Nakul
-
నేడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. దానికి నేటి నుంచే శ్రీకారం పడేలా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ నష్టం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్ ఆదివారం (ఫిబ్రవరి 18) బీజేపీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి. కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేసే కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ బయో నుండి కాంగ్రెస్ పేరును తొలగించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కమల్ నాథ్ ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. కమల్‌నాథ్‌కు కంచుకోటగా పేరుగాంచిన చింద్వారాలో ఇది జరిగింది. నకుల్‌నాథ్ గట్టిపోటీ ఎదుర్కొన్నాక విజయం సాధించారు. కమల్‌నాథ్ తొమ్మిది సార్లు ఎంపీగా పని చేశారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ 2019 ఎన్నికల్లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. -
రణ్వీర్ బాటలో మరో నటుడు, అతడి భార్య భలే ఆన్సరిచ్చిందిగా!
రణ్వీర్ సింగ్ ఫొటోషూట్ నెట్టింట ఎంత రచ్చ లేపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నీ ధైర్యానికి సలామని కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరేమో ఈ తెలివితక్కువ పనేంటని బుగ్గలు నొక్కుకున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు కూడా రణ్వీర్ను ఫాలో అయ్యాడు. అతడిలాగే ఒంటిమీద నూలు పోగు లేకుండా దర్శనమిద్దామనుకున్నాడు. అనుకోవడమేంటి, ఆలోచన అమల్లో పెట్టేశాడు. అచ్చం రణ్వీర్ సింగ్లా పోజు పెట్టిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. ఇది చూసిన నెటిజన్లు అటు మెచ్చుకోకుండా, ఇటు నొచ్చుకోకుండా పడీపడీ నవ్వుతున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో కనిపించేదంతా నిజం కాదు. రణ్వీర్ 'పేపర్' మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోను ఎడిట్ చేసి దానికి తన ముఖాన్ని అతికించాడు. తాను కూడా స్టోన్ మ్యాగజైన్ కోసం ఇలా మారానంటూ జోక్ చేశాడు. మొత్తానికి నకుల్ ఎడిటింగ్ టాలెంట్ చూసిన అభిమానులు నవ్వాపుకోలేకపోతున్నారు. అతడి భార్య జంకీ అయితే.. 'వెంటనే అతడికి పొట్టినిక్కర్లు పట్టుకెళ్లాల్సిందే' అని ఫన్నీగా కామెంట్ చేసింది. కాగా నకుల్ ప్యార్‌కా దర్ద్ హై మీఠా మీఠా, ఇష్క్బాజ్, బడే అచ్చె లగ్తే హై వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు. View this post on Instagram A post shared by Nakuul Mehta (@nakuulmehta) చదవండి: హోంటూర్ వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల ఆమె గొంతు పూర్తిగా పడిపోయింది: నటి శ్రీవాణి భర్త -
స్పెషల్ బంతితో మెరిశాడు.. ప్రతీసారి జరగాలని రాసిపెట్టి ఉండదు!
బ్యాట్స్‌మెన్‌కు ఫెవరెట్ షాట్స్ ఎలా ఉంటాయో.. బౌలర్లు తమ బౌలింగ్‌లో వైవిధ్యతను చూపించేందుకు ప్రాధాన్యమిస్తారు. పేసర్లు అయితే యార్కర్స్, ఇన్ స్వింగర్, ఔట్ స్వింగర్, కట్బాల్.. స్పిన్నర్లు అయితే దూస్రా, గూగ్లీ, క్యారమ్ బాల్ లాంటివి ఉపయోగిస్తారు. అలాంటి కోవకే చెందినదే నకుల్ బాల్. చేతి వేళ్ల మధ్య బంతిని ఉంచి విడుదల చేయడమే నకుల్ బంతి స్పెషాలిటీ. ఇది మన టీమిండియా బౌలర్లో భువనేశ్వర్ ఎక్కువగా ఉపయోగించేవాడు. ఒక దశలో భువీని నకుల్ స్పెషలిస్ట్ అని పిలిచేవారు. నకుల్ బంతిని బ్యాట్స్‌మన్ మిస్ చేశాడో.. లెగ్ స్టంప్ లేదా ఆఫ్‌స్టంప్ వికెట్ ఎగిరిపోవాల్సిందే. నకుల్ బంతి మరీ ఫాస్ట్‌గా ఉండదు.. అలా అని నెమ్మదిగాను ఉండదు. తాజాగా ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ వరుణ్ ఆరోన్ నకుల్ బంతి విసిరాడు. అయితే క్రీజులో ఉన్న ఎవిన్ లూయిస్ దానిని సమర్థంగా ఎదుర్కొని బౌండరీకి తరలించాడు. అలా వరుణ్ ఆరోన్ స్పెషల్ బంతితో మెరిసినప్పటికి వికెట్ మాత్రం పడగొట్టలేకపోయాడు. అయితే వరుణ్ ఆరోన్ నకుల్ బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2019లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్న సమయంలో వరుణ్ ఆరోన్ నకుల్ బంతితో అప్పటి కేకేఆర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. తాజాగా మాత్రం విఫలమయ్యాడు. ''పాపం వరుణ్ ఆరోన్.. వికెట్ ఆశించి ఉంటాడు.. ప్రతీసారి అదే జరుతుందని అనుకోలేం'' అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022: జాసన్ రాయ్, అలెక్స్ హేల్స్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!? IPL 2022: 145 కి.మీ. స్పీడ్‌తో యార్కర్.. పాపం విజయ్ శంకర్.. వీడియో వైరల్! V Aaron swinging away to Lewis with knuckle grip. Unique delivery, don't think any other pacers currently swinging with knuckle grip. pic.twitter.com/X8uSJc8zLB — Muthu kumar.. (@MuthukJo) March 29, 2022 -
భువీ బర్త్ డే.. కెరీర్ విశేషాలివే..!
హైదరాబాద్: టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌కు ప్రపంచవ్యాప్త క్రీడాభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నేడు (ఫిబ్రవరి 5) భువీ 31వ పడిలోకి అడుగుపెట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ మీడియం పేసర్.. బంతిని రెండువైపులా స్వింగ్ చేయడంలో సమర్ధుడు. ప్రతి బంతిలోనూ వైవిధ్యం చూపగలిగే ఈ ఆటగాడు.. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు ఆఖరి ఓవర్లలో బంతి వేగంలో వైవిధ్యాన్ని చూపుతూ పొదుపుగా బౌలింగ్ చేయడంలో దిట్ట. 'నకుల్' బంతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన భువీ.. సమర్ధవంతమైన బౌలర్‌గానే కాకుండా నమ్మకమైన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమిండియా తరపున 21 టెస్ట్‌లు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడిన భువీ.. 63 టెస్ట్ వికెట్లు, 132 వన్డే వికెట్లు, 41 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న భువీ.. టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2011 ఐపీఎల్ సీజన్లో పూణే వారియర్స్ తరపున బరిలోకి దిగిన భువీ.. సంచలన ప్రదర్శనలతో వెలుగులోకి వచ్చి, జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను.. గాయం కారణంగా గతేడాది కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే పరిమితమయ్యాడు. ఇటీవల ముగిసిన ముస్తాక్ అలీ టోర్నీలో పునరాగమనం చేసిన భువీ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. భువీ జన్మదినం సందర్భంగా అతని కెరీర్‌లోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. రంజీల్లో సచిన్‌ను డకౌట్ చేసిన తొలి బౌలర్‌గా గుర్తింపు వన్డే కెరీర్లో తొలి బంతికే వికెట్ సాధించాడు 2014 ఇంగ్లండ్ పర్యటనలో 9వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగి మూడు అర్ధశతకాలు సాధించిన తొలి భారత క్రికెటర్ ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస సీజన్లలో(సన్‌రైజర్స్ తరపున 2016, 2017) పర్పుల్ క్యాప్ సాధించిన ఏకైక ఆటగాడు మూడు క్రికెట్ ఫార్మాట్లలో 5వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్ Just a thread of Bhuvi and Nupur being the cutest together ❤️ @BhuviOfficial#HappyBirthdayBhuvi pic.twitter.com/WLF1v1lnde — Happy Birthday Bhuvs ❤️ (@ishita11x) February 5, 2021 -
వాళ్లిదరి ఆచూకీ చెబితే రూ. 21 వేలు!
భోపాల్: ‘‘మహమ్మారి కరోనా సంక్షోభ సమయంలో కనిపించకుండా పోయిన చింద్వారా ఎమ్మెల్యే, ఎంపీ కోసం స్థానిక ప్రజలు వెదుకులాట ప్రారంభించారు. వాళ్లను చింద్వారాకు తీసుకువచ్చిన వారికి 21,000 క్యాష్ రివార్డు ఇస్తాం’’ అంటూ చింద్వారా నియోజకవర్గం ప్రజలు పలుచోట్ల పోస్టర్లు అంటించారు. విపత్కర సమయంలో తమకు అండగా నిలవకుండా బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారంటూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ ఫొటోలను పోస్టర్లపై ముద్రించి నిరసన తెలిపారు. కాగా చింద్వారా శాసన సభ స్థానం నుంచి కమల్‌నాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందగా.. లోక్‌సభ స్థానం నుంచి ఆయన తనయుడు నకుల్‌నాథ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.('కళ్ల ముందే ప్రాణం పోతుంటే ఏం చేయలేకపోయా') ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా తాము కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ వీరిద్దరిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఇలా పోస్టర్లు వేయించారు. ఇక పోస్టర్లపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ నాయకులే ఈ చర్యకు పాల్పడ్డారంటూ విమర్శలు గుప్పించారు. అయితే బీజేపీ నేతలు ఆ విమర్శలను కొట్టిపారేశారు. ఆ పోస్టర్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన జ్యోతిరాదిత్యా సింధియా కమల్‌నాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కమల్ సర్కారు కూలిపోగా.. ఆయన రాజీనామా అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.(మిగిలిన టెన్త్ పరీక్షలు రద్దు.. సీఎం కీలక నిర్ణయం) -
చింద్వారాలో చిందేస్తున్న వారసుడు
మధ్యప్రదేశ్‌లో మొదట్నించీ కాంగ్రెస్ కంచుకోట చింద్వారా లోక్‌సభ స్థానం. 1957లో అవతరించిన చింద్వారాలో పోలింగ్ ఈ నెల 29న జరుగుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ 1980 నుంచి 2014 ఎన్నికవరకూ ఇక్కడ తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆయన కొడుకు నకుల్‌నాథ్ పోటీచేస్తున్నారు. 1996లో ఓ కోర్టు కేసు కారణంగా కమల్‌నాథ్ పోటీ చేయలేదు. భార్య అల్కానాథ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి విజయం సాధించారు. ఈ కేసులో క్లీన్చిట్ రావడంతో 1997లో తన భార్యతో రాజీనామా చేయించగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన పోటీచేసి బీజేపీ మాజీ సీఎం సుందర్‌లాల్ పట్వా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఇదే మొదటిసారి. మళ్లీ 1998 నుంచీ కమల్‌నాథ్ గెలుస్తూ వచ్చారు. 44 ఏళ్ల నకుల్‌నాథ్ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. 1996లో తన తల్లి అల్కా గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ చదివారు. ఎన్నికల అనుభవం లేకున్నా చింద్వారాలో కమల్‌నాథ్ వేసిన పునాదులు నకుల్‌కు ఉపయోగపడతాయి. కిందటి ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి బదులు నాథన్ షా కర్వేటీకి బీజేపీ టికెట్ ఇచ్చారు. ఆరెసెస్ నేపథ్యం ఉన్న యువ ఆదివాసీ నేత నాథన్ షా. తొలి నుంచీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చడం, ఢిల్లీలో వారి కోసం 24 గంటలూ పనిచేసే ఆఫీసు ఏర్పాటు చేయడం ద్వారా చింద్వారా ప్రజల్లో కమల్‌నాథ్ తిరుగులేని ఆదరణ సంపాదించారు. కాంగ్రెస్ గెలుపు సునాయాసమే! చింద్వారా సీటుకు నకుల్ పేరు ఒక్కటే ప్రతిపాదించడం, తండ్రి ముఖ్యమంత్రి పదవిలో ఉండడం, బలహీనమైన బీజేపీ ప్రత్యర్థి బరిలో ఉండడం వంటి కారణాల వల్ల నకుల్ గెలుపు నల్లేరుపై నడకగా వర్ణిస్తున్నారు. చిన్న వయసు నుంచీ తండ్రితోపాటు చింద్వారాలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం, సెలవులు ఇక్కడే గడపడంతో నకుల్‌కు ఈ ప్రాంతం కొత్త కాదు. కిందటి డిసెంబర్లో తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచీ నకుల్ చింద్వారా వచ్చి కాంగ్రెస్ నాయకులతో సమావేశం కావడం ఎక్కువైంది. నకుల్కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కార్యకర్తల నుంచి వచ్చింది. తండ్రికి సీఎం పదవి దక్కినప్పుడు కొడుకుకు లోక్‌సభ టికెట్ ఇవ్వడం కాంగ్రెస్‌లో కొత్తేమీ కాదు. -
ఒకరి ఆస్తి 660కోట్లు మరొకరి ఆస్తి రూ.1,823
ఎన్నికలంటేనే కోట్ల రూపాయల వ్యవహారంగా మారిన ఈ రోజుల్లో పట్టుమని పదివేలు కూడా లేకుండా ఎన్నికల బరిలో దిగడం సాహసమే అనాలి. లేదా తెలివి తక్కువతనమనాలి. మధ్య ప్రదేశ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఇలాంటి నిరుపేదలు ఉన్నారని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) విశ్లేషణలో తేలింది.ఈ ఎన్నికల్లో కోటీశ్వరులతో పాటు పేదలు, నిరక్షరాస్యులు కూడా పోటీ చేస్తున్నారు. సిద్ధి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న లలన్ కుమార్ ఆస్తి కేవలం 1,823 రూపాయలు. రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్న 104 మందిలో ఈయనే కడు పేదవాడని ఏడీఆర్ పేర్కొంది. అలాగే,ఇక్కడ నుంచే బరిలో దిగిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి రాం సహాయ్ ఆస్తి 6,134 రూపాయలు. కాగా జబల్పూర్ అభ్యర్థి ధనుక్ పరిస్థితి వీరిద్దరికంటే కొంచెం మెరుగు.ఆయన ఆస్తి విలువ 10,300 రూపాయలు. ఇక కోటీశ్వరుల విషయానికి వస్తే, చింద్వారా కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్(సీఎం కమల్‌నాథ్ కుమారుడు) ఆస్తి 660 కోట్లు. జబల్పూర్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తన్ఖా 66 కోట్ల ఆస్తిపరుడు. సిద్ధి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ సింగ్‌కు 37కోట్ల విలువైన ఆస్తిపాస్తులున్నాయని ఏడీఆర్ తెలిపింది.వివేక్ తన వార్షికాదాయం 11 కోట్ల రూపాయలని ఇన్‌కంట్యాక్స్ రిటర్న్స్‌లో పేర్కొంటే, నకుల్ 2 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం 104 మంది అభ్యర్థుల్లో 14శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 17శాతం మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని అఫిడవిట్లలో తెలిపారు. అభ్యర్థుల్లో 41 మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు. 55 మంది 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఇద్దరు అసలు చదువుకోలేదు. మరో నలుగురికి చదవడం, రాయడం వచ్చు. ఈసారి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎక్కువగా యువకులనే బరిలో దింపాయని ఏడీఆర్ తెలిపింది. మొత్తం అభ్యర్థుల్లో 60శాతం పాతిక నుంచి 50 ఏళ్ల లోపు వారే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు(షాదోల్, సిద్ధి, జబల్పూర్, మాండ్లా, బాలాఘాట్, చింద్వారా)కు ఏప్రిల్ 29న పోలింగు జరుగుతుంది. -
హామీలు నెరవేర్చకుంటే బట్టలిప్పి కొట్టండి!
ధనోరా: లోక్‌సభ ఎన్నికల్లో ఛింద్వారా నుంచి తన కుమారుడు నకుల్‌నాథ్‌ను గెలిపించాలని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ ప్రజలను కోరారు. ఒకవేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే అతని దుస్తులను చించివేసి శిక్షించాలని సూచించారు. ధనోరా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఛింద్వారా నియోజకవర్గంతో తన 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కమల్‌నాథ్..‘నకుల్ ప్రస్తుతమిక్కడ లేకపోయినా మీకు సేవ చేస్తాడు. నకుల్‌కు ఆ బాధ్యతను నేను అప్పగించాను. మీరిచ్చిన శక్తి, ప్రేమ వల్లే నేను ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాను. మనం త్వరలోనే సరికొత్త చరిత్రను సృష్టించడంతో పాటు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం’ అని అన్నారు. -
అలరిస్తూ ఆలోచింపజేసే చిత్రం
తమిళ సినిమా: సగటు ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచి అదే సమయంలో ఆలోసింపజేసే చిత్రంగా బ్రహ్మ.కామ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పురుష్ విజయ్ తెలిపారు. మెలినా కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం లో నకుల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా ఆస్నాజవేరి నటించగా సిద్ధార్థ్ విపిన్, దర్శకుడు కే.భాగ్యరాజ్, నటి నీతూచంద్ర,కౌశల్య, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ భగవంతుడిని అందరూ ఏదోఒకటి కోరుతూనే ఉంటారన్నారు. అయితే ఆయన సృష్టించిన మనకి ఏమేం చేయాలో ఆయనకు తెలియదా?అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మ.కామ్ అని తెలిపారు. ఇది పూర్తి స్థాయి వినోదంతో కూడిన చిత్రమే అయినా ఆలోచింపజేసే సన్నివేశాలు చాలానే ఉంటాయన్నారు. హీరో నకుల్ ఒక యాడ్ ఫిలిం డర్శకుడున్నారు. నటి ఆస్నాజవేరి మోడల్ అని, సిద్ధార్థ్ విపిన్ యాడ్ కంపెనీ నిర్వాహకుడిగా నటించారని తెలిపారు. నకుల్, సిద్ధార్థ్ విపిన్లిద్దరూ ఆస్నాజవేరిని ప్రేమిస్తుంటారని చెప్పారు. దర్శకుడు కే.భాగ్యరాజ్ దేవుడిగా నటించారన్నారు.దేవుడంటే కిరీటం ధరించి కాకుండా సాధారణ మనిషిలానే కనిపిస్తారని, ఆయన్ని నకుల్ ఎప్పుడూ ఎదో ఒకటి అడుగుతూ చేసే గోల ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఇక నటి నీతూచంద్ర చిత్రంలోనూ నటిగానే నటించి ఒక గ్లామరస్ పాత్రలోనూ కనువిందు చేయనున్నారని దర్శకుడు తెలిపారు. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుందని తెలిపారు. -
అలరిస్తూ ఆలోచింపజేసే ‘బ్రహ్మ.కామ్’
సగటు ప్రేక్షకుడికి కావలసినంత వినోదాన్ని పంచి అదే సమయంలో ఆలోసింపజేసే చిత్రంగా బ్రహ్మ.కామ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పురుష్ విజయ్ తెలిపారు. మెలినా కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రంలో నకుల్ హీరోగా నటించారు. ఆయనకు జంటగా ఆస్నాజవేరి నటించగా సిద్ధార్థ్ విపిన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, నటి నీతూచంద్ర, కౌశల్య, ముట్టై రాజేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 15న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ భగవంతుడిని అందరూ ఏదో ఒకటి కోరుతూనే ఉంటారు.. అయితే ఆయన సృష్టించిన మనకి ఏమేం చేయాలో ఆయనకు తెలియదా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మ.కామ్ అని తెలిపారు. ఇది పూర్తిస్థాయి వినోదంతో కూడిన చిత్రమే అయినా ఆలోచింపజేసే సన్నివేశాలు చాలానే ఉంటాయన్నారు. నకుల్ ఒక యాడ్ ఫిలిం డర్శకుడిగా, ఆస్నాజవేరి మోడల్‌గా, సిద్ధార్థ్ విపిన్ యాడ్ కంపెనీ నిర్వాహకుడిగా నటించారని తెలిపారు. నకుల్, సిద్ధార్థ్ విపిన్లిద్దరూ ఆస్నాజవేరిని ప్రేమిస్తుంటారని చెప్పారు. దర్శకుడు కె.భాగ్యరాజ్ దేవుడిగా నటించారన్నారు. దేవుడంటే కిరీటం ధరించి కాకుండా సాధారణ మనిషిలానే కనిపిస్తారని, ఆయన్ని నకుల్ ఎప్పుడూ ణేదో ఒకటి అడుగుతూ చేసే గోల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పారు. ఇక నీతూచంద్ర చిత్రంలోనూ నటిగానే నటించి ఒక గ్లామరస్ పాత్రలో కనువిందు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
నాకు అవకాశాలు ఇవ్వాల్సిందే
ఇప్పుడిక తప్పదు అంటోంది నటి ఆస్నా జవేరి. ఈ జాన గొడవేమిటనేగా మీ ప్రశ్న. హాస్యనటుడు సంతానం కథానాయకుడిగా అవతారమెత్తిన వల్లవనుక్కుమ్ పుల్లుం చిత్రంలో ఆయనతో రొమాన్స్ చేసి కోలీవుడ్‌కు దిగుమతి అయిన ముంబై భామ ఆస్నా జవేరి. ఆ చిత్ర విజయంతో మరోసారి అదే నటుడితో ఇనిమే ఇప్పడిదాన్ చిత్రంలో జత కట్టింది. దీంతో సంతానం సిఫారసు చేస్తున్న నటి, ఆయనతో సన్నిహితంగా ఉంటోందన్న ప్రచారం జోరందుకుంది. అలాంటి వదంతులకు ఫుల్స్టాప్ పెట్టేలా సంతానం ఆస్నా జవేరిని దూరంగా పెట్టారనే వార్తలు హల్చల్ చేశాయి. అలా రెండు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించినా ఆస్నాకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని పొందాలనే పట్టుదలతో ఉన్న ఈ అమ్మడు అందుకు రూట్ ఏమిటన్న ఆలోచనలో భాగంగా తనకు తమిళ భాష సమస్యగా మారడంతో కోలీవుడ్ పక్కన పెట్టిందన్న అభిప్రాయానికి వచ్చిన ఆస్నా జవేరి తమిళ భాషను స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుందట. ఇప్పుడామె తన భాషా పాండిత్యాన్ని పరిచయం అయిన దర్శకుల వద్ద ప్రదర్శిస్తూ, చూశారా తాను తమిళంలో ఎలా మాట్లాడగలుగుతున్నానో, ఇక తనకు అవకాశాలు ఇవ్వాల్సిందే అంటూ చొరవతోనే గొడవ చేస్తోందట. ప్రస్తుతం ఆస్నా జవేరి నకుల్‌కు జంటగా బ్రహ్మ.కామ్, ఆరితో నాగేశ్ తిరైఅరంగేట్రం చిత్రాలతో పాటు సీవీ.కుమార్ సంస్థలో మరో చిత్రం చేస్తూ బిజీగానే ఉందట. అయితే స్టార్ హీరోలతో నటించడానికి తనదైన స్టైల్లో అవకాశాల వేటలో పడిందట. మొత్తం మీద ఎంతో కాలంగా కోలీవుడ్‌లో నటిస్తున్న చాలా మంది బాలీవుడ్ భామలకు ఇప్పటికీ తమిళ భాష మట్లాడలేకపోతున్నారు. ఇటీవలే కోలీవుడ్‌కు వచ్చిన ఆస్నా జవేరి తమిళ భాషను నేర్చుకోవడాన్ని అభినిందించాల్సిందే. -
నకుల్, ఆంజల్ సెయ్ ప్రారంభం
నకుల్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం సెయ్ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్థానిక సాలిగ్రామంలో గల ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.ఇందులో నకుల్‌కు జంటగా ఘాయల్-2 చిత్రం ఫేమ్ బాలీవుడ్ నటి ఆంజల్ నాయకిగా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అవుతోంది. దీన్ని బియాండ్ ఐ ఎంటర్టెయిన్మెంట్ అధినేత సుబిన్,ట్రిప్పీ టర్పిల్ ప్రొడక్షన్స్ అధినేతలు మను,ఉమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళంలో సారథి అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోపాల్ మనోజ్ ఈ సెయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథ,కథనాన్ని రాజేశ్ కే.రామన్ సమకూర్చారు. దీనికి నిక్స్లోఫేస్ సంగీతాన్ని,రాజేశ్ శుక్లా ఛాయాగ్రహణను,దళపతి దినేశ్ పోరాట సన్నివేశాలను కంపోజ్ చేయనున్నారు. పాత్రికేయుల సమావేశంలో చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది సినిమా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. పెద్ద నటుడు కావాలని తపించే హీరో, దర్శకురాలు కావాలని ఆశించే హీరోయిన్ల కలయిక వారి పయనాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నదే సెయ్ చిత్రం అన్నారు. పాత్ర నచ్చింది చిత్ర కథానాయకుడు నకుల్ మాట్లాడుతూ తాను చాలా సెలెక్టెడ్ చిత్రాలను అంగీకరిస్తున్నానని, ఈ సెయ్ చిత్రంలోని కథానాయకుడి పాత్ర నచ్చడంతో చేయడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. తమిళంలో మాట్లాడతా ఆంజల్ మాట్లాడుతూ తమిళంలో తనకిది తొలి చిత్రం. అందువల్ల ప్రస్తుతానికి తమిళంలో మాట్లాడలేనని,అయితే చిత్రం పూర్తి అయ్యేలోగా తమిళ భాష నేర్చుకుని మాట్లాడతానని అన్నారు.తనకు తమిళ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
నకుల్‌తో బాలీవుడ్ బ్యూటీ అంచల్
నటుడు నకుల్ బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. వల్లినం వంటి విజయవంతమైన చిత్రం తరువాత నకుల్ ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.ఇటీవలే ఓ ఇంటి వాడైన ఈయన కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో బాలీవుడ్ భామ ఆంచల్ కథానాయికిగా పరిచయం కానున్నారు. ఈమె హిందీలో కరణ్ జోహర్ నిర్మించిన వీఆర్ ఫ్యామిలీ చిత్రం ద్వారా నటిగా పరిచయమైందన్నది గమనార్హం. ఆ తరువాత ప్రకాశ్ జా దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్‌తో కలసి అరక్షన్ చిత్రంలో ఇటీవల సన్నిడియోల్‌తో కలిసి ఘాయల్ ఒన్స్ ఎగైన్ చిత్రంలోనూ నటించి ప్రాచుర్యం పొందిన ఆంచల్ ఇప్పుడు కోలీవుడ్‌కు దిగుమతి అవుతోంది. దీన్ని ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాణ సంస్థలు బియాండ్ ఎంటర్టెయిన్మెంట్,ట్రిప్పీ టర్టిల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రముఖ మలయాళ దర్శకుడు గోపాలన్ మనోజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈయన జాతీయ అవార్డులతో పాటు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ దర్శకుడిగా అవార్డులను అందుకున్నారు. గోపాలన్ మనోజ్ దర్శకత్వం వహించిన వయలిన్ టెలీఫిలిం కేరళ ప్రభుత్వం నుంచి నాలుగు అవార్డులను గెలుచుకుంది. అదే విధంగా లారా టెలీఫిలిం, అతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను అందుకుంది. దర్శకుడి తొలి చిత్రం సారధి ప్రేక్షకాదరణతో పాటు వివర్శకుల ప్రశంసలు పొందింది. నకుల్, అంచల్ హీరోహీరోయిన్లుగా నటించనున్న చిత్రం ఈ నెల 26న చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి కథ, కథనం,మాటలను రాజేశ్ కే.రామన్, సతీష్ గురూబ్ చాయాగ్రహణం, నితిన్ లోబస్ సంగీతాన్ని, జిగర్తండ చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న వివేక్ హర్షన్ ఎడిటింగ్ బాధ్యతల్ని అందించనున్నారు. -
ఘనంగా నటుడు నకుల్ వివాహం
తమిళసినిమా: నటుడు నకుల్ ఓ ఇంటివాడయ్యారు. ప్రియురాలి మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడు అడుగులు నడిచారు. బాయ్స్ చిత్రంలో నలుగురు హీరోలలో ఒకరిగా పరిచయం అయిన నకుల్ ఆ తరువాత కాదలిల్ విళిదేన్, మాచిలామణి, నాన్రాజావగపోగిరేన్, తమిళుక్కు ఎన్ 1ఐ అళుత్తవుమ్ తదితర చిత్రాలలో నటించారు. ఈయన నటి దేవయాని తమ్ముడన్నది తెలిసిన విషయమే. కాగా ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పని చేస్తున్న శ్రుతి భాస్కర్ అనే అమ్మాయి నకుల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు పంచజెండా ఊపడంతో గత నెలలో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఆదివారం ఉదయం స్థానిక ఎగ్మోర్‌లోని రాణి మెయ్యమ్మై కల్యాణ మండపంలో జరిగింది. వేద మంత్రాల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఉదయం 10.41 గంటలకు నకుల్ శ్రుతి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. -
జూన్‌లో తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం
తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం చిత్రం జూన్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ నటుడు నకుల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోగా అట్టకత్తి దినేష్ నటిస్తున్నారు. హీరోయిన్లుగా బిందుమాధవి, నవ నటి ఐశ్వర్య నటిస్తున్నారు. వి.ఎల్.ఎస్.రాక్ సినిమా పతాకంపై వి.చంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు రామ్‌ప్రకాష్ పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు శరవణన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. పలు యాడ్ ఫిలిం చేసినా రామ్ ప్రకాష్ తన తొలి చిత్రం తమిళుక్కు ఒండ్రై అలుత్తవుం చిత్రం గురించి తెలుపుతూ ఒక సంఘటనతో వేదనకు గురై కథలోని పాత్రలు చివరికి ఆ వేదన నుంచి ఎలా బయటపడతాయనేది ఈ చిత్రం అని తెలిపారు. చిత్రంలోని ప్రధాన పాత్రలను ఆ సంఘటన కలుపుతుందన్నారు. చిత్రంలో లవ్, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ అంటూ అన్ని కమర్షియల్ అంశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. అయితే ఇతర కమర్షియల్ చిత్రాలకు పూర్తి డిఫరెంట్‌గా ఉంటుందని చెప్పగలనన్నారు. ఇది ట్రెండ్ సెట్ చేస్తుందన్నారు. చిత్రంలో నకుల్ పోరాట దృశ్యాలు అచ్చెరువు పరుస్తాయన్నారు. అట్టకత్తి దినేష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈయనకు జంటగా బిందు మాధవి, నకుల్ సరసన ఐశ్వర్య నటిస్తున్నారని ఈ చెన్నై బేస్డ్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యిందని ఒక్క పాటను దినేష్, బిందుమాధవిలపై చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు వెల్లడించారు. చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.