
సినీ సెలబ్రెటీల అంటే కోట్లు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతుంటారిన అంతా అభిప్రాయపడుతుంటారు. కానీ ఈ తాజా సంఘటన చూస్తుంటే వాళ్లు అందరిలా సామాన్య మనుషులేనా అనిపిస్తోంది. తాజాగా ఓ నటి రూ. 2వేలకు కక్కుర్తి పడి దొంగతనం చేస్తూ దొరికిపోయిన సంఘటన హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ అమెరికన్ నటి క్లోయి చెర్రీ. అడల్ట్ కంటెంట్, యుఫోరియా వంటి టీవీ సిరీస్‌తో గుర్తింపు పొందింది.
ఈ క్రమంలో ఇటీవల ఆమె పెన్సెల్వేనియాలోని లాన్‌కాస్టర్‌లోని ఓ రీటైల్ స్టోర్‌కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేస్తూ రూ. 2వేలు ఖరీదు చేసే బ్లౌజ్‌ను దొంగతనం చేసింది. ఇదంతా అక్కడి సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. అది గమనించిన షాపు నిర్వాహకులు నిలదీయగా క్లోయి తడబడింది. భయంతో నోరు మెదపకుండా ఉండిపోయిందట. దీంతో షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోయిని విచారించి అనంతరం ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఇలా సెలెబ్రిటీలు దొంగతనం చేస్తు పట్టుబడటం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వినోనా రైడర్ అనే ప్రముఖ హాలీవుడ్ నటి 5 వేల డాలర్ల డిజైనర్ ఐటమ్స్ దొంగిలించి పట్టుబడింది. దీంతో ఆమెపై పోలీసు కేసు నమోదు అయింది. అంతేకాదు మూడేళ్ల పాటు ఆమె నిషేధానికి కూడా గురైంది.
చదవండి:
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం
‘స్వయం కృషి’ తర్వాత చిరంజీవి గురించి కళాతపస్వి కె విశ్వానాథ్ ఏమన్నారంటే!
Comments
Please login to add a commentAdd a comment