కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లెటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో హిట్ టాక్ వచ్చినా.. బాలీవుడ్, టాలీవుడ్‌లో మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూస్ కూడా నెగటివ్‌గా రావడంతో ఈ రెండు చోట్ల కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి.
తాజాగా ఈ విషయంపై వెంకట్ ప్రభు స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అభిప్రాయపడ్డాడు. వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ధోనీని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
(చదవండి: ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్)
మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, లైలా, స్నేహ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దివంగత నటుడు విజయకాంత్‌ని, ఐపీఎల్ విజువల్స్ ద్వారా ధోనీని వెండితెరపై చూపించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment