నిన్ను చంపేస్తా..! ట్విట్టర్లో బెదిరింపులు
సెలబ్రిటీలకు అపరిచితుల నుంచి ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయ్. గడచిన రెండు నెలలుగా శ్రుతీహాసన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. డాక్టర్ చెందిన ఓ డాక్టర్ అదే పనిగా ట్విట్టర్ ద్వారా శ్రుతిని అనరాని మాటలు అనడంతో ఆమె విసుగు చెందారని సమాచారం. చివరకు దగ్గరగా కనపడితే, ‘నిన్ను చంపేస్తా’ అని కూడా అతను బెదిరిస్తున్నాడట.
దాంతో శ్రుతీహాసన్‌కి పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి ఆ డాక్టర్ చాలా ఘోరంగా వ్యాఖ్యానించాడట. చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులను కలసి, శ్రుతి తరఫు వ్యక్తులు ఫిర్యాదు చేసి, ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను కూడా చూపించారు. అలాగే అతగాడి ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ను కూడా పోలీసులకు ఇచ్చారట. శ్రుతీహాసన్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆ డాక్టర్ గురించి వాకబు చేసే పనిలో పడ్డారు.