కమల్ అనుమతి కోసం నిరీక్షణ
కమల్ అనుమతి కోసం నిరీక్షణ
Published Mon, Jan 13 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
కమలహాసన్ అనుమతి కోసం సూర్య చిత్రం ఎదురుచూస్తోంది. అదేమిటి సూర్య చిత్రానికి కమలహాసన్ అనుమతి అవసరమేమొచ్చిందంటే.... సూర్య ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి సూర్య బిరియాని చిత్రం ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్ర కథ వండటంలో తలమునకలైన దర్శకుడు దీనికి కల్యాణరామన్ అనే పేరును పెట్టాలనుకుంటున్నారు. సమస్య ఏమిటో అర్థం అయిపోయివుంటుందిగా. ఈ పేరుతో ఇంతకుముందే కమలహాసన్ నటించిన చిత్రం వచ్చింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది కూడా. ఆ టైటిల్ సూర్య చిత్రానికి పెట్టాలంటే కమలహా సన్, చిత్ర నిర్మాత పంజా అరుణాచలం అనుమతి కావాలి. వెంకట్‌ప్రభు ప్రస్తుతం వారి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
Advertisement
Advertisement