నిన్ను చంపేస్తా..! ట్విట్టర్‌లో బెదిరింపులు | Sruthihasan faced Threats from twitter | Sakshi
Sakshi News home page

నిన్ను చంపేస్తా..! ట్విట్టర్‌లో బెదిరింపులు

Published Thu, Nov 10 2016 11:01 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

నిన్ను చంపేస్తా..! ట్విట్టర్‌లో బెదిరింపులు - Sakshi

నిన్ను చంపేస్తా..! ట్విట్టర్‌లో బెదిరింపులు

సెలబ్రిటీలకు అపరిచితుల నుంచి ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి.

సెలబ్రిటీలకు అపరిచితుల నుంచి ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయ్. గడచిన రెండు నెలలుగా శ్రుతీహాసన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. డాక్టర్ చెందిన ఓ డాక్టర్ అదే పనిగా ట్విట్టర్ ద్వారా శ్రుతిని అనరాని మాటలు అనడంతో ఆమె విసుగు చెందారని సమాచారం. చివరకు దగ్గరగా కనపడితే, ‘నిన్ను చంపేస్తా’ అని కూడా అతను బెదిరిస్తున్నాడట.

దాంతో శ్రుతీహాసన్‌కి పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి ఆ డాక్టర్ చాలా ఘోరంగా వ్యాఖ్యానించాడట. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులను కలసి, శ్రుతి తరఫు వ్యక్తులు ఫిర్యాదు చేసి, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. అలాగే అతగాడి ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులకు ఇచ్చారట. శ్రుతీహాసన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ డాక్టర్ గురించి వాకబు చేసే పనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement