ఆరోన్ మెరుపు బౌలింగ్ | Irani Cup: Varun Aaron stars for Rest of India against Karnataka | Sakshi
Sakshi News home page

ఆరోన్ మెరుపు బౌలింగ్

Published Wed, Mar 18 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

ఆరోన్ మెరుపు బౌలింగ్

ఆరోన్ మెరుపు బౌలింగ్

బెంగళూరు: పేసర్ వరుణ్ ఆరోన్ ధాటికి రంజీ చాంపియన్ కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడింది. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.... ఆరోన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో తొలిసారిగా ఆరు వికెట్లతో రెచ్చిపోవడంతో కర్ణాటక 77.1 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (119 బంతుల్లో 68; 13 ఫోర్లు), కరుణ్ నాయర్ (99 బంతుల్లో 59; 11 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (87 బంతుల్లో 54; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.

107కే నాలుగు వికెట్లు పడిన దశలో కరుణ్, అభిషేక్ ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ తర్వాత మరో 24 పరుగుల వ్యవధిలోనే కర్ణాటక జట్టు చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. ఓజాకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్టాఫ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసేసరికి ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement