సూర్యకు స్క్రిప్టు రెడీ
సూర్యకు స్క్రిప్టు రెడీ
Published Fri, Dec 6 2013 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
కార్తీతో బిరియాని తయారు చేసిన దర్శకుడు వెంకట్ ప్రభు ఇప్పుడు ఆయన సోదరుడు సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. మంగాత్త వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం బిరియాని. ఈ చిత్రం ఈ నెల 20న తెరపైకి రానుంది. తాజాగా సూర్య హీరోగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. వెంకట్ప్రభు చెప్పిన సింగిల్ లైన్ స్టోరీ సూర్యను ఆకట్టుకోవడంతో ఆయన గో అహెడ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇంతకుముందు జిల్లును ఒరు కాదల్, పరుత్తివీరన్, సింగం, చిరుతై, నాన్ మహన్ అల్ల, శకుని, అలెక్స్ పాండియన్, అళగురాజా వంటి భారీ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా, కార్తీతో రూపొందించిన బిరియాని విడుదలకు సిద్ధం అవుతోంది. తదుపరి సూర్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా ఎస్ ఆర్ ప్రకాష్బాబు, ఎస్ ఆర్ ప్రభు వ్యవహరిస్తున్నారు. సూర్య ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తరువాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Advertisement
Advertisement