
బాపట్ల జిల్లా,సాక్షి: దేశంలో తనకున్న రాజకీయనుభవం ఎవరికీ లేదు. మైక్ దొరికితే చాలు తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ డబ్బా కొట్టుకుంటూ సంపద సృష్టిస్తానని చెప్పుకునే చంద్రబాబు బాపట్ల జిల్లా పర్చూరు జిల్లా ప్రజలు షాకిచ్చారు. అంతేకాదు, నాలుగుసార్లు సీఎంగా చేశానని తన డప్పు గ్యాప్ లేకుండా ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకుంటుంటారు. కానీ తన మాటల్ని ఎవరూ వినడం లేదని, అందుకే సభలకు ఎవరూ రావడం లేదని చంద్రబాబుకు అర్థమైంది.
ఇటీవల నిర్వహించిన పీ4 సభ అట్టర్ ప్లాప్ అవ్వడంతో బాబుకు విషయం త్వరగానే బోధపడింది. అంతే నా మీటింగ్‌కు రండి అంటూ పిల్లల్ని, మహిళల్ని బతిమలాడుకుంటున్నారు చంద్రబాబు. కొత్తగొల్లపాలెంలో సీఎం చంద్రబాబు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో మీరే చూడండి అంటూ స్థానికులు పర్యటన వీడియోల్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఆ వీడియోల్లో.. హే పిల్లలంతా మీటింగ్‌కు రండి. అందరూ నా మీటింగ్‌కు రండమ్మా అంటూ చంద్రబాబు స్థానికుల్ని ప్రాధేయపడుతుండడం మనం గమనించవచ్చు.
