rest of india
-
NCAలో టీమిండియా స్టార్ క్రికెటర్.. కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీ 2024-25 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ ఇరానీ కప్ హీరో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.డబుల్ సెంచరీఈ క్రమంలో దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌తో పాటు... ఇరానీ కప్-2024లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. లక్నోలో అక్టోబరు 1-5 వరకు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ముంబై ఇరానీ కప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో 222 పరుగులతో అజేయంగా నిలిచిన సర్ఫరాజ్ ఖాన్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా సెలక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ నేపథ్యంలో అతడిని బీసీసీఐ.. ఎన్సీఏకు పంపించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. కివీస్‌తో సిరీస్‌కు అతడిని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీకేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్ వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపాడు. అయితే, బంగ్లాతో సిరీస్ సందర్భంగా రాహుల్ తిరిగి రావడంతో అతడికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. అయితే,ఈసారి మరింత స్ట్రాంగ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సర్ఫరాజ్ సిద్దమైపోయాడు. కాగా ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరువైన టీమిండియా.. బంగ్లాతో టీ20 సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ఆడనుంది. అక్టోబరు 16 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. అయితే, అక్టోబరు 11 నుంచే రంజీల్లో ముంబై తమ ప్రయాణం మొదలుపెట్టబోతోంది. బరోడాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. దీంతో సర్ఫరాజ్ ఖాన్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు పీటీఐ వెల్లడించింది. చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’
‘‘దేశంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా.. అక్కడి మైదానంలోని వికెట్‌కి అనుగుణంగా మన బ్యాటింగ్ శైలి మార్చుకోవాలి. మా నాన్న ఇదే చెబుతూ ఉంటారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలంటారు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం నాకెంతో కలిసి వచ్చింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర నుంచి భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనేది సీనియర్లను చూసి నేర్చుకున్నా.ఇక ఈ మేము గెలిచిన ఈ ట్రోఫీ జట్టు మొత్తానిది. అయితే, ముషీర్‌కు నేను ఓ మాట ఇచ్చాను. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తానని చెప్పాను. యాక్సిడెంట్‌కు గురై మ్యాచ్‌కు దూరమైన ముషీర్‌కు ఈ అవార్డు అంకితం’’ అని టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ అన్నాడు. ఇరానీ కప్-2024లో డబుల్ సెంచరీతో మెరిసిన ఈ ముంబై బ్యాటర్.. తనకు దక్కిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తన తమ్ముడు, క్రికెటర్ ముషీర్ ఖాన్‌కు అంకితమిచ్చాడు.1997లో చివరిసారిగాకాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై జట్టు.. దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో విజేతగా నిలిచింది. కాగా ముంబై 1997లో చివరిసారిగా ఇరానీ కప్ గెలిచింది. ఇప్పుడిలా.. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడింది. ఓవరాల్‌గా ముంబైకిది పదిహేనో ఇరానీ కప్.కాగా 1997–98 నుంచి గత సీజన్ వరకు మరో ఎనిమిదిసార్లు ఇరానీ కప్ ఆడినా... ముంబై మాత్రం గెలుపు గీత దాటలేకపోయింది. చివరిసారిగా 2015–16లో ఇరానీ కప్‌లో ముంబై పరాజయం పాలైంది. ఈసారి సమష్టి ప్రదర్శనతో కదంతొక్కిన ముంబై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఓవర్‌నైట్ స్కోరు 153/6తో ఐదోరోజు శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై... 78 ఓవర్లలో 8 వికెట్లకు 329 పరుగులు చేసింది.తనుశ్ కొటియాన్ వీరవిహారం.. ఈ దశలో ముంబై తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఇక ఫలితం తేలడం కష్టమని భావించిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు ‘డ్రా’కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబైని విజేతగా ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో.. సర్ఫరాజ్ ఖాన్ (17) రెండో ఇన్నింగ్స్‌లో త్వరగానే ఔటైనా... తనుశ్ కొటియాన్ (150 బంతుల్లో 114 నాటౌట్; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో అదరగొట్టాడుమిగతా వాళ్లలో... మోహిత్ అవస్థి (91 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అతడికి చక్కటి సహకారం అందించాడు. సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ (2) వెంట వెంటనే అవుట్ కావడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేసినా... తనుశ్ వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.ఫలితం తేలడం కష్టమనిమోహిత్తో కలిసి తనుశ్ అబేధ్యమైన తొమ్మిదో వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. సాధించాల్సిన లక్ష్యం కొండంత పెరిగిపోగా... అందుకు తగిన సమయం కూడా లేకపోవడంతో చివరకు రెస్ట్ ఆఫ్ ఇండియా సారథి రుతురాజ్ గైక్వాడ్ ‘డ్రా’కు అంగీకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై ఎనిమిది వికెట్లు కోల్పోగా... అందులో 6 వికెట్లు ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ తీయడం విశేషం. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా... రెస్టాఫ్ ఇండియా 416 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీతో మెరిసిన ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం కారణంగా రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు దూరమైన ముషీర్ ఖాన్‌కు తన పురస్కారాన్ని అంకితం చేశాడు. కాగా భారత టెస్టు జట్టులో సభ్యుడైన సర్ఫరాజ్ ఖాన్... బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇరానీ కప్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే.రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం సంతోషంముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ..‘27 ఏళ్ల తర్వాత తిరిగి ఇరానీ కప్ గెలుచుకోవడం సంతోషంగా ఉంది. తనుశ్ కొటియాన్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ విలువైన పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ రెండూ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని హర్షం వ్యక్తం చేశాడు.ఘన సన్మానంఇక సుదీర్ఘ విరామం తర్వాత ఇరానీ కప్‌ను సొంతం చేసుకున్న ముంబై జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) వెల్లడించింది. వాంఖడే స్టేడియంలో త్వరలోనే ఆటగాళ్లను సన్మానిస్తామని ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ తెలిపాడు. దేశవాళీల్లో తమ ఆధిపత్యం చాటుతూ ముంబై జట్టు మరోసారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని... సమష్టి ప్రదర్శనకు దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఇరానీ కప్-2024: సంక్షిప్త స్కోర్లు ముంబై తొలి ఇన్నింగ్స్: 537 రెస్టా ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 416ముంబై రెండో ఇన్నింగ్స్: 329/8. చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
ఇరానీ కప్ విజేతగా ముంబై.. 27 ఏళ్ల తర్వాత!
ఇరానీకప్-2024 విజేతగా ముంబై నిలిచింది. కాన్పూర్ వేదికగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో.. తొలి ఇన్నింగ్స్ లీడ్ ఆధారంగా ముంబై ఛాంపియన్స్‌గా అవతరించింది. కాగా ముంబై ఇరానీకప్‌ను సొంతం చేసుకోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఇరానీ కప్ విజేతగా ముంబై నిలవడం ఇది 15వ సారి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్) డబుల్ సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు కొటియన్(64) పరుగులతో రాణించాడు. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబై జట్టుకు 121 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 8 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది. అయితే శనివారం(ఆక్టోబర్ 5) ఆఖరి రోజు ఆట కావడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ముంబై ఖాతాలో ఓవరాల్‌గా ఇది 62 దేశీవాళీ క్రికెట్ ట్రోఫీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీలు-45, ఇరానీ కప్-15, విజయ్ హజారే ట్రోఫీ-4, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీ-1 ముంబై పేరిట ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
Team India: ఇషాన్ కిషన్ కల చెదిరిపోయినట్లే!
ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబైతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 93 పరుగులతో దుమ్ములేపాడు.'శతకం చేజారినాసెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయినా.. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191)తో కలిసి రెస్ట్ ఆఫ్ ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇక ఇదే మ్యాచ్‌లో తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ధ్రువ్ జురెల్ అదరగొడుతున్నాడు. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో అతడు మూడు క్యాచ్‌లతో మెరిశాడు.ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో ఆయుశ్ మాత్రే(19), హార్దిక్ తామోర్(0), యశ్ దయాల్ బౌలింగ్‌లో కెప్టెన్ అజింక్య రహానే(97) ఇచ్చిన క్యాచ్‌లు పట్టి.. వారిని పెవిలియన్‌కు పంపడంలో తోడ్పడ్డాడు. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టి తనపై నుంచి మరలకుండా చేసుకోగలిగాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.ఇషాన్ కిషన్ విఫలంమరోవైపు.. ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్‌తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకే ఆడుతున్న మరో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ మాత్రం నిరాశపరిచాడు. ఐదో స్థానంలోబ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండర్ 60 బంతులు ఎదుర్కొని 38 పరుగులకే పరిమితమయ్యాడు. కాగా ఇషాన్ కిషన్ గత కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే.టీమిండియా సెలక్టర్ల దృష్టి మరలకుండాముఖ్యంగా టెస్టుల్లో స్థానం పొందాలన్న ఇషాన్ కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇప్పటికే క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఈ జార్ఖండ్ బ్యాటర్‌కు ధ్రువ్ జురెల్ చెక్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధ్రువ్.. తన తొలి మ్యాచ్‌లోనే మెరుగ్గా రాణించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. తాజాగా దులిప్ ట్రోఫీ-2024లోనూ వికెట్ కీపర్‌గా రాణించిన ధ్రువ్ జురెల్.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో పంత్ బ్యాకప్‌గా ఉన్నాడు.ఇషాన్ రంజీల్లో రాణిస్తేనేతాజాగా రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున అద్బుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. స్వదేశంలో టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో ఆడే సిరీస్‌కు ముందు సెలక్టర్ల ముందు సత్తా నిరూపించుకున్నాడు. దీంతో సెలక్టర్లు.. టెస్టుల్లో ఇషాన్ కిషన్‌ను వికెట్ కీపర్ రేసు నుంచి తప్పించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఏడాది రంజీల్లో గనుక ఇషాన్ రాణిస్తే తన రాత మారే అవకాశం ఉంటుంది. భారీ ఆధిక్యం దిశగా ముంబైకాగా రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై.. ఇరానీ కప్ కూడా గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. లక్నోలో అక్టోబరు 1న మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇందుకు రెస్ట్ ఆఫ్ ఇండియా 416 పరుగులతో బదులిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్
ముంబైతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ సెంచరీతో కదంతొక్కాడు. ఈశ్వరన్ 117 బంతుల్లో సెంచరీ మార్కు తాకడు. మూడో రోజు టీ విరామం సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్ 193/3గా (49 ఓవర్లలో) ఉంది. ఈశ్వరన్ 108, ఇషాన్ కిషన్ 20 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ 9, సాయి సుదర్శన్ 32, దేవ్‌దత్ పడిక్కల్ 16 పరుగులు చేసి ఔటయ్యారు. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్తి, జునెద్ ఖాన్, తనుశ్ కోటియన్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై స్కోర్ కంటే ఇంకా 344 పరుగులు వెనుకపడి ఉంది.అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీతో (222) ముంబై భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అజింక్య రహానే (97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ (57), తనుశ్ కోటియన్ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, ప్రసిద్ద్ కృష్ణ తలో రెండు, సరాన్ష్ జైన్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూపర్ ట్రాక్ రికార్డుముంబైతో మ్యాచ్‌లో సెంచరీ చేసిన అభిమన్యు ఈశ్వరన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈశ్వరన్ ఈ ఫార్మాట్లో 167 ఇన్నింగ్స్‌లు ఆడి 50 సగటున 7500 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచరీలు, 26 సెంచరీలు ఉన్నాయి.చదవండి: ‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’ -
‘భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!’
టీమిండియా స్టార్ రుతురాజ్ గైక్వాడ్ ఇరానీ కప్-2024 మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా మొత్తంగా 27 బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రుతు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే, భారత టెస్టు జట్టుకు ఎంపిక కావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.కాగా రంజీ చాంపియన్ ముంబై- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు మధ్య ఇరానీ కప్ టైటిల్ కోసం పోటీ జరుగుతోంది. లక్నో వేదికగా అక్టోబరు 1న మొదలైన ఈ రెడ్‌బాల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.సర్ఫరాజ్ డబుల్ సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ (276 బంతుల్లో 221 బ్యాటింగ్; 25 ఫోర్లు, 4 సిక్సర్లు) రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగడంతో.. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 138 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 536 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 237/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై రెండో రోజంతా అదే జోరు కనబర్చింది.కెప్టెన్ అజింక్య రహానే, షమ్స్ ములానీ (5) త్వరగానే ఔటైనా... తనుశ్ కోటియాన్ (124 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో కలిసి సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. మంచి బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇరానీ కప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ముంబై ఆటగాడిగా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు.భీకర ఫామ్‌లో అతడు.. నువ్వు మాత్రం ఇలా!ఇలా... టీమిండియా టెస్టు జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న సర్ఫరాజ్ దేశవాళీల్లో భీకర ఫామ్ కొనసాగిస్తూ చెలరేగగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రుతురాజ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ తొమ్మిది పరుగుల వద్ద ఉండగా.. ముంబై ప్లేయర్ జునైద్ ఖాన్ బౌలింగ్‌లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఆదిలోనే రెస్ట్ ఆఫ్ ఇండియాకు షాక్ తగిలింది.అయితే, మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకంతో అదరగొట్టి సెంచరీ దిశగా పయనిస్తుండగా.. సాయి సుదర్శన్(32) అతడికి సహకారం అందించాడు. ఈ క్రమంలో గురువారం నాటి మూడో రోజు ఆటలో 36 ఓవర్లు ముగిసేసరికి రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై కంటే 396 పరుగులు వెనుకబడి ఉంది.సెలక్టర్లు మాత్రం ఏం చేస్తారు?కాగా టీమిండియా టెస్టు ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా యశస్వి జైస్వాల్ పాతుకుపోయిన విషయం తెలిసిందే. రోజురోజుకూ బ్యాటింగ్ మెరుగుపరచుకుంటూ ఈ యంగ్‌స్టర్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఇలాంటి తరుణంలో బ్యాకప్ ఓపెనర్‌గా అయినా స్థానం దక్కించుకునేందుకు రుతు ప్రయత్నిస్తున్నాడు.ఈ క్రమంలో.. ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-సి జట్టు సారథిగా వ్యవహరించిన రుతురాజ్.. మూడు మ్యాచ్‌లలో కలిపి 232 పరుగులు చేయగలిగాడు. అయితే, తాజాగా ఇరానీ కప్ మ్యాచ్‌లో మాత్రం ఇలా నిరాశపరిచాడు. కాగా టీమిండియా నవంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రుతురాజ్ కూడా జట్టుకు ఎంపికవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి ఆట తీరుతో అతడు సెలక్టర్లను ఆకట్టుకోవడం కష్టమేనని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.చదవండి: కోహ్లి, రవిశాస్త్రి వల్లే ఇదంతా.. నాకది పునర్జన్మ: రోహిత్ శర్మ Maiden First-Class wicket for Mohammad Juned Khan on debut 🙌What a way to get off the mark! He gets the big wicket of captain Ruturaj Gaikwad 👌#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/KvUOFHK6Nx— BCCI Domestic (@BCCIdomestic) October 3, 2024 -
డబుల్ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్
బంగ్లాదేశ్‌లో టెస్టు సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. తుదిజట్టులో చోటివ్వని సెలక్టర్లకు సవాల్ విసిరేలా ధనాధన్ డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరానీ కప్-2024లో భాగంగా ఈ ముంబై క్రికెటర్ రెస్ట్ ఆఫ్ ఇండియాపై ఈ మేరకు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్బంతిని కసితీరా బాదుతూ ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఆకాశమే మద్దుగా చెలరేగి 253 బంతుల్లో.. 23 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. తద్వారా ఇరానీ కప్ చరిత్రలో ముంబై తరఫున ద్విశతకం చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త రికార్డు సృష్టించాడు. యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో 200 పరుగులు చేసిన పిన్న వయస్కుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 26 ఏళ్ల 346 రోజుల వయసులో సర్ఫరాజ్ ఈ ఘనత సాధించాడు. ఇక ఇరానీ కప్ యంగెస్ట్ డబుల్ సెంచూరియన్స్ లిస్టులో యశస్వి జైస్వాల్(21 ఏళ్ల 63 రోజుల వయసులో), ప్రవీణ్ ఆమ్రే(22 ఏళ్ల 80 రోజులు), గుండప్ప విశ్వనాథ(25 రోజుల 255 రోజులు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.ఈసారి ముంబై వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాకాగా ద్విశతకం బాదిన అనంతరం.. హెల్మెట్ తీసి డ్రెసింగ్ రూం వైపు బ్యాట్ చూపుతూ సర్ఫరాజ్ తన సంతోషాన్ని పంచుకోగా.. సహచర ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్‌తో అతడిని అభినందించారు. ఇక ప్రతి ఏడాది రంజీ చాంపియన్- రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ ట్రోఫీ కోసం పోటీ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈసారి అజింక్య రహానే కెప్టెన్సీలో ముంబై రంజీ చాంపియన్‌గా నిలిచి.. రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతోంది.భారీ స్కోరు సాధించిలక్నోలోని ఏకనా స్టేడియంలో మంగళవారం(అక్టోబరు 1) ఈ ఐదు రోజుల మ్యాచ్ మొదలైంది. ఇందులో.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై రెండో రోజు ఆటలో భాగంగా 500 పైచిలుకు పరుగులు సాధించింది. బుధవారం నాటి ఆట సందర్భంగానే ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.చదవండి: WTC: ఫైనల్ చేరాలంటే టీమిండియా చేయాల్సిందిదే! 💯 turns into 2⃣0⃣0⃣ 👌A sensational double century for Sarfaraz Khan✌️He becomes the 1⃣st Mumbai player to score a double ton in #IraniCup 👏The celebrations say it all 🎉#IraniCup | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/Er0EHGOZKh pic.twitter.com/225bDX7hhn— BCCI Domestic (@BCCIdomestic) October 2, 2024 -
జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్! సంజూకు నో ఛాన్స్
ఇరానీ ట్రోఫీ-2024లో భాగంగా లక్నో వేదికగా ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ జట్టుకు టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌కు మాత్రం బీసీసీఐ సెలక్టర్లు మొండి చేయిచూపించింది. అతడికి ఇరానీ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వలేదు. అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన భారత క్రికెటర్లు ధ్రువ్ జురెల్, యష్ దయాల్‌ను ఈ జట్టులో సెలెక్టర్లు చేర్చారు. దీంతో వీరిద్దరూ రెండు టెస్టుకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు ఈ ఇరానీ కప్‌లో ముంబై జట్టుకు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.ఇరానీ ట్రోఫీకి రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)*, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, సరాంశ్ జైన్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్, యష్ దయాల్*, రికీ భుయ్, శాశ్వత్ రావత్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్చదవండి: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం.. ట్రోఫీ మాదే: హర్మన్ -
ఇరానీ ట్రోఫీ 2023 విజేత రెస్ట్ ఆఫ్ ఇండియా
2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. డిఫెండింగ్ రంజీ ఛాంపియన్స్ సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 175 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులు చేయగా.. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకు ఆలౌటైంది. రాణించిన సాయి సుదర్శన్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 5 వికెట్లు పడగొట్టగా.. ధరేంద్ర జడేజా 3, యువరాజ్ సింగ్ దోడియా 2 వికెట్లు తీశారు. చెలరేగిన సౌరభ్ కుమార్.. అనంతరం బరిలోకి దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు ఆలౌటైంది. అర్పిత్ వసవద (54) అర్ధసెంచరీతో రాణించగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (4/65), షమ్స్ ములానీ (2/47), పుల్కిత్ నారంగ్ (1/56) సౌరాష్ట్రను దెబ్బకొట్టారు. తిప్పేసిన పార్థ్ భట్.. సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియాను పార్థ్ భట్ (7/53) తిప్పేశాడు. అతనికి జడేజా (3/65) కూడా తోడవ్వడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే చాపచుట్టేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (43), హనుమ విహారి (22), సర్ఫరాజ్ ఖాన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మరోసారి విజృంభించిన సౌరభ్ కుమార్.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్పిన్నర్ సౌరభ్ కుమార్ రెండో ఇన్నింగ్స్‌లోనూ విజృంభించడంతో (6/43) సారాష్ట్ర తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్‌గా రికార్డుల్లోకెక్కింది. సౌరభ్‌కు జతగా షమ్స్ ములానీ (3/22), పుల్కిత్ నారంగ్ (1/1) వికెట్లు పడగొట్టారు. -
Irani Trophy 2023: సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్
ఇరానీ ట్రోఫీ 2023లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు స్వల్ప ఆధిక్యం దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్రస్తుతం సౌరాష్ట్ర.. రెస్ట్ ఆఫ్ ఇండియా స్కోర్‌కు 96 పరుగులు వెనుకపడి ఉంది. ఐదేసిన పార్థ్ భట్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32), హనుమ విహారి (33), శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32), సౌరభ్ కుమార్ (39) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులకు ఆలౌటైంది. సౌరాష్ట్ర బౌలర్ పార్థ్ భట్ 5 వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియాను దెబ్బకొట్టాడు. ధరేంద్ర జడేజా (3/20), యువరాజ్ సింగ్ దోడియా (2/74) తలో చేయి వేశారు. సౌరాష్ట్రను దెబ్బకొట్టిన కావేరప్ప, సౌరభ్ కుమార్.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్రను విధ్వత్ కావేరప్ప (3/28), సౌరభ్ కుమార్ (3/64) దెబ్బకొట్టారు. వీరిద్దరికి షమ్స్ ములానీ (2/46), పుల్కిత్ నారంగ్ (1/56) తోడవ్వడంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. హార్విక్ దేశాయి (0), చిరాగ్ జానీ (2), షెల్డన్ జాక్సన్ (13), జడేజా (11) విఫలం కాగా.. సమర్థ్ వ్యాస్ (29), చతేశ్వర్ పుజారా (29), ప్రేరక్ మన్కడ్ (29), పార్థ్ భట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో అర్పిత్ వసవద (54) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. జడదేవ్ ఉనద్కత్ (17), దోడియా (0) క్రీజ్‌లో ఉన్నారు. -
Irani Trophy 2023: రాణించిన సాయి సుదర్శన్.. తొలి రోజు బౌలర్ల హవా
ఇరానీ ట్రోఫీ 2023లో తొలి రోజు బౌలర్ల ఆధిపత్యం నడిచింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర బౌలర్లు హవా కొనసాగించారు. పార్థ్ భట్ (4/85), ధరేంద్ర సింగ్ జడేజా (2/89), యువరాజ్ సింగ్ దోడియా (2/74) రాణించారు. వీరి ధాటికి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి రోజే 8 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. రాణించిన సాయి సుదర్శన్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఓపెనర్లు సాయి సుదర్శన్ (72), మయాంక్ అగర్వాల్ (32) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం మాయంక్ ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన హనుమ విహారి (33) సైతం ఓ మోస్తరు స్కోర్ చేసి ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (17), యశ్ ధుల్ (10), పుల్కిత్ నారంగ్ (12) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. శ్రీకర్ భరత్ (36), షమ్స్ ములానీ (32) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌరభ్ కుమార్ (30), నవదీప్ సైనీ (8) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఇరానీ ట్రోఫీ రంజీ ఛాంపియన్ టీమ్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుతుందన్న విషయం తెలిసిందే. -
కేక పుట్టించిన యశస్వి.. రెస్టాఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ 2023 విజేతగా రెస్టాఫ్ ఇండియా నిలిచింది. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. హిమాన్షు మంత్రి 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్ష్ గావ్లి 48 పరుగులు చేశాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో సౌరబ్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. ముఖేశ్ కుమార్, పుల్కిత్ నారంగ్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో రెస్టాఫ్ ఇండియా 484 పరుగులు చేసింది. అనంతరం మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్ కావడంతో రెస్టాఫ్‌కు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి మరోసారి సెంచరీతో చెలరేగగా.. జట్టు 246 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని రెస్టాఫ్ ఇండియా మధ్యప్రదేశ్ ముందు 436 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. That winning feeling 😃👌#IraniCup | #MPvROI | @mastercardindia Scorecard 👉 https://t.co/UMUCM30e11 pic.twitter.com/5Nxt4DhLXg — BCCI Domestic (@BCCIdomestic) March 5, 2023 A victory to savour! 👌👌 Rest of India register a 238-run win over Madhya Pradesh at the Captain Roop Singh Stadium, Gwalior to win the #IraniCup 👏🏻👏🏻 #MPvROI | @mastercardindia Scorecard 👉 https://t.co/UMUCM30e11 pic.twitter.com/0FQgBND6Sx — BCCI Domestic (@BCCIdomestic) March 5, 2023 చదవండి: హై స్కోరింగ్ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారాలా? తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ -
యశస్వి జైస్వాల్ చారిత్రక ఇన్నింగ్స్‌లు.. ఓటమి దిశగా మధ్యప్రదేశ్
ఇరానీ ట్రోఫీ 2022-23లో భాగంగా రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వన్‌సైడెడ్‌గా సాగుతోంది. 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. అర్హమ్ అఖిల్ డకౌట్ కాగా.. శుభమ్ శర్మ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ హిమాన్షు మంత్రి (51) అజేయ అర్ధశతకంతో మధ్యప్రదేశ్‌ను ఓటమి బారి నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేస్తున్నాడు. హిమాన్షుతో పాటు హర్ష్ గవ్లీ (15) క్రీజ్‌లో ఉన్నాడు. ముకేశ్ కుమార్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు, యశస్వి జైస్వాల్ (144) మెరుపు అర్ధసెంచరీతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ కాగా.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్‌దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు. దీనికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, అభిమన్యు ఈశ్వరన్ (154) భారీ సెంచరీతో చెలరేగడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 190 పరుగుల ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగుల స్కోర్‌తో కలుపుకుని మధ్యప్రదేశ్‌కు 437 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది రెస్ట్ ఆఫ్ ఇండియా. ఈ మ్యాచ్‌తో ఇరానీ కప్ అరంగేట్రం చేసిన యశస్వి.. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన భారత యువ కెరటం.. డెబ్యూలోనే డబుల్ సెంచరీ, సెంచరీ
Yashasvi Jaiswal: భారత యువ కెరటం, ఉత్తర్‌ప్రదేశ్ బార్న్ ముంబై క్రికెటర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ టోర్నీ ఇరానీ కప్‌లో ఇరగదీశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు), సెంచరీతో (132 బంతుల్లో 121 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టి, టీమిండియాలో చోటు కోసం దూసుకొస్తున్నాడు. ఇటీవలి కాలంలో దేశవాలీ క్రికెట్లో ఫార్మాట్లకతీతంగా విజృంభిస్తున్న యశస్వి.. పలు సంచలన ప్రదర్శనల నమోదు చేసి, నేను కూడా టీమిండియా ఓపెనర్ రేసులో ఉన్నానని భారత సెలక్టర్లకు సవాలు విసురుతున్నాడు. Yashasvi Jaiswal has 9 Hundred, including 3 double hundreds in just 15 first-class matches 😲#IraniCup | #CricketTwitter pic.twitter.com/9wvHwCCKIy — InsideSport (@InsideSportIND) March 4, 2023 మధ్యప్రదేశ్‌తో ఇరానీ కప్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన యశస్వి.. ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు బద్దలుకొట్టాడు. ఇరానీ కప్‌లో ఒకే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా.. శిఖర్ ధవన్ తర్వాత ఇరానీ కప్ మ్యాచ్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా.. ఒకే ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ నమోదు చేసిన 11వ భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. Yashasvi Jaiswal is the first batter to record a double hundred and a hundred in the same Irani Cup match. He is also only the second player after Shikhar Dhawan to score more than 300 runs in one Irani Cup game. — Lalith Kalidas (@lal__kal) March 4, 2023 ప్రస్తుత దేశవాలీ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న యశస్వి.. కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగుల మార్కును అందుకుని, ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ నమోదు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 21 ఏళ్ల యశస్వికి అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 484 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (213) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అభిమన్యు ఈశ్వరన్ (154) సెంచరీతో కదం తొక్కాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టగా.. అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తీకేయ తలో 2 వికెట్లు, అంకిత్ కుష్వా ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. పుల్కిత్ నారంగ్ (4/65), నవ్‌దీప్ సైనీ (3/56), ముకేశ్ కుమార్ (2/44), సౌరభ్ కుమార్ (1/74) ధాటికి 294 పరుగులకే చాపచుట్టేసింది. యశ్ దూబే (109) సెంచరీతో రాణించగా.. హర్ష గవ్లీ (54), సరాన్ష్ జైన్ (66) అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించారు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ ఇండియా.. నాలుగో రోజు లంచ్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి, ఓవరాల్‌గా 391 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. యశస్వి (121) అజేయమైన సెంచరీతో క్రీజ్‌లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అంకిత్ ఖుష్వా తలో 2 వికెట్లు, కుమార్ కార్తీకేయ, సరాన్ష్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఆధిక్యం
గ్వాలియర్: రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఆట మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 112/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 112.5 ఓవర్లలో 294 పరుగులకు ఆలౌటైంది. యశ్ దూబే (258 బంతుల్లో 109; 16 ఫోర్లు) సెంచరీ సాధించగా, సారాంశ్ జైన్ (150 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన రెస్ట్ ఆఫ్ ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 85 పరుగులు సాధించింది. తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 275 పరుగులకు పెంచుకుంది. కెపె్టన్ మయాంక్ డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (58 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), అభిమన్యు ఈశ్వరన్ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. -
అరంగేట్రంలోనే అదరగొట్టిన యశస్వి జైస్వాల్.. డబుల్ సెంచరీతో..!
Irani Cup 2022-23: ముంబై యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్..ఇరానీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన యశస్వి.. మధ్యప్రదేశ్‌తో ఇవాళ (మార్చి 1) ప్రారంభమైన మ్యాచ్‌లో 230 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ఇరానీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 259 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 213 పరుగులు చేపి ఔటయ్యాడు. యశస్వికి బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (154) తోడయ్యాడు. వీరిద్దరూ శతకాలతో విజృంభించడంతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. .@ybj_19 roars at the Captain Roop Singh Stadium 💪 💪 A spectacular 2️⃣0️⃣0️⃣ 👏 to help build a solid foundation with Abhimanyu Easwaran Follow the match 👉 https://t.co/L1ydPUXHQL #IraniCup | #MPvROI | @mastercardindia pic.twitter.com/AIrv9JYEAW — BCCI Domestic (@BCCIdomestic) March 1, 2023 కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 2 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. యశస్వి, ఈశ్వరన్ శతకాల మోత మోగించారు. సౌరభ్ కుమార్ (0), బాబా ఇంద్రజిత్ (3) క్రీజ్‌లో ఉన్నారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఈశ్వరన్ రనౌటయ్యాడు. కాగా, యశస్వి జైస్వాల్‌కు అరంగేట్రం మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదడం కొత్తేమి కాదు. దులీప్ ట్రోఫీ డబ్యూలోనూ యశస్వి ఇదే తరహాలో డబుల్ సెంచరీతో విజృంభించాడు. ఈ ట్రోఫీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన యశస్వి.. నార్త్ ఈస్ట్ జోన్‌పై 227 పరుగులు చేశాడు. అలాగే ఇండియా-ఏ తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనూ యశస్వి సెంచరీతో చెలరేగాడు. 2022 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 146 పరుగులు స్కోర్ చేశాడు. -
Irani Cup 2023: స్టార్ క్రికెటర్‌కు దక్కని చోటు.. కారణం ఏంటంటే..?
ముంబై స్టార్ క్రికెటర్, అప్ కమింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌కు దేశవాలీ ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఇరానీ కప్‌లో ఆడే అవకాశం లభించలేదు. మార్చి 1 నుంచి మధ్యప్రదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు సర్ఫరాజ్ సారధ్యం వహించాల్సి ఉండింది. అయితే చేతి వేలి ఫ్రాక్చర్ కారణంగా సెలెక్టర్లు సర్ఫరాజ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. సర్ఫరాజ్ గైర్హాజరీలో మయాంక్ అగర్వాల్ రెస్ట్ ఆఫ్ ఇండియా పగ్గాలు చేపడతాడు. డీవై పాటిల్ టీ20 కప్ సందర్భంగా సర్ఫరాజ్‌కు గాయమైనట్లు సమాచారం. కాగా, సర్ఫరాజ్ గతకొంతకాలంగా జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఇతను దేశవాలీ టోర్నీల్లో పరుగుల వరద పారిస్తున్నా.. సెలెక్టర్లు ప్రతిసారి మొండిచెయ్యే చూపిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధిస్తున్నప్పటికీ.. ఈ ముంబై ఆటగాడిపై సెలెక్టర్లు కనికరం చూపించడం లేదు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఒకానొక దశలో సహనం కోల్పోయి సెలెక్టర్లు, బీసీసీఐపై విరుచుకుపడ్డాడు. సెలక్టర్లు తనను మోసం చేశారంటూ వాపోయాడు. ఇదిలా ఉంటే, దేశవాలీ కెరీర్లో ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. 79.65 సగటున 13 శతకాల సాయంతో 3505 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన రంజీ సీజన్లో 6 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 92.66 సగటున 3 సెంచరీల సాయంతో 556 పరుగులు సాధించాడు. రెస్టాఫ్ ఇండియా : మయాంక్ అగర్వాల్, సుదీప్ కుమార్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, హర్విక్ దేశాయ్, ముఖేశ్ కుమార్, అతిత్ సేథ్, చేతన్ సకారియా, నవదీప్ సైనీ, ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), మయాంక్ మార్ఖండే, సౌరభ్ కుమార్, ఆకాశ్ దీప్, బాబా ఇంద్రజీత్, పుల్కిత్ నారంగ్, యశ్ ధుల్ -
అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ.. రెస్ట్ ఆఫ్ ఇండియాదే ఇరానీ కప్
ఇరానీ కప్ విజేతగా రెస్ట్ ఆఫ్ ఇండియా నిలిచింది. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 104 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. కోన శ్రీకర్ భరత్ 27 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర బౌలర్లలో కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ రెండు వికెట్లు తీశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయింది. సర్ఫరాజ్ ఖాన్(138 పరుగులు) సెంచరీతో మెరవగా.. హనుమ విహారి 82 పరుగులు చేయగా సౌరబ్ కుమార్ 55 పరుగులతో రాణించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 380 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేయగా.. ప్రేరక్ మాన్కడ్ 72 పరుగులతో రాణించాడు. ఇక 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ ఆఫ్ ఇండియా 31.5 ఓవర్లలో చేధించి 8 వికెట్ల తేడాతో గెలిచి ఇరానీ కప్‌ను ఒడిసిపట్టింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఓవరాల్‌గా ఎనిమిది వికెట్లతో రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్ కుల్దీప్ సేన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాగా రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇది 29వ ఇరానీ టైటిల్ కావడం విశేషం. Winners Are Grinners! ☺️ 🙌 Rest of India beat the spirited Saurashtra side to win the #IraniCup. 👏 👏 #SAUvROI | @mastercardindia Scorecard ▶️ https://t.co/u3koKzUU9B pic.twitter.com/WD2ELx8wrP — BCCI Domestic (@BCCIdomestic) October 4, 2022 చదవండి: టి20 ప్రపంచకప్‌కు దూరం కావడంపై బుమ్రా స్పందన.. 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం -
మారువేషంలో జడేజా.. అంతా ఉనాద్కట్ మాయ!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలీ సర్జరీతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జడ్డూతో పాటు బుమ్రా కూడా దూరమవ్వడం టీమిండియా అభిమానులకు షాక్ తగిలేలా చేసింది. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే టీమిండియా ప్రపంచకప్‌లో ఆడనుంది. మరి టీమిండియా అంచనాలు అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ విషయం పక్కనబెడితే.. ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా బ్యాటర్‌గా ప్రత్యక్షమైన ఫోటో వైరల్‌గా మారింది. అదేంటి ప్రస్తుతం జడేజా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో ఉన్నాడు కదా.. ఇరానీ కప్‌లో ఆడడమేంటీ అనుకుంటున్నారా. అదంతా సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ మాయ. అతని పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెస్టాఫ్ ఇండియాతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనాద్కట్‌తో పాటు ప్రేరణ్ మన్కడ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ప్రేరక్ మన్కడ్‌ను దూరం నుంచి చూస్తే కాస్త రవీంద్ర జడేజాలానే పోలి ఉంటాడు. ఇక్కడే ఉనాద్కట్ తన తెలివిని ఉపయోగించాడు. తనతో బ్యాటింగ్ చేసిన ప్రేరక్ మన్కడ్ ఫోటోకు కాస్త మార్ఫింగ్ చేసి జడేజాను పెట్టాడు. ''జడ్డూ టీమ్‌లో ఉండడం ఆనందంగా ఉంది(మారువేషంలో)'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. కేవలం సరదా కోసమే చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జడేజా, ప్రేరక్ మన్కడ్లకు పోలికలు దగ్గరగా ఉండడంతో..'' మరో జడేజా వచ్చేశాడు.. టి20 ప్రపంచకప్‌కు ఈ జడ్డూను పంపిద్దామా'' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 380 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెస్టాఫ్ ఇండియా ముందు 104 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 2 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 25, శ్రకర్ భరత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. Glad to have Jaddu in the team.. (in disguise 😂) @imjadeja = @PrerakMankad46 pic.twitter.com/3URrzEMgD2 — Jaydev Unadkat (@JUnadkat) October 3, 2022 చదవండి: 'అలసత్వం తెచ్చిన తంటా'.. టి20 ప్రపంచకప్‌కు దూరం గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్ -
సౌరాష్ట్ర 380 ఆలౌట్.. రెస్టాఫ్ ఇండియా టార్గెట్ 104 పరుగులు
రాజ్‌కోట్: ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్ర రెస్ట్ ఆఫ్ ఇండియా ముందు 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆటకు రెండు రోజుల సమయం మిగిలి ఉండడంతో రెస్టాఫ్ ఇండియా విజయం దాదాపు ఖాయమే. ఇక ఓవర్‌నైట్ స్కోరు 368/8తో నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌరాష్ట్ర మరో 12 పరుగులు మాత్రమే చేసి 380 పరుగులకు ఆలౌట్ అయింది. జైదేవ్ ఉనాద్కట్ 89 పరుగులు చేసి ఔట్ కాగా.. మిడిలార్డర్లో షెల్డన్ జాక్సన్ (71; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), అర్పిత్ (55; 7 ఫోర్లు, 1 సిక్స్), లోయర్ ఆర్డర్లో ప్రేరక్ మన్కడ్ (72; 9 ఫోర్లు) రాణించారు. దీంతో సౌరాష్ట్రకు 104 పరుగుల ఆధిక్యం లభించింది. రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలోకుల్దీప్ సేన్ ఐదు వికెట్లు తీయగా.. సౌరభ్ 3 వికెట్లు తీశాడు. -
సర్ఫరాజ్ ఖాన్.. మొన్న దులీప్ ట్రోపీ.. ఇవాళ ఇరానీ కప్‌లో
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోపీలో సెంచరీల మోత మోగించిన సర్ఫరాజ్ ఖాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలే దులీప్ ట్రోపీ ఫైనల్లో సెంచరీతో మెరిసిన సర్ఫరాజ్ ఖాన్.. తాజాగా ఇరానీ కప్‌లోనూ శతకం సాధించి తన జోరు చూపిస్తున్నాడు. కేవలం 92 బంత్లులోనే శతకం సాధించిన సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం 125 పరుగులతో ఆడుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఇరానీ కప్‌లో భాగంగా సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సర్ఫారాజ్ ఖాన్ 125 పరుగులు, కెప్టెన్ హనుమ విహారి 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు రెస్టాఫ్ ఇండియా బౌలర్ల దాటికి సౌరాష్ట్ర 98 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ 4 వికెట్లు,కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. 💯 for Sarfaraz Khan! 🙌 🙌 What a stunning knock this has been by the right-hander! 👏 👏 Follow the match ▶️ https://t.co/u3koKzDR7B#IraniCup | #SAUvROI | @mastercardindia pic.twitter.com/O2XeAZ91RV — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
Irani Cup 2022: కెప్టెన్‌గా హనుమ విహారి.. జట్టులో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు
Irani Cup 2022- Rest of India (RoI) squad: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక పోరు ఇరానీ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబరు 1 నుంచి 5 వరకు టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఇందులో భాగంగా 2019- 20 రంజీ ట్రోఫీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా జట్లు ఈ మ్యాచ్‌లో తలపడనున్నాయి. కెప్టెన్‌గా విహారి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. సౌరాష్ట్రతో పోటీపడే 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఉమ్రాన్ మాలిక్ సైతం ఇక ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచిన వెస్ట్‌జోన్ జట్టులో భాగమైన ప్రియాంక్ పాంచల్, ద్విశతకంతో చెలరేగిన యశస్వి జైశ్వాల్, యశ్ దుల్ తదితరులు రెస్టాఫ్ ఇండియాలో స్థానం సంపాదించుకున్నారు. ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను సైతం ఈ టీమ్‌కు ఎంపిక చేశారు. కాగా రంజీ ట్రోఫీ విజేతకు.. వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు మధ్య జరిగే టెస్టు మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఇరానీ కప్ ట్రోఫీ అందుకుంటుంది. అయితే, కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించలేదు. రెస్టాఫ్ ఇండియా జట్టు: హనుమ విహారి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్పరాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కేఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్ సాయికిషోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వస్వల్లా. చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్ ICC T20 Rankings: మరోసారి అదరగొట్టిన సూర్య! అగ్రస్థానానికి అడుగు దూరంలో.. -
మళ్లీ విదర్భదే ఇరానీ కప్
గతేడాది ఇటు రంజీ ట్రోఫీ, అటు ఇరానీ కప్ గెలుచుకున్న విదర్భ జట్టు... అదే ప్రదర్శనను మరోసారి నమోదు చేసింది. తద్వారా డబుల్ ధమాకా సాధించింది. ఇరానీ కప్‌లో చివరి రోజు శనివారం లక్ష్య ఛేదనలో విదర్భ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ అందరూ రాణించారు. దీంతో... ఊరించే లక్ష్యంతో ఆ జట్టును పడేయాలనుకున్న రెస్టాఫ్ ఇండియా ఆశలు ఆవిరయ్యాయి. నాగ్‌పూర్: ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వీరోచిత సెంచరీలు విదర్భ జోరు ముందు వెలవెలబోయాయి. ఊరించే లక్ష్యానికి అవలీలగా చేరువైన విదర్భ మళ్లీ ఇరానీ విజేతగా నిలిచింది. వరుసగా రంజీ చాంపియన్‌షిప్ సాధించినట్లే... ఇరానీ కప్‌నూ చేజిక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఐదు రోజుల మ్యాచ్ ‘డ్రా’ అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు గెలుపు వాకిట ఉన్న విదర్భతో ఇక చేసేదేమీ లేక రెస్టాఫ్ ఆటగాళ్లు చేతులు కలిపారు. కేవలం 11 పరుగుల దూరంలోనే ఉన్న విదర్భ చేతిలో ఐదు వికెట్లున్నాయి. ఇక విజయం ఖాయం కావడంతో ముందుగానే ఆటను ముగించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఇరానీ కప్ విదర్భ వశమైంది. వసీమ్ జాఫర్ గాయంతో తప్పుకోవడంతో... చివరి నిమిషంలో విదర్భ తుది జట్టులోకి వచ్చిన అథర్వ తైడే (215 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్), గణేశ్ సతీశ్ (195 బంతుల్లో 87; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్ ముగిసే సమయానికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 103.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రాహుల్ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. వీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ ఏ దశలోనూ తడబడలేదు. 18 ఏళ్ల అథర్వ తొలి సెషన్‌ను నడిపించాడు. సంజయ్ రామస్వామి (42; 4 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీని పూర్తిచేసుకున్నాడు. తర్వాత గణేశ్ సతీశ్‌తో మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించాక జట్టు స్కోరు 146 పరుగుల వద్ద అథర్వ మూడో వికెట్‌గా నిష్క్రమించాడు. అనంతరం సతీశ్‌కు మోహిత్ కాలే (37; 5 ఫోర్లు) జతయ్యాడు. వీళ్లిద్దరు నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో రెస్టాఫ్ బౌలర్లకు ఇబ్బందులు తప్పలేదు. 229 పరుగుల వద్ద కాలే నిష్క్రమించగా, 269 పరుగుల వద్ద సతీశ్‌ను విహారి ఔట్ చేశాడు. అదేస్కోరు వద్ద మ్యాచ్ ముగించేందుకు ఇరు జట్లు అంగీకరించడంతో మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. అక్షయ్ వాడ్కర్ (10 నాటౌట్) అజేయంగా నిలిచాడు. -
విదర్భ మళ్లీ మెరిసింది..
నాగ్‌పూర్: గతేడాది ఇరానీకప్‌లో విజేతగా నిలిచిన విదర్భ..ఈ ఏడాది కూడా మెరిసింది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో విదర్భ వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో చాంపియన్‌గా నిలవడంతో మరోమారు రెస్టాఫ్ ఇండియాతో ఇరానీకప్‌లో విదర్భకు తలపడే అవకాశం దక్కింది. ఈ పోరులో ఆద్యంతం ఆకట్టుకున్న విదర్భ టైటిల్‌ను దక్కించుకుంది. రెస్టాఫ్ ఇండియా నిర్దేశించిన 280 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విదర్భ ఆట నిలిచే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రా అయ్యింది. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఆధారంగా విదర్భను విజేతగా ప్రకటించారు. విదర్భ తన తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేయగా, రెస్టాఫ్ ఇండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 330 పరుగులు చేసింది. ఇక రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆపై ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆదిలోనే కెప్టెన్ ఫైజ్ ఫజాల్ వికెట్‌ను కోల్పోయింది. ఫజాల్ పరుగులేమీ చేయకుండా నిష్క్రమించడంతో విదర్భ స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో సంజయ్ రఘనాథ్(42), అథర్వా తైడే(72)లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆపై గణేశ్ సతీష్(87) హాఫ్ సెంచరీతో ఆకట్టకోగా, మోహిత్ కాలే(37) ఫర్వాలేదనిపించాడు. విదర్భ ఐదో వికెట్‌గా గణేశ్ సతీష్ వికెట్‌ను కోల్పోయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు సంధి చేసుకున్నారు. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో నిలిచిన విదర్భను విజేతగా ప్రకటించారు. 2018 ఇరానీకప్‌లో కూడా తొలి ఇన్నింగ్స్ ఆధారంగానే విదర్భ టైటిల్‌ను గెలవడం విశేషం. -
హనుమ విహారి బ్యాటింగ్ రికార్డు
నాగ్‌పూర్: ఆంధ్ర యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారి సరికొత్త బ్యాటింగ్ రికార్డు నెలకొల్పాడు. ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇరానీకప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియా తరుఫున ఆడుతున్న విహారి.. రంజీ చాంపియన్ విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన విహారి.. రెండో ఇన్నింగ్స్ళో కూడా శతకం నమోదు చేశాడు. శుక్రవారం నాల్గో రోజు ఆటలో భాగంగా విహారి సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు సాధించాడు. ఫలితంగా ఇరానీకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. గతేడాది ఇదే విదర్భతో జరిగిన మ్యాచ్‌లో విహారి 183 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, 2011 తర్వాత ఒక ఇరానీకప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ కూడా విహారినే కావడం మరో విశేషం. ఆనాటి ఇరానీకప్‌లో రెస్టాఫ్ ఇండియాతో తరఫున ఆడిన శిఖర్ ధావన్.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు సాధించాడు. తాజా ఇరానీకప్ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తన రెండో ఇన్నింగ్స్‌ను 374/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. దాంతో విదర్భకు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ 330 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 374/3 డిక్లేర్డ్ విదర్భ తొలి ఇన్నింగ్స్ 425 ఆలౌట్