తమిళసినిమా: నటుడు నకుల్ ఓ ఇంటివాడయ్యారు. ప్రియురాలి మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడు అడుగులు నడిచారు. బాయ్స్ చిత్రంలో నలుగురు హీరోలలో ఒకరిగా పరిచయం అయిన నకుల్ ఆ తరువాత కాదలిల్ విళిదేన్, మాచిలామణి, నాన్‌రాజావగపోగిరేన్, తమిళుక్కు ఎన్ 1ఐ అళుత్తవుమ్ తదితర చిత్రాలలో నటించారు. ఈయన నటి దేవయాని తమ్ముడన్నది తెలిసిన విషయమే. కాగా ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పని చేస్తున్న శ్రుతి భాస్కర్ అనే అమ్మాయి నకుల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు పంచజెండా ఊపడంతో గత నెలలో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఆదివారం ఉదయం స్థానిక ఎగ్మోర్‌లోని రాణి మెయ్యమ్మై కల్యాణ మండపంలో జరిగింది. వేద మంత్రాల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఉదయం 10.41 గంటలకు నకుల్ శ్రుతి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
ఘనంగా నటుడు నకుల్ వివాహం
Published Mon, Feb 29 2016 11:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM
Advertisement
Advertisement