బ్యాట్స్‌మెన్‌కు ఫెవరెట్ షాట్స్ ఎలా ఉంటాయో.. బౌలర్లు తమ బౌలింగ్‌లో వైవిధ్యతను చూపించేందుకు ప్రాధాన్యమిస్తారు. పేసర్లు అయితే యార్కర్స్, ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, కట్‌బాల్.. స్పిన్నర్లు అయితే దూస్రా, గూగ్లీ, క్యారమ్ బాల్ లాంటివి ఉపయోగిస్తారు. అలాంటి కోవకే చెందినదే నకుల్ బాల్. చేతి వేళ్ల మధ్య బంతిని ఉంచి విడుదల చేయడమే నకుల్ బంతి స్పెషాలిటీ. ఇది మన టీమిండియా బౌలర్లో భువనేశ్వర్ ఎక్కువగా ఉపయోగించేవాడు. ఒక దశలో భువీని నకుల్ స్పెషలిస్ట్ అని పిలిచేవారు. నకుల్ బంతిని బ్యాట్స్‌మన్ మిస్ చేశాడో.. లెగ్ స్టంప్ లేదా ఆఫ్‌స్టంప్ వికెట్ ఎగిరిపోవాల్సిందే. నకుల్ బంతి మరీ ఫాస్ట్‌గా ఉండదు.. అలా అని నెమ్మదిగాను ఉండదు.
తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ వరుణ్ ఆరోన్ నకుల్ బంతి విసిరాడు. అయితే క్రీజులో ఉన్న ఎవిన్ లూయిస్ దానిని సమర్థంగా ఎదుర్కొని బౌండరీకి తరలించాడు. అలా వరుణ్ ఆరోన్ స్పెషల్ బంతితో మెరిసినప్పటికి వికెట్ మాత్రం పడగొట్టలేకపోయాడు. అయితే వరుణ్ ఆరోన్ నకుల్ బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2019లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో వరుణ్ ఆరోన్ నకుల్ బంతితో అప్పటి కేకేఆర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తాజాగా మాత్రం విఫలమయ్యాడు. ''పాపం వరుణ్ ఆరోన్.. వికెట్ ఆశించి ఉంటాడు.. ప్రతీసారి అదే జరుతుందని అనుకోలేం'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.
చదవండి: IPL 2022: జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!?
IPL 2022: 145 కి.మీ. స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్!
V Aaron swinging away to Lewis with knuckle grip. Unique delivery, don't think any other pacers currently swinging with knuckle grip. pic.twitter.com/X8uSJc8zLB
— Muthu kumar.. (@MuthukJo) March 29, 2022
Comments
Please login to add a commentAdd a comment