అమెరికా ఎన్నికల్లో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ సాంగ్‌ | Kamala Harris Use RRR Song For US Elections | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికల్లో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ సాంగ్‌

Published Wed, Sep 11 2024 9:59 AM | Last Updated on Mon, Oct 7 2024 10:37 AM

Kamala Harris Use RRR Song For US Elections

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలా హారిస్‌ దూసుకెళ్తున్నారు. భారత మూలాలున్న ఆమెకు భారీగానే మద్దతు లభిస్తోంది.  మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రట్‌, రిపబ్లికన్‌ అభ్యర్థులు తమ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఈ క్రమంలో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ సరికొత్తగా ఆర్‌ఆర్‌ఆర్‌ సాంగ్‌తో ప్రచారంలో దిగారు.

దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలను ఆకర్షించేందుకు కమలా హారీస్‌ అడుగులేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె వినూత్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్‌ 'నాటు నాటు' సాంగ్‌ హిందీ వర్షన్‌తో ఒక వీడియోను రూపొందించారు. ఈ పాటలో ఆమె విజువల్స్‌ వచ్చేలా ఎన్నికల ప్రచార గీతాన్ని క్రియేట్‌ చేశారు.

ఆ వీడియోను ఇండియన్-అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా విడుదల చేశారు. ఆ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ప్రచారం గీతం వస్తున్న క్రమంలో భారతీయ మూలాలకు చెందిన పలువురు వ్యక్తుల కామెంట్లను కూడా వినిపించారు. కమలా హారిస్‌కు ఓట్‌ వేయాలని తెలుగు భాషలో  కూడా  డెమొక్రాటిక్ పార్టీ నేతలు అభ్యర్థించారు. దక్షిణాసియాకు చెందినవారు అమెరికాలో భారీగానే ఉన్నారు. సుమారు 60 లక్షల ఓట్లు దక్షిణాసియాకు చెందిన వారివి ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పడు వారు ఎటువైపు మద్ధతు ఇస్తే.. వారిదే గెలుపు అని అక్కడ ట్రెండ్‌ అవుతుంది.

 ఇదీ చదవండి: విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణ

కమలాహారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలేనని తెలిసిందే. శ్యామల తండ్రే పీవీ గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. అయితే, శ్యామల 1958లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లి అక్కడే  డాక్టరేట్‌ పూర్తి చేశారు. రొమ్ము క్యాన్సర్‌పై ఆమే అనేక పరిశోధనలు జరిపారు.  అనంతరం జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారిస్‌ను శ్యామలా పెళ్లి చేసుకున్నారు. అలా వారికి జన్మించిన మొదటి సంతానమే  కమలా హారిస్‌. ఆమెకు చెల్లెలు మాయా కూడా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement