బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం 'బాపు'. ‘ఎ ఫాదర్స్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాపు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
ట్రైలర్ చూస్తే తండ్రి పడే కష్టాలను తెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. ఒక రైతు తన పిల్లల కోసం పడే తపన, బాధలను కథాంశంగా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో బలగం సుధాకర్ రెడ్డి, బ్రహ్మజీ తండ్రీ, కుమారులుగా నటించారు. గతంలో విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment