The Goat Movie
-
ఆ ట్రోల్స్ తట్టుకోలేక డ్రిపెషన్లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి
సినిమా నటీనటులకు ట్రోలింగ్ అనేది మాములే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్ చేస్తునే ఉంటారు. ఇక గాసిప్స్ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్ విషయాల్లోనూ చాలా పుకార్లు సృష్టిస్తుంటారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని భరించలేకపోతారు. భయపడతారు..బాధ పడతారు..డిప్రెషన్లోకి వెళ్తారు. హీరోయిన్ మీనాక్షి ఈ కేటగిరిలోకే వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కారణంగా తాను మనస్థాపానికి గురయిందట. వారం రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )నే చెప్పింది.‘ది గోట్’పై ట్రోలింగ్!కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(vijay), వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) గతేడాది సెప్టెంబర్ 5న విడుదైన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీనాక్షిపై ట్రోలింగ్ జరిగింది. ఇందులో కొడుకుగా నటించిన విజయ్ పాత్రను ఏఐ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. రిలీజ్ తర్వాత మీనాక్షి పాత్రపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. అవి చూసి మీనాక్షి చాలా బాధపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘విజయ్ హీరోగా వచ్చిన ‘ది గోట్’ విడుదలైన తర్వాత నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డా. వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్లా. తర్వాత ‘లక్కీ భాస్కర్’ విడుదలైంది. ఆ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. అందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మంచి సినిమాలపై దృష్టిపెట్టాలని అర్థం చేసుకున్నా’ అని చెప్పారు.‘సంక్రాంతి..’తో బిజీ బిజీప్రస్తుతం మీనాక్షి చౌదరి నటించిన‘సంక్రాంతికి వస్తున్నాం’(sankranthiki vastunam Movie) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఐశర్వర్య రాజేశ్ మరో హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మీనాక్షి ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో చేస్తున్నారు మీనాక్షి. దానికి గల కారణం కూడా చెప్పారు. ‘గతేడాది ఆరు సినిమాలు చేశాను. నెలకో సినిమా రిలీజ్ అయింది. షూటింగ్ కారణంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే సమయం దొరకలేదు. ఈ సారి మాత్రం కాస్త గ్యాప్ దొరికింది. అందుకే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను’ అని చెప్పింది. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'స్వాగ్'తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు గత వారం రిలీజైన 'దేవర' హంగామా ఇప్పటికీ నడుస్తోంది. ఇలాంటి టైంలో ఓటీటీల్లో 21 సినిమాలు ఈ శుక్రవారం అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనేది చూద్దాం.(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ)ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (అక్టోబరు 04)జీ5కలర్స్ ఆఫ్ లవ్ - హిందీ మూవీద సిగ్నేచర్ - హిందీ సినిమానెట్ఫ్లిక్స్హర్ట తాహ్త రైజా - ఇండోనేసియన్ మూవీద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - తెలుగు సినిమాద ఫ్లాట్ ఫామ్ 2 - ఇంగ్లీష్ మూవీకంట్రోల్ - హిందీ మూవీఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ - ఇంగ్లీష్ సినిమారన్మ 1/2 - జపనీస్ సిరీస్ (అక్టోబరు 05)ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 - జపనీస్ సిరీస్ (అక్టోబరు 06)అమెజాన్ ప్రైమ్ఫేస్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్హైవే లవ్ సీజన్ 2 - హిందీ సిరీస్ 2ద ట్రైబ్ - హిందీ రియాలిటీ సిరీస్సోనీ లివ్మన్వత్ మర్డర్స్ - మరాఠీ సిరీస్ఆహాబాలు గాని టాకీస్ - తెలుగు మూవీకళింగ - తెలుగు సినిమాజియో సినిమాఅమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ - హిందీ మూవీబుక్ మై షోపెటిట్స్ మైన్స్ - ఫ్రెంచ్ సినిమాసిడోని ఇన్ జపాన్ - ఫ్రెంచ్ మూవీమనోరమ మ్యాక్స్ఆనందపురం డైరీస్ - మలయాళ సినిమాఆపిల్ ప్లస్ టీవీవేరే ఈజ్ వాండా - జర్మన్ సిరీస్కర్సస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్ 3?) -
ఓటీటీకి వచ్చేసిన 'ది గోట్' మూవీ.. ఎక్కడ చూడాలంటే?
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది.ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Adavi ki raju simham aithe, ee lokaaniki raju ee GOAT! 🔥Thalapathy Vijay’s The G.O.A.T - The Greatest of all time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! 🐐#TheGOATOnNetflix pic.twitter.com/MQgFkpV6gl— Netflix India South (@Netflix_INSouth) October 2, 2024 -
ది గోట్ మూవీకి షాకింగ్ కలెక్షన్స్.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ స్పై థ్రిల్లర్ ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ మూవీ దేశవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 170.75 కోట్లకు పైగా నికర వసూళ్లు సాధించింది. దీంతో త్వరలోనే రూ.200 కోట్ల మార్కును చేరుకోనుంది. మొదటి రోజు రూ.44 కోట్లు రాబట్టిన ది గోట్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే అత్యధికంగా రూ.126 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది. కానీ లియో రికార్డ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. రాజకీయాలకు ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు
-
ధోనీని హైలైట్ చేయడం తెలుగు వాళ్లకు నచ్చలేదు: వెంకట్ ప్రభు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లెటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో హిట్ టాక్ వచ్చినా.. బాలీవుడ్, టాలీవుడ్లో మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూస్ కూడా నెగటివ్‌గా రావడంతో ఈ రెండు చోట్ల కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. తాజాగా ఈ విషయంపై వెంకట్ ప్రభు స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అభిప్రాయపడ్డాడు. వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ధోనీని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్)మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, లైలా, స్నేహ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దివంగత నటుడు విజయకాంత్‌ని, ఐపీఎల్ విజువల్స్ ద్వారా ధోనీని వెండితెరపై చూపించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. -
కలిసొచ్చిన వినాయక చవితి.. ది గోట్ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లతో దూసుకెళ్తోంది. శనివారం వినాయక చవితి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించింది. వీకెండ్ కావడంతో ఒక్క రోజే రూ.33 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.విడుదలైన మూడో రోజే దేశవ్యాప్తంగా కలెక్షన్లలో రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తొలిరోజు రూ.43 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన ది గోట్ చిత్రం రెండో రోజు రూ.25.5 కోట్లు వచ్చాయి. అయితే శనివారం వీకెండ్, వినాయకచవితి పండుగ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.102.5 కోట్ల నెట్ వసూళ్లు కలెక్ట్ చేసింది. శనివారం తమిళంలో థియేటర్లలో 72.58 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. రాజకీయాల్లో పోటీకి ముందు విజయ్ నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. తండ్రీకొడుకులుగా విజయ్ అభిమానులను అలరించారు. ఇందులో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ ఆకాష్, అజయ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
విజయ్ ది గోట్ మూవీ.. తొలి రోజు ఊహించని కలెక్షన్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన గుంటూరు కారం భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో గోట్ అభిమానుల్లో మరింత అంచనాలు పెంచేసింది. టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇండియన్-2 సినిమాను అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసింది.అంచనాలకు తగ్గట్టుగానే తొలిరోజు కలెక్షన్ల గోట్ దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన గోట్ చిత్రానికి ఇండియాలో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రూ.43 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్టు కలెక్ట్ చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముంది. ఓవర్సీస్ కలెక్షన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే మరిన్నిరికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ లియో చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ రికార్డ్‌ను గోట్ అధిగమించలేకపోయింది. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషించారు. -
విజయ్ చివరి సినిమా! థియేటర్లో త్రిష
స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే అభిమానులు థియేటర్లకు క్యూ కడతారు. అలాంటిది దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు చేసిన చివరి చిత్రం 'గోట్' నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో అటు సోషల్ మీడియాలో ఇటు థియేటర్ల వద్ద సందడి నెలకొంది. హీరోయిన్ త్రిష సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసింది. నిర్మాత అర్చన కలపతితో కలిసి చెన్నైలోని ఓ థియేటర్లో గోట్ వీక్షించింది.గెస్ట్ రోల్ఇకపోతే గోట్ సినిమాలో త్రిష అతిథి పాత్రలో మెరిసింది. ఓ పాటలో విజయ్‌తో కలిసి స్టెప్పులేసింది. కాగా వీరి జంటకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. 2004లో గిల్లి మూవీలో విజయ్- త్రిష జంటగా నటించారు. ఈ జోడీ అభిమానులకు తెగ నచ్చేసింది. తిరుపాచి, ఆతి, కురువి చిత్రాల్లోనూ ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. ఇటీవల వచ్చిన లియో మూవీలోనూ విజయ్‌తో కలిసి యాక్ట్ చేసింది. ఇప్పుడు గోట్లో ఓ పాటలో మెరిసింది. Engada Andha Yellow SareeBTS of #Trisha From #Matta Song#TheGreatestAllTime #TheGOAT pic.twitter.com/iUUxJ52xAq— RINKU (@RinkuRv03012001) September 5, 2024చదవండి: గోట్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి