నకుల్, ఆంజల్ సెయ్ ప్రారంభం | nakul ,anjal movie shooting starts | Sakshi
Sakshi News home page

నకుల్, ఆంజల్ సెయ్ ప్రారంభం

Published Sun, Apr 17 2016 3:34 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

నకుల్, ఆంజల్ సెయ్ ప్రారంభం - Sakshi

నకుల్, ఆంజల్ సెయ్ ప్రారంభం

నకుల్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం సెయ్ శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. స్థానిక సాలిగ్రామంలో గల ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.ఇందులో నకుల్‌కు జంటగా ఘాయల్-2 చిత్రం ఫేమ్ బాలీవుడ్ నటి ఆంజల్ నాయకిగా తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం అవుతోంది. దీన్ని బియాండ్ ఐ ఎంటర్‌టెయిన్‌మెంట్ అధినేత సుబిన్,ట్రిప్పీ టర్పిల్ ప్రొడక్షన్స్ అధినేతలు మను,ఉమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మలయాళంలో సారథి అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన గోపాల్ మనోజ్ ఈ సెయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కథ,కథనాన్ని రాజేశ్ కే.రామన్ సమకూర్చారు. దీనికి నిక్స్‌లోఫేస్ సంగీతాన్ని,రాజేశ్ శుక్లా ఛాయాగ్రహణను,దళపతి దినేశ్ పోరాట సన్నివేశాలను కంపోజ్ చేయనున్నారు. పాత్రికేయుల సమావేశంలో చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది సినిమా నేపథ్యంలో సాగే కథా చిత్రం అని తెలిపారు. పెద్ద నటుడు కావాలని తపించే హీరో, దర్శకురాలు కావాలని ఆశించే హీరోయిన్‌ల కలయిక వారి పయనాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నదే సెయ్ చిత్రం అన్నారు.

 పాత్ర నచ్చింది
చిత్ర కథానాయకుడు నకుల్ మాట్లాడుతూ తాను చాలా సెలెక్టెడ్ చిత్రాలను అంగీకరిస్తున్నానని, ఈ సెయ్ చిత్రంలోని కథానాయకుడి పాత్ర నచ్చడంతో చేయడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు.

 తమిళంలో మాట్లాడతా
ఆంజల్ మాట్లాడుతూ తమిళంలో తనకిది తొలి చిత్రం. అందువల్ల ప్రస్తుతానికి తమిళంలో మాట్లాడలేనని,అయితే చిత్రం పూర్తి అయ్యేలోగా తమిళ భాష నేర్చుకుని మాట్లాడతానని అన్నారు.తనకు తమిళ ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement