mobile store
-
ఫ్లాష్ లూటీ...
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్ పేరిట డ్యాన్స్‌లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్‌లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్స్టోర్పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు. -
బంజారాహిల్స్: టెక్నోవిజన్ స్టోర్‌లో సందడి చేసిన జబర్దస్త్ ఫేం, నటి వర్ష (ఫొటోలు)
-
బీ న్యూ మొబైల్స్ స్టోర్‌లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
432 ఖరీదైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లిన దొంగలు
-
‘బి న్యూ మొబైల్స్’ వార్షికోత్సవ ఆఫర్లు
హైదరాబాద్: గొలుసుకట్టు మొబైల్ విక్రయశాలల సంస్థ ‘బి న్యూ మొబైల్స్’ సంస్థ ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ షోరూమ్‌ల సంఖ్యను 108కు పెంచుకుంది. అంతేకాదు ఈ నెలలోనే కొత్తగా 10 షోరూమ్‌లను ప్రారంభించబోతున్నట్టు ‘బి న్యూ మొబైల్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యర్రగుంట్ల సాయి నిఖిలేష్ తెలిపారు. శామ్సంగ్, ఐఫోన్, రెడ్మీ, రియల్మీ, వన్‌ప్లస్ వన్, వివో, ఒప్పో, తదితర ఎన్నో బ్రాండ్ల మొబైల్ ఫోన్లను అతి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. అన్ని ప్రముఖ బ్రాండ్ల టెలివిజన్లతోపాటు, ల్యాప్‌టాప్‌లు, హోం థియేటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, కెమెరాలు, స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అమెజాన్ పే ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.900 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్టు చెప్పారు. ఐసీఐసీఐ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ క్యాష్‌బ్యాక్.. జస్ట్‌మనీ ద్వారా కొనుగోలు చేస్తే ఒక నెల ఈఎంఐ ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. పేటీఎం ద్వారా కొనుగోళ్లపై 11శాతం క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లను ఇస్తున్నట్టు చెప్పారు. -
మహానటి పుట్టిన గడ్డకు రావడం అనందంగా ఉంది
-
తిరుపతిలో ‘సెలెక్ట్ మొబైల్స్’ స్టోర్లు
తిరుపతి: సెలెక్ట్ మొబైల్స్ బుధవారం తిరుపతిలో మూడు రిటైల్ మొబైల్ స్టోర్లను ప్రారంభించింది. బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి స్టోరును సినీ నటి కియారా అద్వానీ ప్రారంభించారని సంస్థ తెలియజేసింది. ఇక రెండు, మూడు షోరూమ్‌లను సెంట్రల్ పార్క్ వద్ద, తిలక్ రో డ్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ‘ప్రస్తుతం తిరుపతిలో మూడు స్టోర్లు ప్రారంభించాం. ఇదే నెలలో హైదరాబాద్‌లో మరో 20 స్టోర్లను ఏర్పా టు చేస్తాం. త్వరలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 100 వరకు స్టోర్లను ప్రారంభిస్తాం. అలాగే మహారాష్ట్ర, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లోనూ విస్తరిస్తాం. 500 స్టోర్ల ఏర్పాటే మా లక్ష్యం’అని సెలెక్ట్ మొబైల్స్ చైర్మన్, ఎండీ వై.గురుస్వామి నాయుడు వివరించారు. -
నాగచైతన్యకు గిఫ్ట్
అనంతపురం న్యూసిటీ: ‘అనంత’లో అందాల నటి సమంత అక్కినేని తళుక్కుమన్నారు. సొట్టబుగ్గలతో చిరునవ్వు చిందిస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపారు. సుభాష్‌రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ బ్రాండెడ్ మొబైల్ స్టోర్స్‌ను సినీనటి సమంత సోమవారం రిబ్బన్‌కట్ చేసి, ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి, హ్యాపీ మొబైల్స్ లోగో, పలు ఇంటర్నేషనల్ మొబైల్స్‌ను ఆమె ఆవిష్కరించారు. సమంత మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా హ్యాపీ మొబైల్స్ నిర్వాహకులు అతి తక్కువ ధరకు ఆన్రాయిడ్లో (4జీ, 3జీ)మొబైల్స్‌తో పాటు వివిధ రకాల మొబైల్స్‌ను అందుబాటులో ఉంచారన్నారు. హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణపవన్, ఈడీ కోట సంతోష్ మాట్లాడుతూ సొంత జిల్లాపై ఉన్న ప్రేమతో హ్యాపీ మొబైల్స్‌ను ఇక్కడ ప్రారంభించామన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో హ్యాపీ మొబైల్స్ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. రాబోవు రోజుల్లో రూ.500 కోట్ల వ్యయం లక్ష్యంతో 150 నుంచి 200 హ్యాపీ బ్రాండ్ మొబైల్ స్టోర్స్‌ను నడుపుతామన్నారు. రూ.999 ఫోన్ రూ 299, స్మార్ట్ ఫోన్ రూ.1,999, వన్జీబీ 8 జీబీ ర్యాం ఫోన్స్ రూ.2,999, 3 జీబీ ర్యాం ఫోన్ రూ.6,999 ధరకే అందిస్తున్నామన్నారు. ఇతర మొబైళ్ల కొనుగోలుపై టీవీ, ఫ్రిజ్, ఎయిడ్ కూలర్‌తో పాటు మరిన్ని డిస్కౌంట్లు అందిస్తున్నామన్నారు. తమ అభిమాన నటిని చూసేందుకు ఉదయం 8 గంటల నుంచే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపుగా మూడు గంటల పాటు జనంతో సుభాష్‌రోడ్డు కిక్కిరిసింది. సెల్ఫీ కాంటెస్ట్.. హ్యాపీ మొబైల్స్ నిర్వాహకులు తొలి పది మొబైళ్లు కొనుగోలు చేసిన వారికి సెల్ఫీ కాంటెస్ట్‌ను నిర్వహించారు. పది మందికి సెల్ఫీ దిగే చాన్స్‌ను అందించారు. దీంతో సెల్‌ఫోన్ కొనుగోలు చేసి, సమంతతో సెల్ఫీ దిగిన కస్టమర్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాగచైతన్యకు గిఫ్ట్ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణపవన్, ఈడీ కోట సంతోష్ అక్కినేని నాగచైతన్యకు ఆపిల్ మొబైల్‌ను గిప్ట్గా అందించారు. -
మొబైల్ దుకాణంలో చోరీ
శ్రీకాకుళం, మందస: మొబైల్ కావాలని యజమానిని మాటల్లో దింపి.. దుకాణంలోని ఖరీదైన మొబైల్‌తో పాటు మరో ఫోన్‌ను ఇద్దరు యువకులు చోరీ చేసి జారుకున్నారు. ఈ సంఘటన మందస మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బాలిగాం–హరిపురం జంక్షన్‌లోని శ్రీకామేశ్వరి కమ్యూనికేషన్స్‌లో కొత్త మొబైల్ కావాలని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారితో మాట్లాడుతూ యజమాని మద్ది అరుణ్ మరో కస్టమర్‌తో కూడా మాట్లాడిన అనంతరం కంప్యూటర్ పనిలో నిమగ్నమై ఉండగా, వచ్చిన వ్యక్తులిద్దరూ ఖరీదైన మొబైల్‌తో పాటు రూ.10వేలు టాక్‌టైం ఉన్న డెమో మొబైల్‌ను దొంగిలించి జారుకున్నారు. ఫోన్లు కనిపించకపోవడంతో సీసీ కెమేరా ఫుటేజ్ పరిశీలించగా దొంగతనం జరిగిందని అరుణ్ గుర్తించి లబోదిబోమంటూ పుటేజ్‌లో కొంతభాగాన్ని ఫేస్బుక్, వాట్సప్‌లో పెట్టారు. నిందితులు గొప్పిలిలో ఉన్నారని అక్కడి మొబైల్ షాప్ యజమాని తెలిపారు. అరుణ్ అక్కడికి చేరుకునేలోగా గొప్పిలి నుంచి కూడా నిందితులు జారుకున్నారు. కాగా, ఇటీవల హరిపురంలోని రట్టిరోడ్ జంక్షన్ వద్ద గల ఓ మొబైల్ దుకాణంలో కూడా దొంగతనం జరగ్గా సీసీ ఫుటేజ్‌తోనే నిందితులను గుర్తించారు. ఈ రెండు సంఘటనలు కూడా పోలీసు కేసు కాలేదు. -
హలో..
కృష్ణగాడి వీర ప్రేమ గాథతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ మెహరీన్ శుక్రవారం హిందూపురంలో సందడి చేశారు. తాజాగా రాజా ది గ్రేట్‌లో తన నటనతో ఆకట్టుకున్న ఈ బొద్దుగుమ్మ ‘బీ న్యూ’ మొబైల్ షోరూంను ప్రారంభించారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించి అక్కడి శిల్పకళ తనను కట్టి పడేసిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమాన హీరోయిన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడారు. హిందూపురం అర్బన్: అభిమానుల ప్రేమానురాగాలు ఎన్నటికీ మరువలేనివని ప్రముఖ సినీ తార మెహ్రీన్ పిర్జాడ అన్నారు. పట్టణంలోని డీఎల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బీన్యూ మొబైల్ షోరూమ్‌ను శుక్రవారం ఆమె వేలాది మంది అభిమానుల కేరింతల నడుమ ప్రారంభించారు. బీన్యూ షోరూం అధినేత వై.డి.బాలాజీ చౌదరితో కలిసి షోరూంను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూపురానికి రావడం ఇది రెండవసారి అని, అదే అభిమానాన్ని చూపుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. షోరూంలో ఆకర్షణీయమైన సెల్ఫోన్లు రూ.499 ధర నుంచి రూ.లక్ష వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. నాణ్యమైన సెల్పోన్లతో పాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. షోరూం అధినేత బాలాజీ చౌదరి మాట్లాడుతూ ప్రస్తుతం హిందూపురంలో ప్రారంభించిన షోరూం నవ్యాంధ్రాలో 42వ షోరూం కాగా.. జిల్లాలో నాల్గవదని తెలిపారు. 2018 సంవత్సరం పూర్తయ్యేలోపు ఏపీలో 100 షోరూంలో ప్రారంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. హీరోయిన్ రాక నేపథ్యంలో సీఐలు చిన్నగోవిందు, తమీంఅహమ్మద్లు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లేపాక్షి సందర్శన లేపాక్షి: పర్యాటక ప్రాంతమైన లేపాక్షి ఆలయాన్ని సినీనటి మెహ్రీన్ పిర్జాడ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. -
'అను'రాగంగా..
కలువ మొగ్గల్లాంటి కళ్లతో కవ్వించే సినీ తార అను ఇమ్మానియేలు మంగళవారం బాపట్లలో సందడి చేసింది. బీన్యూ మొబైల్ షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన ఈ ముద్దుగుమ్మ విరిసీవిరియని నవ్వులతో ఆకట్టుకుంది. హలో హాయ్ అంటూ అనురాగంగా పలకరిస్తూ తన వయ్యారాలతో అభిమానుల చూపులను కట్టిపడేసింది. విజయవాడ కల్చరల్: తెలుగువారి అభిమానం మరువలేనని అజ్ఞాతవాసి కథానాయిక అనూఇమ్మానియేల్ తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల నగరంలోని స్థానిక హోటల్లో బస చేసిన అమెనే ఈవీవీ యువ కళావాహిని వ్యవస్థాపకుడు వెచ్చా కృష్ణమూర్తి మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలలో నటించటం ఆనందంగా ఉందన్నారు. సొంత బంధువుల మధ్య గడిపి నట్లుగా ఉందని చెప్పారు. పవన్‌తో కలసి నటించండం జీవితంలో మరచిపోలేని అనుభవంగా ఉందన్నారు. వెచ్చా కృష్ణమూర్తి యువ కళావాహిని సేవలను వివరించారు. ఆమెను యువ కళావాహిని సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు. -
‘టాటూ’ దొంగను పట్టిచ్చింది
బనశంకరి: మోబైల్ దుకాణంలో చోరీకి పాల్పడిన చోరీదారుడిని ట్యాటూ ఆధారంగా పీణ్యాపోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.5 లక్షల విలువ చేసే సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ 23న జాలహళ్లి క్రాస్‌లోని మోబైల్షోరూమ్లో రూ.5 లక్షల విలువైన సెల్ఫోన్లు, రూ.2 లక్షల నగదు దోచుకుని ఉడాయించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పీణ్య పోలీసులు మోబైల్ దుకాణంలో అమర్చిన సీసీకెమెరా పుటేజీలను పరిశీలించారు. నిందితుడి చేతిపై ఉన్న ట్యాటూ గుర్తు కలిగి ఉండటం, వాట్సాప్ ఆన్‌చేసి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. దీని ఆధారంగా పోలీసులు విభిన్నకోణాల్లో విచారణ చేపట్టిన నిందితుడిని జార్ఖండ్‌కు చెందిన సంజయ్గా గుర్తించారు. ఈమేరకు పోలీసులు జార్ఖండ్‌కు వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తెనాలిలో "ఏంజెల్"
గలగల మాటలతో, గమ్మత్తయిన చూపులతో మురిపించే సినీ తార హెప్సిబా పటేల్ శుక్రవారం ఆంధ్రాప్యారిస్‌లో తళుక్కున మెరిసింది. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఈ సుకుమారి బిస్కెట్ కలర్ డ్రస్‌తో వచ్చి యువత మనసులపై తియ్యని క్రీమ్ బిస్కెట్ వేసింది. తుమ్మెద రెక్కల్లాంటి కళ్లతో మాయ చేస్తూ పసందైన నవ్వులతో అందరినీ ఆకట్టుకుంది. తెనాలిఅర్బన్ : తెనాలి బోస్ రోడ్డులోని ఎస్బీఐ ఎదురు నూతనంగా ఏర్పాటు చేసిన బి న్యూ మొబైల్స్ షోరూంను శుక్రవారం హెబ్బాపటేల్ ప్రారంభించారు. తెనాలి పట్టణం రావడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఆమె వచ్చిన సంగతి తెలుసుకున్న యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో షోరూం వద్దకు పెద్ద సంఖ్యలో యువత చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు. యువతను ఆమె ఉత్సహపరుస్తూ సందడి చేశారు. ఆమె వెంట షోరూం నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఢిల్లీలో మొబైల్ స్టోర్‌లో మహిళల రచ్చ
-
భారత్‌లో బ్లాక్‌బెర్రీ జెడ్3
- ధర రూ. 15,990 - జులై 2 నుంచి మార్కెట్లోకి.. సాక్షి, న్యూఢిల్లీ: బ్లాక్ బెర్రీ సంస్థ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ప్లే ఉన్న ఈ స్మార్ట్ఫోను ధర రూ.15,990లు. ఈ స్మార్ట్‌ఫోనును వచ్చే నెల 2 నుంచి విక్రయిస్తామని బ్లాక్‌బెర్రీ ఇండియా మెనేజింగ్ డెరైక్టర్ సునీల్ లాల్వానీ ఇక్కడ బుధవారం ప్రకటించారు. ఈ నెల 25 నుంచి జూలై 1వ తేదీ వరకు దేశంలోని అన్ని బ్లాక్‌బెర్రీ షోరూంలలో, ఫ్లిప్‌కార్ట్, మొబైల్ స్టోర్లలో ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బ్లాక్‌బెర్రీ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 1.2 గిగా హెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 400 డ్యుయల్-కోర్ ప్రాసెసర్,1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని లాల్వానీ తెలి పారు. ఈ ఫోన్‌తో ఫైల్స్‌ను, ఫొటోలను, డాక్యుమెంట్లను వేగంగా షేర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో తామందిస్తున్న తొలి ఫోన్ ఇదని తెలిపారు. ఈ ఫోన్‌తో పాటు బ్లాక్‌బెర్రీ మ్యాప్స్‌ను అందిస్తున్నామని వివరించారు. ఒక బ్లాక్‌బెర్రీ ఫోన్‌తో ఈ బ్లాక్‌బెర్రీ మ్యాప్స్ యాప్‌ను అందించడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్లాగే ఈ యాప్ టుడెమైన్షనల్ మ్యాప్‌లను లోకల్ సెర్చ్, టర్న్-ైబె -టర్న్ వాయిస్ డెరైక్షన్లతో అందిస్తుందని వివరించారు. హిందీ, ఇంగ్లిష్ ప్రిడిక్టివ్ టైపింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. ఆఫర్లు..: కాగా ఈ-రిటైలింగ్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్, మొబైల్ స్టోర్లు ఈ కొత్త ఫోనుపై ఆఫర్లు ప్రకటించాయి. ముందస్తుగా ఆర్డర్ చేస్తే చేసుకుంటే వెయ్యి రూపాయిల ఓచర్ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. మరోవైపు మొబైల్ స్టోర్ కూడా జూలై 1వ తేదీలోపు బ్లాక్‌బెర్రీ జడ్3 స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేస్తే వెయ్యి రూపాయిల గిఫ్ట్ ఓచర్‌తో పాటు ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగదారులకు 7.5 శాతం తగ్గింపు ధరలను కూడా ప్రకటించింది.