final Beating Saurashtra In Semi Final-2.. విజయ్ హజారే ట్రోఫీ 2021లో తమిళనాడు ఫైనల్‌కు చేరింది. సౌరాష్ట్రతో జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో తమిళనాడు 2 వికెట్లతో విజయాన్ని అందుకుంది. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు ఇన్నింగ్ ఆఖరి బంతికి 8 వికెట్లు కోల్పోయి చేధించింది. తమిళనాడు బ్యాటింగ్‌లో ఓపెనర్ బాబా అపరాజిత్(122 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ (61 బంతుల్లో 70, 8 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. సౌరాష్ట్ర బౌలర్లలో చేతన్ సకారియా 5 వికెట్లు తీశాడు. చదవండి: ఆరోన్ ఫించ్ సరికొత్త రికార్డు.. టి20 చరిత్రలో ఆరో బ్యాటర్‌గా ఆఖరివరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. వికెట్ కీపన్ షెల్డన్ జాక్సన్(125 బంతుల్లో 134 పరుగులు, 11 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగగా.. వసవదా 57, ప్రేరక్ మన్కడ్ 37 పరుగులు చేశారు. తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్ 4, సిలింబరాసన్ 3 వికెట్లు తీశారు. ఇక హిమాచల్ ప్రదేశ్, సర్వీసెస్ మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 77 పరుగులతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్ 26న జరగనున్న ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. చదవండి: Harbhajan Singh Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ స్పిన్నర్ -
సెమీస్‌లో సౌరాష్ట్ర, సర్వీసెస్
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాజీ చాంపియన్ సౌరాష్ట్ర సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర 7 వికెట్ల తేడాతో విదర్భపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 40.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. అపూర్వ్ వాంఖడే (69 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. కెప్టెన్ ఉనాద్కట్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీశాడు. అనంతరం సౌరాష్ట్ర 29.5 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు సాధించింది. సౌరాష్ట్ర 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా... ప్రేరక్ మన్కడ్ (72 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), అర్పిత్ వాసవదా (41 నాటౌట్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 116 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. గెలిపించిన రవి చౌహాన్... కేరళతో జరిగిన మరో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన సర్వీసెస్ సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా కేరళ 40.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రోహన్ కన్నుమ్మల్ (106 బంతుల్లో 85; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సర్వీసెస్ 30.5 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవి చౌహాన్ (90 బంతుల్లో 95; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా, రజత్ పలివాల్ (86 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. చదవండి: భారత బౌలర్‌పై సచిన్ ప్రశంసల జల్లు.. -
Vijay Hazare Trophy: ప్రేరక్ మన్కడ్ అద్భుత ఇన్నింగ్స్.. సెమీస్‌లో సౌరాష్ట్ర
Saurashtra Won: విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో సౌరాష్ట్ర అదరగొట్టింది. జయదేవ్ ఉనద్కట్ సారథ్యంలోని జట్టు... విదర్భను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. ప్రేరక్ మన్కడ్ హాఫ్ సెంచరీ(72 బంతుల్లో 77 పరుగులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర.... 150 పరుగులకే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసింది. జట్టులోని ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్ తీయడం విశేషం. ఈ క్రమంలో 151 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌరాష్ట్ర... ఆదిలోనే విశ్వరాజ్ జడేజా వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ హర్విక్ దేశాయ్(9 పరుగులు) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన షెల్డన్ జాక్సన్ కూడా 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్, అర్పిత్ వాసవడా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వరుసగా 77, 41 పరుగులతో అజేయంగా నిలిచి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో ఏడు వికెట్ల తేడాతో సౌరాష్ట్ర విదర్భపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. విదర్భ బౌలర్లలో ఆదిత్య ఠాక్రేకు రెండు, లలిత్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. అంతకుముందుబ్యాటర్ అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు) చేయడంతో విదర్భ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్కోర్లు: విదర్భ- 150 (40.3) సౌరాష్ట్ర- 151/3 (29.5) DO NOT MISS: Prerak Mankad's match-winning 77* (72) against Vidarbha 👍 👍 The Saurashtra right-hander creamed 10 fours & 2 sixes to power his side to a convincing 7-wicket win in the #QF3 of the #VijayHazareTrophy. 👏 👏 #SAUvVID Watch his knock 🎥 🔽https://t.co/EVS1KXWGgV pic.twitter.com/iAQU5i8iJ9 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
Vijay Hazare Trophy: 23,1,1,1,18,14,1,0,5,0.. అందరూ చేతులెత్తేశారు.. ఒక్కడే 72!
Sheldon Jackson Super Diving Catch Video Viral: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. సూపర్డైవ్తో విదర్భ బ్యాటర్ అథర్వ టైడ్ పెవిలియన్ చేరేలా చేశాడు. విజయ్ హజారే ట్రోఫీ-2021 మూడో క్వార్టర్ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర- విదర్భ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన విదర్భకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ ఫాజల్ 23 పరుగులు చేయగా.. అతడికి జోడీగా ఓపెనింగ్‌కు దిగిన అథర్వ కేవలం ఒకే ఒక్క పరుగు తీసి వెనుదిరిగాడు. మూడో ఓవర్ మూడో బంతికి జయదేవ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పాదరసంలా కదిలి డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. ఆ తర్వాత విదర్భ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే అపూర్వ్ వాంఖడే హాఫ్ సెంచరీ(72 పరుగులు)తో రాణించడంతో 40.3 ఓవర్లలో 150 పరుగులు చేసి విదర్భ ఆలౌట్ అయింది. విదర్భ బ్యాటర్ల స్కోర్లు వరుసగా.. 23,1,1,1,18,14,72,1,0,5,0. సౌరాష్ట్ర బౌలర్లలో ఉనద్కట్కు 2, చేతన్ సకారియాకు ఒకటి, చిరాగ్ జానీకి 2, ప్రేరక్ మన్కడ్‌కు ఒకటి, డీఏ జడేజాకు రెండు, యువరాజ్ చౌడసమాకు 2 వికెట్లు దక్కాయి. సౌరాష్ట్ర బ్యాటింగ్ కొనసాగిస్తోంది. చదవండి: Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం! ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ .@ShelJackson27's superb diving catch 👌 👌 Jackson, keeping the wickets, flew towards his left & completed a stunning catch off @saucricket captain @JUnadkat to dismiss Atharva Taide. 👍 👍 #SAUvVID #VijayHazareTrophy #QF3 Watch that catch 🎥 🔽https://t.co/aqsiKMv4A8 pic.twitter.com/Z0Rah3D6P5 — BCCI Domestic (@BCCIdomestic) December 22, 2021 -
తీవ్ర విషాదం... గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి
Young Saurashtra Cricketer Avi Barot Dies: క్రీడా ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. సౌరాష్ట్ర యువ బ్యాటర్ అవి బరోట్ మరణించాడు. 29 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో శుక్రవారం కన్నుమూశాడు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ‘‘ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది’’ అని బాధాతప్త హృదయంతో మీడియాకు ప్రకటన విడుదల చేసింది. కాగా కుడిచేతి వాటం గల అవి బరోట్... అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్(2011)గా వ్యవహరించాడు. 2019-20 సీజన్‌కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. బరోట్ 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 38 లిస్ట్-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచ్‌లలో భాగస్వామ్యమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన బరోట్... ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 1547 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 1030, టీ20లలో 717 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 122 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా అవీ బరోట్ ఆకస్మిక మరణం పట్ల ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బరోట్ ఎంతో మంచి వాడని, అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని పేర్కొన్నారు. చదవండి: Team India Coach: రాహుల్ ద్రవిడ్ ఒప్పేసుకున్నారు.. ఇకపై హెడ్ కోచ్‌గా?! -
కరోనా కాటుకు మాజీ క్రికెటర్ బలి
న్యూఢిల్లీ: సౌరాష్ట్ర మాజీ క్రికెటర్, బీసీసీఐ రిఫరీ రాజేంద్రసిన్హ్ జడేజా(66) కరోనా కాటుకు బలయ్యారు. ఆదివారం ఉదయం ఆయన మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ధృవీకరించింది. క్రికెటర్‌గా, కోచ్‌గా, రిఫరీగా వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన జడేజా మృతి చెందడం బాధకరమని, అతని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. పాతతరం క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు గాంచిన జడేజా.. 1974-1987 మధ్యకాలంలో 50 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 11 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 1640 పరుగులతో పాటు 145 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కొంతకాలం పాటు సౌరాష్ట్ర కోచ్‌గా, మేనేజర్‌గా, సెలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన జడేజా.. బీసీసీఐ అధికారిక రిఫరీగా కూడా వ్యవహరించాడు. 53 ఫస్ట్క్లాస్మ్యాచ్లు, 18 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 34 టీ20 మ్యాచ్‌లకు అతను మ్యాచ్ రిఫరీగా పని చేశారు. జడేజా మృతి పట్ల బీసీసీఐ మాజీ కార్యదర్శి నిరంజన్ షా, ప్రస్తుత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జైదేవ్ షా సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: ప్రముఖ నటితో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి ప్రేమాయణం..? -
సమష్టి మంత్రం... స్వప్నం సాకారం
ఒకరిద్దరు మినహా భారత్‌కు ఆడిన ఆటగాళ్లెవరూ ఆ జట్టులో లేరు. అయినా దేశవాళీ క్రికెట్లో ఈసారి ఆ జట్టు అద్భుతమే చేసింది. ఆద్యంతం నిలకడగా రాణించింది. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. నాలుగో ప్రయత్నంలో రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించింది. ప్రత్యర్థి ఎవరైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, పిచ్ ఎలాంటిదైనా ... పక్కా ప్రణాళికతో ఆడితే తుది ఫలితం కోరుకున్నట్లు ఉంటుందని నిరూపించిన జట్టే సౌరాష్ట్ర. గత ఏడాది రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నా... నిరాశ చెందకుండా ఈసారి మరింత పకడ్బందీగా ఆడిన సౌరాష్ట్ర చాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది. భారత జట్టులోకి పునరాగమనం చేయగల సత్తా నాలో ఉంది. ఆ పట్టుదలే ఈ సీజన్లో నేను అద్భుతంగా ఆడేలా ప్రేరేపించింది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయాల్సి రావడం శారీరకంగా కూడా నన్ను తీవ్ర శ్రమకు గురి చేసింది. అయితే మేం ఈసారి రంజీ ట్రోఫీ గెలవగలిగాం. ప్రపంచంలో ఇప్పుడు అందరికంటే ఎక్కువగా నేనే సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఐపీఎల్లో భారీ మొత్తాలకు అమ్ముడుపోయిన ఆటగాడిగానే చాలా మంది నా గురించి మాట్లాడుతుంటారు. అయితే ఆడేటప్పుడు ఐపీఎల్ గురించి ఆలోచన రాదు. ఒక క్రికెటర్‌గా దేశంలో చాలా మందిలాగే మైదానంలో నేనూ కష్టపడతాను. ఇప్పుడు నా రాష్ట్ర జట్టు తరఫున రంజీ గెలవడంతో నా సుదీర్ఘకాల స్వప్నం సాకారమైంది. –జైదేవ్ ఉనాద్కట్, సౌరాష్ట్ర కెప్టెన్ సాక్షి క్రీడా విభాగం: రంజీ సీజన్ ప్రారంభమైన మొదట్లో సౌరాష్ట్ర జట్టు చాంపియన్‌గా అవతరిస్తుందని ఎవరూ ఊహించలేదు. కర్ణాటక, తమిళనాడు, ముంబై, విదర్భ జట్లలో ఒకటి విజేతగా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ సౌరాష్ట్ర జట్టు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రంజీ ట్రోఫీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర జట్టుకు ఆడే భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఒక్క మ్యాచ్‌లోనూ అందుబాటులో లేకుండా పోయాడు. భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా కేవలం ఆరు మ్యాచ్‌ల్లో సౌరాష్ట్రకు ఆడాడు. వీరిద్దరి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకున్నా సౌరాష్ట్ర సీజన్ మొత్తం నిలకడగా రాణించింది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో మెరిపించి ప్రత్యర్థుల ఆట కట్టించింది. భారత క్రికెటర్, జట్టు కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ అన్నీ తానై సౌరాష్ట్రను ముందుండి నడిపించాడు. శుభారంభంతో... గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సౌరాష్ట్ర 2019–2020 సీజన్‌ను వరుసగా రెండు విజయాలతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో... రెండో మ్యాచ్‌లో రైల్వేస్‌పై ఇన్నింగ్స్ 90 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్రకు ఇన్నింగ్స్ 72 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. ఈ రంజీ సీజన్లో సౌరాష్ట్ర ఓడిన ఏకైక మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్ చేతిలో ఓటమి ఎదురయ్యాక సౌరాష్ట్ర లీగ్ దశలో ఆడిన మిగతా ఐదు మ్యాచ్‌ల్లో నాలుంగిటిని ‘డ్రా’ చేసుకొని మరో మ్యాచ్‌లో గెలిచి 41 పాయింట్లతో 18 జట్లున్న ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌లో 31 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్న ఆంధ్ర జట్టుతో ఒంగోలులో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ను సౌరాష్ట్ర ‘డ్రా’ చేసుకుంది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఒకదశలో తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చిరాగ్ జానీ అద్భుత సెంచరీ, ప్రేరక్ మన్కడ్ అర్ధ సెంచరీ చేసి సౌరాష్ట్రకు 419 పరుగుల భారీ స్కోరును అందించారు. అనంతరం బౌలింగ్‌లో జైదేవ్ ఉనాద్కట్ విజృంభణకు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే ఆలౌటైంది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా సౌరాష్ట్ర రిస్క్ తీసుకోకుండా వ్యూహాత్మకంగా రెండో ఇన్నింగ్స్ ఆడి మళ్లీ భారీ స్కోరు చేసింది. మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లోనూ మెరిసిన ఉనాద్కట్ సౌరాష్ట్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో 28 ఏళ్ల ఉనాద్కట్ ఓవరాల్‌గా ఈ సీజన్లో అత్యధికంగా 67 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఒకరు కాదంటే మరొకరు.... జట్టు క్రీడ అయిన క్రికెట్లో ఏ ఒక్కరితోనో ఎల్లవేళలా విజయాలు సాధించడం సాధ్యం కాదు. సమష్టి ప్రదర్శన చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సీజన్లో సౌరాష్ట్ర విషయంలో ఇదే జరిగింది. జట్టు ఒకరిద్దరు ప్రదర్శనపై ఆధారపడలేదు. ఒక మ్యాచ్‌లో ఒకరు మెరిస్తే మరో మ్యాచ్‌లో ఇతర ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ అర్పిత్ వసవాడ సెమీఫైనల్లో, ఫైనల్లో సెంచరీలు చేశాడు. ఓవరాల్‌గా టోర్నీ మొత్తంలో అర్పిత్ నాలుగు సెంచరీలతో కలిపి మొత్తం 763 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్ చిరాగ్ జానీ పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ హార్విక్ దేశాయ్, వెటరన్ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ కూడా తమవంతు పాత్ర పోషించారు. షెల్డన్ జాక్సన్ మొత్తం పది మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 809 పరుగులు చేసి సౌరాష్ట్ర తరఫున రంజీ సీజన్లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పుజారా 573 పరుగులు... చిరాగ్ జానీ 544 పరుగులు... హార్విక్ దేశాయ్ 597 పరుగులు... ప్రేరక్ మన్కడ్ 445 పరుగులు సాధించారు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటును తెలియకుండా మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర సింగ్ జడేజా ముఖ్యపాత్ర నిర్వర్తించాడు. అతను ఈ సీజన్లో 388 పరుగులు చేయడంతోపాటు 32 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. ఈసారి సౌరాష్ట్ర చాంపియన్‌గా అవతరించడానికి సమష్టి ప్రదర్శనే కారణమని ఆ జట్టు కోచ్ నీరజ్ ఒదేద్రా అభిప్రాయపడ్డారు. ‘గతంలోనూ సౌరాష్ట్ర బాగా ఆడింది. ఫైనల్స్‌కూ చేరింది. అయితే ఆ సందర్భాల్లో స్టార్ ఆటగాళ్లపైనే పూర్తిగా ఆధారపడింది. స్టార్ ప్లేయర్లు విఫలమైతే ఫలితం మరోలా వచ్చేది. ఈసారి మాత్రం పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరూ తమవంతుగా రాణించడంలో సౌరాష్ట్రకు టైటిల్ లభించింది. గత సీజన్లో జైదేవ్ ఉనాద్కట్ జట్టు పగ్గాలు చేపట్టాక ఆటగాళ్ల మైండ్‌సెట్‌లోనూ మార్పు వచ్చింది. ఒకప్పుడు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తేనో, ‘డ్రా’ చేసుకుంటేనో సంతృప్తి పడేది. కానీ ఉనాద్కట్ కెప్టెన్ అయ్యాక సౌరాష్ట్ర ప్రతి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా పోరాడటం అలవాటు చేసుకుంది’ అని నీరజ్ అన్నారు. ఉనాద్కట్ నిశ్చితార్థం... సౌరాష్ట్రను రంజీ చాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ త్వరలోనే ఇంటివాడు కానున్నాడు. ఆదివారం రాజ్‌కోట్‌లో తన ప్రియురాలు రిన్నీతో జైదేవ్ వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత టెస్టు క్రికెటర్, సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారాతోపాటు సౌరాష్ట్ర జట్టుకు చెందిన ఇతర సభ్యులు హాజరయ్యారు. -
సౌరాష్ట్రకు ‘జై’
గత ఏడు సీజన్లలో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీ గెలవలేకపోయిన సౌరాష్ట్ర ఎట్టకేలకు విజయబావుటా ఎగరేసింది. జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలో తొలిసారి విజేతగా అవతరించింది. సొంత మైదానంలో హోరాహోరీగా సాగిన తుది పోరులో బెంగాల్‌పై సాధించిన 44 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సౌరాష్ట్రను చాంపియన్‌ను చేసింది. చివరి రోజు నాలుగు వికెట్లతో ఆధిక్యం కోసం బెంగాల్ పోరాడినా లాభం లేకపోయింది. చివరకు రంజీ చరిత్రలో ఎక్కువ సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. రాజ్‌కోట్: భారత దేశవాళీ క్రికెట్ ప్రధాన టోర్నీ రంజీ ట్రోఫీలో కొత్త చాంపియన్ అవతరించింది. జైదేవ్ ఉనాద్కట్ నేతృత్వంలోని సౌరాష్ట్ర జట్టు మొదటిసారి విజేతగా నిలిచింది. సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ శుక్రవారం ‘డ్రా’గా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా సౌరాష్ట్రకు ట్రోఫీ ఖరారైంది. చివరి రోజు 72 పరుగులు చేస్తే ఆధిక్యం అందుకునే స్థితిలో ఆట కొనసాగించిన బెంగాల్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 44 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 105 పరుగులు చేసింది. అయితే విజేత ఖరారైన నేపథ్యంలో ముందుగానే ఆటను నిలిపివేసేందుకు ఇరు జట్లు అంగీకరించాయి. ఆ వెంటనే సొంత గడ్డపై సౌరాష్ట్ర సంబరాలు మొదలయ్యాయి. విజేత సౌరాష్ట్రకు రూ. 2 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. ఉనాద్కట్ జోరు... సీజన్ మొత్తం తన అద్భుత బౌలింగ్, కెప్టెన్సీతో సౌరాష్ట్రను నడిపించిన ఉనాద్కట్ చివరి రోజు కూడా కీలక పాత్ర పోషించాడు. ఓవర్‌నైట్ స్కోరు 354/6తో బరిలోకి దిగిన బెంగాల్ జట్టు అనుస్తుప్ మజుందార్ (151 బంతుల్లో 63; 8 ఫోర్లు)పైనే తమ ఆశలు పెట్టుకుంది. అయితే ఆరో ఓవర్లోనే ఆ జట్టుకు దెబ్బ పడింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో అనుస్తుప్ ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అదే ఓవర్లో మరో రెండు బంతులకే ఆకాశ్ దీప్ (0) రనౌటయ్యాడు. సింగిల్ తీసేందుకు అవకాశం లేకపోయినా షాట్ ఆడిన ఆకాశ్ ముందుకు వచ్చాడు. కీపర్ బారోత్ విసిరిన బంతి స్టంప్స్‌ను తాకలేదు. అయితే చురుగ్గా వ్యవహరించిన ఉనాద్కట్ వెంటనే దాన్ని అందుకొని వికెట్లపైకి విసిరాడు. అప్పటికీ క్రీజ్‌లో వెనక్కి రాని ఆకాశ్ వెనుదిరిగాడు. ముకేశ్ కుమార్ (5)ను ధర్మేంద్ర జడేజా పెవిలియన్‌కు పంపగా... కొద్ది సేపటికే ఇషాన్ పొరెల్ (1)ను అవుట్ చేసి ఉనాద్కట్ బెంగాల్ ఆట ముగించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర తరఫున అవి బారోత్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హార్విక్ దేశాయ్ (21), విశ్వరాజ్ జడేజా (17), అర్పిత్ వసవాద (3) వికెట్లు తీయడంలో బెంగాల్ సఫలమైంది. ఇన్నింగ్స్ 34వ ఓవర్ చివరి బంతికి బారోత్ అవుట్ కాగానే ఇరు జట్లు ఆటగాళ్లు కరచాలానికి సిద్ధపడ్డారు. ►1 సౌరాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి. 1950–51 సీజన్ నుంచి జట్టు ఈ పేరుతో బరిలోకి దిగుతోంది. అంతకుముందు సౌరాష్ట్రకు పూర్వ రూపంగా ఉన్న, ఇదే ప్రాంతానికి చెందిన రెండు జట్లు నవానగర్ (1936–37), వెస్టర్న్ ఇండియా (1943–44) రంజీల్లో విజేతలుగా నిలిచాయి. ఆ రెండు సార్లు ఫైనల్లో బెంగాలే ఓడింది. ►12 రంజీల్లో అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిన జట్టుగా బెంగాల్ నిలిచింది. 14 సార్లు తుది పోరుకు అర్హత సాధించిన బెంగాల్ 2 సార్లు మాత్రమే టైటిల్ అందుకోగలిగింది. బెంగాల్ ఆఖరిసారిగా 1989–90లో టైటిల్ సాధించింది. ►67 ఈ సీజన్లో జైదేవ్ ఉనాద్కట్ తీసిన వికెట్లు. రంజీ చరిత్రలో ఒకే సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జైదేవ్ రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది బిహార్ బౌలర్ అశుతోష్ అమన్ 68 వికెట్లు పడగొట్టాడు. -
రంజీ చరిత్రలో సౌరాష్ట్ర నయా రికార్డు
రాజ్‌కోట్: సౌరాష్ట్ర రంజీ జట్టు కొత్త రికార్డు సృష్టించింది. రంజీ చరిత్రలో తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుని నయా రికార్డును లిఖించింది. తుది పోరులో బెంగాల్‌తో తలపడిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 44 పరుగుల ఆధిక్యం కారణంగా విజేతగా నిలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా కావడంతో మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా సౌరాష్టను టైటిల్ వరించింది. శుక్రవారం చివరి రోజు ఆటలో బెంగాల్ తన తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు సాధించిన సౌరాష్ట్ర విజేతగా నిలిచింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. రంజీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు డ్రా అయిన పక్షంలో విజేతను తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ప్రకటించే సంగతి తెలిసిందే. నిన్నటి వరకూ రసపట్టులోనే తాజా రంజీ ట్రోఫీని ఎవరు గెలుస్తారనేది నిన్నటి వరకూ ఆసక్తికరంగా ఉంది. గురువారం ఆట ముగిసే సమయానికి బెంగాల్ ఆరు వికెట్లు కోల్పోయి 354 పరుగులు చేసింది. దాంతో ఈ రోజు ఆటలో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ స్కోరును బెంగాల్ అధిగమిస్తుందని అంతా భావించారు. కానీ సౌరాష్ట్ర బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 27 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లను కోల్పోయింది బెంగాల్. ఓవర్‌నైట్ ఆటగాడు మజుందార్(63) ఏడో వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత అమాబ్ నంది(40 నాటౌట్) అజేయంగా నిలిచినా మిగతా వారు వరుస పెట్టి క్యూకట్టేయడంతో బెంగాల్‌కు ఆధిక్యం దక్కలేదు. దాంతో అక్కడే సౌరాష్ట్రకు టైటిల్ ఖాయమైంది. ఇక మ్యాచ్ డ్రాగా ముగియడంతో సౌరాష్ట్ర ట్రోఫీని ముద్దాడింది. -
బెంగాల్‌కు 72 పరుగులు... సౌరాష్ట్రకు 4 వికెట్లు!
రాజ్‌కోట్: సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఇప్పటికే నాలుగు రోజులు గడవడంతో మ్యాచ్‌లో విజేత తేలే పరిస్థితి లేదు... అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టుకే రంజీ ట్రోఫీ దక్కనుండటంతో ఇరు జట్లు కూడా కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో బెంగాల్‌కు 72 పరుగుల కావాల్సి ఉండగా... సౌరాష్ట్రకు 4 వికెట్లు అవసరం. నేడు ఆటకు చివరి రోజు. 291 పరుగులు వెనుకబడి... 134/3 స్కోరుతో గురువారం ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ ఆట ముగిసే సమయానికి 147 ఓవర్లలో 6 వికెట్లకు 354 పరుగులు చేసింది. ప్రస్తుతం అనుస్తుప్ మజుందార్ (58 బ్యాటింగ్; 8 ఫోర్లు), అర్నబ్ నంది (28 బ్యాటింగ్; 3 ఫోర్లు, సిక్స్) క్రీజులో ఉన్నారు. ఆదుకున్న సుదీప్, సాహా అంతకుముందు నాలుగో రోజు ఆటను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ సుదీప్ చటర్జీ (81; 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (64; 10 ఫోర్లు, సిక్స్) నిలకడగా ఆరంభించారు. ఈ రంజీ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సాహాకు గురువారం ఆటలో అదృష్టం బాగా కలిసొచ్చింది. రెండు సార్లు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి తప్పించుకున్న అతడికి... సౌరాష్ట్ర ఫీల్డర్ల నుంచి రనౌట్, క్యాచ్ రూపాల్లో రెండు లైఫ్‌లు లభించాయి. దీనిని ఆసరాగా చేసుకున్న సాహా... సుదీప్తో కలిసి నాలుగో వికెట్‌కు 101 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరడంతో పాటు షహబాజ్ అహ్మద్ (16; 2 ఫోర్లు) అవుట్ అవడంతో... మ్యాచ్ మరోసారి సౌరాష్ట్ర వైపుకు మళ్లింది. ఈ దశలో జతకట్టిన అనుస్తుప్, అర్నబ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తాను ఇచ్చిన క్యాచ్‌ను మొదటి స్లిప్‌లో ఉన్న హార్విక్ దేశాయ్ నేలపాలు చేయడంతో బతికి బయటపడ్డ అనుస్తుప్... ఆ తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అర్నబ్‌తో కలిసి ఏడో వికెట్‌కు అభేద్యంగా 91 పరుగులు జోడించాడు. నేడు జరిగే ఆఖరి రోజు ఆటలో బెంగాల్ 72 పరుగులు సాధిస్తే... 30 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలుస్తుంది. చివరిసారిగా 1989–90 సీజన్లో బెంగాల్ టైటిల్ సాధించింది. అయితే పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటం... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉండటం బెంగాల్ చారిత్రక విజయానికి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. -
అర్పిత్ సెంచరీ: సౌరాష్ట్ర 384/8
రాజ్‌కోట్: అర్పిత్ వసవాడా (287 బంతుల్లో 106; 11 ఫోర్లు) అద్భుత సెంచరీ... చతేశ్వర్ పుజారా (237 బంతుల్లో 66; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్... వెరసి బెంగాల్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 206/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర ఆట ముగిసే సమయానికి 160 ఓవర్లలో 8 వికెట్లకు 384 పరుగులు చేసింది. తొలి రోజు అస్వస్థత కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన పుజారా రెండో రోజు మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అర్పిత్‌తో కలిసి పుజారా సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ రెండు సెషన్లపాటు ఆడటంతోపాటు ఆరో వికెట్‌కు 380 బంతుల్లో 142 పరుగులు జోడించారు. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్లో సెంచరీ చేసిన అర్పిత్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించాడు. ఓవరాల్‌గా రెండో రోజు సౌరాష్ట్ర 79.1 ఓవర్లు ఆడి మూడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు సాధించింది. చివరి సెషన్లో అర్పిత్, పుజారా అవుటైనా అప్పటికే బెంగాల్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం చిరాగ్ జానీ (44 బంతుల్లో 13 బ్యాటింగ్), ధర్మేంద్ర సింగ్ జడేజా (22 బంతుల్లో 13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఫీల్డర్ విసిరిన బంతి తగిలి అంపైర్ విలవిల
రాజ్‌కోట్: రంజీ ట్రోఫీలో భాగంగా సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ షంషుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తొలి రోజు ఆటలో స్వ్కేర్ లెగ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సమయంలో బెంగాల్ ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వచ్చి షంషుద్దీన్ ఉదర భాగంలో బలంగా తాకింది. దాంతో విల్లవిల్లాడిపోయిన అంపైర్ ఫీల్డ్‌లోనే కుప్పకూలిపోయాడు. సౌరాష్ట్ర వికెట్ కోల్పోయిన తర్వాత బెంగాల్ ఆటగాళ్లు సంబరాలు చేసుకునే క్రమంలో ఓ ఫీల్డర్ బంతిని అంపైర్ వైపు గట్టిగా త్రో విసిరాడు.(జడేజాకు బీసీసీఐ నో పర్మిషన్..!) అది కాస్తా వెళ్లి అంపైర్‌కు తగిలింది. ఆ ఊహించని పరిణామంతో గాయపడ్డ అంపైర్ ఫీల్డ్‌లో నిలబడలేకపోయాడు. దాంతో అతను ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అతని స్థానంలో టీవీ అంపైర్‌గా వ్యవహరిస్తున్న ఎస్ రవి..తొలి రోజు ఆట ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, అదే సమయంలో షంషుద్దీన్ టీవీ అంపైర్‌గా చేశాడు. కాగా, ఈ రోజు ఆటలో స్థానిక అంపైర్ పీయూష్ కక్కర్ స్వ్కేర్ లెగ్ అంపైర్‌గా విధులు నిర్వర్తించాడు. అయితే బుధవారం మూడో రోజు ఆటలో షంషుద్దీన్ స్థానంలో యశ్వంత్ బద్రి ఫీల్డ్ అంపైర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అంపైర్ షంషుద్దీన్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారం రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దాంతో రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ నుంచి షంషుద్దీన్ వైదొలిగాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 8 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది.అర్పిత్ వసవాడా(106) సెంచరీ చేయగా, చతేశ్వర్ పుజారా(66), బరోత్(54), విశ్వరాజ్ జడేజా(54)లు హాఫ్ సెంచరీలు సాధించారు.(21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు..) -
సౌరాష్ట్ర 206/5
రాజ్‌కోట్: తొలిసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా అవతరించాలని ఆశిస్తున్న సౌరాష్ట్ర జట్టు శుభారంభాన్ని అనుకూలంగా మల్చుకోలేకపోయింది. మాజీ చాంపియన్ బెంగాల్‌తో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు సాధించింది. భారత స్టార్ క్రికెటర్, సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా జ్వరంతో బాధపడుతుండటంతో... ఆరో నంబర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 24 బంతులు ఆడి ఐదు పరుగులు చేశాక అస్వస్థతతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రెండో రోజు పుజారా బ్యాటింగ్‌కు వస్తాడని సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ తెలిపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌరాష్ట్రకు ఓపెనర్లు హార్విక్ దేశాయ్ (111 బంతుల్లో 38; 5 ఫోర్లు), అవీ బారోట్ (142 బంతుల్లో 54; 6 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు. బెంగాల్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో నిలదొక్కుకున్న ఈ జంట తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించింది. హార్విక్‌ను అవుట్ చేసి స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అవీ బారోట్‌ను ఆకాశ్‌దీప్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత విశ్వరాజ్‌సింగ్ జడేజా (92 బంతుల్లో 54; 7 ఫోర్లు), అర్పిత్ (94 బంతుల్లో 29 బ్యాటింగ్; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో సౌరాష్ట్ర స్కోరు 150 దాటింది. చివరి సెషన్లో బెంగాల్ పేస్ బౌలర్ ఆకాశ్‌దీప్ విజృంభించడంతో సౌరాష్ట్ర మూడు వికెట్లను కోల్పోయింది. సంక్షిప్త స్కోర్లు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 206/5 (80.5 ఓవర్లలో) (హార్విక్ దేశాయ్ 38, అవీ బారోట్ 54, విశ్వరాజ్‌సింగ్ జడేజా 54, అర్పిత్ 29 బ్యాటింగ్, షెల్డన్ జాక్సన్ 14, చేతన్ సకారియా 4, ఆకాశ్‌దీప్ 3/41); బెంగాల్‌తో మ్యాచ్. -
జడేజాకు బీసీసీఐ నో పర్మిషన్..!
రాజ్‌కోట్: రంజీ ట్రోఫీ ఫైనల్లో తమ స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆడటానికి అనుమతి ఇవ్వాలన్న సౌరాష్ట్ర అభ్యర్థనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తిరస్కరించింది. ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్లో భాగంగా సౌరాష్ట్ర ఫైనల్‌కు అర్హత సాధించిన నేపథ్యంలో జడేజా ఆడటానికి అనుమతించాలని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎస్సీఏ) కోరింది. కాగా, దీన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తిరస్కరించారు. దేశానికి ఆడటమే తొలి ప్రాధాన్యత పాలసీ కింద జడేజాను రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడటానికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై సౌరాష్ట క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా అసహనం వ్యక్తం చేశారు. కనీసం స్టార్ ఆటగాళ్లను రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లు ఆడటానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ‘ జడేజాను సౌరాష్ట్ర జట్టులో తీసుకోవడానికి బీసీసీఐ పర్మిషన్ కోరా. కానీ గంగూలీ దాన్ని తిరస్కరించాడు. ‘కంట్రీ ఫస్ట్ పాలసీ’ కింద జడేజా రంజీ ఫైనల్ మ్యాచ్ ఆడటానికి అనమతి ఇవ్వలేదు. రంజీ ట్రోఫీ ఫైనల్ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు అనేవి ఉండకూడదు. దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇస్తే అప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండకూడదు. రంజీ ట్రోఫీ ఫైనల్ జరిగే సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ ఉంది. నేను బీసీసీఐని ఒకటే అడగదల్చుకున్నా. ఐపీఎల్ జరిగేటప్పుడు ఏమైనా అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారా. అది డబ్బును తెచ్చిపెడుతుంది కాబట్టి అప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు పెట్టడం లేదు. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పుడే రంజీ ట్రోఫీ మరింత ఫేమస్ అవుతుంది. కనీసం ఫైనల్స్‌లోనైనా స్టార్ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వండి. రంజీ ఫైనల్స్ జరిగేటప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లు షెడ్యూల్లో ఉండకూడదు’ అని షా సూచించారు. తమ జట్టు తరఫున ఆడటానికి జడేజాని కోరుతున్నామని, అదే సమయంలో మహ్మద్ షమీ బెంగాల్ తరఫున ఆడాలని కూడా తాము కోరుకుంటున్నామన్నారు. (21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు..) మార్చి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ సౌరాష్ట్ర-బెంగాల్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా రంజీ ట్రోఫీ ఫైనల్ జరుగనుంది. అదే సమయంలో భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటించనుంది. మార్చి 12వ తేదీన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. ఆ నేపథ్యంలో జడేజా రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడటానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. టీమిండియా తరఫున జడేజా కీలక ఆటగాడు కాబట్టి అతనికి రంజీ ఫైనల్స్‌కు అనుమతి లభించలేదు. దీన్నే ప్రశ్నిస్తున్నారు ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా. ఆ సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ ఏమిటని బీసీసీఐని నిలదీశారు. -
21 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు..
రాజ్‌కోట్: తాజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు కెప్టెన్, పేసర్ జయదేవ్ ఉనాద్కత్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. గుజరాత్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఉనాద్కత్ సంచనల ప్రదర్శన నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు సాధించి గుజరాత్‌ను కట్టడి చేసిన ఉనాద్కత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ రంజీ సీజన్లో ఉనాద్కత్ తీసిన వికెట్ల సంఖ్య 65కు చేరింది. ఫలితంగా ఒక రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్‌గా ఉనాద్కత్ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 1998-99 సీజన్లో కర్ణాటక పేస్ బౌలర్ దొడ్డా గణేశ్ నెలకొల్పిన 62 వికెట్ల రికార్డును ఉనాద్కత్ బద్ధలు కొట్టాడు. ఈ జాబితాలో బెంగాల్‌కు చెందిన రణదేబ్ బోస్ 57 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా, హరియాణాకు చెందిన హర్షల్ పటేల్ 52 వికెట్లతో నాల్గో స్థానంలో ఉన్నాడు. (13 ఏళ్ల తర్వాత... రంజీ ఫైనల్లో బెంగాల్) మాజీ చాంపియన్ గుజరాత్‌తో బుధవారం ముగిసిన ఐదు రోజుల సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టు 92 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దాంతో వరుసగా రెండో ఏడాది కూడా ఫైనల్‌కు చేరింది. 327 పరుగుల లక్ష్యంతో... ఓవర్‌నైట్ స్కోరు 7/1తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్‌ను జైదేవ్ ఉన్కాదట్ దెబ్బ తీశాడు. జైదేవ్ ధాటికి గుజరాత్ రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పార్థివ్ పటేల్ (148 బంతుల్లో 93; 13 ఫోర్లు), చిరాగ్ గాంధీ (139 బంతుల్లో 96; 16 ఫోర్లు) త్రుటిలో సెంచరీలు కోల్పోయారు. వీరిద్దరిని జైదేవ్ ఉనాద్కట్ అవుట్ చేశాడు. ఈనెల 9 నుంచి రాజ్‌కోట్‌లో మొదలయ్యే ఫైనల్లో బెంగాల్‌తో సౌరాష్ట్ర తలపడుతుంది. -
ఆంధ్ర సెమీస్ ఆశలు ఆవిరి!
సాక్షి, ఒంగోలు: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో తొలిసారి సెమీస్ చేరాలన్న ఆంధ్ర జట్టు ఆశలు దాదాపు ఆవిరి అయ్యాయి. ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజి మైదానంలో సౌరాష్ట్రతో జరగుతోన్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆంధ్ర నిరాశాజనక బ్యాటింగ్‌తో 78.2 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. దాంతో ప్రత్యర్థి జట్టుకు 283 పరుగుల భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను ఆంధ్ర ‘డ్రా’ చేసుకున్నా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోవడంతో సెమీస్ వెళ్లే అవకాశం ఉండదు. ఓవర్‌నైట్ స్కోరు 40/2తో శనివారం ఆట కొనసాగించిన ఆంధ్ర ఏ దశలోనూ కుదురుగా ఆడుతున్నట్లు కనిపించలేదు. ఓపెనర్ జ్ఞానేశ్వర్ (43; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా యెర్రా పృథ్వీరాజ్ బ్యాటింగ్‌కు దిగలేదు. ఆంధ్ర తమ చివరి ఏడు వికెట్లను 43 పరుగుల తేడాతో కోల్పోయింది. జైదేవ్ ఉనాద్కట్ (4/42), ధర్మేంద్ర సింగ్ జడేజా (3/27) ఆకట్టుకున్నారు. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా సౌరాష్ట్ర బ్యాటింగ్‌కే మొగ్గు చూపింది. ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లలో 2 వికెట్లకు 93 పరుగులు చేసింది. ఫలితంగా 376 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం అవి బరోట్ (44 బ్యాటింగ్; 6 ఫోర్లు), విశ్వరాజ్ జడేజా (35 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల సంక్షిప్త స్కోర్లు ►బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 332 ఆలౌట్; ఒడిశా తొలి ఇన్నింగ్స్: 250 ఆలౌట్; బెంగాల్ రెండో ఇన్నింగ్స్: 79/2 (45 ఓవర్లలో). ►గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 602/8 డిక్లేర్డ్; గోవా తొలి ఇన్నింగ్స్: 173 ఆలౌట్; గుజరాత్ రెండో ఇన్నింగ్స్: 158/1 (48 ఓవర్లలో). ►కర్ణాటక తొలి ఇన్నింగ్స్: 206 ఆలౌట్; జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 88/2 (34 ఓవర్లలో). -
సౌరాష్ట్ర 419 ఆలౌట్
సాక్షి, ఒంగోలు: తొలి రోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్లు రెండో రోజు లయ తప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ చిరాగ్ జానీ (121; 12 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో... ఇక్కడి సీఎస్ఆర్ శర్మ కాలేజి మైదానంలో జరుగుతోన్న రంజీ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 226/6తో శుక్రవారం ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర చివరి 4 వికెట్లకు మరో 193 పరుగులు జోడించింది. ప్రేరక్ మన్కడ్ (80; 8 ఫోర్లు) రాణించాడు. యెర్రా పృథ్వీరాజ్, కేవీ శశికాంత్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం జ్ఞానేశ్వర్ (22 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఆంధ్ర మరో 379 పరుగులు వెనుకబడి ఉంది. -
హైదరాబాద్ బోణీ
ఆలూరు (బెంగళూరు): దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ బోణీ కొట్టింది. శనివారం సౌరాష్ట్రతో మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (98 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ (74 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. సారథి అంబటి రాయుడు (17) నిరాశపరిచాడు. చివర్లో బవనక సందీప్ (38; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుతో జట్టు 250 పరుగుల మార్కు దాటింది. అనంతరం సందీప్ బౌలింగ్‌తో సౌరాష్ట్రను కుప్పకూల్చాడు. 9.1 ఓవర్లు వేసిన అతడు 26 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 131 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్భారీ శతకం బెంగళూరు వేదికగా కేరళతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ భారీ శతకం (122 బంతుల్లో 133; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కదంతొక్కాడు. మొదట కర్ణాటక రాహుల్, మనీశ్ పాండే (50) రాణించడంతో 49.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. కేరళ 46.4 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ విష్ణు వినోద్ (104), సంజూ శామ్సన్ (67) మినహా మరెవరూ నిలవకపోవడంతో 123 పరుగుల తేడాతో ఓడింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబైపై చత్తీస్‌గఢ్ 5 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలుత ముంబై 50 ఓవర్లలో 317 పరుగులు చేయగా... చత్తీస్‌గఢ్ బంతి మిగిలి ఉండగానే 318 పరుగులు చేసింది. -
బీసీసీఐని నిలదీసిన క్రికెటర్
న్యూఢిల్లీ: తానేమీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)ని ప్రశ్నించడం లేదంటూనే ఉతికి ఆరేశాడు సౌరాష్ట్ర రంజీ క్రికెటర్ షెల్డాన్ జాక్సన్. గత కొన్నేళ్లుగా సౌరాష్ట్ర ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ తమ జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడాన్ని తప్పుబట్టాడు. ‘ మీకు మా ఆటగాళ్లు ప్రదర్శన కనబడలేదా.. లేక చిన్న జట్టే కదా అని మాపై చిన్నచూపా. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరాం. కానీ మా జట్టు నుంచి ఏ ఒక్క ఆటగాడ్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కనీసం ‘ఏ’ సిరీస్‌లకు మమ్మల్ని ఎంపిక చేయడం లేదు. ఇదేనా మీరు రంజీ ట్రోఫీ ఫైనల్స్‌కు ఇచ్చే ప్రాముఖ్యత. గత ఐదేళ్ల నుంచి చిన్న రాష్ట్రాల జట్లకు ఆడుతున్న వారిని పరిగణలోకి తీసుకోవడం లేదు.. ఇప్పటికీ మమ్మల్ని అలానే చూస్తున్నారా. ఇప్పటివరకూ సితాన్షు కోటక్స్ కోచింగ్‌లో సౌరాష్ట్ర మూడు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మా జట్టులో బ్యాట్, బంతితో మెరిసే ఆటగాళ్లు ఉన్నారు. కానీ మాకు దక్కే గౌరవం దక్కడ లేదు. ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కాదు.. కేవల అడుగుతున్నానంతే’ అని వరుస పెట్టి ట్వీట్ల వర్షం కురిపించాడు షెల్డాన్ జాక్సన్. సౌరాష్ట్ర తరఫున ప్రతిభ చాటుకుంటున్న క్రికెటర్లలో జాక్సన్ ఒకడు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సుమారు 50 సగటుతో దూసుకుపోతున్నాడు. స్వతహాగా వికెట్ బాట్స్మన్ అయిన జాక్సన్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్ కూడా ఆడాడు. -
విదర్భ విజయ దర్పం
సాదాసీదా జట్టుగా గత సీజన్ బరిలో దిగి రంజీ ట్రోఫీని కైవసం చేసుకున్న విదర్భ... అదే అద్భుతాన్ని పునరావృతం చేసింది. నాలుగో ఇన్నింగ్స్ పోరాటాలతో ఫైనల్‌కు చేరిన సౌరాష్ట్రకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ట్రోఫీని మరోసారి ఒడిసిపట్టింది. తద్వారా తమ విజయ ప్రస్థానం గాలివాటం కాదని నిరూపించింది. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీని నెగ్గాలన్న సౌరాష్ట్ర కల మూడోసారి చెదిరిపోయింది. నాగ్‌పూర్: విజయంపై ఏమూలనో ఉన్న సౌరాష్ట్ర ఆశలను వమ్ము చేస్తూ... డిఫెండింగ్ చాంపియన్ విదర్భ 2018–19 సీజన్ రంజీ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. గురువారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 58/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర 127 పరుగులకు ఆలౌటైంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆదిత్య సర్వతే (6/59), ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (3/37) ప్రత్యర్థి పనిపట్టారు. మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు పడగొట్టడంతో పాటు, రెండో ఇన్నింగ్స్‌లో విలువైన 49 పరుగులు చేసిన సర్వతేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. వారిద్దరి పోరాటం కాసేపే... చేతిలో ఉన్న ఐదు వికెట్లతో గెలుపునకు 148 పరుగులు చేయాల్సిన స్థితిలో గురువారం మైదానంలో దిగిన సౌరాష్ట్ర కాసేపు ప్రతిఘటించింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ విశ్వరాజ్ జడేజా (137 బంతుల్లో 52; 6 ఫోర్లు), కమలేశ్ మక్వానా (45 బంతుల్లో 17; 2 ఫోర్లు) ఆశలు రేపారు. దాదాపు 15 ఓవర్లు క్రీజులో నిలిచిన వీరు ఆరో వికెట్‌కు 33 పరుగులు జత చేశారు. కానీ, మక్వానాను ఔట్ చేసిన సర్వతే ఈ జోడీని విడగొట్టాడు. ఆ వెంటనే ప్రేరక్ మన్కడ్ (2)ను అక్షయ్ పెవిలియన్ పంపాడు. జట్టు స్కోరు 103 వద్ద విశ్వరాజ్ను సర్వతే ఎల్బీడబ్ల్యూ చేయడంతో సౌరాష్ట్ర ఓటమి ఖాయమైంది. ధర్మేంద్ర జడేజా (17), కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (7) వికెట్లను ఆరు పరుగుల తేడాతో పడగొట్టి విదర్భ జయకేతనం ఎగురవేసింది. సంక్షిప్త స్కోర్లు విదర్భ తొలి ఇన్నింగ్స్: 312 (కర్నెవార్ 73; అక్షయ్ వాద్కర్ 45; ఉనాద్కట్ 3/54, సకారియా 2/44); రెండో ఇన్నింగ్స్: 200 (సర్వతే 49, మోహిత్ కాలే 38; ధర్మేంద్ర జడేజా 6/96, మక్వానా 2/51). సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్: 307 (స్నెల్ పటేల్ 102, ఉనాద్కట్ 46; సర్వతే 5/98, వాఖరే 4/80) రెండో ఇన్నింగ్స్: 127 (విశ్వరాజ్ జడేజా 52; సర్వతే 6/59, వాఖరే 3/37). ►6 రంజీ ట్రోఫీని వరుసగా రెండో ఏడాది గెలుచుకున్న ఆరో జట్టుగా విదర్భ గుర్తింపు పొందింది. గతంలో ముంబై, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్ ఈ ఘనత సాధించాయి. వీటిలో ముంబై ఆరు సార్లు వరుసగా రెండేసి, ఒక సారి వరుసగా మూడు టైటిల్స్ సాధించడంతో పాటు 1958–59 సీజ¯Œ నుంచి 1972–73 వరకు వరుసగా 15 సార్లు నెగ్గడం విశేషం. కర్ణాటక రెండు సార్లు వరుసగా రెండు టైటిల్స్ గెలుచుకుంది. ► 10 వసీం జాఫర్ 10వ రంజీ టైటిల్ విజయంలో భాగమయ్యాడు. ముంబై తరఫున 8 సార్లు, విదర్భ తరఫున 2 సార్లు అతను గెలిచాడు. -
మళ్లీ వారిదే రంజీ టైటిల్
నాగ్‌పూర్: రంజీట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన విదర్భ టైటిల్‌ను నిలబెట్టుకుంది. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ 78 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విదర్భ విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర తన రెండో ఇన్నింగ్స్‌లో 127 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. దాంతో టైటిల్‌ను సాధించే అవకాశాన్ని కోల్పోయింది. విదర్భ బౌలర్లలో స్పిన్నర్ ఆదిత్య సర్వతే ఆరు వికెట్లతో సౌరాష్ట పతనాన్నిశాసించాడు. అతనికి జతగా అక్షయ్ వాఖరే మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్ వికెట్ తీశాడు. సౌరాష్ట్ర ఆటగాళ్లలో విశ్వరాజ్ జడేజా(52) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు సాధారణ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలబడింది. నలుగురు మాత్రమే నాలుగు అంకెల స్కోరును దాటడంతో సౌరాష్ట్రకు పరాజయం తప్పలేదు. అంతకుముందు విదర్భ తన రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేసింది. దాంతో విదర్భకు తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఐదు పరుగుల ఆధిక్యంతో 205 పరుగుల్ని బోర్డుపై ఉంచింది. ఆదిత్య సర్వతే (49), గణేశ్ సతీష్(35), మోహిత్ కాలే(38)లు క్లిష్ట దశలో మెరిసి జట్టు స్కోరును రెండొందలకు చేర్చారు. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌరాష్ట్ర 55 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర మరో 69 పరుగులు చేసి మిగతా వికెట్లను చేజార్చుకోవడంతో సౌరాష్ట ఓటమి పాలైంది. -
విదర్భ... విజయం ముంగిట
సౌరాష్ట్రకు రంజీ ఫైనల్ మరో‘సారీ’ చెప్పేసింది. పరాజయానికి బాట వేసింది. విదర్భ వరుసగా విజయగర్వానికి సిద్ధమైంది. కీలకమైన పుజారాను డకౌట్ చేయడంతోనే మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న విదర్భ... ప్రత్యర్థి 60 పరుగులైనా చేయకముందే సగం వికెట్లను పడగొట్టింది. నాగ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ విదర్భ రంజీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సై అంటోంది. భారత స్టార్ చతేశ్వర్ పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక విలవిల్లాడుతోంది. విదర్భ చాంపియన్‌షిప్‌కు ఐదు వికెట్ల దూరంలో ఉంటే... లోయర్ ఆర్డర్, టెయిలెండేర్లే ఉన్న సౌరాష్ట్ర ఇంకా 148 పరుగులు చేయాల్సివుంది. విదర్భను ఆదిత్య సర్వతే తన ఆల్‌రౌండ్ షోతో నిలబెట్టాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌లో విఫలమైన విదర్భ బౌలింగ్‌లో జూలు విదిల్చింది. మొత్తానికి బుధవారం ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ముందుగా 55/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 92.5 ఓవర్లలో 200 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదిత్య సర్వతే (49; 5 ఫోర్లు) ఒక్కడే ప్రత్యర్థి బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్ ధర్మేంద్రసింగ్ జడేజా (6/96) స్పిన్ ఉచ్చులో 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన విదర్భను టెయిలెండర్ ఆదిత్య 200 పరుగుల దాకా లాక్కొచ్చాడు. మోహిత్ కాలే 38, గణేశ్ సతీశ్ 35 పరుగులు చేశారు. కమలేశ్ మక్వానాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్రను సర్వతే (3/13)స్పిన్‌తో కొట్టాడు. ఓపెనర్లు హర్విక్ దేశాయ్ (8), స్నెల్ పటేల్ (12)లతో పాటు పుజారా (0)ను ఖాతా తెరువకుండానే సాగనంపాడు. క్వార్టర్స్, సెమీస్‌లో జట్టును నడిపించిన పుజారా ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఒక పరుగే చేశాడు. అర్పిత్ వాసవద (5)ను ఉమేశ్, షెల్డన్ జాక్సన్ (7)ను అక్షయ్ వఖారే పెవిలియన్ చేర్చడంతో సౌరాష్ట్ర 55 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి విశ్వరాజ్ జడేజా (23 బ్యాటింగ్, 3 ఫోర్లు), కమలేశ్ మక్వానా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
హోరాహోరీగా రంజీ ఫైనల్
నాగపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తుది సమరం ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం విదర్భకు దీటుగా సమాధానమిచ్చిన సౌరాష్ట్ర చివర్లో తడబడింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 5 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 158/5తో ఆట కొనసాగించిన సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ స్నెల్ పటేల్ (209 బంతుల్లో 102; 15 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే జట్టు లోయర్ ఆర్డర్ పట్టుదలగా ఆడటంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి చేరువగా రాగలిగింది. 7 నుంచి 11వ బ్యాట్స్‌మెన్ వరకు చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (101 బంతుల్లో 46; 4 ఫోర్లు)తో పాటు ప్రేరక్ మన్కడ్ (62 బంతుల్లో 21; 2 ఫోర్లు), కమలేశ్ మక్వానా (61 బంతుల్లో 27; 3 ఫోర్లు), ధర్మేంద్ర జడేజా (32 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), చేతన్ సకరియా (82 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. వీరందరూ కలిసి 145 పరుగులు చేయడం విశేషం. ముఖ్యంగా పదునైన బౌలింగ్‌తో ఉమేశ్ యాదవ్... ప్రధాన బ్యాట్స్‌మన్ స్నెల్ పటేల్‌ను ఔట్ చేసిన తర్వాత సౌరాష్ట్ర చివరి మూడు వికెట్లకు 123 పరుగులు జోడించగలిగింది. ఆఖరి వికెట్‌కు ఉనాద్కట్, మక్వానా 60 పరుగులు జత చేశారు. విదర్భ స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (5/98), అక్షయ్ వాఖరే (4/80) జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో కీలక పాత్ర పోషించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో విదర్భ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. రామస్వామి సంజయ్ (16), ఫైజ్ ఫజల్ (10) ఔట్ కాగా... గణేశ్ సతీశ్ (24 బ్యాటింగ్), వసీం జాఫర్ (5 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ధర్మేంద్ర జడేజాకే ఈ 2 వికెట్లు దక్కాయి. పిచ్‌పై పగుళ్లు ఏర్పడి అనూహ్యంగా స్పందిస్తున్న స్థితిలో నాలుగో రోజు ధర్మేంద్ర జడేజా బౌలింగ్ కీలకం కానుంది. ప్రస్తుతం 60 పరుగుల ఆధిక్యంలో ఉన్న విదర్భ గట్టిగా నిలబడి ప్రత్యర్థికి ఎంత లక్ష్యం నిర్దేశిస్తుందో చూడాలి. మరోవైపు క్వార్టర్ ఫైనల్లో యూపీపై 372 పరుగులు, సెమీస్‌లో కర్ణాటకపై 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సౌరాష్ట్ర...మరోసారి నాలుగో ఇన్నింగ్స్‌లో బాగా ఆడగలమనే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. -
రెండో రోజు విదర్భ జోరు
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ పడి...లేచింది. రెండో రోజు ఇటు పరుగులతో అటు వికెట్లతో పట్టుబిగించింది. సౌరాష్ట్రను కష్టాల్లో పడేసింది. స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (3/55), అక్షయ్ వఖారే (2/42) ప్రత్యర్థి టాపార్డర్‌ను తమ మాయలో పడేశారు. వఖారే ముందుగా బ్యాట్‌తో, తర్వాత బౌలింగ్‌తో విదర్భ జోరుకు ఊపిరిపోశాడు. సౌరాష్ట్ర కష్టాలు పెంచాడు. రెండో రోజు 200/7 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. చేతిలో ఉన్న టెయిలెండర్లతోనే ఏకంగా 112 పరుగులు జతచేసింది విదర్భ. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ అక్షయ్ కర్నేవార్ (73 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), వఖారే (34; 3 ఫోర్లు) తొలి సెషనంతా మొండిగా పోరాడారు. ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. వఖారే నిష్క్రమణ తర్వాత ఉమేశ్ యాదవ్ (13), గుర్బానీ (6)ల అండతో కర్నేవార్ జట్టు స్కోరును 300 దాటించాడు. ఉనాద్కట్ 3, చేతన్ సాకరియా, కమలేశ్ మక్వానా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన సౌరాష్ట్రను స్పిన్నర్లు ఆదిత్య సర్వతే, వఖారే ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ స్నెల్ పటేల్ (87 బ్యాటింగ్; 14 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కీలక బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (1) సహా, మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ (10), విశ్వరాజ్ జడేజా (18), అర్పిత్ (13), షెల్డన్ జాక్సన్ (9) ప్రత్యర్థి స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో సౌరాష్ట్ర 131 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి స్నెల్ పటేల్‌తో పాటు ప్రేరక్ మన్కడ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సౌరాష్ట్ర ఇంకా 154 పరుగుల వెనుకంజలో ఉంది. -
విదర్భ 200/7
నాగ్‌పూర్: సౌరాష్ట్ర బౌలర్లు తొలిరోజు ఆటను శాసించారు. రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో నిలువకుండా దెబ్బమీద దెబ్బ కొట్టారు. సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (2/26) విదర్భ టాప్ లేపాడు. కీలకమైన విదర్భ ‘రన్ మెషీన్’ వసీమ్ జాఫర్ (23; 1 ఫోర్, 1 సిక్స్)తో పాటు ఓపెనర్ సంజయ్ (2)ను ఔట్ చేశాడు. మిగతా బౌలర్లు తలా ఒక చేయి వేశారు. దీంతో ఆదివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొదట టాస్ నెగ్గిన విదర్భ బ్యాటింగ్ ఎంచుకుంది. సంజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (16) శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఫజల్ రనౌట్ కాగా, ఉనాద్కట్ బౌలింగ్‌లో సంజయ్, జాఫర్ నిష్క్రమించడంతో విదర్భ 60 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన వారిలో మోహిత్ కాలే (35; 4 ఫోర్లు), గణేశ్ సతీశ్ (32; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు నిలబడటంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత సౌరాష్ట్ర బౌలర్లు మూకుమ్మడిగా పట్టుబిగించడంతో విదర్భ ఇన్నింగ్స్ కకావికలమైంది. జట్టు స్కోరు 106 పరుగుల వద్ద మోహిత్ కాలేను స్పిన్నర్ కమలేశ్ మక్వానా, సతీశ్‌ను మీడియం పేసర్ ప్రేరక్ మన్కడ్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. ఇది చాలదన్నట్లు క్రీజులో పాతుకుపోతున్న అక్షయ్ వాడ్కర్ (45)ను చేతన్ సాకరియా సాగనంపాడు. దీంతో 33 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి అక్షయ్ కర్నేవర్ (31 బ్యాటింగ్), అక్షయ్ వఖరే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
రంజీ ఫైనల్లో సౌరాష్ట్ర
బెంగళూరు: పుజారా (131 నాటౌట్; 17 ఫోర్లు) అజేయ పోరాటంతో సౌరాష్ట్రను రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేర్చాడు. ఈ దేశవాళీ చాంపియన్‌షిప్‌లో సౌరాష్ట్ర టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇది మూడోసారి. సోమవారం ముగిసిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. ఆఖరి రోజు మిగతా 55 పరుగుల లాంఛనాన్ని మరో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 224/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలిచింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ ( 100; 15 ఫోర్లు) సెంచరీ చేసిన వెంటనే నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన అర్పిత్ (12) త్వరగానే ఔట్ కావడంతో... ప్రేరక్ మన్కడ్ (4 నాటౌట్)తో కలిసి జాగ్రత్తగా ఆడిన పుజారా సౌరాష్ట్రను గెలుపు తీరానికి చేర్చాడు. వినయ్ కుమార్‌కు 3 వికెట్లు దక్కాయి. వచ్చే నెల 3 నుంచి 7 వరకు జైపూర్‌లో జరిగే ఫైనల్లో సౌరాష్ట్ర జట్టు డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో తలపడుతుంది. -
పుజారా అజేయ శతకం
బెంగళూరు: రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర ఫైనల్‌కు చేరింది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో సౌరాష్ట్ర ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత పొందింది. సౌరాష్ట్ర ఆటగాడు చతేశ్వర్ పుజారా(131 నాటౌట్; 266 బంతుల్లో 17 ఫోర్లు) అజేయంగా శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా షెల్డాన్ జాక్సన్(100 ; 217 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీ సాధించడంతో సౌరాష్ట్ర ఘన విజయం నమోదు చేసింది. 224/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర.. మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక విసిరిన 279 పరుగుల లక్ష్య ఛేదనలో సౌరాష్ట్రకు ఆదిలోనే షాక్ తగిలింది. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో పుజారా-జాక్సన్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి నాల్గో వికెట్‌కు 214 పరుగులు జోడించిన తర్వాత జాక్సన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పుజారా మరింత బాధ్యతాయుతంగా ఆడటంతో సౌరాష్ట్ర ఐదో రోజు ఆట తొలి సెషన్లోనే విజయాన్ని అందుకుంది. ఫలితంగా రంజీ ట్రోఫీలో మూడోసారి ఫైనల్‌కు చేరింది. డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో అమీతుమీ తేల్చుకోనుంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో ఇరు జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 275 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 239 ఆలౌట్ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 236 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 279/5 -
7 వికెట్లతో చెలరేగిన ఉమేశ్
వాయనాడ్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీట్రోఫీ 68 ఏళ్ల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్ చేరిన కేరళ ఆనందాన్ని టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ (7/48) ఆవిరి చేశాడు. గురువారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ విదర్భ తరఫున బరిలో దిగిన అతడు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. దీంతో కేరళ మొదటి ఇన్నింగ్స్‌లో 28.4 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. ఏడో నంబర్ బ్యాట్స్‌మన్ విష్ణు వినోద్ (37 నాటౌట్) టాప్ స్కోరర్. ఉమేశ్ ధాటికి... విష్ణు, కెప్టెన్ సచిన్ బేబీ (22), పేసర్ బాసిల్ థంపి (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. రజనీష్ గుర్బానీ (3/38) మిగతా మూడు వికెట్లను పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను కేరళ పేసర్లు సందీప్ వారియర్ (2/46), దినేశన్ నిధీశ్ (2/53) ఇబ్బంది పెట్టారు. అయితే, కెప్టెన్ ఫైజ్ ఫజల్ (75) అర్ధ సెంచరీతో పాటు వెటరన్ వసీం జాఫర్ (34) రాణించడంతో ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆ జట్టుకు ఇప్పటికే 65 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. కర్ణాటక 30/4 నుంచి 264/9కు... బెంగళూరు: మరో సెమీస్‌లో సౌరాష్ట్ర పేసర్ జైదేవ్ ఉనాద్కట్ (4/50) మెరుపు బౌలింగ్‌కు తొలుత తడబడిన కర్ణాటక తర్వాత నిలదొక్కుకుంది. ఉనాద్కట్... ఓపెనర్లు ఆర్.సమర్థ్ (0), మయాంక్ అగర్వాల్ (2), సిద్ధార్థ్ (12)లను స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేయడం, కరుణ్ నాయర్ (9)ను చేతన్ సకారియా వెనక్కి పంపడంతో కర్ణాటక 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆల్ రౌండర్ శ్రేయస్ గోపాల్ (182 బంతుల్లో 87; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మనీశ్ పాండే (67 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 106 పరుగులు జోడించారు. చివరకు పాండేను ఉనాద్కట్ పెవిలియన్ చేర్చి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ కమలేశ్ మక్వానా (3/73)... శ్రేయస్ గోపాల్‌తో పాటు కృష్ణప్ప గౌతమ్ (2), అభిమన్యు మిథున్ (4) వికెట్లను పడగొట్టినా మరో ఎండ్‌లో వికెట్ కీపర్ శ్రీనివాస్ శరత్ (177 బంతుల్లో 74 బ్యాటింగ్; 11 ఫోర్లు) పట్టుదల చూపి అర్ధ శతకం సాధించాడు. దీంతో కర్ణాటక 264/9తో రోజును ముగించింది. -
రికార్డ్ రన్స్ చేసి.. ప్రేమలోనూ నెగ్గి..
సాక్షి, న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో, టి20 టోర్నీ ముస్తాక్ అలీలో టైటిల్ పోరులో చతికిలపడ్డ కర్ణాటక జట్టు వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని సొంతం చేసుకుంది. మంగళవారం సౌరాష్ట్రతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 41 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (79 బంతుల్లో 90; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు టైటిల్ అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు. విజయ్ హజారే ట్రోఫీ నెగ్గి సీజన్‌కు అద్భుత ముగింపు ఇవ్వడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ తాను విజయం సాధించినట్లు మయాంక్ అంటున్నాడు. ‘ఈ సీజన్ నాకెంతో కలిసొచ్చింది. నా ప్రియురాలికి ప్రేమ విషయం చెప్పి, లవ్ ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె ఒప్పుకుంది. మరోవైపు విజయ్ హజారే ఓ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెరీర్ పరంగా రాణించినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్ ఇన్నింగ్స్‌కుగానూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నానని’ పలు విషయాలు మయాంక్ షేర్ చేసుకున్నట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రేయసి వివరాలు లాంటివి మాత్రం క్రికెటర్ వెల్లడించలేదని తెలుస్తోంది. మయాంక్ పరుగుల రికార్డు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా మయాంక్ రికార్డు సృష్టించాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 723 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు 607 పరుగులతో (2016–17) దినేశ్ కార్తీక్ పేరిట ఉండేది. దేశవాళీ క్రికెట్ ఒకే సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గానూ మయాంక్ (2,141 పరుగులు) గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (1,947 పరుగులు; 2015–16) పేరిట ఉండేది. -
కర్ణాటకదే విజయహాసం
న్యూఢిల్లీ: టెస్టు ఫార్మాట్ రంజీ ట్రోఫీలో, టి20 టోర్నీ ముస్తాక్ అలీలో చక్కగా ఆడినా అదృష్టం కలిసిరాక టైటిల్ గెలవలేకపోయిన కర్ణాటక... వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని మాత్రం ఒడిసిపట్టింది. తద్వారా ఈ సీజన్లో తమ అత్యద్భుత ఆటకు సరైన ముగింపునిచ్చింది. మంగళవారం సౌరాష్ట్రతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 41 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 45.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (79 బంతుల్లో 90; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన ఇన్నింగ్స్‌కు తోడు, సమర్థ్ (65 బంతుల్లో 48; 1 ఫోర్, 1 సిక్స్); దేశ్‌పాండే (60 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లలో కమలేశ్ మక్వానా (4/34); ప్రేరక్ మన్కడ్ (2/54) ఆకట్టుకున్నారు. లక్ష్య ఛేదనలో కెప్టెన్ చతేశ్వర్ పుజారా (127 బంతుల్లో 94; 10 ఫోర్లు, 1 సిక్స్) మినహా మరెవరూ నిలవకపోవడంతో సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లు ప్రసిధ్ కృష్ణ (3/37), కృష్ణప్ప గౌతమ్ (3/27) రాణించారు. మయాంక్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అతడే ఆడాడు... ఐదు పరుగులకే కెప్టెన్ కరుణ్ నాయర్ (0), కేఎల్ రాహుల్ (0) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన కర్ణాటకను మయాంక్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. సమర్థ్‌తో కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. కుదురుకున్నాక బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. శతకం చేసే ఊపులో కనిపించిన అతడు... ధర్మేంద్ర బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. కొద్దిసేపటికే సమర్థ్ కూడా వెనుదిరిగినా పవన్ దేశ్‌పాండే, శ్రేయస్ గోపాల్ (28 బంతుల్లో 31; 6 ఫోర్లు) విలువైన పరుగులు జోడించారు. అనంతరం పేసర్ ప్రసిద్ధ్ ధాటికి సౌరాష్ట్ర 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కీపర్ బరోట్ (30) అండతో పుజారా అడ్డుగోడలా నిలిచాడు. టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా (15) సహా మన్కడ్ (0), వసవాదా (0), ఉనాద్కట్ (0)ల వైఫల్యంతో సౌరాష్ట్ర కోలుకోలేకపోయింది. జట్టు స్కోరు 200 వద్ద పుజారా రనౌట్‌గా వెనుదిరగడంతో పరాజయం ఖాయమైంది. ఈ మ్యాచ్‌తో కర్ణాటక లెఫ్టార్మ్ పేసర్, 33 ఏళ్ల శ్రీనాథ్ అరవింద్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మయాంక్ రికార్డు విజయ్ హజారే ట్రోఫీ ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా మయాంక్ రికార్డు సృష్టించాడు. అతను 8 మ్యాచ్‌ల్లో 723 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు 607 పరుగులతో (2016–17) దినేశ్ కార్తీక్ పేరిట ఉండేది. దేశవాళీ క్రికెట్ ఒకే సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గానూ మయాంక్ (2,141 పరుగులు) గుర్తింపు పొందాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ముంబై క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (1,947 పరుగులు; 2015–16) పేరిట ఉండేది. -
కర్ణాటక(Vs)సౌరాష్ట్ర
న్యూఢిల్లీ: ఈ సీజన్లో అద్భుత ఆటతీరు కనబరుస్తున్న కర్ణాటక, సంచలనాల సౌరాష్ట్ర మధ్య మంగళవారం ఇక్కడ దేశవాళీ ప్రతిష్ఠాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ జరగనుంది. రెండు జట్ల బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు. టోర్నీలో 633 పరుగులు సాధించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో పాటు కెప్టెన్ కరుణ్ నాయర్, ఆల్‌రౌండర్లతో కర్ణాటక ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా వంటి ఆటగాళ్లున్న సౌరాష్ట్రను తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరుకు అవకాశం ఉంది. ► ఉదయం గం. 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆంధ్ర ఓటమి
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. అజేయంగా సెమీస్ చేరిన ఆంధ్ర ఆదివారం జరిగిన సెమీఫైనల్లో సౌరాష్ట్ర చేతిలో 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ కాగా... ఆంధ్ర 45.3 ఓవర్లలో 196 పరుగులకే పరిమితమై టోర్నీ నుంచి నిష్క్రమించింది. రవీంద్ర జడేజా (56; 4 ఫోర్లు, 1 సిక్స్), అర్పిత్ (58; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సౌరాష్ట్ర గౌరవప్రద స్కోరు చేసింది. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభాలు లభించినా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. భరత్ (29), అశ్విన్ హెబర్ (12), కెప్టెన్ విహారి (25), రికీ భుయ్ (13) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. సుమంత్ (42; 2 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (42) పోరాడినా లాభం లేకపోయింది. మంగళవారం జరిగే ఫైనల్లో కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడుతుంది. -
నాకౌట్ పోరుకు సౌరాష్ట్ర
సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో సౌరాష్ట్ర జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్ ‘డి’ చివరి దశ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌరాష్ట్ర 8 వికెట్ల తేడాతో విదర్భపై ఘనవిజయం సాధించింది. దీంతో రంజీ చాంపియన్స్ విదర్భ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ముందు వరకు గ్రూప్ ‘డి’లో సౌరాష్ట్ర 12 పాయింట్లతో నాలుగో స్థానంలో... విదర్భ, హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్ 16 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే చివరి లీగ్ మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించిన హైదరాబాద్ (20 పాయింట్లు), సౌరాష్ట్ర (16 పాయింట్లు) జట్లు గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు చేరుకోగా... రన్‌రేట్‌లో సౌరాష్ట్రకంటే వెనుకబడ్డ ఛత్తీస్‌గఢ్, విదర్భ వరుసగా మూడు, నాలుగు స్థానాలతో సంతృప్తి పడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు, సందీప్, సిరాజ్ రాణించడంతో హైదరాబాద్ 84 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. అవీ బరోట్ దూకుడు... సికింద్రాబాద్‌లోని ఏఓసీ సెంటర్లో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో సౌరాష్ట్ర జట్టు విదర్భను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విదర్భ 40.5 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. జితేశ్ శర్మ (69 బంతుల్లో 55; 5 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. జితేశ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. సంజయ్ రామస్వామి (29), రవిజాంగిడ్ (22) పరవాలేదనిపించారు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్, శౌర్య సనందియా, ధర్మేంద్రసిన్హ్ జడేజా, కమ్లేశ్ మక్వానా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సౌరాష్ట్ర జట్టు వికెట్ కీపర్ అవీ బరోట్ (114 బంతుల్లో 91 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో 34 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. చతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. విదర్భ బౌలర్లలో గుర్బాని, శ్రీకాంత్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జార్ఖండ్ ఘనవిజయం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మరో గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో జార్ఖండ్ జట్టు 97 పరుగులతో జమ్మూ కశ్మీర్‌పై నెగ్గింది. మొదట జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 296 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ సింగ్ (96; 11 ఫోర్లు) కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఉత్కర్‡్ష సింగ్ (31), సుమిత్ (35) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఉమర్ నజీర్, పర్వేజ్ రసూల్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం జమ్మూ కశ్మీర్ 46 ఓవర్లలోనే 199 పరుగులకు కుప్పకూలింది. జార్ఖండ్ బౌలర్లలో వికాస్ సింగ్, ఆశిష్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో జార్ఖండ్ ఐదో స్థానంలో నిలవగా, జమ్మూ ఆరోస్థానాన్ని దక్కించుకుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సర్వీసెస్ జట్టు చివరిదైన ఏడో స్థానంలో ఉంది. -
సౌరాష్ట్రను గెలిపించిన జడేజా
సాక్షి, హైదరాబాద్: జాతీయ జట్టులో చోటు కోల్పోయిన స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా విజయ్ హజారే ట్రోఫీలో చెలరేగాడు. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్‌తో జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో జడేజా (116 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో సౌరాష్ట్రను గెలిపించాడు. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్ర 48.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసి విజయం సాధించింది. సౌరాష్ట్ర బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప (17 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చతేశ్వర్ పుజారా (44; 6 ఫోర్లు), చిరాగ్ (46 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. ఐదో వికెట్‌కు చిరాగ్‌తో కలిసి జడేజా 114 పరుగులు జతచేశాడు. అంతకుముందు జార్ఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (93; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీని చేజార్చుకున్నాడు. సౌరాష్ట్ర బౌలర్లలో జైదేవ్ ఉనాద్కట్, చిరాగ్, శౌర్య రెండేసి వికెట్లు తీశారు. గ్రూప్ ‘డి’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో ఛత్తీస్‌గఢ్ 45 పరుగులతో విదర్భపై, జమ్మూ కశ్మీర్ ఐదు వికెట్లతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. -
మెరిసిన అక్షత్, రాయుడు
సాక్షి, హైదరాబాద్: విదర్భ చేతిలో ఎదురైన దారుణ ఓటమి నుంచి హైదరాబాద్ జట్టు వెంటనే గుణపాఠం నేర్చుకుంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పటిష్టమైన సౌరాష్ట్రతో శుక్రవారం జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగు వికెట్లతో అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో మూడో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా సౌరాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా... అక్షత్ రెడ్డి (96 బంతుల్లో 94; 10 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (83 బంతుల్లో 76; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విజృంభించడంతో హైదరాబాద్ 49.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసి గెలుపొందింది. హైదరాబాద్ పేసర్ సిరాజ్ (3/46) ధాటికి సౌరాష్ట్ర సీనియర్ ప్లేయర్లు రాబిన్ ఉతప్ప (14), పుజారా (10) జట్టు స్కోరు 37 వద్దే పెవిలియన్ చేరారు. కాసేపటికే రవీంద్ర జడేజా (7) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో సమర్థ్ వ్యాస్ (57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్పిత్ (49; 5 ఫోర్లు), పరేఖ్ మన్కడ్ (62; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో సౌరాష్ట్ర మెరుగైన స్కోరు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ, రవికిరణ్, మెహదీ హసన్, భండారిలకు తలా ఓ వికెట్ దక్కింది. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అక్షత్ రెడ్డి ఆటే హైలైట్. రాయుడుతో కలిసి ధాటిగా ఆడిన అతను త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో ఆకాశ్ భండారి (29 బంతు ల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో మరో మూడు బంతులు మిగిలుండ గానే హైదరాబాద్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆంధ్రను గెలిపించిన రికీ భుయ్ చెన్నై వేదికగా జరుగుతున్న గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర వికెట్ తేడాతో గోవాపై నెగ్గింది. ఈ మ్యాచ్‌లో రికీ భుయ్ (86 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆంధ్ర బౌలర్లు గిరినాథ్ రెడ్డి (4/32), విహారి (2/18), అయ్యప్ప (2/37)ల ధాటికి గోవా 47.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రికీ ఒంటరి పోరాటం చేయడంతో ఆంధ్ర 49.3 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలుపొందింది. -
నితీశ్ ను ఆహ్వానించిన హార్దిక్ పటేల్
పాట్నా: గుజరాత్ లో పటేల్ సామాజికవర్గం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్ మంగళవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను కలిశారు. జనవరి 28న గుజరాత్ లోని సౌరాష్ట్రలో నిర్వహించనున్న సభకు హాజరు కావాలని నితీశ్ కు ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొనేందుకు నితీశ్ అంగీకరించారని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో నిర్వహించనున్న కీలక సభలో నితీశ్ పాల్గొననుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మహారాష్ట్రకు చెందిన మరాఠా క్రాంతి మోర్చా కన్వీనర్ బ్రిగేడియర్ సుధీర్ సామంత్, రాజస్థాన్ కు చెందిన గుజ్జర్ల నాయకుడు హిమ్మత్ సింగ్ ఆహ్వానాల మేరకు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు నితీశ్ కుమార్ అంగీకరించినట్టు త్యాగి తెలిపారు. బిహార్ లో మద్య నిషేధం విధిస్తూ నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని హార్దిక్ పటేల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. -
సౌరాష్ట్రపై ఒడిశా గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఒడిశా బోణీ చేసింది. గ్రూప్-బిలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒడిశా 32 పరుగుల తేడాతో గెలుపొందింది. ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒడిశా బౌలర్ సూర్యకాంత్ ప్రధాన్ (3/37, 5/69) 8 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదివారం 96/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను కొనసాగించిన సౌరాష్ట్ర 101 ఓవర్లలో 179 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ సాగర్ (68) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, లోయర్ ఆర్డర్లో అర్పిత్ వసావ్డా (45) రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ప్రధాన్ బౌలింగ్ ధాటికి విలవిలలాడారు. అతనితో పాటు కీలక సమయంలో ధీరజ్ సింగ్ 2 పడగొట్టగా... దీపక్, సమంత్రే చెరో వికెట్ పడతీశారు. తొలి ఇన్నింగ్సల్లో ఒడిశా 228, సౌరాష్ట్ర 186 పరుగులు చేశాయి. -
షెల్డాన్ జాక్సన్ వీరవిహారం
రాజ్ కోట్:దేశవాళీ లీగ్ మ్యాచ్ ల్లో భాగంగా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో సౌరాష్ట్ర ఓపెనర్ షెల్డాన్ జాక్సన్ వీరవిహారం చేశాడు. గ్రూప్-డిలో భాగంగా శనివారం గోవాతో జరిగిన మ్యాచ్ లో జాక్సన్(150 నాటౌట్; 103 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో సౌరాష్ట్రకు ఘన విజయం సాధించింది. అతనికి జతగా మరో ఓపెనర్ బారోట్ (49 నాటౌట్:56 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. దీంతో సౌరాష్ట్ర 26.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకుంది. ఇంకా 141 బంతులు మిగిలి ఉండగానే సౌరాష్ట్ర గెలుపును సొంతం చేసుకోవడం ఈమ్యాచ్ లో విశేషం. టాస్ గెలిచిన సౌరాష్ట్ర తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా గోవాను కోరింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన గోవా 47.4 ఓవర్లలో 199 పరుగులకే పరిమితమైంది. గోవా ఆటగాళ్లలో కామత్(95) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.సౌరాష్ట్ర బౌలర్లలో సనాన్ దియాకు మూడు వికెట్లు లభించగా, రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు లభించాయి. -
చెలరేగిన జడేజా
రాజ్ కోట్:టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో చెలరేగిపోతున్నాడు. రంజీల్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఆడిన రెండు మ్యాచ్ ల్లో 24 వికెట్లు నేలకూల్చి జట్టుకు వరుసగా అద్భుతమైన విజయాలను అందించాడు. త్రిపురతో జరిగిన తొలి మ్యాచ్ లో 11 వికెట్లు తీసి సౌరాష్ట్ర గెలుపులో కీలకపాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కించుకున్న జడేజా.. అనంతరం జార్ఖండ్ తో జరిగిన మ్యాచ్ లో 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లతో జార్ఖండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు. దీంతో జార్ఖండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 168 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో 122 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం 86 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన సౌరాష్ట్ర కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకున్న జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో జడేజా(58)హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జడేజా విశేషంగా రాణించడంతో నాలుగు రోజులు జరగాల్సిన మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ 168, రెండో ఇన్నింగ్స్ 122 సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ 205, రెండో ఇన్నింగ్స్ 86/2 (8వికెట్లతో విజయం) -
రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ షో
రాజ్ కోట్: టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. సౌరాష్ట్ర తరుపున ఆడుతున్నజడేజా అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. గ్రూప్ సి లో భాగంగా గురువారం ఇక్కడ జార్ఖండ్- సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ ను 168 పరుగులకే ఆలౌట్ చేయడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. 71 పరుగులకు ఆరు వికెట్లు తీసి జార్ఖండ్ వెన్నువిరిచాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన సౌరాష్ట్ర ఆదిలో తడబడినా జడేజా ఆదుకున్నాడు. సౌరాష్ట్ర వరుసగా వికెట్ల కోల్పోతున్న తరుణంలో జడేజా తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తించి హాఫ్ సెంచరీ చేశాడు. 75 బంతులో 58 పరుగులతో జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకు ఆలౌటైన సౌరాష్ట్రకు 37 పరుగుల ఆధిక్యం లభించింది.