ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. కోన శ్రీకర్ భరత్ 27 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు.
ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్(138 పరుగులు) సెంచరీతో మెరవగా.. హనుమ విహారి 82 పరుగులు చేయగా సౌరబ్ కుమార్ 55 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేయగా.. ప్రేరక్ మాన్కడ్ 72 పరుగులతో రాణించాడు.
ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 31.5 ఓవర్లలో చేధించి 8 వికెట్ల తేడాతో గెలిచి ఇరానీ కప్‌ను ఒడిసిపట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఓవరాల్‌గా ఎనిమిది వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ కుల్దీప్ సేన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్ కావడం విశేషం.
Winners Are Grinners! ☺️ 🙌
— BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022
Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia
Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP
Comments
Please login to add a commentAdd a comment