బనశంకరి: మోబైల్ దుకాణంలో చోరీకి పాల్పడిన చోరీదారుడిని ట్యాటూ ఆధారంగా పీణ్యాపోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.5 లక్షల విలువ చేసే సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ 23న జాలహళ్లి క్రాస్‌లోని మోబైల్‌షోరూమ్‌లో రూ.5 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, రూ.2 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పీణ్య పోలీసులు మోబైల్ దుకాణంలో అమర్చిన సీసీకెమెరా పుటేజీలను పరిశీలించారు.
నిందితుడి చేతిపై ఉన్న ట్యాటూ గుర్తు కలిగి ఉండటం, వాట్సాప్ ఆన్‌చేసి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. దీని ఆధారంగా పోలీసులు విభిన్నకోణాల్లో విచారణ చేపట్టిన నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన సంజయ్‌గా గుర్తించారు. ఈమేరకు పోలీసులు జార్ఖండ్‌కు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment