సేవ్ ది టైగర్స్‌ నటి కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్! | Save The Tigers Devayani Sharma New Movie Details | Sakshi
Sakshi News home page

సేవ్ ది టైగర్స్‌ నటి కొత్త చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published Wed, Sep 11 2024 11:16 AM | Last Updated on Wed, Sep 11 2024 1:47 PM

Save The Tigers Devayani Sharma New Movie Details

సత్య , షాలిని , దేవియాని శర్మ ప్రధాన పాత్రల్లో వస్తోన్న తాజా చిత్రం లైఫ్ స్టోరీస్. ఈ సినిమాకు ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు.  అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్‌ బ్యానర్లపై విజయ జ్యోతి నిర్మిస్తున్నారు. సామాన్యుల జీవితం కోణంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, రిలేషన్స్‌, సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా ప్రభావితం చేస్తాయో ఈ మూవీలో చూపించనున్నారు.

(ఇది చదవండ: అమెరికా ఎన్నికల్లో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ సాంగ్‌)

అయితే సేవ్ ది టైగర్స్‌, సైతాన్ లాంటి వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దేవయాని శర్మ ఈ చిత్రంలో నటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. అన్ని రకాల సినీ అభిమానులను ఈ చిత్రం మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రతి ప్రేక్షకుడి సినిమాతో కనెక్ట్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 14న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో వివాన్ జైన్, లక్ష్మీ సుంకర, రాజు గొల్లపల్లి, ప్రదీప్ రాపర్తి, గజల్ శర్మ, శరత్ సుసర్ల, స్వర్ణ డెబోరా, రాహుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు విన్ను సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement