Devayani
-
వెండితెరపైకి మళ్లీ రానున్న ఒకప్పటి ప్రముఖ హీరోయిన్
నటి దేవయాని చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుంది. టాలీవుడ్లో సుస్వాగతం సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా నటించిన ఆమె ఆ తర్వాత శ్రీమతీ వెళ్ళొస్తా, చెన్నకేశవరెడ్డి, నాని వంటి చిత్రాల్లో కనిపించింది. అయితే 2001లో పెళ్లి అయిన తర్వాత పెద్దగా సినిమాల్లో నటించలేదు. 2018లో అరవింద సమేత వీర రాఘవ, లవ్ స్టోరీ మూవీలో కనిపించింది. చాలా కాలం తర్వాత దేవయాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తెరపైకి రాబోతుంది. . దర్శన్ ఫిలిమ్స్ పతాకంపై జ్యోతిశివ నిర్మిస్తున్న 'నిళర్కుడై' అనే తమిళ ప్రాజెక్ట్‌లో ఆమె నటించనుంది. ఈ చిత్రం ద్వారా శివ ఆర్ముగం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు కేఎస్.అదియమాన్ శిష్యుడు అన్నది గమనార్హం. తెలుగులో బొబ్బిలి వంశం (బాలకృష్ణ) సినిమాను అదియమాన్ డైరెక్ట్ చేశాడు.విజిత్ కథానాయకుడుగా నటిస్తున్న ఇందులో కన్మణి మనోహరన్ కథానాయకిగా నటిస్తున్నారు. ఇళవరుసు, రాజ్‌కపూర్, మనోజ్‌కుమార్, వడివుక్కరసి, కవిత రవి, అక్షర ముఖ్యపాత్రలు పోషిస్తుండగా దర్శన్ మరో వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా నిహారిక, అహనా అనే ఇద్దరు బాల తారలు నటిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈతరం యువత విదేశీ మోహం తమ కుటుంబ అనుబంధాలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఎలా ప్రతిబంధకంగా మారుతోంది, తద్వారా ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వంటి పలు ఆసక్తికరమైన అంశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయన్నారు. -
సేవ్ ది టైగర్స్ నటి కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్!
సత్య , షాలిని , దేవియాని శర్మ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం లైఫ్ స్టోరీస్. ఈ సినిమాకు ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్జన్ ఎంటర్టైన్మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్లపై విజయ జ్యోతి నిర్మిస్తున్నారు. సామాన్యుల జీవితం కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, రిలేషన్స్, సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా ప్రభావితం చేస్తాయో ఈ మూవీలో చూపించనున్నారు.(ఇది చదవండ: అమెరికా ఎన్నికల్లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ సాంగ్)అయితే సేవ్ ది టైగర్స్, సైతాన్ లాంటి వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దేవయాని శర్మ ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. అన్ని రకాల సినీ అభిమానులను ఈ చిత్రం మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రతి ప్రేక్షకుడి సినిమాతో కనెక్ట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విన్ను సంగీతం అందిస్తున్నారు. -
రెండురోజులకే వదిలేస్తానంది.. నేనే ఒప్పించా: దర్శకుడు
అళగి చిత్ర యూనిట్ అంతా కూడా 22 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు ఒకే వేదికపై కలవడం సంతోషంగా ఉందని నటి దేవయాని పేర్కొన్నారు. 2012లో విడుదలైన క్లాసికల్ లవ్‌స్టోరీ అళగి (ఇది తెలుగులో లేత మనసులుగా రీమేకైంది). నటుడు పార్తీపన్, దేవయాని, నందితాదాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తంగర్‌బచ్చన్ దర్శకత్వంలో ఉదయగీత ఫిలింస్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అదే అళగి చిత్రం 22 ఏళ్ల తరువాత శుక్రవారం (మార్చి 29న) రీరిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించింది. దర్శకుడు తంగర్ బచ్చన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం, నటి నందితా దాస్ ముంబైలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నటుడు పార్తీపన్, దేవయాని, నిర్మాత ఉదయకుమార్, ఇతర నటీనటులు పాల్గొన్నారు. దేవయాని మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించడానికి అంగీకరించిన మొదటి చిత్రం అళగి అని చెప్పారు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు తంగర్‌బచ్చన్ అడిగారన్నారు. ఎంత ప్రేమ ఉన్నా.. ఒక భార్య తన భర్తను వేరొకరితో పంచుకోవడానికి అంగీకరించని పాత్ర రూపకల్పన తనకు చాలా నచ్చిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించినట్లు చెప్పారు. పార్తీపన్ మాట్లాడుతూ దర్శకుడు తంగర్‌బచ్చన్ మంచి కథారచయిత అని పేర్కొన్నారు. ఆయన కాకుండా వేరే ఎవరున్నా ఈ చిత్రం ఇంత విజయం సాధించి ఉండేది కాదన్నారు. షూటింగ్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం తనకు సెట్ కాదనిపిస్తోందని, తాను వైదొలగుతానని నటి నందితాదాస్ తనతో చెప్పారన్నారు. అయితే తాను చిత్రానికి సంబంధించిన సంభాషణలను వివరించి, ఆమె నటించేలా చేశానన్నారు. కాగా అళగి చిత్రానికి సీక్వెల్ చేయడానికి కథను రెడీ చేశానని, అయితే ఆ టైటిల్‌ను తంగర్‌బచ్చన్ తనకు ఇవ్వనన్నారని చెప్పారు. అందుకే ఆయన రాజకీయాల్లో స్థిరపడిపోతే తనకు అళగి 2 చిత్రం చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఆ హీరోయిన్ సినిమా చేయనంది.. నేనే బలవంతంగా..
ఇరవై రెండేళ్ల తరువాత అళగి చిత్రయూనిట్ అంతా మళ్లీ ఒకే వేదికపై కలవడం సంతోషంగా ఉందని నటి దేవయాని పేర్కొన్నారు. 2012లో విడుదలైన క్లాసికల్ లవ్‌స్టోరీ అళగి. నటుడు పార్తీపన్, దేవయాని, నందితాదాస్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తంగర్‌బచ్చన్ దర్శకత్వంలో ఉదయగీత ఫిలింస్ పతాకంపై ఉదయకుమార్ నిర్మించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. అళగి చిత్రం 22 ఏళ్ల తరువాత శుక్రవారం (మార్చి 29న) రీరిలీజైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలో మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు తంగర్ బచ్చన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుడడం, నటి నందితా దాస్ ముంబైలో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. నటుడు పార్తీపన్, దేవయాని, నిర్మాత ఉదయకుమార్, ఇతర నటీనటులు పాల్గొన్నారు.నటి దేవయాని మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకున్న తరువాత నటించడానికి అంగీకరించిన మొదటి చిత్రం అళగి అని చెప్పారు. ఈ చిత్రంలో నటించమని దర్శకుడు తంగర్‌బచ్చన్ అడిన్నారు. ఎంత ప్రేమ ఉన్నా.. ఒక భార్య తన భర్తను వేరొకరితో పంచడానికి అంగీకరించకపోయే మహిళ పాత్ర రూపకల్పన తనకు చాలా నచ్చిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించినట్లు చెప్పారు.పార్తీపన్ మాట్లాడుతూ దర్శకుడు తంగర్‌బచ్చన్ మంచి కథారచయిత అని పేర్కొన్నారు. ఆయన కాకుండా వేరెవరైనా అయితే ఈ చిత్రం ఇంత విజయం సాధించి ఉండేది కాదన్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఈ చిత్రం తనకు సెట్ కాదనిపిస్తోందని, తాను వైదొలగుతానని నటి నందితాదాస్ తనతో చెప్పారన్నారు. అయితే తాను ఆమెకు చిత్రానికి సంబంధించిన సంభాషణలను వివరించి, ఆమె నటించేందుకు ప్పింన్నారు.కాగా అళగి చిత్రానికి సీక్వెల్ చేయడానికి కథను రెడీ చేశానని, అయితే ఆ టైటిల్‌ను తంగర్‌బచ్చన్ తనకు ఇవ్వనన్నారని చెప్పారు. అందుకే ఆయన రాజకీయాల్లో స్థిరపడపోతే తాను అళగి 2 చిత్రం చేయడానికి మార్గం సుగమం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఆ హీరోపై కన్నేసిన హీరోయిన్.. అదే తన లక్ష్యమట!
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న శింబుతో జత కట్టడమే తన జీవిత లక్ష్యం అంటోంది వర్ధమాన నటి దేవయాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తోంది. అదేవిధంగా తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చింది. 2021లో రొమాంటిక్ అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించి తన నటనతో అందరినీ మెప్పించింది. ఆవిధంగా ప్రారంభంలోనే గుర్తింపు తెచ్చుకున్న దేవయానిశర్మ పలు రకాల నృత్యాల్లో శిక్షణ పొందడం విశేషం. హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నా తమిళ చిత్రాల్లో నటించాలన్నది తన కోరిక అని పేర్కొంది. సాధారణ కథానాయకి పాత్రల్లో కాకుండా ప్రతిభకు పదునుపెట్టే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలన్నదే తన ఆశయమని చెబుతోంది. హీరోయిన్లలో కీర్తీ సురేష్, సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని.. నటిగా వారే తనకు ఆదర్శమని పేర్కొంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే శింబు అంటే పిచ్చి అభిమానమని.. కచ్చితంగా ఆయనతో జత కడతానని.. అదే తన జీవిత లక్ష్యమని అంటోంది. అందుకోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పింది. అదే సమయంలో మంచి నటిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడానికి తన వంతు కృషిచేస్తానని చెప్పింది. మొత్తం మీద హిందీ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పాగా వేసిన ఢిల్లీ భామ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలోనూ త్వరలో పాగా వేస్తాననే ధీమాను వ్యక్తం చేస్తోంది.ఈ ముద్దుగుమ్మ ఆశ ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Deviyani Sharma (@deviyyani) -
100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్‌గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది
నటి దేవయాని తెలుగు సినీ ఫ్యాన్స్ అందరికీ సుపరిచయమే. పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమెకు తల్లితండ్రులు పెట్టిన పేరు సుష్మా. ఈమె ముంబైలోని నిరుపేద అయిన ఒక కొంకణీ కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి జయదేవ్ ఒక ఫ్యాక్టరీలో రోజువారి కూలీ కాగా తల్లి లక్ష్మి గృహిణి. ఈమెకు నకుల్, మయూర్ అని ఇద్దరు సోదరులు ఉన్నారు. నకుల్ తమిళ సినిమా రంగంలో నటుడు, గాయకుడుగా పనిచేస్తున్నాడు. మయూర్ ఇటీవలే ఒక సినిమాలో నటుడుగా ఆరంగేట్రం చేశాడు. పదో తరగతి వరకు విధ్యాబ్యాసం కారణం ఇదే దేవయాని కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల పదో తరగతితోనే తన చదువుకు ఫుల్స్టాప్ పడింది. కానీ ఆమె స్కూల్లో టాపర్‌గా చదవులో రానిస్తుండగా ముంబైలో ఒక హిందీ సినిమా షూటింగ్ కోసం కొందరు బస్తీ జనాలు కావాలని ప్రకటన ఇవ్వడంతో దేవయాని తల్లి లక్ష్మినే ఆమెను అక్కడకు తీసుకెళ్లింది. అప్పుడు వారికి చెరో రూ. 100 ఇవ్వడంతో సినిమా ఇండస్ట్రీలో ఉంటే ఇంత డబ్బు వస్తుందా అని ఆశ్చర్యపోయారట. దీంతో దేవయానికి 16 ఏళ్ల వయసులో ఉండగానే మొదట హిందీ సినిమా అవకాశం వచ్చింది. దీంతో దేవయాని తల్లే స్కూల్ ఆపించేసి సినిమాల్లో నటించమని ఒప్పించిందట. అవకాశాల కోసం కాంప్రమైజ్ ఆ తర్వాత అక్కడ చాలా అవకాశాలు వచ్చినా ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ప్రభావం ఆమెపై పడిందట. కానీ అవకాశాల కోసం కొన్ని చోట్ల ఆమె కూడా కాంప్రమైజ్ కాక తప్పలేదని ప్రచారం జరిగింది. సినిమా అవకాశాలు వచ్చాయి కానీ అవి అంతగా హిట్ కాకపోవడంతో ఆమెను చాలామంది హీరోలు పక్కన పెట్టేశారు. దీంతో చేసేది ఏం లేక పలు బెంగాళీ సినిమాల్లో రొమాంటిక్ పాత్రలు కూడా చేసింది. కొన్ని ఐటమ్ సాంగ్స్‌తో పాటు బికినీలో కూడా కనిపించింది. ఇవన్నీ కూడా తను ఆర్థికంగా నిలబడేందుకే చేసినట్లు సమాచారం. తమిళ్లో వారితో ప్రేమాయణం అక్కడ నుంచి ఆమె తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అక్కడ కూడా శరత్‌కుమార్, అజిత్ వంటి వారితో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో కోలీవుడ్‌లో కూడా సినిమా అవకాశాలు లేకుండా పోయాయి అని వార్తలు వచ్చాయి. అలా దేవయాని 2001లో తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అది దేవయాని తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ఒక గుడిలో పెళ్లి చేసుకుంది. దీంతో అప్పటి వరకు ఆమె సంపాదించిన డబ్బు నుంచి ఒక్కరూపాయి కూడా ఆమె తల్లిదండ్రులు ఇవ్వలేదట. వీరికి ఇద్దరు కుమార్తెలు ఇనియ, ప్రియాంక ఉన్నారు. చేతిలో డబ్బు లేదు.. పెళ్లి కావడంతో సినిమాల్లో అవకాశాలు కూడా లేవు. దీంతో ఆమె బుల్లితెరపై దృష్టి సారించింది. అక్కడ రోజుకు లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటిగా తన ప్రత్యేకతను చాటుకున్న దేవయాని మళ్లీ గాడిలో పడ్డారు. కొన్నిరోజుల తర్వాత ఈమె చిత్ర నిర్మాణం చేపట్టి తన భర్త దర్శకత్వంలో కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు. అవి అంతగా ప్రేక్షకాధరణ పొందకపోవడంతో సంపాధించిన డబ్బు అంతా అయిపోయింది. అలా అప్పుల్లో కూరుకుపోయి. కొన్ని రోజుల తర్వాత ఎంతోకొంత చెల్లించి అప్పుల నుంచి బయటపడ్డారట. నటనకు స్వస్తి చెప్పి రీ ఎంట్రీ అప్పుల గొడవ తర్వాత ఆమె అనూహ్యంగా నటనకు స్వస్తి చెప్పి అధ్యాపకురాలిగా ఉద్యోగం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దేవయాని తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో గల చర్చ్‌పార్కు కాన్వెంట్ పాఠశాలలో నర్సరీ పిల్లలకు అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. తనకు ఉపాధ్యాయరాలిగా పనిచేయాలని చిన్ననాటి నుంచి కోరికని ఆమె గతంలో తెలిపారు. దీంతో టీచర్ కోర్సు చదివి ఉత్తీర్ణత పొందానని చెప్పారు. అనంతరం తనపిల్లలు చదువుతున్న చర్చ్ పార్కు పాఠశాలలో అధ్యాపకురాలిగా చేరానని తెలిపారు. అక్కడి విద్యార్థులను చూస్తున్నప్పుడు తాను మళ్లీ కొత్తగా పుట్టినట్టుందన్నారు. జీతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఇక్కడ చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉందని దేవయాని పేర్కొన్నారు. కానీ ఆమెకు అక్కడ ప్రస్తుతం సుమారు రూ. 10 వేలు ఇస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, నాగ చైతన్య లవ్ స్టోరీ వంటి చిత్రాలతో తను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం సెలక్టెడ్ పాత్రలు మాత్రమే చేస్తున్నట్లు సమాచారం. ఆమె ప్రేమ పెళ్ల పట్ల కోపంతో ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఎవరూ దేవయాని భర్తతో టచ్‌లో లేరు. కానీ దేవయాని మాత్రం తన కుటుంబ సభ్యులను అప్పుడప్పుడు కలుస్తుంటారు. -
స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!
సినిమా రంగంలో వారసుల తెరంగేట్రం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పటికే చాలామంది వారసులు వివిధ శాఖల్లో రాణిస్తున్నారు. తాజాగా ఒక కొత్త కాంబినేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటుడు విజయ్ తన తండ్రి దర్శకుడు ఎస్ఏ. చంద్రశేఖర్ ద్వారా కథానాయకుడుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) అదేవిధంగా నటి దేవయాని. ఈమె బహుభాషా నటి. తొట్టాల్ సీణుంగి చిత్రం ద్వారా తమిళంలో కథానాయకగా పరిచయమైన దేవయాని ఆ తర్వాత కాదల్ కోట్టై వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. నీ వరివాయ్ ఎన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజకుమార్. ఆ చిత్రంలో అజిత్, దేవయాని హీరో హీరోయిన్గా నటించారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు రాజకుమార్‌కు, నటి దేవయానికి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె ఇనియ కుమార్‌ను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.రాజకుమార్ దర్శకత్వం వహించిన నీ వరువాయ్ ఎన్ చిత్రం 1999లో విడుదలైంది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇందులో విజయ్ కుమారుడు సంజయ్, తన కూతురు ఇనియకుమార్తోను, హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన కూతురు ఇనియాకు నటించాలని కోరిక ఉందని దీంతో సంజయ్‌కు జంటగా ఆమెను నటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు అయితే విజయ్ వారసుడు సంజయ్ తెరవెనుక బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఆయన కథానాయకుడిగా నటిస్తారా వేచి చూడాల్సిందే. -
ఆగస్టు 4న రెండు ఐపీఓలు...
ముంబై: భారత్‌లో అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ ఫ్రాంచైజీ సంస్థ దేవయాని ఇంటర్నేషనల్ ఐపీఓకు సిద్ధమైంది. ఇష్యూ ఆగస్ట్ 4న మొదలై., అదే నెల ఆరవ తేదిన ముగుస్తుంది. ఐపీఓకు ధరల శ్రేణి రూ.86–90గా నిర్ణయించి మొత్తం రూ.1,838 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.440 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 15 కోట్ల ఈక్విటీలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 165 షేర్లను కలిపి ఒక లాట్‌గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేకంగా 5.50 లక్షల ఈక్విటీలకు కేటాయించారు. సమీకరించిన నిధులను రుణాలను తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది. ఎక్సారో టైల్స్ ముంబై: గుజరాత్‌కు చెందిన వెర్టిఫైడ్ టెల్స్ తయారీ సంస్థ ఎక్సారో టైల్స్ ఐపీఓ ఆగస్ట్ 4న ప్రారంభం కానుంది. అదే నెల 6వ తేదీన ముగిస్తుంది. ధర శ్రేణి రూ.118–120గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా కంపెనీ 1,342,4000 తాజా షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్ దీక్షిత్‌కుమార్ పటేల్ 22.38 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మకానికి పెట్టారు. మొత్తం 125 షేర్లను కలిపి ఒక లాట్ నిర్ణయించారు. ఇన్వెస్టర్లు రూ.15వేలు చెల్లించి ఒక లాట్‌ను సొంతం చేసుకోవచ్చు. షేర్లను ఆగస్ట్ 16వ తేదిన ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. పంథోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ ఈ ఇష్యూకు లీడింగ్ బుక్ మేనేజర్‌గా వ్యవహరించనుంది. ఎక్సారో టైల్స్ 27 రాష్ట్రాల్లో విస్తరించింది. సుమారు 2000లకు పైగా డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. -
కృత్రిమ మేథో సంవత్సరంగా 2020
సాక్షి, హైదరాబాద్: ‘కృత్రిమ మేథస్సు సంవత్సరం’గా 2020ను ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య రక్షణ రంగాల్లో కృత్రిమ మేథస్సు వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్ తో ప్రగతిభవన్‌లో శుక్రవారం కేటీఆర్ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పొడవునా కృత్రిమ మేథస్సు అంశంపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నూతన సాంకేతికతలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను దేవయానికి కేటీఆర్ వివరించారు. డేటా సైన్సెస్‌లో యువతకు శిక్షణ ఇవ్వడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై దేవయాని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరక్టర్ రమాదేవి, డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్ సమావేశంలో పాల్గొన్నారు. -
ఎలాంటి పాత్రనైనా చేస్తా..
తమిళసినిమా: బుల్లితెర తారలు వెండితెరపై కనిపించాలని ఆరాట పడటం, అదే విధంగా వెండితెరపై ఏలిన తారలు బుల్లితెరను ఎంచుకోవడం పరిపాటిగా మారింది. అలా సినిమాల్లో రాణించాలని ఆరాట పడుతున్న మరో నటి లతారావ్. సినిమాలో ఏ తరహా పాత్రనైనా చేయడానికి రెడీ అంటోంది ఈ భామ. ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు వెండితెరపైనా గుర్తింపు పొందుతోంది. ఇటీవల తెరపైకి వచ్చిన గడికార మణిదర్గళ్ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంటున్న లతారావ్ ఈ సందర్భంగా తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ బుల్లితెరపై నాలుగు భాషల్లో నటించి గుర్తింపు పొందానని చెప్పింది. అయితే ఇప్పుడు సినిమాల్లో రాణించాలన్న కోరికతో బుల్లి తెరకు స్వస్తి చెప్పానని తెలిపింది. ఇంతకుముందు తిల్లాలంగడి చిత్రంలో వడివేలుకు జంటగా కామెడీ పాత్రలో నటించినట్లు పేర్కొంది. అలా పరిచయం అయిన తాను శశికుమార్ దర్శకత్వం వహించిన ఈశన్ చిత్రంలో, సముద్రఖని దర్శకత్వం వహించిన నిమిర్న్దు నిల్, సుదీప్ హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ముడింజా ఇవన్ పుడి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించినట్లు తెలిపింది. తాజాగా కిశోర్‌కు జంటగా గడికార మనిదర్గళ్ చిత్రంలో నటించినట్లు చెప్పింది. ఇందులో మధ్య తరగతికి చెందిన ముగ్గురు పిల్లలకు తల్లిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించినట్లు చెప్పింది. అదే విధంగా ప్రస్తుతం భరత్ కథానాయకుడిగా నటిస్తున్న 8 చిత్రంలోనూ, వివేక్, దేవయాని కలిసి నటిస్తున్న ఎళుమిన్ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పింది. మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఆశ పడుతున్నట్లు, ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అని నటి లతారావ్ పేర్కొంది. మొత్తం మీద మరో క్యారెక్టర్ ఆర్టిస్ కోలీవుడ్‌కు దొరికినట్టే. -
'జనతా గ్యారేజ్'లో సుహాసిని
నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేస్తూ సినిమా కాస్టింగ్‌ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మరో సీనియర్ నటి జనతా గ్యారేజ్ టీంతో జాయిన్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రాఖీ, బాద్ షా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సుహాసిని, జనతా గ్యారేజ్‌లోనూ నటించనుంది. ఈ సినిమాలో మోహన్ లాల్‌కు జోడిగా సుహాసినిని ఎంపిక చేశారు. ముందుగా ఈ పాత్రకు తమిళ నటి దేవయానిని సంప్రదించినా, చివరి నిమిషంలో సుహాసినిని ఫైనల్ చేశారు. గతంలో ఎన్టీఆర్, సుహాసిని కలిసి నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో సెంటిమెంట్ పరంగా కూడా జనతా గ్యారేజ్‌కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
ఘనంగా నటుడు నకుల్ వివాహం
తమిళసినిమా: నటుడు నకుల్ ఓ ఇంటివాడయ్యారు. ప్రియురాలి మెడలో అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడు అడుగులు నడిచారు. బాయ్స్ చిత్రంలో నలుగురు హీరోలలో ఒకరిగా పరిచయం అయిన నకుల్ ఆ తరువాత కాదలిల్ విళిదేన్, మాచిలామణి, నాన్రాజావగపోగిరేన్, తమిళుక్కు ఎన్ 1ఐ అళుత్తవుమ్ తదితర చిత్రాలలో నటించారు. ఈయన నటి దేవయాని తమ్ముడన్నది తెలిసిన విషయమే. కాగా ఒక చిత్ర నిర్మాణ సంస్థలో పని చేస్తున్న శ్రుతి భాస్కర్ అనే అమ్మాయి నకుల్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు పంచజెండా ఊపడంతో గత నెలలో వివాహ నిశ్చితార్ధం జరిగింది. ఆదివారం ఉదయం స్థానిక ఎగ్మోర్‌లోని రాణి మెయ్యమ్మై కల్యాణ మండపంలో జరిగింది. వేద మంత్రాల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వివాహ వేడుకలో ఉదయం 10.41 గంటలకు నకుల్ శ్రుతి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ ప్రముఖులు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. -
పట్టు వీడని అమెరికా
న్యూయార్క్/వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసిందంటూ ఓవైపు మొసలి కన్నీరు కారుస్తున్న అమెరికా.. మరోవైపు మాత్రం తన పట్టువీడడం లేదు. దేవయానిని పూర్తిస్థాయిలో కేసులో ఇరికించడానికి యత్నిస్తోంది. వీసా మోసం కేసులో తనపై అభియోగాలు నమోదు చేయడానికి ఈ నెల 13 వరకు ఉన్న గడువును నెల రోజులపాటు పొడిగించాలని దేవయాని కోరగా.. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అమెరికా ప్రాసిక్యూటర్ తేల్చిచెప్పారు. అమెరికా ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా(ఈయన భారత్‌లోనే పుట్టారు) కార్యాలయం.. దేవయానిని అరెస్టు చేసిన 30 రోజు ల్లోపు.. అంటే ఈ నెల 13కల్లా ఆమెపై అభియోగాలు నమో దు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దేవయాని తరఫు న్యాయవాది డేనియల్ అర్షక్.. న్యూయార్క్ దక్షిణ జిల్లాలోని జిల్లా కోర్టులో సోమవారం అభ్యర్థన దాఖలు చేశారు. ‘ప్రాసిక్యూషన్‌కు, డిఫెన్స్ పార్టీకి, ప్రభుత్వ విభాగాలకు మధ్య పలు కీలకమైన చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. అయితే గడువు దగ్గరపడిపోవడంతో.. ఈ చర్చలకు విఘాతం కలుగుతోంది’ అని ఆ అభ్యర్థనలో పేర్కొన్నారు. గడువు నెల రోజులు పెంచాలని అడిగారు. దీనిపై ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారా స్పందిస్తూ.. గడువు పొడిగింపునకు అంగీకరించబోమని చెప్పారు. అభియోగాలు నమోదు చేసిన తర్వాత కూడా చర్చలు జరుపుకోవచ్చన్నారు. దేవయానికి పూర్తి దౌత్య రక్షణ కల్పించేందుకు వీలుగా భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితికి బదిలీ చేసినప్పటికీ.. అమెరికా మాత్రం బదిలీని ఇంకా ఆమోదించలేదు. చట్ట ప్రకారం కొన్ని ఫైళ్లు ఇంకా సిద్ధం కావాల్సి ఉందంటూ రెండు వారాలుగా కాలం గడుపుతోంది. పరిష్కారానికి 3 అవకాశాలు.. రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన దేవయాని సమస్య పరిష్కారానికి మూడు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అమెరికా పాలనా యంత్రాంగంలో చర్చ జరుగుతోంది. వాటిలో మొదటిది.. ఐక్యరాజ్యసమితికి ఆమె బదిలీని.. నేరాభియోగాలు మోపడానికి ముందే అంగీకరించడం ద్వారా పూర్తి స్థాయి దౌత్య రక్షణ ఆమెకు కల్పించడం. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండాలని కోరుకుంటున్న వారు.. దీనికి మద్దతిస్తున్నట్లు సమాచారం. ఇక రెండోది.. ఆమెపై అభియోగాలు నమోదు చేశాక ఐక్యరాజ్యసమితికి బదిలీని అంగీకరించడం. మూడోది.. నేరాభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణం చూపి.. ఐక్యరాజ్యసమితికి ఖోబ్రగడే బదిలీని తిరస్కరించడం. అమెరికా దౌత్యవేత్తల హోదా తగ్గిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా చివరి ఆప్షన్ ప్రయోగించాలని అమెరికా పాలనా యంత్రాంగంలో మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కాన్సులేట్ ముందు దేవయాని తండ్రి ధర్నా ముంబై: దేవయాని అరెస్టు అక్రమమంటూ ఆమె తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ముంబైలో అమెరికా కాన్సులేట్ వద్ద ధర్నాకు దిగారు. ‘నా కుమార్తె అరెస్టు అక్రమం. ఈ విషయాన్ని స్వయానా అమెరికా కూడా అంగీకరించింది. ఆమెపై అభియోగాలన్నీ బూటకం’ అంటూ ఆయ న నినదించారు. ఆమె అరెస్టును కిడ్నాప్‌తో పోల్చారు. -
అభియోగాలు ఉపసంహరించాలి
దేవయాని ఉదంతంపై అమెరికాను కోరిన భారత కొత్త రాయబారి జైశంకర్ వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై మోపిన అభియోగాలను తక్షణమే ఉపసంహరించాలని అమెరికాలో భారత కొత్త రాయబారి ఎస్ జైశంకర్ ఆ దేశానికి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం ఆ దేశ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దేవయాని అరెస్టుపై తీవ్ర నిరసన తెలిపారు. తన నియామక పత్రాలను చీఫ్ ఆప్ ప్రొటోకాల్ ఆఫీసులో సమర్పించిన తర్వాత అమెరికా విదేశాంగశాఖ ఉపమంత్రులు వెండీ షెర్మన్(రాజకీయ వ్యవహారాలు), పాట్రిక్ ఎఫ్ కెన్నడీ(నిర్వహణ)లతో ఆయన భేటీ అయ్యారు. భేటీల్లో దేవయాని అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆమెపై అభియోగాలను తక్షణమే ఉపసంహరించాలని జయశంకర్ కోరినట్లు సమాచారం. భారత దౌత్యవేత్తల ఇళ్లలోని భారతీయ పనిమనుషుల కుటుంబ సభ్యులను అమెరికా ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్న తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. మరోవైపు ఐక్యరాజ్యసమితిలోని భారత దౌత్యబృందంలో ప్రతినిధిగా ఉన్న దేవయానికి దౌత్యపరంగా పూర్తి రక్షణ కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. ‘ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత ప్రతినిధి బృంద సభ్యురాలిగా ఖోబ్రగడేను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియమించినట్టు మాకు భారత ప్రభుత్వం తెలిపింది’ అని పేర్కొన్నారు. ఐరాసలోని భారత శాశ్వత బృందం సలహాదారుగా దేవయానికి 2013 ఆగస్టు 26న ఐరాస గుర్తింపునిచ్చింది. అది ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. దీంతో పూర్తి దౌత్య రక్షణ ఉన్న ఆమెను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై అమెరికాకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయొచ్చని భారత అమెరికన్ లాయర్ రవి బాత్రా వివరించారు. అమెరికా రాయబారి నేపాల్ పర్యటన రద్దు న్యూఢిల్లీ: దేవయాని అరెస్టు పరిణామాల నేపథ్యంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ తన నేపాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దేవయానిపై అమెరికా తీరుకు నిరసనగా భారత్‌లోని అమెరికా దౌత్యవేత్తలకు కల్పిస్తున్న కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కేంద్రం తగ్గించడం తెలిసిందే. ఇందులో భాగంగా విమానాశ్రయాల్లో తనిఖీలు లేకుండా స్వేచ్ఛగా వెళ్లడానికి పావెల్‌కు ఇప్పటివరకు ఉన్న సౌకర్యాన్ని ఉపసంహరించారు. దీంతో ఆమె పర్యటనను రద్దు చేసుకున్నారు. -
అరెస్టుకు ముందే దేవయానికి ‘దౌత్య’ మినహాయింపు!
న్యూఢిల్లీ/వాషింగ్టన్: వ్యక్తిగత అరెస్టు, నిర్బంధం వంటి ఏవైతే చర్యల నుంచి ఇప్పుడు మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నారో... ఈనెల 12న భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు అరెస్టు చేసేటప్పటికే ఆమె పూర్తిస్థాయిలో ఆ మినహాయింపు కలిగి ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడు న్యూయార్క్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా ఉన్న ఆమె ఐరాసలోని భారత శాశ్వత బృందానికి సలహాదారుగా కూడా ఉన్నారు. ఇందుకుగాను ఐరాస సాధారణ సభ ఆమెకు ఇచ్చిన ‘గుర్తింపు’ డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఈ ప్రకారం చూస్తే డిసెంబర్ 12న దేవయానిని అరెస్టు చేయడం ఆమె హోదాకు భంగకరమని పరిశీలకులు చెబుతున్నారు. ఇదే వాదనను భారత్ అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. -
దిగొస్తున్న అమెరికా
ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో పనిమనుషుల అంశం ఉంటుందని ప్రకటన ‘దేవయాని వివాదం’పై పరిష్కారానికి భారత్‌తో చర్చిస్తున్నట్లు వెల్లడి వాషింగ్టన్/న్యూయార్క్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై అమెరికా వ్యవహరించిన తీరుకు ప్రతిచర్యగా ఆ దేశ కాన్సులేట్ సిబ్బందికి తీవ్ర నేరాల్లో కల్పిస్తున్న దౌత్యపరమైన న్యాయ రక్షణను భారత్ కుదించిన నేపథ్యంలో అగ్రరాజ్యం దిగొస్తోంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో పనిమనుషుల నియామకం అంశం కూడా ఉంటుందని బుధవారం ప్రకటించింది. అలాగే దేవయాని అరెస్టుతో తలెత్తిన దౌత్య వివాదానికి పరిష్కారంపై ముందడుగు విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖకు చెందిన ఓ అధికారి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ‘న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ నుంచి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత దౌత్య కార్యాలయానికి దేవయాని బదిలీ దరఖాస్తును మేం సమీక్షిస్తూనే ఉన్నాం. అదే సమయంలో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని మేం గుర్తించాం. రానున్న వారాలు, నెలల వ్యవధిలో జరగబోయే ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల్లో పనిమనుషుల నియామకం అంశం ఎజెండాలో ఉంటుంది’ అని ఆ అధికారి వ్యాఖ్యానించారు. దర్యాప్తు అధికారిది పొరబాటు: దేవయాని లాయర్ దేవయానిపై వీసా మోసం అభియోగాల దర్యాప్తు, అరెస్టు విషయంలో అమెరికా దౌత్య భద్రతా సేవల ఏజెంట్ మార్క్ స్మిత్ పొరబాటు చేశారని ఆమె తరఫు న్యాయవాది డానియల్ అర్షాక్ పేర్కొన్నారు. దేవయాని ఇంటి పనిమనిషి సంగీతా రిచర్డ్ జీతానికి సంబంధించి సమర్పించిన పత్రాలను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. సంగీతా రిచర్డ్ వీసా దరఖాస్తుతోపాటు జత చేసిన డీఎస్-160 ఫారంలో పొందుపరిచిన దేవయాని మూలవేతనం 4,500 డాలర్లను సంగీతా రిచర్డ్ ఆశిస్తున్న జీతంగా ఆ అధికారి పొరబాటుపడ్డారని డానియల్ తెలిపారు. వాస్తవానికి సంగీతా రిచర్డ్‌కు నెలకు 1,560 డాలర్లను (గంటకు 9.75 డాలర్ల చొప్పున వారానికి 40 గంటల పనికి) చెల్లించేందుకు దేవయాని ఆమెతో ఒప్పందం కుదుర్చుకుందని న్యాయవాది గుర్తుచేశారు. ఫెడరల్ ఏజెంట్ పొరబాటుపడటం తీవ్రమైన విషయమన్నారు. -
దేవయాని ఉదంతంలో అమెరికాపై ప్రతిచర్యలు
న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టులో అమెరికా దాష్టీకంపై భారత ప్రభుత్వం మంగ ళవారం కఠిన చర్యలు తీసుకుంది. ప్రతిచర్యల్లో భాగంగా భారత్‌లోని అమెరికా కాన్సులేట్ సిబ్బందికి ఉన్న న్యాయరక్షణను కుదించింది. వారి కుటుంబ సభ్యులకు ఉన్న దౌత్యపరమైన న్యాయరక్షణను ఉపసంహరించింది. దేశంలోని నాలుగు అమెరికా కాన్సులేట్ల అధికారులకు న్యాయరక్షణను పరిమితం చేస్తున్నట్లు తెలిపే కొత్త గుర్తింపు కార్డులను మంజూరు చేస్తోంది. ఇవి అచ్చం అమెరికా.. భారత కాన్సులేట్ సిబ్బందికి ఇస్తున్న కార్డులను పోలి ఉన్నాయి. వీటి కారణంగా తీవ్రనేరాల విషయంలో ఇక అమెరికా కాన్సులేట్ సిబ్బందికి న్యాయరక్షణ లభించదు. అమెరికాలోని మన దౌత్యవేత్తలకు పరిమిత న్యాయరక్షణే ఉండడ ంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అమెరికాలోని భారత దౌత్యవేత్తల కుటుంబ సభ్యులకు దౌత్య గుర్తింపు కార్డులు లేని నేపథ్యంలో మన దేశంలోని అమెరికా దౌత్యవేత్తల కుటుంబ సభ్యులకు ఉన్న అలాంటి కార్డులను ఉపసంహరించుకుంది. అమెరికా కాన్సులేట్ సిబ్బంది భారత్‌లో బాధ్యతలు చేపట్టాక తమకు అవసరమైన సామగ్రిని దిగుమతి చేసుకోవడానికి ఇస్తున్న మూడేళ్ల గడువును ఆరు నెలలకు తగ్గించింది. -
చర్చలు జరుగుతున్నాయి
‘దేవయాని ఉదంతం పరిష్కారం’పై భారత్, అమెరికాల ప్రకటన అమెరికాలో భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్ట్‌పై అమెరికా, భారత్‌ల మధ్య తలెత్తిన వివాదం పరిష్కారం దిశగా కదుల్తోంది. దౌత్యపరమైన, ప్రైవేటు మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని రెండు దేశాలు శనివారం ప్రకటించాయి. ద్వైపాక్షిక సంబంధాలు తమకు అత్యంత విలువైనవని స్పష్టం చేశాయి. వివాద పరిష్కార యత్నాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెరీ త్వరలో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు ఫోన్ చేయాలనుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి వెల్లడించారు. సమస్య పరిష్కారం కోసం వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని సల్మాన్ ఖుర్షీద్ కూడా తెలిపారు. సామరస్య పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మా దౌత్యవేత్తకు మీ దగ్గర గౌరవమర్యాదలు లభించాలని మేం ఆశించడం అసంబద్ధమవుతుందా?’ అని అమెరికాను ఆయన ప్రశ్నించారు. మరోవైపు, దేవయానిని ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్‌కు బదిలీ చేయడం వల్ల ఆమెకు లభించిన సంపూర్ణ దౌత్య రక్షణ గతకాలానికి వర్తించదని, ఆ రక్షణ ప్రస్తుత స్థాయి నుంచే అమల్లోకి వస్తుందని అమెరికా స్పష్టం చేసింది. పరిమితమైన దౌత్య రక్షణ లభించే డెప్యూటీ కాన్సుల్ జనరల్ హోదా నుంచి సంపూర్ణ దౌత్య రక్షణ లభించే ఐరాస మిషన్‌కు బదిలీ కావడం వల్ల ఆమెపై ఉన్న గత కేసులన్నీ మాయమైపోవని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి వ్యాఖ్యానించారు. ఆమె సీఐఏ ఏజెంట్: దేవయాని తండ్రి ఆరోపణ వివాదానికంతటికీ కారణమైన పనిమనిషి సంగీత రిచర్డ్స్ అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఏజెంట్ అయ్యుండొచ్చని దేవయాని తండ్రి ఉత్తమ్ ఖొబ్రగడే శనివారం ఆరోపించారు. కుట్రలో భాగంగానే తన కూతురిని బలిపశువును చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. దేవయానిపై కేసులను ఉపసంహరించుకుంటేనే తమకు న్యాయం లభిస్తుందన్నారు.