ది గోట్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్‌.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Thalapathy Vijay The Greatest of All Time nett Collections in India Box Office | Sakshi

Thalapathy Vijay: విజయ్‌ చిత్రానికి షాకింగ్ కలెక్షన్స్‌.. వారం రోజులైనా కూడా!

Sep 12 2024 2:59 PM | Updated on Sep 12 2024 3:34 PM

Thalapathy Vijay The Greatest of All Time nett Collections in India Box Office

కోలీవుడ్ స్టార్‌ దళపతి విజయ్ స్పై థ్రిల్లర్ ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ దేశవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 170.75 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. దీంతో త్వరలోనే రూ.200 కోట్ల మార్కును చేరుకోనుంది. 

మొదటి రోజు రూ.44 కోట్లు రాబట్టిన ది గోట్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే అత్యధికంగా రూ.126 కోట్లు గ్రాస్  వసూళ్లు సాధించింది. కానీ లియో రికార్డ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. రాజకీయాలకు ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో  నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement