
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం 'జననాయగన్'. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ భామ శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందు నటిస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.
— Vijay (@actorvijay) March 24, 2025
Comments
Please login to add a commentAdd a comment