ది గోట్ సరికొత్త రికార్డ్.. కేక్ కట్ చేసిన విజయ్ | Thalapathy Vijay celebrates GOAT success with producer Archana Kalpathi | Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: ది గోట్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న విజయ్

Published Sun, Oct 13 2024 9:59 PM | Last Updated on Mon, Oct 14 2024 2:52 PM

Thalapathy Vijay celebrates GOAT success with producer Archana Kalpathi

విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్‌. సెప్టెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ‍సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్‌ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్‌ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.

తాజాగా దళపతి విజయ్ తన చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాఈ చిత్రం తమిళనాడులో రూ. 100 కోట్ల షేర్ సాధించడంతో నిర్మాత అర్చన కల్పాతితో కలిసి కేక్ కట్ చేశారు. అర్చనతో కలిసి నటుడు కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

కాగా.. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement