Kamala Hassan
-
బిగ్ బాస్ వల్ల రచ్చ.. వనిత విజయ్‌కుమార్‌పై దాడి
సౌత్ ఇండియా సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ తరుచూ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. 'దేవి' సినిమాతో ఆమె తెలుగు వాళ్లకు పరిచయం అయింది. అలా పలు సినిమాల్లో ఆమె నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కూతురు జోవిక బిగ్ బాస్-7 తమిళ్లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. దీంతో జోవిక ట్రోలింగ్‌కు గురి అవుతూ రావడంతో వనిత విజయ్‌కుమార్ వాటిని తిప్పి కొడుతుంది. ఇలా ఆమె చుట్టూ కాంట్రవర్సీ జరుగుతున్న సమయంలో వనిత విజయ్‌కుమార్‌పై దాడి జరిగింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నిన్న రాత్రి ఆమె ఎదుర్కొన్న సంఘటనను తెలిపింది. బిగ్ బాస్ స్టార్ అభిమాని అంటూ ఓ వ్యక్తి తనను కొట్టాడని, తన ముఖం నుంచి రక్తం కూడా వచ్చిందని వనితా విజయకుమార్ ఫోటోతో సహా ఇలా వెల్లడించింది. 'నాపై గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. అతనెవరో దేవుడికి మాత్రమే తెలుసు. ఈ దాడికి పాల్పడింది బిగ్ బాస్ స్టార్ ప్రదీప్ ఆంటోనీ అభిమాని అని తెలుస్తోంది. అతన్ని విచారిస్తే అన్నీ విషయాలు బయటకొస్తాయి. రాత్రి బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసిన తర్వాత రివ్యూ చెప్పి నేను డిన్నర్ కోసం బయటకు వచ్చాను. తర్వాత మా అక్క సౌమ్య ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న కారును తీయడానికి వస్తుండగా చీకట్లోంచి ఓ వ్యక్తి వచ్చాడు. అప్పుడు అతను నాకు రెడ్ కార్డ్ గుర్తుందా..? అంటూ కొట్టాడు. రెడ్ కార్డ్ వివాదంలో మీ సపోర్ట్ కూడా ఉంది ఉంటూ పారిపోయాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నా ముఖం నుంచి రక్తం వచ్చినప్పుడు, నేను అరుస్తూ ఏడ్చాను. అప్పుడు అర్ధరాత్రి ఒంటిగంట అయింది. కాబట్టి నా చుట్టూ ఎవరూ లేరు. వెంటనే అక్కకి ఫోన్ చేశాను. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అక్క చెప్పింది. కానీ నేను వారిని అంతగా నమ్మను అందుకే ప్రస్తుతానికి నేను ఫిర్యాదు చేయలేదు. కానీ పోలీసుల వద్దకు తప్పకుండా వెళ్తాను. ఆ సమయంలో ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స తీసుకుని అనంతరం ఇంటికి వెళ్లాను. నాపై ఎవరు దాడి చేశారో గుర్తించలేకపోయాను. పిచ్చివాడిలా అతని నవ్వు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతోంది. నేను ప్రస్తుతం ఆ గాయం నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను.. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను.. ఎందుకంటే నాకు శారీరకంగా బాగా లేదు. ఈ స్థితిలో తెర ముందుకు రావడం సాధ్యం కాదు.' అని వనిత చెబుతోంది. కూతురు జోవిక వల్లే ఈ గొడవ జరిగిందా..? తరువాత, వనిత తన ముఖంపై గాయాన్ని కూడా చూపించింది. ‘‘నేను ఎదుర్కొన్న క్రూరమైన దాడి ఇది. ధైర్యంగా ఈ పోస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ తమిళ్ కేవలం గేమ్ షో మాత్రమే. ఇలాంటి దాడి సరికాదు.' అని ఆమె చెప్పింది. కమల్ హాసన్ హాస్ట్‌గా ఉన్న తమిళ బిగ్ బాస్ ఏడో సీజన్ జరుగుతోంది. ఈ షోలో వనిత కూతురు జోవిక కూడా పోటీ పడుతోంది. అదే షోలో తమిళ్ నటుడు ప్రదీప్ ఆంటోనీ అనే కంటెస్టెంట్ ఉన్నాడు. ఆయనపై తోటి కంటెస్టెంట్లతో పాటు జోవిక కూడా గతంలో విమర్శలు చేసింది. ఆయన ఎప్పుడూ వాష్ రూమ్ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రతలేదని జోవిక ఆరోపించింది. దీంతో ఆంటోనీ ప్రదీప్‌కు కమల్ కూడా రెడ్ కార్డ్ జారీ చేశాడు. అప్పుడు ఆయన బిగ్ బాస్ మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఈ గొడవ వల్లే వనిత విజయ్‌కుమార్‌పై ప్రదీప్ అభిమానులు దాడి చేశారని తెలుస్తోంది. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరే చూడాలి కానీ ఇలా దాడులు చేయడం వరకు వెళ్లడం ఏంటని నెటిజన్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) -
ఆ రెండు పార్టీలపై కమల్, రజనీ కన్ను
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అన్ని పార్టీలూ తంటాలు పడుతున్నాయి. కొత్తగా రాజకీయాల్లో కాలుమోపిన నటులు కమల్‌హాసన్, రజనీకాంత్ డీఎంకే, అన్నాడీఎంకే ఓటర్లతో పాటు పార్టీ సభ్యత్వానికీ కన్నం వేసే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు గుసగుసలాడుతున్నారు. ఆ పార్టీల కార్యకర్తలపై గురిపెట్టి సభ్యత్వ లక్ష్యాన్ని సాధించేందుకు వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీ కార్యకర్తలపై కన్నేశారని తెలుస్తోంది. తమ పార్టీల్లో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ విరామం తరువాత తమిళ సినీరంగం నుంచి ఇద్దరు అగ్ర నటులు రాజకీయరంగ ప్రవేశం చేశారు. వెండితెరపై ఒకరిది మాస్, మరొకరిది క్లాస్. రాజకీయ తెరపై కూడా రజనీది ఆధ్యాత్మిక పార్టీ, కమల్‌ది ఇందుకు పూర్తిగా నాస్తిక పార్టీగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నేను నాస్తిక వాదిని, నా పార్టీ కాదు అని కమల్ ఇటీవల వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే ప్రజల మదిలో మాత్రం అన్నాడీఎంకేలా ఆధ్యాత్మిక ధోరణిలో రజనీ, డీఎంకేలా నాస్తికవాదంలో కమల్ రాజ కీయ ప్రయాణం సాగుతోందని, కేవలం ఈ ఒక్క విషయంలో ఆ రెండు పార్టీలకు ఈ రెండు పార్టీలు ప్రత్యామ్నాయాలని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా ఇప్పటికే ఏదో ఒక పార్టీలో చురుగ్గా ఉండే కార్యకర్తలనే ఆకర్షించక తప్పదు. ఏదో కొద్ది శాతం మినహా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారంతా ఏదో ఒక పార్టీలో సభ్యులుగా కొనసాగుతుంటారు. రాష్ట్రంలో అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలున్నా రాజకీయంగానేగాక, సభ్యత్వపరంగా కూడా డీఎంకే, అన్నాడీఎంకే మాత్రమే బలమైనవిగా భావించవచ్చు. అయితే అమ్మ మరణం, నాయకత్వ లేమితో అన్నాడీఎంకే బాగా బలహీనపడిపోయింది. ఇక పార్టీలోని భిన్న ధ్రువాలుగా ఉన్న నేతలను ఏకతాటిపైకి తేవడం అసాధ్యమని తేలిపోయింది. అన్నాడీఎంకేలో జనాకర్షణ ఉన్న నేత కరువయ్యాడు. ఏటా జరిగే సభ్యత్వ నమోదుకు, పునరుద్ధరణకు వేలాదిగా కార్యకర్తలు ముందుకు వచ్చేవారు. అన్నాడీఎంకే కార్యాలయం కిటకిటలాడి పోయేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదుకు పార్టీ కార్యాలయ తలుపులు తెరుచుకోగా గతంలో లాగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక డీఎంకే కార్యకలాపాలను అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థకు గురికావడం కొందరిలో నిరాశను కలిగించింది. అమ్మ చనిపోయిన కొద్దిరోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసి, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చు, వచ్చిన అవకాశాలను పార్టీ సద్వినియోగం చేసుకోవడం లేదని కొందరు అని అసంతృప్తితో ఉన్నారు. ఇలా రెండు పార్టీల్లోని అసంతృప్తిని గమనిస్తున్న కమల్, రజనీ ఆ పార్టీల కార్యకర్తలపై కన్నేశారు. తమ పార్టీల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలంటే అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలను అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. పార్టీలో సభ్యులైనపుడే తమ పార్టీకి చెందిన విజిల్ యాప్‌లో ఫిర్యాదులను నమోదు చేసేందుకు అర్హులవుతారని, అలా ఫిర్యాదులు చేసిన వారిని తాము తరచూ సంప్రదిస్తుంటామని కమల్ సంకేతాలు ఇచ్చారు. అలాగే రజనీ సైతం వీధికి కనీసం పది చొప్పున రజనీ మక్కల్ మన్రంలో సభ్యులుగా చేర్చాలని టార్గెట్ పెట్టారు. ఒక్కో వీధికి ఒక దరఖాస్తు ఫారం అందజేస్తున్నారు. ఈ ఒక దరఖాస్తు ద్వారా 30 మందిని సభ్యులుగా చేర్చవచ్చు. 1.50 కోట్ల సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండు పార్టీల కార్యకర్తలను చేరదీయక తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎంకే మాజీ మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తి రజనీ మక్కల్ మన్రం రాష్ట్ర నిర్వాహకులుగా నియమితులయ్యారు. డీఎంకేతో ఉన్న పరిచయాలను రజనీ పార్టీ సభ్యత్వ నమోదుకు సద్వినియోగం చేసుకుంటున్నారు. -
జీఎస్టీ తగ్గించకుంటే వైదొలగుతా
► ఫిలిం ఛాంబర్ సమావేశంలో కమల్ జీఎస్టీ పన్ను తగ్గించకుంటే తాను సినిమా నుంచి వైదొలగుతానని విశ్వనటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. వివరాల్లో కెళితే..కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న జీఎస్టీ పన్ను విధానం సినిమా పరిశ్రమపై పెనుభారం మోపనుంది. ఇతర రంగాల మాదిరిగానే సినిమాలకు 28 శాతం పన్నుభారం పడనుంది. దీనిని సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ జీఎస్టీ పన్ను విషయంలో పునఃపరిశీలన చేయాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి స్థానిక అన్నాసాలైలోని ఫిలిం ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహిం చింది. ఈ సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు ఎల్.సురేష్‌తో పాటు నటు డు కమలహాసన్, రవి కొటార్కర, అభిరామి రామనాథన్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమలహాసన్ మాట్లాడుతూ సినిమా అన్నది జూదం కాదన్నారు. అది ఒక కళ అని సినిమా టికెట్‌పై విధించనున్న 28 శాతం జీఎస్టీ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ పన్ను వలన సినిమా బాధింపునకు గురవుతుందన్నారు. అందువలన ఈ పన్ను విధానాన్ని కనీసం 12 నుంచి 18 శాతం వరకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో భారతీయ చిత్రాలకు 28 శాతం జీఎస్టీ పన్ను విధించడం సబబు కాదన్నారు. ఒక వేళ ఈ పన్ను విధానాన్ని హిందీ చిత్ర పరిశ్రమ ఆమోదించినా తాము మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సినిమాకు 28 జీఎస్టీ పన్ను విధానంపై పునరాలోచించాలని లేని ఎడల తాను సినిమా నుంచి వైదొలుగుతానని కమలహాసన్ ఆవేశంగా అన్నారు. కాగా జీఎస్టీ పన్ను తగ్గించాలని కోరుతూ త్వరలో కేంద్ర మంత్రి అరుణ్జైట్లిని కలవనున్నట్లు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎల్.సురేష్ వెల్లడించారు. -
నేనేమి చేశాను తప్పు?
నేనేమి చేశాను తప్పు. ఏమిటీ ఇది పాటలోని చరణం అనుకుంటున్నారా? కాదండీ విశ్వనటుడు కమలహాసన్ వ్యక్తం చేసిన ఆవేదనపు వ్యాఖ్యలు. ఆయన అంతగా బాధపడాల్సిన అవసరమేమొచ్చిందనేగా మీ ఆసక్తి. కమల్ ఇటీవల తరచూ తన భావాలను వ్యక్తం చేయడానికి ట్విట్టర్‌ను సాధనంగా వాడుకుంటున్నారు. ఇటీవల నెలకొన్న రాజకీయపరిణామాల గురించి ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక ఒక విప్లవంలా సాగిన విద్యార్థుల జల్లికట్టు పోరాటానికి మద్దతు తెలపడానికి ట్విట్టర్‌ను వాడుకున్నారు.రాజకీయవేత్త సుబ్రహ్మణ్యంస్వామి ఆరోపణలను ట్విట్టర్ ద్వారా తిప్పికొట్టారు. ఇలా తరచూ రాజకీయాల గురించి తన వాదనను వినిపించడంతో ఆయన రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిజానికి కమలహాసన్ ను రాజకీయరంగప్రవేశం చేయాలన్న ఒత్తిడి చాలా కాలంగానే ఉంది. అయితే రాజకీయాలు తనకు సరిపడవని ఆయన తన నిర్ణయాన్ని పలుమార్లు స్పష్టంగా వెల్లడించారు. తాజాగా జల్లికట్టు పోరాటంలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలను ఖండిస్తూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాదు ఇటీవల బీజేపీ నేత ఫొన్ రాధాకృష్ణన్ తో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కమల్ రాజకీయరంగప్రవేశం చేయాలన్న ఒత్తిడి మరో సారి పెరుగుతోంది. దీనిపై స్పందించిన కమలహాసన్ మీకు అండగా నిలుస్తున్నా? నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు? నేనేమి చేశాను తప్పు. ఇది నన్ను చాలా వేదనకు గురిస్తోంది అని కాస్త ఘాటుగానే స్పందించారు. ఈ విషయం అటుంచితే శనివారం తన కూతురు శ్రుతిహాసన్ పుట్టిన రోజు కావడంతో ట్విట్టర్ ద్వారా కమల్ శుభాకాంక్షలు అందించారు. అందులో ఆయన పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు. నీ కార్యాచరణ బాగుంది. ఇది ఆరంభం మాత్రమే. అది మనసులో ఉంచుకో. లవ్యూ పాప అని పోస్ట్ చేశారు. -
దేశం గర్వించేలా చేస్తున్నారు
యువకుల పోరాటాన్ని సినిమాకు చెందిన వారు దోచుకోకూడదంటున్నారు నటుడు కమలహాసన్ . తమిళనాట జల్లికట్లు ఆందోళన తారాస్థాయికి చేరుకుంది. పారంపర్య క్రీడ జల్లికట్టు తమిళుల వీరత్వానికి చిహ్నం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకునేది లేదు అంటూ తమిళనాడులో చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రజానీకం ఆందోళన బాట పట్టారు. జల్లికట్టును ఎలాంటి ఆంక్షలు లేకుండా సాధించుకుంటామన్న లక్ష్యానికి దిశగా ఇప్పటికే చేరుకున్నారు. వారికి తమిళసినిమా మద్దతుగా నిలిచింది. ఆది నుంచి జల్లికట్టుకు సపోర్ట్ చేస్తున్న విశ్వనటుడు కమలహాసన్ యువత పోరాట పఠిమను ప్రశంసించారు. జల్లికట్టు వ్యవహారంలో ప్రపంచం మనల్ని చూస్తోంది. ఇక్కడ నేను మానవతా దృష్టితో చూస్తున్నది యువత కూటమిని కాదు నవ ఉన్నత ఉపాధ్యాయ కూటమిని. వారికి ప్రణమిల్లుతున్నాను. జల్లికట్టు కోసం తమిళనాడులో జరుగుతున్న ఆందోళన శిఖరాగ్రస్థాయికి చేరుకుంది. మండే ఎండలను, కురిసే మంచును, వర్షాలను లెక్కచేయకుండా రేయింబవళ్లు పోరాడుతున్నారు. ప్రపంచం మనల్ని చూస్తోంది. భారతదేశం గర్వించేలా చేస్తున్నారు. మీరు లక్ష్య సాధన విషయంలో దృఢంగా ఉండండి. 1930లో సంఘటిత శక్తితోనే మద్రాస్ ఏర్పడింది. అది 2017లో మరోసారి విజయవంతంగా సాగుతోంది. రాజకీయ పార్టీలు, టీవీ ప్రచారాలను దృష్టిలో పెట్టుకోండి. సామాజిక మాధ్యమాల ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి. అహింసామార్గంలో పోరాడి లక్ష్యాన్ని చేరుకోండి. సినీ నక్షత్రాలు యువత పోరాటానికి మద్దుతుగా మాత్రమే నిలబడండి. వారి పోరాటాన్ని తస్కరించరాదన్నదే నా అభిప్రాయం అని కమలహసన్ జల్లికట్టుకు పోరాడుతున్న యువతను ఉద్దేశించి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ముమ్మరంగా మరుదనాయకం
విశ్వనటుడు చేయని పాత్ర, చేయలేని పాత్ర అంటూ ఉండదు. అయినా ఒక్కో నటుడికి ఒక్కో డ్రీమ్ పాత్ర ఉన్నట్లు కమలహాసన్ కు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అదే మరుదనాయకం. ఒక చరిత్ర వీరుని కథాంశంతో కూడిన ఈ చిత్రాన్ని కమలహాసన్1997 అక్టోబర్ 16వ తేదీన ఎంతో ఆర్భాటంగా మొదలెట్టారు. చిత్ర ప్రారంభోత్సవానికి రాణి ఎలిజబెత్‌ను చెన్నైకి రప్పించారు. మరుదనాయకం 30 నిమిషాల సన్నివేశాలను అద్భుతంగా కమల్ చిత్రీకరించారు. అప్పటికే రూ.10 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లు దాటుతుందన్న అంచనాతో షూటింగ్ ఆగిపోయింది. అయితే మరుదనాయకం చిత్రం డ్రాప్ అయినట్లు కమలహాసన్ ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికైనా ఆ చిత్రాన్ని చేసి తీరాలన్న దృఢ సంకల్పంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉన్న విశ్వనటుడు అందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ మధ్య విదేశీ మిత్ర బృందం మరుదనాయకం చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చినట్లు కమలహాసనే స్వయంగా వెల్లడించారు. తాజాగా రజనీకాంత్ హీరోగా సుమారు రూ.400 కోట్లతో 2.ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థ మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ముందుకొచ్చినట్లు కమల్ వెల్లడించారు.ఈ విషయమై కమల్ ఆ సంస్థ అధినేత సుభాష్‌కరణ్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తం మీద 19 ఏళ్ల తరువాత మరుదనాయకం చిత్ర నిర్మాణానికి ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నట్లు తెలుస్తోంది. కమల్ తాజా చిత్రం శభాష్‌నాయుడు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రానికి లైకా సంస్థ భాగస్వామ్యం వహిస్తుందన్నది గమనార్హం. -
మెయ్యప్పన్‌గా కమల్‌హాసన్
శభాష్‌నాయుడు తరువాత విశ్వనాయకుడు మెయ్యప్పన్‌గా మారనున్నారన్నది తాజా వార్త. నటనకు నవరసాలను ప్రాతిపదికగా చెబుతుంటారు. అరుుతే నటుడు కమలహాసన్‌ను వాటికి పరిమితం చేయలేం. నవరసాల్లోనే మరిన్ని రసాలను పండించగల దిట్ట ఆయన. ఒక్క హాస్యంలోనే ఎన్నో కోణాల్లో అభినరుుంచగల నట మేధావి కమల్. ఒకే చిత్రంలో పది పాత్రల్లో నటించి మెప్పించిన ఏకై క భారతీయ నట దిగ్గజం కమల్. తాజాగా దశావతారం చిత్రంలోని పది పాత్రల్లో ఒకటైన బలరామ్ నాయుడు పాత్రను లీడ్‌గా తీసుకుని మరో సారి శభాష్‌నాయుడు అంటూ తెరపైకి రానున్నారన్న విషయం తెలిసిందే. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమలహాసన్ కూతురు శ్రుతిహసన్ తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఇక ముఖ్య పాత్రల్లో రమ్యకృష్ణ, గౌరవ్శుక్లా, బ్రహ్మానందం నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స సమర్పణలో కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ అమెరికాలో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ముగించుకుని వచ్చిన కమల్ తన కార్యాలయంలో మెట్ల మీద నుంచి కిందపడి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్సానంతరం పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. శభాష్‌నాయుడు చిత్ర తదుపరి షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ చిత్రం తరువాత విశ్వనాయకుడు సీనియర్ దర్శకుడు మౌళితో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి మెయ్యప్పన్ అనే టైటిల్‌ను నిర్ణరుుంచినట్లు తెలిసింది. మెయ్యప్పన్ అన్నది ప్రఖ్యాత దివంగత నిర్మాత, ఏవీఎం స్టూడియో అధినేత పేరు కావడంతో ఆ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందనే అపోహ సినీ వర్గాల్లో నెలకొంది. అరుుతే అది నిజం కాదని, శభాష్‌నాయుడు చిత్రం పూర్తి కాగానే ప్రారంభం అయ్యే మెయ్యప్పన్ చిత్రానికి నిర్మాత ఎవరన్నది త్వరలోనే వెల్లడికానుందని సమాచారం. ఇది కూడా పూర్తి వినోదభరిత కథా చిత్రమేనని తెలిసింది. -
దేవుడే దిక్కంటే ఎలా?
నాకు దైవభక్తి ఎక్కువ అంటున్నారు నటి శ్రుతిహాసన్. పక్కా మోడ్రన్ అమ్మారుుగా పెరిగిన శ్రుతిహాసన్ ఇలా మాట్లాడడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అందులోనూ ఈ బ్యూటీ తండ్రి కమలహాసన్ పూర్తిగా నాస్తికుడన్న విషయం తెలిసిందే.అలాంటిది మీరెలా ఆస్తికులయ్యారన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ ఇలా చెప్పుకొచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం అన్నది నాకే కలిగింది.ఇది ఎవరో చెప్పడంతో కలిగింది కాదు.దైవభక్తి అన్నదిసాధారణ పరిస్థితికి మించింది. ఒక్క దేవుడినని కాదు అన్ని దేవుళ్లను పూజిస్తాను. అలాగని నా ఇంటిలో దేవుని గది అంటూ ప్రత్యేకంగా ఉండదు. అరుునా ఎలా దేవునిపై నమ్మకం కలిగిందో నాకే తెలియదు. నాకు సమయం దొరికినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ల దైవార్చనలు చేసుకుంటాను. పుణ్యస్థలాలను దర్శిస్తుంటాను. షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటాను. అరుుతే ఆ ఆలయాల్లో ఏ దేవుడున్నారన్న విషయం గురించి ఆలోచించను. గుడిలో దేవున్ని చూడగానే దండం పెట్టుకుంటాను.అలాగని నేనేమీ కోరుకోను అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. చిన్న చిన్న కోరికలు కోరుకుంటాను. అరుుతే మన బాధ్యతలను విస్మరించకూడదు. ఏమీ చేయకుండా భగవంతుడా అంతా నీదే భారం అని కూర్చోవడం సరికాదు. మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అని అంటున్న నటి శ్రుతిహాసన్ తాజాగా తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో తన తండ్రి కమలహాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. -
సూపర్‌స్టార్, ఇలయదళపతి కలిసిన వేళ
తమిళసినిమా; స్టార్ నటు లు ఈ మధ్య అభిమానులకు స్వీట్ షాక్ ఇస్తున్నా రు. ఇటీవల తన చిరకాల మిత్రుడు కమలహాసన్‌ను కలవడానికి ఆయన కార్యాలయానికి వెళ్లి అందర్నీ ఆసక్తి గురి చేశారు రజనీ కాంత్. కాగా ఇళయదళపతి విజయ్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి ఇరువురి అభిమానులకు ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ షూటింగ్ స్థానిక ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆవరణలో జరుగుతోంది. అదే విధంగా విజయ్ నటిస్తున్న తాజా చిత్రం భైరవా చివరి రోజు షూటింగ్ అదే ఇన్స్టిట్యూట్లో జరిగింది. చిత్ర షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టిన తరువాత సమీపంలో షూటింగ్లో ఉన్న సూపర్‌స్టార్‌ను విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. 10 నిమిషాల సేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. అయితే రజనీకాంత్ 2.ఓ చిత్ర గెటప్‌లో ఉండడం వల్ల విజయ్ ఆయనతో ఫొటో దిగలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
శ్రుతి డైరెక్షన్ చేయడం సరికొత్త అనుభవం
శ్రుతిహాసన్‌ను డైరెక్ట్ చేయడం సరికొత్త అనుభంగా పేర్కొన్నారు ఆమె తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కమలహాసన్. ఈ విశ్వనటుడు తాజగా శభాష్‌నాయుడు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్ తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.మలయాళ దర్శకుడు రాజీవ్‌కమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఆయన అనూహ్యంగా షూటింగ్ ఆరంభంలోనే అనారోగ్యానికి గురికావడంతో దర్శకత్వం బాధ్యతలను కమలహాసన్ తన భుజాలపై మోయాల్సిన పరిస్థితి. శభాష్‌నాయుడు చిత్రం షూటింగ్ అమెరికాలో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన కూతురు శ్రుతిని డెరైక్షన్ చేయడం సరికొత్త అనుభవం అని కమల్ పేర్కొన్నారు.ఇంతకు ముందు పలువురు నటీనటులను డెరైక్షన్ చేసినా శ్రుతి లాంటి స్టార్ హీరోయిన్ను తొలిసారిగా డెరైక్షన్ చేస్తున్నానని అన్నారు. తాను దశావతారం చిత్రంలో అమెరికా వ్యక్తి పాత్రకు మాట్లాడిన అమెరికా యాస ఉచ్చరింపునకు కారణం శ్రుతినేనన్నారు. తను అప్పట్లో అమెరికా నుంచి తిరిగొచ్చారన్నారు. శ్రుతినే తనకు అమెరికా యాసలో మాట్లాడడం నేర్పించినట్లు తెలిపారు. ఇక తాను హాస్యానికి ఎప్పుడూ దూరం కాలేదన్నారు. దశాతారం చిత్రంలోనూ వినోదాన్ని జోడించానని అన్నారు. ఇక శభాష్‌నాయుడు ఆ చిత్రంలోని బలరామ్ నాయుడు పాత్రకు కొనసాగింపుగా భావించవచ్చునన్నారు. ఇది పూర్తి వినోదాత్మక కథా చిత్రం అని తెలిపారు. అమెరికా షెడ్యూల్ పూర్తి చేసి మిగిలిన భాగాన్ని చెన్నైలో చిత్రీకరించి చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు కమల్ వెల్లడించారు. -
ఆ ఇద్దరూ కలిసి నటించాల్సి వస్తే..
కోలీవుడ్‌లో దిగ్గజాల్లాంటి నటులు విశ్వనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్. అలాంటి వీరిద్దరూ కలిసి నటిస్తే?అందులో రజనీకాంత్‌కు కమలహాసన్ విలన్‌గా మారితే? అంత కంటే సంచలనం ఇంకోటి ఉండదు.అయితే అది సాధ్యమయ్యే పనేనా?అలాంటి దుసాధ్య కార్యాన్ని సాధ్యం చేసే ధిశగా స్టార్ డెరైక్టర్ శంకర్ ఇటీవల అడుగులు వేశారు కానీ సఫలం కాలేదు.రజనీకాంత్,శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఎందిరన్ చిత్రం సాధించిన రికార్ట్‌ను నేటికీ మరో చిత్రం బద్దలు కొట్టలేదు. అలాంటి చిత్రానికి తాజాగా 2.ఓ పేరుతో సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని లైకా సంస్థ అత్యధికంగా 350 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా మొదట హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను నటింపజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు శంకర్. ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ రెడీ అన్నంతగా ప్రచారం మారుమోగింది. అయితే అలా జరగలేదు. ఆ తరువాత సూపర్‌స్టార్‌కు విలన్‌గా విశ్వనాయకుడిని నటింపజేసే ప్రయత్నాలు చేశారు. కానీ కమలహాసన్ కూడా రజనీకాంత్‌కు ప్రతినాయకుడిగా మారడానికి అంగీకరించలేదు. ఆ తరువాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ఆ పాత్రలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2.ఓ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. రజనీకాంత్‌కు విలన్‌గా నటించడానికి కారణాన్ని కమలహాసన్ ఇటీవల బహిరంగపరచారు. ఈ అంశం గురించి ఆయన తెలుపుతూ రజనీ తానూ ఇంతకు ముందు చాలా చిత్రాలు కలిసి నటించామన్నారు. ఆ తరువాత విడివిడిగా హీరోలుగా నటిస్తున్నామని అన్నారు. ఒకవేళ మళ్లీ తాము కలిసి నటించాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయితే ఆ చిత్రాన్ని తామిద్దరం కలిసి నిర్మించాలని, లేదా తమలో ఎవరైనా ఒకరు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతే కానీ రజనీకి తాను విలన్‌గా నటించడానికి నిరాకరించాననడంలో వాస్తవం లేదన్నారు. అలా చూస్తే తాను చాలా చిత్రాల్లో విలన్‌గా నటించానని అన్నారు. అయితే ఇప్పుడు 2.ఓ చిత్రంలో పేద్ద నటుడే రజనీకి విలన్‌గా నటిస్తున్నారని కమలహాసన్ పేర్కొన్నారు. -
తండ్రీకూతుళ్ల చిత్రానికి 29న శ్రీకారం
క్రేజీ కాంబినేషన్ చిత్రాలు చాలానే తెరకెక్కుతుంటాయి. అయితే అసలు క్రేజీ అనే పదానికి నిర్వచనంగా ఒక చిత్రానికి శ్రీకారం జరగనుంది. విశ్వనాయకుడు కమలహాసన్, ఆయన కూతురు, అత్యంత పాపులర్ నటి శ్రుతిహాసన్ కలిసి నటిస్తే చూడాలన్న ఆసక్తి, ఆశ చాలా కాలంగా చాలా మందికి ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈ కాంబినేషన్లో చిత్రం చాలా కాలంగా ఊరిస్తుందనే చెప్పాలి. అది ఇన్నాళ్లకు నిజం కానుంది. ఎస్ కమలహాసన్ ఆయన వారసురాలు శ్రుతిహాసన్ కలిసి నటించనున్న చిత్రం ఈ నెల 29న ప్రారంభంకానుంది. దీనికి కమలహాసన్ ఒక మంచి వినోదంతో కూడిన తండ్రీకూతుళ్ల అనుబంధాల కథను ఎంపిక చేసుకున్నారు. దీనికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఈయన కమలహాసన్‌తో ఇంతకు ముందు చాణక్యన్ అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజా చిత్రాన్ని కమల్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 41వ చిత్రం అవుతుంది. దీనికి హాస్యనటుడు, కథకుడు క్రేజీ మోహన్ సంభాషణలు అందించడం విశేషం అయితే చాలా సుదీర్ఘ గ్యాప్ తరువాత ఇసైజ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనుండడం మరో విశేషం. వీరి కలయికలో ఇంతకు ముందు పలు భాషల్లో వందకు పైగా చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. అయితే తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ముంబై ఎక్స్‌ప్రెస్‌నే కమల్, ఇళయరాజాల కాంబినేషన్లో రూపొందిన చివరి చిత్రం. ఇకపోతే ఇందులో ముఖ్య పాత్రను నటి రమ్యక్రిష్ణ పోషించనుండడం మరో విశేషం. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమలహాసన్ స్థానిక టీ.నగర్, హబిబుల్లా రోడ్డులో గల నడిగర్ సంఘం ఆవరణలో నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా వెల్లడించారు. -
విశ్వనటుడికి జీవిత సాఫల్య అవార్డు
విశ్వనటుడు కమలహాసన్ అవార్డులకే అలంకారం అనడంలో అతిశయోక్తి కాదేమో. ఇప్పటికే పద్మశ్రీ వంటి జాతీయ అవార్డుతో పాటు పలు విశిష్ట అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా జీవిత సాఫల్య తమిళర్ అవార్డు పురస్కారం కమలహసన్ కోసం ఎదురు చూస్తోంది. ఆరేళ్లుగా నార్వే చిత్రోత్సవాలు నిర్వహిస్తూ తమిళ కళాకారులతో పాటు, తమిళేతర చిత్ర కళాకారులకు తమిళర్ విరుదు పేరుతో అవార్డులను అందిస్తున్నారు. ఏడో నార్వే తమిళ చిత్రోత్సవ కార్యక్రమం మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకూ నార్వేలో నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పోటీకి నామినేషన్ల గడువు ఈ నెల 15తో ముగియనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 25న అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళనాడులో నిర్మించిన చిత్రాలతో పాటు తమిళేతర దేశాల్లో రూపొందించిన తమిళ చిత్రాలకు అవార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి చిత్రాలతో పాటు లఘు చిత్రాలు, డాక్యుమెంట్ చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ కేటగిరీల్లో అవార్డు పోటీలు ఉంటాయన్నారు. నార్వే ప్రభుత్వ అంగీకారంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన విశ్వనటుడు కమలహాసన్‌ను జీవిత సాఫల్య తమిళర్ బిరుదుతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కలైశిఖరం అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
వారసురాలితో నటించనున్న మరో హీరో
హీరోలు తమ వారసులతో కలిసి నటించడం అన్నది అరుదైన విషయమే అనాలి.అలా విశ్వనటుడు కమలహాసన్ తన వారసురాలు, నేటి క్రేజీ హీరోయిన్ శ్రుతిహాసన్‌తో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరిని కలిపి చిత్రం చేయాలన్న ప్రయత్నాలు చాలా కాలంగాను జరుగుతున్నాయి. కమలహాసన్‌నే తన చిత్రంలో శ్రుతిని నటించమని ఇదివరకే అడిగారు.అయితే ఆమె కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ చిత్రంలో నటించలేనని చె ప్పారు. తాజాగా కమలహసన్, శ్రుతిహసన్‌లను వెడి తెరపైనా తండ్రీ కూతుళ్లుగా చూడబోతున్నాం.ఈ క్రేజీ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. నటుడు అర్జున్ కూడా తన వారసురాలితో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. అర్జున్ కూతురు ఐశ్వర్య నటుడు విశాల్‌కు జంటగా పట్టత్తుయానై చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోవడం వల్లో లేక మరే కారణంతోనో ఐశ్వర్యకు ఆ తరువాత అవకాశాలు రాలేదు. అర్జున్ ప్రస్తుతం ఓరు మెల్లియ కోడు, నిపుణన్ చిత్రాల్లో నటిస్తున్నారు.తదుపరి తన స్వీయ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన వారసురాలు ఐశ్వర్య కూడా ముఖ్య పాత్రను పోషించనున్నారట.ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
మళ్లీ మరుదనాయగమ్?
మరుదనాయగమ్ ఇది చరిత్ర కథ. దీన్ని విశ్వనాయకుడు కమలహాసన్ 18 ఏళ్ల క్రితమే చారిత్రాత్మక చిత్రంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆయనే కథను తయారు చేసుకుని కథనం, దర్శకత్వం బాధ్యతలతో పాటు టైటిల్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు. చిత్ర షూటింగ్‌ను ఆర్భాటంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఇంగ్లాడ్ రాణి ఎలిజబెత్‌ను ఆహ్వానించారు. చిత్ర నిర్మాణం కొంత వరకూ నిర్విఘ్నంగా జరిగింది. కమలహాసన్ కూడా తన కలల చిత్రం తెర రూపం దాల్చడంతో ఆనందించారు. అయితే ఆర్థిక సమస్య దానికి అడ్డుకట్ట వేసింది. ఫలితం చిత్ర నిర్మాణం ఆగిపోయింది. మరుదనాయగమ్ చిత్రాన్ని కమల్ 1997లో ప్రారంభించారు. అప్పటి నుంచి దాన్ని పూర్తి చేయడానికి ఆయన పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అది విశ్వనటుడి డ్రీమ్ ప్రాజెక్ట్ కనుక. ఇటీవల కూడా కమలహాసన్ లండన్‌కు చెందిన తన మిత్రుడు మరుదనాయగమ్ చిత్రాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చారన్న విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఐయింగరన్ చిత్ర నిర్మాణ సంస్థ మరుదనాయగమ్ చిత్ర పోస్టర్‌ను అధికారిక పూర్వంగా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఆ చిత్ర నిర్మాణానికి రోజులు దగ్గర పడ్డాయనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. సూపర్‌స్టార్‌తో ఎందిరన్-2 చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా సంస్థే ఆగిన మరుదనాయగమ్కు జీవం పోయనున్నట్లు కోడంబాక్కమ్ వర్గాల టాక్. -
ఫస్ట్ టైమ్... తెరపైనా తండ్రీ కూతుళ్ళు!
మన సినిమాల్లో వారసులకు భలే క్రేజు. అందులోనూ సూపర్‌స్టార్ తండ్రి, స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న వారసులైతే వేరే చెప్పనక్కరలేదు. వారిద్దరూ కలసి ఒకే సినిమాలో నటిస్తే, ఇక డబుల్ క్రేజ్ ఖాయం. ఇప్పుడు కమలహాసన్ కుటుంబం నుంచి అలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్లు భోగట్టా. కమలహాసన్ కుమార్తె శ్రుతీహాసన్ సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తండ్రితో కలసి ఆమె ఎప్పుడు నటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. రాబోయే ఒక చిత్రంలో తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే - ఆ సినిమాలోనూ వాళ్ళు తండ్రీ కూతుళ్ళుగానే కనిపించనున్నారు. జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు టి.కె. రాజీవ్ కుమార్ ఈ తండ్రీ కూతుళ్ళిద్దరూ నటించే స్క్రిప్ట్ ఆలోచించారు. ఆ ఆలోచన నచ్చి కమల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని చెన్నై కోడంబాకమ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి, రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఫ్యామిలీ సెంటిమెంట్స్ నిండిన ఒక రొమాంటిక్ కామెడీ సినిమాను కమలహాసన్ ఇప్పటికే చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అమ్మా నాన్న ఆట’ అనే పేరు కూడా పెట్టారు. జరీనా వహాబ్, అమల అక్కినేని కూడా ఆ సినిమాలో ఉన్నారు. మరి... ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా అదే సినిమాలో నాన్నతో కలసి నటిస్తున్నారా? లేక అది పూర్తిగా కొత్త స్క్రిప్టు, సినిమానా అన్న వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. సినిమా ఏదైనా, ఇప్పటికైతే కమల్, శ్రుతీహాసన్లు కలసి నటించడం వరకు కన్ఫర్మ్. మిగతా వివరాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
దీపావళి బరిలో కమల్‌తో ఢీకుంటున్న అజిత్
దీపావళి బరిలో విశ్వనాయకుడు కమలహాసన్‌తో అజిత్ ఢీకుంటున్నారు. పెద్ద పండగలు వస్తున్నాయంటే చిత్ర పరిశ్రమలో సందడి వాతావరణం, సినీ అభిమానుల్లో ఆనందాలు నెలకొంటాయి. అయితే దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగల సందర్భాల్లోనే భారీ చిత్రాలు విడుదల చేయాలన్న నిర్మాతల మండలి నిబంధన అమలులో ఉంది. కాగా ఈ దీపావళికి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి కమలహాసన్ నటించిన తూంగావనం కాగా రెండోది అజిత్ నటించిన వేదాళం. దీంతో కమల్, అజిత్ మధ్య పోటీ అనివార్యమయ్యింది. తూంగావనం.. పాపనాశం వంటి విజయవంతమైన చిత్రం తరువాత విశ్వనాయకుడు కమలహాసన్ నటించి, తన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన చిత్రం తూంగావనం. ఇది ఏక కాలంలో తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించిన ద్విభాషా చిత్రం. తెలుగులో చీకటిరాజ్యం పేరుతో విడుదల కానుంది. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నాయకిగా నటించారు. ప్రకాశ్‌రాజ్, కిషోర్, ఆశాచరణ్ తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించిన ఈ చిత్రానికి కమలహాసన్ శిష్యుడు రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. వేదాళం.. ఎన్నైఅరిందాల్ వంటి హిట్ చిత్రం తర్వాత అజిత్ నటించిన భారీ చిత్రం బేదాళం. ఈయనతో ఇంతకుముందు ఆరంభం, ఎన్నైఅరిందాల్ చిత్రాలను నిర్మించిన శ్రీసాయి రామ్ ఫిలింస్ అధినేత ఏఎం.రత్నం నిర్మించిన మరో భారీ చిత్రం ఇది. అదే విధంగా ఇంతకు ముందు అజిత్‌తో వీరం వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన శివ తెరకెక్కించిన చిత్రం బేదాళం. ఇందలో శ్రుతీహాసన్ హీరోయిన్. అజిత్‌కు చెల్లెలుగా నటి లక్ష్మీమీనన్ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం కుటుంబ నేపథ్యంలో సాగే కమర్షియల్ కథా చిత్రంగా రానుంది. విశేషం ఏమిటంటే ఈ దీపావళికి తండ్రీకూతుళ్ల చిత్రాలు పోటీ పడుతున్నాయన్న మాట. మరి ఈ రెండింటిలో ఏది ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో, ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తాయో వేచి చూడాల్సిందే. -
రజనీతో ఇద్దరి రొమాన్స్
ప్రముఖ హీరోల సరసన ఒకరికి మించి హీరోయిన్లు నటిం చడం సర్వసాధారణమైపోయింది. కమలహాసన్, విజయ్, సూర్య, అజిత్ ఇలా ప్రముఖ నటులందరూ ఇద్దరు హీరోయిన్లతో అధికంగా నటిస్తున్నారు. అలాంటి సూపర్‌స్టార్ రజనీకాంత్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసి చాలా కాలమే అయింది. అలాంటి ఈ సారి ఇద్దరు ముద్దుగుమ్మలతో సయ్యాటలాడటానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. రజనీకాంత్ ప్రస్తుతం కబాలీ చిత్రంలో నటిస్తున్నారు. రాధిక ఆప్టే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. రజనీకాంత్ తదుపరి చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ చిత్రం గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కారణం ఆరంభానికి ముందే చాలా విశేషాలు ఈ చిత్రం గురించి అనధికారికంగా హోరెత్తుతున్నాయి. రజనీకాంత్, శంకర్ల కలయికలో రెండు సంచలన చిత్రాల తరువాత ముచ్చటగా తెరకెక్కనున్న మూడో చిత్రం ఎందిరన్-2. ఎందిరన్ చిత్రం ఎంత వండర్ కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్‌గా రూపొందనున్న క్రేజీ చిత్రమే ఎందిరన్-2. ఇందులో రజనీకాంంత్కు విలన్‌గా విక్రమ్ నటించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు జరిగింది. అయితే తాజాగా హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ టాక్. ఇందులో హీరోయిన్గా నటించే అదృష్టం ఇంగ్లీష్ బ్యూటీ ఎమీజాక్సన్‌ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో మరో ముద్దుగుమ్మ కూడా నటించనున్నారట. ఆమె కోసం శంకర్ బాలీవుడ్, కోలీవుడ్‌లలో జల్లెడేసి వడగడుతున్నారని తెలిసింది. లైకా సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌కు డిసెంబర్ 25న ముహూర్తం పెట్టినట్లు తెలిసింది. -
కొత్త తరహాలో తూంగావనం ఆడియో ఆవిష్కరణ
ఆధునికాన్ని ఆహ్వానించే నటుల్లో కమలహాసన్ ముందుంటారని ఇప్పుడు కొత్తగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినీ విజ్ఞాని నిరంతర ప్రయోగశాలి అన్నది ఇక్కడ ప్రస్థావించక తప్పదు.కమలహాసన్ తాజా చిత్రం తూంగావనం. ఇది తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న చిత్రం. తెలుగులో చీకటిరాజ్యం పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో త్రిష నాయకి. ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్యపాత్రలు పోషించిన ఈ ద్విభాషా చిత్రాన్ని రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రన్ సంగీతాన్ని అందిస్తున్న చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్లో జరిగింది. సాధారణంగా అందంగా ప్యాక్ చేసిన సీడీల పెట్టెనో లేక చిత్ర పోస్టర్‌తో కూడిన కటౌట్నో ఆవిష్కరించి ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ తూంగావనం చిత్ర ఆడియో వేడుకనూ అదే తరహాలో నిర్వహిస్తే అది కమల్ సినిమా ఎందుకవుతుంది. 25 థియేటర్లలో ప్రదర్శన చెన్నైలోని సత్యం థియేటర్లో నిర్వహించిన తూంగావనం ఆడియో ఆవిష్కరణ వేడుక అదే సమయంలో తమిళనాడులోని 25 థియేటర్లలో ప్రచారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అలా 25 వేల ప్రేక్షకులు ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణను తిలకించారు. అలాగే ఐట్యూన్స్ అనే ఆధునిక టెక్నాలజీ ద్వారా విడుదల చేసి లక్షలాది ప్రజలు ఈ వేడుకను చూస్తున్నారని కమల్ ఈ సందర్భంగా వెల్లడించారు. అది మా టీమ్ సాధించింది కమలహాసన్ మాట్లాడుతూ తూంగావనం చిత్రాన్ని 40 రోజుల్లో పూర్తి చేశామని, 50 రోజుల్లో చేశామని రకరకాల ప్రచారం జరుగుతోందన్నారు. ఇది ద్విభాషా చిత్రం అన్నారు. ఈ రెండు భాషల్లోనూ 52 రోజుల్లో పూర్తి చేయాలని ముందు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. అయితే చాలా సన్నివేశాలు తమిళం తెలుగు అంటూ వేర్వేరుగా తీయాల్సిరావడంతో అనుకున్న దానికంటే మరో ఎనిమిది రోజులు ఎక్కువ పట్టిందని చెప్పారు. మొత్తం 60 రోజుల్లో రెండు భాషల్లో చిత్రాన్ని పూర్తి చేశామన్నారు. ఆ విధంగా చూస్తే ఒక్కో చిత్రాన్ని 30 రోజుల్లో పూర్తి చేసిన ట్లని అన్నారు. ఇది సాధ్యం కాదన్న వారికి తమ టీమ్ సాధ్యమేనని చేసి చూపించిందన్నారు. ఇంతకు ముందు తానూ ఇక చిత్రాన్ని 200 రోజులు చేసిన సంఘటనలు ఉన్నాయని అలాంటిది ఆరేళ్ల నుంచి తయారు చేసిన టీమ్‌తో ఈ చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేయగలిగామని కమల్ వెల్లడించారు. త్రిష,శ్రుతిహాసన్, మధుశాలిని, శ్రీప్రియ, దనుష్, విశాల్, పాండిరాజ్, గౌతమ్‌మీనన్, అమీర్, వైరముత్తు, కాట్రగడ్డ ప్రసాద్ పాల్గొన్నారు. చిత్రంలో ఒక్క పాట చోటు చేసుకుంది. దాన్ని వైరముత్తు రాయగా కమలహాసన్ పాడారు. -
హీరోయిన్ పెళ్లి సందడి
నటి అసిన్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నగలు, బట్టలు అంటూ పెళ్లి సరంజామా కొనుగోలు చేసే పనిలో ఫుల్ బీజీ అయిపోయారు నటి అసిన్. టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయికిగా విరాజిల్లిన ఈ మలయాళీ బ్యూటీ కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన గజినీ చిత్ర రీమేక్ ద్వారా బాలీవుడ్‌కు ఎగబాకారు. టాలీవుడ్లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజలతోనూ, కోలీవుడ్‌లో కమలహాసన్, విజయ్, అజిత్, విక్రమ్, జయం రవి వంటి టాప్ స్టార్స్‌తో నటించనట్లుగానే బాలీవుడ్‌లోనూ అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్,అక్షయకుమార్ వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టారు. కోలీవుడ్, టాలీవుడ్లో మాదిరిగానే అక్కడా విజయాలను అందుకున్న అసిన్ ఆ మధ్య మైక్రోమ్యాక్స్ సంస్థ అధినేత రాహుల్ శర్మ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న అసిన్ నటించిన చివరి హిందీ చిత్రం 'ఆల్ ఈజ్ వెల్'. ఈ చిత్రం రెండు నెలల క్రితం విడుదలైంది. ప్రియుడితో పెళ్లికి సిద్ధమైన అసిన్ కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు. ఈ ప్రేమజంట పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ డిసెంబర్లోనే అసిన్ ఇంట పెళ్లి బాజా భజంత్రీలు మోగనున్నాయని ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. ఇక అసిన్ కుటుంబీకులు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారట.అసిన్ కూడా నగలు, బట్టలు ఇతర వస్తువుల కొనుగోలు కోసం లండన్ వెళ్లరట. అటునుంచి ఫ్రాన్స్, అమెరికా దేశాలు చుట్టేసి పెళ్లికి అవసరం అయిన సరంజామాను దిగుమతి చేసుకోనున్నారని తెలిసింది. -
ప్రేమ చరిత్ర
అగాథంలోకి తొంగి చూస్తే? లోతైన ప్రేమ కనబడుతుంది. పర్వతాలెక్కి పిలిస్తే? ప్రేమ ప్రతిధ్వనిస్తుంది. షరతులతో సంకెళ్లేస్తే? ప్రేమ పట్టరానిదైపోతుంది. కాంక్షలతో కాటేస్తే? కక్షలతో చంపేస్తే? ప్రేమ... మరో చరిత్ర అవుతుంది. ఇలాంటి సినిమా చూడకపోతే? ప్రేమ... భవసాగరంలో కొట్టుకుపోతుంది... బాలు, స్వప్నల స్వప్నంలా..! ప్రేమ ఫలించిందంటే ఏమిటి అర్థం? కథ అయిందనా? చరిత్ర అయిందనా? రెండూ కాదు. నిజం అయిందని! కానీ కమల్, సరితల ప్రేమ నిజం కాలేదు. అంటే వాళ్ల ప్రేమ ఫలించలేదా? ఫలించింది. వాళ్ల ఆత్మలు ఇంకా వైజాగ్ బీచ్ కోటలో కలిసే ఉన్నాయి. ఆత్మలా? మనుషుల్లేరా! ఉన్నారు. ఇప్పుడున్న ప్రేమికులందరి ఆత్మలే ఆ ఇద్దరు. అవునూ... ఇప్పుడూ మనం ఇలా శిథిలాల్లో తిరుగుతున్నాం ఎందుకు స్వప్నా? (కమల్ ఆత్మ) ఈ శిథిలాల వెనుక ఎన్నో కథలుంటాయ్. చిరిగిపోయిన చరిత్ర పుటలు ఎంత చిందరవందరగా పడున్నా శాశ్వతంగా గుర్తుంటాయ్. బాలూ... (సరిత ఆత్మ)స్వప్నా... మనం పెళ్లి చేసుకోకూడదు. ఏ బాలూ...? ప్రేమంతా అయిపోయిందా? ప్చ్... కాదు. పెళ్లి చేసుకుంటే అందరిలా మనం కూడా ఆలుమగలుగా మిగిలిపోతాం? ప్రేమ ఫలించకపోతేనే కథానాయకులమవుతాం. మనది కథెందుకు కావాలి? చరిత్ర కాకూడదా? సరిత విశాఖ విమెన్స్ కాలేజీలో చదువుతోంది. కమల్ ఉద్యోగం మానేసి మద్రాస్ నుండి వైజాగ్ వచ్చేశాడు.ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు. కమల్‌ది తమిళ ఫ్యామిలీ. సరితది తెలుగు ఫ్యామిలీ. కమల్‌ది వెజ్ ఫ్యామిలీ. సరితది నాన్‌వెజ్ ఫ్యామిలీ. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి తల్లిదండ్రులూ డైనమైట్లా పేలారు! ఇద్దర్నీ విడివిడిగా కూర్చోబెట్టి, నిలబెట్టి వంద ప్రశ్నలు వేశారు. ఇద్దరిదీ ఒకటే మాట... మేము ప్రేమించుకున్నాం. మేము ప్రేమించుకున్నాం. ఓ రోజు కమల్ డెరైక్టుగా సరిత ఇంటికే వచ్చేశాడు. సరితను కౌగిలించుకుని ‘ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు’ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య పచ్చటి ప్రేమ భగ్గుమంది.రెండు వైపుల పెద్దలూ సమావేశమయ్యారు. ఇక్కడ కమల్ తల్లి సాఫ్ట్. అక్కడ సరిత తండ్రి సాఫ్ట్. కానీ ఇక్కడి తండ్రి, అక్కడి తల్లి ధాటికి ఆ సాఫ్ట్‌నెస్ వర్కవుట్ కాలేదు. పెద్దలకు, పిల్లలకు మధ్య ప్రేమయుద్ధం మొదలైంది. మేం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తాం. (కమల్)అందరూ మాకన్నా వయసులో, అనుభవంలో పెద్దవాళ్లు. ఒక్కరూ మా మనసులేమిటో అర్థం చేసుకోరే! (సరిత) పెద్దవాళ్లని గౌరవిస్తున్నాం కదా. అందుకే (కమల్) ఎవరికీ తెలియకుండా బాలు నన్ను లేవదీసుకుపోతే ఏం చేసేవారేం? ఆన్సర్ హర్ (కోపంగా పైకి లేవబోయిన తండ్రితో కమల్). మేమేం చేసినా హద్దులు... హద్దులు దాటి ప్రవర్తించలేదు. దాటితే అప్పుడు నోరు మూసుకుంటారే! కమల్ తండ్రి జె.వి.రమణమూర్తి ఆవేశంగా అరిచాడు. ‘‘వాయి మూడ్రా భడవా... బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు.. మాంసం తినే పిల్లను పెళ్లి చేసుకుంటాట్ట. సిగ్గు లేదు. సిగ్గు’’. నేను మాంసం, చేపలు మానేస్తాను అంది సరిత. ఓహో అది గొప్ప త్యాగమా అంది సరిత తల్లి. అదే త్యాగం కాకపోతే నేను మాంసం తింటాను అన్నాడు కమల్.శివ శివా అన్నాడు కమల్ తండ్రి. ఇదంతా కావాలని ఈ అరవోళ్లు చేస్తున్న కుట్ర. అదేదో సామెత చెప్పినట్టు... ఎక్కడో చెన్నపట్నం నుంచి వలస వచ్చినోడికి మా అమ్మాయిని కట్టబెడతామా? ఏం.. తెలుగుదేశం గొడ్డుబోయిందా? (సరిత తల్లి) మీకు భాష మాత్రమే అభ్యంతరమైతే... ఒక్కనెల గడువివ్వండి. మీ తెలుగులో మీకే పాఠాలు చెప్తాను. కవిత్వాలు రాస్తాను. పొయెట్రీ. జస్ట్ వన్ మంత్ (కమల్)రాస్తావ్ అబ్బాయ్ రాస్తావ్. మా నెత్తిన పేడ రాస్తావ్. అందుకే కన్నారు మీ అమ్మా అబ్బా. (సరిత తల్లి) చూడండి... వాళ్లు సరే చిన్నవాళ్లు. మనమైనా కాస్త పెద్ద తరహాగా వ్యవహరించకపోతే ఎలా? వాళ్లిద్దరూ ఒకళ్లనొకళ్లు ప్రేమించుకున్నాం అంటున్నారు. ఇప్పుడు మనమేం చేయాలో అది ముందు ఆలోచించండి. (కమల్ తల్లి) ఏం చేయవలెనా? ముందా చెయ్యి తియ్యమనండి. (కమల్ సరిత చెయ్యి పట్టుకుని ఉంటాడు) అంద కయ్యిడరా. ఈ వయసులో ప్రేమయే! ప్రేమ! వ్యామోహం ద. బలుపు. (కమల్ తండ్రి) వాదన ఆగట్లేదు. ఇదంతా ఎందుకండీ... మాది నిజమైన ప్రేమే అని తెలియజేయడానికి ఏం చెయ్యమంటారో చెప్పండి. చేస్తాం అంది సరిత. ఊ... చూడండీ... మీరెవరూ ఏమీ అనుకోనంటే... నేనొక మాట చెప్తాను. ఒక సంవత్సరం పాటు వాళ్లిద్దర్నీ వేరు చేసి చూడండి. ఆ తర్వాత కూడా వాళ్లు పరస్పరం కోరుకుంటే... అది నిజంగా ప్రేమే. వ్యామోహం కాదు అన్నాడు మధ్యవర్తి. కమల్ ఇంటి ఓనర్. అయితే అప్పుడు పెళ్లి చేయవాలా? పోవయ్యా.. నూరు సంవత్సరమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అదెల్లా ముడియాదు. (కమల్ తండ్రి). ముడియాదు అనడానికి మీరెవరండీ. నేను చెప్తున్నాను. ఈ సంబంధం నాకు ముడియాదు. ఈ జగన్నాథానికేం (మధ్యవర్తి) పోయింది. పిల్లా పీచా.. నోటికొచ్చినట్టు వాగుతాడు. (సరిత తల్లి)అలా తోసి పారేయకండి. కాస్త ఆలోచించండి. (కమల్ తల్లి) సరిత తండ్రి ఆలోచనలో పడ్డాడు. అవునే. ఆయనజెప్పిందీ కాస్త సబబుగానే ఉన్నట్టుంది. అన్నాడు. ఏం బాలూ అంది కమల్ తల్లి. ఎదుక్కుమా ఇదెల్లా.. ఏదో పెద్ద అగ్ని పరీక్ష లాగా. యూ... యూసీ... మేము ఒప్పుకోం (కమల్) పోనీ ఒప్పుకుందాం బాలూ. వీళ్ల పరీక్షలకు మనం దడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారవ్. నాకా నమ్మకం ఉంది అంది సరిత. ఊ.. అయితే అన్నాళ్లు ఒకర్నొకరు చూసుకోకూడదు. మాట్లాడకూడదు. ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. (సరిత తల్లి) ఆ.. అసలు ఇద్దరూ ఒక ఊర్లోనే ఉండకూడదు. వాణ్ణి హైద్రాబాద్ పంపిస్తున్నాను. (కమల్ తండ్రి) అగ్రిమెంట్ అయింది. కమల్, సరిత విడిపోయారు. కమల్ హైదరాబాద్‌లో. సరిత వైజాగ్‌లో. ఏడాది వరకు వీళ్లు కలుసుకోడానికి వీల్లేదు. డెడ్‌లైన్... డిసెంబర్ 19, 1977. ఈలోపు కలుసుకుంటే ప్రేమ రద్దు. అక్కడ హైదరాబాద్‌లో కమల్‌కి ఎవరైనా ‘కావ్యం’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ‘వెన్నెల’ అంటే సరిత గుర్తుకొస్తోంది. ఇక్కడ విశాఖపట్నంలో సరిత... కమల్ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతోంది. అక్కడ కమల్‌కి మాధవి పరిచయం అయింది. మాధవియంగ్ విడో. కమల్‌కి తెలుగు నేర్పిస్తోంది. డాన్స్ నేర్పిస్తోంది. ఇక్కడ సరితకు బావ టార్చర్ మొదలైంది. కమల్ ప్రతి జ్ఞాపకాన్నీ తుడిచేసి, తన తమ్ముడు మిశ్రోకి ఇచ్చి పెళ్లి చేసేందుకు సరిత తల్లే ఆ బావని రప్పించింది. సరితకు ఇంకో టార్చర్.. అమెపై కన్నేసిన బుక్‌షాప్ ఓనర్. అవకాశం కోసం కాచుక్కూర్చున్న కామాంధుడు అతడు. రోజులు గడుస్తున్నాయి. కమల్, సరితల ప్రేమకు ఒక్కోరోజు ఒక్కో పరీక్ష ఎదురౌతోంది. కమల్ నెగ్గుతున్నాడు. సరిత నెగ్గుతోంది. కానీ ఓ రోజు కమల్ ఓడిపోయినంత పని చేశాడు! జూలాజికల్ ఎక్స్కర్షన్ కోసం వైజాగ్ నుండి సరిత, ఆఫీస్ ఇన్స్పెక్షన్ కోసం హైదరాబాద్ నుండి కమల్ కాకినాడ వెళ్లారు. ఓ రెస్టారెంట్లో దిగారు. అనుకోకుండా ఇద్దరివీ పక్కపక్క గదులు. సరితకు తెలీకుండా ఆమె బావ కూడా ఆమెను ఫాలో అయి వచ్చాడు. సరిత ఆశ్చర్యపోయింది. తనపై నిఘా పెట్టినందుకు తల్లిని తిట్టుకుంది. ఇక్కడే స్టోరీ మలుపు తిరుగుతుంది. సరితను చూడకుండా ఉండలేక ఆమె గదిలోకి వెళ్లిన కమల్‌కు సరిత బావ కనిపించాడు. త్వరలో తను సరితను చేసుకుంటున్నట్లు చెప్పాడు. కమల్ నమ్మాడు. కోపంతో వెళ్లిపోయాడు. ఆ కోపం మాధవి మీద ప్రేమ అయింది. ఆ ప్రేమ పెళ్లి కార్డులు వేసే వరకు వెళ్లింది. ఈలోపు కమల్, మాధవి బుక్ ఎగ్జిబిషన్‌కి వెళతారు. అక్కడ స్టాల్ పెట్టిన వైజాగ్ బుక్‌షాప్ ఓనర్ (నటుడు కృష్ణ చైతన్య) కమల్‌కి కనిపిస్తాడు. మాధవిని అనుమానంగా చూడడం గమనించి, నా కాబోయే భార్య అని చెప్తాడు కమల్. ‘పెళ్లి చేసుకోవడం నాకూ చేతనౌను. వైజాగ్ వెళ్లి చెప్పండి’ అంటాడు. ఇక కృష్ణ చైతన్య ఊరుకుంటాడా? నేరుగా వెళ్లి సరితకు, ఆమె అమ్మానాన్నలకు చెప్పాడు. సరిత షాక్ తింది. పరుగున వెళ్లి ‘బాలూ పెళ్లి చేసుకుంటున్నాడా..’ అని కమల్ తల్లిని అడిగింది. నిజం కాదని తెలుసుకుని గుండెమీద చెయ్యి వేసుకుంది. గడువు తేదీ కోసం ఎదురు చూస్తోంది. అక్కడ హైదరాబాద్‌లో కమల్ సరితకు రాసి, పోస్ట్ చేయని ఉత్తరాలను చూసింది మాధవి. వారిద్దరి మధ్య ప్రేమ ఉందని గ్రహించింది. వెంటనే వైజాగ్ వచ్చి సరితకు కమల్ ప్రేమ గురించి చెప్పింది. సరిత పెళ్లి కూడా వట్టి మాటేనని తెలుసుకుంది. తిరిగి హైదరాబాద్ వెళ్లి కమల్‌కు అసలు సంగతి చెప్పింది. ప్రింట్ అయిన పెళ్లి కార్డులను పక్కన పడేసింది. వెంటనే వెళ్లి సరితను కలుసుకొమ్మని కమల్‌కు చెప్పింది. కమల్‌కు ట్రైన్ టిక్కెట్ కూడా బుక్ చేసింది. కమల్ వైజాగ్ బయల్దేరాడు. మాధవి అన్న రెడ్డి, తన చెల్లెలి పెళ్లి పాడైపోయిందన్న ఆవేదనతో, ఆగ్రహంతో కమల్‌ను చంపేందుకు పథకం వేశాడు. రాత్రి 3 గంటలప్పుడు విశాఖపట్నం అప్పారావుకు ఫోన్ చేసి, వాణ్ణి చంపెయ్ అని చెప్పాడు. నా చె ల్లెల్ని దగా చేసినవాడు మరొక దానితో కులకడానికి వీల్లేదు అని అన్నాడు. క్లైమాక్స్ వైజాగ్‌లో కొండ మీద గుడి. కమల్, సరితల లవ్స్పాట్. కమల్ వస్తున్నాడని గుడికి బయల్దేరింది సరిత. ఒంటరిగా సైకిల్ మీద. అమెను ఫాలో అవుతున్నాడు... ఎప్పటినుంచో ఆమె కోసం కాచుక్కూర్చున్న కృష్ణ చైతన్య. ఇప్పటికి ఛాన్స్ దొరికింది.ఇంటికి వచ్చి, అక్కడి నుంచి సరిత వాళ్ల ఇంటికి వెళ్లి ఆమె గుడికి వెళ్లిందని తెలుసుకుని బైక్‌పై బయల్దేరాడు కమల్. మాధవి అన్న రెడ్డి పురమాయించిన రౌడీలు కమల్ని వెంబడించారు. సరితను కృష్ణ చైతన్య వెంటాడుతున్నాడు. కమల్ ను వీళ్లు వెంటాడుతున్నారు. ఒకరు శీలం దోచుకోవడం కోసం. ఇంకొకరు ప్రాణాలు తీయడం కోసం. ఇక్కడ ట్విస్టులేమీ లేవు. సర్వం కోల్పోయి సరిత, ప్రాణాలు కోల్పోతుండగా కమల్ ఒకరినొకరు కలుసుకున్నారు. ఒకరిలోకి ఒకరు ఒరిగిపోయారు. బాలు... బాలు.. ఇంతకాలం మనం విడిపోయింది మృత్యువు ఒడిలో కలవడానికా? బాలూ ఇది జరక్కముందే నన్ను నీతో లేవదీసుకుపో బాలూ... అంటోంది సరిత. రా స్వప్నా అంటున్నాడు కమల్. ఇద్దరూ సముద్రంలో కలిసిపోయారు. ప్రేమికులు ఓడిపోయారు. కానీ ప్రేమ గెలిచింది. మరో చరిత్ర అయి నిలిచింది. వివరాలు నటీనటులు : కమల హాసన్, సరిత (తొలి పరిచయం), మాధవి, జయవిజయ, కాకినాడ శ్యామల, జె.వి.రమణమూర్తి, కృష్ణచైతన్య, పి.ఎల్.నారాయణ, మిశ్రో. పాటలు : ఆచార్య ఆత్రేయ నేపథ్య గానం : పి.సుశీల, జానకి, వాణీజయరామ్ ఎల్.ఆర్.ఈశ్వరి, రమోలా, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాటలు : గణేశ్ పాత్రో సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్ నిర్మాత: రామ అరంగణ్ణల్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.బాలచందర్, విడుదల (1978) సమర్పణ: ఆండాళ్ ప్రొడక్షన్స్. విశేషాలు మరో చరిత్ర 1981లో హిందీలో ఏక్ దూజేకే లియే పేరుతో వచ్చింది. ప్లాటినమ్ జూబ్లీ (75 వారాలు) జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే. సరిత అసలు పేరు అభిలాష. బాలచందరే సరితగా మార్చారు. పాటలు ఏ తీగ పువ్వునొ, ఏ కొమ్మ తేటినో (సంతోషం) బలే బలే మగాడివివోయ్ బంగారు నా సామివోయ్ కలిసి ఉంటే కలదు సుఖము... కలసి వచ్చిన అదృష్టము పదహారేళ్లకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే... ఏ తీగ పువ్వునో... ఏ కొమ్మ తేటినో (విషాదం) విధి చేయు వింతలన్నీ... -
పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క
పాత్రల స్వరూపాల కోసం కసరత్తులు చేసి తమను తాము మార్చుకోవడం అన్నది సాధారణంగా నటులు చేస్తుంటారు.అది కూడా తమిళంలో కమలహాసన్, విక్రమ్ లాంటి అతి కొద్ది మందే.అలాంటిది అరుంధతిగా పరకాయ ప్రవేశం చేసి దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాల్లో స్థిరస్థాయిగా చోటు సంపాదించుకున్న అనుష్క పాత్రగా మారి నటిస్తున్న తాజా చిత్రం ఇంజి ఇడుప్పళగి. తెలుగులో సైజ్ జీరో అంటూ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అనుష్క 100 కేజీల బరువు పెరిగి నటిస్తున్నారు. అనుష్క సాధారణ బరువు 80 కేజీలు. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం 20 కేజీలు పెరిగారన్నమాట. బరువు కారణంగా ఇక యువతి జీవితంలో ఎదుర్కొనే సమస్యల ఇతి వృత్తంగా రూపొందుతున్న చిత్రం ఇంజిఇడుప్పళగి. ఇందులో పాత్ర గురించి బరువు పెరగాల్సిన విషయం గురించి దర్శకుడు అనుష్కకు ముందే చెప్పారట. బరువైన పాత్ర కావడంతో పాత్ర స్వరూపానికి తగ్గట్లుగా మారడానికి అంగీకరించారట. ఈ చిత్రంలో అనుష్క సన్నగా, నాజూగ్గా, బొద్దుగా భారీ బరువు అంటూ రెండు పరిమాణాల్లో కనిపిస్తారట. స్లిమ్‌గా ఉండే సన్నివేశాల్ని ఇప్పటికే చిత్రీకరించారు. ఇక ఇప్పుడు భారీకాయంతో నటించాల్సిన సన్సివేశాల్ని చితీకరిస్తున్నారు. ఇటీవల బాహుబలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే అనుష్క లావుగా కనిపించారు. తన భారీకాయాన్ని పొడవైన దుప్పటాతో దాసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా అనుష్క భారీ కాయం ఫొటోలు వెబ్సైట్లో హల్చల్ చేస్తుండడం విశేషం. ఏదేమయినా ఒక పాత్ర కోసం ఇలా బరువు తగ్గడం,పెరగడం కోసం కసరత్తులు చేస్తున్న అనుష్కను అభినందించాల్సిందే. -
రజనీకాంత్‌కి లాస్... కమలహాసన్‌కి ప్రాఫిట్!
మలయాళ సినిమా ‘దృశ్యమ్’ తెలుసుగా! ఆ సూపర్‌హిట్ సినిమా అదే పేరుతో తెలుగులో వెంకటేశ్‌తో, కన్నడంలో ‘దృశ్య’ పేరుతో హీరో వి. రవిచంద్రన్‌తో రీమేకై హిట్టయిన సంగతీ తెలిసిందే. తాజాగా తమిళంలో కమలహాసన్‌తో ‘పాపనాశమ్’గా రిలీజై, హిట్ టాక్‌తో నడుస్తోంది. తాజా విషయం ఏమిటంటే, అసలీ తమిళ రీమేక్‌ను మొదట రజనీకాంత్‌తో చేద్దామనుకున్నారట! మలయాళ ఒరిజనల్‌కూ, ఇప్పుడీ తమిళ రీమేక్‌కూ - రెంటికీ దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ నేరుగా రజనీని కలిశారట! స్క్రిప్ట్ నచ్చినప్పటికీ, సినిమాలోని రెండు సీన్స్ పట్ల రజనీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ‘‘సినిమా చివరలో పోలీసులు హీరోను చితగ్గొట్టే సీన్, అలాగే క్లైమాక్స్ సీన్ - ఈ రెండిటి గురించి రజనీ అనుమానపడ్డారు. ఫ్యాన్స్‌కు నచ్చకపోవచ్చేమోనని అన్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ కూడా ఆ మాటతో ఏకీభవించారు’’ అని కోడంబాకమ్ వర్గాలు ఇప్పుడు బయటపెట్టాయి. మొత్తానికి, అలా రజనీకాంత్ వద్దన్న సినిమా కమలహాసన్‌ను వరించింది. ఇప్పుడీ తమిళ రీమేక్‌కు వస్తున్న స్పందన, పత్రికల్లో వస్తున్న రివ్యూలను బట్టి చూస్తే, కమల్‌కు చాలాకాలం తర్వాత మంచి హిట్ వచ్చినట్లుంది. అంటే, సినిమా వదిలేసి రజనీకాంత్ నష్టపోయారనీ, కమల్ లాభపడ్డారనీ అనుకోవచ్చా? -
ఆత్మకథ రాస్తున్న నటి...
విశ్వనాయకుడు కమలహాసన్ లాంటి వారు జీవిత కథ రాసుకోవడానికి ఇష్టపడనంటారు. అలాంటిది నటి లిజీ లాంటి కొందరు ఆటోగ్రఫీ రాసుకుని సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతుంటారు. నటి లిజి జీవితం పలు సంచలనాలమయం అని చెప్పవచ్చు. తమిళం, మలయాళం, తెలుగు అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను కథానాయకిగా నటించారు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన లిజి ఇటీవల భర్త నుంచి విడిపోయి విడాకులు కోరుతూ కోర్టు కెక్కారు. అంతకుముందు ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసి కలకలం సృష్టించారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న లిజి చాలామంది లాగే మళ్లీ నటించడానికి సిద్ధం అవుతారని చాలామంది భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆమె తన స్వీయ చరిత్రను రాసుకుంటున్నారట. దీని గురించి లిజి తెలుపుతూ తన జీవిత చరిత్రలో తన జీవితంలో కలుసుకున్న ప్రముఖ వ్యక్తులు, తానెదుర్కున్న సంఘటనలు, పొందుపరుస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తాను సందర్శించిన ప్రదేశాలు, మరువలేని సంఘటనలు, తన ఇంటర్వ్యూలో చేసుకుంటాయన్నారు. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలు ఉంటాయని చెప్పారు. తన ఈ ఆత్మకథను ఒక ప్రముఖ మలయాళ పత్రిక ప్రచురించనుందని వెల్లడించారు. అనంతరం తన జీవిత చరిత్రను పుస్తకంగా తీసుకురానున్నట్లు చెప్పారు. ఇందులో తాను ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలు లాంటి పలు సంచలన విషయాలు చోటు చేసుకుంటాయని లిజి పేర్కొన్నారు. -
అందుకే...ఆ సినిమా చేయడంలేదా?!
‘ఎంగేజ్డ్’ స్టేటస్ నుంచి ‘ఐయామ్ సింగిల్’కు మారిన త్రిష ఇప్పుడు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సుందర్ సి. దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘అరణ్మణై-2’లో ఓ కథానాయికగా నటించడానికి కూడా అంగీకరించారు. ఈ రెండు చిత్రాలతో పాటు సెల్వరాఘవన్ దర్శక త్వంలోని చిత్రంలో హీరో శింబు సరసన నటించడానికి ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడీ సెల్వరాఘవన్ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారని చెన్నై టాక్.కమలహాసన్, సుందర్. సి చిత్రాలకు ఎక్కువగా డేట్స్ కేటాయించడం వల్లే ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని కొంతమంది అంటున్నారు. కానీ, త్రిష మాజీ ప్రేమికుడు వరుణ్ మణియన్ ఈ చిత్రానికి నిర్మాత కావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలున్నాయి. ఏదైతైనేం.. త్రిష తప్పుకోవడంతో ఆ సినిమా అవకాశం హీరోయిన్ కేథరిన్‌ను వరించిందట.