ఫ్లాష్‌లూటీ తర్వాత ఓ షాప్ పరిస్థితి ఇది..
ఫిలడెల్ఫీయా: నిత్యం నిఘా నీడన ఉండే అమెరికాలో దొంగల ముఠా పేట్రేగిపోయింది. చూడ్డానికి.. షాపింగ్‌మాల్స్‌లో ఫ్లాష్‌మాబ్ పేరిట డ్యాన్స్‌లు, అవగాహన కార్యక్రమాలు చేసే బృందంలా కనిపిస్తూ ఒక్కసారిగా దుకాణాలపై తెగబడి అందిన కాడికి దోచేశారు. అమెరికాలోని ఫిలడెల్ఫీయా నగరం ఈ చోరీల ఘటనకు వేదికైంది. ఒక్కటి కాదు చాలా స్టోర్స్‌లో టీనేజర్లు ఇలా ఒకే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు.
మంగళవారం రోజు జరిగిన ఈ చోరీల తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ఖరీదైన ఐఫోన్లుసహా యాపిల్ కంపెనీకి చెందిన పలు ఎల్రక్టానిక్ ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన దాదాపు 100కుపైగా టీనేజర్లు యాపిల్ స్టోర్, ఫూట్‌లాకర్, లూలూలెమెన్ స్టోర్లలో చొరబడి బ్యాగుల నిండా వస్తువులను తీసుకెళ్లారు. విషయం తెల్సుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను విశ్లేíÙంచి 20 మందికిపైగా టీనేజర్లను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలనూ స్వాదీనం చేసుకున్నారు. అయితే, వస్తువును దొంగిలించినా వాడుకోలేని(యాంటీ–థెఫ్ట్) ఫీచర్ ఉన్న కొన్ని యాపిల్ సంస్థ వస్తువులను దొంగలు అక్కడే వదిలేసివెళ్లారని ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. గత నెలలో డ్రైవర్ ఎడ్డీ ఐరీజెర్రీని ఫిలడెల్ఫీయా పోలీస్ అధికారి కాల్చిచంపిన కేసులో రిటెన్‌హౌజ్ స్క్వేర్ వద్ద శాంతియుత ర్యాలీ జరిగిన కొద్దిసేపటికే అక్కడా ఇలా రిటైల్‌స్టోర్‌పై దాడి జరిగింది. అయితే ఆ నిరసనకారులతో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఫిలడెల్ఫీయా పోలీసులు స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment