దేవుడే దిక్కంటే ఎలా? | According to the actress srutihasan godliness. | Sakshi
Sakshi News home page

దేవుడే దిక్కంటే ఎలా?

Published Mon, Dec 5 2016 2:21 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

దేవుడే దిక్కంటే ఎలా?

దేవుడే దిక్కంటే ఎలా?

నాకు దైవభక్తి ఎక్కువ అంటున్నారు నటి శ్రుతిహాసన్. పక్కా మోడ్రన్ అమ్మారుుగా పెరిగిన శ్రుతిహాసన్ ఇలా మాట్లాడడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అందులోనూ ఈ బ్యూటీ తండ్రి కమలహాసన్ పూర్తిగా నాస్తికుడన్న విషయం తెలిసిందే.అలాంటిది మీరెలా ఆస్తికులయ్యారన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ ఇలా చెప్పుకొచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం అన్నది నాకే కలిగింది.ఇది ఎవరో చెప్పడంతో కలిగింది కాదు.దైవభక్తి అన్నదిసాధారణ పరిస్థితికి మించింది. ఒక్క దేవుడినని కాదు అన్ని దేవుళ్లను పూజిస్తాను. అలాగని నా ఇంటిలో దేవుని గది అంటూ ప్రత్యేకంగా ఉండదు. అరుునా ఎలా దేవునిపై నమ్మకం కలిగిందో నాకే తెలియదు. నాకు సమయం దొరికినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ల దైవార్చనలు చేసుకుంటాను.

పుణ్యస్థలాలను దర్శిస్తుంటాను. షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటాను. అరుుతే ఆ ఆలయాల్లో ఏ దేవుడున్నారన్న విషయం గురించి ఆలోచించను. గుడిలో దేవున్ని చూడగానే దండం పెట్టుకుంటాను.అలాగని నేనేమీ కోరుకోను అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. చిన్న చిన్న కోరికలు కోరుకుంటాను. అరుుతే మన బాధ్యతలను విస్మరించకూడదు. ఏమీ చేయకుండా భగవంతుడా అంతా నీదే భారం అని కూర్చోవడం సరికాదు. మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అని అంటున్న నటి శ్రుతిహాసన్ తాజాగా తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో తన తండ్రి కమలహాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement