తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సీజన్-7 విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త పోకడలతో అభిమానులను అలరిస్తోంది. ఇంతలా ఆదరణ పొందిన రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సైతం మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ షో ద్వారానే కొందరు సినీరంగంలో ఫేమస్ అవుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొనే వారికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది.
(ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు: శుభ శ్రీ)
మన తెలుగు బిగ్‌బాస్ షో అయితే కంటెస్టెంట్స్ పారితోషికాల గురించి మనం లక్షల్లోనే వింటుంటాం. అంతే కాదు.. ఎలిమినేట్ అయినవారు సైతం తమ రెమ్యునరేషన్ గురించి ఇంటర్వ్యూల్లోనూ ప్రస్తావించారు. అయితే లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకున్న కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. మరీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అబ్బే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కోట్లలో ఇస్తారా? అని అంటారా?.. కానీ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న వారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ కేవలం 3 రోజులకే రూ. 2 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇంతకీ ఎవరో తెలుసుకుందాం.
హిందీలో బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ సీజన్-4లో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. కేవలం మూడు రోజులు మాత్రమే అతిథిగా ఇంట్లో ఉండిపోయింది. ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్‌తోనే సల్మాన్ ఖాన్ మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత అత్యధికంగా బిగ్ బాస్ -15 విజేత తేజస్వి ప్రకాశ్‌కు 1.7 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించారు.
కాగా.. పమేలా ఆండర్సన్ కెనడియన్-అమెరికన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు దక్కించుకుంది. ప్లేబాయ్ మ్యాగజైన్‌లో తన మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సిరీస్ బేవాచ్‌లో సీజే పార్కర్ పాత్రతో ఆమె ఫేమస్ అయింది.
(ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?)
అయితే పమేలా తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 2014లో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 6 నుంచి 10 వయస్సులో ఓ మహిళ తనను వేధించిందని.. ఆ తర్వాత 12 ఏళ్లకే 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని వివరించింది. అంతే కాదు.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని పేర్కొంది. ఆమెకు 14 ఏళ్ల వయసులో తన ప్రియుడితో పాటు, అతని ఫ్రెండ్స్ ఆరుగురు అత్యాచారం చేశారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment