Varun Aaron
-
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్‌లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్‌లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్‌కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే.. -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ 2024లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ తనకు చివరి రెడ్ బాల్ మ్యాచ్ అని వెల్లడించాడు. ఫాస్ట్ బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదని, అందుకే రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 34 ఏళ్ల వరుణ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో జార్ఖండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తన సొంత మైదానమైన కీనన్ స్టేడియంలో (జంషెడ్పూర్) రాజస్థాన్‌తో రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. 2010 దశకంలో టీమిండియా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న వరుణ్.. 2011-15 మధ్యలో 9 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఐపీఎల్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున 52 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన వరుణ్ 65 మ్యాచ్‌లు ఆడి 168 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. వరుణ్ దేశవాలీ క్రికెట్లో జార్ఖండ్‌తో పాటు బరోడా జట్టుకు కూడా ఆడాడు. 2014 ఓల్డ్‌ట్రాఫర్డ్ టెస్ట్‌లో రాకాసి బౌన్సర్‌తో ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ముక్కు పగలగొట్టడం ద్వారా వరుణ్ వెలుగులోకి వచ్చాడు. -
స్పెషల్ బంతితో మెరిశాడు.. ప్రతీసారి జరగాలని రాసిపెట్టి ఉండదు!
బ్యాట్స్‌మెన్‌కు ఫెవరెట్ షాట్స్ ఎలా ఉంటాయో.. బౌలర్లు తమ బౌలింగ్‌లో వైవిధ్యతను చూపించేందుకు ప్రాధాన్యమిస్తారు. పేసర్లు అయితే యార్కర్స్, ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, కట్బాల్.. స్పిన్నర్లు అయితే దూస్రా, గూగ్లీ, క్యారమ్ బాల్ లాంటివి ఉపయోగిస్తారు. అలాంటి కోవకే చెందినదే నకుల్ బాల్. చేతి వేళ్ల మధ్య బంతిని ఉంచి విడుదల చేయడమే నకుల్ బంతి స్పెషాలిటీ. ఇది మన టీమిండియా బౌలర్లో భువనేశ్వర్ ఎక్కువగా ఉపయోగించేవాడు. ఒక దశలో భువీని నకుల్ స్పెషలిస్ట్ అని పిలిచేవారు. నకుల్ బంతిని బ్యాట్స్‌మన్ మిస్ చేశాడో.. లెగ్ స్టంప్ లేదా ఆఫ్‌స్టంప్ వికెట్ ఎగిరిపోవాల్సిందే. నకుల్ బంతి మరీ ఫాస్ట్‌గా ఉండదు.. అలా అని నెమ్మదిగాను ఉండదు. తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ వరుణ్ ఆరోన్ నకుల్ బంతి విసిరాడు. అయితే క్రీజులో ఉన్న ఎవిన్ లూయిస్ దానిని సమర్థంగా ఎదుర్కొని బౌండరీకి తరలించాడు. అలా వరుణ్ ఆరోన్ స్పెషల్ బంతితో మెరిసినప్పటికి వికెట్ మాత్రం పడగొట్టలేకపోయాడు. అయితే వరుణ్ ఆరోన్ నకుల్ బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2019లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో వరుణ్ ఆరోన్ నకుల్ బంతితో అప్పటి కేకేఆర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తాజాగా మాత్రం విఫలమయ్యాడు. ''పాపం వరుణ్ ఆరోన్.. వికెట్ ఆశించి ఉంటాడు.. ప్రతీసారి అదే జరుతుందని అనుకోలేం'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!? IPL 2022: 145 కి.మీ. స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్! V Aaron swinging away to Lewis with knuckle grip. Unique delivery, don't think any other pacers currently swinging with knuckle grip. pic.twitter.com/X8uSJc8zLB — Muthu kumar.. (@MuthukJo) March 29, 2022 -
అక్టోబర్ 29 ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: నాగేంద్రబాబు (నటుడు), వరుణ్ ఆరోన్ (క్రికెటర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరి పుట్టిన తేదీ 29. ఇది చంద్ర కుజుల కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య. ఈ తేదీలో పుట్టిన వారికి 29 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో వృద్ధి, విదేశీ యానం ఉంటుంది. రాజకీయాలలో ఉన్న వారికి తగిన పదవి, గుర్తింపు లభిస్తాయి. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఆ ప్రతిపాదనలు విరమించుకోవడం మంచిది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. పూర్వికుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొంటుంది. భర్త ఆస్తిలో వాటా లేదా మనోవర్తి కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ ఏడాది తప్పక లాభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల విజయం సాధించగలుగుతారు. లక్కీ నంబర్స్: 1,2,4,6,8; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; సూచనలు: రోజూ కాసేపు వెన్నెలలో విహరించడం, చంద్రకాంతమణిని లేదా ముత్యాన్ని ధరించడం, శివుడికి అభిషేకం చేయడం, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయటం, ఆల యాలు, దర్గాలు, చర్చిలలో పాయసం లేదా ఇతర తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఆరోన్ మెరుపు బౌలింగ్
బెంగళూరు: పేసర్ వరుణ్ ఆరోన్ ధాటికి రంజీ చాంపియన్ కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్‌లో విలవిల్లాడింది. ఇరానీ కప్‌లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.... ఆరోన్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో తొలిసారిగా ఆరు వికెట్లతో రెచ్చిపోవడంతో కర్ణాటక 77.1 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (119 బంతుల్లో 68; 13 ఫోర్లు), కరుణ్ నాయర్ (99 బంతుల్లో 59; 11 ఫోర్లు), అభిషేక్ రెడ్డి (87 బంతుల్లో 54; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. 107కే నాలుగు వికెట్లు పడిన దశలో కరుణ్, అభిషేక్ ఐదో వికెట్‌కు 113 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆ తర్వాత మరో 24 పరుగుల వ్యవధిలోనే కర్ణాటక జట్టు చివరి ఐదు వికెట్లను కోల్పోయింది. ఓజాకు రెండు వికెట్లు పడ్డాయి. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన రెస్టాఫ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసేసరికి ఐదు ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. -
ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గాయపడిన పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి వచ్చాడు. రెండు, మూడో వన్డేల కోసం బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ తెలిపింది. కటక్ వన్డేలో ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తొలి బంతి వేయగానే ఆరోన్ కండరాల నొప్పితో మైదానం వీడాడు. ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన చివరి వ న్డే ఆడాడు. గురువారం రెండు జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. -
వరుణ్ ఆరోన్ స్థానంలో స్టువర్ట్ బిన్నీ
న్యూఢిల్లీ: గాయపడిన భారత పేసర్ వరుణ్ ఆరోన్ స్థానంలో ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ జట్టులోకి రానున్నాడు. శ్రీలంకతో జరగనున్న రెండు, మూడు వన్డేలకు ఆరోన్ స్థానంలో బిన్నీని తీసుకున్నట్టు బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక-భారత్ రెండో వన్డే గురువారం అహ్మదాబాద్ లో జరగనుంది. జూన్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బిన్నీ చివరిసారిగా ఆడాడు. ఈ నెల 2న జరిగిన తొలి వన్డేలో కుడికాలి కండరాలు పట్టేయడంతో ఆరోన్ బౌలింగ్ చేయలేకపోయాడు. 13వ ఓవర్ లో ఆరోన్ వైదొలగడంతో అతడి కోటాను కెప్టెన్ విరాట్ కోహ్లి పూర్తి చేశాడు.