Srutihasan
-
టఫ్ పోలీస్
రవితేజ పోలీస్ అనగానే ‘విక్రమార్కుడు’ సినిమాలోని టఫ్ పోలీస్ గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పోలీసాఫీసర్‌గా నటించనున్నారు రవితేజ. ఇది రవితేజకు 66వ చిత్రం. గురువారం ఈ చిత్రం ప్రారంభం కానుంది. సరస్వతి ఫిలింస్ డివిజన్‌పై బి. మధు (ఠాగూర్ మధు) నిర్మిస్తున్న ఈ చిత్రానికి గతంలో రవితేజ హీరోగా నటించిన రెండు చిత్రాలకు (డాన్ శీను, బలుపు) దర్శకత్వం వహించిన మలినేని గోపీచంద్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని ముఖ్య పాత్రలు చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్. -
బ్యాలెన్స్ ఉంటే ఏ బ్యాలెన్సూ అక్కర్లేదు
ఎనభై ఏళ్ల వయసొచ్చాక శ్రుతీహాసన్ ఎలా ఉంటారు? ఎలా ఉన్నా.. తెలుగు సినిమాలో మాత్రం ఉంటారు! అంత అఫెక్షన్ శ్రుతీకి తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే. ‘కాటమరాయుడు’ తర్వాత.. మళ్లీ రెండేళ్లకు ఓ తెలుగు సినిమాకు సైన్ చేశారు శ్రుతీహాసన్. ఇప్పటికైతే ఆ వివరాలు సీక్రెట్. శ్రుతీని వెంటనే చూసేయాలని అనుకుంటే మాత్రం.. వచ్చే నెల అమెరికన్ టీవీ చానెల్లో మొదలౌతున్న ‘ట్రెడ్‌స్టోన్’ కోసం రిమోట్ పట్టుకుని కూర్చోవచ్చు. అందులో నీరా పటేల్‌గా శ్రుతి ఓ బ్యాలెన్స్డ్ పాత్రలో నటించారు. అంతకన్నా బ్యాలెన్సింగ్ విషయాలు ‘సాక్షి’కి శ్రుతీహాసన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలానే ఉన్నాయి. లండన్‌లో అమెరికన్ టీవీ సిరీస్ ‘ట్రెడ్ స్టోన్’ షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నట్లున్నారు. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారట.? అవును.. నేర్చుకున్నాను. అమెరికన్ పాపులర్ యాక్షన్ మూవీ ‘ది బోర్న్’ సిరీస్ అధారంగా ఈ టీవీ సిరీస్ చేస్తున్నాం. ఇందులో నేను భారతదేశానికి చెందిన హంతకురాలు నీరా పటేల్ పాత్రలో కనిపిస్తాను. అక్టోబర్ 15 నుంచి అమెరికన్ టీవీ చానల్ యుఎస్ఎ నెట్‌వర్క్‌లో ఈ సిరీస్ ప్రసారం అవుతుంది. ఇందులో నా పాత్ర పెద్ద పెద్ద ఫైట్స్ చేస్తుంది. ఆ ఫైట్స్ కోసమే నాలుగు వారాలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. సినిమా కోసం నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ వ్యక్తిగతంగా కూడా పనికొచ్చేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా నాతో తేడాగా ప్రవర్తిస్తే ఒక్క ‘కిక్’ ఇస్తాను (నవ్వుతూ). ఆడవాళ్లు సున్నితంగా ఉంటారు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ చేయలేరని, నేర్చుకోవడం కష్టం అని అంటుంటారు స్త్రీ శరీరం వేరు. పురుషుడి శరీరం వేరు. మగవాళ్లు బలవంతులుగా ఉండటానికి కారణం ‘టెస్టోస్టెరోన్’ అనే హార్మోన్. ఆడవాళ్లకు ఈ హార్మోన్ లేకపోవడం వల్ల అంత బలంగా ఉండరు. అయితే ఫైట్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని ఎక్కడ తొక్కాలి? ఎంత స్పీడ్‌గా కిక్ చేయాలి? వెనక నుంచి అతన్ని ఎలా పడగొట్టాలి? వంటి టెక్నిక్స్ ఉంటాయి. అవి నేర్చుకుంటే ఎంతటి బలవంతుడితోనైనా స్త్రీ పోరాడగలుగుతుంది. నేనెప్పుడూ చెబుతుంటాను.. అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని. అలా మిమ్మల్ని మీరు రక్షించుకున్న సందర్భం ఏదైనా? ఒకే ఒకటి. నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి నా ఇంట్లోకి చొరబడ్డాడు. అప్పటికి నాకు మార్షల్ ఆర్ట్స్ తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం ఉంది. నిజానికి ఇలాంటివి ఎదురైనప్పుడు కొందరు అమ్మాయిలు ముందు ‘బ్లాంక్’ అయిపోతారు. కానీ ఆ రోజు నేను అతన్ని వేగంగా తోసేసి, బయటకు పారిపోయేలా చేయగలిగాను. హిందీ మూవీ ‘లక్’తో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ ఏడాదికి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా విదేశాల్లో కెరీర్ మొదలుపెట్టడం ఎలా ఉంది? చాలా వేగంగా గడిచిపోయింది. విశేషం ఏంటంటే... పదేళ్ల తర్వాత మళ్లీ న్యూ కమర్గా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో కెరీర్ స్టార్ట్ అయింది. నేను దేవుడిని నమ్ముతాను. నా పట్ల చాలా దయగా ఉన్నాడనిపిస్తోంది. ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా ఇక్కడ నా కెరీర్‌ని బాగా తీసుకెళ్లగలిగాను. ఇప్పుడు ఇంకో రూట్ చూపించాడు. లైఫ్ చాలెంజింగ్‌గా ఉంది. 19 ఏళ్ల వయసులో అమెరికాలో మ్యూజిక్ స్కూల్లో చేరాను. ఆ రోజలు గుర్తొస్తున్నాయి. ‘కాటమరాయుడు’ తర్వాత తెలుగు సినిమా కమిట్ కాలేదు..? నా మ్యూజిక్ బ్యాండ్, ఇంటర్నేషనల్ సిరీస్‌తో బిజీగా ఉండటంవల్ల హీరోయిన్గా కొంచెం గ్యాప్ వచ్చింది. నేను విదేశాల్లో ఉన్నా నాలో ఉన్న సౌత్ గాళ్ అలానే ఉంది. అందుకే సౌత్‌లో రెండు సినిమాలు సైన్ చేశాను. వాటిలో ఒక తెలుగు సినిమా ఉంది. నేను తమిళ అమ్మాయిని అయినా హీరోయిన్గా నాకు స్టార్డమ్ తెచ్చింది ముందు తెలుగు సినిమానే. అందుకే తెలుగు పరిశ్రమకు, ప్రేక్షకులకు నా మనసులో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. నాకు 80 ఏళ్లు వచ్చాక కూడా తెలుగు సినిమాకి అవకాశం వస్తే చేస్తాను. ఇంతకుముందు మాట్లాడుతూ దేవుడు నా పట్ల దయగా ఉన్నాడని అన్నారు. కానీ దేవుడు ఫేవర్ చేయని సమయాల్లో నిందిస్తారా? నెవ్వర్. ఆ పని మాత్రం చేయను. ఎందుకంటే దేవుడు కష్టాలు ఇచ్చాడంటే ముందు ముందు మంచి ఇవ్వడానికే అని నమ్ముతాను. కొంతమంది లైఫ్‌ని చూస్తే.. పేదవాళ్లు ఎప్పటికీ పేదవాళ్లలా మిగిలిపోరు. మంచి మార్పొస్తుంది. జీవితంలో నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం అది. ఏదో జరిగిందని దేవుడిని నిందించడం కాదు. వాటిని ఎదుర్కొని నిలబడే పవర్ మనకి ఇచ్చాడు. దాన్ని ఉపయోగించకుండా దేవుడిని నిందిస్తే ఏం లాభం? జీవితం ఇంకా మీకేం పాఠాలు నేర్పించింది? మొత్తం ప్రపంచాన్ని చూస్తే ఏదీ స్టేబుల్ కాదు. భూమి, సూర్యుడు, చంద్రుడు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. బ్యాలెన్స్ అనేది లేదు. అందుకే మనం లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చెబితే నవ్వుతారేమో కానీ ఈ మధ్య నేనో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. ఒక సగం బంతి మీద ఒక కాలు పెట్టి, ఇంకో కాలితో గాల్లో నిలబడుతూ, పడిపోకుండా నన్ను నేను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మామూలుగా ఒక కాలు మీద నిలబడటమే కష్టం. అలాంటిది ఆ కాలు కింద బంతి పెట్టుకుని బ్యాలెన్స్ చేయడం అంటే ఇంకా కష్టం. కానీ నేను అచీవ్ చేయగలుగుతున్నాను. త్వరలో రెండు కాళ్లతో బంతి మీద నిలబడి, పడకుండా ప్రాక్టీస్ మొదలుపెడతాను. అంత ఏకాగ్రతతో బ్యాలెన్స్ చేయగలిగితే మనం లైఫ్‌లో అన్నింటినీ బ్యాలెన్స్ చేయగలుగుతాం అని నా నమ్మకం. అసలు మన జాబ్ ఏంటంటే ‘లైఫ్‌ని బ్యాలెన్స్’ చేయడమే. అయితే మనం చాలామంది లైఫ్‌లో బ్యాలెన్డ్స్‌గా ఉండాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుందనుకుంటాం. మీరూ అలా ఆలోచించిన సందర్భాలు ఉన్నాయా? యస్. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలని నేనూ అనుకున్న రోజులు ఉన్నాయి. నేను కూడా తప్పులు చేశాను. టూ మచ్‌గా ఖర్చు పెట్టేదాన్ని. డబ్బులు కోసమే పని చేశాను. కానీ ఆత్మసంతృప్తి దొరకలేదు. హ్యాపీగా ఉండటానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే సరిపోదని అప్పుడు అర్థమైంది. అయితే నాతో పాటు ఉన్న హీరోయిన్లతో పోల్చితే డబ్బు సంపాదనలో నేను చాలా వీక్. నేను అంత స్మార్ట్ కాదు. మనీ మేకింగ్ క్వాలిటీ నాకు లేదు. యాక్చువల్‌గా మీ నాన్నగారు కూడా ఈ విషయంలో స్మార్ట్ కాదని అంటుంటారు.. నాన్నగారు సినిమాల్లో సంపాదించింది సినిమాల్లోనే పెడుతుంటారు. మామూలుగా ఎవరైనా అయితే ప్రాపర్టీస్ కొంటారు. కానీ నాన్నగారు రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బేనర్ పెట్టి, సినిమాలు నిర్మిస్తుంటారు. ఆయనకు సినిమాలంటే ప్రేమ. మరి.. మాకేమైనా మిగుల్చుతారా? ప్రాపర్టీలో మా షేర్ ఎంత? అని మీరు, మీ చెల్లెలు అడిగిన సందర్భాలేమైనా? (నవ్వేస్తూ). మా చైల్డ్‌హుల్డ్ చాలా కంఫర్టబుల్. నాన్నగారు మమ్మల్ని చెన్నైలో మంచి స్కూల్లో చదివించారు. ఆ తర్వాత అమెరికాలో బెస్ట్ కాలేజీలో చేర్చారు. మంచి ఫుడ్, మంచి బట్టలు, ఖరీదు గల కార్లు, మంచి ఇల్లు... ది బెస్ట్ ఇచ్చారు. 21 ఏళ్లకే నేను హీరోయిన్ అయి, సంపాదించడం మొదలుపెట్టాను. అప్పటినుంచి నాన్నగారి దగ్గర్నుంచి డబ్బులు తీసుకోవడం మానేశాను. ఇంతవరకూ నాన్నగారిని ప్రాపర్టీలో నా షేర్ ఏంటి? అని అడగలేదు. ఎందుకంటే నాకు కావాల్సిన ఆస్తులను నేనే సంపాదించుకుంటాను. రేపు నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాను. తల్లిదండ్రులు ఇచ్చేవి ఇస్తారు. కానీ మన ప్రయత్నం ఉండాలి. ఫైనల్లీ.. ఇన్ని విషయాలు ఫ్రాంక్‌గా చెప్పారు. మరి.. మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన విషయం గురించి మాట్లాడతారా? లైఫ్‌లో ఓపెన్‌గా ఉండాలనే విషయం నా ఫస్ట్ రిలేషన్షిప్ ద్వారా తెలుసుకున్నాను. మొట్టమొదటిసారి నేను రిలేషన్లో ఉన్నప్పుడు ఆ విషయం బయటకు చెప్పడానికి భయపడ్డాను. ఎవరైనా ఏమైనా తప్పుగా అనుకుంటారేమో? అని భయం. ఆ రిలేషన్ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు మళ్లీ ఓ బంధం ఏర్పడింది. ఈసారి ఎందుకు బయటకు చెప్పకూడదు? అనిపించింది. అవును.. ఓ స్పెషల్ రిలేషన్ ఉన్నానని బయటకు చెప్పేశాను. నేనలా ఫ్రాంక్‌గా చెప్పడాన్ని చాలామంది మెచ్చుకున్నారు. జీవితాంతం కొనసాగించాలనే ఏ బంధాన్నయినా మొదలుపెడతాం. అది కుదరనప్పుడు ఏం చేయగలం? ఆ బంధం మొదలైనందుకు హ్యాపీ ఫీలయ్యాను. ముగిసిపోయనప్పుడూ ఆనందపడ్డాను. నా ఆలోచన చాలా ప్యూర్‌గా ఉంది. ఆ రిలేషన్‌కి నేను నా బెస్ట్ ఇచ్చాను. కానీ వర్కవుట్ కాలేదు. లైఫ్‌లో ఇలాంటివి చాలామందికి ఉంటాయి. విఫలమవుతున్న వివాహ బంధాలను కూడా చూస్తున్నాం కదా. ఏదీ మన చేతుల్లో ఉండదు. లైఫ్ ఎలా తీసుకెళితే అలా వెళ్లడమే. కానీ మన ఆలోచనలు, చేసే పనులు ‘ప్యూర్’గా ఉండాలి. – డి.జి. భవాని ఇటీవల మీ నాన్నగారు నటుడిగా 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆ విషయం గురించి? నేను ఈ మధ్య హీరోయిన్గా 10 ఇయర్స్ కంప్లీట్ చేశాక ‘పదేళ్లు కంప్లీట్ చేశారు. నాట్ ఎ జోక్. చాలా సాధించారు’ అని లండన్‌లో అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నాన్నగారు 60 ఏళ్లు పూర్తి చేశారని తెలిసి, ‘వావ్... 60 ఇయర్స్.. గ్రేట్’ అన్నారు. నిజమే.. 60 ఏళ్ల కెరీర్ ముందు 10 ఏళ్లు ఎంత? ఎంతో డెడికేషన్ ఉండబట్టే నాన్నగారు ఇన్నేళ్లు ఉండగలిగారు. నాకు లైఫ్‌లో ఇన్స్పైరింగ్ పర్సన్ అంటే నాన్నగారే. ఆయనకు భయం అనేది తెలియదు. సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందున్నారు. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లారు. రాజకీయాలు అంత ఈజీ కాదు. అయినా వెళ్లారు. చిన్నప్పటినుంచీ నాన్న ధైర్యం చూస్తూ పెరిగాను కాబట్టి నాకు భయం తక్కువ. పదేళ్లు ఇక్కడ సినిమాలు చేసి, హఠాత్తుగా అమెరికాలో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. ఏమవుతుందో ఏంటో అని భయపడితే ఇంతదాకా వచ్చేదాన్ని కాదు. అసలు నా ఫీలింగ్ ఏంటంటే.. లైఫ్‌లో చాలామంది ‘భయం’ వల్ల ఏదీ సాధించకుండా మిగిలిపోతుంటారు. ఇప్పుడు మన దేశీ స్టార్స్ చాలా మంది వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. మీక్కూడా ఆ ఐడియా ఉందా? డెఫినెట్‌గా చేస్తాను. నా ఫోన్లో నెట్‌ఫ్లిక్స్, అమేజాన్, ఊట్.. ఇలా అన్ని యాప్స్ ఉన్నాయి. ట్రావెల్ చేస్తున్నప్పుడు దాదాపు అన్ని సిరీస్‌లను చూస్తాను. ఇండియన్ షోస్‌లో నాకు ‘సాక్రెడ్ గేమ్స్’ అంటే చాలా ఇష్టం. మంచి స్క్రిప్ట్, రోల్ దొరికితే తప్పకుండా వెబ్ సిరీస్ చేస్తాను. స్లిమ్ అయ్యారు? ఒక కారణం మార్షల్ ఆర్ట్స్. నిజానికి మార్షల్ ఆర్ట్స్ అంటే ఎవరినో కొట్టడానికి నేర్చుకునేది కాదు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి మీతో మీరు ఫైట్ చేయడానికే మార్షల్ ఆర్ట్స్. ఈ ఆర్ట్స్ వల్ల నాకు లైఫ్‌లో చాలా ఫోకస్ వచ్చింది. మరి డైట్ సంగతి? దేవుడు మనకు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. సలాడ్స్ తింటూ కూర్చుంటే ఏం బాగుంటుంది? లైఫ్ బోర్ కొట్టేస్తుంది. అందుకని అన్నీ బాగా తింటాను. బాగా వర్కవుట్స్ చేస్తాను. ఇండియాలో స్టార్ హీరోయిన్ అనిపించుకుని, విదేశాల్లో కొత్త ఆర్టిస్ట్ అనిపించుకోవడం ఎలా ఉంది? ఒక న్యూ కమర్ ఎలా కష్టపడతారో అలానే పడుతున్నాను. ఒక విషయంలో మాత్రం చాలా రిలీఫ్‌గా ఉంది. ఎందుకంటే ‘మీ నాన్నగారు కమల్‌హాసన్ కదా.. మీ అమ్మ సారిక కదా. వాళ్లు గొప్ప ఆర్టిస్టులు’ అంటూ పోలిక పెట్టేవాళ్లు ఇక్కడ లేరు. కానీ మన దగ్గర వేరే విధంగా ఉండేది. తల్లీతండ్రిలా మంచి పేరు తెచ్చుకుంటుందో? లేదో అనేవారు. నా మీద నాకు నమ్మకం ఉన్నప్పటికీ నాన్న లాంటి లెజెండ్రీ ఆర్టిస్ట్‌తో పోల్చినప్పుడు చాలా భయం అనిపించేది. బయటకు మాత్రం మామూలుగా ఉండేదాన్ని. కంపేరిజన్ అనేది మన దగ్గర ఎప్పుడూ ఉంటుందేమో? ఎందుకు అలా అంటున్నానంటే ‘శ్రీమంతుడు’ రిలీజయ్యాక ‘చాలా బాగా నటించారు’ అంటూనే ‘మీ నాన్నగారు ‘స్వాతిముత్యం’ సినిమాలో ఎంతో బాగా నటించారు’ అన్నారు ఒక వ్యక్తి. నాకు నవ్వాగలేదు. నాన్న ఎక్కడ? నేను ఎక్కడ? అయితే లండన్‌లో ‘శ్రుతి ఎలా యాక్ట్ చేస్తోంది? తను ఎంత టాలెంటెడ్’ అని మాత్రమే చూస్తున్నారు. దాంతో కొంచెం స్వేచ్ఛ దొరికినట్లుగా ఉంది. -
శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్
కుందనపు బొమ్మలే కాదు..ఇప్పుడు బొమ్మా బొరుసూ కూడా.బొమ్మ తయారవ్వడానికి కావాల్సి నంత లక్ష్మిని కటాక్షిస్తున్నారు.ఇదిగో వచ్చారు.. శ్రీశ్రీశ్రీ లేడీ ప్రొడ్యూసర్స్. పారితోషికం తీసుకోవడమే కాదు.. ఇస్తాం కూడా అంటున్నారు అందాల నాయికలు. నటన మీద ఆసక్తితో సిల్వర్ స్క్రీన్ కనపించడంతో పాటు మేకింగ్ మీద ఇంట్రస్ట్‌తో నిర్మాతలుగా మారుతున్నారు. కథానాయికలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం ఏం కాదు. కొత్తగా ఈ తరంలో కొందరు కథానాయికలు తమ పేర్లను రిజిష్టర్ చేయించుకున్నారు. అలా నిర్మాతలుగా అడ్వాన్సులు ఇవ్వడానికి సిద్ధపడిన ప్రొడ్యూసరమ్మల గురించి తెలుసుకుందాం. సినిమాలు లేక కాదు సౌత్‌లో కథానాయికగా కాజల్ సూపర్ సక్సెస్. ‘మగధీర, బృందావనం, డార్లింగ్, మిస్టర్ ఫర్పెక్ట్, బిజినెస్‌మేన్, తుపాకీ’ ఇలా... చెప్పుకుంటూ పోతే కాజల్ కథానాయికగా నటించిన హిట్టు సినిమాల లిస్ట్ పెద్దదే. రెండేళ్ల క్రితం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో నాయికగా 50వ చిత్రం మైలురాయిని కూడా చేరుకున్నారు. ఇండస్ట్రీలో ఇంత సాధించిన కాజల్ ఇక ప్రొడ్యూసర్‌గా సత్తా చాటాలనుకుంటున్నారు. అందుకే ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గతేడాది ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ సినిమాకు కాజల్ నిర్మాతగా మారనున్నారని సమాచారం. 50 సినిమాలు చేసింది కదా.. ఇక హీరోయిన్గా అవకాశాలు లేక నిర్మాతగా మారుతుందేమో అనుకుంటున్నారా? అంటే అలాంటిదేం లేదండీ బాబు. కాజల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. నటిగా ప్రస్తుతం ఆరేడు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. మనసు గెలవాలని.. ఇండస్ట్రీలో తాను సంపాదించిన సొమ్మును ఇండస్ట్రీలోనే పెడుతున్నందుకు రొంబ (చాలా) హ్యాపీ అని అమలాపాల్ అంటున్నారు. అవును... ఆమె నిర్మాతగా మారారు. అనూప్ ఫణిక్కర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తమిళంలో ‘కడవేర్’ అనే ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూనే నిర్మాతగాను వ్యహరించేందుకు రెడీ అయ్యారు అమలాపాల్. కేరళ పోలీస్ శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ జీవితంలో జరిగిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఫోరెన్సిక్ పాథాలజిస్ట్‌గా నటిస్తున్నారు అమలాపాల్. ఆడియన్స్ మనసు గెలుచుకునే స్క్రిప్ట్ కాబట్టి ఈ చిత్రం ద్వారా నిర్మాతగా కూడా వారి మనసు గెలవాలనుకుంటున్నాని అమలా పాల్ పేర్కొన్నారు. ఇటు హీరోయిన్‌గానూ ఆమె కెరీర్ ఫుల్ రైజింగ్లోనే ఉంది. తండ్రి బాటలో... కమల్‌హాసన్ కూతురిగా శ్రుతీహాసన్ ఇండస్ట్రీకి పరచయం అయ్యారు కానీ తక్కువ కాలంలోనే తానేంటో ప్రూవ్ చేసుకుని సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు శ్రుతీహాసన్. కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు వీలైనప్పుడు సంగీతంలోనూ తన ప్రావీణ్యతను చాటుతున్నారు శ్రుతి. కొత్త కథలను, కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించడానికి ఆమె నిర్మాతగా మారారు. 2017లో తమిళంలో ‘లెన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి ప్రశంసలు అందుకున్నారు జయప్రకాష్ రా«ధాకృష్ణన్. ఆ తర్వాత ‘ది మస్కిటో ఫిలాసఫీ’ అనే సినిమా తీశారు. ఈ సినిమా చూపి ఇంప్రెస్ అయిన శ్రుతీహాసన్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇలా నిర్మాతగా మారారు. ఇదిలా ఉంటే.. కమల్హాస రాజ్ కమల్ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బేనర్‌పై సినిమాలు నిర్మిస్తుంటారని తెలిసిందే. చిన్నప్పటి నుంచి తండ్రిని చూశారు కదా. అలా యాక్టింగ్, ప్రొడక్షన్‌ను రెంటినీ బ్యాలెన్స్ చేస్తూ శ్రుతీ తండ్రి బాటలో నడుస్తున్నట్లున్నారు. డైరెక్షన్ మారింది డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా టాప్ యాక్టర్స్ అందరూ ఎంటర్టైనింగ్ డిజిటల్ సెక్టార్ వైపు కన్నేశారు. ఈ జాబితాలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ కూడా ఉన్నారు. కానీ యాక్టింగ్ పరంగా కాదు. నిర్మాతగా. 2010లోనే ‘గోవా’ అనే సినిమాను నిర్మించిన సౌందర్యా రజనీకాంత్ తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్రముఖ తమిళ నవల ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ‘కొచ్చాడియన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన సూర్యప్రతాప్ దర్శకుడు. అన్నట్లు ‘కొచ్చాడియన్’ సినిమాకు సౌందర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బావ ధనుష్ హీరోగా ‘వీఐపీ 2’ చిత్రానికి దర్శకత్వం వహించారు సౌందర్య. అయితే దర్శకురాలిగా రెండు వైఫల్యాలను చవిచూడటంతో నిర్మాణం వైపు డైరెక్షన్ మార్చారేమో! హిందీ హిట్ ‘క్వీన్’ చిత్రం సౌత్‌లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు పరుల్ ఒక నిర్మాతగా ఉన్నారు. కన్నడ రీమేక్ ‘బటర్‌ఫ్లై’లో పరుల్ యాదవ్ కథానాయికగా నటించారు. విశేషం ఏంటంటే.. ‘క్వీన్’ సౌత్ రీమేక్లన్నింటికి సహ–నిర్మాతల లిస్ట్‌లో కన్నడ బ్యూటీ పరుల్ యాదవ్ పేరు ఉంది. సో... పరుల్ కూడా ప్రొడక్షన్లోకి వచ్చినట్లే. టాలీవుడ్లో సమంత ఎంత పెద్ద స్టార్ హీరోయిన్నో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే... డైరెక్షన్ పట్ల తనకు పెద్దగా ఆసక్తి లేదని భవిష్యత్‌లో నిర్మాణ రంగంవైపు దృష్టి పెట్టాలనే ఆలోచన మాత్రం ఉందని ఓ సందర్భంలో సమంత చెప్పుకొచ్చారు. అలాగే మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక కొణిదెల కూడా ప్రొడక్షన్వైపు తనకు ఆసక్తి ఉందన్నారు. ఆల్రెడీ వెబ్ సిరీస్‌లను ప్రొడ్యూస్ చేస్తున్నానని, భవిష్యత్‌లో సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసే ఆలోచన ఉందని ఇటీవల చెప్పారు. చార్మింగ్ ప్రొడ్యూసర్ తెలుగుతెరపై కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్నారు నటి చార్మీ. ‘మాస్, అనుకోకుండా ఒకరోజు, మంత్ర’ వంటి హిట్ చిత్రాలు కథానాయికగా ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. ఆ తర్వాత హీరోయిన్గా కెరీర్లో కాస్త స్లో అయ్యారు. కానీ నిర్మాతగా జోరు పెంచారు చార్మీ. ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాల (రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ఆకాశ్ పూరి ‘రొమాంటిక్’) నిర్మాణాన్ని చూసుకుంటూ ‘చార్మింగ్ ప్రొడ్యూసర్’ అనిపించుకుంటున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పూరీ కనెక్ట్స్‌తో కలిసి ఆమె ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. 2017లో వచ్చిన ‘రోగ్’ సినిమాకు తొలిసారి కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘పైసా వసూల్, మెహబూబా’ సినిమాలకు కూడా ఆమె నిర్మాణ బాధ్యతలను నిర్వహించారు. ఆ అనుభవంతో ఒకేసారి ‘ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్’ చిత్రాల నిర్మాణాన్ని చాకచక్యంగా చూసుకుంటున్నారని చెప్పొచ్చు. బాలీవుడ్లో అగ్రకథానాయికలుగా ఎదిగిన ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేసి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ‘వెంటిలేటర్’ అనే చిత్రానికి ప్రియాంకా చోప్రా అయితే నిర్మాతగా జాతీయ అవార్డును కూడా తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ నిర్మాతగా మారారు. ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘రాజీ’ ఫేమ్ మేఘన్ గుల్జార్ దర్శకత్వంలో ‘చప్పాక్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మి పాత్రలో దీపికా పదుకోన్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే నిర్మాతగా మారారు దీపికా పదుకోన్. ఇక ఇప్పుడిప్పుడే నటిగా పైకొస్తున్న స్వరా భాస్కర్ కూడా నిర్మాతగా మారారు. ‘‘తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, ఎక్స్: పాస్ట్ అండ్ ప్రజెంట్, వీరే ది వెడ్డింగ్’’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు స్వర. ఆమె తన తమ్ముడు ఇషాన్ భాస్కర్‌తో కలిసి ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. కొత్త కథలను, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికే నిర్మాతగా మారాను అని స్పష్టం చేశారు స్వరాభాస్కర్. మరో యువనటి రీచా చద్దా కూడా నిర్మాతల జాబితాలో చేరారు. ఫుక్రే, మసాన్ వంటి సినిమాల్లో నటించిన రీచా చద్దా ఇటీవల షకీలా బయోపిక్‌లో నటించారు. ‘‘హీరోయిన్లు కెమెరా ముందు నటించడానికి మాత్రమే కాదు. డైరెక్షన్, రైటింగ్, ప్రొడక్షన్ ఇలా అన్ని క్రాఫ్ట్స్‌లో సత్తా చాటగలరు’’ అని రీచా పేర్కొన్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్ కూడా ప్రొడక్షన్ ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ కథానాయికగా ఉన్న కంగనా ఇటీవల ‘మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రంలో కొన్ని సన్నివేశాల కోసం మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. అలాగే కన్ఫార్డ్మ్గా చెప్పలేదు కానీ సోనమ్ కపూర్, ఆలియా భట్ కూడా భవిష్యత్‌లో ప్రొడక్షన్ వైపు అడుగులు వేసే ప్లాన్‌లో ఉన్నట్లు మాత్రం చెబుతున్నారు. – ముసిమి శివాంజనేయులు -
ప్రేమ కుట్టింది
టాలీ, కోలీ, బాలీ.. అన్ని వుడ్లనూ దాటిలవేరియా అన్ని అడవు(డ్)లకూ పాకింది.గుయ్.. గుయ్ మంటూ..ఈ వుడ్డునుంటావా, ఆ వుడ్డునుంటావాఅని అడిగేవరకూ ఆగడం లేదు. పడవెక్కి ప్రేమవుడ్డుకు.. సారీ.. ప్రేమఒడ్డుకుసాగిపోతోంది. అన్ని వుడ్‌ల ప్రేమా ఫలించాలి. స్క్రీన్ మీద లవ్‌బర్డ్స్‌కి లైఫ్‌లో కూడా లవ్ వైరస్ సోకితే.. అభిమానులు, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ వాక్సిన్ వేసుకుంటారు. అలా లవేరియాతో అయిదు జంటలు ఎంజాయ్ చేస్తున్నాయి. ఎవరో తెలుసుకోండి... పండగ చేసుకోండి ‘వాలెంటైన్స్‌డే’ను. ఆ దేవుడే పంపాడు ఈ సంక్రాంతికి విశాల్ తన పెళ్లిని కన్ఫార్మ్ చేశారు. అనీషా ఆళ్ల అనే హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారాయన. అనీషా కూడా నటే. ‘పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి’ చిత్రాల్లో ఆమె నటించారు. ‘‘అనీషాతో నా పరిచయం పెళ్లివరకు వెళ్తుందని ఊహించలేదు. తనలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నాయి. తను బాస్కెట్‌బాల్ నేషనల్ ప్లేయర్. సోషల్ వర్కర్ కూడా. మా పెళ్లి అయ్యాక అనీషా సినిమాలు మానేస్తుందని నేను చెప్పలేను. ఆమెను దేవుడే నా కోసం పంపాడు’’ అని విశాల్ అంటారు. విశాల్, అనీషా నిశ్చితార్థం మార్చిలో జరగనుందట. పెళ్లి ఆగస్టులో జరగనుందని టాక్. పెళ్లి కబురు ఎప్పుడొస్తుందో! కోలీవుడ్‌లో ప్రేమపక్షులు అంటే నయనతార, విఘ్నేష్ శివన్లే. లేటెస్ట్గా ఆర్య, సాయేషాల పేర్లూ టైటిల్ కార్డ్స్‌లో చేరాయి. ఈ ఇద్దరూ కలిసి ‘గజనీకాంత్’ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా టైమ్‌లోనే ఈ ఇద్దరి మీద కాదల్ (ప్రేమ) క్లాప్ కొట్టిందట. ఇప్పుడు సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ సినిమాలో సాయేషా కథానాయికగా నటిస్తుండగా, ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అతి త్వరలో ఆర్య, సాయేషాల వివాçహానికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చనే వార్త వైరల్ అయింది తమిళ సినీ పరిశ్రమలో. ఫొటోలతో కన్ఫార్మ్ బాలీవుడ్ కూడా లవ్ ఫ్లూతో ఫ్లేమ్ అవుతోంది. నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్, నటి షిబానీ దండేకర్ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వినపడుతోంది. సోషల్ మీడియాలో కనపడుతోంది కూడా. గతేడాది అక్టోబర్‌లో ఫర్హాన్ అఖ్తర్, షిబానీ ఇద్దరూ ఒకేఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫర్హాన్ లవ్ సింబల్‌ను జతపెట్టి మరీ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి లవ్‌కి కన్ఫర్మేషన్ వచ్చినట్టయింది. ‘‘మీరు ఫర్హాన్‌తో ప్రేమలో ఉన్నారా?’’ అని షిబానీని అడిగితే ‘‘మేం పోస్ట్ చేసే ఫొటోలను బట్టే అందరూ అర్థం చేసుకోవాలి’’ అని జవాబు ఇచ్చారు. దాంతో ఈ ఏడాదే వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకోనున్నారని బాలీవుడ్లో ఒకటే హోరు. రోహ్మాన్తో ప్యార్ మే 1994 మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ ఇప్పుడు సినిమాల్లో రేర్ అయినా పబ్లిసిటీలో జోరుగా ఉన్నారు... రోహ్మన్ షాల్ అనే వ్యక్తితో లవ్‌లో పడి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ఈ జంట వేసిన స్టెప్స్ సూపర్ హిట్. ‘రోహ్మాన్తో ప్యార్ మే’ కదా అంటే సుష్మితా నవ్వుతున్నారు. ‘మీ పెళ్లెప్పుడు?’ అంటే మాత్రం ‘నా పెళ్లి విషయం మీకెందుకు’ అంటూ మండిపడతున్నారట. కానీ మీడియాలో అయితే వీళ్లిద్దరూ ఈ ఏడాది వివాహం చేసుకోబోతున్నారనే న్యూస్ స్ట్రీమ్ అవుతోంది. సుష్మితా సేన్‌కు రినీ సేన్, అలీసా సేన్ అనే ఇద్దరు దత్తపుత్రికలు ఉన్న సంగతి తెలిసిందే. లవ్ ఫర్ హార్లిన్ ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్’తో 200 కోట్ల క్లబ్లో చేరాడు విక్కీ కౌశల్. పర్సనల్ లైఫ్‌ను లవ్ క్లబ్లో రిజిష్టర్ చేయించుకున్నాడు. హార్లిన్ సేథి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పారు విక్కీ. ‘‘కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ పార్టీలో హార్లిన్ను కలిశాను. లాస్ట్ ఇయర్ నుంచే తనతో డేటింగ్లో ఉన్నా. ఒకరినొకరం తెలుసుకుంటున్నాం. మా రిలేషన్ బాగుంది’’ అని చెప్పారు విక్కీ కౌశల్. మొహబ్బతే... తాప్సీ–మాథ్యాస్ బో, శ్రుతీహాసన్ – మైఖేల్ కోర్సలే, ఇలి యానా –ఆండ్రూ నీబోన్, నటాషా దలాల్–వరుణ్‌ధావన్, ఆలియా భట్–రణ్‌బీర్ కపూర్, రియా కపూర్–కరణ్ బులానీ, టైగర్ ష్రాఫ్–దిశా పాట్నీ... ఈ జంటలు ప్రేమలో మునిగి ఉన్నట్లు వాళ్ల తీరు స్పష్టం చేస్తోంది. వీళ్ల ప్యార్ ఈ యేడాదైనా మ్యారేజ్ టేక్ తీసుకుంటుందా? చూడాలి! ఇంతకీ ఇక్కడ ప్రస్తావించిన జంటల్లో రియా కపూర్ ఎవరో అనుకునేరు... ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తె, నటి సోనమ్‌కపూర్ సోదరే రియా. రింగులు మార్చుకున్నారు నిశ్చితార్థంతో సగం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కథానాయికలూ ఉన్నారు. జో అనే వ్యక్తితో రిచా గంగోపాధ్యాయ, జార్జ్ పానాయియోటోన్తో అమీ జాక్సన్, గుణ జక్కాతో అనీషా అంబ్రోస్లకు ఎంగేజ్మెంట్ అయింది. వీళ్ల పెళ్లి తేదీలు ఇంకా ఖరారు కాలేదు. జతకూడేనా? టాలీవుడ్లో ప్రేమ, పెళ్లి టాపిక్స్ వస్తే చాలు వెంటనే ప్రభాస్, రానా గుర్తొస్తారు. వీరితోపాటు వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్, నిఖిల్, విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్, అఖిల్, నాగశౌర్య, రాజ్ తరుణ్ వంటి హీరోల స్టేటస్ సింగిల్‌గానే ఉంది. వచ్చే ప్రేమికుల రోజుకైనా వీరికి వాళ్ల వేలెంటైన్ దొరికేనా.. జత కూడేనా? కాలం కాదల్‌తో జవాబిస్తుందేమో చూద్దాం! ప్రేమించు.. పెళ్లాడు ఇటీవల ప్రేమ వివాహలు చేసుకున్న జంటలు చాలానే ఉన్నాయి. మలయాళ నటి భావన.. నిర్మాత నవీన్‌ను, శ్రియ తన ప్రేమికుడు అండ్రూ కృశ్చేవ్‌ను, కలర్స్ స్వాతి పైలట్ వికాస్‌ను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు నటి శ్వేతాబసు ప్రసాద్ గత డిసెంబర్ 13న పుణేలో రోహిత్ మిట్టల్‌కు జీవితభాగస్వామి అయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె , దర్శక, నిర్మాత సౌందర్యా రజనీకాంత్ వ్యాపారవేత్త విశాగన్ వనంగాముడిని వివాహమాడారు. ఇక బీటౌన్ పెళ్లిళ్ల వైపు వెళితే.. దీప్‌వీర్‌ల (దీపికా పదుకోన్–రణ్వీర్ సింగ్) ఇటలీలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒకింటి వారయ్యారన్నది సినీ అభిమాన జగమెరిగిన సత్యం. ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్ (నిక్యాంక)లు కూడా గత డిసెంబర్ 1, 2 తేదీల్లో రాజస్థాన్‌లోని జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 1న క్రిస్టియన్ స్టైల్లో, డిసెంబర్ 2న నార్త్ ఇండియన్ స్టైల్లో ఆ పెళ్లి వేడుకలు జరిగాయి. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాల వెడ్డింగ్ పంజాబ్ స్టైల్లో గత మే 8న జరగింది. సోనమ్ కపూర్ పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత మే 10న నేహా« «ధూపియా, అంగద్ బేడీల పెళ్లి అయింది. నటుడు మిలింద్ సోమన్, అంకిత కోన్వార్.. ఏప్రిల్ 22న మహారాష్ట్రియన్ వివాహ పద్ధతిలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దర్శక–నిర్మాత దినేష్ విజన్ దుబాయ్‌కి చెందిన ప్రమీత తన్వర్‌ను, బాలీవుడ్ నటుడు, కమెడియన్ కపిల్ శర్మ.. గిన్ని చత్రాథ్ను పరిణయమాడారు. వీరితో పాటు హిందీ బుల్లితెర నటీనటులు కొందరు గతేడాది మ్యారీడ్ లైఫ్‌కు శ్రీకారం చూట్టారు. -
ఆ కల నిజమయ్యింది!
తన చిరకాల కోరిక నెరవేరిందన్న ఆనందంలో తేలిపోతున్నారు నటి శ్రుతీహాసన్. సినిమాల్లోకి రాక ముందు నుంచే శ్రుతి సంగీత కళాకారిణి అన్న విషయం తెలిసిందే. తన తండ్రి కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన ‘ఉన్నైపోల్ ఒరువన్’ చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలిగా పని చేశారు. ఆరేళ్ల ప్రాయం నుంచే సంగీత సాధన చేస్తోన్న శ్రుతి ప్రస్తుతం నటిగా, నిర్మాతగా, సంగీత కళాకారిణిగా భిన్న రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవల సినిమాల నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నా.. మళ్లీ నటనపై దృష్టి సారించారు శ్రుతి. ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తున్న శ్రుతీహాసన్ మరో వైపు సంగీతంపై కూడా దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా సంగీత ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటుకున్న శ్రుతి.. ఇటీవలే లండన్‌లో సంగీత కచేరి చేయాలన్న తన కలను నిజం చేసుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత ‘ట్రవ్‌బడూర్’ అనే ప్రాంగణంలో సంగీత కచేరిని నిర్వహించారు శ్రుతి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం విడుదల కావాల్సిన తన చిత్రాల్లోని పాటలను పాడి లండన్‌వాసులను అలరించారు. 1954లో కాఫీ హౌస్‌గా ప్రారంభమైన ట్రవ్‌బడూర్ ప్రస్తుతం ప్రపంచ ఖ్యాతి గాంచిన సంగీత ప్రాంగణంగా అవతరించింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత సంగీతదర్శకులైన బాబ్ డిలన్, ఎల్టన్ జాన్, అదేలి, ఎడ్ షీరన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై సంగీత ప్రదర్శనలను ఇచ్చారు. ఈ వేదికపై సంగీత ప్రదర్శన ఇవ్వాలని కలలు కన్న శ్రుతి.. దాన్ని నిజం చేసుకున్నారు. అదే విధంగా గత ఏడాది ఆగస్ట్ 15న న్యూయార్క్‌లోని మెడిషన్ అవెన్యూలో ‘ది ఇండియన్ డే పేరడే’ పేరుతో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో శ్రుతీహాసన్ వందేమాతరం ప్రదర్శనను ఇచ్చి ఆ దేశ పత్రిక హెడ్‌లైన్స్‌లో నిలవడమే కాక.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇదేకాక సెప్టెంబర్‌లో లండన్‌లోని ‘ది నెడ్’ ప్రాంతంలో నిర్వహించిన మరో సంగీత కచేరి కూడా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఈ సంగీత కార్యక్రమాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతూ సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తున్నాయి. -
టాటూలతో తిప్పలే!
మణికట్టుపై ఒకటి... చెవి వెనక ఒకటి... వీపుపై ఇంకొకటి... కాలి మీద మరొకటి... భుజంపై మళ్లీ ఒకటి... మొత్తంగా ఒంటిపై ఐదు పచ్చబొట్లు పొడిపించుకున్నారు శ్రుతీహాసన్. ఇప్పుడు సై్టలుగా ‘టాటూలు’ అంటున్నారు కదా... పచ్చబొట్లంటే అవే. ఈ ఐదింటికి తోడుగా మీ ఒంటిపై ఆరో పచ్చబొట్టు ఎప్పుడు చేరుతుంది? ఇంకో టాటూ ఎప్పుడు వేయించుకుంటారు? అని శ్రుతీని అడిగితే... ‘‘ఇక చాలు! ఈ ఐదు టాటూలు వేయించుకున్నందుకు చాలా బాధపడుతున్నా. ముఖ్యంగా మణికట్టుపై టాటూతో అయితే మరీ ఎక్కువ బాధపడుతున్నా. దీన్ని కవర్ చేయడానికి టూ మచ్‌గా మేకప్ వేసుకోవలసి వస్తుంది’’ అన్నారు. హీరోయిన్లకు టాటూలతో ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట. -
అందుకే తప్పుకున్నా!
‘‘ఈ సినిమా కోసం ఫిజికల్‌గానే కాదు.. మెంటల్‌గా కూడా చాలా ప్రిపేర్ అవుతున్నా. కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ చెప్పి నెల రోజులు కూడా కాలేదు. ఈలోపు ఆమె ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సినిమా ఏదో ఊహించే ఉంటారు. ‘సంఘమిత్ర’. శ్రుతీహాసన్ లీడ్రోల్లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సుందర్.సి రూపొందించనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రిలీజ్ చేశారు. శ్రుతి కూడా అక్కడకు వెళ్లారు. అలాంటిది ఈ సినిమా నుంచి ఆమె ఎందుకు తప్పుకున్నారు? ‘‘పూర్తి బౌండ్ స్క్రిప్ట్ అందజేయకపోవడం, షూటింగ్ షెడ్యూల్స్ గురించి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోవడంవల్లే శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు’’ అని ఆమె వ్యక్తిగత సిబ్బంది సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతీహాసన్‌తో ‘సంఘమిత్ర’ చేయలేకపోతున్నాం’’ అంటూ చిత్రనిర్మాణ సంస్థ శ్రీ తేనాండాల్ ఫిల్మ్స్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా కోసం శ్రుతి లండన్‌లో యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అదంతా వేస్ట్ అయిందను కోడానికి లేదు. ఎందుకంటే భవిష్యత్తులో ఆమె ఇలాంటి సినిమా చేస్తే ఉపయోగపడుతుంది కదా. -
రాణి సంఘమిత్ర
చూడండి... శ్రుతీహాసన్లో రెండోవైపును చూడండి! ఇదైతే... జస్ట్ లుక్కే. కానీ, కత్తితో శ్రుతి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందోననే ఊహే ప్రేక్షకులకు కిక్ ఇస్తోంది. ఇప్పటివరకు అయితే... స్వీట్ అండ్ ఇన్నోసెంట్, లేదంటే... బ్యూటిఫుల్ అండ్ బబ్లీ హీరోయిన్గా ఎక్కువ శాతం సినిమాల్లో నటించారు శ్రుతి. వారియర్ ప్రిన్సెస్‌గా ‘సంఘమిత్ర’లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారు. తమిళ దర్శకుడు సుందర్ .సి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రుతి ఫస్ట్ లుక్‌ను ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విడుదల చేశారు. తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’, తమిళంలో ‘పులి’.. శ్రుతి రెండు సోషియో ఫాంటసీ ఫిల్మ్స్ చేశారు. రెండిటిలోనూ ఆమెకు యుద్ధాలు చేసే ఛాన్స్ రాలేదు. ఈ ‘సంఘమిత్ర’లో ఆమె టైటిల్ రోల్లో కనిపించనున్నారు. లుక్ ఎలా ఉందో చూశారుగా? శత్రువుల లెక్కలు సరిచేయడంలో శ్రుతి ఏమాత్రం ఛాన్స్ తీసుకోరని అర్థమవుతోంది కదూ! ఈ సినిమా కోసం లండన్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఇతర యుద్ధ విద్యల్లో శ్రుతి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. శ్రుతితో పాటు ఇందులో హీరోగా నటిస్తున్న ఆర్య లుక్‌ను కూడా కేన్స్‌లో విడుదల చేశారు. -
అనుష్క బాటలో శ్రుతీ
నటి అనుష్క బాటలో శ్రుతీహాసన్ పయనిస్తున్నారా? ఆమె సినీ పయనం చూస్తుంటే అలా అనిపించక మానదు. అనుష్క ఆదిలో కోలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అందాలారబోతలో దుమ్మురేపారు. సుందర్. సీ దర్శకత్వంలో అనుష్క నటించిన ఈత దుస్తుల దృశ్యాలు ఇప్పటికీ గూగుల్‌లో సందడి చేస్తూ నే ఉంటాయి. అంతగా అందాల మోత మోగించిన అనుష్క ఆ తరువాత చారిత్రిక కథా చిత్రాల్లో నటిస్తూ వీరనారిగా రణభూమిలో కదం తొక్కారు. అందుకు కత్తిసాము, గుర్రపుస్వారీ లాంటి చాలా కసరత్తులు చేశారు. అదే విధంగా కథా పాత్ర డిమాండ్ మేరకు సుమారు 80 కిలోల వరకూ బరువు పెరిగా ఇంజి ఇడుప్పళగి చిత్రంలో నటించారు. ఇక బాహుబలి–2లో కత్తి చేత పట్టి సాహస విన్యాసాలు చేశారు. క్రేజీ నటి శ్రుతీహాసన్ కూడా తొలి చిత్రం లక్ (హింది) లోనే గ్లామర్ విషయంలో ఎల్లలు దాటారు. అలాంటి నటి ఇప్పుడు గ్లామర్ ఇమేజ్ను బ్రేక్ చేయడానికి సిద్ధం అయ్యారనిపిస్తోంది. అనుష్కతో ఈత దుస్తులు ధరింపజేసిన అదే సుందర్.సీ ఇప్పుడు శ్రుతీహాసన్ చేత కత్తి పట్టిస్తున్నారు. ఆయన తాజాగా బాహుబలి చిత్రం తరహాలో సంఘమిత్ర పేరుతో చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందులో శ్రుతీహాసన్ యువరాణిగా నటించనున్న విషయం తెలిసిందే. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం శ్రుతీహాసన్ లండన్‌లో కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు. అదే విధంగా తను నటిస్తున్న తాజా హిందీ చిత్రం బెహన్ హోగి తేరి కోసం నటి అనుష్క అంత కాకపోయినా పాత్ర డిమాండ్ మేరకు బరువు పెరిగి నటిస్తున్నారట. ఇందులో తీయని పదార్థం కంట పడితే చాలు లొట్టలేసుకుంటూ తినేసే యువతిగా నటిస్తున్నారట. సినిమా ఆధునిక పుంతలు తొక్కుతున్న తరుణంలో ఇది చాలదు. అంతకు మించి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వారిని సంతృప్తి కోసం కథానాయకుడైనా, నాయకి అయినా కొత్తదనం కోసం ఇలా తమ వంతు శ్రమించాల్సిందే. -
సుకుమారి... వీరనారి
‘ఏం చక్కని మందారం.. ఇది ఎనిమిది దిక్కుల సింధూ రం’... అని హీరో పాడుతుంటే.. హీరోయిన్ శ్రుతీహాసన్ సుతి మెత్తగా అడుగులు వేస్తూ, తన సుకుమారాన్నంతా నడకలోనే ప్రదర్శించేసింది. అది పాట కాబట్టి అలా కనిపించింది. అదే ఫైట్ అయితే వీరనారిలా విజృంభిస్తుంది. ‘సంఘమిత్ర’ సినిమాలో అలాంటి పాత్రనే చేయనుంది శ్రుతి. నటి ఖుష్బూ భర్త సుందర్. సి దర్శకత్వంలో మూడు భాషల్లో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయికగా నటించనున్న శ్రుతి ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకునే పని మీద ఉంది. టిమ్ క్లోజ్ క్లోజ్ అనే ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో లండన్‌లో ఆమె ఫైట్స్ నేర్చుకుంటోంది. అక్కడ సిన్సియర్‌గా శిక్షణ తీసుకుంటూ, ఖాళీ సమయాల్లో లండన్‌లోని అందమైన ప్రదేశాలను సందర్శిస్తోంది. అలాగే, అక్కడి వంటకాలను కూడా ఓ పట్టు పడుతోందామె. ‘జయం’ రవి, ఆర్య హీరోలుగా నటించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వరకర్త. మన ‘బాహుబలి’కి ప్రభాస్ మూడు నాలుగేళ్లు కేటాయించినట్లే ఈ చిత్రం కోసం ‘జయం’ రవి, ఆర్య ఏడాదిన్నరకు పైగా డేట్స్ ఇచ్చేశారట. శ్రుతీహాసన్ కూడా ఈ చిత్రానికి ఎక్కువ రోజులు ఇచ్చారని సమాచారం. -
అంతా మేజిక్‌లా ఉంది!
‘‘మా నాన్నగారు వెరీ స్ట్రాంగ్. ఆయనకు జరిగిన ప్రమాదం నుంచి కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందనుకున్నా. కానీ, చాలా త్వరగా కోలుకుంటున్నారు. అంతా మేజిక్‌లా అనిపిస్తోంది. త్వరలో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ మొదలుపెడతాం’’ అని శ్రుతీహాసన్ అన్నారు. దాదాపు ఏడు నెలల క్రితం కమల్‌హాసన్ ఇంట్లో పడిపోయిన విషయం, అప్పుడు ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దాదాపు రికవర్ అయ్యారు. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘వాస్తవానికి నాన్నగారికి ప్రమాదం జరిగినప్పుడు నేను ఇండియాలో లేను. ఫోన్లో చెప్పారు. వినగానే చాలా బాధపడ్డాను. ఇండియా వచ్చాక ఆయన పరిస్థితి చూసి, కంగారుపడ్డాను. నాకు తెలిసి వేరే ఎవరైనా అయితే ఇంత త్వరగా కోలుకుని ఉండేవారు కాదు. నాన్నగారిలో ఉన్న సంకల్పసిద్ధిని ఇంతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు. ఆ విల్ పవరే ఆయన్ను త్వరగా కోలుకునేలా చేసింది. నేను, నాన్న తండ్రీ కూతుళ్లుగా నటిస్తోన్న ‘శభాష్ నాయుడు’ షూటింగ్‌కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. త్వరలో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. -
ఇండియా నా రెండో ఇల్లు
ఇండియా నా రెండో ఇల్లు. ఇలా అన్నది ఎవరో తెలుసా? నేటి టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సంచలన నటి శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న మైఖేల్ కోర్సెల్. కమలహాసన్ వారసురాలు శ్రుతీహాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌తో చెటా్టపటా్టల్ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన శ్రుతీహాసన్ మైఖేల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేననీ, అయినా తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదనీ బాహాటంగానే వెల్లడించారు. కాగా ఒక ఆల్బం రికార్డింగ్ కోసం లండన్ వెళ్లిన శ్రుతీహాసన్ కు అక్కడ పరిచయం అయిన వ్యక్తే మైఖేల్. వారి పరిచయం స్నేహంగా మారి ఆపై మైఖేల్ శ్రుతీహాసన్ కు బాయ్‌ఫ్రెండ్‌గా మారాడన్నది సినీవర్గాల టాక్. కాగా ఇటీవల ఇండియా వచ్చిన మైఖేల్‌ను శ్రుతీ విమానాశ్రయంలోనే రిసీవ్ చేసుకుని ఇద్దరు సన్నిహితంగా నడిచి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాంటి ప్రచారం గురించి తాను చింతించేది లేదనీ, అసలు ఆ విషయమై స్పందించడానికి ఇష్టపడడం లేదనీ, ఇంకా చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదనీ ఇప్పటికే నటి శ్రుతీహాసన్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ తన వెబ్సైట్లో ఇండియాకు వచ్చినప్పుడు అదు్భతవైున యువతి శ్రుతితో కాలం సంతోషంగా గడిచి పోయిందన్నారు. ఆమె అందవైున స్నేహితుల బృందాన్ని కలుసుకున్నాననీ, ఇండియా తనకు రెండో ఇల్లు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలే కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారాయి. -
నా మనసుకు అనిపించిందే చేస్తా!
నా మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తాను అంటున్నారు నటి శ్రుతీహాసన్.ప్రస్తుతం టాప్ మోస్ట్ కథానాయకిగా వెలుగొందుతున్న ఈ బోల్డ్ బ్యూటీ మొదట్లో గాయనిగా, ఆ తరువాత సంగీతదర్శకురాలిగా పరిచయం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ తరువాతే కథానాయకిగా తెరపైకి వచ్చారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూతురు అనే ముద్రతో రంగప్రవేశం చేసిన శ్రుతీ ఇప్పుడు ఆమె తండ్రి కమల్ అనేంతగా ఎదిగిపోయారు. తమిళ అమ్మాయి అయినా ఆదిలో బాలీవుడ్లో నటిగా పరిచయం అయ్యి, ఆ తరువాత టాలీవుడ్లోకి రంగప్రవేశం చేసి, ఆపైనే కోలీవుడ్‌కు విచ్చేశారు.ఈ మూడు భాషల్లోనూ తొలి చిత్రాలు నిరాశపరచినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవల సూర్యకు జంటగా నటించిన సీ–3 చిత్ర విజయంతో తన సక్సెస్ పయనాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న శ్రుతీహాసన్ మాట్లాడుతూ తనను శక్తిమంతురాలిగా తయారు చేసింది సినిమానేనని పేర్కొన్నారు. నటిగా తానీ స్థాయికి చేరుకున్నా.. ఇప్పటికీ కమలహసన్, సారికల కూతురు అనే గుర్తింపునే కోరుకుంటున్నానన్నారు. కాగా ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి చాలానే గాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. హాలీవుడ్ నటుడితో చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది. అలాంటి వాటి గురించి స్పందిస్తూ తన గురించి ఎవరేమనుకున్నా, నా మనసుకు ఏమనిపిస్తే అదే చేస్తాననీ చెప్పారీ అమ్మడు. నటిగా తన వయసు ఎనిమిదేళ్లు అనీ, ఈ కాలంలో తనకు సినిమా చాలానే నేర్పిందనీ చెప్పుకొచ్చారు. ఒక పరిణితి చెందిన నటిగా మంచి పాత్రలను ఎంచుకుని మరింత మంచి పేరు తెచ్చుకోవాలన్నదే తన ఆశ అని శ్రుతి పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రుతి తెలుగులో పవన్ కల్యాణ్ సరసన కాటమరాయుడు, తన తండ్రి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం శబాష్ నాయుడు చిత్రంతో పాటు మరో హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
ఒకరు మిస్... ఇంకొకరు యస్!
చేతిదాకా వచ్చింది.. ఇక సెట్లోకి వెళ్లడమే ఆలస్యం... ఇంతలోనో ఏదో అయింది.. వచ్చిన ఛాన్స్ చేజారింది.. ఒకరికి ‘మిస్’ అయిన ఛాన్స్ ఇంకొకరికి వెళితే.. ‘యస్’ చెప్పకుండా ఉంటారా? చెప్పినవాళ్లు సెట్లోకి.. మిస్సయిన వాళ్లు వేరే సెట్లోకి.. ఇంతకీ ఎవరు ‘మిస్’ చేసుకున్నారు? ఎవరు ‘యస్’ చెప్పారు? రండి... తెలుసుకుందాం. జస్ట్ మిస్! అనూహ్యంగా తుపాన్ వస్తే ఢిల్లీ–హైదరాబాద్ ఫ్లైట్ మధ్యలో గోవాలోనే ల్యాండ్ అయినట్టు, అనుపమా పరమేశ్వన్ ముహూర్తం కూడా జరగక ముందు చరణ్–సుక్కు ఫ్లైట్ నుంచి కిందకు దిగారు. ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారు అనుపమ. ‘అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’... ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటివరకూ తెలుగులో మూడు సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపే వచ్చింది. అదే రామ్‌చరణ్ సినిమాలో ఛాన్స్ తెచ్చిపెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ హీరోగా మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించే సినిమాలో మొదట అనుపమను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇంకేముంది... అమ్మాయి ఎగిరి గంతేసింది. అంతలోనే పెద్ద కుదుపు. ఆమెను తప్పించి, కథానాయికగా సమంతను తీసుకున్నారు. పారితోషకం విషయంలో బెట్టు చేయడంతోనే అనుపమను సినిమా నుంచి తొలగించారనే వార్తలొచ్చాయి. వాటిని నిర్మాణ సంస్థ ఖండించింది. కారణాలు ఏవైనా అనుపమకు ఓ స్టార్ పక్కన నటించే ఛాన్స్ దూరమైంది. ఆమె స్థానంలో చరణ్–సుక్కు ఫ్లైట్ ఎక్కిన సమంతకు హీరో, దర్శకుడు ఇద్దరితోనూ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా మిస్సయిన అనుపమ ఫీలింగ్ ఎలా ఉందంటే, ‘అవకాశం చేజారవచ్చు.. బయటవాళ్లు అనుకుంటున్నట్లుగా యూనిట్ సభ్యులతో నాకేం పొరపొచ్ఛాలు లేవు. మేం ఫ్రెండ్లీగానే ఉన్నాం’’ అని క్లారిఫై చేశారామె. జ్యోతిక తప్పుకుంటే నిత్యా ఒప్పుకున్నారు నిత్యా మీనన్ ఓ చిత్రానికి సంతకం చేసారంటే... అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సవుతారు. లేదంటే కనీసం కుటుంబంతో కలసి చూసేలా ఉంటుందనుకుంటారు. రీ–ఎంట్రీ తర్వాత జ్యోతిక కూడా అచ్చంగా అటువంటి పేరే తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు ఓ కామా పెట్టిన జ్యోతిక.. తన పిల్లలు కాస్త పెద్దవాళ్లయిన తర్వాత మళ్లీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు... బోలెడంతమంది దర్శక, నిర్మాతలు ఆమెకు కథలు వినిపించారు. తొందరపడి ఏదొకటి చేయకుండా ‘36 వయదినిలే’, ‘మగళిర్ మట్టుమ్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విషయమున్న కథలకు ఓటేశారు జ్యోతిక. ఈ టైమ్‌లోనే అట్లీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ చేస్తున్న సినిమాలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించమని జ్యోతికను సంప్రదించారు. అంతే కాదు... ఆమె నటిస్తున్నట్టు ప్రకటించారు. విజయ్–జ్యోతికలది హిట్ కాంబినేషన్. తమిళ ‘ఖుషి’తో పాటు ఈ ఇద్దరూ మరో సినిమా చేశారు. కట్ చేస్తే... వారంలోపే జ్యోతిక నటించడం లేదనే వార్త బయటకొచ్చింది. ఆ వెంటనే నిత్యా మీనన్‌కి పిలుపొచ్చింది. విజయ్ సినిమా కావడంతో నిత్యా మీనన్ కూడా చకచకా సంతకం చేశారు. జ్యోతిక ఎందుకు నటించనన్నారో.. నిత్యా ఎందుకు అంగీకరించారో... ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటో... సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది. క్లాష్.. క్లాష్...! మామూలుగా దర్శకుడు గౌతమ్ మీనన్ సినిమాలంటే హీరోయిన్లకు మంచి ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని కొంతమంది ఎదురు చూస్తారు. ఇక విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా ఛాన్స్ అంటే.. డబుల్ ధమాకానే. ‘ధృవ నక్షత్రం’తో అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఆ డబుల్ ధమాకా వచ్చింది. విక్రమ్‌తో ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ, అప్పటికే అంగీకరించిన సినిమాలతో ‘ధృవ నక్షత్రం’ షెడ్యూల్స్ క్లాష్ కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారామె. అదే టైమ్‌లో ‘పెళ్లి చూపులు’లో నటించిన తెలుగమ్మాయి రీతూ వర్మ దర్శకుడు గౌతమ్ మీనన్ చూపుల్లో పడడం.. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగాయి. ఇందులో విక్రమ్, రీతూ వర్మలవి టిపికల్ హీరో హీరోయిన్ పాత్రలు కాదట. హాలీవుడ్ సై్టల్లో వాళ్ల క్యారెక్టర్లు డిఫరెంట్‌గా డిజైన్ చేశారట గౌతమ్ మీనన్. రీతూ వర్మకు తొలి భారీ చిత్రమిదే. సెట్స్‌ని టచ్ చేయకుండానే... ఓ అడుగు ముందుకు... మరో అడుగు వెనక్కి... కథానాయిక లావణ్యా త్రిపాఠి తీరిది. తెలుగులో తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే ఈ ఉత్తరాది బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచేశారు. ఆ తర్వాత కెరీర్లో కంటిన్యూ స్‌గా హిట్స్ పడ్డాయి. కానీ, ఎక్కువ సినిమాలు చేయడంలో ఇతర హీరోయిన్లతో పోలిస్తే... లావణ్యా త్రిపాఠి ఓ అడుగు వెనకే ఉన్నారు. తాజాగా రవితేజ ‘టచ్ చేసి చూడు’ ఛాన్స్ లావణ్య చేజారిందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త వినిపిస్తోంది. విక్రమ్ సిరిని దర్శకునిగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు’లో రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం రాశీఖన్నాతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మరో కథానాయిక లావణ్యా త్రిపాఠి సీన్స్ ఏప్రిల్‌లో చిత్రీకరించడా నికి ప్లాన్ చేశారు. అప్పుడు లావణ్య చిత్రీకరణలో పాల్గొంటే ఫిల్మ్‌నగర్ టాక్ నిజం కాదని అర్థం. ఓ కథానాయిక స్థానంలో మరొకర్ని ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామ్‌చరణ్ ‘ఎవడు’లో ముందు సమంతను తీసుకుని, కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఏమైందో ఏమో.. చివరకు, ఆమె స్థానంలో శ్రుతీహాసన్ నటించారు. ఇలా శ్రుతి ఖాతాలో ఓ సినిమా చేరితే.. మరో సినిమా చేజారింది. అదే ‘ఊపిరి’. నాగార్జున, కార్తీ చేసిన ఈ చిత్రంలో ముందు శ్రుతీనే తీసుకున్నారు. నిర్మాతలతో ఏవో సమస్యలు రావడంతో శ్రుతీహాసన్ తప్పుకున్నారు. అప్పుడు తమన్నా ఆ సినిమాలో నటించారు. తమన్నా ఈ విధంగానే మరో తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అదే ‘పెళ్లి చూపులు’ రీమేక్. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ నిర్మాత. ముందు తెలుగులో నటించిన రీతూ వర్మనే తమిళ రీమేక్‌లోనూ తీసుకోవాలనుకున్నారు. చివరకు తమన్నాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం రీతూకి మంచి చేసింది. ఎలాగంటే.. ఈ సినిమాకి కేటాయించాలనుకున్న డేట్స్‌ను ఓ పెద్ద సినిమాకి ఇచ్చారు. అదే విక్రమ్–గౌతమ్‌ల ‘ధృవ నక్షత్రం’. కథానాయికలే కాదు... దర్శకులు, వాళ్ల కథలు కూడా ఓ హీరో నుంచి మరో హీరో దగ్గరికి వెళ్తుంటాయి. ఇదీ కొత్త విషయమేమీ కాదు. ప్రస్తుతం హీరోలు చేస్తున్న సినిమాలు కొన్నిటిని ఓ లుక్కేస్తే... ఎన్టీఆర్ 27వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టకముందు రవితేజ కోసం దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) ఓ కథ సిద్ధం చేశారు. ఆ కథతోనే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారా? లేక వేరే కథతోనా? అన్నది దర్శకుడే చెప్పాలి. రవితేజ నుంచి బాబీ.. ఎన్టీఆర్ దగ్గరికి వస్తే.. ఎన్టీఆర్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి.. రవితేజ దగ్గరికి వెళ్లారు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి తీస్తున్న ‘రాజా.. ద గ్రేట్’ కథ రామ్ నుంచి ఎన్టీఆర్, అక్కణ్ణుంచి రవితేజ దగ్గరకి వెళ్లింది. ఎన్టీఆర్ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం కావాలనుకున్నారు. ఆయన రెడీ చేసిన కథ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు అంతగా నచ్చకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లారు. ఇక, గౌతమ్ మీనన్ ‘ధృవ నక్షత్రం’లోనూ ముందు అనుకున్న హీరో విక్రమ్ కాదు.. సూర్య. కథలో సూర్య చాలా మార్పులు చెప్పడంతో గౌతమ్ చేయనని చెప్పేశారట. రెండేళ్ల తర్వాత విక్రమ్‌తో అదే కథతో సినిమా తీస్తున్నారు. -
జస్ట్ ఫ్రెండ్.. అంతే!
ప్రేమా లేదు... పాడూ లేదు... మీరు ఏవేవో ఊహించుకోవద్దని శ్రుతీహాసన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మధ్య శ్రుతీతో సన్నిహితంగా ఓ అబ్బాయి తిరుగుతున్నాడని, అతను ఆమె లవర్ అనీ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే... ఇటీవల విమానాశ్రయాల్లో శ్రుతీహాసన్‌తో తరచూ ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. రఫ్ అండ్ టఫ్స్టైలిష్ లుక్‌లో కనిపించే అతగాడి పేరు మైఖేల్ కోర్సేల్. అతను లండన్‌లో సెటిల్ అయిన ఇటాలియన్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అందుకని, థియేటర్స్ ఆర్ట్స్‌లో ఓ కోర్స్ కూడా చేశాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన మైఖేల్‌తో శ్రుతీహాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగిందనే వార్తలు షికారు చేశాయి. ప్రేమికుల రోజున ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారనే వార్త గుప్పుమంది. ఇవన్నీ నిజమేనా? అని శ్రుతీహాసన్‌ను తాజా ఇంటర్వూ్యలో ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్. అంతే’’ అన్నారామె. ఒక్క ముక్కలో సమాధానం చెప్పిన శ్రుతీహాసన్ ప్రేమలో ఎప్పుడు పడతారో మాత్రం చెప్పలేదు. -
150 కోట్ల సినిమాలో...
వరుస విజయాలతో రేసుగుర్రంలా దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ‘ప్రేమమ్’ వంటి క్యూట్ లవ్‌ప్టోరీ, ‘సింగమ్ 3’ వంటి మాస్ కమర్షియల్ మూవీ.. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసి, మెప్పించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో శ్రుతీకి ఛాన్స్ దక్కిందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’లో శ్రుతి ఓ హీరోయిన్గా ఎంపికయ్యారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఈ సినిమా కోసం పలువురు కథానాయికలను దర్శకుడు సంప్రదించినా, చివరికి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో శ్రుతి మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. హిందీలో అక్కడి నటీనటులతో తీయాలనుకుంటున్నారని వినికిడి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు. -
చారిత్రాత్మక చిత్రంలో శ్రుతిహాసన్
బ్రహ్మాండమైన చారిత్రాత్మక చిత్రంలో క్రేజీ హీరోయిన్ శ్రుతీహసన్ ఒక భాగం కానున్నారా? ఈ ప్రశ్నకు అలాంటి అవకాశం ఉందనే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. శ్రుతి ఇప్పుడు మంచి జోష్‌లో ఉన్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న ఆ బ్యూటీ సూర్యకు జంటగా నటించిన సీ–3 మంచి విజయం సాధించింది. తాజాగా తన తండ్రి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న శబాష్‌నాయుడు చిత్రంలో తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్నారు. ఇది తమిళం, తెలుగు, హింది భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం అన్నది గమనార్హం. హిందీలో బెహెన్ మోగి తెరి అనే చిత్రంతో పాటు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా సంఘమిత్ర అనే హిస్టారికల్ మూవీలో నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహించనున్నారు. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తన నూరవ చిత్రంగా రూపొందనున్న ఇందులో ఇంతకు ముందు ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు వంటి నటులతో నిర్మించాలని భావించినా వారి కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో యువ స్టార్స్ జయంరవి, ఆర్యలను కథానాయకులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా వారికి జంటగా బాలీవుడ్ భామలు దీపికాపడుకునే, సోనాక్షిసిన్హాలను నటింపజేయాలనుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఒక కథానాయకిగా టాప్ హీరోయిన్లలో ఒకరైన శ్రుతీహాసన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ఏడాది రెండవ భాగంలో సెట్‌పైకి వెళ్లనున్న సంఘమిత్ర చిత్రానికి సంబంధించిన పూర్తి వివారాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఆనందంతో నాన్నగారు హత్తుకున్నారు
‘‘ఎస్ 3’ అందరికంటే నాకు చాలా ఇంపార్టెంట్. ఈ నెల 9న ఏ పండగా లేదు. అయినా, ‘సింగం’ ప్రేమికులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఇంత పెద్ద హిట్ చేశారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని హీరో సూర్య అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ హీరో హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘ఎస్ 3’ ఇటీవల విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. సూర్య మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ‘ఫిల్మ్ ఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు’ అందుకున్నప్పుడు నేను, కార్తీ ఆయన్ను హత్తుకున్నాం. ఇప్పుడు ‘ఎస్ 3’ చూసి, నాన్నగారు నన్ను హత్తుకున్నారు. అది మాటల్లో చెప్పలేని ఆనందం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళా ప్రేక్షకులు డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో ఏడాదికి వెయ్యి సినిమాలు రిలీజవుతున్నాయి. కానీ, ఏడు శాతం చిత్రాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. ఇది చాలా పూర్. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వైవిధ్యమైన సినిమా చేస్తున్నా. కీర్తీ సురేశ్ కథానాయిక. రమ్యకృష్ణగారు ముఖ్య పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. ‘‘ఎస్ 3’ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ చిత్రం వసూళ్లు బాగున్నాయి. మీతో (సూర్య, హరి) నా ప్రయాణం నిరంతరాయంగా కొనసాగాలి’’ అని శివకుమార్ అన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు, సూర్య అభిమానులకు చాలా చాలా కృతజ్ఞతలు. ‘ఎస్ 3’ విజయం చాలా ఎనర్జీ ఇచ్చింది. ‘సింగమ్’ సిరీస్‌లో ‘ఎస్ 4’ మూవీ వస్తుంది. కానీ, వెంటనే కాదు. ఐదారేళ్లు పడుతుంది’’ అన్నారు. -
రేసీ.. మాసీ సింగమ్
సింగమ్... ఓ సినిమా పేరు కాదు, అదో బ్రాండ్. అందులో సూర్య యాక్షన్, డైలాగ్ డిక్షన్, మీసకట్టు.. ప్రతిదీ బ్రాండ్. ‘సింగమ్’ బ్రాండ్ దెబ్బకి బాక్సాఫీస్ రెండుసార్లు షేక్ అయింది. ముచ్చటగా మూడోసారి నరసింహం అలియాస్ ‘సింగమ్’గా ఈ నెల 9న తమిళ హీరో సూర్య ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో లుక్కేయండి! కథేంటి?: మంగుళూరు సిటీ పోలీస్ కమీషనర్ (జయప్రకాశ్) హత్యకు గురవుతాడు. నెలలు గడుస్తున్నా హంతకుల్ని పట్టుకోలేకపోయారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆందోళనలతో కర్ణాటక అసెంబ్లీ అట్టుడుకు తుంది. అప్పుడు సౌతాఫ్రికన్ మాఫియా డాన్ డానీ ఆట కట్టించిన (సింగం–2లో) ఏపీ పోలీస్ నరసింహం (సూర్య) ని డిప్యూటేషన్‌పై సీబీఐ అధికారిగా మంగుళూరుకు రప్పిస్తారు కర్ణాటక హోంమంత్రి (శరత్‌బాబు). నరసింహంకి కమీషనర్ హత్య కేసు అప్పగిస్తారు. నిజాయితీకి మారుపేరు గా ముద్రపడిన నరసింహం... మంగుళూరుకి వచ్చిన వెంటనే రౌడీలతో స్నేహం చేస్తాడు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కుమారుడు, ఆస్ట్రేలియాలో నివాసం ఉండే ఆ దేశ పౌరుడైన విఠల్‌ప్రసాద్ (అనూప్ సింగ్ ఠాకూర్) సిటీలో చేస్తున్న పలు అక్రమాలు నరసింహంకి తెలుస్తాయి. సాక్ష్యాలు చేతికి చిక్కిన తర్వాత విఠల్ అక్రమాలు వెలుగు లోకి తీసుకురావాలనుకున్న టైమ్‌లో నరసింహంకి షాక్. ‘రౌడీలతో నరసింహం స్నేహం’ పేరుతో పతాక శీర్షికల్లో వార్తలొస్తాయి. ఈ వార్త రాసింది... సిటీకి వచ్చినప్పట్నుంచీ నరసింహం వెంటపడిన విద్య అలియాస్ అగ్ని (శ్రుతీహాసన్) అనే అమ్మాయి. ఈ వార్తల్ని సాకుగా చూపి, సీబీఐ అతణ్ణి విధుల నుంచి తప్పుకోమంటుంది. అప్పుడు నరసింహం ఏం చేశాడు? కావ్య (అనుష్క)తో పెళ్లైన తర్వాత విడాకులు తీసుకున్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఆస్ట్రేలియాలో నివసించే విఠల్ అక్రమాలను ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడు? తనపై ప్రజలు, ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది కథ. విశ్లేషణ: సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే మూడడుగులు ముందుకు దూకడానికే, జూలు విదల్చడానికే అన్న సామెతను దర్శకుడు హరి బాగా వంటబట్టించుకున్నారు. సిన్మా ప్రారంభంలో కాస్త వెనకడుగు వేసిన నరసింహం.. జూలు విదిల్చిన దగ్గర్నుంచీ కథ వంద కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ‘సింగమ్’ ఫ్రాంచైజీలో వచ్చిన గత సిన్మాల కంటే స్క్రీన్‌ప్లే ఇందులో మరింత ఫాస్ట్‌గా ఉంటుంది. హరి మార్క్ యాక్షన్ సీన్లు, డైరెక్షన్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. మాస్... అంటే సింగమ్. సింగమ్... అంటే మాస్ అనే రీతిలో ప్రతి సీన్, ప్రతి ఫైట్, ప్రతి డైలాగ్ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఇంత మాస్ యాక్షన్ సిన్మాలోనూ దర్శకుడు హరి ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చూపించిన తీరు బాగుంది. అనుష్క, శ్రుతీహాసన్ పాత్రలు కథతో పాటు ప్రయాణం చేశాయి. నరసింహం పాత్రలో సూర్య ఉగ్ర నరసింహుడిగా చెలరేగారు. పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్లలో కసి, కథకు అవసరమైన చోట ఎమోషనల్ యాక్టింగ్‌తో ఇరగదీశారు. సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్ కూడా సీన్‌కి తగ్గట్టు తన సై్టల్లో కాకుండా మాసీగా రీ–రికార్డింగ్ చేశారు. పక్కా మాస్ మసాలా యాక్షన్ ఫిల్మ్ ఇది. -
జ్యోతిక ఆ మాట అనకముందే నేను సినిమా చేస్తా!
వంద రోజులు ఆడిన సినిమాల గురించి విన్నాం. వంద రోజులు వాయిదా పడిన సినిమా గురించి ఇప్పుడు వింటున్నాం. అదే ‘ఎస్3–యముడు3’. ‘అయినా నో టెన్షన్’ అంటున్నారు హీరో సూర్య. ‘సింగం’ సిరీస్ మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం అలాంటిది అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘సింగం–3’ని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ నెల 9న వస్తున్న ఈ సినిమా గురించి సూర్య చెప్పిన సంగతులు..... జ్యోతికకి బైక్ నేర్పినట్టున్నారు? ఇట్ వాజ్ ఫన్. ఆల్రెడీ తనకి కొంచెం వచ్చు. గతంలో ఓ సినిమాలో హ్యార్లీ డేవిడ్సన్ నడిపింది. ‘మగళిర్ మట్టుమ్’లోని ఓ సీన్లో ఆగ్రా, ఉత్తరప్రదేశ్ రోడ్లపై ఊర్వశిగారిని వెనక కూర్చోబెట్టుకుని బుల్లెట్ నడపాలి. జ్యోతిక ఓ నెలలో కంప్లీట్‌గా నేర్చుకుంది. మొదటిరోజే నేను తన వెనక కూర్చోవలసి వచ్చింది. ‘నీకంత కాన్ఫిడెన్స్ ఏంటి? నేను బండి పడేస్తాననే భయం లేదా?’ అని జ్యోతిక అడిగింది. నేను వెనక కూర్చుంటే తనకి కాన్ఫిడెన్స్ పెరిగి, బాధ్యతగా బైక్ రైడ్ చేస్తుందని నా నమ్మకం. ► మొత్తానికి వాయిదాల పర్వం పూర్తయింది! (నవ్వుతూ..) దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. ఓసారి తమిళనాడు ముఖ్యమంత్రి మరణం, మరోసారి ‘జల్లికట్టు’.. తదితర కారణాల వల్ల సుమారు వంద రోజులు వాయిదా పడింది. విడుదల తేదీ ప్రకటించి, మళ్లీ మళ్లీ వాయిదా వేయడం వల్ల ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కానీ, వాళ్లంతా ప్రేమ, గౌరవంతో సినిమాపై ఆసక్తితో ఉన్నారు. ‘సింగం’ సిరీస్‌కి హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉండడం వల్లే ‘ఎస్ 3’పై క్రేజ్ ఉంది. ► వసూళ్లపై ఈ ప్రభావం ఉంటుందనుకుంటున్నారా? దీపావళికి విడుదలైతే 15 నుంచి 20 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్సుందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు పండగ వాతావరణం లేదు. కానీ, ఫిబ్రవరిలో విడుదలైన కార్తీ ‘పరుత్తి వీరన్’, ‘యుగానికి ఒక్కడు’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కథ బాగుంటే సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే. ► ‘జల్లికట్టు’కి మద్దతుగా సినిమా వాయిదా వేస్తే.. పబ్లిసిటీ కోసమేనంటూ పెటా ఆరోపణలు చేయడం, మీరు లీగల్ నోటీసుల వరకూ వెళ్లడం.. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళనాడు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ‘జల్లికట్టు’కి మద్దతుగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఓ తమిళ వ్యక్తిగా నేనూ మద్దతిచ్చా. ‘దిస్ ఈజ్ మై ఫేస్. నేను బయటకి వచ్చినప్పుడు నా ముఖాన్ని పక్కనపెట్టి, మాస్క్ వేసుకుని రాలేను కదా!’. ‘ఎస్3’ విడుదలకి నాలుగు రోజుల ముందు ఈ ‘జల్లికట్టు’ అంశం తెరపైకి వచ్చింది. ఓ తమిళుడిగా సంస్కృతి పరిరక్షణకు మద్దతిస్తే వాళ్లు అలా మాట్లాడడం బాధాకరం. చివరికి, క్షమాపణలు చెప్పారు. ► ‘సింగం’ ఫ్రాంఛైజీలో మిమ్మల్ని ఎగై్జట్ చేస్తున్న అంశాలేంటి? ఈరోజు ఐపీయస్ సీవీ ఆనంద్‌గారితో మాట్లాడితే... ప్రభుత్వ సహకారంతో బ్యాంకాక్ వెళ్లి కృషి బ్యాంక్ నిందితులను పట్టుకున్న వైనం గురించి చెప్పారు. ‘సింగం–2’లో ఆపరేషన్ ‘డి’ పేరుతో హీరో సౌతాఫ్రికా వెళతాడు. సినిమాల్లో చూపించినవి 80 శాతం రియల్ లైఫ్‌లో జరుగుతున్నాయి. మామూలుగా ఓ మనిషిని చెంపదెబ్బ కొట్టడానికి కూడా మన చట్టాలు ఒప్పుకోవు. కానీ, కమర్షియల్ యాక్షన్ పేరుతో ఓ 20 శాతం డ్రామా జోడించి, అర్థవంతమైన కమర్షియల్ సినిమాలు తీస్తున్నాం. సీవీ ఆనంద్ వంటి రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు (పోలీసులు) ‘సింగం’ చిత్రాలను గౌరవిస్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ అకాడెమీలలో చూపించి ‘మీరూ ఇలా ఉండాల’ని చెబుతున్నారు. అవి విన్నప్పుడు ఎగై్జట్‌మెంట్ వస్తుంది. ►ఎన్టీఆర్, ఎమ్జీఆర్ సీఎంలుగా ఉన్నప్పటి సంఘటనల స్ఫూర్తితో ‘ఎస్3’ తీశామన్నారు. అవేంటి? పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఓ సీనియర్ అధికారి మాకు చెప్పింది ఏంటంటే... ఎన్టీఆర్‌గారు మొదటిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తమిళనాడు సీఎంగా ఎమ్జీఆర్ ఉన్నారు. అప్పుడు ఏపీలో జరిగిన ఓ రైడ్‌కి ఎక్కువ పోలీస్ సపోర్ట్ అవసరమైనప్పుడు ఎమ్జీఆర్గారు తమిళనాడు ఐపీయస్ అధికారులను ఏపీకి పంపించారు. ఓ రాష్ట్ర పోలీసులు పొరుగు రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడమనే సంఘటన స్ఫూర్తితో దర్శకుడు హరిగారు ఈ కథ రాశారు. ► ‘సింగం’ మ్యూజిక్‌కి బ్రాండ్ తీసుకొచ్చిన దేవిశ్రీప్రసాద్‌ని ఎందుకు తప్పించారు? సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్‌తో నేను 8, హరిగారు 4 సినిమాలు చేశాం. అన్నీ మ్యూజికల్ హిట్సే. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం కోసమే ‘ఎస్3’కి ఆయన్ని తీసుకున్నాం. ప్రతి సినిమాకీ మణిరత్నం ఒకే డీఓపీతో పని చేయరు కదా! ఇదీ అంతే. ఏం చేసినా ‘సింగం’ బ్రాండ్ కోసమే. దేవిశ్రీతో ఈ మాట చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించారు. ► ‘ఎస్3’కి ముందు హరి దర్శకత్వంలో మరో కథతో సినిమా చేయాలనుకున్నారు కదా! అది మిలటరీ నేపథ్యంలో జరిగే కథ. ఫుల్ స్క్రిప్ట్ రెడీ. నాకూ ఆ సినిమా చేయాలనుంది. ‘సింగం–4’కి ముందే అది పట్టాలు ఎక్కుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతానికి ఏదీ ప్లాన్ చేయలేదు. ► ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ ‘తానా సేంద కూట్టమ్’ చిత్రీకరణ ఎంతవరకూ వచ్చింది? కంప్లీట్ రీమేక్ కాదు. ఆ సిన్మాలో రెండు సన్నివేశాల స్ఫూర్తితో వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త కథ రాశాడు. ‘స్పెషల్ చబ్బీస్’ కంటే ‘తానా సేంద కూట్టమ్’ డిఫరెంట్‌గా ఉంటుంది. యువ దర్శకులతో పనిచేసినప్పుడు మనల్ని కొత్తగా ఆవిష్కరిస్తారు. రజనీకాంత్‌గారు కూడా యువ దర్శకుడు రంజిత్‌తో ‘కబాలి’ చేశారు. ► మొన్న ఆదివారం మీ శ్రీమతి జ్యోతికకి దోసెలు వేశారు. తొలిసారి గరిటె తిప్పారా? లేదండీ! (నవ్వుతూ..) అప్పుడప్పుడూ వంట చేస్తాను. ఆమ్లెట్స్, దోసెలు వేస్తా. సమోసాలు చేయడమూ వచ్చు. అయితే... జ్యోతిక ‘మగళిర్ మట్టుమ్’ ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. చాలా మంచి చిత్రమది. నలుగురు మహిళలు రోడ్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది కథ. మహిళలు మాత్రమే కాదు మగవారు కూడా చూడాల్సిన సినిమా. ► ‘మగళిర్ మట్టుమ్’ని తెలుగులో డబ్బింగ్ చేసే ఆలోచన ఉందా? తప్పకుండా డబ్బింగ్ చేస్తాం. ‘36 వయదినిలే’ తెలుగు డబ్బింగ్ కూడా పూర్తయింది. మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నాం. పెళ్లైన మహిళల్లో స్ఫూర్తి నింపే చిత్రమది. ఏ వయసులోనైనా కొత్త కెరీర్ స్టార్ట్ చేయొచ్చని చెప్పే సినిమా. ఎంటర్టైన్మెంట్ సినిమాలు మనం ఎక్కువ చేస్తాం. ఒక్కోసారి వాటిలో అర్థవంతమైన విషయాలు కూడా చెప్పొచ్చు. అప్పుడొచ్చే సంతృప్తి, సంతోషం మాటల్లో వర్ణించలేం. ► మీరు, మీ భార్య జ్యోతిక మళ్లీ తెరపై కనిపించేది ఎప్పుడు? గతేడాది కలసి ఓ సినిమా చేయాల్సింది. కానీ, కుదరలేదు. మళ్లీ ‘నేను నటించడం మానేస్తాను’ అని జ్యోతిక చెప్పక ముందే ఓ సినిమా చేసేయాలి. -
సిట్టింగ్ ప్రెట్టీ
‘సిట్టింగ్ ప్రెట్టీ’ అంటే జీవితంలో అన్ని అవకాశాలు మన దగ్గరకి వచ్చే పొజిషన్లో కూర్చుని ఉండడం... సక్సెస్ కొట్టి కంఫర్ట్‌లో కూర్చుని ఉండడం... కంఫర్టబుల్‌గా కూర్చున్నా కెరీర్ పరుగులు పెట్టడం... ప్రతి ‘సిట్టింగ్’లోనూ హీరోయిన్గా ఈవిడే కావాలని డైరెక్టర్ అనడం.. అన్ని సినిమాల్లోనూ అబ్బో.. ఎంత ‘ప్రెట్టీ’ అని ఆడియన్స్ ఆరాధించడం... దిస్ ఈజ్ శ్రుతీహాసన్... షి ఈజ్ ‘సిట్టింగ్ ప్రెట్టీ’ అమ్మానాన్నల నుంచి అవి నేర్చుకున్నా... నాన్నగారు చాలా క్రమశిక్షణ గల నటుడు. పాత్రలోకి చాలా డీప్‌గా వెళ్లిపోతారు. ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడరు. అమ్మ కూడా చాలా స్ట్రాంగ్. తల్లవ్వాలనుకున్నప్పుడు కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అమ్మానాన్న దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ⇔ న్యూ ఇయర్, సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.. త్వరలో వేలంటైన్స్ డే రాబోతోంది.. ఎలా? (మధ్యలో అందుకుంటూ) ఏం అడగబోతున్నారో అర్థమైంది. నాకు ఊహ తెలియకముందు వేలంటైన్స్ డే గురించి తెలియదు. తెలిశాక దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. సెలబ్రేట్ చేసుకునే అలవాటు లేదు. ⇔ ఫుల్ జోష్‌గా ఉన్నారు.. ఇంతకుముందు కనిపించిన శ్రుతీకీ, ఇప్పటి శ్రుతీకి కొంచెం మార్పు కనిపిస్తోంది? ఎప్పటిలానే ఉన్నాను. కాకపోతే ఆలోచనా విధానం మారింది. జీవితాన్ని చూసే తీరులో మార్పొచ్చింది. లైఫ్ పట్ల క్లారిటీ వచ్చింది. ⇔ అందుకేనేమో ‘మార్పు చాలా అందమైనది. నా లైఫ్‌లో ఆ మార్పు వచ్చింది. మార్పు అనేది సవాల్ లాంటిది’ అని ట్వీట్ చేశారు. మీకు సవాల్ అనిపించిన విషయం ఏంటి? సవాల్ అని అన్నది మనుషులను ‘డీల్’ చేసే విషయం గురించి. కొందరు అస్సలు అర్థం అవ్వరు. సినిమా ప్రపంచం పెద్దది. కొందరిని డీల్ చేయడం కష్టంగా ఉంటుంది. మార్పు గురించి చెప్పాలంటే.. నా ఆలోచనా విధానం మారింది. లైఫ్ సై్టల్ మారింది. ఆహారపు అలవాట్లు మారాయి. ఈ మార్పులు బాగున్నాయి. ⇔ ‘నా చుట్టూ ఉన్న గుడ్ పీపుల్‌కి థ్యాంక్స్’ అని కూడా ట్వీట్ చేశారు.. ఆ మంచి వ్యక్తులెవరో చెబుతారా? నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్‌ని ఉద్దేశించే అలా అన్నాను. ఎంత కాదనుకున్నా ఒక్కోసారి ‘లో’ అవుతాం. అలాంటి సమయాల్లో నా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతాను. నిజంగా ‘గాడ్ ఈజ్ వెరీ గ్రేట్’. ఎందుకంటే, నాకు మంచి ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌నీ ఇచ్చాడు. నా చుట్టూ ఉన్నవాళ్లంతా నా సంతోషాలనూ, బాధలనూ సమానంగా పంచుకునేవాళ్లే. ⇔ సెలబ్రిటీల లైఫ్ క్లిష్టమే. కాంప్లిమెంట్స్ తక్కువ.. కాంట్రవర్సీలు ఎక్కువ? కామెంట్స్ తీసుకోదగ్గవి అయితే తీసుకుంటాను. టైమ్‌పాస్ కోసం మాట్లాడుతున్నారనిపిస్తే... మనసుకి ఎక్కించుకోను. పట్టించుకుంటే నా పని మీద దృష్టి పెట్టలేను. ‘డౌన్’ అయిపోతాను. ఒకర్ని ‘డౌన్’ చేయడం ద్వారా తాము ‘అప్’ అవుతామనుకునేవాళ్లు ఏదేదో మాట్లాడతారు. ఆ మాటలను నెగటివ్‌గా కాకుండా పాజిటివ్‌గా తీసుకుంటే మనకు మంచిది. మన పని మనం బాగా చేయగలుగుతాం. ⇔ బాగా చెప్పారు... ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సినిమా హిట్టయితే హీరో గురించి ఎక్కువ.. హీరోయిన్ల గురించి తక్కువ మాట్లాడుతుంటారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఉన్నట్లుండి మార్పు ఆశించలేం. హీరోల గురించి ఎక్కువ మాట్లాడితే మాట్లాడనివ్వండి. నో ప్రాబ్లమ్. నా మటుకు నేను నాకు మంచి పాత్ర ఇచ్చారా? ఆ పాత్ర బాగా చేశానా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లో ఉమెన్ డామినేషన్ కూడా ఉంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ అయ్యాయి. అవి హిట్టవుతున్నాయి. వాటి గురించి మాట్లాడేటప్పుడు హీరోయిన్ల గురించే మాట్లాడాలి కదా. ⇔ సెలబ్రిటీల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలామంది ఉత్సాహంగా ఉంటారు.. అది మీకెలా అనిపిస్తుంది? ఓ స్టార్ కూతురిగా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ పబ్లిక్‌లోనే ఉంది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడను. తెలుసుకోవాలనుకున్నవాళ్లు ఆసక్తి కనబరుస్తారు. నేనేం చేయలేను. ⇔ మీ నాన్నగారి నుంచి గౌతమిగారు విడిపోవడానికి కారణం మీరే అని కూడా ఆసక్తిరాయుళ్లు అంటున్నారు.. అది నాన్నగారి పర్సనల్ విషయం. దాని గురించి నేనేం మాట్లాడదల్చుకోలేదు. నిజానికి నాన్నగారనే కాదు.. నేను ఎవరి పర్సనల్ విషయాల గురించీ పబ్లిక్‌గా మాట్లాడను. ⇔ ఎంత కాదనుకున్నా.. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ప్రభావం ఉండకుండా ఉండదు.. ఆ ప్రభావం నుంచి మీరెలా బయటపడతారు? కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. కాదనడంలేదు. కాసేపు ఆలోచిస్తా. ఇతరుల నుంచి ప్రశంసలు ఆశిస్తేనే ప్రాబ్లమ్. ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. విమర్శలను కూడా లైట్ తీసుకోవడానికే ప్రయత్నిస్తా. ⇔ ఈ మధ్య మీ నాన్న (కమల్‌హాసన్) గారితో మీరెక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్లనిపిస్తోంది. వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల విలువ బాగా తెలుస్తుందంటారు. మీలో ఆ మార్పు... అఫ్కోర్స్ మనం ఎదిగే కొద్దీ పేరెంట్స్ విలువ స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్లు బాగా అర్థం అవుతారు. అది కామన్. అయితే మా నాన్నగారితో నేను ఇప్పుడు కాదు.. ఎప్పుడూ క్లోజ్‌గానే ఉంటాను. ఆయన ఆలోచనలు నాకు నచ్చుతాయి. అవసరమైనప్పుడు ఇచ్చే సలహాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నన్నూ, అక్షరనీ మగపిల్లల్లా ట్రీట్ చేస్తారు. ఆయన చెప్పే మాటలు ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ⇔ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో శుత్రీ పెళ్లి చేసుకుంటే చూడాలనీ, తన పిల్లలను ఎత్తుకోవాలనీ మీ నాన్న అన్నారు. మరి.. ఎప్పుడు నెరవేరుస్తారు? (నవ్వుతూ). నాన్నగారు ఈ మాటలు చాలాసార్లు అన్నారు. కానీ, దేనికైనా టైమ్ రావాలి. అది వచ్చినప్పుడు ఏదీ ఆగదు. ⇔ కొంతమంది ఆడవాళ్లు పెళ్లయిన తర్వాత ఉద్యోగానికి ఫుల్స్టాప్ పెట్టేస్తుంటారు.. మీరు? ఇంకా పెళ్లి గురించే ఆలోచించలేదు. ఆ తర్వాత విషయం గురించి అడుగుతున్నారు. కెరీర్‌కి పెళ్లి ఆటంకం కాదని నా ఫీలింగ్. ఇష్టపడి ఫుల్స్టాప్ పెడితే ఓకే. కానీ, అత్తమామలు వద్దన్నారనో, భర్త వద్దన్నాడనో కెరీర్‌ని త్యాగం చేయకూడదు. నేను నా ఇష్టప్రకారమే నిర్ణయాలు తీసుకుంటాను. నాకు సినిమాలంటే ఇష్టం. భార్య అయ్యాక, తల్లయ్యాక కూడా వదలనేమో. ⇔ మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లు శారీరకంగా వీక్... మానసికంగా కూడా చాలామంది అలానే ఉంటారు.. వాళ్లకు మీరిచ్చే సలహా? సలహాలిచ్చేంతగా ఎదిగానో లేదో తెలియదు. కానీ, ఒకటి మాత్రం చెబుతాను. ప్రపంచాన్ని చూడండి. ఏం జరుగుతుందో తెలుసుకోండి. భారతదేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఆడవాళ్ల గురించి ఎలా మాట్లాడుతున్నారో వినండి. శారీరక బలంకన్నా మానసికం బలం గొప్పది. అందుకే అంటున్నా... ‘బీ స్ట్రాంగ్’. అలాగని ఎగబడి ఎవర్నీ తిట్టమనడంలేదు.. కొట్టమనడంలేదు. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించడం కోసం బలంగా ఉండాలి. ⇔ ఆడవాళ్ల సక్సెస్‌ని అంగీకరించడానికి పురుషాధ్యిక ప్రపంచం దాదాపు ఒప్పుకోదు. ప్రతిభ గురించి మాట్లాడకుండా అందంగా ఉందని సక్సెస్ అయిందనో, మాటలు చెప్పగలదనో.. ఇలా ఏవేవో అంటారు. మీ ఫీల్డ్ నుంచి మా ఫీల్డ్ వరకూ ఇలానే ఉంది.. సరిగ్గా చెప్పారు. ఇది మేల్ డామినేటెడ్ వరల్డ్. ఫిమేల్ సక్సెస్‌ని మనస్ఫూర్తిగా అంగీకరించేవాళ్లు తక్కువమంది ఉంటారు. కానీ, మా నాన్నగారిలాంటి మగవాళ్లు కూడా ఉంటారు. తన కూతుళ్ల సక్సెస్‌నే కాదు.. బయటి ఆడవాళ్ల సక్సెస్‌ని కూడా ఆయన అభినందిస్తారు. ఇక, విమర్శించే వాళ్ల గురించి అంటారా? పట్టించుకోవడం అనవసరం. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. ⇔ రీసెంట్గా బర్త్‌డే జరుపుకున్నారు. ఆ సెలబ్రేషన్స్? నా బర్త్‌డే పార్టీ చాలా చిన్నగా ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్.. అంతే. చెన్నైలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్నగారితో కలసి సెలబ్రేట్ చేసుకుంటాను. ఈసారి అక్కడే ఉన్నాను. నాన్నగారు, నా ఫ్రెండ్స్‌తో ఇంట్లోనే ఎంజాయ్ చేశా. ⇔ రోజులు.. నెలలు.. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వ్యక్తిగా ఎదుగుతాం.. మారతాం. మీలో వచ్చిన మార్పు గురించి? మీరన్నది కరెక్టే. ఐదేళ్ల క్రితం ఉన్నట్లు ఇప్పుడు ఉండం. ఇప్పుడున్నట్లు ఐదేళ్ల తర్వాత ఉండం. ఈ మధ్య నాలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఏంటంటే... ఏ విషయం గురించైనా క్లియర్‌గా ఆలోచించిస్తున్నాను. నాకేం కావాలో, ఏం అక్కర్లేదో స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నా. ‘మనం ఈ మాట మాట్లాడితే ఎవరైనా హర్ట్ అవుతారేమో’ అనే ఫీలింగ్‌తో నా మనసులోని మాటలను చెప్పేదాన్ని కాదు. కానీ, ఇప్పుడు మనం అబద్ధం ఆడనంతవరకూ, నిజాయితీగా ఉన్నంతవరకూ మన మనసుకి అనిపించిన మాటలు మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. అయితే నా మాటలు ఎవర్నీ బాధపెట్టకుండా జాగ్రత్తపడుతున్నా. చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ‘ఇల్యూజన్’ అనే పుస్తకం చదివాను. ఇప్పటికీ అప్పుడప్పుడూ తిరగేస్తుంటాను. ఆ పుస్తకం చదువుతుంటే నా జీవితానికి అర్థం తెలుసుకున్నట్లుగా ఉంటుంది. రిచర్డ్ బక్ అద్భుతంగా రాశారు. ⇔ సినిమాల ఎంపిక విషయంలో కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ మార్పు కూడా వచ్చింది. ప్రొఫెషనల్‌గా అంతకుముందు ‘యస్’ అన్నవాటికి ఇప్పుడు ‘నో’ అంటున్నా. ‘క్రిస్టల్ క్లియర్’ అంటారు. ఇప్పుడు నా ఆలోచనా విధానం అలానే ఉంది. ⇔ మామూలుగానే మీరు స్ట్రాంగ్ గర్ల్.. ఇప్పుడు మరీ స్ట్రాంగ్ అయినట్లున్నారు? అవును. చైల్డ్‌హుడ్ నుంచీ నేను కొంచెం స్ట్రాంగే. నా బాడీ లాంగ్వేజ్, నా మాట తీరు ఆ విషయాన్ని బయటపెట్టేస్తాయి. నేను బోల్డ్‌గా ఉండటానికి ఓ కారణం పెంపకం. నాన్నగారు ‘నువ్వు ఆడపిల్లవి’ అని గుర్తు చేస్తూ నన్ను, అక్షరను పెంచలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇప్పుడూ అలానే ఉంటున్నారు. ఏదైనా చెప్పుకునేంత స్వేచ్ఛ నాన్న దగ్గర ఉంది. ⇔ ఈ మధ్య ఏడాదికో తీపి గుర్తు అన్నట్లు.. 2015లో ‘శ్రీమంతుడు’, 2016లో ‘ప్రేమమ్’.. ఈ రెండూ మిగిల్చిన అనుభూతి గురంచి? నిజంగా ‘శ్రీమంతుడు’ నా సినిమా కెరీర్లో ఎప్పటికీ ఓ స్వీట్ మెమరీ. ఒక కమర్షియల్ సినిమాలో మంచి వేల్యూస్ చెప్పడం అనేది వందకు వంద శాతం కుదరకపోవచ్చు. ‘శ్రీమంతుడు’కి కుదిరింది. నా క్యారెక్టర్ సూపర్బ్. ఆర్టిస్ట్‌గా సంతృప్తినిచ్చిన పాత్ర. ఇక, ‘ప్రేమమ్’ డిఫరెంట్. ‘శ్రీమంతుడు’లో స్టూడెంట్‌గా చేస్తే.. ‘ప్రేమమ్’లో లెక్చరర్‌గా చేశా. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ⇔ 2017 ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఎప్పటిలానే పాజిటివ్‌గానే ఉన్నాను. నాన్నగారికి కూతురిగా నా రియల్ లైఫ్ క్యారెక్టర్ని ‘శభాష్ నాయుడు’లో చేయడం ఓ మంచి అనుభూతి. నాన్నగారి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్, టెక్నీషియన్‌తో సినిమా చేయడం మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లాంటిది. ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. ఓ దర్శకుడిగా నాన్నగారికి నా నటన నచ్చింది. అది చాలు. తెలుగులో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్‌గారితో ‘కాటమరాయుడు’ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచి సినిమా. త్వరలో విడుదల కానున్న ‘సింగమ్ 3’ కూడా బాగుంటుంది. ⇔ అవకాశాలు తెచ్చుకోవడం కష్టం. స్టార్ కావడం ఇంకా కష్టం. ఆ స్టేటస్‌ని నిలబెట్టుకోవడం మరీ మరీ కష్టం. ఓ స్టార్‌గా మీకిది ఒత్తిడిగా ఉంటుందా? అస్సలు లేదు. ఇప్పుడు మనం స్టార్.. రెండేళ్ల తర్వాత ఇలానే ఉంటామా? అని ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం నుంచి ప్రెజర్ మొదలవుతుంది. అందుకే నా ఆలోచనలను అంత దూరం వెళ్లనివ్వను. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నానా? లేదా అని మాత్రమే పట్టించుకుంటాను. మంచి రోల్స్ చేయాలని తాపత్రయపడతాను. ⇔ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేçస్తున్నారు.. ఎక్కువ వర్క్ చేస్తే బోర్..? సక్సెస్ అనేది నాకు ఈజీగా రాలేదు. చాలా స్లోగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీని చేసింది. చేతినిండా పని ఉంది. చేసే పనిని కష్టంగా ఫీలైతే బోర్ ఏంటి.. అలసట కూడా అనిపిస్తుంది. రెండేళ్ల క్రితం నేను ఏడు సినిమాలు చేశాను. పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించుకునే తీరికే లేకుండాపోయింది. అయినా బాగానే అనిపించింది. ఎందుకంటే, టాలెంట్ ఉండి కూడా సరైన ఛాన్స్ దక్కనివాళ్లు ఉన్నారు. ⇔ ఫైనల్లీ హీరోయిన్గా సెవన్ ఇయర్స్ జర్నీ ఎలా అనిపిస్తోంది? ఏడేళ్లు త్వరగా గడచిపోయాయి. ఇంకా చాలా సినిమాలు చేయడానికి ఎగై్జటెడ్‌గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాన్న కెరీర్ చూస్తున్నాను. అందుకే ఫ్లాప్స్.. సక్సెస్‌లను సమానంగా తీసుకోవడం అలవాటైంది. – డి.జి. భవాని -
సీ–3 వ్యాపారం రూ. 100 కోట్లు
సాధారణంగా సినిమా విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తే దాని కలెక్షన్లను బట్టి 100, 200 కోట్ల క్లబ్లో చేరిందంటుంటారు. అలాంటిది సీ–3 చిత్రం వ్యాపారంలోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని ఆ చిత్ర నిర్మాత చెప్పారు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీ–3. ఇది సింగం చిత్రానికి రెండో సీక్వెల్. హరి దర్శకత్వం వహించిన ఇందులో అనుష్క, శ్రుతీహాసన్ కథానాయికలు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ హీరోల స్థాయిని వారు పొందుతున్న పారితోషికంతో చిత్రాల వ్యాపారం పరంగా లెక్కకట్టాలన్నారు. తమ సీ–3 చిత్రం రూ. 100 కోట్ల వ్యాపారం జరిగిందని తెలిపారు. ఆ విధంగా చూస్తే రజనీకాంత్ తరువాతి స్థానంలో సూర్య ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం సూర్య మాట్లాడుతూ తన 20 ఏళ్ల నటజీవితంలో 35 చిత్రాల్లో నటించానని..వాటిల్లో సింగం చిత్రానికి ప్రత్యే చోటుంటుందని చెప్పారు. తాను దర్శకుడు హరితో కలిసి చేసిన ఐదవ చిత్రం ఇదని తెలి పారు. సీ–3 చిత్రం రూ.100 కోట్ల వ్యాపారం చేసిందనే కారణంతో రజనీకాంత్, కమలహాసన్ లతో పోల్చుతున్నారని, నిజానికి వారితో పోల్చితే తాను చిన్న పిల్లాడినన్నారు. జల్లికట్టు పోరాటంలో పోలీసులు హింసాత్మక చర్యలక పా ల్పడడం బాధాకమని.. అయితే పోలీసులందరినీ అందుకు బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి అనేలా ఈ చిత్రంలో దురైసింగం పాత్ర ఉంటుందని ఆయన చెప్పారు. -
సింగం-3 మరోసారి వాయిదా?
-
మరోసారి వాయిదా?
నటుడు సూర్య చిత్ర విడుదల మరోసారి వాయిదా పడిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సీ–3. అనుష్క, శ్రుతీహాసన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం సూపర్‌హిట్ చిత్రం సింగంకు సిరీస్‌గా తెరకెక్కిన మూడో చిత్రం అన్నది తెలిసిందే. కమర్షియల్ దర్శకుడు హరీ తాజా చిత్రం ఇది. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం సీ–3. ఇప్పటికే రెండు సార్లు పేర్లను, రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. సూర్య మరోసారి పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ సీ–3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే చిత్ర ట్రైలర్ థియేటర్లలో దుమ్మురేపుతోంది. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని గతేడాది డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేశారు. కరెక్ట్‌గా అలాంటి సమయంలో ప్రధాని పెద్ద నోట్ల రద్దు ప్రకటన సీ–3 చిత్ర విడుదలకు ఆటంకంగా మారింది. దీంతో జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఇప్పుడు జల్లికట్టు వివాదం మరోసారి సీ–3 చిత్ర విడుదలకు అడ్డపడిందని తెలుస్తోంది. జల్లికట్టు పోరాటం తమిళనాడులో తీవ్రరూపం దాల్చడంతో ఈ సమస్య సద్దుమణిగిన తరువాత సీ–3 చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. కాగా కాస్త లేటుగా అయినా సీ–3 లేటెస్ట్గా ఉంటుందని చిత్ర దర్శక నిర్మాతలు నమ్మకంతో ఉన్నారని చెప్పవచ్చు. చిత్ర తదుపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు ఎలాంటి ప్రకటన చేయలేదన్నది గమనార్హం. -
రిలీజ్ డేట్ ముఖ్యమే
‘‘ప్రతి ఏడాది వందకుపైగా సినిమాలు రిలీజవుతుంటే... 30, 40 సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. మిగతా సినిమాల్లో మంచివి ఉన్నప్పటికీ, పరిస్థితుల కారణంగా ప్రేక్షకులకు చేరువ కావడం లేదు. రిలీజ్ టైమ్ కూడా ఒక్కోసారి రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తుంది’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ ముఖ్యతారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించిన తమిళ చిత్రాన్ని ‘ఎస్3–యముడు3’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారీయన. ఈ నెల 26న వస్తోన్న ఈ సినిమా గురించి మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘డిసెంబర్ 16న రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. డీమానిటైజేషన్, చెన్నైలో తుఫాన్, ఇతర కారణాలతో వాయిదా పడి ఈ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాకు ప్రతి సినిమాని ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అలవాటు. ఇటీవలే ‘ఎస్3’ ఫస్ట్ కాపీ చూశా. మా సంస్థ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిదే. రాజకీయ నేపథ్యం గల ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్ని నరసింహం ఎలా పట్టుకున్నాడనేది చిత్రకథ. వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ నరసింహంగా సూర్య అద్భుతంగా నటించారు. తమిళ చిత్రమైనా.. తెలుగు నేటివిటీతో కూడిన చిత్రమిది. 60 శాతం చిత్రాన్ని విశాఖలోనే తీశారు. ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన ‘యముడు’, ‘సింగం’ చిత్రాలను మించిన యాక్షన్, ఎమోషన్ ‘ఎస్3’లో ఉన్నాయి. సూర్యగారు ఛాన్స్ ఇస్తే ఆయనతో స్ట్రయిట్ తెలుగు సినిమా తీయాలనుంది. ప్రస్తుతం వేరే హీరోలతో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం’’ అన్నారు. -
సముద్రం... స్వీట్ మెమొరీస్!
‘‘ఓపక్క అందమైన సముద్రం.. మరోపక్క ‘సింగం–3’ షూటింగ్.. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి తెలుసా!’’ అన్నారు శ్రుతీహాసన్. సూర్య సరసన ఆమె ఓ కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘సింగం–3’. హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క మరో కథానాయిక. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని ‘ఎస్3– యముడు–3’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 26న రిలీజవుతున్న ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను విశాఖలోనే చిత్రీకరించారు. ‘‘చిన్నప్పుడు ఎప్పుడో నాన్నగారి (కమల్‌హాసన్)తో పాటు విశాఖ వెళ్లా. నాన్న షూటింగ్ చేస్తుంటే.. నేను వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేశా. ‘ఎస్3’ షూటింగ్ చేస్తుంటే చిన్నప్పటి జ్ఙాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్‌గా నటించా. చాలా బోల్డ్ క్యారెక్టర్’’ అన్నారు శ్రుతీహాసన్. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘నిజాయితీ గల పోలీసాఫీసర్ వృత్తి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది చిత్రకథ. పరుగులు పెట్టే కథనంతో మాస్ –యాక్షన్ ఎంటర్టైనర్గా హరిగారు ఈ సినిమా తీశారు. ‘యముడు’, ‘సింగం’ సినిమాల తరహాలో ‘ఎస్3’ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, ‘రాడాన్’ రవి, సుమిత్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జయరాజ్. -
సంక్రాంతి రాయుడు!
పంట పొలాలు... పచ్చని కొబ్బరిచెట్లు... ఎడ్లబళ్లు... సంప్రదాయ దుస్తుల్లో సందడి చేసే మనుషులు... సంక్రాంతి, ఉగాది పండగల పేర్లు వినగానే ప్రేక్షకులకు ఇవే గుర్తొస్తాయి కదూ! ఈ సందడంతా అభిమాన హీరో సినిమాలో కనిపిస్తే... పండగే కదా! ఉగాదికి థియేటర్లలో అలాంటి సందడి తీసుకు రావడానికి ‘కాటమరాయుడు’ రెడీ అవుతున్నాడు. సాంపిల్ అన్నట్లు సంక్రాంతి కానుకగా ప్రచార చిత్రాలను విడుదల చేశారు. పంచెకట్టు, ఎడ్లబండి.. ఈ స్టిల్‌లో పల్లె సందడి మొత్తం కనిపిస్తోంది కదూ. పవన్‌కల్యాణ్, శ్రుతీహాసన్ జంటగా కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్‌మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ నెల 26న టీజర్ విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ నెల 16న తాజా షెడ్యూల్ మొదలవుతుంది. ఉగాది కానుకగా మార్చి 29న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
నాకాబాధ లేదు
ప్రస్తుతం అందాలారబోతకు అతీతులైన కథానాయికలు లేరనే చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో శ్రుతిహాసన్ కాస్త ఎక్కువని చెప్పడం అతిశయోక్తి అనిపించదు. చిత్రాలకు హీరోయిన్ అందాలు చాలా అవసరం అని ఈ అమ్మడే స్వయంగా వెల్లడించారన్నది గమనార్హం. ఆ మధ్య హిందీ చిత్రం దిడేలో శ్రుతీహాసన్ శృంగారభరత సన్నివేశాలు యువతకు యమ కిక్ ఇచ్చాయన్న విషయాన్ని మరచి పోలేం. అలా తమిళం, తెలుగు, హింది భాషల్లో నాయకిగా తనదైన బాణీలో రాణిస్తున్న శ్రుతిహాసన్ తాజాగా ఒక భేటీలో పేర్కొంటూ తనకిప్పుడు చాలా మంచి అవకాశాలు అభిస్తున్నాయని తెలిపారు. బాలీవుడ్‌లోనూ మూస పాత్రలను అంగీకరించడం లేదని చెప్పారు. అయితే ఇలా అన్ని చిత్రాల్లో అద్భుత పాత్రలు లభిస్తాయిని ఆశించకూడదన్నారు. ఇప్పటి వరకూ నటించిన ప్రతి పాత్రా తన ఎదుగుదలకు దోహద పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా కుటుంబానికి చెందిన నటిని కావడం వల్ల నిర్బంధకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందా? అని అడుగుతున్నారని, తనకు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. నిజం చెప్పాలంటే తమది సినిమా కుటుంబం అయినా ఎప్పుడూ దాని గురించే ఆలోచించడం జరగదన్నారు. ఇతరుల మాదిరిగానే తాము జీవితానికి సంబంధించిన ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటామని అన్నారు. అదే విధంగా సినిమా విషయాలను తాను, తన చెల్లెలు అక్షర స్వయంగానేనిర్ణయించుకుంటామని చెప్పారు. ఇక చిత్రాల జయాపజయాలను విభజించి మాట్లాడడం కష్టమేనన్నారు. కొన్ని చిత్రాలు అనూహ్య విజయాలను సాధిస్తాయని, ఒక్కో సారి అపజయాలను ఎదర్కోక తప్పదని అన్నారు. అందువల్ల జయాపజయాల గురించి తనకు ఎలాంటి బాధింపులేదని అన్నారు. పది చిత్రాలు చేస్తే అన్నీ విజయం సాధించాలని ఆశించడం సరికాదని శ్రుతిహీసన్ పేర్కొన్నారు. -
నాకూ... ఆ రొమాన్సే ఇష్టం!
సినిమాలు... సంగీతం... జీవితం... ఎక్కడ చూసినా శ్రుతీహాసన్ మోడ్రన్ అమ్మాయిలకు రోల్ మోడల్ అన్నట్టు కనిపిస్తారు. కానీ, ఆమెకు మోడ్రన్ డేస్ రొమాన్స్ కంటే ఓల్డ్ స్టైల్ రొమాన్సే ఇష్టమట! ‘‘మా రోజుల్లో వాట్సాప్, ఇతరత్రా మొబైల్ యాప్స్ లేవు. అందువల్ల, అందరూ నేరుగా కలుసుకుని మాట్లాడుకునేవారు. మీటింగులు, మాటల వల్లే సగం ప్రేమకథలు చిగురించేవి’’ అని కమల్‌హాసన్ శ్రుతీతో చెప్పేవారట!! శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘ల్యాండ్‌లైన్‌కి బాయ్‌ఫ్రెండ్ ఎవరైనా కాల్ చేస్తే ఎక్కడ అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తారోనని కంగారు... నోకియా ఫోనులు, ఇంట్లో తెలియకుండా మెస్సేజ్‌లు పంపుకోవడాలు.. ఎంతైనా ఆ రోజులే వేరు. నాన్న చెప్పిన ప్రేమకథలు నాకింకా గుర్తున్నాయి. ఇప్పటి యువతరమంతా అటువంటి రొమాంటిక్ మూమెంట్స్‌ని మిస్ కావడం బాధాకరం. నాకు ఓల్డ్ స్టైల్ సింపుల్ రొమాన్స్ అంటేనే ఇష్టం’’ అన్నారు. -
అందాలారబోతలో తప్పులేదు
అందాలారబోతలో తప్పులేదు అంటూ మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు నటి శ్రుతిహాసన్. కథానాయికులు పొట్టి దుస్తులు ధిరిస్తేనే యువత చూస్తారని, అందుకే వారికి కోట్ల రూపాయల పారితోషికం ఇస్తున్నట్లు ఇటీవల దర్శకుడు సూరజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి తమన్నా, ఆమెకు మద్దతుగా నయనతార, నటుడు విశాల్, రానా వంటి నటీనటులు ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ మూకుమ్మడి దాడి చేయడంతో సూరజ్‌కు వేరే దారి లేక క్షమాపణ చెప్పుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన కాస్త సద్దుమణిగిందో లేదో సంచలన నటి శ్రుతిహాసన్ గ్లామర్ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. హీరోయిన్లు అందాలారబోయడం ఏమాత్రం తప్పు కాదని పేర్కొన్నారు. ఈ మోడరన్ కాలంలో హీరోయిన్లు గ్లామరస్‌గా నటించడం చాలా అవసరం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమర్షియల్ చిత్రాలకు ఒక స్థాయిలో గ్లామర్ అవసరం అవుతుందన్నారు. అందులో కథానాయికలు పాలు పంచుకోవలసి వస్తోందని అన్నారు. కథ డిమాండ్ మేరకు హీరోయిన్లు అందాలారబోయాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందులో నటనకు అవకాశం ఉంటుందని శ్రుతిహాసన్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ సూర్యతో నటించిన ఎస్–3 చిత్రం ఈ నెల 26న తెరపైకి రానుంది. ప్రస్తుతం తన తండ్రితో కలిసి శభాష్‌నాయుడు, తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రాల్లో నటిస్తున్నారు. -
ఫుల్ స్టిల్ ఆ రోజే!
తెలుగు సినిమా ప్రేక్షకులు, అభిమానులకు డిసెంబర్ 31న కొత్త ఏడాది కానుక ఇవ్వడానికి పవన్‌కల్యాణ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను డిసెంబర్ 31 అర్ధరాత్రి విడుదల చేయనున్నారు. తమిళ హిట్ ‘వీరమ్’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ ప్రీ–లుక్ పోస్టర్‌గా మీరు చూస్తున్న స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పంచెకట్టులో ఉన్న పవన్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి, ఫుల్ ఫొటో ఎక్కడనుకుంటున్నారా? ఈ 31న ఫుల్ స్టిల్ రిలీజ్ చేస్తారట! శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
పొల్లాచ్చి టు హైదరాబాద్
అందంలో ఆకాశం లాంటి అమ్మాయికి.. ఆనందంతో అల్లరి చేసే యువకుడు జత కలిస్తే... ‘గబ్బర్ సింగ్’లో పవన్‌కల్యాణ్, శ్రుతీహాసన్‌ల జంటలా ఉంటుంది. అందులో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. ‘గబ్బర్ సింగ్’తో హిట్ జోడీ అనిపించుకున్న ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. కిశోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్ ముగించుకుని ఇటీవల ఈ చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. ‘‘పొల్లాచ్చిలో పవన్, శ్రుతిలపై చిత్రీకరించిన సన్నివేశాలు, పాట అద్భుతంగా వచ్చాయి. చిత్రీకరణ చివరి ఘట్టానికి వచ్చింది’’ అన్నారు శరత్ మరార్. ‘‘వచ్చే ఫిబ్రవరి కల్లా చిత్రీకరణ పూర్తి చేసి, ఉగాది కానుకగా మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కిశోర్ పార్థసాని. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్. -
నేను చాలా మారిపోయా!
కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకునేవాళ్లు తీసుకుంటున్నారు. 2016 ఎలా గడిచింది అని విశ్లేషించుకునే పని మీద కొంతమంది ఉన్నారు. శ్రుతీహాసన్ కూడా ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఓసారి ఆలోచించుకున్నారు. ఆ మార్పుల గురించి శ్రుతి చెబుతూ – ‘‘వ్యక్తిగా నేను చాలా మారాను. స్వీయ అవగాహన చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువ టైమ్ కేటాయించాను. ఇంతకుముందు కొన్ని చేయడానికి సంశయించేదాన్ని. అది మంచిదైనా ఎందుకో వెనకడుగు వేసేదాన్ని. కానీ, ఇకనుంచి ముందడుగు వేస్తాను. నా ఇష్టాయిష్టాల పరంగా కూడా నేనో నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చేశా. ‘ఇది మనకు నచ్చదు’ అని ఓ విషయం గురించి అనుకుంటే ఇక ఎప్పటికీ నచ్చదు. నచ్చినది ఎప్పటికీ నచ్చుతుంది. అంత బలమైన అభిప్రా యాలను కలగజేసిన సంవత్సరం ఇది. వయసు, అనుభవం వ్యక్తుల్లో పరిణతి తెస్తాయంటారు. 30 ఏళ్లొచ్చేశాయ్ కదా.. నాలోనూ పరిణతి వచ్చింది’’ అన్నారు. -
భయం... సంతోషం...నాన్నతో రెండూ!
‘‘నాన్నతో కలసి నటించడం మధురమైన అనుభూతి. అదే సమయంలో నేను చాలా భయపడ్డా’’ అన్నారు శ్రుతీ హాసన్. తండ్రీకూతుళ్లు కమల్ హాసన్, శ్రుతీ హాసన్ కలసి నటిస్తున్న మొదటి చిత్రం ‘శభాష్ నాయుడు’. శ్రుతి భయానికి కారణం ఏంటో తెలుసా? ఈ చిత్రానికి కమలే దర్శక–నిర్మాత. అందువల్ల వ్యక్తిగతంగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారట! శ్రుతీ హాసన్ మాట్లాడుతూ –‘‘దర్శకుడిగా నాన్న చాలా స్ట్రిక్ట్. ప్రతి ఒక్కరికీ ఎలా నటించాలో స్పష్టంగా చెబుతారు. ఆయన చెప్పినట్లు చేయకుంటే ముఖం మీదే చెప్పేస్తారు. దాంతో నేను భయపడ్డా. కానీ, నా వర్క్ పట్ల నాన్న హ్యాపీగా ఉన్నారు. నటిగా ఇప్పటివరకూ నాకు వచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏంటంటే... నాన్న హ్యాపీగా ఉన్నానని చెప్పడమే’’ అన్నారు. ఈ చిత్రంలో కూడా కమల్, శ్రుతి తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ‘దశావతారం’లోని ‘రా’ ఆఫీసర్ బలరామ్ నాయుడు పాత్రనే కమల్ ఇందులోనూ చేస్తున్నారు. -
దేవుడే దిక్కంటే ఎలా?
నాకు దైవభక్తి ఎక్కువ అంటున్నారు నటి శ్రుతిహాసన్. పక్కా మోడ్రన్ అమ్మారుుగా పెరిగిన శ్రుతిహాసన్ ఇలా మాట్లాడడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అందులోనూ ఈ బ్యూటీ తండ్రి కమలహాసన్ పూర్తిగా నాస్తికుడన్న విషయం తెలిసిందే.అలాంటిది మీరెలా ఆస్తికులయ్యారన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ ఇలా చెప్పుకొచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం అన్నది నాకే కలిగింది.ఇది ఎవరో చెప్పడంతో కలిగింది కాదు.దైవభక్తి అన్నదిసాధారణ పరిస్థితికి మించింది. ఒక్క దేవుడినని కాదు అన్ని దేవుళ్లను పూజిస్తాను. అలాగని నా ఇంటిలో దేవుని గది అంటూ ప్రత్యేకంగా ఉండదు. అరుునా ఎలా దేవునిపై నమ్మకం కలిగిందో నాకే తెలియదు. నాకు సమయం దొరికినప్పుడల్లా దేవాలయాలకు వెళ్ల దైవార్చనలు చేసుకుంటాను. పుణ్యస్థలాలను దర్శిస్తుంటాను. షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటాను. అరుుతే ఆ ఆలయాల్లో ఏ దేవుడున్నారన్న విషయం గురించి ఆలోచించను. గుడిలో దేవున్ని చూడగానే దండం పెట్టుకుంటాను.అలాగని నేనేమీ కోరుకోను అని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది. చిన్న చిన్న కోరికలు కోరుకుంటాను. అరుుతే మన బాధ్యతలను విస్మరించకూడదు. ఏమీ చేయకుండా భగవంతుడా అంతా నీదే భారం అని కూర్చోవడం సరికాదు. మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అని అంటున్న నటి శ్రుతిహాసన్ తాజాగా తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో తన తండ్రి కమలహాసన్‌తో కలిసి శభాష్‌నాయుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. -
ముందుకు దూకడానికే!
సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే నాలుగడుగులు ముందుకు దూకుతుందంటారు. ఇప్పుడు తమిళ నటుడు సూర్య అభిమానులు ఈ మాటే అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగం-3’ విడుదల ఓ వారం వెనక్కి వెళ్లింది. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 16న రిలీజ్ చేయాలనుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఓ వారం వాయిదా వేసి, రెండు భాషల్లోనూ ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్య, అనుష్క, శ్రుతీ హాసన్ ముఖ్యతారలుగా హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగులో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. త్వరలో తెలుగు పాటలు విడుదల చేయనున్నారు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. అన్నట్లు, సూర్య సినిమా ఒక వారం వెనక్కి వెళ్ళిందే తడవుగా, తెలుగులో కొన్ని సినిమాల రిలీజ్ ముందుకొచ్చింది. -
నిన్ను చంపేస్తా..! ట్విట్టర్లో బెదిరింపులు
సెలబ్రిటీలకు అపరిచితుల నుంచి ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయ్. గడచిన రెండు నెలలుగా శ్రుతీహాసన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. డాక్టర్ చెందిన ఓ డాక్టర్ అదే పనిగా ట్విట్టర్ ద్వారా శ్రుతిని అనరాని మాటలు అనడంతో ఆమె విసుగు చెందారని సమాచారం. చివరకు దగ్గరగా కనపడితే, ‘నిన్ను చంపేస్తా’ అని కూడా అతను బెదిరిస్తున్నాడట. దాంతో శ్రుతీహాసన్‌కి పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి ఆ డాక్టర్ చాలా ఘోరంగా వ్యాఖ్యానించాడట. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులను కలసి, శ్రుతి తరఫు వ్యక్తులు ఫిర్యాదు చేసి, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. అలాగే అతగాడి ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులకు ఇచ్చారట. శ్రుతీహాసన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ డాక్టర్ గురించి వాకబు చేసే పనిలో పడ్డారు. -
అతనికి చెల్లెలు అవుతుంది!
తెలుగు, తమిళ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా హిందీలో శ్రుతీహాసన్ ఏడాదికి ఒక సినిమా అయినా ఒప్పుకుంటారు. వీలైతే రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. శ్రుతి నటించిన హిందీ చిత్రం ‘యారా’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మరో చిత్రం అంగీకరించారు. ‘బెహెన్ హోగీ తేరి’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ సరసన శ్రుతి నటించనున్నారు. అంటే.. ‘ఆమె నీకు చెల్లెలు అవుతుంది’ అని అర్థం. మరి.. సినిమాలో శ్రుతీని ఉద్దేశించి ఏ పాత్ర ఇలా అంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. పంజాబీలో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ కె. పన్నాలాల్ ఈ చిత్రం ద్వారా హిందీ రంగానికి పరిచయమవుతున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ మూవీ. డిసెంబర్లో చిత్రీకరణ మొదలుపెట్టి, జనవరిలో పూర్తి చేయాలనుకుంటున్నారు. నితిన్ సరసన? శ్రుతి చేస్తున్న తెలుగు సినిమాల విషయానికొస్తే.. పవన్ కల్యాణ్ సరసన ‘కాటమరాయుడు’లో నటిస్తున్నారు. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న చిత్రంలో ఆమెను కథానాయికగా అడిగారట. ఈ సినిమాలో నటించడానికి శ్రుతి సుముఖంగానే ఉన్నారని సమచారం. డిసెంబర్లో చిత్రీకరణ మొదలుపెట్టాలనుకుంటున్నారట. శ్రుతీహాసన్ ఈలోపు డైరీ చెక్ చేసుకుని, ఈ సినిమాకి డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారట. -
ఇప్పుడు నేనేమీ చెప్పాలనుకోవడం లేదు!
నటుడు కమల్‌హాసన్‌తో పదమూడేళ్ల సహజీవనాన్ని ముగిస్తూ మంగళవారం గౌతమి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇద్దరు వ్యక్తులు కలసి జీవించడానికి పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉంటే చాలు’’ అని పలు సందర్భాల్లో కమల్, గౌతమి పేర్కొన్నారు. మరి ఇప్పుడు వాళ్ల మధ్య ఏ విషయంలో అవగాహన కొరవడి ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. ఈ చర్చల్లో కీలకంగా శ్రుతీహాసన్ పేరు వినిపిస్తోంది. ఒకరి నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: శ్రుతి పెద్ద కూతురు శ్రుతీహాసన్‌తో కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ షూటింగ్లో గౌతమి, శ్రుతీ మధ్య కాస్ట్యూమ్స్ పరంగా జరిగిన వాదన, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలే తాజా పరిణామానికి కారణం అయ్యుంటాయన్నది కొందరి ఊహ. కానీ, గౌతమికీ, తనకూ మధ్య పొరపొచ్ఛాలు లేవని ఆ సమయంలో శ్రుతి వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు తండ్రి నుంచి గౌతమి విడిపోవడానికి తాను కారణం అనే వార్త ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఎవరి వ్యక్తిగత విషయాల గురించి, నిర్ణయాల గురించి తనకు సంబంధం లేదని శ్రుతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపైన గౌరవం ఉందన్నారు. తాను ప్రేమించేది వారినేనన్నారు. శ్రుతి హాసన్ పేరిట ఆమె మీడియా పర్సన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరణ తెలిపారు. ఆ సంగతలా ఉంచితే... కమల్ పేరిట వార్తల వివాదం కమల్, తానూ విడిపోతున్న విషయాన్ని గౌతమి ప్రకటించిన నేపథ్యంలో కమల్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది తాజా చర్చ. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రిక విలేఖరి కమల్ని సంప్రదించగా, కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత కమల్ పెదవి విప్పినట్లు కొన్ని పత్రికల్లో, సైట్స్‌లో వచ్చింది. ‘‘ఇప్పుడు నా ఫీలింగ్స్‌కి ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బు సౌకర్యవంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లకు మంచి జరగాలని ఆశిస్తున్నా. ఎప్పుడు కావాలన్నా వాళ్ల కోసం నేనున్నానన్నది వాళ్లు తెలుసుకోవాలి. శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మి (గౌతమి కూతురు)- ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఈ ప్రపంచంలో నేను లక్కీయస్ట్ ఫాదర్ అనుకుంటున్నా’’ అని కమల్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. అలా చేయడం అనాగరికం అంటున్న కమల్ అయితే, బుధవారం సాయంత్రం కమల్ తాను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదన్నట్లు ట్విట్టర్లో ఓ ప్రకటన చేశారు. ‘‘ఇలాంటి సమయంలో నా పేరు మీద ఎవరో ఏదో ప్రకటిస్తున్నారు. అలా ఆడుకోవడం వివేక వంతం కాదు. దాన్ని అనాగరికం అంటారు. ఇప్పుడు నేనేదీ ప్రకటించాలనుకోవడం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొ న్నారు. అలా పత్రికల్లో తన పేర వస్తున్న వార్తలు తప్పని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కాసేపటికి ఆయన పక్షాన మీడియా పర్సన్ మరింత వివరంగా ప్రకటన చేశారు. గౌతమి తన నుంచి విడిపోవాలన్న నిర్ణయం ఆమె వ్యక్తిగత విషయమనీ, తనెక్కడ ఉన్నా బాగుండాలని కోరు కుంటున్నాననీ, గౌతమి ఎప్పుడైనా సాయం కోరుకుంటే అది అందించడానికి సిద్ధమనీ తాను అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కమల్ ఖండించారు. అసత్య ప్రచారం మంచిది కాదన్నారు. గౌతమి గురించి తానెలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, గౌతమి ప్రకటన, దానిపై వార్తలు, శ్రుతి, కమల్ల ప్రకటనలతో ఈ వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు నలుగురి నోళ్ళలో నానుతోంది. -
నేను పెళ్లే చేసుకోను!
పెళ్లి చేసుకోను అనే తారల పట్టికలో మరో నటి చేరారు. ఒక పక్క పెళ్లి చేసుకున్న వారు విడిపోతూ కలకలం సృష్టిస్తుంటే మరో పక్క అసలు పెళ్లే వద్దు అని సంచలన కలిగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందనిపిస్తోంది. ఇంతకు ముందు నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి పెను సంచలనానికి కేంద్రబిందువు అయ్యారన్నది గమనార్హం. తాజాగా వర్ధమాన నటి సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనంటూ వార్తల్లోకెక్కారు. మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా భూమ్‌లోకి వచ్చిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిశారన్నది గమనార్హం. వైద్య విద్యనభ్యసించిన ఈ బ్యూటీలో మంచి డాన్సర్ ఉన్నారు. కొన్ని చానళ్లలో డాన్స పోటీల్లోనూ పాల్గొన్నారన్నది గమనార్హం. ప్రేమమ్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమంతటా ప్రాచుర్యం పొందిన సాయిపల్లవికి ఇంతకు ముందు కోలీవుడ్‌లో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్‌స వచ్చినట్లే వచ్చి మిస్ అయింది. అయితే త్వరలోనే కోలీవుడ్ ఆఫర్ ఆమె కోసం ఎదురు చూస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య హీరోయిన్లు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి మాధ్యమాల ద్వారా ఇంట్రాక్ట్ అవడం అన్న ఒరవడి కొనసాగుతోంది. సమీపకాలంలో నటి సాయిపల్లవి తన అభిమానులతో అలాంటి చిట్‌చాట్ చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఈ అమ్మడు ఎలా బదులిచ్చారో చూద్దాం. ప్ర: తమిళంలో మీకు నచ్చిన చిత్రం? జ: సూర్య నటించిన కాక్క కాక్క ప్ర: నచ్చిన పాట? జ: రెమో నీ కాదలన్ పాట అంటే చాలా ఇష్టం ప్ర: మీకు చికెన్ బిరియానీ ఇష్టమా?మటన్ బిరియానీ ఇష్టమా? జ: నేను శాఖాహారిని. ప్ర: ప్రేమ వివాహం చేసుకుంటారా? పెద్దలు నిశ్చియించిన పెళ్లి చేసుకుంటారా? జ: నేను అసలు పెళ్లే చేసుకోను. ప్ర: కారణం? జ: జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. -
సింగంతో ఓ సెల్ఫీ
వన్.. టు.. త్రీ.. మొన్నటివరకూ శ్రుతీహాసన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. అదే ‘సింగం-3’. సూపర్ హిట్ ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందు తోన్న మూడో చిత్రమిది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాలతో సూర్యకు సూపర్ సక్సెస్ అందించిన దర్శకుడు హరి, ఈ మూడో చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. జార్జియా లో సూర్య, శ్రుతీలపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ‘‘సింగం 3’ షూటింగ్ పూర్తి చేశా, తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అని శ్రుతీహాసన్ ట్వీట్ చేశారు. ఈ సినిమా గుర్తుగా సూర్యతో ఓ సెల్ఫీ తీసుకున్నారు. అనుష్క మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్ హిట్స్
శృతిహాసన్ అన్బ్లష్డ్: బి ద బిచ్ నిడివి : 2 ని. 27 సె. హిట్స్ : 5,83,133 ‘బిచ్’ అనేది మంచి మాట కాదు. వదిలేసి వెళ్లిన అమ్మాయిని మగాళ్లు తిట్టే తిట్టు. బట్... ‘బి ద బిచ్’ అంటున్నారు శృతిహాసన్. అమ్మాయిలూ... బిచ్లా ఉండండి అని స్క్రిప్ట్ రాశారు. స్క్రీన్‌ప్లే ఇచ్చారు. ‘బ్లష్’ అనే వీడియో చానల్ దాన్ని అప్లోడ్ చేసింది. యూట్యూబ్‌లో ఇప్పుడొక సంచలనం ఈ వీడియో. బిచ్ అనే మాటకు మంచి నిర్వచనం ఇచ్చారు శృతి ఇందులో. అదీ తన టోన్‌లో. ‘బిచ్ ఈజ్ ఎ ప్యూర్ యాంబిషన్ విత్ హార్మోన్స్’ అని ముగించారు. బిచ్ టీచర్లా సొసైటీని మారుస్తుంది, బిచ్ మల్టీ టాస్కింగ్ చేస్తుంది అంటూ ఎమోషనల్‌గా సాగే శృతీ వీడియో ప్రతి అమ్మాయికీ ఒక సెల్ఫ్ ఎప్రైజల్. తప్పకుండా చూడండి. అబ్బాయిలూ మిమ్మల్నే. రోగ్ వన్: స్టార్ వార్స్ స్టోరీ ట్రైలర్ నిడివి : 2 ని. 37 సె. హిట్స్ : 67,48,196 స్టార్ వార్స్ సిరీస్‌లోని లేటెస్ట్ మూవీ ‘రోగ్ వన్’ రెండో ట్రైలర్ విడుదలైంది! చిత్రం ఈ డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. విశ్వాంతరాళాల్లో పాలపుంత సామ్రాజ్యం (గెలాక్టిక్ ఎంపైర్) ఏర్పడ్డాక తిరుగుబాటు శక్తులు తలెత్తుతాయి. ఆ శక్తులు జిన్ ఎర్సో అనే యువతిని నియమించుకుని ఆమెకు క్యాసియన్ ఆండన్ అనే యువకుడిని జత కలిపి ‘డెత్ స్టార్’ ప్లాన్స్‌ని దొంగిలించడానికి పంపుతాయి. డెత్ స్టార్ అనేది పాలపుంత సామ్రాజ్యానికి చెందిన ఒక మొబైల్ స్పేస్ స్టేషన్. అందులోని సమాచారాన్ని సంగ్రహిస్తే గెలాక్టిక్ ఎంపైర్పై ఈ తిరుగుబాటు శక్తులు ఆధిక్యాన్ని సంపాదించవచ్చు. అదీ పథకం. తొలి స్టార్ వార్స్ చిత్రం 1977లో వచ్చింది. ఆ వరుసలో ‘రోగ్ వన్’ 9వ సినిమా. మరో 5 చిత్రాలు మేకింగ్‌లో ఉన్నాయి. ‘రోగ్ వన్’కు గ్యారెత్ ఎడ్వార్డ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌కి బాగా అలవాటు పడి, స్పందనలు కోల్పోయిన ఈ తరాన్ని సైతం ఎంటర్టైన్ చేసేలా ఈ హాలీవుడ్ ఎపిక్ స్పేస్ అపేరా ఉండబోతోంది. నమ్మలేకపోతే ట్రైలర్‌ని చూడండి. డొనాల్డ్ ట్రంప్ అండ్ హిల్లరీ: ఐ హ్యావ్ హ్యాడ్ ది టైమ్ ఆఫ్ మై లైఫ్ నిడివి : 1 ని. 31 సె. హిట్స్ : 35,81,825 ట్రంప్, హిల్లరీ.. ఉప్పు, నిప్పు. ప్రెసిడెన్షియల్ డిబేట్లలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. సీమ టపాకాయల్లాంటి మాటలు పేల్చుకుంటున్నారు. హిల్లరీని చూసి ట్రంప్ పటపట పళ్లు కొరుకుతున్నారు. ట్రంప్‌ను చూసి హిల్లరీ మూతీ ముక్కూ విరుస్తున్నారు. ‘నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే హిల్లరీని జైల్లో తోయిస్తా’ అని ట్రంప్ అంటే, ‘అమెరికన్ మహిళల చేతుల్లో తమరికి ఉంది లెండి’ అని హిల్లరీ అన్నారు. అయితే ఒక డిబేట్లో మాత్రం సడెన్‌గా వీళ్లు డ్యూయెట్ పాడుకున్నారు! 1987 నాటి బిల్ మెడ్లీ (గాయకుడు), జెన్నీఫర్ వార్న్స్ (గాయని)ల ప్రేమగీతం ‘ఐ హ్యావ్ హ్యాడ్ ది టైమ్ ఆఫ్ మై లైఫ్’ను వేదికపై ఆలపించి ప్రేక్షకులను అలరించారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూసి మాట్లాడండి. అప్పటికీ నమ్మలేకపోతే, మనం ఉన్న విషయమే మాట్లాడుకోవాలి. నిజానికి వీళ్లిలా ఒకళ్లపై ఒకళ్లు ప్రేమగా, ఆరాధనగా పాడుకోలేదు. ఒకవేళ పాడుకుని ఉంటే చూడ్డానికి ఎలా ఉంటుందీ అన్న ఒక అందమైన ఊహ వచ్చిన వాళ్లెవరో డిబేట్లో ట్రంప్, హిల్లరీల లిప్ మూవ్‌మెంట్‌కు అమరేలా ఈ లవ్ సాంగ్‌ను సెట్ చేశారు. ఈ మీమ్ (ఝ్ఛఝ్ఛ) ప్రపంచాన్ని నవ్వుల్తో షేక్ చేస్తోంది. ‘ఇప్పటికి తీరికయింది, నా జీవిత క్షణాలను నీకు అర్పించడానికి’ అనే అర్థం వచ్చే ఈ మెలడీ ఎన్ని జన్మల శత్రువులకైనా సెట్ అవుతుందేమో! -
ఆయనతో సినిమా చేయడం నాకో గొప్ప పాఠం!
‘‘మలయాళ మూవీ ‘ప్రేమమ్’ రీమేక్ కోసం దర్శకుడు చందూ మొండేటి నన్ను కలిసినప్పుడు ఆలోచించా. ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నా. అందుకని మళ్లీ రీమేక్ మూవీనా? అనిపించింది. వరుసగా రీమేక్ చిత్రాల్లో నటిస్తుండటంతో ‘రీమేక్ రాణి’ అయిపోయా (నవ్వుతూ)’’ అని కథానాయిక శ్రుతీహాసన్ అన్నారు. నాగచైతన్య, శ్రుతీహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘ప్రేమమ్’ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ చెప్పిన విశేషాలు. ► మలయాళ ‘ప్రేమమ్’ మూవీ చూశా. బాగా నచ్చింది. రీమేక్ అయినా చందూ తన శైలిలో తెలుగుకి అనుగుణంగా కథ తయారు చేశారు. కథ, నా పాత్ర నచ్చడంతో ఒప్పుకున్నా. ఈ చిత్రంలో నేను సాఫ్ట్, డిగ్నిఫైడ్ టీచర్ సితార పాత్రలో కనిపిస్తా. ► రియల్ లైఫ్‌లో మాత్రం సితార పాత్రకు విరుద్ధంగా ఉంటా. అందుకే ఈ పాత్రను ఓ ఛాలెంజ్‌గా భావించి చేశా. ప్రేక్షకులకు బాగా నచ్చింది. కొందరైతే సౌందర్యలా ఉన్నావని ప్రశంసించడం మరచిపోలేని అనుభూతి. టీచర్ పాత్ర కాబట్టి మేకప్‌కి పెద్దగా చాన్స్ లేదు. వాస్తవానికి నాకు మేకప్ లేకుండా నటించడమంటేనే ఇష్టం. ► ‘ప్రేమమ్’లో నటించక ముందే నాగచైతన్య, నేను ఫ్రెండ్స్. దాంతో మేం షూటింగ్లో చాలా సరదాగా ఉండేవాళ్లం. షూటింగ్ మొత్తం ఓ పిక్నిక్లా జరిగింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని ఉంది. బలమైన కథ ఉంటే చేస్తా. ► నా వరకు నేను వంద శాతం హార్డ్‌వర్క్ చేస్తా. కష్టపడని వాళ్లంటే నాకు నచ్చదు. నా పాత్ర బాగా వచ్చేందుకు రిహార్సల్స్ చేస్తా. చెల్లి అక్షరాహాసన్‌కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. కానీ, సినిమాల ఎంపికలో సలహాలివ్వను. రచన, సింగింగ్ అంటే నాకు ఇష్టం. ప్రస్తుతానికి బిజీ కాబట్టి, వాటిపై పెద్దగా దృష్టి సారించడంలేదు. భవిష్యత్‌లో నిర్మాతగా చేయాలనుంది. ► నాన్నతో (కమల్‌హాసన్) ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటించడం నాకొక గొప్ప పాఠం. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. పవన్‌కల్యాణ్‌గారితో ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ‘కాటమరాయుడు’లో నటిస్తుండడం హ్యాపీ. ‘సెవన్త్ సెన్స్’ తర్వాత సూర్యగారితో ‘సింగం 3’ లో నటించడం మంచి అనుభవం. -
ముందు ముత్తయ్యతోనేనా?
నటుడు సూర్య ప్రస్తుతం ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అనుష్క, శ్రుతీహాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం సింగం చిత్రానికి మూడోభాగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. సూర్య నటించే తదుపరి చిత్రం ఏమిటన్న విషయం గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది.కబాలి చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ఉంటుందని స్వయాన సూర్యనే ఆ మధ్య వెల్లడించారు. అయితే తాజాగా దర్శకుడు ముత్తయ్య పేరు వినిపిస్తుండడం విశేషం. కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాల దర్శకుడు ముత్తయ్య. కొంబన్ చిత్రంలో కార్తీ కథానాయకుడిగా నటించారన్నది తెలిసిందే. విశాల్ హీరోగా నటించిన మరుదు చిత్రం ఆశించిన విజయాన్ని పొందలేదు. దీంతో దర్శకుడు ముత్తయ్య తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం సూర్య ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారట. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఆగస్ట్ నెల చివరగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి సెప్టెంబర్, లేదా అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రారంభంచడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. మరి రంజిత్‌తో చిత్రం ఏమైనట్లు అన్న ప్రశ్న చిత్ర వర్గాల్లో తలెత్తుతోంది. నిజానికి కబాలి చిత్రానికి ముందే రంజిత్ సూర్య చిత్రానికి దర్శకత్వం వహించాల్సి ఉంది. రజనీకాంత్ చిత్ర అవకాశం రావడంతో నిర్మాత జ్ఞానవేల్‌రాజా తన చిత్రాన్ని వాయిదా వేసుకున్నారు. సూర్య తదుపరి ఏ దర్శకుడితో చిత్రం చేస్తారన్నది అధికారికపూర్వకంగా ప్రకటించేవరకూ ఊహాగానాలిలా కొనసాగుతూనే ఉంటాయి. -
నం.1 నయనతారే!
సంచలన తారగా పేరొందిన నటీమణుల్లో ముందుండే నటి నయనతారనే అనక తప్పదు. చిత్ర పరిశ్రమలో చాలా మంది జయించడం లేదు. ముఖ్యంగా కథానాయికలు వరుసగా అవకాశాలను పొందడంలో విఫలం అవుతున్నారు. ఇక వేరే అవకాశాలు పొందినా వాటిని ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం లేదు. అలాంటిది పదేళ్లకు పైగా చిత్రపరిశ్రమలో నంబర్ వన్ హీరోయిన్గా వెలుగొందుతున్న నటి నయనతార అని చెప్పడంలో అవాస్తవం ఉండద నుకుంటా. సినిమా పరంగానూ, వ్యక్తిగతంగానూ పలు ఆటంకాలను, అనేక సమస్యలను ఎదురొడ్డి ఆ ప్రభావాలను తన నటనపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రముఖ నటిగా భాసిల్లుతున్న నటి నయనతార. అయ్యా చిత్రం ద్వారా తమిళ చిత్రపరిశ్రమలోకి దిగుమతి అయిన కేరళ కుట్టి నయన. ఆ తరువాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ తనదైన నటనా ప్రతిభతో అభిమానుల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఇక నయనతార నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్న పేరును సంపాదించుకున్నారు. దీంతో దర్శక నిర్మాత ఆమె చుట్టూ తిరుగుతుంటే ప్రముఖ హీరోల నుంచి యువ నటుల వరకూ నయనతార తమకు జంటగా నటించాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఒక ఆంగ్ల పత్రిక నిర్వహించిన దక్షిణాది అగ్ర కథానాయికి ఎవరన్న చర్చావేదికలో అగ్రస్థానం నయననే వరించింది. నయనతార అందం, అభినయాలను ఇష్టపడుతున్నట్లు అధిక సంఖ్యలో అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2013లో చర్చావేదికలో 7వ స్థానంతోనే సరిపెట్టుకున్న నయనతార ఇప్పుడు ప్రథమ స్థానానికి ఎగబాకడం విశేషమే. ఇక రెండో స్థానంలో నటి శ్రుతిహాసన్ నిలువగా, మూడో స్థానాన్ని ఇంగ్లిష్ భామ ఎమీజాక్సన్, నాలుగు, ఐదు స్థానాల్లో అనుష్క, తమన్న దక్కించుకున్నారు. ఇక త్రిష, హన్సిక ఆ తరువాత స్థానాలకే పరిమితమయ్యారు. -
శ్రుతిని కలవరపెడుతున్న తోళా విజయం
తోళా చిత్ర విజయం నటి శ్రుతిహాసన్‌ను కలవరానికి గురి చేసిందా? దీనికి చిత్ర వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అదేమిటి తోళా చిత్రం విజయవంతమైతే శ్రుతి కేమిటి చింతా అనేదేగా మీ సందేహం. ఒక్కోసారి పరిస్థితుల ప్రభావంతోనో, ఇతర కారణాల వల్లో మంచి అవకాశాలను వదులుకుని ఆ తరువాత బాధ పడడం అనేది చాలా మందికి జరుగుతుంటుంది. నటి శ్రుతిహసన్ విషయంలోనూ ఇలాంటిదే జరిగింది. నాగార్జున, కార్తీ కలసి న టించిన ద్విభాషా చిత్రం తోళా. తెలుగులో ఊపిరిగా తెరకెక్కి ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. ఇందులో నాయకిగా నటించిన తమన్నా ఖాతాలో మరో విజయం నమోదైంది. దీంతో ఆమె ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయింది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా,తోళా చిత్ర విజయం మాత్రం నటి శ్రుతిహాసన్‌కు మింగుడు పడడంలేదట. కారణం ఈ విజయం తనకు దక్కాల్సింది. ఎస్ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్గా ఎంపికైంది శ్రుతిహాసన్‌నే. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా పుచ్చుకున్న ఈ క్రేజీ బ్యూటీ ఆ తరువాత కాల్షీట్స్ కేటాయించకుండా చిత్ర యూనిట్‌కు సమస్యలు సృష్టించారనే ప్రచారం కూడా జరిగింది.అంతే కాదు శ్రుతిహసన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిత్ర నిర్మాతల వర్గం పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లారు. ఈ విషయాలు పక్కన పెడితే మొత్తం మీద శ్రుతిహాసన్ ఆ చిత్రం నుంచి వైదొలగారు. ఆమె పాత్రలో నటించే అవకాశాన్ని మిల్కీబ్యూటీ తమన్న దక్కించుకుంది.ఇప్పుడు తోళా చిత్రం విజయం సాధించడం శ్రుతిహసన్‌ను కలవరపెడుతోందని పరిశ్రమ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. -
సెల్ఫీ... సో స్పెషల్!
శ్రద్ధగా మేకప్ చేసుకున్నప్పుడు సెల్‌ఫోన్‌తో ఓ సెల్ఫీ తీసుకుని, తీపి గుర్తుగా దాచుకోవాలనుకుంటాం. విహార యాత్రకు వెళ్లినప్పుడు అందమైన లొకేషన్స్‌లో సెల్ఫీ తీసుకుంటాం. చానాళ్ల తర్వాత స్నేహితులను కలిసినప్పుడు వాళ్లతో సెల్ఫీ దిగుతాం. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ సెల్ఫీకి అనర్హం. సినిమా తారలు ట్విట్టర్స్, ఫేస్‌బుక్స్‌లో ఇలాంటి సెల్ఫీలు చాలా కనిపిస్తాయి. అలా గత వారంలో హల్చల్ చేసిన సెల్ఫీల్లో రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ కలిసి దిగిన సెల్ఫీ ఓ హైలైట్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి నేడు బెంగళూరులో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో చరణ్, వరుణ్ సెల్ఫీ దిగారు. ఆదివారం చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా తాము దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే అన్నా.. లవ్ యు’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులో మెరిసే శ్రుతీహాసన్ ‘సింగమ్ 3’ చిత్రం కోసం పట్టుచీర కట్టుకున్నారు. అందుకని మురిపెంగా సెల్ఫీ దిగి, ఫేస్బుక్లో పెట్టారు. తల్లితో కలిసి రకుల్ ప్రీత్‌సింగ్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో తల్లితో కలిసి సెల్ఫీ దిగారు. హిందీ చిత్రం ‘పింక్’ షూటింగ్ స్పాట్లో షాట్ గ్యాప్‌లో కో-స్టార్స్‌తో కలిసి తాప్సీ ఓ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీలు సో... స్పెషల్‌గా ఉన్నాయి కదూ! -
కళ్లు, గోళ్లను బట్టి ఇట్టే చెప్పేస్తా!
మీకెలాంటి మగాడంటే ఇష్టం? అని ఏ కథానాయికను అడిగినా... ‘అతను చాలా మంచివాడు అయ్యుండాలి’ అని కామన్‌గా సమాధానం చెబుతుంటారు. శ్రుతీహాసన్ కూడా అలానే చెప్పారు. దాంతో పాటు తనకు ఎలాంటి మగాళ్లంటే ఇష్టం? ఎదుటి వ్యక్తి తన గురించి ఏమనుకుంటున్నాడో ఎలా తెలుసుకుంటాను? అనే విషయాల గురించి ఈ చెన్నై సుందరి చెబుతూ - ‘‘బేసిక్‌గా నేను మంచి వ్యక్తినే పెళ్లాడాలనుకుంటా. అఫ్కోర్స్ ఎవరైనా అలానే అనుకుంటారనుకోండి. ఆ సంగతి అలా ఉంచితే... అతనికి కొంచెమైనా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. అతను రాక్‌స్టార్ కాకపోయినా ఫరవాలేదు. ముందు మంచి మనసు ముఖ్యం. అది ఉంటే... ఆ తర్వాత మనకు కావాల్సిన లక్షణాలు అతనిలో ఉండేలా చేయొచ్చు. ఒక మగాడు నా గురించి ఏమనుకుంటున్నాడో అతను నన్ను చూసే విధానాన్ని బట్టి అంచనా వేసేస్తాను. అందుకే ముందు అతని కళ్లను చూస్తాను. ఆ తర్వాత అతని చేతి గోళ్లను కూడా చూస్తాను. మగాళ్లు గోళ్లు కొరుక్కోకూడదని నా బలమైన నమ్మకం. ఎందుకు కొరుక్కోకూడదో నేను చెప్పలేను. కళ్లు, గోళ్లూ చూశాక టోటల్‌గా అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో గమనిస్తాను. పద్ధతి గల మనుషుల బాడీ లాంగ్వేజ్ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. సో... ఏ వ్యక్తి గురించి అయినా ఓ నిర్ణయానికి రావడానికి అతని బాడీ లాంగ్వేజ్ కూడా ఓ కారణ మవుతుంది’’ అన్నారు. -
ఫస్ట్ టైమ్... తెరపైనా తండ్రీ కూతుళ్ళు!
మన సినిమాల్లో వారసులకు భలే క్రేజు. అందులోనూ సూపర్‌స్టార్ తండ్రి, స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న వారసులైతే వేరే చెప్పనక్కరలేదు. వారిద్దరూ కలసి ఒకే సినిమాలో నటిస్తే, ఇక డబుల్ క్రేజ్ ఖాయం. ఇప్పుడు కమలహాసన్ కుటుంబం నుంచి అలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్ రానున్నట్లు భోగట్టా. కమలహాసన్ కుమార్తె శ్రుతీహాసన్ సినీరంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తండ్రితో కలసి ఆమె ఎప్పుడు నటిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. రాబోయే ఒక చిత్రంలో తండ్రీ కూతుళ్ళిద్దరూ కలసి నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే - ఆ సినిమాలోనూ వాళ్ళు తండ్రీ కూతుళ్ళుగానే కనిపించనున్నారు. జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు టి.కె. రాజీవ్ కుమార్ ఈ తండ్రీ కూతుళ్ళిద్దరూ నటించే స్క్రిప్ట్ ఆలోచించారు. ఆ ఆలోచన నచ్చి కమల్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని చెన్నై కోడంబాకమ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి, రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఫ్యామిలీ సెంటిమెంట్స్ నిండిన ఒక రొమాంటిక్ కామెడీ సినిమాను కమలహాసన్ ఇప్పటికే చేస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘అమ్మా నాన్న ఆట’ అనే పేరు కూడా పెట్టారు. జరీనా వహాబ్, అమల అక్కినేని కూడా ఆ సినిమాలో ఉన్నారు. మరి... ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా అదే సినిమాలో నాన్నతో కలసి నటిస్తున్నారా? లేక అది పూర్తిగా కొత్త స్క్రిప్టు, సినిమానా అన్న వివరాలు ఇంకా స్పష్టం కాలేదు. సినిమా ఏదైనా, ఇప్పటికైతే కమల్, శ్రుతీహాసన్లు కలసి నటించడం వరకు కన్ఫర్మ్. మిగతా వివరాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
ప్రేమేసర్వం
నాగచైతన్య ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ మాగ్జిమమ్ ప్రేమకథా చిత్రాలే. మరోసారి ప్రేమే సర్వస్వంగా భావించే ప్రేమికునిగా ఒదిగిపోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అందరితో ప్రేమ మంత్రం జపించేలా చేసి సంచలన విజయం సాధించిన మలయాళ హిట్ ‘ప్రేమమ్’. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య హీరోగా ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శ్రుతీ హాసన్, అనుపమా పరమేశ్వరన్ నాయికలు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి.సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో అఖిల్ క్లాప్ ఇచ్చారు. ఈ లవ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 3 నుంచి వైజాగ్‌లో జరగనుంది. సమర్పణ: పీడీవీ ప్రసాద్. -
సారీ అండీ!
గాసిప్ ‘హెరా ఫేరీ 3’లో శ్రుతీహాసన్ నటించనుందనే వార్తలు నిన్నా మొన్నటి వరకు గట్టిగా వినిపించాయి. అయితే ఈ సినిమా చేయడం లేదని ఆమె తాజాగా ప్రకటించింది. డేట్స్ కమిట్మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోతోందట. అయితే గుసగుసలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. తండ్రి కమల్‌హాసన్, బాలీవుడ్ నటదిగ్గజం ఆమిర్ఖాన్లకు ఉన్న ‘పర్ఫెక్షనిస్ట్’ అనే పేరు తాను కూడా తెచ్చుకోవాలనుకోవడంతో ఆమె అతిగా ఆచితూచి వ్యవహరిస్తోందనే మాటలు అక్కడక్కడా వినిపిస్తున్నాయి. నీరజ్ వొరా దర్శకత్వం వహిస్తున్న ‘హెరా ఫేరి 3’ సేఫ్ ప్రాజెక్ట్‌గానే చెప్పుకోవాలి. పైగా పరేష్ రావల్, సునీల్‌శెట్టి, జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్‌లాంటి ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. బాలీవుడ్లో నిలబడడానికి శ్రుతీహాసన్‌కు ఈ సినిమా ఉపకరిస్తుందని కూడా సినీ పండితులు అంచనా వేశారు. మరి ఈ తేనె కళ్ల సుందరి సినిమా ఎందుకు చేయనంది? తాజా గుసగుస ప్రకారం... ఈ సినిమాలో తన పాత్రను హీరోల పాత్రలతో పాటు హీరోయిన్లు ఇషా గుప్తా, నేహాశర్మల పాత్రలతో పోల్చి చూసుకుందట. కొలతలు వేసిందట. మిగిలిన వారితో పోల్చితే తన పాత్రకు ప్రత్యేకత ఏదీ కనిపించలేదట. ‘మొక్కుబడిగా కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తేనే మేలు’ అనుకొని డెరైక్టర్ నీరజ్‌కు, ప్రొడ్యూసర్ ఫిరోజ్‌కు ‘సారీ’ చెప్పిందట! -
ఇది ఓ విజువల్ ఫీస్ట్ : దేవిశ్రీ ప్రసాద్
‘‘ ‘పులి’ లాంటి అడ్వంచరస్, ఫ్యాంటసీ చిత్రానికి మ్యూజిక్ అందించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు శింబుదేవన్ విజన్‌కు హ్యాట్సాఫ్’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. శింబుదేవన్ దర్శకత్వంలో విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా, సీనియర్ నటి శ్రీదేవి ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం ‘పులి’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సిబు థమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా పతాకంపై శోభారాణి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీలను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఈ కథ విని చాలా ఇన్స్పైర్ అయ్యాను. పాటలు స్వరపరచడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్’’ అని అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘విజయ్ నటించిన సినిమాలు తెలుగులో బాగా ఆడాయి. ఏ భాషా చిత్రాలు వచ్చినా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు. ‘‘ ‘తుపాకి’ వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత విజయ్‌గారు హీరోగా నటించిన ‘పులి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి శ్రీదేవి క్యారెక్టర్ హైలైట్. దర్శకుడు ఆమె క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు’’ అని శోభారాణి అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు కొరటాల శివ, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
రెండు కానుకలు!
ఒకప్పుడు నటీనటులు సినిమాలో తమపై వచ్చే పాటలను తామే పాడుకునేవాళ్లు. ఆ తర్వాత తర్వాత ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చేశారు. దాంతో నటీనటులు పాడటం మానేశారు. ఇప్పుడు మళ్లీ తారలు పాడే ట్రెండ్ మొదలైందని చెప్పాలి. హీరో, హీరోలు సరదాగా పాటలు పాడేస్తున్నారు. శ్రుతీ హాసన్, నిత్యామీనన్, ఆలియా భట్, శ్రద్ధా కపూర్, సోనాక్షీ సిన్హాలు ఇప్పటికే సింగర్స్‌గా తమ ప్రతిభ నిరూపించుకున్నారు. ఇప్పుడీ జాబితాలో ఐశ్వర్యా రాయ్ చేరనున్నారు. ‘జజ్బా’ చిత్రంతో ఐశ్వర్యా రాయ్ రీ-ఎంట్రీ కావడం అభిమానులకు ఓ మంచి కానుక. ఈ చిత్రం ద్వారా ఆమె మరో కానుక కూడా ఇవ్వనున్నారు. ఈ చిత్రంతో ఆమె గాయని అవతారం ఎత్తనున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. ఇందులో ఓ పాటను ఐష్ పాడితే బాగుంటుం దని దర్శకుడు అడిగితే, ముందు ఊహూ అన్న ఆమె, తర్వాత ఓకే అన్నారు. ఈ పాటను త్వరలో రికార్డ్ చేయనున్నారు. -
అమ్మ, నాన్నను సంప్రదించం
మాకు సంబంధించిన ఏ విషయాన్ని మా అమ్మా నాన్నలను అడగం, సంప్రదించం కూడా అంటున్నారు నటి శ్రుతిహాసన్. ఇప్పుడు భారతీయ సినిమా అభిమానుల కలల రాణిగా ఎదుగుతున్న కథానాయకి ఈమె అని చెప్పవచ్చు.నటన అనేది శ్రుతిహాసన్ రక్తంలోనే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నటనలో వేళ్లూరుకు పోయిన కమలహాసన్, సారిక పుత్రికారత్నాలు శ్రుతిహాసన్, అక్షరహాసన్. శ్రుతి తమిళం, తెలుగు, హిందీ అంటూ ఏక కాలంలో టాప్ హీరోయిన్గా దుమ్మురేపుతున్నా రు. ఇటీవల విడుదలైన టాలీవుడ్ చిత్రం శ్రీమంతుడు ఈమె క్రేజ్‌ను మరింత పెంచిందని చెప్పక తప్ప దు. ఆ చిత్రంలోని ఆమె ఫొటోలను, నటించిన పాటల్ని ఇంటర్నెట్, యూట్యూబ్‌లలో అధికంగా చూ స్తున్నారని ఒక సర్వేలో తెలింది. కాగా శ్రుతిహాసన్ ఇంత తక్కువ కాలంలో అంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఆమె కుంటుబ నేపథ్యం కారణమనే అపోహ కొందరికి ఉండవచ్చు. అలాంటిదేమీ కాదని శ్రుతిహాసన్ మాటలు విన్నవారికి స్పష్టం అవుతుంది. ఇంతకీ ఈ టాప్ హీరోయిన్ ఏమంటున్నారో చూద్దాం. నటన, సంగీతం నాకు రెండు కళ్లు లాంటివి. చిన్నతనంలో అమ్మ సారిక నాకు సంగీతంపై ఆసక్తిని పెంపొందించి ప్రోత్సహించారు. అదే విధంగా నాన్న కమలహాసన్ నటనపై మోహాన్ని, ప్రపంచ సినీ అనుభవాన్ని రేకెత్తించారు. అలాంటి బలమైన పునాదినే నా చెల్లెలు అక్షర హాసన్‌కు ఇచ్చారు. అందువల్లే మేమిద్దరం మా పనుల్ని మేమే ఎవరి సహాయం లేకుండా సక్రమంగా చేసుకుపోతున్నాం. ఎలాంటి పరిస్థితుల్లోనయినా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలన్న నాన్న హితబోధనను పాఠిస్తున్నాం. కథలు వినడం,పారితోషికం మాట్లాడడం, కాల్షీట్స్ కేటాయించడం వంటి విషయాల్లో ఎవరి ప్రమేయం లేకుండా నేను,చెల్లెలు ఇష్టానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటాం. అమ్మానాన్నలు జోక్యం చేసుకోరు. అలాంటి స్వేచ్ఛను వారు మాకిచ్చా రు. ఇక నాన్నతో కలిసి నటించే విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. అలాంటి అవకాశం ఇంతకు ముందొకసారి వచ్చింది. అప్పుడు నా కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాను. నాన్నతో కలిసి నటించాలనే ఆకాంక్ష నాకు ఉంది. మరోసారి అలాంటి అవకాశం వస్తే వదులుకోను. అలాగే నా చెల్లెలు తమిళంలో ఎప్పుడు నటిస్తుందన్నది తననే అడగాలి. అక్షర నాకంటే ప్రతిభ గల నటి. మంచి కథ అమిరితే మేమిద్దరం కలిసి నటిస్తాం. -
చారుశీల... స్వప్న బాల!
‘‘ఈ చిత్రకథ విన్నప్పుడే హిట్ ఖాయం అనుకున్నా. అలాగే నేను చేసిన చారుశీల పాత్ర నా కెరీర్లో మెమొరబుల్‌గా నిలిచిపోతుందని ముందే తెలిసిపోయింది. సినిమా విడుదలయ్యాక కూడా అందరూ ఈ పాత్రను ఇష్టపడుతున్నారు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన శివగారికి చాలా థ్యాంక్స్. పాటలపరంగా కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘చారుశీల.. స్వప్న బాల’ చాలా బాగుందని అందరూ అంటున్నారు’’ అని కథానాయిక శ్రుతీహాసన్ చెప్పారు. మహేశ్‌బాబు, శ్రుతి జంటగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ-‘‘ ‘శ్రీమంతుడు’ ఇంత పెద్ద శ్రీమంతుడు అవుతాడని ఊహించలేదు. ‘మంచి ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా’ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సాధారణంగా ఏ సినిమా అయినా ఒక సెక్షన్‌కి నచ్చుతుంది, ఇంకో సెక్షన్‌కు నచ్చదు. కానీ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకున్న సినిమా ఇది. ఇంత పెద్ద సక్సెస్‌ను అసలు ఊహించలేదు. తమిళ పరిశ్రమలోని దర్శక, నిర్మాతలందరూ ఫోన్ చేసి ఓ మంచి యూనివర్శల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీశారని అభినందించారు’’ అని తెలిపారు. ‘‘మేం ఈ సినిమాను చాలా ప్రేమించి చేశాం. విడుదలయ్యాక ప్రేక్షకులు అంతకు మించిన ప్రేమను కురిపిస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ మూవీకి చాలా పెద్ద సక్సెస్‌నిచ్చారు’’ అని జగపతిబాబు చెప్పారు. -
శ్రీమంతుడు దిల్లున్నోడు
‘అంతా నేనే’ అనుకుంటే అధిపతి అవుతారేమో! ‘అంతా నాది’ అనుకుంటే ఆస్తిపరులు అవుతారేమో! ‘అంతా మనవాళ్లే’ అనుకుంటే శ్రీమంతులవుతారు. ఆస్తి సున్నా అయినా ఫర్వాలేదని... సంతకం పెట్టిన చెక్కుమీద ఎక్కువ సున్నాలుంటే... ఓహ్... దిల్లున్న మహారాజులవుతారు. మనిషి జీవితాన్ని ఎంతగా ప్రేమించాడన్నది విషయం కాదు... మనిషి ఎంతమంది ప్రేమను సంపాదించాడన్నది పరమార్థం. అదే ఈ శ్రీమంతుడి అసలైన బ్యాంక్ బ్యాలెన్స్. తారాగణం: మహేశ్‌బాబు, శ్రుతీహాసన్, జగపతి బాబు, ముఖేశ్‌రుషి, రాజేంద్రప్రసాద్, సుకన్య, తులసి; కెమేరా: మది; సంగీతం: దేవిశ్రీప్రసాద్; ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్; రచన - దర్శకత్వం: కొరటాల శివ; రిలీజ్ డేట్: ఆగస్టు 7; నిడివి: 163 నిమిషాలు. కొత్త సినిమా గురూ! ఆగస్టు 9వ తేదీ. హీరో మహేశ్‌బాబు పుట్టినరోజు. ప్రతి ఏటా మహేశ్ ఫ్యాన్స్‌కూ, ఆయన తండ్రి హీరో కృష్ణ ఫ్యాన్స్‌కూ అది పండగరోజు. కానీ, ఈ సారి పండుగ రెండు రోజులు ముందే వచ్చింది. ఆగస్టు 7... శుక్రవారం... హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పాపులర్ సినిమా థియేటర్ల దగ్గర కోలాహల వాతావరణమే అందుకు ఉదాహరణ. ఒక్క రాజధానిలోనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్యపట్నాల్లో... దేశవిదేశాల్లో ఇంచుమించు ఇదే సీన్... రిపీట్. ‘శ్రీమంతుడు’ రిలీజ్. వెనక్కి ఇచ్చేయాలనుకున్న ‘శ్రీమంతుడు’ ఇంతకీ ‘శ్రీమంతుడు’లో ఏముంది? సినిమా కథేమిటి? రొటీన్‌గా వస్తున్న సినిమాలకు భిన్నమైన స్టోరీలైన్ ఇది. ఉద్యోగం, వ్యాపారం కోసం సొంత ఊరొదిలేసి వచ్చేస్తున్న మనం ఎంతో సంపాదించినా, ఆ ఊరికేం చేస్తున్నాం? ఏం చేయాలి? అన్నది బేసిక్ పాయింట్. మొత్తం రెండు గంటల 43 నిమిషాల నిడివి... యు/ఏ సర్టిఫికెట్. రవికాంత్ (జగపతిబాబు) పాతికవేల కోట్ల వ్యాపారానికి అధిపతి. భార్య (సుకన్య), తమ్ముడు (సుబ్బరాజు), మేనల్లుడు కార్తీక్ (రాహుల్ రవీంద్ర) - ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఇంత కుటుంబానికీ, వ్యాపారానికీ ఒకే ఒక్క వారసుడు... హర్ష (మహేశ్‌బాబు). తండ్రికేమో కొడుకు తన లైన్లోకొచ్చేసి, వ్యాపారం చూసుకోవాలని! కానీ, కొడుకు ఆలోచన వేరు. ‘లెట్ మీ ఎర్న్ సమ్ రెస్పెక్ట్’ అంటాడు. డబ్బును పెంచుకొనే కన్నా ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న అనుబంధాలనూ, ఆత్మీయతనూ పంచుకోవాలంటాడు. పెంచుకోవాలంటాడు! బెంజ్ కార్లున్నా స్టయిలిష్ సైకిల్ వాడే టైపు! ఆఫీస్ స్టాఫ్ చేసుకొనే శ్రీరామనవమి ఉత్సవానికి తండ్రి ఎగ్గొట్టినా, తాను వెళ్ళి ‘రామ రామ...’ అంటూ రామాయణ గీతం పాడి, ఆడి వచ్చే రకం. అందుకే, తండ్రికీ, కొడుకుకూ మధ్య ఒక చిన్న గ్యాప్. ఇంతలో హీరోకు చారుశీల (శ్రుతీహాసన్) తారసపడుతుంది. ఎం.బి.ఏ. చదివి, రూరల్ డెవలప్మెంట్ కోర్స్ చేస్తుంటుంది. ‘చాలా ఇచ్చింది మా ఊరు.ఎంతో కొంత తిరిగిచ్చేయాలి’ అంటూ ఉంటుంది. ఆమె ప్రభావంతో హీరో కూడా రూరల్ డెవలప్మెంట్ కోర్సులో చేరతాడు. ‘జత కలిసే జత కలిసే...’, ‘చారుశీలా స్వప్నబాలా...’ అని పాడుకుంటూ, ప్రేమలో పడతాడు. అతను ఫలానా డబ్బున్నవాళ్ళ కుర్రాడని తెలియక, ఆమే ప్రేమించేస్తుంది. మరోపక్క కేంద్ర మంత్రి వెంకట రత్నం (ముఖేశ్ ఋషి) కథ. హైవేల విస్తరణ కాంట్రాక్ట్ కోసం అతని కొడుకు (హరీష్ ఉత్తమన్) వచ్చి, హీరో తండ్రిని బెదిరిస్తాడు. విషయం తెలిసి, హీరో రంగంలోకి దిగుతాడు. విలన్ల బెండు తీస్తాడు. ఉత్తరాంధ్రలోని దేవరకోట గ్రామం ఆ కేంద్రమంత్రిది. అతని తమ్ముడు శశి (‘మిర్చి’ ఫేమ్ సంపత్‌రాజ్) ఆ ప్రాంతాన్నీ, ప్రజల్నీ పట్టి పీడిస్తుంటాడు. ఆ ఊరికి సరైన రోడ్డు లేదు. బడి లేదు. వ్యవసాయానికీ, తాగునీటికీ ఆధారమైన చెరువు కూడా మద్యం ఫ్యాక్టరీ నడిపే విలన్ల చేతిలోనే. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతుల ఆత్మహత్యలు... ఒక్కో కుటుంబం హైదరా బాద్‌కు వలసలు... హీరోయిన్‌దీ ఆ గ్రామమే. శ్రీమం తుల బిడ్డ అయిన హీరోవాళ్ళదీ ఆ ఊరేనని హీరోయిన్ తెలుసుకుంటుంది. ‘మీ ఊరేదో తెలుసా? ఊరొదిలి వచ్చేసిన మీ నాన్న ఆ ఊరికేం చేశారు’ అంటూ హీరోని నిలదీస్తుంది. హీరో ఆలోచనలో పడతాడు. మూలాలు వెతుక్కుంటూ ఊరి బాట పడతాడు. అక్కడ ఇంటర్వెల్ బ్లాక్. ఇంటర్వెల్ అయిన తరువాత నుంచి కథ ఊళ్ళో తిరుగుతుంది. ఊరికి వెళ్ళిన హీరో తానెవరో బయటపెట్టడు. ఊరి బాగు కోసం సిద్ధపడతాడు. అదే ఊరిలో పుట్టి పెరిగి, ఊరొదిలేసి పట్నానికి వచ్చేసిన తన తండ్రి ఫ్లాష్‌బ్యాక్ తెలుస్తుంది. ఇవాళ ఇంత కమర్షియల్ బిజినెస్‌మ్యాన్‌గా తన తండ్రి ఎందుకు మారాడో అర్థమవుతుంది. ఇంతకీ హీరో తండ్రి జీవితంలో ఉన్న మానని గాయం ఏమిటి? కన్నతల్లి లాంటి ఊరిని అతనెందుకు వదిలేశాడు. పది నిమిషాల ఈ ఫ్లాష్‌బ్యాక్‌తో అంతా తెలుసుకున్న హీరో ఆ ఊరికి వెనక్కి ఏమిచ్చాడు? ఊరిని వేధిస్తున్న విలన్లు హీరో కోస్టల్ కారిడార్ రానున్న ఉత్తరాంధ్రలోని వేలకొద్దీ పొలాల్ని బలవంతంగా రాయించుకోవాలన్న విలన్ల ప్లాన్ ఏమైంది? హీరోకూ, అతని తండ్రికీ మధ్య సయోధ్య కుదిరిందా? హీరో ఏ రూట్ తొక్కాడు? ఇదంతా వెండితెరపై వచ్చే ‘శ్రీమంతుడు’ మిగతా కథ. టీమ్ వర్క్ అమెరికాలో డిస్ట్రిబ్యూటర్స్‌గా పేరు తెచ్చుకొన్న ముగ్గురు మిత్రులు (నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్) నిర్మాతలై, తొలిసారిగా చేసిన ప్రయత్నమిది. ‘భద్ర’, ‘ఒక్కడున్నాడు’, ‘బృందావనం’ తదితర చిత్రాల రచయితగా మొదలైన కెరీర్ కొరటాల శివది. దర్శకుడిగా ప్రభాస్‌తో ‘మిర్చి’ లాంటి సూపర్‌హిట్ తీసిన ఆయనకు డెరైక్టర్‌గా ఇది రెండో ఫిల్మ్. రచయితగా తన స్ట్రెంత్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూనే, అలవాటైన కెమెరామన్ (‘మిర్చి’ ఫేమ్ మది), అనుభవజ్ఞుడైన ఎడిటర్ (కోటగిరి వెంకటేశ్వరరావు), మ్యూజిక్ డెరైక్టర్ (దేవిశ్రీప్రసాద్) అండ తీసుకున్నారు. మహేశ్‌బాబు లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్ అండ ఉండనే ఉంది. ఐటమ్ సాంగ్స్ లాంటి హంగామాలూ, కథలో కలవని సెపరేట్ కామెడీ ట్రాక్‌లూ, వినోదం పేరిట వెకిలి డైలాగ్‌లూ సినిమాలో కనిపించవు. రెండు సినిమాల తర్వాత... నిజానికి, మహేశ్ నటించిన గత రెండు సినిమాలూ - ‘1... నేనొక్కడినే’, ‘ఆగడు’ అంచనాల్ని అందుకోలేదు. ప్రేక్షకులు, ఫ్యాన్సే కాదు... మహేశ్ కూడా డిజప్పాయింటెడ్. అందుకే ఇప్పుడు ‘శ్రీమంతుడు’పై ఆశలు, అంచనాలు. ‘బాహుబలి’తో ప్రేక్షకులు, పరిశ్రమ మంచి జోష్ మీద ఉన్న టైమ్‌లో మహేశ్ కరెక్ట్‌గా మళ్ళీ తెరపైకొచ్చారు. ఎక్కడ ఉండి సినిమా చూస్తున్నవాళ్ళకైనా... కన్నతల్లి లాంటి సొంత ఊరిని గుర్తు చేశాడు! కమర్షియల్ హీరోలు తటపటాయించే ఇలాంటి స్టోరీలైన్‌ను ఓకె చేయడం, నటిస్తూనే ప్రొడక్షన్లో పార్ట్నర్ కూడా కావడం - మహేశ్ గొప్పే! ఇలాంటి కథ... మధ్య మధ్యలో ‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత వెనక్కి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం’ లాంటి మంచి డైలాగులు... మొత్తం మీద ఒక మంచి కాన్సెప్ట్‌ను మాస్కు చేరవేయడంలో కొరటాల శివ ప్రయత్నం కూడా మెచ్చుకొని తీరాల్సిందే! సొంత ఊరిని బాగుచేయడమనే కాన్సెప్ట్ కె. విశ్వనాథ్ - బాలకృష్ణల ‘జననీ జన్మభూమి’ నాటి నుంచి ఉన్నదే. అయితే, ఊరును దత్తత చేసుకొని, బాగు చేయాలంటూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు ఇప్పటికి ఇది గుడ్ కమర్షియల్ ఎటెంప్ట్ ఆన్ సిల్వర్‌స్క్రీన్! తమిళ, మలయాళ సీమల్లోనూ శుక్రవారమే తమిళ వెర్షన్ రిలీజైంది. క్లీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించే ఆడియన్స్ అభిమానధనం ఇప్పటికి ఈ ‘శ్రీమంతుడు’ సొంతం! మీకు తెలుసా? ► అన్నయ్య రమేశ్, అక్కయ్య మంజుల నిర్మాతలైన చిత్రాల్లో గతంలో మహేశ్ పాలుపంచుకున్నారు. ఇప్పుడు తొలిసారిగా ‘మహేశ్‌బాబు ఎంటర్టైన్ మెంట్ ప్రై.’ పెట్టి, ‘శ్రీమంతుడు’ పార్ట్నరయ్యారు. ►‘రామ రామ’లో హీరోయిన్ పూర్ణ డ్యాన్స్ చేశారు. ►ఒకప్పటి సూపర్‌హిట్ ‘పెద్దరికం’ జంట సుకన్య, జగపతిబాబు చాలా ఏళ్ల తర్వాత కలిసి నటించారు. మహేశ్ అమ్మానాన్న పాత్రలు చేశారు. ►‘శంకరాభరణం’ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు, ‘స్వరకల్పన’ తదితర చిత్రాల్లో హీరోగా నటించిన ఏడిద శ్రీరామ్ చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో ఓ పాత్ర చేశారు. ► ఇంతకు ముందు కూడా మహేశ్ సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. అయితే తెలుగుతో పాటే తమిళంలోనూ అదే రోజు రిలీజైన తొలి సినిమా ఇదే. తమిళ వెర్షన్ పేరు ‘సెల్వందన్’. ► ఈ సినిమాకు సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి. ‘రామ... రామ’ పాటలో ముందు వచ్చే సాకీ పాడుతూ, ఆయన తెరపై కనిపిస్తారు. ► ఇందులో మహేశ్ ఉపయోగించిన సైకిల్ ఖరీదు సుమారు 4 లక్షల రూపాయలు. ఆటోమేటిక్ గేర్స్ ఉండడం దీని స్పెషాల్టీ. ముందు ఏమనుకున్నారంటే... ► ఈ కథను మహేశ్ కన్నా ముందు ఇంకో హీరోకి చెప్పారట దర్శకుడు కొరటాల శివ. ఆ హీరో ఆసక్తి చూపకపోవడంతో ప్రాజెక్ట్ మహేశ్ దగ్గరకొచ్చింది. ► ‘శ్రీమంతుడు’ కన్నా ముందు ‘ఊరికి మొనగాడు’, ‘మగాడు’ లాంటి టైటిల్స్ ప్రచారమయ్యాయి. ఎక్కడెక్కడ తీశారంటే... ► హైదరాబాద్, ఆర్ఎఫ్సీ, పొల్లాచ్చి, కారైక్కుడి, పుణే, మలేసియా ► మొత్తం వర్కింగ్ డేస్... సుమారు 120 రోజులు బిజినెస్ ఖబర్ ‘శ్రీమంతుడు’ రూ. 60 కోట్ల నిర్మాణవ్యయంతో తయారైనట్లు ప్రచారం. విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ మిగిల్చింది. ‘శ్రీమంతుడు’ శాటిలైట్ రైట్స్ ‘జీ తెలుగు’ సొంతం చేసుకుంది. రైట్స్ దాదాపు రూ. 10 కోట్ల పైగా మొత్తం పలికినట్లు వ్యాపారవర్గాల భోగట్టా. శాటిలైట్ రైట్స్ రేట్లు రూ. 10 కోట్ల పై మాట పలకడం తెలుగు సినీ చరిత్రలో తొలి సారి. (‘బాహుబలి’ రైట్స్ తుది రేటు ఇంకా చర్చల్లోనే ఉంది). రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు అధికారికంగానే బాగా పెంచేశారు. దీంతో సినిమా నికరవసూళ్లు బాగా పెరుగుతాయి. - రెంటాల జయదేవ -
ముంబయ్ అత్తవారిల్లు... తమిళనాడు పుట్టినిల్లు - శ్రీదేవి
‘‘చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది. ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది’’ అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘పులి’. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి. సెల్వకుమార్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా పతాకంపై సి.జె. శోభ తెలుగులో విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. హీరో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఆయన సతీమణి సంగీతా విజయ్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ -‘‘నాకు చాలా కాలంగా చారిత్రక నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఓ సినిమా చేయాలని కోరిక ఉండేది. ‘పులి’ చిత్రంతో అది కాస్తా తీరిపోయింది. శ్రుతీహాసన్, హన్సిక ఇద్దరూ పోటీపడి నటించారు. సీనియర్ నటి శ్రీదేవి గారు నా సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కథ వినగానే వెంటనే చేయడానికి అంగీకరించడం విశేషం. పరీక్ష రాశాం. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు శ్రుతీహాసన్, హన్సిక, తమిళ గీత రచయిత వైరముత్తు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరికి మొనగాడు
మహేశ్‌తో స్పెషల్ చిట్‌చాట్ ► మహేష్ తన ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నాడు. ► మహేష్ ఫ్యాన్స్ మహేష్‌ని దత్తత తీసుకున్నారు. ► సినిమా ఫ్యాన్స్ మహేష్ నటనను దత్తత తీసుకున్నారు. ► మహేష్.... మహేష్ కంటే పెద్దవాడైపోయాడు...ఇమేజ్ ప్రభావం. ► తనని తాను దత్తత తీసుకోలేనంతగా ఎదిగిపోయాడు. ► శుక్రవారం లక్ష్మీకటాక్షమూ అభిమాన ధనప్రాప్తమూ ఉంటుందని చిద్విసిలాసంగా మాట్లాడాడు. శుభం. ► జరిగేవన్నీ మంచికని ఈ శ్రీమంతుడు, ఊరిని దత్తత తీసుకున్న ఈ మొనగాడు... ► తప్పులను దత్తత తీసుకుని కొత్త క్యారెక్టర్లను మంచి పెంపకంతో మార్చుకుంటున్నాడు. ► అయినా సరే ధైర్యంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. ► దత్తత తీసుకున్న ఇంతమంది ఆశయానికి పని చేయాలి తప్పదు! ► సినిమాను ప్రేమించి చేద్దామని ఆశ పడితే సరిపోవడం లేదు. ‘శ్రీమంతుడు’తో ఆగస్ట్ 7న పలకరించనున్న మహేశ్ చెప్పిన ముచ్చట్లు... చాలా రోజుల తరువాత మళ్లీ ‘శ్రీమంతుడు’తో మీ ముందుకొస్తున్నా. ఇది మంచి స్క్రిప్ట్. తెలుగులోని బెస్ట్ రైటర్స్‌లో ఒకరైన కొరటాల శివ చెప్పిన కథ బాగుంది. కథలో బలమైన విషయముందని ఫీలయ్యా. అందుకే, చెప్పగానే ఒప్పుకున్నా. చెప్పినదానికన్నా బాగా తీశారాయన. మా జర్నీ బాగుంది. ఈ సినిమా, పాత్ర కోసం అనేకం వదిలేశా! ‘ఖలేజా’, ‘దూకుడు’ లాంటి సినిమాల్లో చేసిన పాత్రల్లో కామెడీ మిళితమై ఉంటుంది. కానీ, ప్రతి సినిమాలో అలాగే ఉండడం కుదరదుగా! ‘శ్రీమంతుడు’లో పాత్ర కొత్తగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఉండదు. నటిస్తున్నట్లు కాకుండా, క్యారెక్టర్లా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అందుకే, నటనకు సంబంధించి గతంలో అలవాటైన అనేక అంశాలను వదులుకున్నా. ఇక, టైటిల్ గురించి చెప్పాలంటే, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కాగానే శివ గారు వచ్చి ‘శ్రీమంతుడు’ టైటిల్ చెప్పారు. ఆ టైటిల్ జస్ట్ యాప్ట్. నిర్మాణం నాకు కొత్తేమీ కాదు! నిర్మాణంలో పార్ట్నర్ కావడం నాకు కొత్తేమీ కాదు. గతంలో మా అక్కయ్య, మా అన్నయ్య సినిమాలకూ చేశా. అప్పట్లో ఎగ్జిక్యూషన్ కూడా చేశాం. ఈసారి ‘ఎం.బి. ఎంటర్టైన్మెంట్’ అని సొంత బ్యానర్‌పై, ఎగ్జిక్యూషన్‌తో సంబంధం లేకుండా చేస్తున్నా. అంతే తేడా! నా బ్యానర్‌పై ప్రస్తుతానికి నా సినిమాలే ఉంటాయి. అసలు వీటికే టైమ్ సరిపోదు, ఇతరులతో తీయడమెక్కడ? ఈ సినిమా, పాత్ర కోసం చాలా వదిలేశా! ఒకవైపు నటన, మరోవైపు నిర్మాణం చేస్తున్నా. ఇక దర్శకత్వమంటారా? ఆ ఆలోచన ఏమీ లేదు. డెరైక్షన్ చేయమంటున్నారు... (నవ్వుతూ) ఏమిటీ? ఇక్కడున్న అందరినీ పంపించేద్దామనే...! ఆస్వాదిస్తూ చేస్తే... అద్భుతం! ఫ్యాన్స్‌ను మెప్పించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంటా. ‘శ్రీమంతుడు’లో డ్యాన్సులు బాగున్నాయంటే డ్యాన్స్‌మాస్టర్ రాజుసుందరం, డెరైక్టర్ శివ ప్రతిభ. వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ చేసుకు వెళ్ళానంతే! ఏ పనైనా ఆస్వాదిస్తూ చేస్తే అద్భుతమైన అవుట్పుటొ స్తుంది. చారుశీలా పాటకి పేరురావడానికదే కారణం. శ్రుతీహాసన్ టెరిఫిక్ పెర్ఫార్మర్! కమలహాసన్ గారికి ఫ్యాన్‌ని. ఆయన కూతురు శ్రుతీహాసన్ టెరిఫిక్ పెర్ఫార్మర్. నా దృష్టిలో ఇప్పటి వరకు చేసినవాటిలో ఆమె బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక, నా తండ్రి పాత్రకు సరిగ్గా ఆయన లాంటి స్టేచర్ ఉన్నవాళ్ళు కావాలని జగపతిబాబును ఎంచుకున్నాం. ప్రమోషన్ మోస్ట్ ఇంపార్టెంట్! కో-ప్రొడ్యూసర్‌ను కాబట్టి, ‘శ్రీమంతుడు’కి నేనే స్వయంగా ప్రమోషన్‌కు రావడమని కాదు. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసినప్పుడు, దానికి ప్రమోషనూ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే, ఇంత ప్రమోట్ చేస్తున్నా. నేను ఎక్స్పరిమెంట్స్ చేయలేదా? కొత్త తరహా పాత్రలు చేయరేంటని కొందరు అడుగుతుంటారు. ఏం! నేను ఎక్స్పరిమెంట్స్ చేయలేదా? ‘టక్కరిదొంగ’, ‘నాని’, ‘1... నేనొక్కడినే’ -ఇవన్నీ ఎక్స్పరిమెంట్సే కదా! ఐ ఎక్స్పరిమెంటెడ్ ఎ లాట్! దురదృష్టవశాత్తూ అవేవీ వర్కౌట్ కాలేదు. బహుశా, వాటిలో తప్పులు జరిగి ఉంటాయి. మరోపక్క ఇవాళ ప్రతి సినిమా బిగ్ బడ్జెట్‌తో తయారవుతోంది కాబట్టి, పాత తప్పులు రిపీట్ కాకుండా నేను చూసుకోవాలి! అల్లూరి సీతారామరాజు నాకు బైబిల్! నాన్న గారి సినిమాల్లో ‘అల్లూరి సీతారామరాజు’ నాకు బైబిల్ లాంటిది. వందసార్లయినా చూసి ఉంటా. అలాంటి క్లాసిక్‌ను మళ్ళీ మళ్ళీ చూసి ఆనందించాలే తప్ప, మనం చేయాలని టచ్ చేయకూడదు. ఇక, నాన్న గారి లాగా జేమ్స్‌బాండ్ తరహా సినిమాలంటారా? అలాంటి కథతో నేను బాగుంటానని అనుకున్న డెరైక్టర్స్, రైటర్స్ తమదైన విజన్‌తో ముందుకొస్తే ఓకె. అంతేకానీ, నాకు ఫలానా పాత్ర చేయాలనుందని, నేనే కథ వండించడం కరెక్ట్ కాదు. తమిళంలోకీ వెళుతున్నా! ‘అతడు’ లాంటి డబ్బింగ్ వెర్షన్లు తమిళంలో బాగా ఆడాయి. ‘శ్రీమంతుడు’ తమిళంలో ఏకకాలంలో రిలీజ్ చేయాలని నెల క్రితం దాకా అనుకోలేదు. కానీ, కెమేరామన్ ‘మది’ ఈ యూనివర్సల్ సబ్జెక్ట్‌ను తమిళంలోనూ అందిస్తే బాగుంటుందన్నారు. పైగా, తమిళ యూత్, లేడీస్ నా తెలుగు రిలీజ్లు చూస్తుంటారు కాబట్టి, తెలుగుతో పాటే తమిళంలో డబ్ చేసి, రిలీజ్ చేయాలనుకున్నాం. నెక్స్ట్ ‘బ్రహ్మోత్సవమ్’ను తెలుగుతో పాటు, తమిళంలోనూ స్ట్రెయిట్ ఫిల్మ్‌గా తీస్తున్నాం. చెన్నైలో పుట్టి పెరిగా కాబట్టి, తమిళం గడగడా మాట్లాడగలను కానీ, టైమ్ లేక డబ్బింగ్ చెప్పలేదు. మే బి నెక్స్ట్ టైమ్! ఈ 4న తమిళ శ్రీమంతుడు ‘సెల్వందాన్’ ఆడియో రిలీజ్. పుట్టి పెరిగిన చోట సొంత సినిమాకు ఈ ఫంక్షన్లో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైమ్. బాలీవుడ్‌కు టైమ్ లేదు! బాలీవుడ్ ఈజ్ ఎ బిగ్గర్ క్యాన్వాస్. కానీ, అక్కడ చేయడానికి, టు బి ఆనెస్ట్ అంత టైమ్ ఎక్కడుంది! తెలుగులోనే ఏటా రెండు సినిమాలు చేయాలంటే కుదరడం లేదు. కథలున్నాయి, దర్శకులున్నారు కానీ, ప్రతి సినిమాకూ ఏడెనిమిది నెలలవుతోంది. బాలీవుడ్కెళితే, రెండు, మూడేళ్ళు మన చిత్రాల్లో కనపడం! అందుకే నాకా ఉద్దేశం లేదు. ‘బజ్రంగీ భాయ్’ లాంటి వాటికి నేను రెడీ! హిందీలో ‘బజ్రంగీ భాయ్‌జాన్’, ‘పీకే’ లాంటి సినిమాలు ఇక్కడా రావాలి. ఇక్కడెందుకు రావడం లేదనే ప్రశ్న నన్ను కాదు... దర్శకులనూ, రచయితలనూ అడగాలి. నిజం చెప్పాలంటే, అవి ఎక్స్పరిమెంట్స్ కాదు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు. ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిన సినిమాలు. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే చేయడానికి నేను రెడీ! కొత్త దర్శకులతోనూ చేస్తా! నాకు ఫ్రెండ్స్ లేరు! ఇవాళ ఫ్రెండ్షిప్ డే. కానీ, నిజం చెప్పాలంటే నా లైఫ్‌లో బెస్ట్ ఫ్రెండ్ మాట అలా ఉంచండి. నాకు ఫ్రెండ్సే ఎక్కువ లేరు. ఉన్నవాళ్ళంతా చెన్నైలోనే ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చేశాక, వాళ్ళతో టచ్ పోయింది. చేస్తున్న సినిమాల దర్శకులు, యూనిట్లే నాకిప్పుడు ఫ్రెండ్స్. మా అమ్మాయి నాటీ! మా పిల్లలిద్దరిలో అమ్మాయే నాటీ! మా అబ్బాయి గౌతమ్ గుడ్ బాయ్. మూడేళ్ళ మా సితార మాత్రం మహా నాటీ. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటే నాకు టైమ్ తెలీదు. మా మూడు తరాలూ కలసి సినిమా! నాన్న గారు, నేను, మా గౌతమ్ - ఇలా మూడు తరాలం కలసి సినిమా చేస్తే, బాగుంటుంది. ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్. అందుకు తగ్గ మంచి కథ దొరికితే, తప్పకుండా చేస్తాం. సారీ చెప్పింది అందుకే! ఫెయిల్యూర్స్ రూపంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు ఆ ప్రభావం నా మీదా ఉంటుంది. గత రెండు చిత్రాలు ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన మాట నిజం. ‘శ్రీమంతుడు’ ఆడియో రిలీజ్ వేడుకలో వాళ్ళకు సారీ చెప్పింది అందుకే! కాకపోతే, ఫెయిల్యూర్స్ నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా. అంతేతప్ప, ఇట్ డజ్ నాట్ ఎఫెక్ట్ మై ఛాయిసెస్. థియేటరికల్ రిలీజ్ టైమ్‌లో అంతగా ఆదరణ పొందని ‘1...నేనొక్కడినే’ లాంటి సినిమాలను టీవీలో చూసి, జనం అద్భుతం అంటూ ఉంటే, ఏం చేస్తాం! ఒక చిన్న నవ్వు నవ్వడం తప్ప! నేనెప్పుడూ ఎవరి మాటా వినలేదు..! మీకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్. అభిమాన ధన శ్రీమంతుడైన మీరు ఈ సినిమా ద్వారా ఇంకేం సంపాదించాలనుకుంటున్నారు? సంపాదించడం ఏమీ లేదు. ప్రతి సినిమాకూ ఒకటే గోల్... ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. దాని గురించి కష్టపడి పనిచేస్తాం అంతే. ఈ సినిమా మీ కెరీర్‌కు ఎంతవరకు క్రూషియల్? కెరీర్లో ప్రతి సినిమా కీలకమే. ఆ మాటకొస్తే, ప్రతి శుక్రవారం వెరీ క్రూషియల్. ఎందుకంటే సినిమా చాలామంది డబ్బులతో ముడిపడిన వ్యవహారం. మీరన్నట్లు ‘శ్రీమంతుడు’ నా కెరీర్‌కు చాలా క్రూషియలే. (నవ్వుతూ) ఎందుకంటే గత సినిమాలు ‘1’, ‘ఆగడు’ ఆడలేదుగా! గత అనుభవాలతో ఆత్మపరిశీలన చేశారా? నేర్చుకున్న పాఠాలేంటి? అదేమీ లేదండీ! బ్యాడ్ సినిమా చేయాలని ఎవరూ అనుకోరు. సమ్‌టైమ్స్ వియ్ మేక్ మిస్టేక్స్. వియ్ లెర్న్ ఫ్రమ్ దోజ్ మిస్టేక్స్. లాస్ట్ టైమ్ చేసిన మిస్టేక్ ద్వారా కంటెంట్ కన్నా ఏదీ గొప్పది కాదని అర్థమైంది. కంప్లీట్ ప్యాకేజ్‌లా చేయాలి. అన్ని యాంగిల్స్నూ కవర్ చేయాలి. స్టోరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని తెలిసింది. ‘శ్రీమంతుడు’ హీరో కన్నా కంటెంట్ గొప్పదని నిరూపిస్తుంది. కంటెంట్ ఈజ్ బిగ్గర్ దేన్ ఎనీ స్టార్! ఫ్యాన్స్, స్టార్ ఇమేజ్ కంటెంట్ డెవలపింగ్‌లో ఇబ్బందిగా మారతాయా? డెఫినెట్లీ! స్టార్స్‌కు అదే ప్రాబ్లమ్. ఇమేజ్‌కు తగ్గట్టు సినిమా తీయాలి. అదే సమయంలో ఎప్పుడూ ‘ఇది చేయాలి..అది చేయాలి’ అంటూ పక్కనున్న వాళ్లు కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అందుకే, ఓన్‌గా డెసిషన్ తీసుకోవడం మంచిది. అందుకే, నేనెప్పుడూ ఎవరి మాటా వినలేదు. ఏదైనా సరే నా నిర్ణయమే. నాకు తోచిందే చేశా. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ అవన్నీ నా మిస్టేక్స్! ఆల్వేస్ ఐ టుక్ డెసిషన్స్ ఆన్ మై ఓన్! వర్కౌట్ అవకపోతే ఐ లెర్న్ట్ మై మిస్టేక్స్! ‘వాళ్లు చెప్పారు కాబట్టి నేను చేశా’నని ఎప్పుడూ అనను. దిస్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్! ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుంటారా? జాగ్రత్తలు తప్పవు. ఫ్యాన్స్‌కి గత సినిమాలో పాటలు నచ్చలేదంటే, ఎందుకో తెలుసుకుని ఈ సారి ఇంకా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. బాలనటునిగానే ప్రయాణం మొదలు పెట్టారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎప్పుడైనా, ఏదైనా స్పెషల్‌గా చేయాలనిపించిందా? నిజం చెప్పాలంటే, ఎప్పుడూ అలానే అనుకుంటూ ఉంటా. అలా వచ్చినవే - ‘టక్కరిదొంగ’, ‘నాని’, ‘ఒక్కడు’. అలాగే, ‘పోకిరి’ కూడా ఆ టైమ్‌కి ఫ్రెష్ కదా. ఏ కథలో అయినా ఫ్రెష్‌నెస్ గురించే చూస్తా. రెగ్యులర్‌గా అనిపిస్తే నాకూ బోర్ కొడుతుంది. ‘సీతమ్మ వాకిట్లో...’ లానే ‘శ్రీమంతుడు’ ఫ్యామిలీ ఎంటర్టైనరా? ‘శ్రీమంతుడు’ ఓ బిగ్ క్యాన్వాస్‌లో చెప్పిన కథ. ఇటీజ్ లార్జర్ దేన్ లైఫ్. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. శివగారు గతంలో తీసిన ‘మిర్చి’ కూడా పెద్ద క్యాన్వాస్ సినిమా. చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఇదీ అంతే. హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా ఉంటాయి. నేను వినగానే చాలా ఎగ్టయిట్ అయ్యా. చూశాక కూడా చాలా బాగా నచ్చింది. ఊరిని దత్తత తీసుకునే ఈ చిత్ర కాన్సెప్ట్ మీ లైఫ్‌లోనూ జరిగిందిగా? అదేమీ లేదండి జస్ట్ కో-ఇన్సిడెన్స్. ‘ఆగడు’ సెట్స్‌పై ఉండగా, శివ ఈ కథ చెప్పారు. ఊరిని దత్తత తీసుకోవడమనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. చేస్తూ వచ్చాం. తరువాత మా ఊరు బుర్రిపాలెంను దత్తత తీసుకున్నా. సినిమా రిలీజయ్యాక ఊరికి ఏం చేయాలి, ఎలా చేయాలనేది కుటుంబసభ్యులతో కూర్చొని ప్లాన్ చేస్తాం. మీ నిర్ణయాల్లో మీ శ్రీమతి నమ్రత పాత్ర ఎలాంటిది? సినిమాకు సంబంధించిన నిర్ణయాల్లో నాదే డెసిషన్. నేను హీరోగా పరిచయమైన ‘రాజకుమారుడు’ సినిమా నుంచి మా నాన్నగారు నాకు ఆ స్పేస్ ఇచ్చారు. నాకు నేను ఏదైనా సొంతంగా చేయాలనే భావనతో ఆయన ఉండేవారు. అందుకే ఆయనంటే నాకు చెప్పలేనంత ఆరాధన. ‘ఇలా చేయాలి. ఇది చేయకూడదు’ అని ఆయనెప్పుడూ అనలేదు. ఏదైనా మనంతట మనం చేయాలి. నేర్చుకోవాలి. దట్స్ వాట్ ఐ బిలీవ్. సినిమాలు తీస్తుంటే హెల్ప్ చేయడానికి నమ్రత ఉంటుంది. అంతే తప్ప నా నిర్ణయాలు నావే. ఇంటి బడ్జెట్ అయినా, సినిమా బడ్జెట్ వ్యవహారాల లాంటి ఆర్థిక విషయాలైనా తనే చూసుకుంటుంది. కో-ప్రొడక్షన్‌తో స్టార్ హీరో రంగంలోకి దిగుడం వల్ల ఏమైనా ఎడ్వాంటేజ్ ఉంటుందంటారా? తప్పకుండా ఎడ్వాంటేజ్ ఉంటుంది. బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది. రెమ్యునరేషన్ త గ్గించుకోవచ్చు.రెమ్యునరేషన్ తగ్గించి, మహేశ్ జాగ్రత్తగా చేస్తున్నాడ ని మీ నాన్నగారు ఆ మధ్య చెప్పారు. నిజానికి, మునుపెన్నడూ ఏ సినిమాకూ రానంత రెమ్యూనరేషన్ నాకు ఈ సినిమాకు వచ్చింది. అదే సమయంలో బడ్జెట్ ఈజ్ అండర్ కంట్రోల్. కో-ఆర్డినేషన్‌తో చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. రిలీజ్ తర్వాత ఏమైనా ప్రాఫిట్స్ వస్తే, నాకూ కొంత వస్తాయి. ఇటీజ్ గుడ్ ఫర్ ఎనీ అదర్ హీరోస్ టు డూ ఇట్ టు కీప్ బడ్జెట్ ఇన్ కంట్రోల్. మణిరత్నం గారితో సినిమా చేయాలనే ఆలోచన ఏమైంది? అవునండీ. కానీ దురదృష్టవశాత్తూ, అది వర్క్‌వుట్ కాలేదు. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. రాజమౌళితో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎప్పుడన్నది కరెక్ట్‌గా చెప్పలేను. ‘బాహుబలి, రుద్రమదేవి’ లాంటి భారీ సినిమాలు రావడంపై? ఇంత పెద్ద స్టాండర్డ్స్‌తో రాజమౌళిగారు సినిమా తీయడం గర్వంగా అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపూ ఎగ్జయిట్ అయ్యా. ఆయనకు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాను. తెలుగు సినిమా స్టామినా ఉందని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పా. త్రీడీలో రానున్న తెలుగువారి చరిత్ర ‘రుద్రమదేవి’ గురించి... ట్రైలర్ చూశా. దర్శకుడు గుణశేఖర్గారిని కలిసి మాట్లాడాను. త్రీడీలో చేయడం మామూలు విషయం కాదు. ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్. ‘రుద్రమదేవి’ కూడా గొప్ప సినిమా అవుతుంది. గోన గన్నారెడ్డిగా మిమ్మల్ని చూడాలనుకున్నా, చేయలేదేం? టూ మెనీ డేట్స్ క్లాష్ కావడంతో చేయలేకపోయా. స్టయిల్, లుక్స్‌లో మీరు హ్యాండ్సమ్. ఏదైనా ఎక్స్ట్రా కేర్? ఫిట్నెస్ అనేది ప్రతి యాక్టర్‌కూ చాలా ముఖ్యం. అవి ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. ఇక, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాటా ఇప్పటికీ జనం ఫాలో అవుతున్న ‘పోకిరి’ షర్ట్ లాంటి స్టయిల్స్ అంటారా? కొన్ని క్యారెక్టర్స్, స్టయిల్స్ అలా వర్క్‌వుట్ అవుతాయి. ప్లాన్ చేస్తే ఏవీ కావు. ‘బాహుబలి’కి స్టార్స్ షేక్ అవ్వరు! ‘బాహుబలి’ కలెక్షన్స్ ఒక రకంగా మన మంచికే. స్టార్సేమీ షేకవ్వరు. ‘బాహుబలి’ అన్ని కోట్లు కలెక్ట్ చేశాక, తర్వాత వచ్చే సినిమాలు ఎక్స్ట్రా పది కోట్లు వసూలు చేస్తాయి. ఇలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ హీరోల సినిమాలకి కూడా 10 - 15 కోట్లు ఎక్కువ వస్తుంది. ఇన్నేళ్ల బట్టి నేను గమనించిన విషయం అది. ‘మగధీర’ తర్వాత అన్ని చిత్రాల రేంజ్లూ పెరిగాయి. ‘బాహుబలి’ కొత్త మార్కెట్ ఓపెన్ చేసింది. ఇదో శుభ పరిణామం. -
మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా!
శ్రుతీహాసన్ చాలా స్ట్రాంగ్! ఇండిపెండెంట్.. ఇంటెలిజెంట్! ఆమె దృష్టిలో గ్లామర్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్! ఎక్కడ ఎటాచ్ కావాలో... ఎప్పుడు డిటాచ్ కావాలో...ఆమెకు బాగా తెలుసు గ్రేట్ యాక్టర్ కమల్‌హాసన్ కూతురిగా గోల్డెన్ స్పూన్‌తో పెరిగినా లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసేశారామె.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శ్రుతి ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్. మహేశ్‌బాబుతో ‘శ్రీమంతుడు’లో చారుశీలగా క నబడిన శ్రుతి చెప్పిన ముచ్చట్లు... *** సినిమా సినిమాకీ మీ అందం పెరుగుతోందనిపిస్తోంది... ఏంటా రహస్యం? థ్యాంక్స్ అండి. చెప్పాలంటే నేను ప్రత్యేకంగా ఏమీ చేయడంలేదు. వయసుతో పాటు మెచ్యూర్టీ వస్తుంది కదా.. అప్పుడు అందం కూడా పెరుగుతుంది. *** అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుందా? అలా ఏం లేదు. స్టయిల్‌గా కనిపించడం కోసం జుత్తుకు రంగేసుకోవడం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం పెదాలకు రంగు వేసుకోవడం ముఖ్యం కాదు. లోపల మనం స్ట్రాంగ్‌గా లేకపోతే పై పైన ఎన్ని మెరుగులు దిద్దుకున్నా పేలవంగా కనిపిస్తాం. మన మీద మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే అప్పుడు అందంగా లేకపోయినా అందంగానే కనిపిస్తాం. బాహ్య సౌందర్యం అనేది దేవుడి ఇచ్చేది. ఇన్నర్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం అనేది మన చేతుల్లోనే ఉంది. అందంగా లేకపోయినా ఫర్వాలేదు... ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమీ చేయలేం. *** మీ ప్రొఫెషన్ అందంతో ముడిపడింది కాబట్టి, చాలా కేర్ తీసుకోవాలిగా? అఫ్కోర్స్ అది నిజమే. మాది గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి, కేర్ తీసుకోవాలి. లేకపోతే ప్రేక్షకులు డిజప్పాయింట్ అవుతారు. అలాగని బ్యూటీ కేర్ కోసం నేను గంటలు గంటలు కేటాయించను. ఎంత తీసుకోవాలో అంతే. *** స్ర్కీన్‌పై గ్లామరస్‌గా కనిపించే మీరు.. రియల్‌గా కూడా అలానే ఉండాలనుకుంటారా? నా పర్సనల్ లైఫ్‌లో నేను గ్లామరస్‌గా ఉండను. చాలా నిరాడంబరంగా ఉంటాను. వీలైనంతవరకూ మేకప్ జోలికి వెళ్లను. సింపుల్‌గా డ్రెస్ చేసుకుంటాను. హెయిర్ స్టయిల్ కూడా చాలా మామూలుగా ఉంటుంది. మొత్తం మీద చాలా కంఫర్టబుల్‌గా ఉండాలనుకుంటాను. *** తెలుగులో మీ తొలి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’ టైమ్‌లో కంటే... ఇప్పుడు నూతన నాయికల తాకిడి ఎక్కువైంది... పోటీ బలంగానే ఉంది కదా? నేను పోటీనీ పట్టించుకోను. ఎవరి సినిమాలు వాళ్లకి ఉంటాయి. అయినా ఏడాదికి 20 సినిమాలు వస్తే... అన్నింటిలో నేనే నటించలేను కదా. ఎన్ని చేయగలనో అన్నే చేస్తున్నాను. *** ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడంవల్ల విశ్రాంతి తీసుకునే వీలు చిక్కడంలేదేమో? చేతి నిండా పని ఇస్తున్నందుకు థ్యాంక్స్ టు గాడ్. విశ్రాంతి లేకపోతేనేం ఆనందంగా ఉన్నాను. *** మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు? ఎప్పుడో ఒకసారి చేసుకోవాల్సిందే. ఎప్పుడని చెప్పలేను. ఎందుకంటే, దాని గురించి అస్సలు ఆలోచించడంలేదు. *** ఓకే... త్వరలో విడుదల కానున్న మీ ‘శ్రీమంతుడు’ సినిమా విషయానికొద్దాం.. మహేశ్‌బాబుతో ‘ఆగడు’ కోసం ఐటమ్ సాంగ్ చేసినప్పుడు ఈ సినిమా సెట్ అయ్యిందా... అంతకుముందేనా? ‘శ్రీమంతుడు’ గురించి డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే ‘ఆగడు’ ఐటమ్ సాంగ్ చేశాను. ఆ పాట బాగుంటుంది. డ్యాన్స్‌కి స్కోప్ ఉంది కాబట్టి చేశాను. *** మహేశ్‌బాబు గురించి ఏం చెబుతారు? మంచి నటుడు. ఆయన ప్రవర్తన చాలా బాగుంటుంది. క్రమశిక్షణ గల వ్యక్తి. లొకేషన్లో తనతో పాటు పని చేసే వ్యక్తులు అసౌకర్యానికి గురయ్యేలా చేయరు. *** మహేశ్ బాగా జోక్స్ వేస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. మరి మీరేమంటారు? అవును. అది నిజమే. జోక్స్ వేస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ యూనిట్ మొత్తం చాలా సరదాగా ఉండేది. షూటింగ్ ఎలా పూర్తయ్యిందో తెలియనంత వేగంగా జరిగింది. *** మామూలుగా మహేశ్‌బాబు మంచి అందగాడు కాబట్టి, ఆయన సరసన నటించే నాయికలు పెద్దగా ఎలివేట్ కారనే టాక్ ఉంది... ఏవండీ... ఇదేమైనా ‘మిస్ ఇండియా’ పోటీనా? మేమంతా కలిసి సినిమా చేస్తున్నాం. మహేశ్ అందంగా ఉంటే మంచిదే కదా. హీరో, హీరోయిన్లిద్దరూ చూడచక్కగా ఉంటే సినిమాకి ప్లస్ అవుతుంది. *** ఈ చిత్రంలో మీరు చేసిన ‘చారుశీల’ పాత్ర గురించి? చారుశీల చాలా స్ట్రాంగ్... ఇండిపెండెంట్... ఇంటలిజెంట్. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నిటికన్నా భిన్నంగా ఉంటుంది. మామూలుగా నేను ఏ కొత్త పాత్ర అంగీకరించినా నా గత పాత్రలకు భిన్నంగా ఉండేలా చూసుకుంటాను. ఎందుకంటే, చేసిన పాత్రనే చేస్తే నాకు బోర్ కొడుతుంది. ఒకే రకమైన పాత్రలో నన్ను చూసి ప్రేక్షకులకూ బోర్ కొట్టేస్తుంది. *** కొరటాల శివ గురించి? సెన్సిబుల్ డెరైక్టర్. కామ్‌గా ఉండే స్వీటెస్ట్ టీచర్ అని చెప్పొచ్చు. నేను డెరైక్టర్స్ ఆర్టిస్ట్‌ని. వాళ్లకి ఎలా కావాలంటే అలా నటిస్తా. *** తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా.. మరి మీ పాత్రకు మీరు డబ్బింగ్ చెప్పుకోవచ్చు కదా? చెప్పాలనే ఉందండి. ‘ఎందుకు శ్రుతీతో డబ్బింగ్ చప్పించడంలేదు’ అని మీరు దర్శకులను అడగండి. నాక్కూడా హ్యాపీగా ఉంటుంది. *** మామూలుగా మీరు ఏ సినిమాలో నటించినా అందులో ఒక్క పాట అయినా పాడతారు కదా.. మరి ‘శ్రీమంతుడు’లో ఎందుకు పాడలేదు? ఈ ప్రశ్న కూడా మీరు కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్‌ని అడగాలి. సినిమాలో పాడించలేదు కాబట్టే, ఆడియో ఫంక్షన్ రోజున స్టేజి మీద పాడించారేమో (నవ్వుతూ). *** కమల్‌హాసన్ కూతురు కాబట్టి, సినిమా ఫీల్డ్‌లో మీ దారి రహదారి అనుకోవచ్చా? అలా ఏమీ లేదండి. బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి, డోర్ ఓపెన్‌గా ఉంటుంది. అవకాశం ఈజీగా వస్తుంది. ఒకవేళ నేను బాగా నటించలేదనుకోండి... కమల్‌హాసన్ కూతురే కదా అని రెండో అవకాశం ఇవ్వరు. నేను నటించాలి. కొత్తవాళ్లకి ఉండే ప్రెజర్స్ వాళ్లకుంటాయి. మాకుండేవి మాకుంటాయ్. రెండో సినిమాకే మా తల్లిదండ్రుల్లా గొప్ప నటన కనబర్చాలనుకుంటారు. అది ఎంత ఒత్తిడిగా ఉంటుందో మీరే ఊహించండి. *** మీ చెల్లెలు అక్షరతో కలిసి సినిమా చేస్తారా? కథ కుదిరితే తప్పకుండా చేస్తా. *** అక్షరకు ఎలాంటి సలహాలిస్తుంటారు? మా అమ్మా నాన్న నాకెలాంటి సలహాలివ్వలేదు. ‘నీ లైఫ్ నీ ఇష్టం. తెలివిగా నిర్ణయాలు తీసుకో’ అని చెప్పారు. ఎప్పుడైనా అవసరమైతే సలహాలిస్తారు. నేను కూడా నా చెల్లెలికి సలహాలివ్వను. అవసరమైనప్పుడు మాత్రం కచ్చితంగా ఇస్తా. *** ఒక పాత్ర చేస్తున్నప్పుడు మీరు ఆ మూడ్‌లో ఎంతసేపు ఉంటారు? కెమెరా ముందు ఉన్నంతవరకే ఆ మూడ్‌లో ఉంటాను. ఆ తర్వాత కటాఫ్ చేసేస్తాను. ‘నేనివాళ సీరియస్ సీన్ చేస్తున్నాను కాబట్టి, నాతో ఎవరూ మాట్లాడొద్దు. నేను సీరియస్‌గా ఉండాలి’ అని ఎవరితోనూ అనను. హాయిగా నవ్వుతు ఉంటాను. కెమెరా ముందుకెళ్లాక సీరియస్ అయిపోతా. ఎటాచింగ్, డిటాచింగ్ రెండూ తెలియాలి. ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో దానికి పూర్తిగా ఎటాచ్ అయిపోతా. ఆ పని పూర్తయ్యాక డిటాచ్ అయిపోతా. *** ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మీరు మోస్ట్ వాంటెడ్... ఎలా అనిపిస్తోంది? అనందంగానే ఉందండి. అదే విధంగా ఇది నిరంతరం కాదని కూడా నాకు తెలుసు. నా చిన్నప్పుడు నాన్నగారి కెరీర్ గురించి నాకు చాలా విషయాలు తెలిసేవి. ఆయన మంచి మంచి సినిమాలు చేసినప్పుడు అభినందించేవారు. ఫ్లాప్ సినిమా చేసినప్పుడు పెదవి విరిచేసేవారు. అందుకే, సక్సెస్‌ని నెత్తికెక్కించుకోకుండా నా పని నేను సిన్సియర్‌గా చేసుకుంటూ వెళుతున్నాను. *** మంచి మంచి సినిమాలు చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు మీది గోల్డెన్ లెగ్ అనుకోవచ్చా? గోల్డెన్, సిల్వర్, ఐరన్ లెగ్ అనుకోవడానికి ఇదేమన్నా జ్యువెలరీ షాపా! అలా ఏమీ ఉండదండి. అయినా నా కాలు ఎప్పటిలానే ఉంది (నవ్వుతూ). కాకపోతే ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఏదేదో అంటారు. హిట్ వచ్చాక గోల్డెన్ లెగ్ అంటారు. వాటితో నాకు సంబంధం లేదు. *** ఫైనల్లీ.. మీ కెరీర్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది? నేనేదీ ప్లాన్ చేయలేదు. అంతా ఆ దేవుడే ప్లాన్ చేశాడు. ఆ ప్రకారం వెళ్లిపోతున్నాను. ఏది ఏమైనా మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది. వాటికి న్యాయం చేయడానికి వంద శాతం కృషి చేస్తున్నా. ప్రస్తుతం నా కెరీర్ హ్యాపీగా ఉంది. - డి.జి.భవాని -
మార్షల్ ఆర్ట్స్‌కి రెడీ!
శ్రుతీహాసన్ కర్రసాము చేస్తే? విలన్లను ఎగిరెగిరి తంతే?.. ఈ గులాబీ బాల ఇవన్నీ చేయగలగుతారా? అని అనుమానంగా ఉందా? కానీ, శ్రుతీహాసన్‌కి మాత్రం ఎలాంటి అనుమానం లేదు. చెట్ల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లు పాడటం, నాలుగైదు సెంటిమెంట్ సన్నివేశాల ద్వారా మనసుని టచ్ చేయడం, కామెడీ చేసి నవ్వించడం.. ఇవన్నీ శ్రుతీకి బాగా తెలుసు. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. పూర్తి స్థాయి యాక్షన్ కథా చిత్రంలో నటించనున్నారు. హిందీలో బాజీగర్, సోల్జర్, రేస్, రేస్ 2 వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శక ద్వయం అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో శ్రుతీహాసన్ ఓ చిత్రంలో నటించనున్నారట. ఇటీవలే ఈ దర్శకులిద్దరూ శ్రుతీకి కథ చెప్పారనీ, ఆమెకు కూడా ఆ కథ నచ్చిందనీ భోగట్టా. ఈ చిత్రంలో వీరోచితమైన పోరాట దృశ్యాల్లో నటించాలి కాబట్టి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారట. ఇప్పటికే కేరళకు చెందిన కలరిపయ్యాట్టు అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ఆరంభం కానుంది. ఈలోపు పాత్ర గురించి అవగాహన పెంచుకోవడానికి వర్క్ షాప్స్కి కూడా హాజరు కావాలనుకుంటున్నారట. -
అందుకే వాయిదా వేశాం!
‘‘ఊరిని దత్తత తీసుకోవడం అంటే రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోతాననుకున్నార్రా! వీణ్ణి, వాణ్ణి, వాణ్ణి వీళ్లందరినీ, నిన్ను... మొత్తాన్ని దత్తత తీసుకున్నా’’ అని తనదైన శైలిలో మహేశ్‌బాబు చెప్పిన డైలాగ్‌ని ఆయన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ టీజర్లో అందరూ చూసే ఉంటారు. ఈ ఒక్క డైలాగ్‌తో ఆయన పాత్ర చిత్రణ ఎలా ఉంటుందో క్లుప్తంగా చెప్పానంటున్నారు చిత్రదర్శకుడు కొరటాల శివ. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్(సి.వి.యమ్) నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘టీజర్లో మహేశ్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం చూపించాను. దానికి ఈ కథలో చాలా ప్రాముఖ్యం ఉంది. మహేశ్ ఈ మధ్యే ఓ పల్లెటూరును దత్తత తీసుకున్నారు. కానీ, అంతకు ముందే ఆయనకు ఈ చిత్రకథ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అప్పటికి ‘బాహుబలి’ విడుదల తేదీ ఖరారు కాలేదు. కానీ, ఆ చిత్రం తేదీ ప్రకటించడంతో ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే ఇబ్బందిగా ఉంటుందని మా చిత్రాన్ని వాయిదా వేశాం. పైగా మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇంకాస్త టైమ్ పడుతుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ పాత్రలు ఈ చిత్రానికే హైలై ట్’’ అన్నారు. ‘‘వచ్చే నెల 18న ఆడియోను విడుదల చేయనున్నామని, ఆగస్ట్ 9న మహేశ్ పుట్టినరోజుని పురస్కరించుకుని, కానుకగా రెండు రోజుల ముందే ‘శ్రీమంతుడు’ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: మది, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి. -
శ్రీమతి కమల్ హాసన్ కాదు
మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్. లవ్ ఈజ్ మేడ్ ఆన్ ఎర్త్. మూడుముళ్లు వేస్తేనేనా ప్రేమించినట్టు? ప్రేమిస్తేనేనా మూడుముళ్లు వేసేది? జీవిత భాగస్వామి కావడానికి ప్రేమ, పెళ్లి కాదు... బాధ్యత అవసరం. గౌతమి కూతురు కమల్ హాసన్‌ని ‘పప్పా’ అని పిలుస్తుంది. అంటే డాడీ అని. కమల్ హాసన్ కన్నతండ్రి కాకపోయినా.. అంతకంటే ఎక్కువే. గౌతమి శ్రీమతి కమల్ హాసన్ కాకపోయినా అంతకు మించే. మీ పేరు చెప్పగానే ఎవరికైనా శ్రీనివాస కల్యాణం, గాంధీ నగర్ రెండవ వీధి సినిమాలు గుర్తుకొస్తాయి. తక్కువ సినిమాలు చేసినా అంత దగ్గరయ్యారు. అసలు సిసలు తెలుగమ్మాయైన మీరు మళ్లీ తెలుగు సినిమాలు చేయాలి. గౌతమి: (నవ్వుతూ) చెయ్యాలనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’కి తమిళ రీమేక్) సినిమా చేయడానికైనా మా అమ్మాయి సుబ్బలక్ష్మి కారణం. ‘నా ఆలనా పాలనా చూసుకోవడం కోసం ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నావ్. ఇప్పుడు నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. నువ్వు మళ్లీ సినిమాలు చేయాలి’ అని చెప్పింది. పిల్లల వైపు నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే, ఇక చెప్పడానికేముంటుంది? మా అమ్మ విషయంలో నేనిలానే ఆలోచించేదాన్ని. మీ అమ్మానాన్నల గురించి చెప్పండి. నాన్నగారు శేషగిరిరావు వైజాగ్‌లో పెద్ద పేరున్న డాక్టర్. అమ్మ వసుంధరాదేవి కూడా డాక్టరే. నాన్నగారు ఆర్మీలో పని చేశారు. మంచి ఆర్కిటెక్ట్. టోర్నమెంట్ లెవల్లో బ్రిడ్జ్ ప్లేయర్. బ్రహ్మాండమైన ఫొటోగ్రాఫర్. నేను పుట్టాక నాకు నచ్చలేదని హంటింగ్ వదిలేశారు. అమ్మ సూపర్ ఉమన్. ఆవిడ వర్క్ చేయని టైమ్ అంటూ ఉండేది కాదు. మా నాన్నగారికి, అన్నయ్యకి అమ్మ వంట చేస్తేనే నచ్చుతుంది. ఇంటి పనులన్నీ చక్కబెట్టి, తర్వాత కికక్కి వెళ్లేది. నేను సినిమాల్లోకొచ్చాక ఆవిడ లేకుండా కాలు బయటపెట్టేదాన్ని కాదు. సడన్‌గా అమ్మకి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ‘ఇక చాలు.. ఆమెకి విశ్రాంతి కావాలి’ అని అప్పుడు అనిపించింది. అమ్మకి ఏం కావాలో ఆలోచించే మెచ్యూర్టీ అప్పుడు నాకొచ్చింది. ఇప్పుడు నాకేది తృప్తిగా ఉంటుందో ఆలోచించే మెచ్యూర్టీ మా సుబ్బలక్షి్ష్మకి వచ్చింది. ఇప్పుడు మీ అమ్మ, నాన్న ఉన్నారా? సుబ్బలక్ష్మి పుట్టిన ఏడాదికి అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన ఏడాది లోపు నాన్న కూడా చనిపోయారు. నా కుడి, ఎడమ భుజం లాంటి ఇద్దరూ పోవడం షాకింగ్‌గా అనిపించింది. అప్పటివరకూ రక్షణగా ఓ గూడులో ఉండేదాన్ని. ‘ఇక ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాలి’ అనే ఫీలింగ్ నన్ను మానసికంగా స్ట్రాంగ్ చేసింది. సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? అప్పటికే 120 సినిమాలకు పైగా చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. తర్వాత ఏంటి? అనుకున్నాను. జీవితంలో ఆయా సందర్భాలను బట్టి మన ప్రాధాన్యాలు మారతాయి. నాకు మొదట్నుంచీ రైట్ టైమ్‌లో మొదటి బిడ్డను కనాలని ఉండేది. అది కూడా పాపే కావాలని అనుకున్నాను. పాప పుట్టింది. తన ఆలనా పాలనా నేనే చూసుకోవాలనుకున్నా. అందుకే, సినిమాలను పక్కనపెట్టా. రైట్ ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలనే చేసుకున్నారా... మీది లవ్ మ్యారేజే కదా? అవును. మాది లవ్ మ్యారేజే. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి పెళ్లి కోసం నేను సినిమాలు మానేయలేదు. పెళ్లి చేసుకునే ఏడాదిన్నర ముందే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. కానీ, పెళ్లయ్యాక కనీసం రెండేళ్లు కాకుండానే విడిపోయారేం? ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు. మనషుల మనసులు మారుతూ ఉంటాయి. ఆ మార్పు అన్నది ఒకే డెరైక్షన్‌లో జరిగితే బాగుంటుంది. వేరు వేరు డెరైక్షన్‌లో మార్పు వస్తే, కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది. అందుకే, మేం విడిపోయాం. వృత్తిపరంగా సక్సెస్ అయ్యి... వ్యక్తిగతంగా ఓడిపోయానని అనుకున్నారా? లేదు. ఎందుకంటే, ఎవరి జీవితంలో జరగనిది ఏమీ నా జీవితంలో జరగలేదు. సిగ్గుపడిపోయి, దాక్కునేంత పని చేయలేదు నేను. రెండు మనసులు కలవనప్పుడు, కలిసి బాధపడుతూ బతికేకన్నా, విడిపోయి ఆనందంగా ఉండాలనుకున్నాం. ఇది నా ఓటమి అనుకోవడంలేదు. ఎందుకంటే, మా పాప రూపంలో నా జీవితానికో గమ్యం ఉంది. అమ్మ, నాన్న ఉన్నంతవరకూ నేను ‘వెరీ షెల్టర్డ్’. ఆ ఇద్దరూ పోవడంతో ఆ షెల్టర్ చెదిరిపోయింది. చివరికి చంటిపిల్లతో ఒంటరిగా మిగిలా. అప్పుడే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టా (చెమర్చిన కళ్లతో). మీ పాప తన తండ్రి గురించి అడగలేదా? పాపకు ఊహ తెలిసినప్పట్నుంచీ నా జీవితంలో జరిగిన అన్ని విషయాలనూ చెప్పడం మొదలుపెట్టా. అయితే, ఏ వయసులో ఏది చెబితే అర్థమవుతుందో, అందుకు తగ్గట్టుగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మా పాప పరిస్థితులను అర్థం చేసుకుంది. నా కూతురు అని చెప్పడంలేదు కానీ, తను చాలా తెలివి గలది. ఒకవైపు విఫలమైన వైవాహిక బంధం, అమ్మా, నాన్న తిరిగి రాని లోకాలకు వెళ్లడం. పైగా, చంటిపిల్ల పెంపకం.. ఇవన్నీ ఒక ఎత్తయితే క్యాన్సర్ మరో ఎత్తు. ఒకేసారి ఇన్ని ఎదురు దెబ్బలను ఎలా డీల్ చేశారు? ఇవన్నీ నేను ఎదురు దెబ్బలుగా అనుకోవడం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించాయి. వాస్తవానికి ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకు టాక్సెమియా వచ్చింది. దాంతో బాగా బరువు పెరిగాను. కాంప్లికేషన్స్ వచ్చాయి. ఎలాగో వాటిని అధిగమించి, సేఫ్‌గా బిడ్డను కనగలిగాను. కానీ, పెంపకం పూర్తిగా నా మీద ఉంటుందనుకోలేదు. మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్... నా కూతురికి అన్నీ నేనే. పాపకి ఏం పెట్టాలి? ఎలా పెంచాలి? అని నాకు నేనుగా తెలుసుకుని పెంచాను. ఈ క్రమంలో ఓ మూడు, నాలుగేళ్లు బయటి ప్రపంచాన్ని చూడటం మర్చిపోయాను. మరోవైపు క్యాన్సర్. అది కూడా నాకు తగిలిన దెబ్బగా అనుకోవడం లేదు. నా ప్రాధాన్యాలు తెలిసేలా చేసింది. ‘నా బిడ్డ, అన్నయ్య కుటుంబం, కమల్..’ ప్రపంచంలో వీళ్లే నా ప్రాధాన్యాలు అని నాకు స్పష్టంగా తెలియజేసింది. నా మానసిక ధైర్యం, వాళ్లిచ్చిన ధైర్యం నా అనారోగ్యాన్ని జయించేలా చేశాయి. సినిమాలు చేస్తున్నప్పుడే మీరు కమల్ హాసన్‌కి దగ్గరయ్యారా? ఆయనతో సినిమాలు చేసినప్పుడు ‘కమల్ సార్..’ అంటూ దూరం దూరంగా ఉండేదాన్ని. కమల్‌తో ఎక్కువ సినిమాలు చేసేకొద్దీ గౌరవ భావం పెరిగిపోయింది. ఇద్దరం కలిసి చేసిన చివరి సినిమా ‘ద్రోహి’. ఆ తర్వాత మేం దాదాపు నాలుగైదేళ్లు కలవలేదు. పెళ్లి చేసుకుని, అమెరికా వెళ్లిపోయాను. మరి.. కమల్‌తో మీ బంధం ఎలా బలపడింది? ఇండియా వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో నేనూ, ఆయన కలిశాం. అప్పటికి మేమిద్దరం ఒంటరివాళ్లం. మొదట్లో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత ఫిలాసఫీ, సైకాలజీ.. వాట్ నాట్... బోల్డన్ని టాపిక్స్ వచ్చేవి. జీవితం పట్ల అవగాహన, ప్రతిభ, అందమైన గుణం, ఆశావహ దృక్పథం... ఇలాంటి మంచి లక్షణాలు కమల్లో చాలా ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతుంటే మంచి మంచి విషయాలు తెలుస్తాయి. స్టేజ్ బై స్టేజ్ మా మధ్య అనుబంధం పెరిగింది. ఆ అనుబంధం దీర్ఘకాలంగా (దాదాపు పదేళ్లు) కొనసాగడానికి కారణం? నా జీవితాన్ని ఒక రకంగా ముందు నుంచీ ఊహించుకున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య... వీళ్లతోనే నా లైఫ్ అనుకున్నాను. అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. సక్సెస్ అయ్యాను. పెళ్లయ్యింది. అది సక్సెస్ కాలేదు. చేతిలో చంటిబిడ్డతో మిగిలాను. ఒక రకంగా అది పరీక్షాకాలం. ఆ సమయంలో నాకు కమల్ సెక్యూర్టీని ఇవ్వగలిగారు. ఏ బంధం అయినా దీర్ఘకాలం నిలవాలంటే ఒకరిపట్ల మరొకరికి గౌరవం ఉండాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వాలి. ఇద్దరికీ తాము అనుకున్నది ఎదుటి వ్యక్తికి చెప్పుకోగల స్వేచ్ఛ ఉండాలి. అంత ఓపెన్‌గా ఉన్న ఏ బంధం అయినా బలంగా ఉంటుంది. దానికి ‘లాంగ్ స్టాండింగ్’ ఉంటుంది. మీ సహజీవనం గురించి మీకెలాంటి విమర్శలూ వినిపించలేదా? అస్సలు లేదండి. నేను సినిమాల్లోకొచ్చే ముందు ‘ఇండస్ట్రీ మంచిది కాదు.. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అనేవాళ్లు. కానీ, ఇక్కడ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాన్నిబట్టి నేను చెప్పేదేంటంటే, ‘మనం ఎలా ఉంటామో.. మనతో ఎదుటి వ్యక్తులు అలానే ఉంటారు’ అని. ‘రిలేషన్షిప్స్’కి కూడా ఇది వర్తిస్తుంది. ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆశించి, అందుకు తగ్గట్టుగా లెక్కలేసుకుని ఆ వ్యక్తికి దగ్గరైతే, అది బయటివాళ్లు కనిపెట్టగలుగుతారు. అప్పుడు విమర్శలు వస్తాయి. నిజాయతీగా ఏర్పడిన బంధాల మీద గౌరవ భావం ఉంటుంది. కానీ, సహజీవనాన్ని సమాజం ఒప్పుకుంటుందా? సమాజం అంటే ఏంటండి? నేను, మీరు, ఇంకొకరు, మరొకరు... అంతేగా? ఎవరి జీవితాలు వాళ్లవి. అందరూ ఒకే విధంగా జీవించరు కదా. అయితే, జీవించే విధానంలో హుందాతనం ఉండాలి. అప్పుడు సమాజం కూడా ఆ హుందాతనాన్ని గౌరవిస్తుంది. సహజీవనం చేయాలనుకున్న తర్వాత, మీ పిల్లలు ఏమైనా అనుకుంటారేమోనని మీరు, కమల్ అనుకోలేదా? ‘టు ఇండిపెండెంట్ పీపుల్ ఆన్ ది సేమ్ రోడ్’ అనుకున్నాం. కలిసి ప్రయణం చేస్తాం. మా ఇద్దర్నీ ఆమోదించాల్సిందేనని ముగ్గురు పిల్లల్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే అర్థం చేసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోలేదు? పెళ్లి మీద గౌరవం ఉంది కాబట్టే, చేసుకున్నా. కానీ, విఫలమైంది. ఇద్దరు వ్యక్తులు కలిసి బతకాలనుకుంటే, మాట రూపంలో చెప్పినా, వేడుకగా జరిపి నలుగురికీ తెలియజేసినా... ఏ రూపంలో వ్యక్తపరిచినా ఒకటే. వీటిలో ఏం చేసినా ఇద్దరి మధ్య అవగాహన ఉండటం ముఖ్యం. మా లైఫ్‌లో ఆ అవగాహన ఉంది. ఘనంగా పెళ్లి చేసుకున్నవాళ్లల్లో ఎంతమంది ఆనందంగా ఉంటున్నారో చెప్పండి? పెళ్లయ్యింది కదా... ఇక కలిసి బతికేద్దాం అని బలవంతంగా బతుకుతున్నవాళ్లు లేరా?. మరి... మీ సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకోనంటే అంగీకరిస్తారా? తన ఇష్టం. పెళ్లయినా, రిలేషన్షిప్ అయినా... ఏం చేసినా సిన్సియర్‌గా చేయమని చెబుతా. ఓకే... చాలా విరామం తర్వాత ‘పాపనాశం’లో నటించారు. కమల్ సినిమా కాబట్టే ఒప్పుకున్నారనుకోవచ్చా? చాలామంది కమల్ సినిమాల్లోనే నటిస్తానని ఊహించుకుంటున్నారు. కానీ, అందరితోనూ సినిమాలు చేయాలనుకుంటున్నా. ‘పాపనాశం’లోని పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శక, నిర్మాతలు కమల్ని అడిగారు. నన్నడగమని కమల్ అన్నారట. ఆ తర్వాత నన్నడగడం, యాక్టింగ్ నా ఫస్ట్ లవ్ కావడంతో ఆనందంగా అంగీకరించడం జరిగాయి. ఇక పైనా సినిమాల్లో కొనసాగుతారా? సినిమాల్లో నటించడం మానేశాను తప్ప కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నాను. ‘దశావతారం’ అప్పుడు ఎందుకన్నారో కానీ, ‘ఈ సినిమాకు నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నావ్’ అని కమల్ అన్నారు. అదొక మంచి సవాల్ అనిపించి, ఒప్పుకున్నాను. అప్పట్నుంచీ ఇప్పటివరకూ కమల్ చేసిన సినిమాలకు డిజైనింగ్ చేస్తున్నాను. నటన అంటే ఇష్టం కాబట్టి, ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నా. ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? రొటీన్ అనిపించే పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను చేసే పాత్ర ఆ సినిమాకి కీలకంగా ఉండాలి. అది ఏ భాష సినిమా అయినా ఓకే. నేను చేయడానికి రెడీ. మళ్లీ వ్యక్తిగత విషయాలకొద్దాం.. కమల్‌తో మీ కూతురి అనుబంధం గురించి.. ఆయన్ను తను ఏమని పిలుస్తుంది? ‘షీ ఈజ్ హిజ్ డాటర్’. పప్పా అని పిలుస్తుంది. ఆ రిలేషన్షిప్ వాళ్లు బిల్డప్ చేసుకున్నదే తప్ప నేను కావాలని బిల్డప్ చేసినది కాదు. సుబ్బలక్ష్మికి కమల్ అంటే ఎంతో ప్రేమ. ఆయనక్కూడా అంతే. {శుతీహాసన్, అక్షరాహాసన్లు మిమ్మల్ని అంగీకరించారా? అంగీకరించడం అంటే ఏంటి? వాళ్లిద్దరూ కమల్ కూతుళ్లు. కమల్ జీవితంలో ఉన్న ఆ ఇద్దర్నీ ఎవరూ రీప్లేస్ చేయలేరు. నా జీవితంలో ఉన్న సుబ్బలక్ష్మిని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఆ క్లారిటీ మాకు ఉంది. నటిగా శ్రుతీహాసన్ దూసుకెళుతున్నారు.. తన గురించి నాలుగు మాటలు? {శుతీహాసన్ చాలా హార్డ్ వర్కింగ్. లాస్ ఏంజిల్స్‌లో తను మ్యూజిషియన్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నప్పుడు నా క్యాన్సర్ ట్రీట్మెంట్ చివరి చికిత్స పూర్తయ్యింది. అప్పుడు కమల్ బిజీగా ఉన్నారు. సుబ్బలక్ష్మిని తీసుకుని శ్రుతీతో లాస్ ఏంజిల్స్ వెళ్లి, అన్ని ఏర్పాట్లూ చేసొచ్చాను. ఆ తర్వాత తను ఒంటరిగా అక్కడ ఉండి, చదువుకుని ఇక్కడికొచ్చింది. వచ్చాక తన కెరీర్‌ని తానే బిల్డప్ చేసుకోవాలనే పట్టుదల మీద ఉండేది. ఆ పట్టుదల ఫలితమే తన ఈ సక్సెస్. శ్రుతి ఎదుగుదల చూస్తే, గర్వంగా ఉంటుంది. సుబ్బలక్ష్మిని కూడా కథానాయిక చేస్తారట? నటన అనే కాదు.. ఫిలిం మేకింగ్ అంటే తనకిష్టం. ఆర్టిస్ట్, టెక్నీషియన్.. ఏది కావాలన్నా ఇంకా చాలా టైముంది. తనకిప్పుడు పదిహేనేళ్లే కదా. మీరు వంట చేస్తారా? ఎప్పుడైనా కమల్ కూడా గరిట తిప్పుతారా? కుక్ ఉన్నారు. ఎందుకంటే, పని మీద నేను బయటికెళ్లినప్పుడు ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడకూదు కదా. వీలు చిక్కినప్పుడల్లా నేను వంట చేస్తాను. ఒకసారి ‘అవియల్’ (కలగలుపు కూర) చేస్తున్నా. వంట గదిలోకి తొంగి చూసి, ‘ఏం చేస్తున్నావ్’ అని కమల్ అడిగారు. అవియల్ చేస్తున్నానంటే, ‘నేనూ హెల్ప్ చేస్తా’ అంటూ, కూరగాయలు కోసి ఇచ్చారు. కూరకు కావాల్సిన దినుసులను మిక్సీ పట్టి ఇచ్చారు. ఆ పనులన్నీ ఇష్టంగా చేశారు. మర్నాడు కూడా వంటలో సహాయం చేశారు. ఆయన ఏం చేసినా సరే చాలా ఆసక్తిగా చేస్తారు. మామూలుగా వైవాహిక బంధంలోనే ‘సెవెన్ ఇయర్స్ ఇచ్’ అంటుంటారు. (మధ్యలో అందుకుంటూ...) ఎలాంటి ఇచ్చింగ్స్ లేవు. ప్రతిరోజూ కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. మేం బోల్డన్ని విషయాలు మాట్లాడుకుంటాం. పుస్తకాలు చదువుతాం. మా డైనింగ్ రూమ్‌లో టీవీ ఉండదు. సెల్‌ఫోన్స్, ఐప్యాడ్లకు స్థానం లేదు. హాయిగా మాట్లాడుకుంటూ, భోజనం చేస్తాం. ‘విశ్వరూపం’ సమయంలో కమల్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులను, బాధలను మీతో పంచుకుంటారా? నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరే చెప్పుకుంటాను. ఆయన కూడా అంతే. మంచి, చెడూ పంచుకోలేని బంధం ఎందుకు? అందుకే.. మా బాధలనూ, సంతోషాలనూ పంచుకుంటాం. కమల్ని ఎవరైనా కలవాలంటే, ముందు మీ అనుమతి తీసుకోవాలన్నది చాలామంది ఊహ? ఆ ఊహ నిజం కాదు. నా సలహాల మీద ఆధారపడేంత చిన్నపిల్లాడు కాదాయన. ‘కమల్ ఈజ్ అడల్ట్’. లైఫ్‌ని మ్యానేజ్ చేయడం ఆయనకు బాగా తెలుసు. నేను చెప్పిందే చేస్తారని చాలామంది అనుకుంటారు. ఆయన మా ఇంటి పెద్ద. నా నిర్ణయాల కోసం నేనే ఆయన సలహా తీసుకుంటాను. ఇక, నేను చెబితే ఆయన చేస్తారని అనుకోవడం నాకు జోక్‌గా అనిపిస్తుంది. అందుకే, కమల్ని కలవాలనుకుని నా అనుమతి కోసం ఎదురుచూసేవాళ్ల దగ్గర, ఆయన మేనేజర్ నంబరో, పీఆర్ఓ నంబరో ఇచ్చేస్తాను. ఫైనల్లీ మీ జీవితం గురించి? చాలా ప్రశాంతంగా ఉంది. - డి.జి. భవాని -
శ్రుతిహాసన్‌పై మరో పిటిషన్ ఉపసంహరణ
హైదరాబాద్: ఒప్పందం బేఖాతర్ చేశారంటూ సినీనటి శ్రుతిహాసన్‌పై దాఖలు చేసిన మరో పిటిషన్‌ను పిక్చర్ హౌస్ మీడియా ఉపసంహరించుకుంది. పిక్చర్ హౌస్ తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు 25వ అదనపు ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం అనుమతించారు. అడ్వాన్స్‌గా చెల్లించిన రూ.10 లక్షలను కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని కోరుతూ పిక్చర్ హౌస్ గతంలో కోర్టును ఆశ్రయించింది. అయితే అడ్వాన్స్ ఇవ్వలేదని శ్రుతిహాసన్ తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి నివేదించారు. -
శ్రుతిహాసన్‌ను వేధించేందుకే ఈ పిటిషన్లు
కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు వేరే సినిమాల్లో నటించకూడదన్న ఉత్తర్వులు రద్దు చేయండి కోర్టుకు విన్నవించిన శ్రుతి తరపు న్యాయవాది హైదరాబాద్: సినీ కథానాయిక శ్రుతిహాసన్ కేసు వివాదం మరో మలుపు తిరిగింది. పిక్చర్ హౌజ్‌మీడియా సంస్థ వాస్తవాలను దాచి పిటిషన్లు దాఖలు చేస్తూ.. కోర్టును తప్పుదోవ పట్టిస్తోందని ఆమె తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. శ్రుతిహాసన్‌పై పిక్చర్ హౌజ్‌మీడియా లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను 25వ అదనపు చీఫ్ జడ్జి సాంబశివరావు నాయుడు శుక్రవారం మరోసారి విచారించారు. ఈ సందర్భంగా శ్రుతిహాసన్ స్థానంలో మరో కథానాయిక తమన్నాతో ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్‌లోనే సినిమా షూటింగ్ నిర్వహిస్తూనే.. తమ సినిమా షూటింగ్ ముగిసే వరకు శ్రుతి హాసన్ మరో సినిమాలో నటించకుండా ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారని ఆయన వివరించారు. కోర్టును ఆశ్రయించకముందే గత నెల 25న తమన్నాతో పిక్చర్ హౌజ్ మీడియా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఈ విషయాన్ని బయట పెట్టకుండా కోర్టును తప్పుదోవ పట్టించి, శ్రుతిహాసన్ మరో సినిమాకు సంతకం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొందారని చంద్రసేన్ పేర్కొన్నారు. పిక్చర్ హౌజ్‌మీడియా లిమిటెడ్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు శ్రుతిహాసన్‌కు రూ.10 లక్షల అడ్వాన్స్ చెల్లించలేదని, కాల్షీట్ల కోసం నెల రోజుల ముందే ఆమెను సంప్రదించాల్సి ఉండగా ఏప్రిల్ 2 నుంచి షూటింగ్‌కు రావాలంటూ కొన్ని రోజుల ముందే కోరారని చెప్పారు. అయితే శ్రుతి హాసన్ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో ఇదే విషయాన్ని మీడియా హౌజ్ ప్రతినిధులకు తెలిపిందని పేర్కొన్నారు. అడ్వాన్స్ చెల్లించకపోవడంతోపాటు అగ్రిమెంట్‌ను మీడియా హౌజ్ ఉల్లంఘించిన నేపథ్యంలో వీరి మధ్య జరిగిన ఒప్పందం చెల్లదని వివరించారు. శ్రుతిహాసన్ కొత్త సినిమాలతో ఒప్పందం చేసుకోరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై తమ వాదన వినిపించేందుకు గడువు కావాలని మీడియా హౌజ్ తరఫు న్యాయవాది గడువు కోరవడంతో విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున, కార్తీలు కథానాయకులుగా నటించనున్న సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించేందుకు పిక్చర్ మీడియా హౌజ్‌ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. -
మా ఇంట్లో ఉన్న బ్యూటీయే అది! - అక్షరా హాసన్
పట్టుమని పాతికేళ్లు లేవు.. కానీ, ‘బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యమే గొప్పది’ అని చెప్పగలిగేంత మానసిక పరిణతి అక్షరా హాసన్‌కి ఉంది. ఈ యువ నటి నాన్న కమలహాసన్ దేశమంతటా పేరున్న ‘తిరుగులేని’ నటుడు. అమ్మ సారిక ‘అందాల అభినేత్రి’. ఇక.. అక్క శ్రుతీహాసన్ తల్లితండ్రులకు తగ్గ కుమార్తె అనిపించుకుంటూ, ముందుకు సాగుతున్నారు. సరిగ్గా వారందరి బాటలోనే ముందుకెళ్ళడంలో ఇప్పుడు అక్షరా హాసన్ వంతు వచ్చింది. అందం విషయంలో ఈ అమ్మాయి అదుర్స్. మరి.. అభినయం సంగతేంటి? అనుకున్నవాళ్లకు తొలి చిత్రం ‘షమితాబ్’ ద్వారా సమాధానం ఇచ్చింది అక్షర. తెరంగేట్రం చేసిన తొలి చిత్రంలోనే తానేమీ అమ్మానాన్నలకూ, అక్కకూ తీసిపోనని నిరూపించుకుంది. ఈ బ్యూటీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ’చిట్ చాట్’... మొత్తానికి మీ అమ్మా, నాన్న, అక్కలా మీరు కూడా ఆర్టిస్ట్ అయిపోయారు. వాస్తవానికి మీరు డెరైక్టర్ కావాలనుకున్నారు కదా? అవును... అది నిజమే. సహాయ దర్శకురాలిగా కూడా చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తున్న సమయంలోనే నాకో నాటకంలో నటించే అవకాశం వచ్చింది. అప్పుడు నేను పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ‘ఓసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది?’ అని ఆ డెరైక్టర్ అంటే, ‘సరే’ అన్నాను. అందులో నటించేకొద్దీ నాకు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మంచి అవకాశాలొస్తే చేయాలనుకున్నాను. హిందీ రంగంలో మీకు చాలామంది దర్శకులతో పరిచయం ఉండే ఉంటుంది కాబట్టి, ఎవరి దగ్గరైనా అవకాశాలు అడిగారా? లేదు. నా తొలి నాటకం ప్రదర్శన అయిన ఆరేడు నెలలకు ఓ ఫంక్షన్‌కి వెళ్లాను. అక్కడకు బాల్కీ సార్ కూడా వచ్చారు. అప్పుడాయన ‘నీతో ఐదు నిమిషాలు మాట్లాడాలి’ అన్నారు. ఆశ్చర్యంగా చూశాను. ‘నేనో కథ రాసుకున్నాను. అందులో ఉన్న పాత్రకు నువ్వయితే బాగుంటుంది’ అన్నారు. ఆయన అలా అంటారని నేనూహించలేదు. సహాయ దర్శకురాలిగా చేర్చుకుంటారేమో అనుకున్నాను. కానీ, ఒక క్యారెక్టర్ చేయమన్నారు. అప్పటికే నేను ఆర్టిస్ట్‌గా కొనసాగాలను కుంటున్నా కాబట్టి, ఓకే చెప్పేశాను. కథ వినగానే, ‘సార్.. మీరు మనసు మార్చుకోకూడదు. ఈ అవకాశం నాకే ఇవ్వాలి’ అన్నాను. అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్‌తో నటించాలన్నప్పుడు భయం వేయలేదా? ఈ సినిమా షూటింగ్ ప్రారంభించక ముందు అమితాబ్ సార్‌ను ఓ షూటింగ్ లొకేషన్లో కలిశాను. ఆయనకు ముందు నమస్తే పెట్టాలా? పాదాలకు నమస్కరించాలా? అని తికమకపడిపోయాను. తీరా ఆయన దగ్గరికెళ్లగానే, ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చి, కూర్చోమన్నారు. చాలా బాగా మాట్లాడారు. దాంతో కొంచెం భయం పోయింది. ‘షమితాబ్’ లొకేషన్లో నా నటనను ఆయన మెచ్చుకుంటే, ఏడుపొచ్చేసింది. నా జీవితంలో నేనెప్పుడూ గురికానంత ఉద్వేగానికి గురయ్యాను. మీ మాతృభాష తమిళం కన్నా హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారే?! నేను తమిళం పట్టి పట్టి మాట్లాడుతున్నట్లనిపిస్తోంది కదూ! 2009 నుంచి ముంబయ్‌లో ఉంటున్నాను. అక్కడ తమిళం మాట్లాడేవాళ్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. హిందీ, ఇంగ్లిష్ మాట్లాడడం వల్ల తమిళ భాషతో సాన్నిహిత్యం పోయింది. మీ చెన్నయ్ జీవితం గురించి చెబుతారా? ఎంతైనా.... చెన్నై నా హోమ్ టౌన్ కదా.. అక్కడి జీవితాన్ని మర్చిపోలేను. మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్‌లలో చేసిన అల్లరి ఇంకా జ్ఞాపకం ఉంది. అక్కడి ఇడ్లీ, సాంబార్ రుచి గురించి చెప్పనక్కర్లేదు. ముంబయ్‌లో వడ పావ్లూ, భేల్పురీలు బాగానే ఉన్నా.. చిన్నప్పట్నుంచీ అలవాటుపడిన ప్రాణం కదా... అందుకని అప్పుడప్పుడూ మనసు ఇడ్లీ, సాంబార్ వైపు లాగుతుంటుంది (నవ్వుతూ). ఇంతకీ, మీరు ఎంతవరకూ చదువుకున్నారు? ప్లస్ 1తో సరిపెట్టేశాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చేద్దామని ప్రయత్నించాను కానీ, నా వల్ల కాలేదు. దాంతో వదిలేశాను. అదేంటీ... చదువు మీద ఆసక్తి ఉండేది కాదా? అదేంటో కానీ, ఆట పాటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు. నేను మంచి డ్యాన్సర్‌ని. అది నేర్చుకోవడంలో ఉన్నంత ఆసక్తి చదువులో లేకపోవడంతో మార్కులు తక్కువ వచ్చేవి. ఏదో ఒక డిగ్రీ ఉండాలంటారు! మరి, అమ్మానాన్న ఏమీ అనలేదా? ఎంత ప్రయత్నించినా నాకు ఏకాగ్రత కుదరడం లేదని వాళ్ళూ అర్థం చేసుకున్నారు. దాంతో నన్ను ఒత్తిడి చేయలేదు. కానీ, ఖాళీగా మాత్రం ఉండొద్దన్నారు. నిజమే కదా! అసలేమీ చేయకుండా జీవితం మొత్తం ఎలా ఉండగలుగుతాం? అందుకే, డెరైక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. ముంబయ్‌లో శ్రుతి విడిగా ఇల్లు తీసుకుని, ఒంటరిగా ఉంటున్నారు! మీరు? నేను అమ్మతో కలిసి ఉంటున్నాను. ఒంటరిగా ఉండేంత పరిణతి నాకు లేదు. పెద్దవాళ్ల గెడైన్స్ ఉండాల్సిందే! కమలహాసన్ అందగాడు. సారిక, శ్రుతీహాసన్ అందగత్తెలు. మీరూ అంతే! అసలు బాహ్య సౌందర్యానికి మీరెంతవరకు ప్రాధాన్యం ఇస్తారు? అస్సలు ఇవ్వను. నేను అందంగా ఉన్నానంటే అది నా గొప్పతనం కాదు. నన్ను ఇంత అందంగా పుట్టించిన ఆ దేవుడిది. అందుకే మన చేతుల్లో లేని బాహ్యసౌందర్యం కన్నా మానసికంగా అందంగా ఉండాలి. మీ అంతః సౌందర్యం గురించి చెప్పడానికి చిన్న ఉదాహరణ? చిన్నప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఆకలేస్తోంది అని అడిగితే, నా బ్యాగులో ఎంత డబ్బుంటే అంత ఇచ్చేసేదాన్ని. అఫ్కోర్స్ వేలకు వేలు ఉండేవి కాదనుకోండి. ప్యాకెట్ మనీ ఉండేది. క్యాంటీన్లో శ్నాక్స్ కొనుక్కోవడం కోసం ఉంచుకునేదాన్ని. ఆ డబ్బు ఇస్తున్నప్పుడు... ‘ఇంటికెళ్లగానే మనకు కోరుకున్న తిండి ఉంటుంది. ఇప్పుడీ క్యాంటీన్లో తినకపోతే ఏం’ అనుకునేదాన్ని. ఇప్పటికీ అదే మనస్తత్వం ఉంది. ఈ గుణం మీ తల్లితండ్రుల్లో ఎవరి నుంచి వచ్చింది? ఇద్దరికీ సేవాగుణం ఉంది. అదే నాకూ వచ్చింది. నాన్నగారికి దేవుడంటే నమ్మకం లేదు. శ్రుతీహాసన్ నమ్ముతారు. మీరు...? ఏదో శక్తి ఉందని నమ్ముతాను. కానీ, విగ్రహారాధన మీద నమ్మకం లేదు. అక్క మాత్రం విగ్రహ పూజ చేస్తుంది. అలాగని, నా ఇష్టాన్ని వ్యతిరేకించదు. మా ఇంట్లో ఉండే బ్యూటీయే అది. ఒకరి మనోభావాలను మరొకరం గౌరవించుకుంటాం. ఒకవేళ మీ కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చేసే అవకాశం వస్తే...? ఇప్పుడైతే నేను వెనక్కి తగ్గుతాను. నాన్నగారు మంచి నటుడు. అమ్మ కూడా అంతే. అక్క కూడా సూపర్. నేను చేసింది ఒక్క సినిమానే. మరో ఆరేడు సినిమాలు చేసిన తర్వాత అయితే ఒప్పుకుంటా. ఇక... మీ ప్రయాణం ఎటువైపు? నటనా.. దర్శకత్వమా? నటిగా కొనసాగాలనుంది. మంచి చిత్రాలను ఎన్నుకునే పని మీద ఉన్నా. అయితే, దర్శకత్వం వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా అదీ చేస్తా! -
సినిమాలు చేయనా..? పెళ్లి చేసుకోనా..?
మోర్నింగ్ హైదరాబాద్... ఆఫ్టర్నూన్ చెన్నై... ఈవినింగ్ ముంబై... శ్రుతీహాసన్ షెడ్యూలు ఇంత బిజీగా... టైట్‌గా ఉంటుంది. ఈ గజీబిజీని కూడా శ్రుతి ఆస్వాదిస్తున్నారు. ‘‘పనిలో పడితే నాకు ప్రపంచమే తెలీదు. సేమ్ టూ సేమ్ మా నాన్నలాగే. తిండీ నిద్రా ఇవన్నీ మర్చిపోతాను’’ అని చెబుతారామె. నిజమే... ఇంత బిజీలో కూడా శ్రుతి ఒత్తిడి ఫీలవ్వడంలేదు. హాయిగా నవ్వుతూ నవ్విస్తూ మూడు షూటింగులు... ఆరు ట్రావెలింగులూ అన్నట్టుగా అటు హిందీ, ఇటు తెలుగు, మరోపక్క తమిళ చిత్రసీమల్లో స్టార్డమ్ చవిచూస్తున్నారు. హిందీ ‘తేవర్’ సినిమా ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన శ్రుతి ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. హిందీ చిత్రం ‘తేవర్’లో రెండు పాటలు పాడి, వాటిలో ఓ పాటకే డాన్స్ చేశారు... కారణం ? ముందు ఈ చిత్రం కోసం నాతో ‘జోగానియాన్..’ పాటను మాత్రమే పాడించాలనుకున్నారు. పాడాను. దానికి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత ఒక రోజు ఈ చిత్ర కథానాయకుడు అర్జున్‌కపూర్ ఫోన్ చేసి, ‘ఇందులో మరో పాట ఉంది. అది కూడా మీరు పాడితే బాగుంటుంది. దానికి మీరే డాన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది’ అన్నారు. దాంతో ‘మాడ్మియా’ పాటకు మాత్రమే డాన్స్ చేశాను. అర్జున్ కపూర్ అడిగారనే చేశారా..? అది ఒక కారణం మాత్రమే. ‘మాడ్మియా..’ ట్యూన్ నాకు బాగా నచ్చింది. బాగా డాన్స్ చేయాలనే ఆసక్తి ఉన్నవారిని సంతృప్తిపరిచే పాట ఇది. ఇప్పటివరకు నేను హిందీలో చేసిన చిత్రాలు, చేస్తున్న ‘వెల్కమ్ బ్యాక్’, ‘యారా’, ‘గబ్బర్’లో కూడా ఇలా జోష్‌గా ఉన్న పాట లేదు. పైగా ఇది ఐటమ్ సాంగ్ కాదు. ప్రత్యేక పాట. అందుకే చేశాను. హిందీ రంగంలో ఒక కథానాయికకు మరో కథానాయిక పాట పాడిన సందర్భాలు లేవట. ఆ ఘనత మీకే దక్కినట్టుంది..! అవునా? నాకీ విషయం తెలియదు. అయినా ఇలా వేరే హీరోయిన్‌కి పాట పాడటం నాకు కొత్తేమీ కాదు. సమీరారెడ్డి, హన్సిక.. ఇంకా చాలామందికి పాటలు పాడాను. చిన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైందే ప్లేబ్యాక్ సింగర్‌గా. నా పాత్రకు మాత్రమే కాదు, ఇతరులకు పాడుతున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మహేశ్‌బాబు తాజా చిత్రంలో కథానాయికగా అవకాశం వచ్చింది కాబట్టే, ‘ఆగడు’లో ఆయనతో ఐటమ్ సాంగ్ చేశారనుకోవచ్చా? అవును.. నిజమే! అయితే ఆ పాట కూడా నచ్చింది కాబట్టి, వెంటనే ఒప్పుకున్నా. ‘జంక్షన్’.. పాటను నేను చాలా ఎంజాయ్ చేశాను. మహేశ్‌తో చేస్తున్న తాజా సినిమాలో ఇలాంటి పాట లేదు. మహేశ్ సరసన నటించడం ఎలా ఉంది? మహేశ్ చాలా డౌన్ టు ఎర్త్. ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ ఆ స్టార్‌డమ్‌ని అస్సలు ప్రదర్శించరు. పని విషయంలో చాలా సిన్సియర్. ఆ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నాది స్వతంత్ర భావాలున్న అమ్మాయి పాత్ర. బాగా చదువుకున్న అమ్మాయిని. నార్మల్ గాళ్‌గా కనిపిస్తాను. ఈ పాత్ర అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ పాత్ర మీ నిజజీవితానికి దగ్గరగా ఉంటుందేమో? అవును. స్వేచ్ఛని ఇష్టపడే అమ్మాయిని నేను. మా అమ్మా, నాన్న మాకు బాగా స్వేచ్ఛ ఇస్తారు. దాన్ని దుర్వినియోగం చేయకుండా నేను, నా చెల్లెలు అక్షర జాగ్రత్తపడతాం. స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కువైతే ప్రమాదం. ముఖ్యంగా స్వేచ్ఛ అంటూ మీరు ముంబయ్‌లో ఒక్కరే ఉంటున్నారు. అది తెలుసుకుని ఆ మధ్య ఓ ఆకతాయి మీ ఇంట్లోకి చొరబడ్డాడు కదా? అది మన దురదృష్టమో ఏమో కానీ.. భారతదేశంలో ఉద్యోగం చేసే ఆడవాళ్లకీ, ఇంటిపట్టున ఉన్నవాళ్లకీ... ఎవరికీ రక్షణ లేదు. అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెళ్లే మాట అటుంచితే, కొన్ని చోట్ల పట్టపగలే తిరగలేని పరిస్థితులు ఉంటున్నాయి. అందుకే, పిరికిగా ఉండకూడదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఈ దేశంలో రక్షణ లేదంటున్నారు.. విదేశాల్లో స్థిరపడాలని ఎప్పుడైనా అనిపించిందా? లేదు. వాస్తవానికి నాకు అమెరికా ఇష్టం. నేనక్కడే చదువుకున్నాను. అమెరికా ఎంత నచ్చినా నాకు మన భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలంటే చాలా ఇష్టం. ఇద్దరు నాయికలున్న చిత్రాల్లో కూడా నటిస్తున్నారు... ఇంకో హీరోయిన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కొంతమంది హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు కదా! నాకలాంటి సమస్య లేదండి. రెండున్నర గంటల సినిమాని ఒక్కదాన్నే ఏలాలనే అత్యాశ అంతకన్నా లేదు. ఎంతమంది కథానాయికలున్నా నా పాత్రకు ఉన్న ప్రాధాన్యం ఏంటి... అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ మధ్య నేను చేసిన హిందీ చిత్రం ‘డి-డే’ని తీసుకుందాం. అందులో నా పాత్ర నిడివి తక్కువ. కానీ, ప్రేక్షకులను ఆ పాత్ర చాలా ప్రభావితం చేసింది. మీ కెరీర్లో ‘ది బెస్ట్’ అనదగ్గ పాత్రల్లో ఇదొకటి అని నాతో చాలామంది అన్నారు. సోలో హీరోయిన్గా సాదాసీదా పాత్రలో రెండున్నర గంటలు కనిపించడం కన్నా.. మల్టీస్టారర్‌లో రెండే నిమిషాలు నిడివి ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఉన్న పాత్ర అయితే చేస్తాను. ఈ ఏడాది తెలుగులో మూడు సినిమాల్లో కనిపించారు.. కానీ, వచ్చే ఏడాది ఇక్కడ తక్కువ కనిపిస్తారేమో? ఈ ఏడాది ఎక్కువగా కనిపించాను కదండీ.. ఇతర భాషల్లోనూ కనిపించాలి కదా. ఈ ఏడాది తెలుగులో నేను చేసినవన్నీ మంచి పాత్రలే. ఇప్పుడు హిందీ, తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి కాబట్టి, అంగీకరించాను. హిందీ చిత్రం ‘వెల్కమ్ బ్యాక్’లో నానా పటేకర్, నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియా వంటి సీనియర్ తారలున్నారు.. వాళ్లతో సినిమా చేయడం ఎలా అనిపిస్తోంది? ఎప్పుడైనా సరే సీనియర్ తారలతో సినిమా చేసినప్పుడు షూటింగ్ జరిగినన్ని రోజులూ మంచి మంచి పాఠాలు నేర్చుకున్నట్లు అనిపిస్తుంది. వాళ్ల అనుభవాలను పంచుకుంటారు. అలాగే, లొకేషన్లో వాళ్లు యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూస్తాం కాబట్టి, నటనలో కొన్ని టిప్స్ తెలుస్తుంటాయి. డింపుల్ మేడమ్‌తో నాకు మంచి అనుబంధం కుదిరింది. ఆమె చాలా సరదాగా ఉంటారు. తమిళ చిత్రం ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్) హిందీ రీమేక్ ‘గబ్బర్’లో నటిస్తున్నారు కదా... ఆ చిత్రం గురించి? తెలుగు దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీకి అనుగుణంగా ఈ కథను చాలా అద్భుతంగా మలిచారు. ఇందులో అక్షయ్‌కుమార్ సరసన నటిస్తున్నాను. అక్షయ్ చాలా మంచి వ్యక్తి. ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమా కాబట్టి, హిందీలో కూడా ఈ చిత్రం ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది. తమిళ చిత్రం ‘విజయ్ 58’ గురించి? అది భారీ చిత్రం. ఆ చిత్రవిశేషాలేవీ చెప్పలేను. కాకపోతే, ఆ చిత్రంలో నటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందులో నాది అద్భుతమైన పాత్ర. ఒకేసారి ఆరేడు సినిమాలు చేస్తున్నారు... ఎలా మేనేజ్ చేస్తున్నారు? చేతినిండా పని లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఇంత బిజీగా ఉండటం నాకిష్టం. ఈ మధ్య హైదరాబాద్‌లో పది రోజులు, చెన్నయ్‌లో పది రోజులు, ముంబయ్‌లో కొన్ని రోజులు.. విదేశాల్లో కొన్ని రోజులు... ఇలా ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తున్నాను. కొన్ని రోజులు తెలుగు షూటింగ్, ఆ తర్వాత హిందీ, తమిళ్.. ఇలా మూడు రకాల భాషలు మాట్లాడుతుంటే నా జీవితం భలే మజాగా ఉంది. కాకపోతే.. ప్రయాణాల కారణంగా సూట్‌కేస్ ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే, వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పుడింత చల్లగా ఉంది కదా.. చెన్నయ్‌లో వేరే రకంగా ఉంది. ఈ మార్పుల వల్ల జలుబు, దగ్గు పట్టుకున్నాయి. మరి.. ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అంతకుముందు మాంసాహారం తినేదాన్ని. గత ఆరు నెలలుగా శాకాహారమే తీసుకుంటున్నాను. అలాగని నాన్‌వెజ్ చేటు అని కాదు... శాకాహారమే బెటర్ అనిపించింది. అంటే.. పూర్తిగా నాన్‌వెజ్ మానేసినట్టేనా? లేదు లేదు.. మళ్లీ ఎప్పుడో మొదలుపెడతా. ఓకే.. ఇలా బిజీ బిజీగా సినిమాలు చేయడమేనా.. పెళ్లి గురించేమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించడంలేదు. ఇంకా చాలా రోజుల వరకూ అది జరగదు. ఎందుకలా? సినిమాలు చేయమంటారా? పెళ్లి చేసుకోమంటారా? నా డైరీ తీసి సినిమాలకు నేను కేటాయించిన డేట్స్ చూస్తే, ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశమే లేదన్న విషయం మీకు తెలుస్తుంది. ప్రస్తుతం మా కుటుంబంలో నలుగురు నటీనటులం ఉన్నాం. అమ్మ, నాన్న, నేను, చెల్లి (అక్షర). నన్ను అమ్మా, నాన్నలతో పోల్చడం సరికాదు. అలాగే, అక్షరకన్నా ముందు నేను నటినయ్యాను కాబట్టి, నాతో తనను పోల్చడం సరికాదు. ఎవరి శైలి వారికుంటుంది. అక్షర తొలి హిందీ చిత్రం ‘షమితాబ్’ విడుదల కోసం నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. -
శీనుతో శ్రుతి
కొత్త హీరోల సరసన స్టార్ హీరోయిన్లను నటింపజేయడమంటే... ఇది వరకు తలకు మించిన పని. కానీ... ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సంస్థ, దర్శకుడు, పారితోషికం... ఈ మూడూ సరిగ్గా ఉంటే... కొత్తబ్బాయిలతో జతకట్టడానికి కూడా మన స్టార్ హీరోయిన్లు వెనుకాడటం లేదు. ఈ ట్రెండ్ బాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉంది. దక్షిణాదికే కొత్త. ఈ మధ్య ‘అల్లుడుశీను’తో కలిసి సమంత, తమన్నా ఆడిపాడారు. ఇప్పుడు శ్రుతీ వంతు వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందనున్న తదుపరి సినిమాలో కథానాయికగా నటించడానికి శ్రుతి పచ్చజెండా ఊపేశారని ఫిలింనగర్ సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే శ్రుతికి బోయ పాటి కథ వినిపించేశారట. శ్రుతీహాసన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుంది. -
‘ఐటమ్’కు అరకోటి
హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్ సంస్కృతి పెరిగిపోతోంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తమన్నా, కాజల్, ఇలా ప్రముఖ హీరోయిన్లందరూ ఐటమ్‌సాంగ్స్‌కు ఓకే అంటున్నారు. అధిక పారితోషికం ముట్టడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. తాజాగా శ్రుతిహాసన్ ఒక టాలీవుడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు 50 లక్షలు పుచ్చుకుని యమాగా ఆడేశారని తెలిసింది. మహేష్‌బాబు, తమన్నా జంటగా నటిస్తున్న ఆగడు చిత్రంలో శ్రుతి స్పెషల్‌సాంగ్‌ను చూడవచ్చునట. తొలుత ఐటమ్‌సాంగ్‌కు ఆడదామా? వద్దా? అని సందేహించిన శృతి చివరికి రూ.50 లక్షలు డిమాండ్ చేశారట. అందుకు నిర్మాత ఓకే అనడంతో ఈ క్రేజీ నటి సింగిల్ సాంగ్ చేశారని సమాచారం. ప్రస్తుతం శ్రుతి తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి విజయ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇలా హీరోయిన్గా బిజీగా ఉంటూ మరో పక్క ఐటమ్సాంగ్స్తో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఈ ముద్దుగుమ్మ.