Venkat Prabhu
-
ఓటీటీలో విజయ్ 'ది గోట్' సినిమా.. అధికారిక ప్రకటన
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్). ఓటీటీ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్‌న్యూస్ వచ్చింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినా సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్) సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తే.. త్రిష ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సంచలన కామెంట్స్ చేసిన డైరెక్టర్ వెంకట్ ప్రభు
-
ధోనీని హైలైట్ చేయడం తెలుగు వాళ్లకు నచ్చలేదు: వెంకట్ ప్రభు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లెటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలై మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే కోలీవుడ్‌లో హిట్ టాక్ వచ్చినా.. బాలీవుడ్, టాలీవుడ్లో మాత్రం ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. రివ్యూస్ కూడా నెగటివ్‌గా రావడంతో ఈ రెండు చోట్ల కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి. తాజాగా ఈ విషయంపై వెంకట్ ప్రభు స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని హైలైట్ చేయడం తెలుగు, హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని, అందుకే అక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని అభిప్రాయపడ్డాడు. వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ధోనీని హైలైట్ చేయడం వల్ల ఫలితం రాలేదనడం కరెక్ట్ కాదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: ఏడాదిన్నర ఆగితే.. 12 రోజులు షూట్ చేశారు: బాబీ డియోల్)మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, లైలా, స్నేహ ఇతరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దివంగత నటుడు విజయకాంత్‌ని, ఐపీఎల్ విజువల్స్ ద్వారా ధోనీని వెండితెరపై చూపించారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. -
The Goat Review: విజయ్ ‘ది గోట్’ మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)నటీనటులు: దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్, అజ్మల్, వైభవ్ తదితరులునిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్తెలుగు విడుదల: మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం: వెంకట్ ప్రభుసంగీతం: యువన్ శంకర్ రాజావిడుదల తేది: సెప్టెంబర్ 5, 2024దళపతి విజయ్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన చివరి సినిమా ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం ఇదేనని ప్రచారం జరగడంతో ‘ది గోట్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ యంగ్ లుక్‌లో చూపించడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఓ రకమైన ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం, విజయ్ చివరి చిత్రమని ప్రచారం జరగడంతో తమిళ్లో ‘ది గోట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్‌కి ముందు తెలుగులోనూ విజయ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో తీసిన సీన్స్ ట్రైలర్లో చూపించడం..వాటిపై ట్రోల్స్ రావడంతో తెలుగులో పెద్ద అంచనాలు లేకుండానే సినిమా రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే..విడుదల తర్వాత వెంకట్ ప్రభు చేసిన డీ ఏజింగ్ కాన్సెప్ట్ పక్కా ట్రోల్ అవుతుందని అంతా భావించారు. కానీ ట్రోలర్స్‌కి వెంకట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. జూనియర్ విజయ్ పాత్రను చక్కగా రాసుకోవడమే కాదు.. తెరపై అంతే చక్కగా చూపించాడు. ఈ విషయంలో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక కథ విషయానికొస్తే మాత్రం.. ఇది రొటీన్ సినిమా అని చెప్పొచ్చు. హీరో ఓ సీక్రెట్ ఏజెన్సీలో పని చేయడం..అతని పని వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రావడం..సొంత మనుషులే నమ్మక ద్రోహం చేయడం.. చివరికి హీరో అసలు విషయాన్ని కనిపెట్టి శత్రువుని ముట్టుపెట్టడం..ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వంపై కూడా సినిమాలు వచ్చాయి. ఈ రెండు కాన్సెప్ట్‌లను మిక్స్ చేసి ‘ది గోట్’ సినిమాను తెరకెక్కించాడు వెంకట్ ప్రభు. రొటీన్ కథే అయినా తనదైన స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. కావాల్సిన చోట హీరోకి ఎలివేషన్ ఇస్తూ విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్లో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్‌లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ సీన్ బోర్ కొట్టదు. ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజీని, ధోనీ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నాడు. ఊహకందేలా కథనం సాగడం, ట్విస్టులు కూడా ముందే తెలిసేలా ఉండడంతో పాటు నిడివి కూడా ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిజం ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. ది గోట్లో స్పెషల్ ఏంటంటే విజయ్‌లోని విలనిజాన్ని చూడొచ్చు. గాంధీగా హీరోయిజాన్ని తనదైన స్టైల్లో చూపిస్తూనే.. జీవన్ అలియాస్ సంజయ్గా అద్భుతమైన విలనిజాన్ని తెరపై పండించాడు. హీరోగా కంటే విలన్‌గా విజయ్ చేసిన కొన్ని సీన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పనిచేసే ఆఫీసర్స్‌గా ప్రశాంత్, ప్రభుదేవా, ఆజ్మల్ , జయ రామ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో భార్య అనుగా స్నేహ చక్కగా నటించింది. మీనాక్షి చౌదరి తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్‌ని తెరపై చూపించడం ఆకట్టుకుంటుంది. యోగిబాబు కామెడీ పర్వాలేదు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెరపై కనిపించేంది కొన్ని క్షణాలే అయినా.. సందడిగా అనిపిస్తుంది. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. యువన్ శంకర్ రాజా సంగీతం యావరేజ్‌గా ఉంది. పాటలు ఆకట్టుకోకపోవడమే కాకుండా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. బీజీఎం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డీ ఏజింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. ఏఐ టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ సినిమా ఫ్లాప్ కి కారణం నాగచైతన్యనే..!
-
ట్యూన్ పూర్తయిన రోజే విషాదం.. చివరికీ: ది గోట్ డైరెక్టర్ ఎమోషనల్
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన తాజా చిత్రం 'ది గోట్'. తమిళ స్టార్, దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంఘటనను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అదేంటో తెలుసుకుందాం.గోట్ మూవీలో ఓ పాటకు ట్యూన్ పూర్తయ్యాక ఓ విషాద వార్త వినాల్సి వచ్చిందని వెంకట్ ప్రభు తెలిపారు. ఆ సాంగ్‌కు సింగర్ భవతారిణితో పాడించాలని అనుకున్నట్లు వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఆమె మరణవార్త వినాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సోదరుడు యువన్ శంకర్ రాజా ఈ పాటను కంపోజ్ చేశారని.. తాను ట్యూన్ కంపోజ్ చేసిన రోజే భవతారిణి చనిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమెతోనే ఈ పాటను పాడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఏఐ సాయంతో వాయిస్..ఎలాగైనా సరే భవతారిణి వాయిస్‌తోనే ఆ పాటను పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని వెంకట్ ప్రభు అన్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఎలా చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించామని తెలిపారు. గతంలో ఏఆర్ రెహమాన్ తన పాట కోసం షాహుల్ హమీద్ వాయిస్‌ని ఎలా ఉపయోగించాడో.. అలాగే మనం కూడా చేద్దామని యువన్ శంకర్ రాజాకు చెప్పానని వెల్లడించారు. ఆ తర్వాత వారిని సంప్రదించి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేశారని పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చిన్న చిన్న కనగల్ పాటకు ఆమె వాయిస్‌ను జోడించామని వెంకట్ తెలిపారు. భవతారిణి వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని ఆయన వివరించారు. ఈ సాంగ్ మేల్ వాయిస్‌ను హీరో విజయ్ పాడారని.. మా సినిమాలో విజయ్ రెండు పాటలు పాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.కాగా.. కోలీవుడ్‌లో సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇళయరాజా కూతురు భవతారిణి జనవరి 25న శ్రీలంకలో క్యాన్సర్‌తో మరణించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతి చిత్రంలోని 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు భవతారిణి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. -
ది గోట్‌ని ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు వెంకట్ ప్రభు
‘‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమా చిత్రీకరణ ఏడాదిలోపే పూర్తయింది. హాలీవుడ్లో అయితే ఈ తరహా సినిమా తీయడానికి ఇంకాస్త ఎక్కువ సమయమే పట్టేది. ఇది పొలిటికల్ సినిమా కాదు... పొలిటికల్ డైలాగ్స్ లేవు. అలాంటి డైలాగ్స్ పెట్టమని విజయ్ అడగరు’’ అన్నారు దర్శకుడు వెంకట్ ప్రభు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం ‘ది గోట్: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటించగా, స్నేహా, ప్రశాంత్, లైలా, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ ను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టికెట్‌ను మైత్రీ నిర్మాత రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిలకు అందించారు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చనా. అనంతరం దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఏజీఎస్ సంస్థలో నా తొలి సినిమా ఇది. సపోర్ట్ చేసిన నిర్మాత అర్చనగారికి, ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీవారికి ధన్యవాదాలు. ఈ మూవీని ఆడియన్ ్స ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘గోట్’ రిలీజ్ కోసం ఏజీఎస్తో అసోసియేట్ అయిన మైత్రీ మూవీస్వారికి థ్యాంక్స్. మా ‘గోట్’ విజయ్‌గారు’’ అని వెల్లడించారు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ అర్చనా కల్పాతి. ‘‘వెంకట్ ప్రభుగారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా ‘ది గోట్’ రాబోతోంది’’ అని పేర్కొన్నారు ప్రశాంత్. మెత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ– ‘‘విజయ్‌గారి ఫ్యాన్ ్స కోసం ఎర్లీ మార్నింగ్ షోలను ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు వైభవ్, ప్రేమ్ జీ, నటి లైలా, నిర్మాత అర్చనా కల్పాతి, ఈ సినిమా అసోసియేట్ ప్రోడ్యూసర్ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. -
రజనీకాంత్‌తో ఛాన్స్.. నెల్సన్ తన్నుకుపోయాడు: వెంకట్ ప్రభు
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్‌తో తనకు దక్కిన అవకాశాన్ని దర్శకుడు నెల్సన్ తన్నుకుపోయారని దర్శకుడు వెంకట్‌ప్రభు పేర్కొన్నారు. సీనియర్ దర్శకుడు, సంగీత దర్శకుడు గంగైఅమరన్ వారసుడు వెంకట్‌ప్రభు. 'చెన్నై 28' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఈయన తరువాత చెన్నై 28–2, మంగాత్తా, గోవా, మానాడు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. నటుడుగా, నిర్మాతగానూ కొనసాగుతున్న వెంకట్‌ప్రభు తాజాగా విజయ్ కథానాయకుడిగా గోట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా ఇటీవల ఈయన ఓ భేటీలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. తాను రజనీకాంత్ కథానాయకుడిగా చిత్రం చేయాలని ఆశించాననీ, అందుకు కథను కూడా సిద్ధం చేసి ఆయనకు వినిపించానని చెప్పారు. రజనీకాంత్‌కు కూడా కథ నచ్చిందన్నారు. దీంతో రజనీకాంత్‌తో చిత్రం చేయడం ఖాయం అయ్యిందన్నారు. అయితే చివరి క్షణంలో రజనీకాంత్‌తో చిత్రం చేసే అవకాశాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తన్నుకుపోయారని, అలా తనకు రజనీకాంత్‌తో చిత్రం చేసే అవకాశం మిస్ అయ్యిందని చెప్పారు. నెల్సన్ దిలీప్‌కుమార్ నటుడు రజనీకాంత్‌తో చిత్రం చేయడం సంతోషమేననే అభిప్రాయాన్ని వెంకట్‌ప్రభు వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా గోట్ చిత్రం తరువాత ఈయన నటుడు శివకార్తికేయన్ హీరోగా ఓ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో జైలర్ వచ్చిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. -
రజినీకాంత్ టీజర్‌పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం తలైవార్171. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రివీల్ చేశారు. కూలీ పేరుతో టైటిల్ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు. రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ టీజర్‌ను ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ చేసిన పోస్ట్ కోలీవుడ్‌లో వివాదానికి దారితీసింది. రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కొందరు కొట్టి పారేయగా.. మరికొందరు ఖండించారు. ఇంతకీ వెంకట్ చేసిన పోస్ట్ ఏంటి? అసలు అది ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం.దళపతి విజయ్ హీరోగా గోట్ చిత్రీకరణలో బిజీగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో కమర్షియల్ తమిళ సినిమా ట్రైలర్ ఫార్ములాపై చర్చించే రీల్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అందుకో కమెడియన్ కార్తీక్ కుమార్ ప్రస్తుతం కమర్షియల్ సినిమాల ట్రైలర్స్ అన్ని ఓకే విధంగా ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ అల్ను వెంకట్ ప్రభు ఇన్‌స్టాలో పంచుకోవడంతో కాంట్రవర్సీగా మారింది.ఇదంతా రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే పోస్ట్ పెట్టారని వెంకట్ ప్రభుపై నెటిజన్స్ మండిపడ్డారు. కూలీ టైటిల్ టీజర్ లక్ష్యంగా చేసుకున్నారని రజనీకాంత్ అభిమానులు ఆరోపించారు. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం మద్దతుగా నిలిచారు. ఇదంతా జస్ట్ ఫన్నీ కోసమేనంటూ కొట్టిపారేశారు.తాజాగా తన పోస్ట్‌పై దర్శకుడు వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " కాదు.. ఇది మేమంతా చేస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కోసమే.! అతను చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. మనం రెగ్యులర్ కమర్షియల్ టెంప్లేట్‌కు భిన్నంగా ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఫ్యాన్స్ కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు " అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి వెంకట్ ప్రభు తెరదించారు. కాగా.. గతంలో అట్లీ మూవీ మెర్సల్‌ను సమయంలోనూ ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇదిలా ఉండగా గోట్ సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. Breaking News 🚨 : Director @vp_offl reposted an Instagram story in which @Dir_Lokesh is being Mocked for #Coolie Title Teaser , Then Atlee .... Now Lokesh ... pic.twitter.com/AfN201kqGn— Let's X OTT GLOBAL (@LetsXOtt) April 28, 2024 -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' నుంచి విజయ్ చివరి సాంగ్ విడుదల
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో జేజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 5న విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేశారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా తర్వాత 'దళపతి 69' ప్రాజెక్ట్ మాత్రమే చేయనున్నాడు. 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తే.. తాజాగా విడుదలైన పాటను విజయ్‌తో పాటు వెంకట్ ప్రభు పాడటం జరిగింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. పలు సినిమాల్లో విజయ్ పాటలు పాడుతూ ఉంటాడు. ఇప్పటివరకు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్, అనిరుధ్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడగా అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా! తాజాగా యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం చిత్రం కోసం చివరగా విజయ్ ఒక పాటను పాడడం విశేషం. కొన్నిరోజుల పాటు తమిళనాట ఈ సాంగ్ ఒక ఊపు ఊపేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' విడుదల తేది ప్రకటించిన విజయ్
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ విడుదల తేది ఫిక్స్ అయింది. విజయ్ కెరీర్లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విజయ్ డబుల్ రోల్లో కనిపించిన పోస్టర్ రిలీజ్ అయింది. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. 1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచ్యుట్ తో దూకేసాడు. ఆ కూపర్ అనే వ్యక్తి ఇప్పటికి దొరకలేదు. ఆ మిస్టరీని బేస్ చేసుకొని ఈ సినిమాని తీస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమాను సెప్టెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు విజయ్ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. రంజాన్ సందర్భంగా అభిమానులకు ఇలా కానుకగా సినిమా విడుదల తేదిని ప్రకటించారని ఫ్యాన్స్ అంటున్నారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి ఉంది. పైగా శనివారం కూడా కలిసి వస్తుంది. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా మరింత కలిసొచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Vijay (@actorvijay) -
పండగ స్పెషల్.. దళపతి విజయ్ లేటెస్ట్ మూవీ కొత్త పోస్టర్
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్' (G.O.A.T). వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీల మీనాక్షిచౌదరి హీరోయిన్ కాగా.. స్నేహ, లైలా, మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: సంక్రాంతి సినిమాల సందడి.. ఏది హిట్? కలెక్షన్స్ ఎంత?) ఇప్పటికే కశ్మీర్, హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. ఈ మధ్య రెండు పోస్టర్స్ రిలీజ్ చేయగా.. వాటితో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. అలానే ఈ చిత్రం విజయ్.. ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా సంక్రాంతి సందర్భంగా మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ ఫొటోలో భాగంగా మిలటరీ గెటప్‌లో తుపాకీ పట్టుకుని విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ కనిపించారు. ఈ సినిమా వేసవి కానుకగా థియేటర్లలోకి రానుందని తెలుస్తోంది. అలానే ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తీస్తున్నట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సాయిపల్లవి చెల్లి.. కుర్రాడు ఎవరంటే?) pic.twitter.com/Tl8mrlT8fT — Vijay (@actorvijay) January 15, 2024 -
దళపతి కొత్త మూవీలో శివగామి.. ఏకంగా అలాంటి పాత్రలో!
దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. వెంకట్ ప్రభు దర్శకుడు. విజయ్.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ క్రేజీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇప్పుడు మరో ప్రముఖ నటి కూడా జాయిన్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ.. 'బాహుబలి'లో శివగామిగా చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పుడు విజయ్ కొత్త మూవీలో నటిస్తున్న స్వయంగా ఆమెనే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో ప్రారంభమై థాయిలాండ్, టర్కీ, హైదరాబాద్‌లో జరిగింది. తదుపరి షెడ్యూల్ క్రిస్మస్ తర్వాత అంటే జనవరి తొలివారంలో ప్రారంభం కానుందని సమాచారం. (ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!) -
దళపతి కొత్త మూవీ.. టైటిల్ అదేనంటూ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లియో తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటకొస్తున్నాయి. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ఒక పాత్ర కోసం విజయ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యూత్ ఫుల్‌గా తయారవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విధంగా ఈ చిత్రానికి బాస్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు న్యూస్ తెగ వైరలవుతోంది. ఇకపోతే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబరు 31వ తేదీన విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు రెడీ అయ్యాయి. దీనిపై గురించి చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అర్చన తెలుపుతూ తమ చిత్రం గురించి జరుగుతున్న ప్రచారంలో ఏదీ నిజం లేదన్నారు. ముఖ్యంగా చిత్ర టైటిల్ బాస్ అని జరుగుతున్న ప్రచారంలో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వెంకట్ ప్రభు స్పెషల్‌గా ఆలోచించారని.. ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. విజయ్ తన 69, 70వ చిత్రాలకు కూడా కమిట్ అయినట్లు తెలిసింది. తన 69వ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్, 70వ చిత్రానికి దర్శకుడు శంకర్ లేదా అట్లీ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. ఈ చిత్రంలో నటి స్నేహ, లైలా, రాఘవ లారెన్స్, ప్రశాంత్, మైక్ మోహన్, ప్రేమ్ జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఈమె తెలుగు హీరోయిన్, పక్కనే ఉన్నది స్టార్ డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? కచ్చితంగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఫొటో అప్పుడెప్పుడో 28 ఏళ్ల క్రితం తీసుకున్నది. ఈ బ్యూటీ తెలుగులో దాదాపు పదేళ్ల పాటు సినిమాలు చేసింది. కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్న టైంలోనే ఓ సింగర్‌ని పెళ్లి చేసేసుకుంది. ఆ తర్వాత కారణమేంటో తెలీదు గానీ తెలుగు మూవీస్‌ని పక్కనబెట్టేసింది. ఇంతలా చెప్పాం కదా.. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంగీత. అవును మీరనుకున్నది కరెక్టే. ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, సంక్రాంతి తదితర సినిమాల్లో కనిపించిన బ్యూటీనే ఈ సంగీత. తమిళనాడులోని చెన్నైలో పుట్టిపెరిగిన ఈ ముద్దుగుమ్మ.. 1997లో 'గంగోత్రి' అనే మలయాళ మూవీతో నటిగా పరిచయమైంది. అదే ఏడాది కన్నడ, తర్వాతి సంవత్సరం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే 1999లో తెలుగులోకి ఎంటరైంది. 'ఆశల సందడి' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగీత.. ఆ తర్వాత నవ్వుతూ బతకాలిరా, మా ఆయన సుందరయ్య తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే 'ఖడ్గం'తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. అనంతరం పెళ్లాం ఊరెళ్తే, ఆయుధం, ఖుషిఖుషీగా, విజయేంద్రవర్మ, సంక్రాంతి, మా ఆయన చంటిపిల్లాడు తదితర చిత్రాలు చేసింది. 2010లో 'కారా మజాకా' చేసిన తర్వాత తెలుగు సినిమాలు చేయడం తగ్గించేసింది. మళ్లీ 2020లో 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చింది. 'ఆచార్య'లో సాంగ్, 'మసూద'లో ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించింది. సంగీత వ్యక్తిగత జీవితానికొస్తే.. 2009లో తమిళనాడుకు చెందిన సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా శివయ్య అనే కొడుకు పుట్టాడు. తెలుగు సినిమాల్లో ఈమె పేరు సంగీత అయినప్పటికీ.. మలయాళంలో రషిక, కన్నడలో దీప్తి అనే స్క్రీన్ నేమ్‌తో సినిమాలు చేసింది. ఇకపోతే పైన ఫొటోలో ఈమెతో పాటు ఉన్నది తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు. వీళ్లిద్దరి ఫ్రెండ్స్ కావడంతో అప్పట్లో ఈ ఫొటో తీసుకుంది. తాజాగా వెంకట్ ప్రభు పుట్టినరోజు సందర్భంగా ఈ పిక్ పోస్ట్ చేసింది. సో అదన్నమాట విషయం. View this post on Instagram A post shared by Sangithakrish (@sangithakrish) View this post on Instagram A post shared by Sangithakrish (@sangithakrish) -
స్నేహకు క్రేజీ ఆఫర్.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ హీరోకి జోడిగా!
తమిళసినిమా: ఒకపక్క లియోకి సంబంధించిన వార్తలు, మరోవైపు తన కొత్త చిత్రానికి సంబంధించిన వార్తలతో నటుడు విజయ్ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ప్రస్తుతం లియో చిత్రానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రచారంలో ఉంటునే ఉంది. అదేవిధంగా విజయ్ నటించిన 68వ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తూ ఆయన అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విజయ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో విజయ్ నటించనున్న యువ పాత్ర గెటప్ కోసం ఆయనతోపాటు చిత్ర యూనిట్ ఇటీవల అమెరికాలో మకాం పెట్టినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ గెటప్ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ లుక్ టెస్ట్ చేసినట్లు తెలిసింది. అదేవిధంగా ఇందులో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాల గురించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఇకపోతే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయకలు ఉంటారని అందులో ఓ పాత్రలో నటి స్నేహ నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దర్శకుడు వెంకట్ ప్రభు స్నేహ కలిసి తీసుకున్న ఓ ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. దీంతో దళపతి కొత్త చిత్రంలో స్నేహ కచ్చితంగా ఉంటుందనే ప్రచారం జోరందుకుంది. కాగా 20 ఏళ్ల క్రితం విజయ్ సరసన స్నేహ వశీకర చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు విజయ్‌తో జత కట్టే అవకాశం వచ్చింది. -
విలన్‌గా ధోని.. కాంబినేషన్ సెట్ చేసిన స్టార్ డైరెక్టర్
క్రేజీ కాంబినేషన్లకు సెట్ చేయడంలో దర్శకుడు వెంకట్‌ప్రభు ఘనుడనే చెప్పాలి. చిన్న నటుల నుంచీ స్టార్ హీరోల వరకూ చిత్రాలను చేసి హిట్స్ ఇచ్చిన దర్శకుడీయన. ఆ మధ్య నటుడు అజిత్, అర్జున్‌లో మంగాత్తా చిత్రం చేసి సక్సెస్ అయిన వెంకట్‌ప్రభు ఇటీవల శింబు హీరోగా మానాడు చిత్రంతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. తాజాగా దళపతి విజయ్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇది విజయ్ 68వ చిత్రం అన్నది గమనార్హం. ప్రస్తుతం లియో చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తదుపరి నటించేది వెంకట్‌ప్రభు దర్శకత్వంలోనే. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఇందులో విజయ్ సరసన నటి జ్యోతిక నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో భారతీయ క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్.ధోనీ నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన ధోని నటుడు హరీశ్‌కల్యాణ్ హీరోగా ఎల్జీఎం అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్ర మీడియా సమావేశంలో ధోని హీరోగా యాక్షన్ ఓరియంటెండ్ చిత్రాన్ని చేస్తారని ఆయన సతీమణి సాక్షి ధోని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు విజయ్‌కు విలన్‌గా నటించనున్నారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా ఇంకా పేరు ఖరారు చేయని విజయ్ 68వ చిత్రానికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
నిర్మాతగా మారనున్న ప్రముఖ డైరెక్టర్
కోలీవుడ్‌లో మసాలా పాప్‌కార్న్, వైట్ ఫెదర్స్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్న చిత్రం 'నన్బన్ ఒరువన్ వంద పిరగు'. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్ర నిర్మాణ సంస్థలో పని చేసిన ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనందన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనిగురించి ఐశ్వర్య తెలుపుతూ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్ర నిర్మాణ సంస్థలో పని చేసిన అనుభవంతో మంచి జనరంజకమైన చిత్రాలు నిర్మించాలని తలచానన్నారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) మసాలా పాప్‌కార్న్ చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందే చిత్రాలు ప్రేక్షకులకు సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి. మంచి వినోదాన్ని అందించేలా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అలా మంచి స్నేహమయ జీవితంతో కూడిన చిత్రంగా నన్బన్ ఒరువన్ వంద పిరగు అని చెప్పారు. వైట్ ఫెదర్స్ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. తమ మధ్య స్నేహమే ఈ చిత్రం ఇంత దూరం రావడానికి కారణమన్నారు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు దీనికి సమర్పకుడు వ్యవహరిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలో పాటు అధిక భాగం సింగపూర్‌లో నిర్వహించినట్లు చెప్పారు. చైన్నె 28 చిత్ర జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం సంతోషంగా ఉందని దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. -
కోలీవుడ్ స్టార్స్‌తో దర్శకుడి ఫ్రెండ్షిప్.. ఫోటో వైరల్
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. ఇది పాట మాత్రమే కాదు. జీవనామృతం. ఈ కాలంలో ప్రేమాభిమానాలను పంచుకోవాల్సిన కుటుంబ సభ్యులే ద్వేషాలను పెంచుకుంటున్నారు. అందరూ కాకపోయినా ఎక్కువ మంది కుటుంబాల్లో జరుగుతోంది ఇదే. అయితే ఒక్కోసారి గొడవలు పడ్డా, కొట్టుకున్నా కష్టకాలంలో అండగా నిలుస్తుంది స్నేహితులు మాత్రమే. కాగా సోమవారం స్నేహితుల దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంది. సినీ పరిశ్రమలోనూ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో తోపు అని సామాజిక మాధ్యమాల్లో విమర్శించుకోవడం పరిపాటే. తమిళ సినిమాలో ఒకప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ అభిమానులు ఈ విషయంలో తీవ్రంగా గొడవపడేవారు. అయితే రాను రానూ ఆ పరిస్థితి తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఇలాంటి పోటీ తీవ్ర రూపు దాల్చింది. ఇప్పుడు అది కూడా సన్నగిల్లింది. తాజాగా రజనీకాంత్, విజయ్ అభిమానుల మధ్య ఎవరు సూపర్ స్టార్? అన్న వివాదం నడుస్తోంది. అయితే హీరోలు మాత్రం తామంతా ఒకటేనని వివాదాలు వద్దని తమ అభిమానులకు హితవాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అభిమానులకు అది తలకెక్కడం లేదు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు చుట్టూ ఎప్పుడు చూసినా మిత్ర బృందమే ఉంటుంది. స్నేహానికి అంత విలువనిచ్చే ఆయన స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన ట్విటర్లో 'ఇది చాలా సంతోషకరమైన స్నేహితుల దినోత్సవం. ప్రేమను వ్యాపింపజేయండి' అని పేర్కొన్నారు. అందులో నటుడు రజనీకాంత్, కమల్ హాసన్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, ఆయన తండ్రి గంగై అమరన్ తో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు. అదేవిధంగా విజయ్, అజిత్‌తో కలిసి ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేశారు. Happy friendship day🙏🏽❤️ spread love pic.twitter.com/TJ8Ab1HTEx — venkat prabhu (@vp_offl) August 6, 2023 చదవండి: మిగతా హీరోయిన్లకు సమంత కథ వేరే! -
కస్టడీ డైరెక్టర్‌తో విజయ్.. రెమ్యునరేషన్ ఏకంగా రూ.200 కోట్లా!
దళపతి విజయ్ సౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. ఇంక ఆయనతో సినిమా తీసేందుకు డైరెక్టర్లు సైతం క్యూ కడతారు. అయితే ప్రస్తుతం ఆయన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లియో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మిస్కిన్, ప్రియా ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: కస్టడీ డైరెక్టర్‌తో విజయ్ నెక్స్ట్ మూవీ?) అయితే ఈ సినిమా తర్వాత విజయ్.. కస్టడీ మూవీ దర్శకుడు వెంకట్ ప్రభుతో జతకట్టనున్నట్లు సమాచారం. తన తదుపరి చిత్రం కోసం ఆయనతో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రం కోసం విజయ్ దాదాపు రూ.200 కోట్లు రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారం రానుందని సమాచారం. అదే నిజమైతే ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే తొలి భారతీయ నటుడిగా విజయ్ నిలుస్తాడు. అయితే గతంలో మాస్టర్ మూవీ కోసం విజయ్ రూ. 80 కోట్లు వసూలు చేశాడు. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) -
కస్టడీ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్లో కృతి శెట్టి..
-
ఆ మైండ్ సెట్ తో వెళ్తే కచ్చితంగా నచ్చుతుంది
-
‘కస్టడీ’ మూవీ ట్వీటర్ రివ్యూ
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కస్టడీ’ సినిమా ఎలా ఉంది? కానిస్టేబుల్‌గా నాగచైతన్య ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. (చదవండి: ఆ విషయం ఓ సవాల్‌గా మారింది : నాగచైతన్య) ‘కస్టడీ’చిత్రానికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. నటన పరంగా నాగచైతన్య, అరవింద స్వామి ఇరగదీశారని చెబుతున్నారు. అయితే కథ, కథనం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది కానీ పాటలు ఆకట్టుకునేలా లేవని కామెంట్ చేస్తున్నారు. #Custody One Word Review: This movie has a 50-50 odds of winning at the box office but This gonna be a #NagaChaitanya memorable movie in his career. This remains to be one of the UNDERRATED Movie from tollywood if not recognized today. Mark my words 🔥#CustodyReview… pic.twitter.com/enUNpXNAOK — ReviewMama (@ReviewMamago) May 12, 2023 సినిమా నెమ్మదిగా మొదలై.. ప్రిడిక్టబుల్ నెరేషన్ తో సాగుతుందట ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగించేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50ః50 శాతం విజయం సాధించే అవకాశం ఉంది. కానీ నాగచైతన్య కెరీర్లో ఓ మెమరబుల్ మూవీ అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Custody Overall a Below Par Action Thriller! Interesting plot point with a few well designed scenes that work but the rest is tiresome. Film is dragged in many places with repetitive actions scenes and narrated in a flat way. BGM is ok but songs are awful. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) May 11, 2023 కస్టడీ ఓవరాల్‌గా బిలో యావరేజ్ పార్ యాక్షన్ థ్రిల్లర్. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చాలా సీన్స్ గత సినిమాల్లో చూసినట్టుగా ఉంటాయి. నేపథ్య సంగీతం బాగుంది. కానీ పాటలు ఆకట్టుకోలేకపోయాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు. #Custody career best acting career best movie 3.789/5 — Vv (@babbar5her_) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody an excellent first half and good second half Overall a must watch movie - 3.25/5 👌 — AkkineniBOupdates (@AkkineniBO) May 12, 2023 #Custody it's engaging thriller with lots of turns & twist & because it's @vp_offl film he shows Realeastic ⭐⭐⭐🌟#NagaChaitanya did outstanding perf & he did fab especially in action scenes 🙌#ArvindSwamy is just rugged in his own manner & his look is supercool BGM 💥 pic.twitter.com/SAIX3kYXfj — Md Hussain S 🇮🇳 (@MdHusanyS) May 12, 2023 #Custody First half police station scene 🔥🔥🥳 Second half forest fight 🔥🔥🔥 Kummaru — Toride (@Toride17Toride) May 12, 2023 Just Now Completed My show 🤩 1st Half average, 2nd Half Mathram 💥💥💥 Screenplay +BGM Mamuluga Undav 💥🥵🥵🥵 Chai acting Aithay Un expected💥 Overall ga Block Buster Kotesadu @chay_akkineni Anna 😍#Custody #NagaChaitanya pic.twitter.com/cSd29CzokA — Srinivas (@srinivasrtfan2) May 12, 2023 #CustodyFromTomorrow #CustodyOnMay12 #CustodyMovie #custody 1st half good. It wd have even more gripping but still good 1st half. Chay superb perf 👌 Vennela kishore hilarious 👌 Ilayaraja bgm creates nostalgia 🙏 https://t.co/wmcUQ0NYOk — BayArea MegaFan 💪 (@Twittarodu) May 12, 2023 -
కస్టడీ టీం ప్లానింగ్ అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిఫ్లెక్ట్ అయితే మాత్రం..
-
గాయపడ్డ మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది
-
నాన్న శివ సినిమాకు కస్టడీ సినిమాకు కనెక్షన్..
-
చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు
‘‘మలయాళం మూవీ ‘నాయట్టు’ స్ఫూర్తితో ‘కస్టడీ’ స్టోరీలైన్ రాసుకున్నాను. అయితే ‘నాయట్టు’లో కమర్షియల్ అంశాలు ఉండవు. ‘కస్టడీ’లో తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కమర్షియల్ అంశాలు ఉంటాయి’’ అన్నారు వెంకట్ ప్రభు. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వెంకట్ ప్రభు చెప్పిన విశేషాలు. ►ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలీస్ కానిస్టేబుల్ శివ పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. శివకు ఉన్న ప్రాబ్లమ్స్‌తో ఈ సినిమా కథ మొదలవుతుంది. అతని కుటుంబం, ప్రేయసి వంటి అంశాలతో మొదటి ఇరవై నిమిషాలు గడుస్తాయి. కానీ తనది కాని సమస్యలో శివ ఇరక్కుంటాడు. కాలానికి వ్యతిరేకంగా పరిగెత్తాల్సి వస్తుంది. (చదవండి: ఆఖరి రోజుల్లో దయనీయ స్థితిలో కమెడియన్.. వీడియో వైరల్) ప్రీ ఇంట్రవెల్ నుంచి క్లయిమాక్స్ వరకూ ఆడియన్స్ ఈ సినిమాను ఆసక్తికరంగా చూస్తారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. రీసెంట్గా ‘కస్టడీ’ స్టోరీ లైన్ చెప్పేశాను. ఆ తర్వాత సినిమా గురించి ఎక్కువ రివీల్ చేయవద్దని, సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ను థియేటర్స్‌లో ఆడియన్స్ చూసి ఎగ్జయిట్ అయితే బాగుంటుందని చైతూ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. సో.. ఇంతకంటే ఏమీ చెప్పలేను. (చదవండి: ఆదిపురుష్.. టీజర్‌కి, ట్రైలర్‌కి తేడా ఏంటి?) ► యాక్టింగ్ పరంగా ఈ చిత్రంలో కొత్త చైతూను చూస్తారు. రేవతిగా కృతీ శెట్టి, రాజుగా అరవింద్ స్వామి, శరత్‌కుమార్‌ల పాత్రలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘కస్టడీ’ యూనివర్సల్ సబ్జెక్ట్. సబ్ టైటిల్స్‌తో ఇతర భాషలవారు ఈ సినిమాను చూస్తే వారికీ నచ్చుతుంది. ఇక ‘మానాడు’ సినిమాను తెలుగులో శ్రీనివాసా చిట్టూరిగారు నిర్మించాల్సింది కానీ కుదర్లేదు. అయితే ఆయనతో ఓ ప్రాజెక్ట్ చేయాలన్న ఆశ ‘కస్టడీ’తో తీరింది. ‘కస్టడీ’ సినిమాకు ఇళయరాజాగారు, యువన్ల సంగీతం చాలా పెద్ద ఎస్సెట్ ► నేను శివ సినిమాకి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారి అబ్బాయితో సినిమా చేస్తున్నపుడు అందులో పాత్ర పేరు శివ అయినప్పుడు అదే పేరు పెట్టాలని అనుకున్నాను. అయితే చైతు వద్దు అని చెప్పారు. అది కల్ట్ క్లాసిక్. చాలా పోలికలు వస్తాయని అన్నారు. -
ప్రమాణం చేసి మరీ నిజాలు చెప్పిన ప్రియమణి
-
నాగచైతన్య, కృతి శెట్టి ఇంటర్వ్యూ
-
కస్టడీ ట్రైలర్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ట్రైలర్ మొత్తం ఇదే
-
అందరూ నా కస్టడీ లోకి రావాలి
‘‘కస్టడీ’ సినిమా తొలి 20 నిమిషాలు డైరెక్టర్ వెంకట్గారిలా కూల్‌గా వెళుతుంది. 40వ నిమిషం నుంచి ఫాస్ట్‌గా వెళుతుంది.. థియేటర్లో బ్లాస్టే. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ ఉన్నాయి. నిజంగా ఒక కొత్త చైతూని (నాగచైతన్య) చూడబోతున్నారు.. అలా నా పాత్రని తీర్చిదిద్దారు వెంకట్‌గారు. ఈ నెల 12న మీరందరూ (ప్రేక్షకులు, అభిమానులు) నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘కస్టడీ’ కథని వెంకట్‌గారు నాకు చెప్పినప్పుడు తొలిసారి నేను పైకిలేచి వెంటనే ఆయన్ని హత్తుకున్నా.. నాకు అంత ఎగై్జట్‌మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు కూడా అదే ఎగై్జట్‌మెంట్ వచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా. అజిత్, సూర్య, కార్తీ, శింబుగార్లతో వెంకట్‌గారు సినిమాలు తీసి తమిళ్లో ఎన్నో పెద్ద హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన ఆయనకు స్వాగతం. నా కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ ‘కస్టడీ’ అని చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్, పవన్‌గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. వెంకట్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతన్యగారి స్టైల్, యాక్షన్, నటన, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్... ఇలా అన్నీ ఉన్నాయి. ఈ మూవీలో మీకు ఓ పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ‘కస్టడీ’ రెండో పార్ట్ కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘అందరూ థియేటర్స్‌కి వచ్చి ‘కస్టడీ’ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు నటి ప్రియమణి. ఈ వేడుకలో కృతీశెట్టి, నటుడు ప్రేమ్‌జీ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రెసిపీ ఎవరికీ తెలియదు
‘‘నాకు షూటింగ్ లొకేషన్ హాలిడే స్పాట్లాంటిది. షూటింగ్ చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. ఏ రోజైనా షూటింగ్ లేదంటే నాకు బోర్ అనిపిస్తుంది. అంతగా ప్రొఫెషన్ అంటే నాకు ప్రేమ’’ అన్నారు కృతీ శెట్టి. నాగచైతన్య సరసన కృతీ నటించిన ‘కస్టడీ’ ఈ నెల 12న విడుదల కానుంది. పవన్‌కుమార్ సమర్పణలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు. ► ముందుగా ‘కస్టడీ’ స్టోరీ లైన్ గురించి.. సాధారణంగా ఏ సినిమాలో అయినా విలన్ని చంపడం, ఓడించడం... కథ ఇలా ఉంటుంది. అయితే ‘కస్టడీ’లో మాత్రం విలన్‌ను కాపాడటానికి హీరో ప్రయత్నిస్తుంటాడు. కొత్త స్టోరీ. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ► స్టోరీ లైన్ కొత్తగా ఉంది... మీ పాత్ర? ఇందులో నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేశాను. సీరియస్‌గా నడుస్తున్న కథను నా పాత్ర బ్యాలెన్స్ చేయడమే కాకుండా స్క్రీన్ ప్లేలతో పాటు ప్రయాణం చేస్తుంది. నేనిప్పటివరకూ చేసిన సిని మాలన్నింట్లోకీ ఈ సినిమాలో చేసిన పాత్ర నిడివి ఎక్కువ. ► కానీ యాక్షన్ సినిమాల్లో హీరోయిన్‌కు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా? అది కొంత నిజమే. అయితే ‘కస్టడీ’ యాక్షన్ సినిమా అయినప్పటికీ హీరోయిన్ క్యారెక్టర్ లెంగ్త్ ఎక్కువ. ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే.. వేరే సినిమాలకు డ్యాన్స్ప్రాక్టీస్ చేశాను. కానీ ఈ సినిమా కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను. అందుకే డైరెక్టర్ వెంకట్ ప్రభుగారితో ఈ సినిమా చూశాక హాలీవుడ్ నుంచి నాకు మార్వెల్ ఫిలింస్‌కి, డిస్నీ సంస్థ నుంచి ఫోన్ వస్తుందేమో అని సరదాగా అన్నాను. ► ‘కస్టడీ’లో అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ చిత్రీకరణ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఈ యాక్షన్ సీన్స్ తీయడానికి 15 రోజులు పట్టింది. ఇందులో 5 రోజులు పూర్తిగా 20 ఫీట్ల వాటర్ పూల్‌లో షూటింగ్ చేశాం. తీసే ముందు రెండు రోజులుప్రాక్టీస్ చేశాం. కొన్నిసార్లు 40 సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఊపిరి తీసుకోకుండా చేయాల్సి వచ్చింది. ఈ సీన్లలో చైతూ, సంపత్‌గారు, అరవింద్ స్వామిగారు, నేను ఉంటాం. అందుకే భయం వేసింది. ఎందుకంటే ఎవరికి ‘అన్ ఈజీ’గా అనిపించినా మళ్లీ సీన్ తీయాల్సి ఉంటుంది. నా కారణంగా అలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదని కోరుకున్నాను. ► ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్యతో ‘కస్టడీ’ సినిమా చేశారు.. మీ కెమిస్ట్రీ గురించి? చైతన్య నా ఫేవరెట్ కో–స్టార్, అలాగే తన వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. జనరల్‌గా ఆఫ్ స్క్రీన్‌లో కో–స్టార్స్ మధ్య మంచి రిలేషన్ ఉంటే అది ఆన్ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఆఫ్ స్క్రీన్ చై, నా రిలేషన్ బాగుంటుంది. తనతో ఉన్న సాన్నిహిత్యం మా కెమిస్ట్రీని మరింత అందంగా పండించింది. కొన్నిసార్లయితేప్రాక్టీస్ చేయకుండానే సహజంగానే నటించాం. చైతూతో ఆ కంఫర్ట్ ఉంటుంది. ► ‘ఉప్పెన’ తర్వాత మీరు చేసిన సినిమాలు పెద్దగా ఆశించిన ఫలితం సాధించలేదు. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకున్నారా? ‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ వంటి మంచి సినిమాలు చేశాను. ఆ విషయం పక్కన పెట్టి ఫలితం గురించి చె΄్పాలంటే.. పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న నటులు ఉన్నారు. అయితే వారితో పాటు సక్సెస్ రెసిపీ ఎవరికీ తెలియదు. అది తెలిస్తే అన్నీ హిట్లే వస్తాయి. మా వంతుగా మేం చేయగలిగింది కష్టపడి పని చేయడమే. నేను చేసిన సినిమా ఫ్లాప్ అయినా పశ్చాత్తాపపడను. ఎందుకంటే ఆ సినిమా కూడా ఎంతో కొంత అనుభవాన్ని మిగుల్చు తుంది కదా. ఆ అనుభవం నా భవిష్యత్ సినిమాల ఎంపికకు పనికొస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ► నటన కాకుండా మీకున్న వ్యాపకాలు? దర్శకత్వం చేయాలనుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్షన్‌కి సంబంధించిన విషయాల మీద ఆసక్తి చూపిస్తుంటాను. సెట్స్‌లో అందరూ ఆటపట్టిస్తుంటారు.. అయితే పదేళ్ల తర్వాతే డైరెక్షన్ చేస్తాను. ► తదుపరి సినిమాల గురించి... మలయాళంలో ఒక సినిమా, శర్వానంద్‌తో తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతాను. -
కస్టడీ ట్రైలర్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్..ట్రైలర్ మొత్తం అదే
-
పెద్ద హీరోలను మినహాయించి నన్నే ఎందుకు..? చైతూ
-
కస్టడీ మూవీ టీమ్ ప్రెస్ మీట్లో కృతి శెట్టి స్పీచ్
-
గాయపడిన మనసు గురించి చైతూ మాటల్లోనే..
-
కొడితే ఇప్పుడే కొట్టాలి..లేకపోతే నాగ చైతన్యకి ఇక ఛాన్స్ లేదు!
సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన ప్రతి హీరో మాస్ ఇమేజ్ ట్రై చేస్తుంటారు. ఒకసారి మాస్ ఇమేజ్ వస్తే ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్ తోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. ఇక దర్శక నిర్మాతలు అయితే ఆ హీరోతో సినిమాలు చేసేందుకు క్యూ కడతారు. వీటికంటే ముందు మాస్ హీరో అనిపించుకుంటే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాపీస్ కలెక్షన్స్ తో నిండిపోతోంది. టాలీవుడ్ లో మాస్ హీరో అనిపించుకునేందుకు ట్రై చేస్తున్న యంగ్ హీరోస్ లో నాగచైతన్య ఒకడు. నాగచైతన్య తన కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. జోష్ మూవీ తో హీరోగా తెరంగ్రేటం చేసిన నాగచైతన్య ఏ మాయ చేశావే వంటి క్లాస్ మూవీతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ అక్కినేని హీరో నటించిన మాస్ మూవీస్ దడ, ఆటోనగర్ సూర్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ అక్కినేని హీరో కెరీర్ గమనిస్తే హిట్స్ అందుకున్న సినిమాలన్నీ క్లాస్ మూవీసే. చైతూ కెరీర్లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత మళ్లీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. మారుతి డైరెక్షన్ లో శైలాజా రెడ్డి అల్లుడు సినిమాతో మాస్ ఇమేజ్ దక్కించుకోవాలనుకున్నాడు. ఆ మూవీ కూడా చైతూకి లక్కు ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య ‘కస్టడీ’ అనే మాస్ యాక్షన్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య లుక్ డిపరెంట్ గా కనిపించింది. కొలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. నాగార్జున లానే చైతన్య టోటల్ మాస్ మూవీస్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. కాస్త డిఫరెంట్ స్టోరీకి మాస్‌ను జోడిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న కస్టడీ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. ఆ సినిమా పై నాగచైతన్య ఆశలు భారీగానే పెట్టుకున్నాడు. కోలీవుడ్ లో వెంకట్ ప్రభు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక మాస్ సినిమాలు తీయటంలో వెంకట్ ప్రభుకి వోన్ స్టైల్ ఒకటుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి కస్టడీ తో మాస్ హిట్ దక్కుతుందనే నమ్మకం పెట్టుకున్నారు. -
‘గాయపడిన మనసు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది..’ చై కస్టడి టీజర్ అవుట్
యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో నటుడు అరవింద్ స్వామి కీల పాత్ర పోషిస్తున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్ మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కస్టడీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ తాజాగా చిత్రం బృందం మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో చై డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది..’ అంటూ చై సీరియస్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు. సమ్మర్ కానుకగా మే 12న తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
నాగచైతన్య 'కస్టడీ' టీజర్ డేట్ ఫిక్స్..
యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. అతనికి జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. బంగార్రాజు తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రంపై మరింత క్యూరియాసిటీని పెంచుతూ మరో క్రేజీ అప్డేట్ను వదిలారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈనెల సాయంత్రం 4.51 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను వదిలారు. కాగా సినిమా మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రాధికా శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిశోర్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
కస్టడీ కంప్లీట్
నాగచైతన్య ‘కస్టడీ’ పూర్తయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ రోల్ చేస్తుండగా, ప్రియమణి, సంపత్ రాజ్, శరత్‌కుమార్ కీ రోల్స్ చేశారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘చైతూ... మా ‘కస్టడీ’ నుంచి ఇక నీకు విడుదల’’ అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు. ‘‘మే 12న మీ అందరినీ (ప్రేక్షకులు) కస్టడీలోకి తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు నాగచైతన్య, కృతీశెట్టి. ‘‘నాగచైతన్య కెరీర్‌లోని అత్యంత భారీ బడ్జెట్ మూవీస్‌లో ‘కస్టడీ’ ఒకటి. ఇళయ రాజా, యువన్‌శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
కృతీశెట్టితో స్టెప్పులేస్తున్న నాగచైతన్య
ఏడు సెట్లలో హీరో నాగచైతన్య, హీరోయిన్ కృతీ శెట్టి ఆడిపాడుతున్నారు. ఎందుకంటే ‘కస్టడీ’ చిత్రం కోసం. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కస్టడీ’. పవన్ కుమార్ సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో నాగచైతన్య, కృతీపై ఒక పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్, ఆర్ట్ డైరెక్టర్ డీవై సత్యనారాయణ ఏడు సెట్స్‌ని రూపొం దించారు. ‘‘ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న చిత్రం ‘కస్టడీ’. ఇందులోని ఓ పాటని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నాం. ఈ పాట కోసమే ఏడు సెట్లు వేయించాం. ఈ పాట కనువిందుగా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా మే 12న ‘కస్టడీ’ రిలీజ్ కానుంది. -
Custody: ‘కస్టడీ’లో అక్కినేని నాగచైతన్య!
నాగచైతన్య హీరోగా తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చై కెరీర్లో ఇది 22వ సినిమా. నేడు(నవంబర్23) నాగచైతన్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ మూవీకి ‘కస్టడీ’ అని టైటిల్ ఖరారు చేశారు. ఇందులో నాగచైతన్య పోలీసు పాత్రలో నటిస్తున్నట్లు పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే తోలి అధికారులే ఆయన్ను కదలకుండా ఎందుకు బంధించారనేది సస్పెన్స్‌గా పెట్టారు మేకర్స్. 'ప్రపంచంలో మార్పు రావాలంటే... ముందుగా నువ్వు మారాలి' అనే కొటేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రియమణి, శరత్ కుమార్, అరవిందస్వామి, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, సంపత్ రామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. -
అరవింద్ స్వామితో ఫైట్‌కు సిద్ధమైన నాగచైతన్య
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కృతీశెట్టి హీరోయిన్. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ఆరంభం అయింది. ఓ భారీ సెట్లో నాగచైతన్య, అరవింద్ స్వామిలపై యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ మహేశ్ మాథ్యూ డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్లో కృతీశెట్టి, శరత్‌కుమార్, సంపత్ రాజ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాకు తండ్రీకొడుకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరకర్తలు. -
వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. NC22 అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నటీనటులను పరిచయం చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈచిత్రంలో లెజెండరి నటుడు శరత్ కుమార్, నటి ప్రియమణి, కమెడియన్ వెన్నెల కిషో, సంపత్ రాజా వంటి స్టార్ నటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి తాజాగా ఇందులో బుల్లితెర క్వీన్, నటి ప్రేమి విశ్వనాథ్(కార్తిక దీపం సీరియల్ ఫేం దీప) కూడా నటిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఓ కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమి విశ్వనాథ్‌కు సెట్లోకి స్వాగతం పలుకుతూ తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ఈ మేరకు వెల్కమ్ ఆన్‌బోర్డ్ అంటూ ప్రేమి విశ్వనాథ్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. Welcoming the Television Queen and Versatile Actress #PremiVishwanath on board for our #NC22 💫🔥@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens @srkathiir @rajeevan69 @abburiravi #VP11 pic.twitter.com/FrsJSeAHQQ — Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022 -
చైతూ22 కోసం కీలక పాత్రలో కనిపించనున్న ఆ హీరోయిన్
నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. NC22 అనే వర్కింగ్ టైటిల్‌తో ‘మానాడు’ ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రియమణి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. కాగా మరోవైపు చై నటించిన ధూత వెబ్‌సిరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. Team #NC22 is privileged to welcome the National Award Winning Actress and a terrific performer #Priyamani On Board ❤️🔥💫@chay_akkineni @vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @srkathiir @SS_Screens #VP11 pic.twitter.com/dGULxsU79G — Srinivasaa Silver Screen (@SS_Screens) October 14, 2022 -
వివాదంలో నాగచైతన్య మూవీ! చిత్ర బృందంపై గ్రామస్తుల దాడి?
అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్సీ 22 (#NC22)గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దేవాలయం ముందు బార్ సెట్ వేయడంతో గ్రామస్తులు మూవీ యూనిట్‌పై దాడి చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వివరాలు.. నాగచైతన్య, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చదవండి: నయన్‌ను టార్గెట్ చేసిన నటి, నెట్టింట దూమారం రేపుతున్న ట్వీట్ ఇటీవలె సెట్‌పైకి వచ్చిన ఈ మూవీ కర్ణాటకలో మాండ్య జిల్లా మేల్కొటీ గ్రామంలో షూటింగ్‌ను జరుపుకుంటోంది. అదే గ్రామంలోని రాయగోపుర దేవాలయం సమీపంలో ఈ మూవీ షూటింగ్ సెట్‌ను ఏర్పాటు చేసి పలు కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయం ముందు బార్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇక అది తెలిసి గ్రామస్తులు తీవ్ర మండిపాటుకు గురయ్యారట. దేవాలయం ముందే బార్ సెట్ వేయడంపై వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని, నిత్యం పూజలు జరిగే పవిత్ర దేవాలయం ముందు బార్ సెటప్‌లు వేసి అపవిత్రం చేశారంటూ గ్రామస్తులు చిత్ర బృందపై దాడి చేసినట్లు సమాచారం. ఆ సమయంలో హీరో నాగచైతన్య కూడా సెట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందన అంతేకాదు ఈ మూవీ యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని ఆ ఊరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారట. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హీరో నాగచైతన్య, దర్శక-నిర్మాతలకు జరిమాన విధించినట్లు కూడా తెలుస్తోంది. కాగా ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం మాండ్య జిల్లా డీసీ అశ్విని అనుమతి కోరగా.. రెండు రోజుల షూటింగ్‌కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారట. కానీ దానిని చిత్ర బృందం అతిక్రమించిందని, రెండు రోజులు దాటిన షూటింగ్ కొనసాగించారని తెలుస్తోంది. ఈ షూటింగ్లో బార్ సీన్ ఉన్నట్లు ముందుగా సమాచారం ఇవ్వలేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. -
దళపతి విజయ్, అజిత్‌లతో మల్టీస్టారర్ తీస్తా : మానాడు డైరెక్టర్
లఘు చిత్రాల పోటీల్లో గెలుపొందిన వారికి చెన్నైలోని ఓ హోటల్లో ఆదివారం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. జ్యూరి సభ్యులుగా దర్శకుడు వసంత్, శింబుదేవన్, వెంకట్‌ప్రభు తదితరులు వ్యవహరించారు. గెలుపొందిన వారికి అవార్డులు, ధ్రువపత్రాలను ప్రదానం చేశారు. దర్శకుడు వెంకట్‌ప్రభు మాట్లాడుతూ.. వేదికపై ఉన్న వారందరూ చప్పట్లు అందుకోవాలన్నదే తన ఆశ అన్నారు. తనకు తెలుగు భాష రాకపోయినా చిత్రం చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ చిత్రంలో పలువురు తమిళ నటీనటులు నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించడంతో పలు అనుభవాలను పొందుతున్నట్లు పేర్కొన్నారు. సినిమాకు భాష ముఖ్యం కాదన్న దానికి దర్శకుడు ఏఆర్.మురుగదాస్, ప్రభుదేవా ఉదాహరణ అని అన్నా రు. వాళ్లకి హిందీ తెలియకపోయినా బాలీవుడ్లో చిత్రాలు చేసి విజయం సాధించారన్నారు. అదే విధంగా ఆంగ్ల భాష సరిగ్గా తెలియకపోయినా బాలీవుడ్ వరకూ వెళుతున్నారన్నారు. కాబట్టి సినిమాకు భాష ఆటంకం కాదన్నారు. ఇకపోతే షార్ట్ ఫిలింస్ చేయడం చాలా కష్టం అని పేర్కొన్నారు. తనలాంటి వారికీ షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించడం కష్టమేనన్నారు. ఎందుకంటే చెప్పదలచుకున్న విషయాన్ని షార్ట్ ఫిలిం ద్వారా 3 నిమిషాల్లో చెప్పాల్సి ఉంటుందన్నారు. విజయ్, అజిత్ అంగీకరిస్తే వారితో మల్టీస్టారర్ చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మానాడు చిత్రంలో శింబును సాధారణంగా చూపించానన్నారు. అదే విధంగా వెందు తనిందదు కాడు చిత్రంలో దర్శకుడు గౌతమ్ మీనన్ శింబును మంచి పాత్రలో చూపించారని అన్నారు. ఆ చిత్రాన్ని చూసి తాను శింబును అభినందించానని చెప్పారు. అప్పుడాయన మనం మళ్లీ ఎప్పుడు కలిసి పని చేస్తున్నాం అని అడిగారనీ, అందుకు తాను సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేద్దామని చెప్పానన్నారు. -
నాగచైతన్య, కృతి శెట్టి కాంబినేషన్లో కొత్త చిత్రం.. పేరేంటో తెలుసా..!
అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా తదుపరి చిత్రం అప్డేట్ వచ్చేసింది. నాగచైతన్య తన 22వ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభుతో చేయనున్నారు. ఈ సినిమాను రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రానికి తాత్కాలికంగా 'NC22' అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. నాగచైతన్య కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్ చేస్తూ ‘షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది’ అంటూ చిత్రబృందాన్ని ట్యాగ్ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వనున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. మేకర్స్ నాగ చైతన్య అద్భుతమైన పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ పోస్టర్లో నాగచైతన్య లుక్ రివీల్ చేయలేదు చిత్రబృందం. దీంతో అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఆమిర్‌ఖాన్‌తో కలిసి అక్కినేని నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. #NC22 shoot begins tomorrow #NC22ActionBegins@vp_offl @IamKrithiShetty @ilaiyaraaja @thisisysr @SS_Screens @srinivasaaoffl #VP11 pic.twitter.com/nrrnZ5qyb5 — chaitanya akkineni (@chay_akkineni) September 20, 2022 -
నాగచైతన్య సినిమాపై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ధూత అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న చై ఆ సినిమా కంప్లీట్ కాకుండగానే నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించాడు. మానాడు చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చై కెరీర్లోనే ఇది 22వ సినిమా. తాజాగా ఈ సినిమాపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. రేపు(బుధవారం)ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్గా నటించనుంది. 'బంగార్రాజు' తర్వాత మరోసారి ఈ జోడీ రిపీట్ కానుండటంతో ఆసక్తి నెలకొంది. With all ur love and blessings beginning my next #VP11 tomorrow with @chay_akkineni #NC22 @SS_Screens YES the shoot begins tomorrow @ilaiyaraaja @thisisysr pic.twitter.com/0ugXmSgDRD — venkat prabhu (@vp_offl) September 20, 2022 -
ఓటీటీలో రిలీజ్ కానున్న అమలాపాల్ విక్టిమ్
వినూత్న ప్రయోగాత్మక చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చిన తరువాత నిర్మాతలకు మరింత లిబర్టీ లభిస్తుందనే చెప్పాలి. దర్శకుల భావాలను స్వేచ్ఛగా ఆవిష్కరించే అవకాశం లభిస్తోంది. ఆ విధంగా రూపొందుతున్న వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఒక సరికొత్త ప్రయోగమే విక్టిమ్ వెబ్ సిరీస్. నాలుగు ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ ఆంథాలజీ సిరీస్‌ను నలుగురు ప్రముఖ దర్శకులు రూపొందించడం విశేషం. ఒకే కాన్పెప్ట్‌ను నలుగురు దర్శకులు కలిసి తెరకెక్కించారు. దర్శకుడు వెంకట్ ప్రభు కన్ఫెషన్ పేరుతోనూ, పా.రంజిత్ దమ్మమ్ పేరుతోనూ, శింబుదేవన్ మొట్టై మాడి సిద్ధర్ పేరుతోనూ, ఎం.రాజేష్ విరాజ్ పేరుతోనూ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఫైనల్‌గా విక్టిమ్ పేరుతో రిలీజవుతోంది. ఆగస్టు 5వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకులు వెంకట్ ప్రభు, పా.రంజిత్, సింబుదేవన్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ముందుగా దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో ఏదైనా ఒక కొత్త ప్రయోగం చేయాలన్న ఆలోచన కలిగిందన్నారు. దానికి రూపమే ఈ వెబ్ సిరీస్ అని తెలిపారు. దర్శకులు అందరం మాట్లాడుకుని ఒకే కాన్సెప్ట్ తమ ఆలోచనల మేరకు రూపొందించాలని అనుకున్నామన్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా సాగే సిరీస్ అని, ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీల్ అవుతారని పేర్కొన్నారు. పా.రంజిత్ మాట్లాడుతూ ఈ కాన్సెప్ట్ గురించి తనకు చెప్పగానే తాను నిజ జీవితంలో చూసిన సంఘటనకు దగ్గరగా ఉందని భావించానన్నారు. తాను రూపొందించిన దమ్మమ్ ప్లాట్ తనను నిజజీవితంలో ఇన్స్పైర్ చేసిన సంఘటన అని తెలిపారు. కాగా ఇందులో నటుడు ప్రసన్న, ప్రియా భవాని శంకర్, అమలాపాల్, నట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే! వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు! -
నాగ చైతన్య ద్విభాషా చిత్ర షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
-
మరో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ, ఏకంగా 4 సినిమాలు!
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్‌తో పాటు కొంత లక్ కూడా ఉండాలి. ఈ రెండూ తోడైతే మాత్రం వారిని ఆపడం ఎవరితరమూ కాదు. ప్రస్తుతం కృతీశెట్టికి గోల్డెన్ టైం నడుస్తోంది. తొలి చిత్రం ఉప్పెనతోనే హిట్ అందుకున్న ఈ సొట్టబుగ్గల సుందరికి వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె రామ్‌తో 'ది వారియర్', సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్‌తో 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమెను మరో బంపర్ ఆఫర్ వరించింది. నాగచైతన్య 22వ సినిమాలో కథానాయికగా నటించనుంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమాలో కృతీ శెట్టిని ఎంపిక చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. పోలీస్ స్టేషన్లో ఉండే ఫైల్స్ తరహాలో కృతీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. Welcome aboard The most happening @IamKrithiShetty Next Announcement Will Enthrall You Today at 11:08 AM 💥#NC22Begins ❤️🔥#NC22 @chay_akkineni @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/2tp5rZgIm4 — venkat prabhu (@vp_offl) June 23, 2022 చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! డైరెక్టర్ లింగుస్వామికి రామ్ క్షమాపణలు, ఏం జరిగిందంటే -
అజిత్-విజయ్‌తో మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Venkat Prabhu Says Ajith Vijay Multi Starer Movie: తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్‌కు ఇద్దరికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు తమిళనాట కాకుండా తెలుగులో కూడా వీరికి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడతాయి. అలాంటిది వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో నటిస్తే. విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ పడితే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అయితే వీరిద్దరితో కలిసి సినిమా తీయాలనుందని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు వెల్లడించారు. ఇటీవల శింబు హీరోగా మానాడు సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్యతో వెంకట్ ప్రభు ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చెన్నైలోని ఓ కాలేజ్ ఫంక్షన్లో అజిత్, విజయ్ ఇద్దరితో కలిపి మూవీ తెరకెక్కించాలని, అందుకు సరిపడా కథ సిద్ధంగా కూడా ఉందని తన మనసులోని మాట బయటపెట్టాడు వెంకట్ ప్రభు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో ఒకరకమైన ఉత్సుకత ఏర్పడింది. మరీ ఈ సినిమాకు అజిత్, విజయ్ ఒప్పుకుని పట్టాలెక్కుద్దో వేచి చూడాలి. చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో చూడండి.. ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ #Ajithkumar Vs #ThalapathyVijay in #Mankatha2 Official Announcement 🔜💥@vp_offl Sir ❤#Beast #HBDAjithkumar #Ak61 pic.twitter.com/JWqdBPgy4U — indian Box office (@indianBoxofflce) April 30, 2022 -
తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్న పర భాష డైరెక్టర్లు వీళ్లే..
ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు సినిమా కాదు. మరి ఏంటీ అంటే.. ‘పాన్ ఇండియా సినిమా’ అయిపోయింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి. ఇతర భాషల దర్శకుల చూపు కూడా మన హీరోలపై పడింది. తమిళం, కన్నడ, హిందీ భాషల దర్శకులు తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వణక్కమ్, నమస్కార, నమస్కార్ అంటూ మన హీరోలకు వాళ్ల భాషల్లో ‘నమస్కారం’ చెబుతున్నారు. ఇక ఆ డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా రేంజ్ కావడం విశేషం. హిందీ దర్శకులు ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపగా దర్శకుడు ఓం రౌత్‌కి ముందుగా అవకాశం ఇచ్చారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అలాగే హిందీ చిత్రం ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కన్నడ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’తో పర భాషల్లో కూడా స్టార్‌డమ్‌ను పెంచుకున్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సినిమా చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే ఇతర ఇండస్ట్రీ దర్శకులు ఆసక్తి చూపారు. ఆల్రెడీ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా కన్ఫార్మ్ అయింది. దర్శకుడు కొరటాల శివతో చేయనున్న సినిమాను పూర్తి చేశాక ప్రశాంత్ నీల్ కథలోకి వెళ్తారు ఎన్టీఆర్. సేమ్ ఎన్టీఆర్లానే రామ్‌చరణ్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాక ముందే తమిళ దర్శకుడు శంకర్‌తో ఓ సినిమా కమిటయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్‌తో కూడా రామ్‌చరణ్ కథా చర్చలు జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఓ ప్రముఖ ముంబై నిర్మాణ సంస్థ రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇటు నాగచైతన్య, రామ్ తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్య కోలీవుడ్‌లో ‘మానాడు’తో హిట్ సాధించిన దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తారు. ఇక ‘పందెంకోడి’తో హిట్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల్లో పేరు సంపాదించిన లింగుసామి ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా సినిమా చేస్తున్నారు. ‘ది వారియర్’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ హీరో. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. ఇంకా దర్శకుడు శ్రీ కార్తీక్‌తో హీరో శర్వానంద్ చేసిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైఖేల్’ చేస్తున్నారు. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో.. మరికొన్ని కాంబినేషన్స్ సెట్ కావొచ్చు. కుదిరితే... వార్తల్లో ఉన్న ప్రకారం మరికొందరు తెలుగు హీరోలు కూడా వేరే భాషల దర్శక-నిర్మాతలతో సినిమాలు చేసే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఆ చిత్రాలు కూడా పట్టాలెక్కుతాయి. నటుడు, దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్న సినిమాలో పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు నటిస్తారని, హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు హరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ‘తగ్గేదే లే’ అంటూ.. ‘పుష్ప: ది రైజ్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లోనూ సత్తా చాటిన అల్లు అర్జున్ ఇటీవల హిందీ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలిశారు. బాలీవుడ్లో బన్నీ చేయనున్న స్ట్రయిట్ సినిమా కోసమే ఈ మీటింగ్ అనే టాక్ వినిపిస్తోంది. అలాగే యంగ్ హీరోలు అఖిల్, విజయ్ దేవరకొండతో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేశారట. కీలక పాత్రల్లో... తెలుగు హీరోలను కీలక పాత్రలకు కూడా తీసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకులు. రణ్‌బీర్ కపూర్ హీరోగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నాగార్జున ఓ లీడ్ రోల్ చేశారు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో వెంకటేశ్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సామ్జీ దర్శకుడు అని టాక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీలక పాత్ర చేశారు. అలాగే అభిషేక్ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ‘రామసేతు’లో సత్యదేవ్ ఓ ముఖ్య పాత్ర చేశారు. -
NC22: దూసుకెళ్తున్న చైతూ.. తమిళ దర్శకుడితో మరో చిత్రం
యంగ్ హీరో నాగచైతన్య కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. వెంకీమామ, లవ్‌స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకున్న చైతూ.. ‘థ్యాంక్యూ’ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు హిందీలోకి ఎంట్రీ ఇస్తూ అమీర్ ఖాన్‌తో `లాల్ సింగ్ చద్దా` చిత్రంలో నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బీజీగా ఉంటూనే..మరోవైపు ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం దూత పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న చైతూ.. తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించి అక్కినేని ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచాడు. తొలిసారి ఆయన ద్విభాషా చిత్రం(తెలుగు, తమిళం)చేసేందుకు రెడీ అయ్యారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పై పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇది నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రం కావడం విశేషం. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలోఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. Thank q so much saar ❤️ https://t.co/d07LhbmmgJ — venkat prabhu (@vp_offl) April 6, 2022 -
ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటా: శింబు
సాక్షి, చెన్నై(తమిళనాడు): నటుడు శింబు మానాడు చిత్ర ఆడియో వేదికలో కంటతడి పెట్టారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణి ప్రియదర్శన్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి.హౌస్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మించారు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ నెల 25న తమిళం, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. శింబు మాట్లాడుతూ ఎన్ని సమస్యలనైనా ఎదుర్కొంటానని, అభిమానులు మాత్రం తన వెంటే ఉండాలని విజ్ఞప్తి చేశారు. -
శింబు సినిమాలో విలన్‌గా సుదీప్
ఇటివలే విడుదలైన సల్మాన్‌ఖాన్ దబాంగ్-3 సినిమాలో కన్నడ హీరో సుదీప్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సుదీప్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే సుదీప్ మరోసారి విలన్‌గా నటించనున్నాడు. కాకపోతే ఈసారి తమిళ్ సినిమాలో ఆ పాత్రను చేయనున్నాడు. వివరాల్లోకి వెళితే.. శింబు హీరోగా 'మానాడు' అనే సినిమా చేస్తున్నట్లు 2018లోనే వెంకట్ ప్రభు వెల్లడించారు. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న సురేశ్ కామట్జి, శింబుల మధ్య మనస్పర్థలు రావడంతో నిర్మాణ దశలోనే ఈ చిత్రం ఆగిపోయింది. శింబు తండ్రి, సినీ దర్శకుడు టి. రాజేందర్ జోక్యంతో ' మానాడు' సినిమాను చేస్తున్నట్లు వెంకట్ ప్రభు వెల్లడించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభిస్తున్నట్లు నిర్మాత సురేశ్ కామట్జి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్‌గా నటించాలని దబంగ్-3 షూటింగ్ సమయంలోనే సుదీప్‌ను అడిగామని ప్రొడ్యూసర్ సురేశ్ కామట్జి తెలిపారు. స్టోరీ విన్న సుదీప్ వెంటనే ఈ సినిమాలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. పొలిటికల్ బాక్డ్రాఫ్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మిగతా పాత్రలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది. కాగా సుదీప్ గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమాలో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. -
వెబ్ ఎంట్రీ?
చాలెంజ్‌లకు, కొత్త కొత్త విషయాలకు నేనెప్పుడూ సిద్ధం అంటారు కాజల్ అగర్వాల్. ఇప్పుడు అలాంటి కొత్త ప్రయాణాన్నే ప్రారంభించనున్నారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే ప్రేక్షకుడికి వినోదం పంచడానికి సినిమా స్టార్స్ కొత్తకొత్త ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెబ్ వరల్డ్‌లోకి ప్రవేశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా ఈ వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.. తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు హాట్‌స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లోనే కాజల్ నటించనున్నారట. పది ఎపిసోడ్స్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్ షూటింగ్‌ను ఆగస్ట్‌లో ఆరంభించి సెప్టెంబర్‌కు ముగిస్తారట. కాజల్ నటించిన ‘రణరంగం, కోమలి’ సినిమాలు ఆగస్ట్ 15న రిలీజ్ కానున్నాయి. -
‘మానాడు’కు సిద్ధమవుతున్న శింబు
నటుడు శింబు మానాడు చిత్రానికి రెడీ అవుతున్నారు. చాలా గ్యాప్ తరువాత మణిరత్నం చిత్రం సెక్క సివంద వానం సక్సెస్‌తో ఖుషీగా ఉన్న శింబును ఆ తరువాత సుందర్.సీ దర్శకత్వంలో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం నిరాశ పరిచింది. కాగా అప్పటికే వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు చిత్రంలో నటించనున్నట్లు ప్రకటను వెలువడింది. అయితే ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం హోరెత్తింది. దీంతో చిత్ర నిర్మాత సురేశ్ కామాక్షి మానాడు ఆగిపోలేదని, రూపొందుతుందని స్పష్టం చేశారు. సినిమా ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో అసలు మానాడు చిత్రం ఉంటుందా? అనే అనుమానాలు కోలీవుడ్‌లో వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే సినిమా సెట్‌కు వెళ్లనుందనే సమాచారం తెలిసింది. ప్రస్తుతం శింబు నటి హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న 50వ చిత్రం మహాలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. వాలు చిత్ర షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ శింబు, హన్సిక ఆ తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఈ జంట ఇప్పుడు మహా చిత్రంలో కలిసి నటించడం విశేషం. ప్రస్తుతం మహా చిత్ర షూటింగ్ జరుగుతోంది. శింబు, హన్సికల ప్రేమ సన్నివేశాలను దర్శకుడు జమీల్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో శింబు పైలెట్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ నెలాఖరున మానాడు చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో శింబుకు జంటగా నటి కల్యాణి ప్రియదర్శన్ నటించనున్నారు. కాగా మరో ప్రధాన పాత్రలో సీనియర్ దర్శకుడు భారతీరాజా నటించనున్నారు. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
శింబు శిక్షణ
తమిళ యంగ్ హీరో శింబుకు ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఈ హిట్‌తో శింబు వరుసగా కొత్త సినిమాలు సైన్ చేస్తున్నారు. సుందర్ సి. తో ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో నటిస్తున్నారు. తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు. అందులో పాత్రకు సంబంధించి శింబు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోనున్నారట. అందుకోసం బ్యాంకాక్‌లో దాదాపు నెలరోజులు గడపనున్నారట. మార్షల్ ఆర్ట్స్ బేసిక్స్ అన్నీ నేర్చుకుంటారని కోలీవుడ్ టాక్. ‘మానాడు’ చిత్రం మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
తర్వాత ఏంటి?
‘మహానటి’ సూపర్ సక్సెస్ తర్వాత ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు కీర్తీ సురేశ్. తమిళంలో విక్రమ్‌తో చేస్తున్న ‘సామి స్క్వేర్’, విశాల్‌తో చేస్తున్న ‘సండై కోళి 2’ (పందెం కోడి 2).. ఈ రెండూ కూడా ‘మహానటి’కి ముందు కమిట్ అయిన సినిమాలే. ఈ రెండు సినిమాల తర్వాత ఏంటి? అంటే.. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త ప్రకారం శింబుతో దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేశ్ పేరును పరిశీలిస్తున్నారట. ఈ చిత్రానికి ‘అదిరడి’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఒకవైపు చెన్నై ఫిల్మ్‌నగర్‌లో టైటిల్, హీరోయిన్ గురించి జోరుగా వార్తలు షికారు చేస్తుంటే, దర్శకుడు వెంకట్ ప్రభు మాత్రం ‘‘టైటిల్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. టైటిల్ మాత్రం ‘అదిరడి’ కాదు. కొత్త టైటిల్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది’’ అని పేర్కొన్నారు. -
నెక్ట్స్ ఫిక్స్
తమిళ హీరో శింబు మరో చిత్రానికి సై అన్నారు. రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘చెక్కా చివందా వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారు. ‘‘నా నెక్ట్స్ మూవీలో శింబు హీరోగా నటించబోతున్నాడు అని చెప్పడానికి ఆనందంగా ఉంది. సురేశ్ నిర్మించనున్నారు. సీక్వెల్ కాదు. కొత్త స్క్రిప్ట్. మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తా. సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది’’ అని దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. సో.. శింబు నెక్ట్స్ సినిమా ఫిక్స్ అన్నమాట. -
ఆ డైరెక్టర్ నన్ను మోసం చేశాడు
సాక్షి, సినిమా : సుమంత్ అశ్విన్ డెబ్యూ మూవీ తూనీగ తూనీగతో తెలుగులో నటించింది మనీషా యాదవ్. అయితే ఆ తర్వాతే ఆమె వరుసగా తమిళ చిత్రాలతో బిజీ అయిపోయింది. కానీ, కెరీర్ పీక్స్ లో ఉండగానే వివాహం చేసుకుని.. ఈమధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ, ప్రస్తుతం ఆమెకు పెద్దగా అవకాశాలు రావటం లేదు. అందుకు దర్శకుడు వెంకట్ ప్రభు కారణమని ఆమె ఆరోపిస్తోంది. విషయం ఏంటంటే.. చెన్నై 600028(తెలుగులో కొడితే కొట్టాలిరా) చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చెన్నై 600028-2 లో మనీషా యాదవ్ ‘సొప్పన సుందరి’ అనే ఓ పాత్రలో మెరిసింది. అంతేకాదు ఐటెం సాంగ్‌తో కూడా చిందులేసింది. అయితే అది మరీ దారుణంగా ఉండటంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఆమె చేసిన పాత్రను(డబుల్ మీనింగ్ డైలాగులకు) ప్రేక్షకులు చీదరించుకున్నారు. దీంతో మొత్తానికి ఆమె కెరీర్ మసకబారిపోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అది ఐటెం సాంగ్ కాదని.. సినిమాకు ఎంతో కీలకంగా మారుతుందని దర్శకుడు వెంకట్ ప్రభు నాతో చెప్పాడు. కానీ, నా పాత్రను చాలా దారుణంగా చిత్రీకరించారు. నేను ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నా. కానీ, ఆయన వమ్ము చేశారు. ఇకపై కొత్త చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కాగా, సరోజా, గోవా, గాంబ్లర్, రాక్షసుడు చిత్రాలతో వెంకట్ ప్రభు తెలుగువారికి కూడా సుపరిచితుడే. -
వెంకట్‌ప్రభు పార్టీ మొదలైంది
తమిళసినిమా: కొందరు దర్శకుల చిత్రాలకే ప్రత్యేక బ్రాండ్ ఉంటుంది. అలాంటి వారిలో దర్శకుడు వెంకట్‌ప్రభు ఒకరు. ఆయన చిత్రాల్లో చాలా మంది హీరోలుంటారు. అయినా అవి వెంకట్‌ప్రభు చిత్రాలుగానే గుర్తింపబడతాయి. చెన్నై 28 రెండు భాగాలు, సరోజ, గోవా లాంటివన్నీ ఆ తరహా చిత్రాలే. తాజాగా వెంకట్‌ప్రభు పార్టీకి రెడీ అయ్యారు. అవును ఆయన తాజా చిత్రం పేరు పార్టీ. ఇంతకు ముందు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో అమ్మా క్రియేషన్స్ పతాకంపై సరోజా వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన టి.శివ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే చేస్తున్న చిత్రం పార్టీ. వెంకట్‌ప్రభు గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ ఒక నక్షత్ర బృందమే నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, జై, శివ, కయల్ చంద్రన్, రమ్యకృష్ణ, నివేదా పేతురాజ్, రెజీనా, సంచి తాశెట్టి ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చి త్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు. తన సోదరుడైన వెంకట్‌ప్రభు చిత్రానికి ఈయన తొలిసారిగా సంగీతాన్ని అందిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. రాజేశ్ మాధవ్ ఛాయాగ్రహణం నెరుపుతున్న ఈ చిత్ర మేజర్ పార్టీ షూటింగ్‌ను ఫిజీ దీవుల్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలో జరిగింది. -
శిష్యుడి కోసం సినిమా
శిష్యుల కోసం నిర్మాతలుగా మారుతున్న దర్శకులు కోలీవుడ్‌లోనే అధికం అని చెప్పవచ్చు. శంకర్, ఏఆర్.మురుగదాస్, గౌతమ్‌మీనన్ ఇలా చాలామంది తమ శిష్యులకు దర్శకులుగా అవకాశం కల్పించడానికి నిర్మాతలయ్యారు. తాజాగా ఈ కోవలోకి దర్శకుడు వెంకట్‌ప్రభు చేరారు. చెన్నై 28, బిరియాని, మాస్, చెన్నై 28–2 ఇలా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఈ మధ్య బ్లాక్ టికెట్ కంపెనీ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి స్వీయ దర్శకత్వంలో చెన్నై 28–2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత మరే చిత్రం ఆయన చేయలేదు. తాజాగా నిర్మాతగా తన శిష్యుడు సవరన్రాజ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఒక చిత్రం నిర్మించడానికి రెడీ అయ్యారు. దీనికి తన సోదరుడు ప్రేమ్‌జీని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇక హీరోహీరోయిన్లుగా వైభవ్, సనాలను ఎంపిక చేశారు. విలన్‌గా నటుడు సంపత్ నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. -
జై రాకున్నా పర్వాలేదు
నాకు జై అవసరం లేదు ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు అని అన్నారు ప్రముఖ దర్శకుడు వెంకట్‌ప్రభు. చెన్నై-28 తో దర్శకుడిగా పయనం ఆరంరాకునభించిన ఈయన కేరీర్ దశాబ్దానికి చేరుకుంది. తొలి చిత్రంతోనే అందరూ కొత్తవారితో సంచలన విజయాన్ని సాధించిన వెంకట్‌ప్రభు తాజాగా తన తొలి చిత్రం చెన్నై-28కు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో నటించిన వారందరూ ఈ చిత్రంలో నటించడం ఒక విశేషం అయితే అదనంగా వైభవ్, నిర్మాత టి.శివ, ఐశ్వర్య, సుబ్బు పంజు మరి కొందరు నటించారు. యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని రెండు పాటలను డూపాడూ డాట్‌కామ్ ద్వారా బుధవారం విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన విలేక ర్ల సమావేశంలో ఒక జై మినహా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌కు యూనిట్ సభ్యులందరూ విధిగా పాల్గొనాలని నిర్మాత టి.శివ అన్నారు. నటుడు అజిత్ తనకంటూ ఒక పాలసీని పెట్టుకున్నారని, ఆయన స్థాయికి వచ్చిన తరువాత ఇతర నటులు కూడా అలాంటి పాలసీని పెట్టుకోవచ్చునని అన్నారు. నటుడు జైని ఉద్దేశించా మీ వ్యాఖ్యలు అన్న విలేకరుల ప్రశ్నకు అవునని ఆయన బదులిచ్చారు. చిత్ర దర్శకుడు వెంకట్‌ప్రభు కల్పించుకుని తనకు జయ్ రాకపోయినా పర్వాలేదు ఇక్కడ చాలా మంది హీరోలు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రాన్ని బ్లాక్ టికెట్ పతాకంపై వెంకట్‌ప్రభునే నిర్మించడం విశేషం. చెన్నై-28 చిత్రం 20-20 మ్యాచ్ అంత స్పీడ్‌గా ఉంటే దానికి సీక్వెల్ అయిన ఈ చిత్రం అంతకంటే వేగంగా 15-15 మ్యాచ్ మాదిరి ఉంటుందని అన్నారు. ఈ చిత్ర ఆడియోనూ డూపాడూ సంస్థ విడుదల చేస్తోందని తెలిపారు. ఈ సంస్థ ఒక కొత్త ఫార్ములాను ప్రవేశపెడుతోందని, పాటలను విన్న శ్రోతలకు, సంగీతదర్శకుడికి,నిర్మాతకు డబ్బులు వస్తాయని చెబుతోందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను 22 రోజుల్లో 44 కాల్షీట్స్లో శరవేగంగా పూర్తి చేసినట్లు అందుకు యూనిట్ వర్గాల సహకారమే కారణం అని చెప్పారు. నవంబర్ 10న చెన్నై 28ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత వెంకట్‌ప్రభు వెల్లడించారు. -
క్లైమాక్స్ షూటింగుకు ఐదుగురు డైరెక్టర్లు!
చెన్నై ఒక్క సినిమాకు ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు.. సాధారణంగా అయితే ఒక్కరే కదా. కానీ తమిళంలో క్రికెట్ ప్రధానాంశంగా వస్తున్న 'చెన్నై 600028' సీక్వెల్ సినిమా క్లైమాక్స్‌కు మాత్రం ఏకంగా ఐదుగురు దర్శకత్వం వహిస్తున్నారట. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా... 2007లో ఇదే దర్శకుడు తీసిన సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటి సినిమా క్లైమాక్స్‌కు దర్శకత్వం వహిస్తున్న ఐదుగురు కూడా ఒకప్పుడు వెంకట్ ప్రభు దగ్గర అసిస్టెంట్లుగా చేసినవాళ్లే. సినిమా ఇతివృత్తం మొత్తం స్నేహం గురించే ఉంటుందని, చివరకు ఈ మైత్రీబంధం సినిమా క్లైమాక్స్ తీసే విషయంలో కూడా బాగా కనిపిస్తోందని సినిమా వర్గాలు అంటున్నాయి. వెంకటేష్ రామకృష్ణన్, శరవణ రాజన్, శ్రీ పతి, చంద్రు, నాగేంద్రన్ ఆర్.. ఈ ఐదుగురూ కలిసి క్లైమాక్స్ తీస్తారట. జై హీరోగా చేస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. -
నయన తారతో మళ్లీ మళ్లీ
శింబు, నయనతారలది హిట్ జంటే కాదు సంచలన జంట కూడా. ఈ మాజీ ప్రేమికుల గురించి మీడియాలో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా కథనాలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. శింబు నయనతారలు ప్రేమించుకున్నారు, విడిపోయారు, దూషించుకున్నారు. అయినా మళ్లీ కలిసి నటించారు. ఆ చిత్రం ఇదునమ్మఆళు. అనేక సమస్యలనెదుర్కొన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇటీవల తెరపైకి వచ్చింది. ఇది మంచి విజయం సాధించిందంటూ శింబు ఆదివారం తన మిత్ర బృందంతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఇందులో సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా పాల్గొనడం విశేషం. ఎందుకంటే బీప్ సాంగ్ వివాదం తరువాత శింబు, అనిరుధ్‌లు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే శింబు ఫేస్బుక్లో తన అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా మళ్లీ నటి నయనతారతో కలిసి నటిస్తారా? అన్న ఒక అభిమాని ప్రశ్నకు బదులిస్తూ ఎస్ నయనతారతో మళ్లీ మళ్లీ కలిసి నటిస్తాను అని అన్నారు. మరో విషయం ఏమిటంటే బిల్లా-3 చిత్రం చేయబోతున్నానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. దానికి బిల్లా 2018 అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు.దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు మీతో చిత్రం చేయడానికి తాను రెడీ అని అనడంతో నేను పుట్టినప్పటి నుంచి రెడీ అన్నారు శింబు. మీరు, యువన్‌శంకర్‌రాజా, నేను చిత్రం చేద్దాం అని శింబు అనడమే కాకుండా బిల్లా 2018 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమై 2018లో తెరపైకి వస్తుందనీ అనడం ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. కాగా ఇంతకు ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం బిల్లా. అదే చిత్ర రీమేక్‌లో అజిత్ నటించారు. ఆ చిత్రం విజయాన్ని సాధించింది. ఆ తరువాత అజిత్ బిల్లా-2లోనూ నటించారు. ఇప్పుడు శింబు బిల్లా-3లో నటించనున్నారన్నమాట. ప్రస్తుతం శింబు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చం యంబదు మడమయడా చిత్రంలో నటిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తి కావచ్చింది. తాజాగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అంబానవన్ అసరాదవన్ అడంగాదవన్(ఎఎఎ) అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. -
ద్విభాషా చిత్రం... పరభాష స్ఫూర్తితో!
ఆ సీన్ - ఈ సీన్ దక్షిణాది దర్శకుల్లో తనకంటూ ప్రత్యేక శైలిని కలిగిన దర్శకుల్లో ఒకరు వెంకట్ ప్రభు. స్పోర్ట్స్ కామెడీ అయిన తొలి సినిమా (చెన్నై 600028) తోనే డెరైక్టర్‌గా తన ప్రత్యేకత నిరూపించుకున్నాడు ఈ దర్శకుడు. అదే ‘సరోజ’ను రూపొందించాడు. యువన్ శంకర్‌రాజా కంపోజ్ చేసిన ఊపేసే సంగీతంతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అంతటా పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. అదే రివ్యూయర్లు ఈ సినిమాను ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందిం చారనే అంశాన్ని కూడా హైలెట్ చేశారు. అలాంటిదేమీ లేదని వెంకట్ ప్రభు చెప్పినా, తెలుగు తమిళ భాషల్లో వచ్చిన ఈ ద్విభాషా చిత్రం... ఒక పరభాషా చిత్రం ఆధారంగా రూపొందింది అన్నది వాస్తవం. 1993లో వచ్చిన హాలీ వుడ్ సినిమా ‘జడ్జిమెంట్ నైట్’ స్ఫూర్తితో ‘సరోజ’ రూపొందింది. ఈ రెండు సినిమాలకూ ఉన్న పోలికలే దీనికి సాక్ష్యం. ‘సరోజ’ సినిమాలో నలుగురు హీరోలు ఉంటారు... శివ, వైభవ్ రెడ్డి, ప్రేమ్‌జీ అమరన్, ఎస్పీ చరణ్. వీళ్లు నలుగురూ క్రికెట్ మ్యాచ్ చూడటానికి చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయలు దేరతారు. జడ్జిమెంట్ నైట్ సినిమాలోనూ నలుగురు హీరోలు. ఒక బాక్సింగ్ బౌట్‌ను తిలకించడానికి తమ నగరం నుంచి పక్కనే ఉండే మరో నగరానికి ప్రయాణం అవుతారు. గమనించదగ్గ అంశం ఏమిటంటే, రెండు సినిమాల్లోనూ హీరోలు ఒక డిఫరెంట్ కార్వాన్లోనే ప్రయాణిస్తారు. ‘సరోజ’ సినిమాలో ఎస్పీ చరణ్, వైభవ్‌రెడ్డి అన్నదమ్ములుగా నటించారు. హాలీవుడ్ సినిమాలో కూడా నలుగురు స్నేహితుల్లో ఇద్దరు అన్న దమ్ములే! ఎస్పీ చరణ్ చేసిన పాత్రకు పెళ్లై, ఒక పాప ఉంటుంది. జడ్జిమెంట్ నైట్‌లో కూడా ఆ పాత్ర నేపథ్యం అలాగే ఉంటుంది. హైవే మీద ట్రాఫిక్ స్తంభించి పోవడంతో ఈ ప్రధాన పాత్ర ధారులు ప్రయా ణిస్తున వ్యాన్... దగ్గరి దారి అంటూ రోడ్డు నుంచి టర్న్ తీసుకోవడంతోనే కథ మలుపు తిరుగుతుంది. ఇలా మలుపు తిరిగిన ప్రయాణంలో వీళ్లకు తుపాకీ కాల్పులతో గాయపడ్డ ఒక వ్యక్తి తారస పడటం రెండు సినిమాల్లోనూ జరుగు తుంది. వీళ్లు ఒక హత్యకు సాక్షులు అవుతారు. ఆ హత్య చేసిన గ్యాంగ్ వీళ్లం దరినీ చంపేయడానికి ప్రయత్నిస్తుంది. ‘సరోజ’ సినిమాలోని ఈ ఎపిసోడ్స్ అన్నింటిలో ‘జడ్జిమెంట్ నైట్’ సినిమానే కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే రెండు చిత్రాల్లోని ప్రధాన భాగమంతా రాత్రి పూటే జరుగు తుంది. కిడ్నాపింగ్ గ్యాంగ్ ఆవాసంగా మార్చుకున్న భవనంలో అనుకోకుండా చిక్కుబడతారు స్నేహితులు. ఆ భవనంలో ఉంటూ కూడా వీళ్లు ఆ గ్యాంగ్ కంటపడ కుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంతా హాలీవుడ్ సినిమాలో ఉంటుంది. దాన్నే దర్శకుడు యథా తథంగా తీసుకున్నట్టనిపిస్తుంది. ప్రాణాలు పోతాయేమో అనిపించేంత భయంకర పరిస్థితుల్లో నలుగురు స్నేహితుల మధ్య భావోద్వేగాలు, ఒకరిని రక్షించుకోవడానికి మరొకరు పడే పాట్లు... రెండు సినిమా ల్లోనూ ఒకేలా ఉంటాయి. ఈ భావోద్వే గాలను యథాతథంగా ఆవిష్కరించడంలో వె ంకట్ప్రభు విజయవంతం అయ్యాడు. అయితే మిగతా విషయాల్లో ‘జడ్జిమెంట్ నైట్’... ‘సరోజ’ కన్నా ఎన్నో మెట్లు పైన ఉంటుంది. ‘సరోజ’ సినిమాకు వెనుకా ముందు చాలా నేపథ్యాన్నే తయారు చేసు కున్నాడు దర్శకుడు. సొంతూరికి మేలు చేయ డానికి ధనికుడు అయిన తమ స్నేహితుడి కూతురినే (సరోజ) కిడ్నాప్ చేసే ఒక ముఠా, ఆ ముఠాకు సహయం చేసే పోలీసాఫీ సర్ (శ్రీహరి), అనుకో కుండా ముఠా చేతుల్లో పడి ముప్పు తిప్పలు పడి కిడ్నాప్ అయిన అమ్మా యిలను రక్షించే నలుగురు హీరోలు, వైభవ్ పాత్రకు కాజల్‌తో లవ్‌స్టోరీ... ఇలాంటి యాడింగ్స్ చేస్తూనే, అసలు కథ నేరేషన్‌కు మాత్రం ‘జడ్జిమెంట్ నైట్’ను ఆధారంగా చేసుకున్నాడు. అయితే వెంకట్‌ప్రభు మాత్రం ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఎంతమంది ఎన్ని విధాలుగా అడిగినా కాదని వాదించాడు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఇది కాపీనే అని స్పష్టమవుతుంది! - బి.జీవన్‌రెడ్డి -
'ఇళయరాజా కులాసాగా ఉన్నారు'
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని దర్శకుడు, నటుడు వెంకట్ ప్రభు తెలిపారు. ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. 'ఇళయరాజా ఆస్పత్రిలో చేరారని తెలియగానే అభిమానులు, సన్నిహితులు కంగారు పడ్డారు. ఇళయరాజా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. ఆయనిప్పుడు కులాసాగా ఉన్నారు. జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి నుంచి ఈరోజే విడుదలవుతారు' అని వెంకట్ ప్రభు సోమవారం ట్వీట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతూ ఆయన ఈనెల 15న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగానే ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్టు ఇళయరాజా కుటుంబ సభ్యులు తెలిపారు. 72 ఏళ్ల ఇళయరాజా 5 వేలకు పైగా పాటలు కంపోజ్ చేశారు. For all isaignani fans and well wishers out there!! Raja pa is absolutely fine!! Just a general check up & few tests! He is back home 2day -
సోనాకు రూ.కోటివ్వండి
మే లోపు నటి సోనాకు కోటి రూపాయలు చెల్లించాలని దర్శకుడు వెంక ట్ ప్రభును తమిళ నిర్మాతల మండలి ఆదేశించింది. వివరాల్లో కెళితే.. కుశలన్, అళగర్ మలై, పత్తుపత్తు మొదలగు పలు చిత్రాల్లోవివిధ రకాల పాత్రలు పోషించిన సోనా యూనిక్ ప్రొడక్షన్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చిత్రం నిర్మించతలపెట్టారు. 2009లో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడు వెంకట్ ప్రభుకు పారితోషికంగా సోనా కోటిన్నర ఇచ్చారు. అయితే ఆ తరువాత వెంకట్ ప్రభు ఆ చిత్రం చేయలేదు. చెల్లించిన పారితోషికం తిరిగి చెల్లించలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. సోనా ఈ విషయమై నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై సంఘం నేతలు ఇటీవల చర్చిం చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నడిగర్ సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, ఇతర నిర్వాహకులతోపాటు సోనా, వెంకట్ ప్రభు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు తెలిసింది. సుదీర్ఘ చర్చలానంతరం మే లోపు సోనాకు కోటి రూపాయలు చెల్లించాలని సంఘం నేతలు వెంకట్ ప్రభును ఆదేశించినట్లు తెలిసింది. -
హాస్యంపై కన్నేసిన మాస్
ఏ నటుడయినా వరుసగా ఒకే తరహా చిత్రాలు చేస్తే ఓటమి తప్పదు. ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతారు. అందుకే ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా మన హీరోలు జాగ్రత్త పడుతుంటారు. ఇక నటుడు సూర్య విషయానికొస్తే ఈయన కమర్షియల్ చిత్రాలనే నమ్ముకున్నారు. ఈ పంథాలో సక్సెస్ అయినా ఇటీవల విడుదలైన అంజాన్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇది సూర్యను కాస్త నిరాశ పరిచే విషయమే. ఏదేమయినా ఈ కమర్షియల్ చిత్రాల మాస్ హీరో తాజాగా తన దృక్పథాన్ని మార్చుకుని వినోదంపై కన్నేశారు. తాజా చిత్రం పేరు కూడా మాస్‌నే. అయితే చిత్ర కథ మాత్రం వినోదాల వల్లరిగా ఉంటుందంటున్నాయి యూనిట్ వర్గాలు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈయనకు జంటగా నయనతార, ఎమిజాక్సన్లు నటిస్తున్నారు. ఇందులో సూర్య ఒక పాత్రలో ఆత్మగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రేమ్‌జీ అమరన్, శ్రీమాన్లు ఆయనకు మాత్రమే కనపడే మరో ఆత్మలుగా నటిస్తున్నారట. ఈ ముగ్గురు చేసే హాస్యం కడుపుబ్బ నవ్విస్తుందంటున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తనదైన బాణిలో ఈ మాస్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
దెయ్యంగా సూర్య!
కమల్‌హాసన్ తర్వాత కోలీవుడ్‌లో ప్రయోగాలపై అమితంగా ఆసక్తి కనబరిచే నటుడు సూర్య. గజనీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సెవెన్త్ సెన్స్, మాట్రాన్... ఇలా పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించి.. దక్షిణాది ప్రేక్షకులందరి అభిమానం చూరగొన్నారాయన. తమిళ కథానాయకుడైన సూర్యను, తెలుగు హీరోలతో సమానంగా ఇక్కడి ప్రేక్షకులు అభిమానిస్తున్నారంటే కారణం అదే. త్వరలో సూర్య మరోసారి విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు కోలీవుడ్ టాక్. వెంకటప్రభు దర్శకత్వంలో నటించడానికి ఆయన పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని వినికిడి. ఇందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీక కాగా, మరో పాత్ర ‘దెయ్యం’. మీరు చదివింది నిజమే... సూర్య భూతంలా కనిపించనున్నారట. సూర్య స్థాయి హీరోలు ఇలా దెయ్యంలా నటించడం దక్షిణాదిన ఇదే ప్రథమం కావొచ్చు. ఆయన తరం కథానాయకుల్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసింది కూడా సూర్యనే. దీనికి తోడు ఇప్పుడు దెయ్యంలా కూడా నటించనుండటం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. మరి దెయ్యంగా సూర్య ఏ మేరకు ప్రేక్షకులను భయపెడతారో చూడాలి. -
సూర్య జోక్యం చేసుకుంటే...
సూర్య వెంకట్ ప్రభు కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్ర కథపై సూర్య జోక్యం చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న విషయం దర్శకుడు వెంకట్ ప్రభు భయానికి గురి చేస్తోందట. దీనికి కారణాలు లేకపోలేదు. అజిత్ హీరోగా మంగాత్తా, కార్తీ హీరోగా బిరియాని చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను తయారు చేసే పనిలో తనమునకలైన వెంకట్ ప్రభు ఎట్టకేలకు కథను ఒక కొలిక్కి తీసుకొచ్చారు. సాధారణంగా స్క్రిప్ట్ విషయంలో చాలా సమయం తీసుకునే వెంకట్ ప్రభు సూర్య కోసం తక్కువ సమయంలోనే కథ సిద్ధం చేశారు. ఈ విషయం సూర్య చెవిన వేయగా వెంటనే షూటింగ్‌కు రెడీ అవ్వమని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం అంజాన్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న సూర్య, వెంకట్ ప్రభు నుంచి సింగిల్ లైన్ స్క్రిప్ట్‌ను విన్నారట. పూర్తి కథను వినలేదట. కథ పూర్తిగా విన్న తరువాత ఆయన జోక్యం చేసుకుని ఎలాంటి మార్పులు చేయమంటారోనని వెంకట్ ప్రభు భయపడుతున్నారట. ఆయన భ యానికి కారణం ఇంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిన సూర్య ఆ తరువాత ఆయన పూర్తి కథ సిద్ధం చేయలేదంటూ వైదొలిగారు. అలాగే వెంకట్ ప్రభు కథ బాగాలేదంటారేమోనని ఆయన భయపడుతున్నారట. ఈ చిత్రం జూన్ లో సెట్‌పైకి వెళ్లనుందట. -
3డి మూవీలో నటించబోతున్న సూర్య
-
3డీలో సూర్య
నటుడు సూర్య 3డిలో థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కథతో పాటు పాత్ర, గెటప్‌లలోనూ వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్న సూర్య తాజాగా సాంకేతిక పరంగానూ ఆధునిక టెక్నాలజీ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో లింగుస్వామి దర్శకత్వంలో అంజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కార్తీతో బిరియాని వండిన వెంకట్ ప్రభు ఇప్పుడు ఆయన సోదరుడు సూర్యతో పసందైన 3డి చిత్రాన్ని తెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు. దీని గురించి వెంకట్ ప్రభు మాట్లాడుతూ, సూర్యతో రూపొందించే కథ చివరి దశకు చేరుకుందని తెలిపారు. ఈ చిత్రానికి కల్యాణరామన్ అనే టైటిల్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని అయితే ఇంకా టైటిల్‌ను పెట్టలేదని చెప్పారు. కల్యాణరామన్ పేరుతో పాటు తమ బృందం మరికొన్ని పేర్లు ఆలోచిస్తోందని తెలిపారు. ఈ చిత్రాన్ని తొలిసారిగా 3డీ ఫార్మెట్లో చిత్రీకరించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఇందుకు బడ్జెట్ సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాల గురించి చర్చిస్తున్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే చిత్రాన్ని 3డీలో తెరకెక్కించనున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు వెల్లడించారు. అయితే ఈ చిత్రం అభిమానులకు అద్భుతమైన అనుభూతి నిస్తుందని ఆయన అన్నారు. -
కమల్ అనుమతి కోసం నిరీక్షణ
కమలహాసన్ అనుమతి కోసం సూర్య చిత్రం ఎదురుచూస్తోంది. అదేమిటి సూర్య చిత్రానికి కమలహాసన్ అనుమతి అవసరమేమొచ్చిందంటే.... సూర్య ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి సూర్య బిరియాని చిత్రం ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కథ వండటంలో తలమునకలైన దర్శకుడు దీనికి కల్యాణరామన్ అనే పేరును పెట్టాలనుకుంటున్నారు. సమస్య ఏమిటో అర్థం అయిపోయివుంటుందిగా. ఈ పేరుతో ఇంతకుముందే కమలహాసన్ నటించిన చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది కూడా. ఆ టైటిల్ సూర్య చిత్రానికి పెట్టాలంటే కమలహా సన్, చిత్ర నిర్మాత పంజా అరుణాచలం అనుమతి కావాలి. వెంకట్‌ప్రభు ప్రస్తుతం వారి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. -
‘బిరియాని’ యువన్‌కు వందో సినిమా
-
కుదుటపడిన ఇళయరాజా ఆరోగ్యం
సంగీత ప్రపంచ రారాజు ఇళయరాజా ఆరోగ్యం కుదుటపడిందని ఆయన మేనల్లుడు, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. సోమవారం సాయంత్రం ఇళయరాజాకు స్వల్పంగా గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. 70 ఏళ్ల ఇళయరాజాకు గుండెలో కొద్దిగా నొప్పి అనిపించడంతో వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి అంతా బాగానే ఉందని చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. ''మా మామయ్య, ఇసైజ్ఞాని ఇళయారాజా బాగున్నారు. ఆయన కోసం ప్రార్థనలు చేసినవారికి, ప్రేమను అందించిన వారికి అందరికీ కృతజ్ఞతలు'' అని వెంకట్ ప్రభు తన ట్విట్టర్ పేజీలో ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఇళయరాజాను త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. పలు భాషల్లో ఇళయరాజా ఇప్పటికి 900కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా తలైమురైగల్ చిత్రంలో ఆయన అందించిన సంగీతం ప్రేక్షకుల మదిని దోచుకుంది. దళపతి, క్షత్రియపుత్రుడు, దేవరాగం, నాయకుడు.. ఇలా అనేక చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. త్వరలో ఆయన మలేసియాలో లైవ్ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. My uncle!! our isaignani!! Is absolutely fine!! Thanks for the love and prayers!! — venkat prabhu (@dirvenkatprabhu) December 23, 2013 -
‘బిరియాని’ రుచికరంగా ఉందంటున్నారు
‘‘కొంత విరామం తర్వాత ‘బిరియాని’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాను. అందరూ రుచికరంగా ఉందని మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీ సంతోషం వెలిబుచ్చారు. కార్తీ, హన్సిక జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ‘బిరియానీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ -‘‘యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ చిత్రాలతో తెలుగులో కార్తీ హ్యాట్రిక్ సాధించారు. ‘బిరియాని’ కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘బిరియాని’ ఇంత రుచికరంగా రావడానికి కథే కారణమని దర్శకుడు పేర్కొన్నారు. తన వందో చిత్రం ఇంతలా విజయం సాధించడం పట్ల సంగీత దర్శకుడు యువన్‌శంకర్ రాజా ఆనందం వెలిబుచ్చారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు సహ నిర్మాతలుఎస్సార్ ప్రకాష్‌బాబు, ఎస్సార్ ప్రభు ధన్యవాదాలు తెలిపారు.