hollywood actress
-
వేలకోట్లు ఉండి ఏం లాభం? సాయం చేసేందుకు చేతులే రావట్లేదుగా!
హాలీవుడ్ పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ మంచి చేయబోయి విమర్శలపాలైంది. న్యూయార్క్‌లో తను కారు ఎక్కేముందు ఓ వ్యక్తి తనకు దానం చేయమని కోరాడు. తలదాచుకోవడానికి నిలువ నీడ కూడా లేని అతడికి కేవలం 20 డాలర్లు దానం చేసి బాగా భోజనం చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.పాప్ సింగర్‌పై ట్రోలింగ్ఇంకేముంది, నెటిజన్లు ఆమెపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాదాపు పదివేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణివి, ఇల్లు లేని వ్యక్తికి కేవలం రూ.1600 చిల్లర (20 డాలర్లు) ఇస్తావా? నువ్వు తల్చుకుంటే నిరాశ్రయుడైన వ్యక్తికి ఏకంగా ఒక ఇల్లే కొనివ్వచ్చు, కానీ మరీ చిల్లర ఇవ్వడం బాగోలేదు, అంత డబ్బు ఏమాత్రం సరిపోతాయో.. అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం.. తను ఆ మాత్రమైనా చేసిందని వెనకేసుకొస్తున్నారు. హడావుడిగా వెళ్లిపోకుండా ఆగి మరీ తనకు తోచింది సాయం చేయడం గొప్ప విషయమేనని చెప్తున్నారు.చదవండి: రజనీకాంత్ ఫోటో షేర్ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్ సిప్లిగంజ్ -
మూడు నెలలకోసారైనా ఆర్ఆర్ఆర్ చూస్తా: హాలీవుడ్ నటి
ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. హాలీవుడ్ దర్శకనటులు సైతం ఈ కళాఖండాన్ని చూసి అబ్బురపడిపోయారు. అయితే హాలీవుడ్ నటి మిన్నీ డ్రైవర్ ఇంకా ఆర్ఆర్ఆర్ మేనియా నుంచి బయటకు రాలేకపోతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇండియన్ సినిమా గురించి ఇలా మాట్లాడింది.మా ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీఆర్ఆర్ఆర్ నా ఫేవరెట్ సినిమా. నా కుమారుడితో కలిసి ఈ సినిమా చూడటమంటే నాకెంతో ఇష్టం. మాకు ఇది ఆల్‌టైమ్ ఫేవరెట్ మూవీ. అందుకే మూడు నెలలకోసారి కచ్చితంగా ఈ చిత్రాన్ని చూస్తుంటాం. ఎంతో అందమైన, అద్భుతమైన చిత్రాల్లో ఇదీ ఒకటి అని చెప్పుకొచ్చింది.భారత్‌కు రావాలనుంది..ఇండియన్ చెఫ్ రోమీ గిల్‌తో స్నేహం గురించి మాట్లాడుతూ.. రోమీ నాకు మంచి స్నేహితురాలు. తను చాలా బాగా వంట చేస్తుంది. భారత్‌కు వచ్చి, ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలను చూడాలనుందని తనతో తరచూ అంటూ ఉంటాను అని తెలిపింది. కాగా మిన్నీ డ్రైవర్.. ఇటీవలే ద సెర్పంట్ క్వీన్ రెండో సీజన్లో నటించింది. ఇందులో క్వీన్ ఎలిజబెత్‌గా యాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో అందుబాటులో ఉంది.చదవండి: Bigg Boss 8 Telugu: వీటి గురించి ఎవరు మాట్లాడుకోరేం.. -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్‌పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్‌పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్‌కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్‌పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్‌కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్‌పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
మీరు నా కెరీర్ రైలు దిగనందుకు కృతజ్ఞతలు
ఫ్రాన్స్ నగరంలోని కాన్స్‌లో 77వ కాన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ ఏడాది కాన్స్ జ్యూరీ ప్రెసిడెంట్‌గా నటి–దర్శకురాలు గ్రెటా గెర్విగ్ వ్యవహ రిస్తున్నారు. ఆమె నేతృత్వంలో జ్యూరీ ఈ సంవత్సరం పోటీ పడుతున్న 22 చిత్రాల నుండి విజేతను ఎంపిక చేస్తుంది. వేడుక చివరి రోజు విజేతకు అవార్డు ప్రదానం చేస్తారు. ఇక వేడుకలు ్రపారంభం అయ్యే ముందు విలేకరులతో ‘మీ టూ’ మూమెంట్ గురించి, సమాజంలో సానుకూల మార్పు తెచ్చే శక్తి బలమైన కథలకు ఉంటుందని గ్రెటా గెర్విగ్ పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకూ జరిగే ఈ ఫెస్టివల్లో తొలి రోజు ్రపారంభ చిత్రంగా క్వెంటిన్ డ్యూపియక్స్ దర్శకత్వంలో రూ΄పొందిన ‘ది సెకండ్ యాక్ట్’ ప్రదర్శితమైంది. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డి ఓర్’ పురస్కారాన్ని నటి మెరిల్ స్ట్రీప్‌కి ప్రదానం చేశారు. సినీ రంగానికి మెరిల్ చేసిన సేవలకు గాను ఆమెను ఈ పురస్కారంతో గౌరవించారు. 1989లో కాన్స్ ఉత్సవాల్లో పాల్గొన్నారు మెరిల్. ‘ఈవిల్ ఏంజెల్స్’లో కనబర్చిన నటనకుగాను ఆ ఏడాది ఆమె ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 40 ఏళ్ల వయసు అప్పుడు ఆ అవార్డు అందుకున్న మెరిల్ ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఈ చిత్రోత్సవాలకు హాజరయ్యారు. దాదాపు 35 ఏళ్లకు మళ్లీ కాన్స్‌లో పాల్గొనడం, ప్రతిష్టాత్మక పామ్ డి ఓర్ పురస్కారం అందుకోవడం, అవార్డు అందుకుంటున్న సమయంలో వీక్షకులు ఓ 2 నిమిషాల పాటు నిలబడి చప్పట్లతో అభినందించడంతో మెరిల్ స్ట్రీప్ ఒకింత ఉద్వేగానికి గురై, ఈ విధంగా స్పందించారు. ‘‘గతంలో నేను కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నా వయసు 40. అప్పటికి ముగ్గురు పిల్లల తల్లిని. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నాను. కానీ ఈ రాత్రి (కాన్స్ వేదికను ఉద్దేశించి) నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మేడమ్ ప్రెసిడెంట్ (గ్రెటా గెర్విగ్‌ని ఉద్దేశించి... 2019లో గ్రెటా దర్శకత్వం వహించిన ‘లిటిల్ ఉమెన్’ చిత్రంలో నటించారు మెరిల్)తో సహా నేను పని చేసిన ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు. ఇక్కడ నా సినిమాల క్లిప్పింగ్స్‌ని చూస్తుంటే నా కెరీర్‌ని బుల్లెట్ ట్రైన్ కిటికీలోంచి చూస్తున్నట్లుగా ఉంది. ఆ కిటికీలోంచి నా యవ్వనం మధ్యవయసుకి ఎగరడం నుంచి ఇదిగో ఇప్పుడు ఈ వేదిక వరకూ రావడం.. అంతా కనిపిస్తోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ప్రదేశాలు... ఎన్నో ముఖాలు గుర్తొస్తున్నాయి. అన్నింటికీ మించి ఇన్నేళ్లుగా నన్ను ఆదరిస్తున్న మీకు (ప్రేక్షకులు) చాలా కృతజ్ఞతలు. నా ముఖం పట్ల మీరు విముఖత చూపనందుకు నా కెరీర్ ట్రైన్‌ని మీరు దిగనందుకు ధన్యవాదాలు’’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు మెరిల్ స్ట్రీప్. మెరిసిన దేశీ తారలు ఈ వేడుకల్లో పలువురు దేశ, విదేశీ తారలు ΄పొడవాటి గౌనుల్లో ఎర్ర తివాచీపై క్యూట్‌గా క్యాట్‌వాక్ చేసి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ తారలు దీప్తీ సద్వానీ, ఊర్వశీ రౌతేలా తదితరులు పాల్గొన్నారు. టీవీ సిరీస్ ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ ఫేమ్, పలు హిందీ చిత్రాల్లో నటించిన దీప్తీ సద్వానీ రెడ్ కార్పెట్ పై మెరిశారు. ్రపారంభ వేడుకలో పాల్గొన్న ఈ బ్యూటీ మొత్తం మూడు రోజుల పాటు ఈ చిత్రోత్సవాల్లో పాల్గొననున్నారు. కాన్స్ ఉత్సవాల్లో ΄పొడవాటి గౌను ధరించిన తొలి తారగా రికార్డ్ సాధించారు దీప్తి. ‘‘ఈ రెడ్ కార్పెట్‌పై నడవడం గౌరవంగా భావిస్తున్నాను. అది కూడా రికార్డు బద్దలు కొట్టే ΄పొడవాటి ట్రైల్ ఉన్న గౌను ధరించడం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు దీప్తీ సద్వాని. ఇక గత ఏడాది కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ తార ఊర్వశీ రౌతేలా ఈసారీ హాజరయ్యారు. పింక్ కలర్ ఫ్రాక్‌లో ఆకట్టుకున్నారామె. కాగా 2018లో ఈ వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకోన్ పింక్ రంగు గౌను ధరించారు. ఇప్పుడు ఊర్వశీ ధరించిన గౌనుని అప్పటి దీపికా గౌనుతో పోల్చుతున్నారు. ఇలా తారల తళుకులు, పురస్కారగ్రహీత భావోద్వేగాలతో కాన్స్ చిత్రోత్సవాలు ఆకట్టుకునేలా సాగుతున్నాయి. -
హలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్ అరుదైన పురస్కారం
హాలీవుడ్ ప్రముఖ నటి మెరిల్ స్ట్రీప్ ఆనందంలో ఉన్నారు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్‌లో 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చలన చిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన పామ్ డి ఓర్ గౌరవ పురస్కారానికి మెరిల్ స్ట్రీప్‌ను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఆమె ఆనందానికి కారణం ఇదే. ఈ ఏడాది మెరిల్ స్ట్రీప్‌కు, జపాన్‌కు చెందిన యానిమేషన్ ‘స్టూడియో ఘిబ్లి’ నిర్వాహకులకు, హాలీవుడ్ దర్శక–నిర్మాత జార్జ్ వాల్టన్ లూకాస్ జూనియర్ (స్టార్ వార్స్, ఇండియానా జోన్స్’ ఫేమ్)కు పామ్ డి ఓర్ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా మెరిల్ స్ట్రీప్ మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డుకు ఎంపిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. అంతర్జాతీయ నటీనటులు, ఫిల్మ్ మేకర్స్ భాగాస్వామ్యులైన కాన్స్ వేదికగా నేను ఈ అవార్డును గెలుచుకోవడం అనేది ఫిల్మ్ మేకింగ్ రంగంలో నాకు దక్కిన ఓ అద్భుత విజయంగా భావిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. గతంలో హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, మైఖేల్ డగ్లస్, హారిసన్ ఫోర్డ్ వంటివారికి పామ్ డీ ఓర్ అవార్డు దక్కింది. -
గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్
తానిక ఎక్కువ రోజులు బతకనని ఆమెకు తెలుసు .అందుకే లెజెండరీ స్టార్ షానెన్ డోహెర్టీ షానెన్ డోహెర్టీ గుండెలు పిండే విషాదాన్ని షేర్ చేసింది. ‘‘లెట్స్ బి క్లియర్" అనే పోడ్కాస్ట్లో తన జీవితానికి సంబంధించిన కీలక అప్డేట్ను పంచుకుంది. కేన్సర్ చికిత్సలో భాగంగా . "కేన్సర్ ఇన్ఫ్యూషన్" అనే కొత్త చికిత్స గురించి కూడా మాట్లాడింది. ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసింది. అయినా కూడా తన చనిపోయిన తర్వాత తన తల్లి రోసా డోహెర్టీకి అండగా నిలబడేలా, ఆమెకు భారం కాకుండా ఉండేలా, తనను ప్రేమించిన వారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చేలా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు వెల్లడించింది. ఫోర్త్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న షానెన్కు ఇపుడది మెదడు, ఎముకలకు కూడా వ్యాపించింది. దీంతో తనకిక త్వరలోనే చనిపోతానని తెలిసినా మనోనిబ్బరం కోల్పోలేదు. మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించేందుకు సిద్ధపడుతోంది. అంతేకాదు...తల్లిని ఆదు కోవాల్సిన తను ముందే చనిపోతే, ఆమె ఒంటరిదైపోతుందనీ,అందుకే ఆస్తులను అమ్మి తల్లికివ్వాలని , తద్వారా తన మరణం తర్వాత ఆమెకు ఆర్థికంగా ఆదుకునేలా ఉండాలని చూస్తోంది.తన కెంతో ఇష్టంగా సేకరించుకున్న వస్తువులను విక్రయిస్తోంది.ఇదే సరైంది అని భావిస్తోంది. కేన్సర్‌తో పోరాడుతున్నప్పటికీ, డోహెర్టీ ఉన్న కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడుగులువేస్తోంది.భవిష్యత్తు కోసం సిద్ధం కావాలని నిశ్చయించుకుంది. ఆఖరికి అంత్యక్రియల ఏర్పాట్లను ప్లాన్ చేసుకుంటోంది. కేన్సర్ తన జీవితాన్ని మార్చసిందనీ, నిజంగా జీవితాన్ని, తన ప్రాధాన్యతలను మార్చేసిందని తెలిపింది అందుకే ఏళ్లుగా సేకరించిన పురాతన వస్తువులు, ఇతర వస్తువులను విక్రయించడమో లేదా విరాళంగా ఇవ్వడమో చేస్తోంది. "ప్రస్తుతానికి నా ప్రాధాన్యత నా తల్లి - నేను ఆమె కంటే ముందే చనిపోతే అది ఆమెకు కష్టమని నాకు తెలుసు" ఇది ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, అందుకే ఆమకోసం ఏదైనా చేయాలని నిర్ణయించాను అని తెలిపింది. అలాగే షానెన్ ఆమె సంపాదించిన డబ్బుతో తన తల్లిని సెలవులకు తీసుకెళ్లేందుకు ఆమెను ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. కాగా షానెన్ డోహెర్టీ బాల్యం నుండి నటిస్తోంది. 1981లో తన పదేళ్ల వయసులో "ఫాదర్ మర్ఫీ" అనే టీవీ షోలో గెస్ట్ స్టార్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. టీనేజ్ డ్రామా బెవర్లీ హిల్స్, 90210 , చార్మ్డ్ టీవీ సీరియల్స్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.1983 లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ 18 ఎపిసోడ్లలో జెన్నీ వైల్డర్గా నటించిన ప్రశంసలు పొందింది. అనేక అవార్డులను గెల్చుకుంది. 2015లో డోహెర్టీకి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అప్పట్లో కేన్సర్తగ్గినా మళ్లీ వచ్చిందని ఆమె 2017లో వెల్లడించింది. 2020లో మరింత విస్తరించిందని తెలిపింది. 2023 నవంబర్ 29 న పీపుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెదడుకు, ఎముకలకు కూడా పాకిందని తెలిపింది. -
హీరోతో ఆ పని చేయాలంటూ నిర్మాత బలవంతం చేశాడు: నటి
హాలీవుడ్ నటి న షరాన్ స్టోన్ గుర్తుందా? అదేనండి 90లలో వచ్చిన 'బేసిక్ ఇన్స్టింక్ట్'సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత 1993లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘స్లీవర్’తో యువత కలల రాణిగా మారిపోయింది. ఆ సినిమాలోని శృంగార సన్నివేశాలు అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్ చేశాయి. ఆ తర్వాత వరుస సినిమాలతో హాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు హాలీవుడ్లో ప్రకంపనలు పుట్టించాయి. ముఖ్యంగా ఓ నిర్మాత తనను వేధించాడంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం ఆమె వెల్లడించలేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ నిర్మాత ఎవరో బహిర్గతం చేసింది ఈ ఓల్డ్ బ్యూటీ. ‘స్లీవర్’మూవీ షూటింగ్ సమయంలో హీరో బిల్లీ బాల్డ్విన్తో శృంగారంలో పాల్గొనాలని నిర్మాత రాబర్డ్ ఈవెన్స్(2019తో ఈయన మరణించాడు) బలవంతం పెట్టినట్లు గుర్తు చేసింది. ‘ఓ రోజు నిర్మాత రాబర్డ్ తన ఆఫీస్‌కు రమ్మని కబురు పంపారు. నేను అక్కడికి వెళ్లగా.. సినిమా గురించి మాట్లాడుతూ బిల్లీ బాల్డ్విన్తో చనువుగా ఉంటే ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పారు. అతనితో నిజంగానే శృంగారంలో పాల్గొంటే.. ఆ సన్నివేశాలను తెరపై చక్కగా పండుతాయని ప్రలోభ పెట్టాడు. కానీ నేను ఆ పని చేయలేనని చెప్పేశాను’ అని నటి షరాన్ స్టోన్ చెప్పుకొచ్చింది. షరాన్ స్టోన్ చేసిన ఆరోపణలపై నటుడు బిల్లీ బాల్డ్విన్ ఎక్స్(ట్విటర్)వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ‘సినిమా రిలీజైన ఇన్నేళ్లకు షారన్ స్టోన్ నా గురించి ఎందుకు మాట్లాడుతుందో చెప్పండి? ఆమెకు ఇప్పటికీ నాపై క్రష్ఉందా? లేదా ఆమె ఇచ్చిన చనువును అడ్వాన్స్‌గా తీసుకోకపోవడంతో ఇనేళ్లుగా బాధపడుతూనే ఉందా? నేను కూడా ఒక బుక్ రాసి..అందులో ఆమె గురించి అసత్యాలను, అసభ్యకరమైన విషయాలను చెప్పాలా ఏంటి? అంటూ షరాన్ చేసిన ఆరోపణలు అన్ని అబద్దాలనే పరోక్షంగా చెప్పాడు. Not sure why Sharon Stone keep talking about me all these years later? Does she still have a crush on me or is she still hurt after all these years because I shunned her advances? Did she say to her gal pal Janice Dickinson the day after I screen tested and ran into them on our… pic.twitter.com/PtgqMC6Sgz — Billy Baldwin (@BillyBaldwin) March 12, 2024 -
ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్‌బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!
తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సీజన్-7 విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త పోకడలతో అభిమానులను అలరిస్తోంది. ఇంతలా ఆదరణ పొందిన రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సైతం మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ షో ద్వారానే కొందరు సినీరంగంలో ఫేమస్ అవుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొనే వారికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు: శుభ శ్రీ) మన తెలుగు బిగ్‌బాస్ షో అయితే కంటెస్టెంట్స్ పారితోషికాల గురించి మనం లక్షల్లోనే వింటుంటాం. అంతే కాదు.. ఎలిమినేట్ అయినవారు సైతం తమ రెమ్యునరేషన్ గురించి ఇంటర్వ్యూల్లోనూ ప్రస్తావించారు. అయితే లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకున్న కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. మరీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అబ్బే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కోట్లలో ఇస్తారా? అని అంటారా?.. కానీ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న వారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ కేవలం 3 రోజులకే రూ. 2 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇంతకీ ఎవరో తెలుసుకుందాం. హిందీలో బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ సీజన్-4లో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. కేవలం మూడు రోజులు మాత్రమే అతిథిగా ఇంట్లో ఉండిపోయింది. ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్‌తోనే సల్మాన్ ఖాన్ మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత అత్యధికంగా బిగ్ బాస్ -15 విజేత తేజస్వి ప్రకాశ్‌కు 1.7 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించారు. కాగా.. పమేలా ఆండర్సన్ కెనడియన్-అమెరికన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు దక్కించుకుంది. ప్లేబాయ్ మ్యాగజైన్లో తన మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సిరీస్ బేవాచ్‌లో సీజే పార్కర్ పాత్రతో ఆమె ఫేమస్ అయింది. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే పమేలా తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 2014లో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 6 నుంచి 10 వయస్సులో ఓ మహిళ తనను వేధించిందని.. ఆ తర్వాత 12 ఏళ్లకే 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని వివరించింది. అంతే కాదు.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని పేర్కొంది. ఆమెకు 14 ఏళ్ల వయసులో తన ప్రియుడితో పాటు, అతని ఫ్రెండ్స్ ఆరుగురు అత్యాచారం చేశారని వెల్లడించింది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!
సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మాజీ మోడల్ సిల్వినా లూనా కన్నుమూసింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. 79 రోజుల పాటు పోరాడి తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా.. గతంలో ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వికటించి తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) సర్జరీ వల్ల మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె జూన్‌లో ఆస్పత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 31నే ఆమె చనిపోగా ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కాగా.. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానలు షాక్‌కు గురయ్యారు. సిల్వినా మృతి పట్ల పలువురు అర్జంటీనా నటీనటులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) -
అడల్ట్ మూవీకి ఓకే చెప్పిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్స్ ఉన్నప్పటికీ!
లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రెటా గెర్విగ్ తెరకెక్కించిన చిత్రం 'బార్బీ'. ఈ చిత్రంలో ర్యాన్ గోస్లింగ్‌తో పాటు మార్గోట్ రాబీ నటించారు. తాజాగా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్కు అర్థం ఏమిటంటే ఈ చిత్రంలో అడల్ట్ కంటెంట్‌తో పాటు.. కొన్ని అసభ్యకరమైన సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని 12 ఏళ్ల వయసులోపు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్‌ను బట్టి అర్థమవుతోంది. (ఇది చదవండి: టైగర్ కా హుకుం వచ్చేశాడు.. ఈ వీడియోతో ఫ్యాన్స్‌కు పండుగే) అంతే కాకుండా ఈ చిత్రంలో హస్తప్రయోగంతో పాటు లైంగిక వేధింపుల దృశ్యాలు ఉండడంతో హాలీవుడ్ మూవీ బార్బీకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చినట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఈ మూవీలో కొన్ని అసభ్యకరమైన పదాలు, లైంగిక వేధింపుల సన్నివేశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని లైంగిక పరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన బార్బీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా.. జూలై 21, 2023న థియేటర్లలోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో విల్ ఫెర్రెల్, ఎమ్మా మాకీ, కానర్ స్విండెల్స్, నికోలా కాగ్లాన్, ఎమరాల్డ్ ఫెన్నెల్, కేట్ మెక్‌కిన్నన్, మైఖేల్ సెరా, సిము లియు, అమెరికా ఫెర్రెరా, కుటి గట్వా, ఇస్సా రే, కింగ్స్లీ బెన్-అదిర్, రియా పెర్ల్‌మాన్, షారన్ ఇవాన్స్ , అనా క్రజ్ కేన్, రీతు ఆర్య, జామీ డెమెట్రియో ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. ఏకంగా 53 ఏళ్లకు!
ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ నవోమి కాంప్‌బెల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 53 ఏళ్ల వయసులో మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని నవోమి తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే మే 2021లో నవోమి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రెండేళ్ల వ్యవధిలోనే మరో రెండో బిడ్డను స్వాగతించారు. తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదని నవోమి నిరూపించింది. ఆమె శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే ) నవోమి తన ఇన్‌స్టాలో రాస్తూ..' మై లిటిల్ డార్లింగ్! నీ రాకతో మాకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చావు. మా ప్రేమ నీకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. నువ్వు దేవుడిచ్చిన బహుమతి. వెల్కమ్ టూ బేబీబాయ్.' క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. పిల్లలను కనేందుకు వయసుతో పనిలేదని రుజువు చేసిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి) View this post on Instagram A post shared by Dr Naomi Campbell (@naomi) -
నగ్నంగా రోడ్లపై నటి.. పిచ్చాసుపత్రికి తరలించిన పోలీసులు
అమెరికన్ నటి అమాండా బైన్స్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పిచారు. లాస్ ఏంజిల్స్ వీధుల్లో నగ్నంగా తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 36ఏళ్ల అమాండా గత కొంతకాలంగా మానసికి సమస్యలతో బాధపడుతుంది. పక్కింటికి నిప్పంటించడం, పెంపుడు కుక్కను చంపాలనుకోవడం వంటివి చేసింది. తాజాగా కారు నుంచి నగ్నంగా దిగి లాస్ డౌట్టౌన్ సమీపంలో బట్టలు లేకుండా సంచరించింది. దీంతో గుర్తించిన పోలీసులు ఆమెను సైకియాట్రిస్ట్ నిపుణుల సూచనతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం 71 గంటల పాటు వైద్యుల పర్యవేక్షనలో అమాండా ఉంది. ఒకవేళ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఇంకొన్ని రోజుల పాటు ఆమె అక్కడ ఉండనుంది. కాగా అమాండా గతంలో డ్రగ్స్‌కు బానిసై దాన్నుంచి బయటపడ్డానని స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అమాండా ఈజీ ఎ, షీ ఈజ్ ది మ్యాన్, వాట్ ఏ గర్ల్ వాంట్ వంటి పలు సినిమాల్లో నటించింది. -
60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా ఆస్కార్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం
'కలలు కనండి. నిజం అవుతాయనడానికి నేను ఈ అవార్డును ఓ ప్రూఫ్‌గా చూపిస్తున్నాను. మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీ ప్రైమ్ టైమ్‌ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు. ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్‌హీరోస్. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు. నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్ హాంకాంగ్‌లో స్టార్ట్ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్‌గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్ గివప్. డానియల్ డ్యూయో, ఏ 24 షూటింగ్ స్టూడియో, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదు'. – ఉత్తమ నటి, మిషెల్ యో(కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్‌యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. అంతేకాదు ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు. ) నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్ ఫిల్మ్‌లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్ యాక్టర్‌గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్‌గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు బ్రెండెన్ ఫ్రాజెర్ (చెమర్చిన కళ్లతో...) ఈయన కూడా 54 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.) Michelle Yeoh accepts her #Oscar for Best Actress: "For all the little boys and girls who look like me watching tonight, this is a beacon of hope and possibilities. This is proof that dreams do come true." https://t.co/ndiKiHfmID pic.twitter.com/pQN8nHDhCx — Variety (@Variety) March 13, 2023 -
శృంగార సన్నివేశాల్లో నటించినందుకు కొడుకు దూరమయ్యాడు: నటి
తాను చేసిన ఓ సినిమా వల్ల కొడుకు దూరమయ్యాడంటూ విచారం వ్యక్తం చేసింది హాలీవుడ్ నటి షరాన్ స్టోన్. 1992లో వచ్చిన బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాలో కొద్ది క్షణాల పాటు ఒంటి మీద దుస్తులు లేకుండా నటించింది షరాన్. దీనివల్ల ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ ఒక్క సన్నివేశం వల్ల తన కొడుకు తనకు కాకుండా పోయాడంటోంది. 'టేబుల్ ఫర్ టూ విత్ బ్రూస్ బాజీ' పాడ్‌క్యాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది నటి. '2000వ సంవత్సరంలో ఓ పిల్లవాడిని నేను దత్తత తీసుకున్నాను. 2004లో నా భర్త ఫిల్ బ్రాన్స్టేన్తో విడిపోయేటప్పుడు పిల్లాడు నాకు కావాలన్నాను. అప్పుడు ఓ న్యాయవాది నా గారాల బాబు దగ్గరకు వెళ్లి ఏమన్నాడో తెలుసా? మీ అమ్మ శృంగార చిత్రాల్లో నటిస్తుంది. నీకు ఆ విషయం తెలుసా? అని అడిగాడు. పదహారు సెకండ్ల వీడియోతో నా క్యారెక్టర్‌నే తప్పు పట్టారు. అలా నా దగ్గర పెరగాల్సిన నా కొడుకు నాకు కాకుండా పోయాడు. ఇది నన్ను మానసికంగా కుంగదీసింది. నా గుండె పగిలినంత పనైంది. ఈ వేదనతో నిజంగానే గుండె సమస్యలతో ఆస్పత్రిపాలయ్యాను. అసలు ఆ సన్నివేశం డైరెక్టర్ నన్ను సంప్రదించకుండా నేరుగా సినిమాలో పెట్టేశాడు. అయినా టీవీలో ఒంటి మీద దుస్తులు లేకుండా చాలామంది కనిపిస్తున్నారు. కానీ వాళ్లను ఎవరూ ఏమీ అనరు. సినిమాలో కాసేపు ఒంటి మీద బట్టల్లేకుండా కనిపించినందుకు నాకు పిల్లాడినే దూరం చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో నా పేరు పిలవగానే చాలామంది నవ్వుకున్నారు. అది చూసి ఎంతో బాధేసింది. ఎంతో అవమానకరంగా అనిపించింది. కానీ అలాంటి సన్నివేశంలో నటించాలంటే ఎంతో ధైర్యం కావాలి తెలుసా?' అని చెప్పుకొచ్చింది నటి. -
హాలీవుడ్ నటి రాక్వెల్ వెల్చ్ కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాలీవుడ్ నటి రాక్వెల్ వెల్చ్ (82) తుది శ్వాస విడిచారు. అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్ చికాగోలో 1940 సెప్టెంబర్ 5న రాక్వెల్ వెల్చ్ జన్మించారు. ఆమె అసలు పేరు జో రాక్వెల్ టెజేడా. హైస్కూల్ చదువుతున్న రోజుల్లో ‘ఫెయిరెస్ట్ ఆఫ్ ద ఫెయిర్’గా పేరు పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, స్టేట్ కాలేజ్‌లో థియేటర్ ఆర్ట్స్‌లో చేరారు రాక్వెల్. ‘ఎ హౌస్ ఈజ్ నాట్ ఎ హోమ్’ (1964)లో చేసిన చిన్నపా త్ర ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. 1966లో వచ్చిన ‘ఫెంటాస్టిక్ వాయేజ్’లో ఓ లీడ్ రోల్ చేసిన రాక్వెల్కు మంచి గుర్తింపు లభించింది. 1973లో ‘ద త్రీ మస్కటీర్స్’కి ఆమెకు ఉత్తమ నటిగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు లభించింది. 1995లో ‘ది ఎంపైర్’ మ్యాగజీన్ ప్రచురించిన ‘100 సెక్సియస్ట్ స్టార్స్ ఆఫ్ ట్వంటీయత్ సెంచురీ’లో ఒకరిగా, మరో మ్యాగజీన్ ‘ప్లే బాయ్’ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచారామె. రాక్వెల్ చివరి చిత్రం ‘హౌ టు బి ఏ లాటిన్ లవర్’ (2017). ఇక 1959లో జేమ్స్ వెల్చ్ ను పెళ్లాడారామె. వీరికి ఇద్దరు సంతానం. వెల్చ్ నుంచి విడిపోయాక దాదాపు మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఆయన ‘ఇంటి పేరు’తోనే కొనసాగారామె. -
రూ. 2వేలకు కక్కుర్తి.. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ ప్రముఖ నటి
సినీ సెలబ్రెటీల అంటే కోట్లు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ గడుపుతుంటారిన అంతా అభిప్రాయపడుతుంటారు. కానీ ఈ తాజా సంఘటన చూస్తుంటే వాళ్లు అందరిలా సామాన్య మనుషులేనా అనిపిస్తోంది. తాజాగా ఓ నటి రూ. 2వేలకు కక్కుర్తి పడి దొంగతనం చేస్తూ దొరికిపోయిన సంఘటన హాట్‌టాపిక్‌గా మారింది. ప్రముఖ అమెరికన్ నటి క్లోయి చెర్రీ. అడల్ట్ కంటెంట్, యుఫోరియా వంటి టీవీ సిరీస్‌తో గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె పెన్సెల్వేనియాలోని లాన్కాస్టర్లోని ఓ రీటైల్ స్టోర్‌కు వెళ్లింది. అక్కడ షాపింగ్ చేస్తూ రూ. 2వేలు ఖరీదు చేసే బ్లౌజ్‌ను దొంగతనం చేసింది. ఇదంతా అక్కడి సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. అది గమనించిన షాపు నిర్వాహకులు నిలదీయగా క్లోయి తడబడింది. భయంతో నోరు మెదపకుండా ఉండిపోయిందట. దీంతో షాపు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోయిని విచారించి అనంతరం ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే ఇలా సెలెబ్రిటీలు దొంగతనం చేస్తు పట్టుబడటం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వినోనా రైడర్ అనే ప్రముఖ హాలీవుడ్ నటి 5 వేల డాలర్ల డిజైనర్ ఐటమ్స్ దొంగిలించి పట్టుబడింది. దీంతో ఆమెపై పోలీసు కేసు నమోదు అయింది. అంతేకాదు మూడేళ్ల పాటు ఆమె నిషేధానికి కూడా గురైంది. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని వాణీ జయరాం హఠాన్మరణం ‘స్వయం కృషి’ తర్వాత చిరంజీవి గురించి కళాతపస్వి కె విశ్వానాథ్ ఏమన్నారంటే! -
నాతో స్టార్ హీరో సీక్రెట్ అఫైర్.. చివరకు కాల్ గర్ల్‌లా..: నటి
ఓ స్టార్ హీరో తనను వాడుకుని వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేసింది అమెరికన్ సింగర్, నటి జెస్సికా సింప్సన్. తనతో రహస్య సంబంధం పెట్టుకున్న అతడు ఆ సమయంలో బయటకు మాత్రం సింగిల్‌గానే ఉన్నట్లు చెప్పుకునేవాడని పేర్కొంది. 'మూవీ స్టార్: దె ఆల్వేస్ సే దె ఆర్ సింగిల్' వ్యాసంలో తన అనుభవాన్ని ఏకరువు పెట్టింది నటి. 'మ్యూజిక్ వీడియో అవార్డుల ఫంక్షన్లో హాలీవుడ్‌లోని ఓ మెగాస్టార్ నన్ను ఓరగా చూశాడు. కళ్లతోనే దోబూచులాడాడు. ఆ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో జిమ్‌లో మరోసారి మేమిద్దరం కలిశాం. అప్పుడు అతడిని నా మ్యూజిక్ వీడియోలో నటించమని అడిగాను. మనం అడగ్గానే ఒప్పుకుంటున్నారని మురిసిపోవద్దు. దాన్ని వాళ్లు అవకాశంగా తీసుకుంటారు. తర్వాత మనల్ని మోసం కూడా చేస్తారు. ఇది చాలా ఆలస్యంగా తెలుసుకున్నా. నాపై ముద్దుల వర్షం కురిపించిన అతడు మరో ప్రియురాలితో కలిసి రెడ్ కార్పెట్‌పై కనిపించడంతో నా గుండె ముక్కలయ్యింది. మా బంధం ముగిసిపోయిందని అర్థమైంది. నాకు నేను కాల్ గర్ల్‌లా అనిపించాను. హాలీవుడ్లో ఒక్క భార్య/గర్ల్‌ఫ్రెండ్ చాలు అనుకునేవాళ్లు చాలామందే ఉన్నారని అప్పుడే తెలిసొచ్చింది' అని రాసుకొచ్చింది. కాగా జెస్సికా 2002లో నిక్ లాచేను పెళ్లాడగా 2006లో విడాకులిచ్చింది. తర్వాత 2014లో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎరిక్ జాన్సన్‌ను పెళ్లాడింది. చదవండి: పాపం అవకాశాల్లేక చిత్రవిచిత్ర డ్రెస్సులో కీర్తి సురేశ్ మేకప్ రూమ్‌లో పేలుడు, నటి పరిస్థితి విషమం -
'ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ మూవీ'.. అమ్మా తల్లి అది తెలుగు సినిమా!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ తెలుగు ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. కోట్లకు కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను ఎగరేసుకుంటూ ఔరా అనిపిస్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హాలీవుడ్ నటి జేన్ ఫోండా ఆర్ఆర్ఆర్ను ఆకాశానికెత్తింది. 'నేను ఇంతకుముందు లెస్లీ సినిమా చూడమని సూచించాను కదా! కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా నన్ను ఎంతగానో సర్ప్రైజ్ చేసింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. సామ్రాజ్యవాదం గురించి సీరియస్‌గా చర్చించిన బాలీవుడ్ సినిమా ఇది. చుట్టూ ఉన్న లోకాన్నే మరిచిపోయి సినిమా చూస్తుండిపోయాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది జేన్. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. 'అమ్మా తల్లి, ఇది బాలీవుడ్ సినిమా కాదు, టాలీవుడ్ మూవీ' అని కామెంట్లు చేస్తున్నారు. 'ఈ ఫారినర్లు ఇండియన్ సినిమా అంటే చాలు బాలీవుడ్ అని భ్రమపడుతున్నారు. ఇండియాలో ఎన్నో సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి. టాలీవుడ్(తెలుగు), కోలీవుడ్(తమిళ్), మాలీవుడ్(మలయాళం), సాండల్‌వుడ్(కన్నడ), మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, భోజ్‌పురి, పంజాబీ.. ఇలా అనేకమైన సినీపరిశ్రమలున్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు ఆయా ప్రాంతీయ భాషల్లో సినిమా తీస్తారు. కాబట్టి భారతీయ సినిమా అనగానే దయచేసి బాలీవుడ్ అని డిసైడ్ చేయకండి' అని సూచిస్తున్నారు. 'ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ ఎంపిక కాలేదని , అది దురదృష్టకరమైన విషయం' అని పేర్కొంటున్నారు. View this post on Instagram A post shared by Jane Fonda (@janefonda) చదవండి: సుశాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సారా -
తెలిసిన వ్యక్తే అని వెెళ్తే.. లైంగిక దాడి చేశాడు: నటి
హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ అమెరికన్ మోడల్. ఆమె పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల విడుదలైన కొత్త డాక్యుమెంటరీ 'ప్రెట్టీ బేబీ'లో ఆమెపై జరిగిన లైంగిక దాడి సంఘటనను వివరించారు. అయితే నటిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. కానీ ఆమె ఆ వ్యక్తిని అంతకుముందే కలిసినట్లు చెప్పింది. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు తెలిసిన వ్యక్తేనని వివరించింది. చిన్న వయసులోనే మోడల్‌గా ఫేమస్ అయిన బ్రూక్ షీల్డ్స్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చదివారు. బ్రూక్ షీల్డ్స్‌కు తెలిసిన వ్యక్తి టాక్సీ పిలుస్తానని చెప్పి హోటల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంది. ఆ తర్వాత తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత బాత్రూమ్కు వెళ్లి అదృశ్యమయ్యాడని ఆమె చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటన గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని వెల్లడించింది. బ్రూక్ షీల్డ్ మాట్లాడుతూ.. ' ఆ సమయంలో నేను అతనిపై ఫైట్ చేయలేకపోయా. పూర్తిగా స్తంభించిపోయా. కేవలం 'నో' అని మాత్రమే అరిచా. ఆ సమయంలో కేవలం ప్రాణాలతో బయటపడితే చాలు అనుకున్నా.' అని వివరించింది. ఈ సంఘటన తర్వాత తన స్నేహితుడు, సెక్యూరిటీ హెడ్ గావిన్ డి బెకర్‌కు ఫోన్ చేసినట్లు గుర్తుచేసుకుంది. కాగా.. సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించబడిన కొత్త డాక్యుమెంటరీ "ప్రెట్టీ బేబీ'ని ప్రదర్శించారు. . -
వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మృతి
ప్రపంచంలోనే అందమైన నటిగా పేరుగాంచిన తార ఇకలేరు. ఇటాలియన్ వెండితెర రాణిగా వెలుగొందిన జినా లొల్లో బ్రిగిడా(95) ఇవాళ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇటాలియన్ వార్తా సంస్థ అన్సా ధృవీకరించింది. దీంతో హాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. హాలీవుడ్లో 'బ్రెడ్, లవ్ అండ్ ఫాంటసీ' సినిమాలో తన పాత్రకు బాగా ప్రసిద్ది చెందింది. 1950వ దశకంలో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్‌గా పేరు సంపాదించింది. ఫ్రాంక్ సినాట్రా, హంఫ్రీ బోగార్ట్, మార్సెల్లో మాస్ట్రోయాని లాంటి నటులతో 60కి పైగా చిత్రాలలో నటించింది. 1960 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడంతో కెరీర్ నెమ్మదించింది. జినా ఇటలీలోని సుబియాకోలోని సంపన్న కుటుంబంలో 1927లో జన్మించింది. చదువు కోసం 20 సంవత్సరాల వయస్సులో రోమ్‌కి వెళ్లింది. ఆమె సినిమాల్లో నటనకు అనేక అవార్డులను గెలుచుకుంది. -
షాకింగ్.. రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయిన నటి.. ఎందుకంటే?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయింది ప్రముఖ నటి, షీ-హల్క్ వెబ్ సిరీస్ స్టార్ జమీలా జామిల్. ఆయన ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలని చూస్తోందని మండిపడింది. రిషి సునాక్ సంపన్న వర్గానికి చెందిన వాడని, మితవాది అని, అదృష్టం కొద్ది ప్రధాని అయ్యారని ధ్వజమెత్తింది. ఇంగ్లీష్ భాషలో బూతు పదంతో తీవ్ర విమర్శలు చేసింది. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఎందుకీ విమర్శలు..? బ్రిటన్‌లో ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయాలని రిషి సునాక్ చూస్తున్నారని జమీలా జామిల్ మండపడింది. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం అని ధ్వజమెత్తింది. ప్రజలు ఉద్యోగాలు లేక ఆర్థిక సాయం అందక నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిలియనీర్ రిషి సునాక్ వాళ్ల నోళ్లు మూయించాలని చూస్తున్నారని, దీన్ని తాము ఎంత మాత్రమూ సహించబోమని జమీలా హెచ్చరించింది. బ్రిటన్ వలసదారులపై రిషి సునాక్ విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. బ్రిటన్ కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపొద్దని హితవు పలికింది. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
క్యాన్సర్‌తో పోరాటం.. ప్రముఖ నటి కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటి కిర్స్టీ అల్లీ(71)కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని కిర్స్టీ కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమె ఇన్నాళ్లు గొప్పగా పోరాడింది. జీవితంలో అంతులేని ఆనందం, ముందుకు సాగే సాహసాలను మాకు వదిలేసి వెళ్లిపోయింది.మోఫిట్ క్యాన్సర్ సెంటర్లోని వైద్యులు, నర్సుల బృందం అద్భుతమైన చికిత్స అందించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా కిర్స్టీ అల్లీ ‘‘డ్రాప్ డెడ్ గార్జియస్’’, ‘‘వెరోనికాస్ క్లోసెట్’’, ‘‘ఇట్ టేక్స్ టూ’’వంటి పలు సినిమాల్లో నటించారు. 1970లో బాబ్ అలీ అనే వ్యక్తిని పెళ్లాడి ఏడేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పార్కర్ స్టీవెన్సన్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. కిర్స్టీ అల్లీ తన కెరీర్లో 76 యాక్టింగ్ క్రెడిట్లను దక్కించుకుంది. -
కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి
Actress Anne Heche In Coma After Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి, దర్శకురాలు అన్నే హెచే కోమాలోకి వెళ్లారు. ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో అన్నే హెచే తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ఊపిరితిత్తులకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 'ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఎక్కువగా కాలడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ఇందుకోసం మెకానికల్ వెంటిలేషన్ అవసరం ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆమె స్పృహలోకి రాలేదు. ఇప్పటికీ కోమాలోనే ఉంది' అని వైద్యులు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోరుకోవాలని అన్నే హెచే కుటుంబ సభ్యులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. అలాగే ఇలాంటి సమయంలో ఆమె వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. కాగా 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసే క్రమంలో ఓ ఇంటిని ఢీ కొట్టింది. దీంతో కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 'అనెదర్ వరల్డ్' అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది అన్నే హెచే. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. చదవండి: మంటల్లో చిక్కుకున్న ప్రియాంక చోప్రా సహానటి.. నా వయసు 21, న్యాయం చేయగలనా?: హీరోయిన్ తొలి సినిమాకే నాగ చైతన్య అంత డిమాండ్ చేశాడా? -
కారు ప్రమాదం.. ప్రముఖ నటికి తీవ్ర గాయాలు
Priyanka Chopra Co-Star Anne Heche Critically Injured In Car Crash: ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచే తీవ్ర గాయాలపాలయ్యారు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 53 ఏళ్ల అన్నే హెచే గ్యారేజీ నుంచి తన బ్లూ మినీ కూపర్ కారును బయటకు తీసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటిని ఢీ కొట్టగా, కారు క్రాష్ అయి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసుకొచ్చి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఈలోపే ఆమెకు కాలిన గాయాలయ్యాయని లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రతినిధి బ్రియాన్ హంఫ్రీ ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు. ఆమె కారు క్రాష్‌కు గురైనప్పుడు స్థానికులు అక్కడ ఉండటం వల్లే ప్రమాదం నుంచి బయటపడగలిగారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అన్నే హెచే పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. స్ట్రేచర్‌పై ఉన్న అన్నే స్పృహలోకి వచ్చినట్లు, శ్వాస తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా అన్నే హెచే అనెదర్ వరల్డ్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. 1987 నుంచి 1991 వరకు వచ్చిన ఈ షోలో విక్కీ హడ్సన్, మార్లే లవ్ అనే కవలలుగా నటించినందుకు గానూ ఎమ్మీ అవార్డ్ అందుకుంది. అలాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి 'క్వాంటికో' సిరీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంది. వీటితోపాటు డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్‌గా 'లైగర్' సాంగ్ బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే! -
ప్రాణాంతక వ్యాధి బారిన హీరోయిన్, 2 సార్లు చావు అంచుల వరకు..
ప్రముఖ పాపులర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. యాక్షన్, అడ్వెంచర్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ మొత్తం 73 ఎపిసోడ్స్, 8 సీజన్లుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి ఎమీలియా క్లార్క్. దీని అనంతరం వచ్చిన స్టార్‌వార్స్ సినిమాలతో ఈ నటి మరింత క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ బ్రిటిష్ బ్యూటీ నటించిన చిత్రం ‘ది సీగల్’. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అవుతున్న నయన్-విఘ్నేశ్‌ల పెళ్లి వీడియో ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె తనకున్న ప్రాణాంతక వ్యాధి గురించి బయటపెట్టింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని, దీనివల్ల రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లివచ్చానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా నేను బ్రెయిన్ అనూరిజం అనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. బ్రెయిన్ అనూరిజం వల్ల మెదడుకి సరిగ రక్తం సరఫరా కాదు. దానివల్ల ఓ ప్రదేశంలో బ్లడ్ క్లాట్ అయ్యి పెలిపోయే ప్రమాదం ఉంది. నాలో ఈ వ్యాధి బయటపడగానే సర్జరీ చేయించుకున్నాను. తొలిసారి 2011లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2013లో మళ్లీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. చదవండి: కొత్త ఇంటికి మారిన హిమజ, హోంటూర్ వీడియో వైరల్ అప్పుడు కొన్ని అత్యవసర చికిత్సలు తీసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల ఒక వ్యక్తి మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది. సరిగ్గా మాట్లాడడం కూడా కష్టమే’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సర్జరీల వల్ల తన మెదడులోని సగ భాగం పనిచేయదని చెప్పంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఇకపై నేను నా మెదడుని పూర్తిగా ఉపయోగించలేను. కానీ.. స్పష్టంగా మాట్లాడగలగడం నా అదృష్టం. ఇది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఆ కొద్ది మందిలో నేను ఉడడం అదృష్టంగా భావిస్తోన్న. మీ మెదడులోని ఏ భాగానికైన రక్తం అందకపోతే అది పనికిరాకుండా పోతుంది. ప్రవహించే దారిలో ఏదైనా అడ్డువస్తే రక్తం వెంటనే వేరే దారి చూసుకుంటుంది. దానివల్ల రక్తం అందని భాగం పనిచేయదు’ అని వివరిచింది. -
నటుడితో డేటింగ్, సీక్రెట్‌గా నాలుగో పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్
అమెరికన్ సింగర్, నటి జెన్నీఫర్ లోపెజ్ మరోసారి పెళ్లిపీటలు ఎక్కింది. కొంతకాలంగా నటుడు బెన్ అఫ్లెక్, జెన్నీఫర్ డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా జెన్నీఫర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ బెన్‌తో తన వివాహాన్ని అధికారికంగా ప్రకటిచింది. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు కొద్ది మంది సన్నిహితులు మధ్య జూలై 16న లాస్ వెగాస్‌లో సీక్రెట్‌గా ఈ జంట పెళ్లి జరిగినట్లు స్టానిక మీడియా పేర్కొంది. దీంతో ఈ జంటకు సహా నటీనటులు, ఫాలోవర్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పెళ్లి అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ జంట కొత్త ఇంటిని వేతికే పనిలో పడ్డారని, ఆఖరికి బెవర్లీ హిల్స్‌లో ఇల్లు కొనుగొనుల చేశారని సమాచారం. కాగా 52 ఏళ్ల జెన్నీఫర్‌కు ఇప్పటికే మూడు పెళ్లిల్లు అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెన్ అఫ్లెక్స్ను 4వ వివాహం చేసుకుంది. View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) -
పుట్టినరోజుకు 2 రోజుల ముందు చనిపోయిన పాపులర్ నటి
Seinfeld Actress Estelle Harris Passed Away At 93: హాలీవుడ్ పాపులర్ నటి ఎస్టేల్ హారిస్ శనివారం (ఏప్రిల్ 2) కాలిఫోర్నియాలో కన్నుమూశారు. 93 ఏళ్ల ఎస్టెల్ సహజంగా (వృద్ధాప్యం కారణంగా) మరణించారు. ఆమె మరణించినట్లుగా ఎస్టేల్ కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. ఎస్టేల్ హారిస్ కుమారుడు గ్లెన్ హారిస్ ఆమెకు కన్నీటి నివాళి అర్పించాడు. 'ఈ సాయంత్రం 6:25 గంటలకు ఎస్టేల్ హారిస్ మరణించిందని ప్రకటించడానికి చాలా బాధగా ఉంది. ఆమె దయ, అభిరుచి, సున్నితత్వం, హాస్యం, ఎంపథీ, ప్రేమ ఎవరూ ఇవ్వలేనివి. ఆమెకు తెలిసినవాళ్లకోసం పరితపించే వ్యక్తి.' అని తెలిపాడు గ్లెన్ హారిస్. ఏప్రిల్ 4, 1928న న్యూయార్క్‌లో జన్మించిన ఎస్టేల్ హారీస్ తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు చనిపోయారు. ఎస్టెల్.. 'జెర్రి సీన్ఫెల్డ్' షోలో 'ఎస్టేల్ కోస్టాంజా' పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో జాసన్ అలెగ్జాండర్‌గా పోషించిన జార్జ్ కోస్టాంజా తల్లి పాత్ర ఎస్టేల్ కోస్టాంజాగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. 'టాయ్ స్టోరీ' మూవీ ఫ్రాంచైజీలో మిసెస్ పొటాటో హెడ్‌గా ఉన్న మరో ముఖ్య పాత్రలో కూడా ఎస్టేల్ హారీస్ నటించారు. ది సూట్ లైఫ్ ఆఫ్ జాక్ అండ్ కోడి, టార్జాన్ 2 వంటి చిత్రాల్లో అలరించారు. సీన్ఫెల్డ్ షో అభిమానులు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. కాగా సీన్ఫెల్డ్ షోలో ఎస్టేల్ హారీస్ భర్త ఫ్రాంక్ కోస్టాంజాగా నటించిన జెర్రీ స్టిల్లర్ 2020 మేలో మరణించారు. -
Kim Mi Soo: ప్రముఖ ‘స్నోడ్రాప్’ నటి అనుమానాస్పద మృతి
Snowdrop Series Actress Kim Mi Soo Died At Age 29: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటి కిమ్ మీ సూ(Kim Mi-soo) ఆకస్మాత్తుగా మృత్యువాత పడ్డారు. 29 ఏళ్ల కిమ్ మీ సూ సౌత్ కొరియాలోని తన ఇంటిలో బుధవారం అనూమానస్పదంగా కన్నుమూసినట్లు అక్కడ స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ‘స్నో డ్రాప్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన కిమ్ సూ హఠ్మారణం అందరిని షాక్‌కు గురి చేస్తోంది. చదవండి: Sukumar: మణిరత్నం గారంటే అభిమానం, కానీ కలిసేందుకు వెళ్లిన నాతో సీరియస్‌గా.. దీంతో ఆమె మృతికి కొరియన్ నటీనటులతో పాటు ప్రపంచ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా గతేడాది జనవరి 28న నటి సాంగ్ యూ జంగ్(26) మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కొరియన్‌కు చెందిన చాలా మంది సినీ తారలు 30 ఏళ్లలోపే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతి చెందిన అక్కడ నటీనటులలో చాలా మంది 30 ఏళ్ల లోపువారే ఉండటం గమనార్హం. -
మనీ హేయిస్ట్ నటి ఇంట్లో లార్డ్ గణేశ్ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్
Money Heist Esthar Acebo Have Lord Ganesh Painting At Her House: కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేక్షకులు ఓటీటీల బాట పట్టారు. ఓటీటీల్లో వచ్చిన అనేక వెబ్ సిరీస్‌లు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అందులో ముందు వరుసలో ఉండే వెబ్ సిరీస్ మనీ హేయిస్ట్ (Money Heist). ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్-స్పానిష్ ఆడియెన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సిరీస్‌ను అందించారు. ప్రస్తుతం తెలుగులో కుడా అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ థ్రిల్లర్ సిరీస్‌కు ప్రపంచం మొత్తం అడిక్ట్ అయిదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ గురించి ఎందుకంటా అంటే.. ఈ వెబ్ సిరీస్‌లోని ఒక నటి ఇంట్లో లార్డ్ గణేశుడి ఫొటో ఉండటం. అందుకే మనీ హేయిస్ట్ గురించి మరోసారి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు హిందూ దేవుళ్లను, సాంప్రదాయలను వివిధ దేశాల్లో నమ్మి పాటించేవారి సంఖ్య ఎక్కువే. హిందూ దేవుళ్లను పూజించే విదేశీ వారి గురించి ఎప్పుడో ఒకసారి వింటూనే ఉంటాం. ఇప్పుడు తాజాగా ఈ మనీ హేయిస్ట్ వెబ్ సిరీస్‌లో స్టాక్ హోమ్‌గా నటించిన ఎస్తర్ ఎసిబో (Esthar Acebo) ఇంట్లో వినాయకుడి పేయింటింగ్ ఉండటం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎస్తర్ షేర్ చేసిన ఒక వీడియోలో గణేశుడి పేయింటింగ్ కనిపించింది. దీనిని స్క్రీన్ షాట్ తీసి పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు ఇంటర్నెట్ను హల్చల్ చేస్తున్నాయి. స్పానిష్ నటి ఎస్తర్ ఎసిబో ఇంట్లో హిందూ దేవుడి చిత్ర పటం ఉండటం గర్వకారణం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. Proud moment for India ❤️ Spanish actress @EstherAcebo to international fame for her role as Mónica Gaztambide aka #Stockholm in the hit @netflix series #MoneyHeist. who is proudly displaying vedic pictures of lord #Ganesha at her home in one of her video pic.twitter.com/i3HAq92iri — 𝐓𝐇𝐄 𝐔𝐍𝐒𝐓𝐎𝐏𝐏𝐀𝐁𝐋𝐄 𝐖𝐈𝐍𝐆𝐒 (@the_wings_2002) January 5, 2022 ఇదీ చదవండి: అది ఇది కాదు.. ఎమ్మా వాట్సన్‌కు బదులు మరో హీరోయిన్ -
క్రిస్మస్ రోజే ట్విటర్ ఖాతా తొలగించిన అరియానా.. ఫ్యాన్స్ షాక్ !
Ariana Grande Deletes The Twitter Account On Christmas: హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండె తన పాటలు, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది. 2013-2014 మధ్యలో వచ్చిన 'సామ్ అండ్ క్యాట్' టీవీ షోతో మరింత పాపులర్ అయింది అరియానా. అలాగే 'ది వాయిస్' సీజన్‌కు న్యాయనిర్ణేతగా కూడా కనిపించి అలరించింది. సోషల్ మీడియా పుణ్యమా అని అరియానా గ్రాండె పేరు ఈ సంవత్సరం ఎక్కువగా వినిపించింది. ఈ ఏడాది మేలో లాస్ ఏంజెల్స్ లగ్జరీ రియల్టర్ డాల్టన్ గోమెజ్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన అరియానా తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా శుక్రవారం (డిసెంబర్ 25) క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలందరూ తమ ఫొటోలను, క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ రోజు తన ట్విటర్ ఖాతా తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది అరియానా. ఎలాంటి సమాచారం లేకుండా తన అకౌంట్ డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏమైందా అని ఆరా తీశారు అరియానా ఫ్యాన్స్. అరియానా సైబర్ వేదింపులకు గురయి ఉంటుందని, అందుకే డిలీట్ చేసిందని కొందరు భావిస్తున్నారు. లేదా తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటనతో వచ్చేందుకు ఇలా చేసిందా అని తికమక పడుతున్నారు. ఆమె మీద ట్రోలర్స్ ప్రభావం పడిందేమోనని, వారివల్లే ఖాతా తొలగించిందేమో అని ఆరోపిస్తున్నారు. ఆమె మళ్లీ ట్విటర్‌లోకి రావాలని అరియానా ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) బ్యాంగ్ బ్యాంగ్, బ్రేక్ ఫ్రీ, సైట్ టు సైడ్ వంటి హిట్ సాంగ్స్ పాడిన అరియానా గ్రాండె ఇన్‌స్టా గ్రామ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉంది. తన తాజా నెట్‌ఫ్లిక్స్ చిత్రం డోంట్ లుక్ అప్ ప్రచార చిత్రాలను షేర్ చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మెర్రీ.. బీ సేఫ్, ఐ లవ్ యూ అని స్టోరీ షేర్ చేసింది ఈ బ్యూటీఫుల్ సింగర్. ఇదీ చదవండి: తన నివాసంలో ప్రియుడిని పెళ్లాడిన పాప్ సింగర్ -
ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే
Priyanka Chopra Interesting Comments On India And Culture: గ్లోబల్ స్టార్ ప్రియాంక జోనాస్ ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరైన తక్కువ చేసిన ఊరుకోదు. వెంటనే కౌంటర్ ఇస్తుంది ప్రియాంక. ఇందుకు ఉదాహరణ ఇటీవల తనను 'వైఫ్ ఆఫ్ జోనాస్'గా ప్రస్తావించడమే. ప్రస్తుతం ప్రియాంక తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రమోషన్లో బిజీగా ఉంది. 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియాంక సీత పాత్రను పోషించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టెలివిజన్ హోస్ట్ రాషా గోయెల్‌తో ముచ్చటించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. అలాగే 'మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఇంటికు (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదు. నా ఇళ్లు, నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను.' అని చెప్పుకొచ్చింది ప్రియాంక జోనాస్. ప్రియాంక, నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. అలాగే రెండు పరిశ్రమలను (బాలీవుడ్, హాలీవుడ్) బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే అలా చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది ఉన్నారని ప్రియాంక అభిప్రాయపడింది. So much love for @priyankachopra and seeing her be a part of this franchise. not often South Asian actors get booked in these parts. Talked about her exp on set and how the Indian culture is always with her. ❤️Always fearless in her endeavors. #southasian #PriyankaChopraJonas pic.twitter.com/slRA0fbCfd — Rasha Goel (@RashaGoel) December 16, 2021 ఇదీ చదవండి: 'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్.. -
నా నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ్చు.. నటి ఘాటు వ్యాఖ్యలు
Jennifer Lawrence Opens Up About Her Private Photos Leak: 2014లో జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫల్ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. వేర్వేరు సెలబ్రిటీలకు సంబంధించిన సుమారు 500 ప్రైవేట్ ఫొటోలను హ్యాకర్లు సేకరించి ఆన్లైన్లో లీక్ చేశారు. ఆ సెలబ్రిటీల్లో సింగర్ రిహన్నా, సెలీనా గోమెజ్‌లతో పాటు నటి జెన్నిఫర్ లారెన్స్ కూడా ఉన్నారు. అప్పుడు జరిగిన ఆ స్కాండల్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నానని వెల్లడించింది. 'నా అంగీకారం లేకుండా ఎవరైనా నా నగ్న శరీరాన్ని చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన వారేవరో వాటిని పోస్ట్ చేశారు. కానీ నా గాయం మాత్రం ఎన్నటికీ మానదు.' అని తన మనసులోని బాధను ఘాటుగా బయటపెట్టింది జెన్నిఫర్. అలాగే గతంలో ఈ హ్యాక్‌ని ఒక లైంగిక నేరం, లైంగిక ఉల్లంఘనగా పేర్కొంది. జెన్నిఫర్ 2017లో జరిగిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన స్వస్థలమైన లూయిస్ విల్లే, కెంటక్కీ నుంచి న్యూయార్క్‌కు ఒక ప్రైవేట్ విమానంలో బయలుదేరింది. అప్పుడు విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతో చనిపోతాననే భావన గట్టిగా కలిగింది జెన్నిఫర్‌కు. 'నా అస్థిపంజరం సీటులో ఉండిపోతుంది. నేను నా కుటుంబానికి వాయిస్ మేయిల్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను. నన్ను క్షమించండి.' అని అప్పటి అనుభవాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం జెన్నిఫర్ తన రాబోయే చిత్రం డోంట్ లుక్ అప్ ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ సెటైరికల్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10న పరిమిత థియేటర్లలో విడుదలవనుంది. అలాగే డిసెంబర్ 24 నుంచి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది చదవండి: ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమంటున్న 'వండర్ వుమెన్' -
ఇప్పటికే 3 పెళ్లిళ్లు.. నాలుగో పెళ్లికి సింగర్ రెడీ
Jennifer Lopez Said About Her Fourth Marriage: అమెరికన్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన పాటలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 52 ఏళ్ల ఈ నటి ఇప్పటికి మూడు పెళ్లిల్లు చేసుకుంది. ప్రస్తుతం బెన్ అఫ్లెక్‌తో డేటింగ్లో ఉంది. ఈ విషయమై తాజాగా జెన్నిఫర్‌ను మళ్లీ వివాహం చేసుకుంటారా అని అడిగితే అవునని సమాధానమిచ్చింది. జెన్నిఫర్ కొత్త చిత్రం 'మ్యారీ మీ' సినిమా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. 'అవును. నేను అనుకుంటున్నాను. మీకు నా గురించి తెలుసు. ఐయామ్ రొమాంటిక్. అలా ఎప్పటినుంచో ఉన్నాను. నాకు కొన్ని సార్లు వివాహం జరిగింది. మరో పెళ్లి తర్వాత కూడా సంతోషంగా ఉంటానని 100 శాతం నమ్ముతున్నాను.' ఈ గాయని గతంలో ఓజానీ నోవాను 1997లో వివాహం చేసుకుంది. తర్వాత ఇద్దరూ 1998 ప్రారంభంలో విడిపోయారు. 2001లో క్రిస్ జుడ్‌ని పెళ్లి చేసుకుని 2002లో విడిపోతున్నట్లు ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత జెన్నిఫర్ మార్క్ ఆంటోనిని వివాహామాడింది. 2011లో విడిపోయే వరకు వారు ఏడేళ్లు కలిసి ఉన్నారు. తర్వాత 13 ఏళ్ల ట్విన్స్ అయిన మాక్స్, ఎమ్మేలను చెరొకరు తీసుకున్నారు. మార్క్‌తో వివాహానికి ముందు, జెన్నిఫర్, బెన్ 2002 చివరిలో మొదటిసారి డేటింగ్ చేసి నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2004లో విడిపోయారు. సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి గతంలో కంటే సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో అలెక్స్ రోడ్రిగ్జ్‌తో జెన్నిఫర్ నిశ్చితార్థం ముగిసాక బెన్నిఫర్ (బెన్ అఫ్లెక్, జెన్నిఫర్ లోపెజ్) 2.0 మళ్లీ ప్రారంభమైంది. వారు వారి ప్రేమలో లోతుగా మునిగిపోయారు. వివిధ నగరాల్లో ఎక్కువ రోజులు గడపడం వల్ల ఒకరినొకరు చాలా మిస్సయ్యారని వారి సన్నిహితులు తెలిపారు. జెన్నిఫర్ లోపెజ్ తన తాజా చిత్రం 'మ్యారీ మీ' ని ఒకటి కంటే ఎక్కువసార్లు అనుసరిస్తున్నట్లుగా ఉంది. -
ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్
Priyanka Chopra Shares The Matrix Resurrections New Poster: హాలీవుడ్ 'మ్యాట్రిక్స్' మూవీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో హాలీవుడ్ స్టార్ కీన్ రీవ్స్‌తో పాటు క్యారీ-అన్నె మోస్, జడా పింకెట్ స్మిత్, యహ్యా అబ్దుల్ మాటీన్ 2, జోనాథన్ గ్రోఫ్ ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ ప్రియాంక 'ఈ మ్యాట్రిక్స్ రిసరెక్షన్ కొత్త పోస్టర్‌తో తిరిగి మ్యాట్రిక్స్‌లోకి అడుగు పెట్టండి. ఈ క్రిస్మస్కి థియేటర్లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో చూడండి.' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) భారతీయ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పోస్టర్లో ప్రియాంక కనిపించకపోయేసరికి ప్రశ్నలు కురిపించిసాగారు. 'పోస్టర్లో మీరు ఎక్కడ ఉన్నారు' అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. 'మిమ్మల్ని చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం' అని మరోకరు రాశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక నల్లటి షేడ్స్ ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాల్గో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. -
అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి
వాషింగ్టన్: వెనకటి రోజుల్లో అంటే ఏమో కానీ.. ప్రస్తుతం మాత్రం దెయ్యాలు, భూతాలు అంటే చాలామంది కొట్టి పారేస్తారు. కేవలం సినిమాల్లో తప్ప వాస్తవంగా దెయ్యాలు ఉండవు అనే వారు చాలా మంది. అయితే దెయ్యాల ఉనికిని నమ్మేవారు కూడా కొకోల్లలు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. ప్రముఖ హాలీవుడ్ నటి ఒకరు తాను చాలా ఏళ్ల పాటు దెయ్యాలతో కలిసి జీవించానని.. చివరకు ఒకరోజు వాటిని తరిమే వ్యక్తిని తీసుకువచ్చి.. దెయ్యాల గోల నుంచి విముక్తి పొందానని తెలిపారు. సామాన్యులు ఎవరైనా ఇలాంటి మాటలు చెబితే పెద్దగా పట్టించుకోం.. కానీ ఏకంగా హాలీవుడ్ నటే వెల్లడించడంతో.. ఈ టాపిక్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ వివరాలు.. ఇటీవలే క్లో జావో 'ఎటర్నల్స్'తో అజాక్గా తన సూపర్ హీరో అరంగేట్రం చేసిన ప్రముఖ నటి సల్మా హాయక్, తన లండన్ ఇల్లు దెయ్యాలతో నిండిపోయిందని తెలిపారు. ది ఎల్లెన్ డిజెనెరెస్ షోకు హాజరైన సందర్భంగా హాయక్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇంట్లో తాను ఎదుర్కొన్న విచిత్ర పరిస్థితుల గురించి.. దెయ్యాలను తరిమికొట్టిన విధానం గురించి వెల్లడించారు. (చదవండి: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. రాత్రయితే..) ఈ సందర్భంగా హాయక్ మాట్లాడుతూ.. ‘‘లండన్‌లో ఉన్న నా ఇంట్లో చిత్ర, విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు చోటు చేసుకునేవి. పియానో దానంతట అదే మోగేది. మూడో అంతస్తులో ఉన్న లైట్లు.. వాటంతట అవే వెలిగేవి.. ఆరిపోయేవి. ప్రారంభంలో ఇవన్ని చూసి బెదిరిపోయాను. మనుషులు ఎవరు కనిపించే వారు కారు. ఆ తర్వాత ఇది దెయ్యాల పనే అని నాకు అర్థం అయ్యింది. కాకపోతే నేను ఎప్పుడు వాటిని ప్రత్యక్షంగా చూడలేదు’’ అని తెలిపారు. (చదవండి: వైరల్: ఈమె మనిషా.. దెయ్యామా?!) ‘‘ఈ బాధ నుంచి బయటపడటానికి ఓ వ్యక్తిని తీసుకువచ్చాను. నాకు మా ఇంట్లో ఎప్పుడు దెయ్యం కనిపించలేదు. కానీ విచిత్ర సంఘటనలు చోటు చేసుకునేవి. అందుకే దెయ్యాలను తరిమే వ్యక్తిని తీసుకువచ్చాను. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ నా ఈ ప్రయత్నం వల్ల వాటిని ఇంటి నుంచి తరిమేశాను అనే తృప్తి కలుగుతుంది.. భయం తగ్గి ప్రశాంతంగా ఉంటాను. ఇక నేను తీసుకువచ్చిన వ్యక్తి దగ్గర దగ్గర 20 దెయ్యాలను పట్టుకున్నట్లు తెలిపాడు’’ అని వెల్లడించారు. హాయక్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేకెత్తిస్తున్నాయి. చదవండి: ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ -
షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. సహనటితో ఎంగేజ్మెంట్
Kristen Stewart And Dylan Meyer Are Engaged: ప్రముఖ హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టెవర్ట్ షాకింగ్ ప్రకటన చేశారు. సహనటి డైలాన్ మేయర్‌తో తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు. రెండేళ్ల నుంచి తాము డేటింగ్లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే వీరద్దరు రహస్యంగా వివాహం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజా ప్రకటనతో వీరి బంధం గురించి జనాలకు ఓ క్లారిటీ వచ్చింది. సైరస్ఎక్స్ఎం ది హోవార్డ్ స్టెర్న్ షోకు గెస్ట్‌గా వచ్చిన క్రిస్టెన్ తన ఎంగేజ్మెంట్ వార్తను ప్రకటించారు. పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రిస్టెన్ మాట్లాడుతూ.. ‘‘అతి త్వరలో నేను, డైలాన్ వివాహం చేసుకోబోతున్నాం. మేం ఒకరి కోసం ఒకరం జీవించాలని కోరుకుంటున్నాం. నా కోసం తను.. డైలాన్ కోసం నేను.. మమ్మల్ని మార్చుకున్నాం. మేం తప్పకుండా పెళ్లి చేసుకుంటాం’’ అని తెలిపారు. (చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) ఇక క్రిస్టెన్, డైలాన్ 2019 నుంచి డేటింగ్లో ఉన్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ ఇరువురు ఈ వార్తలపై స్పందించలేదు. కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టైల్ మ్యాగ్జైన్ ఇంటర్వ్యూ సందర్భంగా క్రిస్టెన్ తనకు, డైలాన్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి వివరించారు. ‘‘నేను నా గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి ప్రతిరోజు బయటకు వెళ్లేదాన్ని. తనతో ఆప్యాయంగా ఉన్న సమయంలో నన్ను ఫోటో తీయడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. కానీ నేను వాటి గురించి పట్టించుకునేదాన్ని కాదు’’ అన్నారు. ‘‘నేను ఎంతో ఒత్తిడిని అనుభవించాను. కానీ ఈ ఒత్తిడి నన్ను నేను ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన దాన్ని అని ఫీల్ అయ్యేలా చేయలేదు. జనాలు నాకు సంబంధించిన ఫోటోలు చూస్తున్నారు.. వార్తలు చదువుతున్నారు. ఆ తర్వాత వారు బయటకు వచ్చి తమ గురించి ప్రకటించుకోగలుగుతున్నారు. ఈ విషయంలో చిన్నతనంలో నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. నాలా బాధపడేవారికి ఉపశమనం కలిగించేందుకు నేను చేస్తున్న ప్రయత్నాలు నాకు తృప్తిని ఇస్తున్నాయి’’ అని తెలిపారు. (చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌తో నటి రహస్య వివాహం!) డైలాన్ మేయర్ ఒక నటి, రచయిత. ఆమె మోక్సీ, రాక్ బాటమ్, మిస్ 2059 వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందింది. క్రిస్టెన్ స్టెవర్ట్ తదుపరి స్పెన్సర్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె యువరాణి డయానాగా నటించనుంది. క్రిస్టెన్ స్టీవర్ట్ గతంలో సూపర్ మోడల్ స్టెల్లా మాక్స్వెల్, ట్విలైట్ సహనటుడు రాబర్ట్ ప్యాటిన్సన్లతో డేటింగ్ చేసింది. చదవండి: ముచ్చటగా మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్.. వైరల్ -
బిడ్డకు పాలిస్తే.. బిల్డప్ ఎలా అవుతుంది?: హీరోయిన్
బోల్డ్ స్టేట్మెంట్లు, యాక్షన్లు తరచూ సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అందుకే నొప్పింపక.. తానొవ్వక అనే రీతిలో వ్యవహరిస్తుంటారు కొందరు. ఆ కొందరిలో ఒకరు నటి గాల్ గాడోట్(36). వండర్ ఉమెన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హాలీవుడ్ నటి గాడోట్.. తరచూ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా సున్నితంగా ఆడియెన్స్‌కు చేరవేస్తుంటుంది కూడా. అలాంటిది తాజాగా ఆమె చేసిన ఓ పని.. ఇంటర్నెట్లో విమర్శలకు దారితీసింది. షూటింగ్ కోసం రెడీ అవుతున్న తరుణంలో.. టచప్ సందర్భంగా చనుబాలను పంపింగ్ చేస్తూ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో కొందరు పనిగట్టుకుని ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. అతి చేష్టల్లో భాగంగా ఆమె ఆ పని చేసిందంటూ మండిపడ్డారు. దీంతో గాడోట్ ఓ మీడియా హౌజ్ ద్వారా స్పందించింది. తల్లి పాల విలువేంటో చెప్పేందుకు తాను ఆ పని చేశానని క్లారిటీ ఇచ్చింది. తల్లయ్యాక తిరిగి పనుల్లోకి వెళ్లడం ఎంత కష్టమో ఆ విమర్శించే వాళ్లకు తెలిసి ఉండకపోవచ్చు. అది తెలియాలనే నా ఈ ప్రయత్నం. పైకి నవ్వుతూ ఉన్నా.. ఎల్లప్పుడూ బిడ్డల ఆకలి గురించి ఆలోచించే తల్లుళ్లకు జోహార్లు అంటూ చెంపపెట్టు సమాధానమిచ్చింది గాల్ గాడోట్. కాగా, ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన గాడోట్.. రెండు నెలల క్రితమే మూడో బిడ్డకు జన్మనిచ్చింది. గాడోట్ మాత్రమే కాదు.. గతంలో క్రిస్సి టెయిగెన్, లోకి నటి సోఫియా డి మార్టినో కూడా ఇలా సెట్స్ నుంచే పంపింగ్ ఫొటోలతో వార్తల్లో చర్చకు దారితీశారు. చదవండి: పూజా హెగ్డే.. ఇది మంచి పద్ధతి కాదు! -
మూడోసారి తల్లైన 'వండర్ వుమెన్'
Gal Gadot: 'వండర్ వుమెన్' హీరోయిన్ గాల్ గాడోట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న ఈ హాలీవుడ్ స్టార్ తన గారాలపట్టికి డానియెల్లా అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. ఇక మూడోసారి తల్లైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటో షేర్ చేసింది. ఇందులో భర్త జారన్ వర్సానో, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. "నా కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఇప్పుడు ఐదుకి చేరింది. ఆనందంతో పరవశించిపోతున్నా. డేనియల్లాను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది" అని సదరు పోస్ట్‌కు క్యాప్షన్ జత చేసింది గాల్. గాల్ గాడోట్ ఇటీవలే 'వండర్ వుమన్ 1984' అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 2017 వచ్చిన ‘వండర్ ఉమన్’కు ఇది పార్ట్-2గా వస్తోంది. ప్యాటీ జెన్కిన్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆమె కెన్నెత్ బ్రనగ్ దర్శకత్వం వహిస్తున్న బ్రిటీష్ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ 'డెత్ ఆన్ ద నైల్' సినిమా చేస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. View this post on Instagram A post shared by Gal Gadot (@gal_gadot) చదవండి: ప్లీజ్.. సంరక్షకుడిగా నా తండ్రిని తప్పించండి: బ్రిట్నీ స్పియర్స్ వేడుకోలు -
అవెంజర్స్ సుందరికి పెళ్లైందా?
లాస్ ఏంజెల్స్: మార్వెల్ ‘అవెంజర్స్’ సిరీస్‌లో వాండా మాగ్జిమాఫ్ అలియాస్ స్కార్లెట్ విచ్ క్యారెక్టర్‌తో అలరించింది నటి ఎలిజబెత్ ఓల్సెన్. ఓల్సెన్కు హాట్ నటిగా యూత్‌లో మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే తనకు పెళ్లైందనే విషయం.. పొరపాటుగా అందో లేదా కావాలనే అందోగానీ ఇప్పుడది హాలీవుడ్ వర్గాల్లో టాపిక్‌గా మారింది. ఓల్సెన్ రీసెంట్గా యాక్టర్స్ ఆన్ యాక్టర్స్ అనే ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ వీడియో ఇంటర్వ్యూలో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న వాండావిజన్ ముచ్చట్లు పంచుకుంది. అంతేకాదు రెండో సీజన్ ఉండదని క్లారిటీ ఇచ్చింది కూడా. ఒకానొక టైంలో ఓల్సెన్, నటి కేలీ క్యూకోతో మాట్లాడుతుండగా రాబీ అమెట్ట్ను తన భర్తగా పేర్కొంది. రాబీ, ఓల్సెన్ 2016 నుంచి డేటింగ్లో ఉన్నారు. ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో కలిసి ఉంటున్నారు కూడా. ఇప్పుడామె ‘భర్త’ అని సంభోధించడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అని హాలీవుడ్ మీడియా హౌజ్‌లు చర్చించుకుంటున్నాయి. అయితే నవ్వుతూనే ఆ మాట అనడంతో ఆమె జోక్ చేసి ఉండొచ్చని నటుడు మార్క్ రఫెల్లో(అవెంజర్స్ హల్క్) అంటున్నాడు. ఇక వీళ్ల పెళ్లి గురించి సన్నిహితులుగానీ, కుటుంబ సభ్యులుగానీ స్పందించకపోవడం విశేషం. కాగా, నాలుగేళ్ల వయసుకే ఓల్సెన్ యాక్టింగ్ కెరీర్‌ను మొదలుపెట్టింది. మార్థా మార్సీ మే మార్లెనె(2011)తో హీరోయిన్గా మారడంతో.. తొలి సినిమాకే అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘రెడ్ లైట్స్, సైలెంట్ హౌజ్, కిల్ యువర్ డార్లింగ్స్, గాడ్జిల్లా(2014), విండ్ రివర్ సినిమాలతో పాటు అవెంజ్స్ సిరీస్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. -
రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన నటి.. పరిస్థితి విషమం
వాషింగ్టన్ : హాలీవుడ్ నటి లీసా బెన్స్(65) రోడ్డు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం..లీసా బెన్స్ వాషింగ్టన్‌లోని లింకన్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఆమెను ఢీకొట్టింది. దీంతో నటి లీసాకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బైక్‌పై వచ్చిన వ్యక్తి అతి వేగంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రమాదం తర్వాత బైకుని ఆపకుండా వెళ్లిపోయాడని లాసా మేనేజర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. అయితే బాధితుడి వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఘటన జరిగి రెండు రోజులు అయినా ఇంకా అతడిని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఇక ‘గాన్ గర్ల్’ సినిమాతో ఫేమస్ అయిన లీసా బెన్స్ ఆ తర్వాత పలు సహాయక పాత్రలతో పాట పలు టీవీ ఫోలలో కూడా పాల్గొంది. చదవండి : నాలుగేళ్లుగా డేటింగ్: పెళ్లి జరగదంటున్న నటుడు బ్రాడ్‌పిట్‌కి అనుకూలంగా తీర్పు.. ఇక విడాకులే! -
భద్రతా దళాల కాల్పుల్లో నటికి తీవ్ర గాయాలు
గత వారం హైఫాలో జరిగిన నిరసన సందర్భంగా బాగ్దాద్ సెంట్రల్ స్టార్, పాలస్తీనా నటి మైసా అబ్ద్ ఎల్హాది ఇజ్రాయెల్ బలగాలు కాల్పులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆమె గురువారం (మే 13) సోషల్ మీడియాలో "ప్రస్తుతం తాను కోలుకుంటున్నాని.. బాగానే ఉన్నాను’’ అని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల తరువాత అనేక పాలస్తీనా కుటుంబాలు తమ ఇళ్ల నుంచి బహిష్కరణను ఎదుర్కొన్నాయి. దీని ఫలితంగా నగరంలో ఉద్రిక్తతలు పెరిగి నిరసనలకు దారితీసింది. ఈ క్రమంలో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గత వారం హైఫాలో ఆందోళన చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మైసా కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనికులు నిరసనకారులపై గ్రెనేడ్లను కాల్చడం ప్రారంభించిరని.. ఈ ఘటనలో తాను కూడా గాయపడ్డానని వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మైసా అసలు ఆ రోజు ఏం జరిగిందనేది తెలిపారు. ‘‘ఆదివారం హైఫాలో జరిగిన శాంతియుత నిరసన కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. నినాదాలు, పాటలు ద్వారా మా కోపాన్ని తెలియజేస్తున్నాం. నేను కూడా నినాదాల చేస్తూ.. అక్కడ జరిగే వాటిని రికార్డ్ చేస్తున్నాను. నిరసన ప్రారంభమైన కొద్దిసేపటికే, సైనికులు అక్కడ స్టన్ గ్రెనేడ్లు, గ్యాస్ గ్రెనేడ్లను కాల్చడం ప్రారంభించారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన నేను.. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లి సురక్షితంగా అనిపించిన ప్రదేశంలో ఒంటరిగా నిలబడ్డాను. నా వెనక సైనికులున్నారు. అప్పుడ నేను బహాయ్ గార్డెన్స్‌పై ఉన్న పాలస్తీనా జెండాను ఫోటో తీస్తున్నాను. అప్పటి వరకు ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు” అని మైసా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ‘‘నేను నా కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. పెద్ద శబ్దం వినిపించింది. నా ప్యాంట్ ఏమైనా చిరిగిందా ఏంటి అనుకుంటూ.. అక్కడ నుంచి ఫాస్ట్‌గా వెళ్లాలని భావించాను. కానీ నేను నడవలేకపోతున్నాను. కాలు విపరీతంగా నొప్పి పెడుతుంది. ఏం జరిగింది అని వంగి చూడగా.. నా కాలు చర్మం చీరుకుపోయి.. విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అది చూసి నేను భయంతో కేకలు వేశాను. అక్కడ ఉన్న కొందరు నన్ను ఆస్పత్రిలో చేర్చారు’’ అని తెలిపారు. నటి కాలికి తీవ్ర గాయమయ్యింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు పరస్పరం రాకెట్లతో దాడి చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారని తెలిపింది. చదవండి: Israel- Palestine: క్షతగాత్రి పాలస్తీనా -
షాకింగ్ రెమ్యూనరేషన్.. రోజుకు రూ.2కోట్లు
సినిమా తారల సంపాదన గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తే. ఓ సగటు మనిషి తన జీవిత కాలం అంతా కష్టపడినా సంపాదించని మొత్తం వారు ఒక్క సినిమాతో సంపాదిస్తారు. కొందరు నటులు ఒక్క రోజులో కోట్లు సంపాదిస్తారంటే అతిశయోక్తి కాదు. మన దగ్గర స్టార్ హీరోలు ఒక్క సినిమాకు 50 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే తాజాగా ఓ నటి తీసుకున్న పారితోషికం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె రెమ్యూనరేషన్ తెలిసి జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. వివరాలు చైనా నటి జెంగ్ ఓ షో కోసం రోజుకు 3,20,000 డాలర్ల(రూ.2,36,76,816) చొప్పున 77 రోజులకు కలిపి 25 మిలియన్ డాలర్ల(1,84,97,88,750 కోట్ల రూపాయలు) రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ మొత్తాన్ని 2019లో ఓ కాస్ట్యూమ్ డ్రామాలో నటించేందుకు 77 రోజులు కేటాయించిన నటి.. రోజుకు 3,20,000 డాలర్లు తీసుకుందని మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ప్రచురితమైంది. ఈ క్రమంలో అధిక వేతనం అందుకున్న జెంగ్.. పన్ను ఎగవేతకు పాల్పడిందన్న ఆరోపణలతో షాంఘై, బీజింగ్‌లోని అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా మీడియా కథనాలు వెలువరించింది. ఈ వార్తలపై స్పందించిన సదరు నటి తాను ఇన్వెస్టిగేషన్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది. కాగా ఈ విషయాన్ని జెంగ్ ఎక్స్ పార్ట్నర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ జాంగ్ హెంగ్ బయటపెట్టాడు. తన షో కోసమే నటి ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు తెలిపాడు. చదవండి: టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య -
ఫుల్లుగా తాగి వేలు కత్తిరించుకున్న స్టార్ హీరోయిన్!
తాగిన మత్తులో కూరగాయలు కట్ చేయబోయి ఏకంగా చేతి వేలినే కత్తిరించేసుకుందో హాలీవుడ్ స్టార్. వండర్ వుమెన్‌లో ప్రధాన పాత్ర పోషించిన గాల్ గ్యాడట్ ఈ విషయాన్ని తనే స్వయంగా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇది కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో జరిగింది. అసలు ఎవరైనా ఉదయం 11 గంటలకు మిమోసా లేదా సంగ్రియా తాగుతారా? కానీ నేను మాత్రం తాగాను. సరిగ్గా అప్పుడే క్యాబేజీ సలాడ్ చేయమని నా భర్త చెప్పడంతోని వంటింట్లోకి వెళ్లాను" "పదునైన కత్తి తీసుకుని చకచకా కట్ చేయడం మొదలుపెట్టాను. ఇంతలో నా వేలు తెగింది. అదేదో చిన్న గాయం కూడా కాదు. వేలు పై భాగం తెగిపడింది. వెంటనే నా భర్త యారన్ వార్సనో పరుపరుగున వచ్చి ఆ తెగిపడిన వేలి పై భాగాన్ని తీసుకుని చూశాడు. దాన్ని తీసి చెత్తబుట్టలోకి విసిరేశాడు. దాన్ని ఎలాగో అతికించడానికి వీలుకాదు కాబట్టి ఆస్పత్రికి కూడా వెళ్లలేదు" అని చెప్పుకొచ్చింది. ఇదిలా వుంటే గాల్ గ్యాడ్ త్వరలో మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ మధ్యే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. చదవండి: ఓ ఇంటివాడైన క్రాక్ సినిమాటోగ్రాఫర్ -
రైతులకు మద్దతు.. నటికి అత్యాచార బెదిరింపులు
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో రెండు నెలలకు పైగా ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సం నాటి ఘటనతో రైతులకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖలు మద్దతిస్తుండగా.. మన దేశంలో సెలబ్రిటీలు మాత్రం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతలకు మద్దతిస్తోన్న తనపై అత్యాచార చేస్తామని.. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బ్రిటీష్ నటి జమీలా జమిల్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘గత కొన్ని నెలలుగా నేను తరచుగా భారతీయ రైతులకు మద్దతుగా మాట్లాడుతున్నాను. ఫలితంగా నేను బెదిరింపులు ఎదుర్కొంటున్నాను. చంపేస్తాం.. అత్యాచారం చేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి.. నేనూ మనిషినే.. కొంతవరకే దేన్ని అయినా భరించగలను. రైతులకు నేను సంఘీభావం తెలుపుతున్నాను.. ఇక మీదట కూడా తెలుపుతాను. ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వారు తమ న్యాయమైన హక్కుల కోసం పొరాడుతున్నారని గుర్తించండి’’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Jameela Jamil (@jameelajamilofficial) ఇక జమీలా విషయానికి వస్తే.. ఆమె తండ్రి అలీ జమిల్ భారత సంతతి వ్యక్తి కాగా.. తండ్రి షిరీన్ జమిల్ పాక్ సంతతి మహిళ. ఇక జమీలా 2009లో టీ4తో తన టెలివిజన్ కెరీర్ స్టార్ట్ చేసింది. 2012 వరకు సాగిన ఈ పాప్ కల్చర్ సిరీస్ జమీలా హోస్ట్‌గా పని చేసింది. ఇక ఎన్బీసీలో వచ్చిన ఫాంటసీ కామెడీ సిరీస్ ది గుడ్ ప్లేస్ లో తహాని అల్-జమీల్ పాత్రతో బాగా పాపులర్ అయ్యింది. చదవండి: ‘పోలీసుల దెబ్బలకు రైతుల కాళ్లు కమిలిపోయాయి’ రైతుల చుట్టూ కాదు.. గుండెల్లో మేకులు -
ప్రియుడితో నటి బ్రేకప్: సోషల్ మీడియాకు గుడ్‌బై!
హాలీవుడ్ లవ్ బర్డ్స్ బెన్ అఫ్లెక్- అన డె అర్మాస్ ఈ మధ్యే ప్రేమ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు వారాలకు అన డె సోషల్ మీడియాకే గుడ్‌బై చెప్తూ ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయంతో అన డె అభిమానులు విచారంలో మునిగిపోయారు. కాగా "డీప్ వాటర్" సినిమా షూటింగ్ సమయంలో బెన్, అన డె ప్రేమలో పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లోనే ప్రేమ విషయాన్ని అన డె అధికారికంగా ధృవీకరించింది. అతడితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. తన క్వారంటైన్ సమయాన్ని కూడా లాస్ ఏంజెల్స్‌లోని బెన్ నివాసంలో అతడి పిల్లలతో గడిపింది. కానీ ఏడాది తిరిగేలోగా ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. (చదవండి: ‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది: కేట్) బెన్ ఇప్పుడు అనతో డేటింగ్ చేయట్లేదని, వారి మధ్య బంధం బీటలు వారిందని వారి సన్నిహితులు మీడియాకు తెలిపారు. బెన్ తన పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్‌లోనే ఉండాలనుకుంటున్నాడని, కానీ అన డె లాస్ ఏంజెల్స్‌కు రావాలనుకోవట్లేదని మీడియాకు తెలిపారు. విడిపోయినప్పటికీ వారు సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఆ మధ్య బెన్ అఫ్లెక్ ఇంట్లో నుంచి అన డె ఫొటోలను సిబ్బంది చెత్త డబ్బాలో పారేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సదరు నటి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. (చదవండి: ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్ పూర్తయిందోచ్!) A life-sized cardboard cutout of Ana de Armas from inside Ben Affleck’s residence was seen being thrown out into a trash can. (January 18, 2021) pic.twitter.com/4bxxDC97WZ — Ana de Armas Updates (@ArmasUpdates) January 19, 2021 -
జేమ్స్ బాండ్ 007 నటి మృతి
లాస్ ఎంజెలస్: జేమ్స్ బాండ్ 007 సిరీస్ నటి తన్య రాబర్ట్(65) మృతి చెందారు. ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం కన్నుమూశారు. క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 24న తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్-సినార్ హాస్పిటల్లో చేర్పించినట్లు ఆమె స్నేహితుడు, ప్రతినిధి మైక్ పింగెల్ స్థానిక మీడియాకు తెలిపాడు. దీంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారన్నారు. ఈ క్రమంలో తన్య నిన్న మృత్యువాత పడినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆమె మృతికి కారణం ఇంకా తెలియలేదని, చనిపోవడానికి ముందు తన్య రాబర్ట్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విక్టోరియా లీ బ్లమ్లో జన్మించిన తాన్య రాబర్ట్స్ మొదట మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1975లో వచ్చిన హర్రర్ చిత్రం ఫోర్స్డ్తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 1985లో జేమ్స్ బాండ్ 007 చిత్రంలో తన్య అమెరికన్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్టాసే సుట్టన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతో తన్య నటిగా మంచి గుర్తింపు పొందారు. అయితే సినిమాలలో నటించడానికి ముందు ఆమె కొన్ని టెలివిజన్ ప్రకటనలు కూడా చేశారు. -
హాలీవుడ్ నటి ఒలివియా కన్నుమూత
హాలీవుడ్ సీనియర్ నటి, 1960ల సూపర్ స్టార్, రెండు సార్లు ఆస్కార్ గెలిచిన ఒలివియా కన్నుమూశారు. ఆదివారం రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఒలివియా వయసు 104. ఐదు దశాబ్దాల పాటు హాలీవుడ్ లో నటిగా కొనసాగారామె. సుమారు 49 సినిమాల్లో నటించారు. ‘టుఈచ్ హిజ్ ఓన్’ (1947), ‘ది హెయిరెస్’ (1950) సినిమాలకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారామె. ‘కెప్టెన్ బ్లడ్, ది అడ్వెంచర్స్ ఆఫ్ రాబిన్ హుడ్, స్నేక్ పిట్’ వంటి పాపులర్ సినిమాల్లో కనిపించారు ఒలీవియా. హాలీవుడ్ గోల్డెన్ పీరియడ్ లో ఒలివియా తిరుగులేని సూపర్ స్టార్ అనిపించుకున్నారు. ఒలివియా మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
కరోనాతో హాలీవుడ్ నటి మృతి
కరోనా వైరస్ బారిన పడిన హాలీవుడ్ నటి హిల్లరీ హీత్(74) మృతి చెందారు. కరోనా కారణంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతో హీత్ మృతి చెందినట్లు హాలీవుడ్ సీనీ ప్రముఖులు శనివారం అధికారంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నటి దత్తత కుమారుడు అలెక్స్ ఫేస్బుక్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. (వుహాన్ వదిలి వెళ్లను.. కేరళ యువతి) కాగా బ్రిటిష్‌కు చెందిన హిల్లరీ ముఖేల్ రీవ్స్ హర్రర్ చిత్రం ‘విచ్ ఫైండర్ జనరల్’తో నటిగా పరిచయయ్యారు. ఇక 1995లో వచ్చిన ‘హ్యూ గ్రాంట్’, ‘ఆన్ ఆవ్ఫుల్లీ బిగ్ అడ్వెంచర్’, ‘గ్యారీ ఓల్డమన్స్ నిల్ బై మౌత్’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్వవహరించారు. (కరోనాతో గ్రామీ అవార్డు గ్రహిత మృతి) -
‘జుమాంజి’ నటికి కరోనా
కరోనా ప్రభావం హాలీవుడ్ నటుల మీద బాగా కనిపిస్తోంది. ప్రముఖ నటుడు టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్, ‘జేమ్స్ బాండ్’ నటి ఓల్గా కురీలెన్కో ఆల్రెడీ కరోనా బారిన పడ్డారు. తాజాగా ’జుమాంజి’ నటి లారా బెల్ బండీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రకటించారు. ‘కరోనా పాజిటివ్ అని తెలిసినా భయపడటం లేదు. డాక్టర్స్ సూచనలను పాటిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటానని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు లారా బండీ. -
పిల్లలు పస్తులు ఉండకూడదు
కోవిడ్ 19 (కరోనా వైరస్) కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు ఉచిత భోజన సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు పాఠశాలలు మూతబడడంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు సరైన ఆహారం అందే పరిస్థితి లేదు. అందుకే ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ ‘నో కిడ్ హంగ్రీ’ అనే సేవా సంస్థకు దాదాపు 7 కోట్లకు పైగా విరాళంగా ప్రకటించారు. ‘‘కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. చాలామంది పిల్లలకు స్కూల్ టైమింగ్స్‌లో పౌష్టికాహారం అందుతుంది. అమెరికాలోనే అలాంటి వారు 22 మిలియన్లు ఉన్నారు. అందుకే నా వంతుగా విరాళం ఇస్తున్నా. పిల్లలు పస్తులుండకూడదు’’ అని పేర్కొన్నారు ఏంజెలినా. -
కరోనాతో ఫైట్ చేయగలం
‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’ (2008), ‘ఒబ్లివిన్’ (2013) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి ఓల్గా కురిలెంకో. దాదాపు ఐదురోజుల క్రితం ఈ హాలీవుడ్ తార కోవిడ్ 19 (కరోనా వైరస్) బారిన పడ్డట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆరోగ్యం కాస్త బాగానే ఉందనే విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు ఓల్గా. ‘‘కాస్త బెటర్‌గా ఫీల్ అవుతున్నాను. నా జ్వరం పోయింది. నేను ఎక్కడ ఉన్నానా? అని కొందరు ఆలోచిస్తుండొచ్చు. ప్రస్తుతం నేను లండన్‌లో ఉన్నాను. కరోనా వైరస్ బారిన పడ్డానని టెస్ట్ చేయించుకున్నాక తెలిసింది. డాక్టర్లు చెప్పిన మందులతో పాటు వారి సలహా మేరకు విటమిన్స్, కొన్ని సప్లిమెంట్స్ (మెడిసిన్స్, హెల్దీపుడ్) తీసుకున్నాను. కరోనా వైరస్‌ను విటమిన్స్ నిర్మూలిస్తాయని నేను చెప్పడం లేదు. కానీ మనలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డాక్టర్ల సూచనలు పాటించడంతో పాటు మన జాగ్రత్తల్లో మనం ఉంటే కరోనాతో ఫైట్ చేయగలం’’ అని పేర్కొన్నారు ఓల్గా. ఆమె నటించిన ‘ఎంఫైర్స్ ఆఫ్ ది డీప్, ది బే ఆఫ్ సైలెన్స్’ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. -
కరోనా బారిన పడ్డాను
గత వారం హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్, ఆయన భార్య, నటి రీటా విల్సన్‌లు చేయించుకున్న పరీక్షల్లో కరోనా సోకిందని తేలింది. ఇప్పుడు మరో హాలీవుడ్ తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఓల్గానే తెలిపారు. ‘‘వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాను. టెస్ట్ చేయిస్తే పాజిటివ్ వచ్చింది. జ్వరం, అలసట కరోనా ప్రధాన లక్షణాలు. ఏముందిలే అనుకోకుండా ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రస్తుతం నేను కరోనా కారణంగా గృహనిర్భందంలో ఉన్నాను. చికిత్స చేయించుకుంటున్నాను’’ అని ఓల్గా పేర్కొన్నారు. 2008లో వచ్చిన ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, 2013లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఒబ్లివిన్’లో ఓల్గా నటన ఆకట్టుకుంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఎంపైర్స్ ఆఫ్ ది డీప్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది కాల్పనిక కథతో రూపొందిన యాక్షన్ అడ్వంచరెస్ మూవీ. ఇది కాకుండా ఓల్గా నటించిన ‘ది బే ఆఫ్ సైలెన్స్’ అనే థ్రిల్లర్ మూవీ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. -
'అతను నన్ను దారుణంగా రేప్ చేశాడు'
న్యూయార్క్ : 25 ఏళ్ల క్రితం మూవీ డైరెక్టర్ హార్వే వెయిన్‌స్టీన్ తనను అతి దారుణంగా రేప్ చేశాడంటూ హాలీవుడ్ నటి అన్నాబెల్లా సియోరా గురువారం కోర్టు హాలులో భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు హాలులో జడ్జి జోన్ లూజీ ఓర్బన్ ఎదుట తన వాదనను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. నటి అన్నాబెల్లాను దారుణంగా రేప్ చేశాడన్న ఆరోపణలతో అప్పట్లోనే వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. కానీ ఇంతవరకు ఈ కేసులో సరైన నిజాలు లేకపోవడంతో 25 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి వాదనకు వచ్చిన కేసులో అన్నా తన వాదనలు వినిపించారు. '1994లో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో డైరెక్టర్ హార్వే తన కారులో దింపుతానని నన్ను ఎక్కించుకున్నాడు. న్యూయార్క్‌లోని మహట్టన్ అపార్ట్మెంట్ దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. తర్వాత నేను పడుకోవడానికి సిద్దమవుతుండగా డోర్ తలుపును ఎవరో కొట్టినట్లు అనిపించింది. డోర్ తెలిచి చూడగానే డైరెక్టర్ హార్వే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని ప్రవర్తన నాకు ఏదో అనుమానంగా కనిపించింది. ఆ సమయంలో నా శరీరం మొత్తం వణుకు పుట్టింది. అయినా దైర్యం తెచ్చుకొని ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేలోపే హార్వే నన్ను బలవంతం చేయబోయారు. నేను వద్దని వారించినా వినకుండా బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లాడు. అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నా చేతులను మంచానికి కట్టేసి దారుణంగా రేప్ చేశారు. నిజంగా ఆ రాత్రి నాకు కాళరాత్రిగా మిగిలిపోయింది. వెయిన్‌స్టీన చేసిన పని నా జీవితంలో ఒక చేదు ఘటనగా మిగిలిపోయింది. ఇన్ని సంవత్సరాలైనా ఆ రాత్రి జరిగిన ఘటన ఇప్పటికి గుర్తుందంటూ' 59 ఏళ్ల అన్నాబెల్లా సియోరా చెప్పుకొచ్చారు. అయితే అన్నా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో హార్వే వెయిన్‌స్టీన్ కోర్టు హాలులోనే ఉండడం గమనార్హం. ఆ సమయంలో హార్వే మొహం ఎలాంటి ఆందోళన కనిపించలేదు. దీంతో పాటు వెయిన్‌స్టీన్ 80 మందిని లైంగికంగా వేదించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.అందులో హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ పేరు కూడా ఉండడం విశేషం. కాగా అన్నా వాదనల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది తేల్చడానికి శుక్రవారం సైకియాట్రిస్ట్ డాక్టర్‌ను రప్పించాలని కోర్టు ఆదేశించింది. -
నేలపై నిద్రపోతున్న హీరోయిన్
హాలీవుడ్ సూపర్ నటి ఎమ్మా స్టోన్ నేలపై నిద్రపోతున్నారట. రెండేళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందిన ఈ హీరోయిన్‌కు ఎందుకు ఇంత కష్టం వచ్చిందంటే... అక్కడికే వస్తున్నాం. ఇటీవల ఆమె భుజానికి పెద్ద దెబ్బ తగిలిందని హాలీవుడ్ టాక్. దీంతో డాక్టర్ ఆమెకు దాదాపు రెండు నెలలు రెస్ట్ తీసుకోమని చెప్పారట. అలాగే నేలపై నిద్రపొమ్మని చెప్పారట. స్టార్ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఎమ్మాకు ఎంత కష్టం వచ్చిందని ఆమె ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ప్రస్తుతం ‘క్రూయెల్లా’ అనే హాలీవుడ్ మూవీ కమిట్ అయ్యారు ఎమ్మా. అయితే ఇంకా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉండటంతో ఎమ్మా గాయం ఈ సినిమాపై పడే ప్రభావం లేదంటున్నారు ఆమె సన్నిహితులు. ఇంతకీ ఎమ్మా భుజానికి ఎలా గాయం అయిందీ అంటే.. కొందరేమో షూటింగ్ లొకేషన్లో అని, కొందరేమో ఇంట్లో జారిపడ్డారని అంటున్నారు. -
కలిసి భోంచేశారు
ఇరవై మూడేళ్ల అమెరికన్ మోడల్, టెలివిజన్ స్టార్ కెండెల్ జెన్నెర్, ఆమెకన్నా పదేళ్లు పెద్దదైన మన దీపికా పడుకోన్ ఇద్దరూ కలిసి మంగళవారం న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్ హాస్పిటల్లో లంచ్ చేశారు. హాస్పిటల్లో లంచ్ ఏమిటి?! హాస్పిటల్లో లంచ్ కాదు. హాస్పిటల్ వాళ్లు ఏర్పాటు చేసిన లంచ్ అది. న్యూయార్క్‌లోనే ఉన్న ‘యూత్ యాంగ్జెయిటీ సెంటర్’ కోసం నిధులను సమీకరించే ఒక కార్యక్రమ ప్రారంభోత్సవం అనంతర దీపిక, కెండెల్‌తో మరికొందరు ప్రముఖులు కలిసి విందును ఆరగించారు. అంతకన్నా ముందు దీపిక తన ప్రసంగంలో తనెలా డిప్రెషన్ నుంచి బయటపడిందీ అక్కడివారితో షేర్ చేసుకున్నారు. యువతలో కనిపించే ఆదుర్దా, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు యాత్ యాంగ్జెయిటీ సెంటర్ చికిత్సను అందించడంతో పాటు సంబంధిత వైద్యపరిశోధనలు, అధ్యయనాలు జరుపుతుంటుంది. దీపిక అంటే ఒకే, మరి కెండెల్ అక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఆమెరికన్ల యూత్ ఐకన్ ఇప్పుడు ఆవిడ. -
డమ్మీ గన్‌తో బెదిరించిన నటి.. కాల్చేసిన పోలీసులు!
ఒక్కోసారి మనం చేసిన పనులే మన ప్రాణాలపైకి తెస్తుంది. పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టి తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది ఓ హాలీవుడ్ నటి. ఎదురుగా ఉన్న నటి చేతిలో ఉన్న బొమ్మ తుపాకి చూసి నిజమైనది పోలీసులు అనుకున్నారు. అంతలో పోలీసులవైపు గన్ చూపించడంతో బెదిరిపోయిన ఓ ఆఫీసర్ ఆమెను కాల్చిచంపాడు. సినిమా సీన్‌ను తలపించిన ఈ ఘటన అమెరికాలోని లాస్ఏంజిల్స్లో చోటుచేసుకుంది. ఎన్నో హాలీవుడ్ సీరియల్స్, షోలతో ఆకట్టుకున్న నటి వెనిస్సా మార్క్వెజ్పై గురువారం పోలీసుల కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరిగిన తీరుపట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 46 ఏళ్ల వెన్నిస్సా మార్క్వెజ్ను స్థానిక పోలీసులు కాల్చి చంపిన తర్వాత ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పోలీసులు నటి ఇంటికి వెళ్లే సరికి చేతిలో హ్యండ్ గన్‌తో ఉంది. మాట్లాడుతుండగానే అధికారులను టార్గెట్ చేయడంతో బెదిరిపోయిన ఓ అధికారి ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో వెన్నిస్సా అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించగా వెనిస్సా చేతిలో ఉంది నిజమైన తుపాకీ కాదని బొమ్మ బీబీ చేతి గన్‌గా గుర్తించాము. అయితే వెనిస్సా గన్‌తో అలా ఎందుకు ప్రవర్తించిందో తెలియట్లేదు. తను కొద్దికాలంగా మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతుందని తెలిసింది. పూర్తి వివరాల కోసం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించాం’ అని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ సీన్‌కు నేనేమి దర్శకుడిని కాదు వెనిస్సా గతంలో తన సహనటుడు జార్జ్ క్లూనీ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. దీంతో పలువరు క్లూనీపై అనుమానం వ్యక్తం చేయడంతో ‘ఈ ఘటనకు సంబంధించి అందరూ అనుకుంటున్నది నిజం కాదు. నేను నటున్ని మాత్రమే. వెనిస్సాను నేను చంపిచానడం అసత్యం’ అంటూ క్లూనీ పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
లైంగిక వేధింపులపై నటి దారుణ వ్యాఖ్యలు
లాస్ఏంజెలిస్ : 'లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లను క్షమించకూడదు. అలాంటివాళ్లు మనిషి రూపంలో ఉన్న మృగాలంటూ' గతంలో పేర్కొన్న నటి పమేలా అండర్సన్ తాజాగా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల వివాదాల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ను తప్పుపట్టని ఈమె, తెలివి తక్కువగా ప్రవర్తించడంతోనే నటీమణులపై వేధింపులు జరిగాయని పమేలా అభిప్రాయపడ్డారు. హోటల్ గదులకు ఒంటరిగా వెళ్తే ఏం జరుగుతుందన్న కనీస జ్ఞానం వారికి లేదా అని ప్రశ్నించారు. నిర్మాత హర్వే వీన్‌స్టీన్ తమను గతంలో లైంగికంగా వేధించాడంటూ ఇటీవల కొందరు ఇండస్ట్రీకి చెందిన దాదాపు 50 మంది మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటి పమేలా అండర్సన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'బాధిత నటీమణులు కొద్దిగా కామన్ సెన్స్ వాడి ఉంటే వేధింపుల భారిన పడకుండా సులువుగా తప్పించుకునేవారని, కానీ వారు ఆ పని చేయలేదు. హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనతో కొందరు అసభ్యంగా ప్రవర్తించాలని చూడగా.. కామన్ సెన్స్ వాడి వేధింపుల నుంచి తప్పించుకున్నాను. ఎవరైనా తనను ఒంటరిగా హోటల్ గదికి రమ్మని పిలిస్తే లౌక్యంగా ఆలోచించి అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ కచ్చితంగా హీరోయిన్లు ఆ హోటళ్లకు వెళ్లాల్సి వస్తే మరో వ్యక్తిని తనకు తోడుగా తీసుకెళ్తే ఏ సమస్యలు తలెత్తేవి కావని' పేర్కొన్నారు. 'నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లగా అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారంటూ' గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించిన పమేలా అండర్సన్ ఇతర మహిళల విషయంలో మాత్రం ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి గురైనవాళ్లు మౌనంగా ఉండకూడదని, న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లి పోరాడాలని పిలుపునిచ్చిన నటి పమేలా.. హార్వే వీన్‌స్టీన్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తగా ఇలా మార్చడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ) ఇటీవల జీవిత కాల నిషేధం విధించింది. -
పద్మావతి వివాదం.. ఊహించని ట్వీట్
సాక్షి, ముంబై : పద్మావతి చిత్రంపై వివాదం కొనసాగుతుండగా.. బాలీవుడ్ నుంచి మద్దతు కరువు కావటం చర్చనీయాంశంగా మారింది. దీపిక ఒంటరి పోరాటం.. భన్సాలీ వాదన ఓవైపు... రాజ్‌పుత్ కర్ణి సేన హెచ్చరికలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పద్మావతిపై ఊహించని ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హాలీవుడ్ నటి రూబీ రోస్ పద్మావతి చిత్ర వివాదంపై స్పందించింది. దీపిక హాలీవుడ్ చిత్రం ట్రిపుల్ ఎక్స్: రిటర్న్స్ ఆఫ్ క్జాండర్ కేజ్‌లో రూబీ రోస్ కూడా నటించారు. ‘‘నా స్నేహితురాలి విషయంలో జరుగుతున్న పరిణామాల గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యా. ఆమె పోరాటానికి హాట్సాఫ్. నాకు తెలిసిన ధైర్యవంతమైన మహిళలలో దీపిక ఒకరు’’ అని రూబీ ట్వీట్ చేసింది. దీపిక పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని రూబీ తెలియజేశారు. ఈ లెక్కన పద్మావతి చిత్ర వివాదం ఖండాంతరాలు దాటిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీపికను డబ్బుల కోసం ఆడే బజారు మహిళ.. శూర్ఫణకగా అభివర్ణిస్తున్నా రాజ్‌పుత్ కర్ణి సేన.. ముక్కు, పీక కోస్తామంటూ హెచ్చరిస్తున్నా... దీపిక మాత్రం హెచ్చరికలపై అస్సలు వెనక్కితగ్గకుండా తన అభిప్రాయం చెబుతున్నారు. మరోవైపు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకపోవటంపై ప్రస్తుతం మరో వివాదం మొదలయ్యింది. I am in shock at reading what my dear friend is going through but in absolute awe of her strength and courage. Deepika you are one of the strongest women I know. https://t.co/wrEaO9WZA0 — Ruby Rose (@RubyRose) November 18, 2017 -
మా పిల్లలు నటులు కారట: హీరోయిన్
సాధారణంగా డాక్టర్ల పిల్లలు డాక్టర్లు, లాయర్ల పిల్లలు లాయర్లు, నటీనటుల పిల్లలు కూడా అదే వారసత్వం పుచ్చుకోవడం మనకు తెలుసు. కానీ, హాలీవుడ్ హీరోయిన్ ఏంజెలినా జోలీ పిల్లలు మాత్రం తాము నటనా రంగంలోకి వెళ్లే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పేస్తున్నారట. జోలీకి ఆరుగురు పిల్లులన్నారు. వాళ్లు మాడాక్స్ (14), పాక్స్ (12), జహారా (11), షిలో (10), ఇద్దరు కవలలు వివెన్నె, నాక్స్ (7). అయితే ఈ ఆరుగురిలో ఎవరూ నటనా రంగంలోకి వెళ్లాలని అనుకోవట్లేదట. వాళ్లంతా సంగీతకారులు అవ్వాలనుకుంటున్నారని జోలీ చెప్పింది. బీబీసీ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించింది. సినిమా బయటి నుంచే బాగుంటుందన్నది వాళ్ల అభిప్రాయమని, మాడాక్స్కు ఎడిటింగ్‌లోను, పాక్స్‌కు సంగీతం, డీజేయింగ్లోను ఆసక్తి ఉందని తెలిపింది. ఈ పిల్లలంతా కలిసి వాళ్లలో వాళ్లు ఏడు భాషలు నేర్చుకుంటున్నారట. -
ఇప్పుడు స్టార్ట్.. యాక్షన్... కట్...!
కథానాయికగా చిన్న వయసులోనే ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ త్వరలో దర్శకురాలిగా స్టార్ట్.. యాక్షన్.. కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఒకవైపు కథానాయికగా నటిస్తూనే తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారామె. ‘ప్రాజెక్ట్ డెలీరియం’ టైటిల్‌తో కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నాకు యాక్టింగ్ ఎంత ఇష్టమో, డెరైక్షన్ కూడా అంతే ఇష్టం. నటిగా మొదటి సినిమా చేస్తున్నప్పుడే ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనే కోరిక నాలో కలిగింది. అది ఇప్పుడు తీర్చుకుంటున్నా. 60వ దశకాల్లో మిలటరీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. డెలీరియం అనే రసాయనం మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో సాగే కథ ఇది. చాలా ఫన్నీగా ఉంటుంది’’ అని జెన్నిఫర్ చెప్పారు. -
ఎలుగెత్తిన బాధితులు... గొంతు కలిపిన ఏంజెలినా
చైతన్యం ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ యుద్ధం జరిగినా మహిళలు, చిన్నారులే బాధితులవుతున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అరణ్యకాండ ఇది. మరి దీనికి అంతం లేదా? అంటూ బాధితులు ఆవేదనతో ప్రశ్నించారు ఆ వేదిక మీద నుంచి. ఆఫ్రికాలో దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాలు, దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో మహిళలు బాధితులు అవుతుండటం గురించి ఇటీవల లండన్‌లో ప్రత్యేక చర్చాకార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా హక్కుల ఉద్యమకారిణి నీమా నమడమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈమె కూడా కాంగో అంతర్యుద్ధంలో సామూహిక అత్యాచార బాధితురాలే. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనేకమంది బాధిత మహిళలు యుద్ధోన్మాదంలో తాము బలైన విధానం గురించి, తమపై జరిగిన అకృత్యాల గురించి ఏకరువు పెట్టుకోగా జోలీ చలించిపోయింది. ఇలాంటి శరణార్థుల సమస్యల విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా హోదాలో ఉన్న జోలీ వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. యుద్ధమేఘాలు ఆవరించిన దేశాల్లోని మహిళ స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం ఎందుకు జరుగుతోందో కూడా తెలియని పిల్లలు బాధితులుగా మారుతుండటంపై జోలీ ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధవాతావరణంలో మహిళలపై లైంగికదాడులు చాలా సహజమైపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించింది. మహిళల ఆవేదనను వ్యక్తపరిచిన ఇదే వేదికపై వాళ్ల శక్తిసామర్థ్యాలకు నిదర్శనమైన ఆవిష్కరణలను కూడా ప్రదర్శించారు. శరణార్థ శిబిరాల్లో ఉన్న మహిళలు రూపొందించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఆ మహిళలను అభినందించింది జోలీ. -
సేవా శునకాలు
పెట్ వరల్డ్ ‘‘కుక్కలు నన్ను ఎప్పుడూ కరవలేదు. మనుషులు తప్ప’’ అని కుక్కల్లోని మానవత్వాన్ని ఎప్పుడో లోకానికి చాటారు హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో. శునకాలలో ‘విశ్వాసం’ మాత్రమే కాదు బోలెడు ‘మానవత్వం’ కూడా ఉందని ‘సహాయక శునకాలు’ నిరూపిస్తున్నాయి. లంకంత కొంప. అంత పెద్ద ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఆ వృద్ధదంపతుల పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు. చిన్న చిన్న పనులకు కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. చుట్టపు చూపుగా వచ్చిన ఒకాయన ‘‘మీ ఇంట్లో కుక్క ఉంది కదా...ఇక ముందు చిన్న చిన్న పనులన్నీ అదే చేసి పెడుతుంది’’ అంటూ ఒక ఫోన్ నంబర్ ఇచ్చాడు. అది శునకాలకు సహాయ పనులు నేర్పించే సంస్థ అది. ఒక నెల రోజుల తరువాత... ‘‘స్టార్... వెళ్లి ఆ పాల పాకెట్ తెచ్చివ్వు’’, ‘‘స్టార్... వెళ్లి ఆ పేపర్ తెచ్చివ్వు’’ ... అలా చెబితే చాలు టకీమని చేసేస్తుంది ‘స్టార్’ అనే పేరున్న ఆ శునకం. ‘స్టార్’ చేస్తున్న పనుల గురించి ఇరుగు వారికి పొరుగు వారికి తెలిసిన వారు కూడా తమ శునకాలకు ‘సేవ’లో ప్రత్యేక శిక్షణ నిప్పించారు. విదేశాల్లో విరివిగా... విదేశాల్లో శునకాలకు సహాయక పనులు నేర్పే సంస్థలు ఎక్కువగా ఉంటాయి. శునకాలకు ఇచ్చే శిక్షణలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. గైడ్ డాగ్స్: దృష్టి లోపం ఉన్న వాళ్లకు, అంధులకు సహాయపడే విధంగా శునకాలకు శిక్షణ నిస్తారు. హియరింగ్ డాగ్స్: వినికిడి సమస్య ఉన్నవాళ్లకు సహాయపడేలా శిక్షణ నిస్తారు. సర్వీస్ డాగ్స్: పైన వాటిలా ప్రత్యేకంగా ఒక పనికి కాకుండా రకరకాల పనులకు ఉపయోగపడేలా శునకాలకు శిక్షణ నిస్తారు. వీటితో పాటు మెడికల్ అలర్ట్ డాగ్స్, సైకియాట్రిక్ సర్వీస్ డాగ్స్... పేరుతో శునకాలకు శిక్షణ నిస్తారు. మన దేశంలో తొలి అడుగు... విదేశాల్లోలాగే మన దేశంలోనూ శునకాలకు శిక్షణ నిచ్చే సంస్థ ఏదైనా ఉంటే బాగుండేది కదా అనుకుంది షిరిన్ మర్చెంట్. ఆలోచన రాగానే లండన్‌కు వెళ్లి ప్రపంచ ప్రసిద్ధ డాగ్ థెరపిస్ట్ జాన్ రోగర్సన్ దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఆ తరువాత ఆమె ‘కెనైన్ కెన్ కేర్’ పేరుతో ముంబయిలో ఒక సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహించడం ప్రారంభించింది. యజమానులకు రకరకాలుగా సహాయపడే రీతిలో శునకాలకు శిక్షణ నివ్వడంలో ‘కెనైన్ కెన్ కేర్’ అగ్రగామిగా నిలిచింది. ‘వూఫ్’ పేరుతో ఒక ప్రతికను కూడా ప్రారంభించింది షిరిన్. శునకాల కోసం ప్రత్యేకంగా ఒక పత్రికను నడపడం మన దేశంలో ఇదే ప్రథమం. ఈ పత్రిక పేరు ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి కూడా ఎక్కింది. ఒకసారి ముంబయిలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నప్పుడు ఒకాయన వచ్చి షిరిన్‌ను కలిశాడు. ఆయన వికలాంగుడు. గతంలో ఒకసారి తన శునకానికి షిరిన్ దగ్గర శిక్షణ ఇప్పించాడు. ‘‘ బిడ్డలు లేని లోటును మా పెంపుడు కుక్క తీరుస్తోంది. ప్రతి పనినీ ఓపికగా, చురుకుగా చేసి నాకు అన్నిరకాలుగా సహాయపడుతోంది’’ అని చెప్పుకుంటూ పోతున్నాడు ఆయన. అలా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో వెలుగు! ఆయన చెబుతున్నది వింటున్నప్పుడు ఆమె కళ్లలో అంతకు రెట్టింపు వెలుగు!!