![Thalapathy Vijay Son Jason Sanjay To Act With This Popular Actress Daughter - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/15/sanjay.jpg.webp?itok=VqJMjHYx)
సినిమా రంగంలో వారసుల తెరంగేట్రం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పటికే చాలామంది వారసులు వివిధ శాఖల్లో రాణిస్తున్నారు. తాజాగా ఒక కొత్త కాంబినేషన్‌కు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటుడు విజయ్ తన తండ్రి దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్ ద్వారా కథానాయకుడుగా పరిచయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్నారు.
(ఇది చదవండి: స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!)
అదేవిధంగా నటి దేవయాని. ఈమె బహుభాషా నటి. తొట్టాల్ సీణుంగి చిత్రం ద్వారా తమిళంలో కథానాయకగా పరిచయమైన దేవయాని ఆ తర్వాత కాదల్ కోట్టై వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. నీ వరివాయ్ ఎన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రాజకుమార్. ఆ చిత్రంలో అజిత్, దేవయాని హీరో హీరోయిన్‌గా నటించారు.
ఆ చిత్ర షూటింగ్ సమయంలోనే దర్శకుడు రాజకుమార్‌కు, నటి దేవయానికి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె ఇనియ కుమార్‌ను కథానాయకిగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.రాజకుమార్ దర్శకత్వం వహించిన నీ వరువాయ్ ఎన్ చిత్రం 1999లో విడుదలైంది. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
ఇందులో విజయ్ కుమారుడు సంజయ్, తన కూతురు ఇనియకుమార్‌తోను, హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు రాజకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన కూతురు ఇనియాకు నటించాలని కోరిక ఉందని దీంతో సంజయ్‌కు జంటగా ఆమెను నటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు అయితే విజయ్ వారసుడు సంజయ్ తెరవెనుక బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఆయన కథానాయకుడిగా నటిస్తారా వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment