
కలువ మొగ్గల్లాంటి కళ్లతో కవ్వించే సినీ తార అను ఇమ్మానియేలు మంగళవారం బాపట్లలో సందడి చేసింది. బీన్యూ మొబైల్ షోరూమ్ ప్రారంభానికి విచ్చేసిన ఈ ముద్దుగుమ్మ విరిసీవిరియని నవ్వులతో ఆకట్టుకుంది. హలో హాయ్ అంటూ అనురాగంగా పలకరిస్తూ తన వయ్యారాలతో అభిమానుల చూపులను కట్టిపడేసింది.
విజయవాడ కల్చరల్: తెలుగువారి అభిమానం మరువలేనని అజ్ఞాతవాసి కథానాయిక అనూఇమ్మానియేల్ తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల నగరంలోని స్థానిక హోటల్‌లో బస చేసిన అమెనే ఈవీవీ యువ కళావాహిని వ్యవస్థాపకుడు వెచ్చా కృష్ణమూర్తి మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలలో నటించటం ఆనందంగా ఉందన్నారు. సొంత బంధువుల మధ్య గడిపి నట్లుగా ఉందని చెప్పారు. పవన్‌తో కలసి నటించండం జీవితంలో మరచిపోలేని అనుభవంగా ఉందన్నారు. వెచ్చా కృష్ణమూర్తి యువ కళావాహిని సేవలను వివరించారు. ఆమెను యువ కళావాహిని సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు.