
టాటూలతో తిప్పలే!
మణికట్టుపై ఒకటి... చెవి వెనక ఒకటి... వీపుపై ఇంకొకటి... కాలి మీద మరొకటి... భుజంపై మళ్లీ ఒకటి... మొత్తంగా ఒంటిపై ఐదు పచ్చబొట్లు పొడిపించుకున్నారు శ్రుతీహాసన్. ఇప్పుడు సై్టలుగా ‘టాటూలు’ అంటున్నారు కదా... పచ్చబొట్లంటే అవే.
ఈ ఐదింటికి తోడుగా మీ ఒంటిపై ఆరో పచ్చబొట్టు ఎప్పుడు చేరుతుంది? ఇంకో టాటూ ఎప్పుడు వేయించుకుంటారు? అని శ్రుతీని అడిగితే... ‘‘ఇక చాలు! ఈ ఐదు టాటూలు వేయించుకున్నందుకు చాలా బాధపడుతున్నా. ముఖ్యంగా మణికట్టుపై టాటూతో అయితే మరీ ఎక్కువ బాధపడుతున్నా. దీన్ని కవర్ చేయడానికి టూ మచ్‌గా మేకప్ వేసుకోవలసి వస్తుంది’’ అన్నారు. హీరోయిన్లకు టాటూలతో ఇలాంటి తిప్పలు తప్పవన్న మాట.