Pamela Anderson
-
నేకెడ్ గన్ రీమేక్‌లో...
హాలీవుడ్ హాట్ తార పమేలా ఆండర్సన్ అభిమానులకు ఓ శుభవార్త. ఈ గ్లామరస్ స్టార్ తాజాగా ‘నేకెడ్ గన్’ రీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. ఈ మధ్యకాలంలో చేసిన చిత్రాల్లోకన్నా ఈ చిత్రంలో పమేలా పాత్ర నిడివి ఎక్కువ కావడం, హీరోయిన్ పాత్ర కావడం అనేది అభిమానులు ఆనందించే విషయమే. 1980 చివర్లలో 1990 ఆరంభంలో వచ్చిన క్రైమ్ కామెడీ ‘నేకెడ్ గన్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మూడో భాగం 1994లో వచ్చింది. 30 ఏళ్లకు ‘నేకెడ్ గన్’ మళ్లీ తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అకీవా షాఫర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ రీమేక్‌లో లీడ్ రోల్లో లియామ్ నీసన్ నటించనుండగా, అతని సరసన పమేలా ఆండర్సన్ నటించనున్నారు. గత మూడు భాగాల్లో డిటెక్టివ్ పాత్రను లెస్లీ నీల్సన్ చేయగా అతని ప్రేయసిగా ప్రిసిల్లా ప్రెస్లీ నటించారు. రీమేక్‌లో డిటెక్టివ్‌గా లియామ్ నీసన్, అతని ప్రేయసిగా పమేలా ఆండర్సన్ నటించనున్నారు. వచ్చే ఏడాది జూలై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక పమేలా గురించి చె΄్పాలంటే... 1990లలో హాటెస్ట్ స్టార్ అంటే పమేలానే. ‘ప్లే బాయ్’ మ్యాగజీన్ మోడల్‌గా అప్పట్లో బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారామె. అలాగే బుల్లితెర కోసం ‘బేవాచ్’ సిరీస్ (1992–1997)లో చేసిన సీజే పార్కర్ పాత్ర కూడా హాట్ స్టార్‌గా పమేలాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాల పరంగా ‘రా జస్టిస్, స్కేరీ మూవీ 3, బోరాట్, బేవాచ్’ వంటివి పమేలా క్రేజ్ కొనసాగడానికి ఉపయోగపడ్డాయి. -
ఆమెపై సామూహిక అత్యాచారం.. బిగ్‌బాస్ చరిత్రలోనే రికార్డ్ రెమ్యునరేషన్!
తెలుగుతో పాటు అన్ని భాషల్లో అభిమానుల ఆదరణ దక్కించుకున్న ఏకైక షో బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సీజన్-7 విజయవంతంగా నడుస్తోంది. ప్రతి ఏటా కొత్త కొత్త పోకడలతో అభిమానులను అలరిస్తోంది. ఇంతలా ఆదరణ పొందిన రియాలిటీ షో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సైతం మంచి గుర్తింపు దక్కుతోంది. ఈ షో ద్వారానే కొందరు సినీరంగంలో ఫేమస్ అవుతున్నారు. అయితే ఈ షోలో పాల్గొనే వారికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు అన్న విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశారు: శుభ శ్రీ) మన తెలుగు బిగ్‌బాస్ షో అయితే కంటెస్టెంట్స్ పారితోషికాల గురించి మనం లక్షల్లోనే వింటుంటాం. అంతే కాదు.. ఎలిమినేట్ అయినవారు సైతం తమ రెమ్యునరేషన్ గురించి ఇంటర్వ్యూల్లోనూ ప్రస్తావించారు. అయితే లక్షల్లో మాత్రమే పారితోషికం అందుకున్న కంటెస్టెంట్స్ చాలామందే ఉన్నారు. మరీ కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా? అబ్బే.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కోట్లలో ఇస్తారా? అని అంటారా?.. కానీ కోట్ల రూపాయల పారితోషికం అందుకున్న వారు కూడా ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ కేవలం 3 రోజులకే రూ. 2 కోట్ల రూపాయలు అందుకున్నారు. ఇంతకీ ఎవరో తెలుసుకుందాం. హిందీలో బిగ్‌బాస్ షో హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహిరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ సీజన్-4లో హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. కేవలం మూడు రోజులు మాత్రమే అతిథిగా ఇంట్లో ఉండిపోయింది. ఈ షోలో పాల్గొన్నందుకు ఆమెకు దాదాపు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ సీజన్‌తోనే సల్మాన్ ఖాన్ మొదటిసారిగా హోస్ట్‌గా వ్యవహరించారు. ఆమె తర్వాత అత్యధికంగా బిగ్ బాస్ -15 విజేత తేజస్వి ప్రకాశ్‌కు 1.7 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించారు. కాగా.. పమేలా ఆండర్సన్ కెనడియన్-అమెరికన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు దక్కించుకుంది. ప్లేబాయ్ మ్యాగజైన్లో తన మోడలింగ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ సిరీస్ బేవాచ్‌లో సీజే పార్కర్ పాత్రతో ఆమె ఫేమస్ అయింది. (ఇది చదవండి: అమర్‌దీప్‌కి ఎలిమినేషన్ భయం.. ఇలా అయిపోయాడేంటి?) అయితే పమేలా తన బాల్యంలో లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. 2014లో ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 6 నుంచి 10 వయస్సులో ఓ మహిళ తనను వేధించిందని.. ఆ తర్వాత 12 ఏళ్లకే 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడని వివరించింది. అంతే కాదు.. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని పేర్కొంది. ఆమెకు 14 ఏళ్ల వయసులో తన ప్రియుడితో పాటు, అతని ఫ్రెండ్స్ ఆరుగురు అత్యాచారం చేశారని వెల్లడించింది. -
ఒకటి కాదు, రెండు కాదు.. ఐదోసారి విడాకులకు సిద్ధమైన నటి!
ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటివరకు ఆమె ఏకంగా నాలుగుసార్లు విడాకులు తీసుకుంది. అంతేకాదు ఇప్పుడు ఐదో భర్తకు విడాకులిచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆవిడెవరో కాదు.. హాలీవుడ్ నటి పమేలా అండర్సన్. 54 ఏళ్ల వయసున్న పమేలా అండర్సన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకోగా అవి పెటాకులయ్యాయి. ఆ తర్వాత 2020లో ఐదో పెళ్లి చేసుకుందీ నటి. కరోనా వల్ల విధించిన లాక్డౌన్లో తన బాడీగార్డ్ డాన్ హేహస్ట్కు దగ్గరైంది. ఈ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వివాహ బంధంతో కలకాలం కలిసుందామనుకున్నారు. అలా లాక్‌డౌన్‌లోనే పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ వీరికి కాలం కలిసిరానట్లు కనిపిస్తోంది. పెళ్లై ఏడాది తిరగకముందే దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా పమేలా అండర్సన్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె 1995లో టామీ లీని తొలిసారిగా పెళ్లాడింది. వీరికి బ్రాండన్, డైలాన్ అని ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2006లో సంగీతకారుడు కిడ్ రాక్‌ను పెళ్లాడింది కానీ ఈ బంధం కూడా నిలవలేదు. 2014లో రిక్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఓ షోలో ప్రకటించింది పమేలా. అయితే ఈ సంతోషం కూడా ఆమెకు ఎక్కువ కాలం నిలవలేదు. ఆ మరుసటి ఏడాదే ఇద్దరూ విడిపోయారు. 2020లో నిర్మాత జాన్ పీటర్స్‌ను సీక్రెట్‌గా పెళ్లాడగా కొద్ది రోజులకే అది కూడా పెటాకులైంది. అదే ఏడాది డిసెంబర్లో బాడీగార్డ్ డాన్‌తో వైవాహిక బంధాన్ని ఆరంభించిన పమేలా ఇప్పుడు దాన్ని కూడా తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడటం గమనార్హం. -
బాడీగార్డును పెళ్లి చేసుకున్న స్టార్ నటి
‘బేవాచ్’ సీరియల్ ద్వారా కుర్రకారును వెర్రెక్కించిన హాలీవుడ్ నటి పమేలా ఆండర్సన్ లాక్డౌన్లో తన బాడీగార్డును పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గతేడాది ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత కొద్ది రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఆమె లాక్డౌన్లో తన బాడీగార్డు డాన్ హేహర్ట్స్ను కెనడాలోని తన వ్యాన్కౌవేర్ ఐలాండ్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఆమెకు ఇది ఆరోవ వివాహం. గతేడాది రహస్య వివాహం చేసుకున్న పమేలా అండర్సన్(53) వెడ్డింగ్ ఫ్రాక్‌లో తన భర్త డాన్‌తో కలిసి ఉన్న పెళ్లి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేగాక తాను సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇందుకోసం తన ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: పెళ్లయిన 12 రోజులకే భర్తకు గుడ్‌బై చెప్పిన నటి!) ‘కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో నేను డాన్ హేహర్డ్స్తో ప్రేమలో పడ్డాను. దీంతో అతడిని వివాహం చేసుకున్నాను. నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఇప్పుడు నేను సురక్షితంగా ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలను. అతడితో కలిసి ఉన్న ఈ ఒక్క ఏడాది నాకు ఏడు జన్మల బంధంగా అనిపిస్తోంది’ అంటూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రాసుకొచ్చారు. కాగా పమేలా, డాన్‌ను తమ చర్చి పాస్టర్స్, కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో క్రిస్టియన్ సంప్రాదాయంలో గతేడాది పెళ్లి చేసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కాగా జనవరి 2020లో ప్రముఖ నిర్మాత జాన్ పిటర్స్ను అయిదవ వివాహం చేసుకున్న పమేలా 12 రోజులకే అతడికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి అందిరిని షాక్‌కు గురిచేశారు. ఈ నేపథ్యంలో సరిగ్గా ఏడాది తర్వాత తన బాడిగార్డును వివాహం చేసుకున్నట్లు ప్రకటించి మరోసారి షాక్ ఇచ్చారు. (చదవండి: ఐదోసారి పెళ్లిచేసుకున్న నటి!) View this post on Instagram A post shared by Pamela anderson fan page (@pamanderson2020) -
అయ్యో.. ఐదో పెళ్లి కూడా పెటాకులేనా!
‘బేవాచ్’ సీరియల్ స్టార్ పమేలా ఆండర్సన్ ప్రముఖ నిర్మాత జాన్ పీటర్స్‌ను ఇటీవల వివాహమాడిన సంగతి తెలిసిందే. వారి పెళ్లి విషయం తెలిసి హాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కారణం వారి వయసుతో పాటు పమేలాకు ఇది వరకే నలుగురితో వివాహం జరిగింది. మాజీ ప్రేమికులైన వీరిద్దరూ జనవరి 20న పెళ్లి చేసుకోవడంతో హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటికీ వారి పెళ్లి వార్త హాట్ టాపిక్‌గా ఉన్న తరుణంలో ఈ కొత్త జంట అందరికీ మరో షాకిచ్చింది. తన భర్త జాన్ నుంచి విడిగా ఉంటున్నట్లు తాజాగా పమేలా ప్రకటించడంతో అందరూ కంగుతిన్నారు. ఏమైందా అని జుట్టు పీక్కుంటున్నారు. (చదవండి: ఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి) ఈ విషయంపై పమేలా వివరణ ఇస్తూ.. ‘జీవితంలో ఒకరి నుంచి ఒకరం ఏమి కోరుకుంటున్నామనేది తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ విషయంపై స్పష్టత కోసమే కొంత కాలం దూరంగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు. కాగా వారి వివాహ సర్టిఫికేట్ కూడా ఇంకా దరఖాస్తు చేసుకోకపోవడంతో జాన్, పమేలాలు శాశ్వతంగా విడిపోయారేమోనని హాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. జాన్ పీటర్స్, పమేలాలు 30 ఏళ్ల క్రితం ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 74 ఏళ్ల జాన్ తన పాత ప్రియురాలు పమేలాను ఆరవ వివాహం చేసుకున్నాడు. అయితే పమేలాతో విడిపోవడంపై జాన్ ఇంతవరకు స్పందించలేదు. -
ఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి
లాస్ ఏంజెలెస్: ఆమెకు 52 ఏళ్లు, ఆయనకు 74 ఏళ్లు. ఆమె ఒకప్పుడు ‘బేవాచ్’ సీరియల్ ద్వారా కుర్రకారును వెర్రెక్కించిన పమేలా ఆండర్సన్. ఆయన బ్యాట్‌మేన్, ఫ్లాష్డాన్స్ చిత్రాల ద్వారా ప్రముఖ హాలివుడ్ నిర్మాతగా గుర్తింపు పొందిన జాన్ పీటర్స్. ఆమెకు ఐదో పెళ్లి. ఆయనకు ఇది ఆరో పెళ్లి. ఇద్దరు కలిసి లాస్ ఏంజెలిస్‌లోని మాలిబు పట్టణంలో సోమవారం నాడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇరువురి పిల్లలు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారని ‘ది హాలివుడ్ రిపోర్టర్’ వెబ్సైట్ బుధవారం వెల్లడించింది. వారిద్దరికి 35 ఏళ్ల క్రితమే పరిచయం. ‘ప్లేబాయ్ మాన్షన్’ పమేలా ఆండర్సన్‌ను మొదటి సారి చూడగానే జాన్ పీటర్స్ మనసు పారేసుకున్నారట. అప్పుడే వారు డేటింగ్ కూడా చేశారు. వారిద్దరికి పెళ్లవుతోందని హాలివుడ్ చెవులు కొరుక్కుంది. అయినా ఎందుకో వారు విడిపోయారు. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. పమేలా ఇంతకుముందు పెళ్లి చేసుకున్న నలుగురిలో మాజీ భర్తలు టామ్మీ లీ, కిడ్ రాక్, రిక్ సాలోమన్లు సెలబ్రిటీలే. తాను మాత్రం 35 ఏళ్లుగా పమేలా కోసం ఎదురు చూస్తూనే ఉన్నానని, ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరిందని జాన్ పీటర్స్ వ్యాఖ్యానించారు. ఆమెలో ఓ నటిగా ఎంతో టాలెంట్ ఉందని, ఆ విషయం ఆమెకే తెలియదని ఆయన అన్నారు. ‘జాన్ ఈజ్ ది ఒరిజనల్ బ్యాడ్ బోయ్ ఆఫ్ హాలివుడ్, నో వన్ కంపేర్స్, ఐ లవ్ హిమ్ డీప్లీ లైక్ ఫ్యామిలీ’ అంటూ జాన్ పీటర్స్‌పై పమేలా ఓ కవితను చదవి వినిపించారు. పమేలాకు మొదటి భర్త రాక్ స్టార్ కాగా, మొన్నటి వరకున్న భర్త స్టాకర్ స్టార్ అడిల్ రామి. ఆమెకు ఇద్దరు మగ పిల్లలుండగా, పీటర్స్‌కు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వారంతా వారి పెళ్లికి హాజరయ్యారట. జాన్ పీటర్స్ ప్రముఖ హాలీవుడ్ నటి క్యాథరినా జెటా జోన్స్‌తో కూడా శృంగారం నడిపినట్లు అప్పట్లో వార్తులు గుప్పుమన్నాయి. -
స్త్రీలోక సంచారం
కెనడా సంతతి అమెరికన్ స్టార్ నటి, సూపర్ మోడల్ పమేలా ఆండర్సన్ ‘మీటూ’ ఉద్యమాన్ని విమర్శించారు. ‘ఇదొక బోరింగ్ ఫెమినిజం’ అని ఆమె కామెంట్ చేశారు. అంతేకాదు, ‘మీటూ’ వల్ల మగవాళ్లు చేష్టలుడిగిపోతారని పమేలా అన్నారు. వాస్తవానికి పమేలా కూడా స్త్రీవాదే. అయితే ‘మీటూ’ను మాత్రం మనస్ఫూర్తిగా ఆమె సమర్థించలేకపోతున్నారు. ఒక ఆస్ట్రేలియన్ టీవీ చానల్‌లోని ‘60 మినిట్స్’ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ, ‘క్షమించాలి. నేనిలా అంటున్నందుకు బహుశా నాకు తగినశాస్తి జరగొచ్చు. అయినా సరే చెబుతున్నా. మీటూ నాకు టూమచ్ అనిపిస్తోంది’’ అని పమేలా అన్నారు. -
నటిని టచ్ చేద్దామని ఆమె గదిలో మూడు రోజులు..
న్యూయార్క్ : ఇప్పటి వరకు పురుషులు స్త్రీలను వేధించడం చూశాం. అయితే, ఓ మహిళ కూడా మరో మహిళను లైంగికంగా వేధిస్తుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అనుభవం కూడా ఓ ప్రముఖ హాలీవుడ్ నటి ఎదుర్కోవాల్సి వచ్చింది. పమీలా ఆండర్సన్ ప్రముఖ కెనడియన్ అమెరికన్ నటి పైగా మోడల్. ఆమెకు ఓ అతిథి బస గృహం ఉంది. 2001లో ఒకసారి వైద్యం చేయించుకునేందుకు ఆమె తల్లిదండ్రులు వస్తున్నందున వారికోసం ఆ ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లింది. అయితే, తన పడక గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా అందులో ఓ మహిళ తనకు ఇష్టమైన, తాను ధరించే బే వాచ్ స్విమ్ సూట్‌ను ధరించి కనిపించింది. దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే, తనను చూసి భయపడవొద్దని, తాను అల్లరి చేసేందుకు రాలేదని, తాను కేవలం ఆమెను స్పృషించేందుకే వచ్చానంటూ చెప్పింది. టచ్ చేసేందుకు వచ్చినంత మాత్రానా తనను లెస్బియన్ అనుకోవద్దని చెప్పింది. దాంతో ఒక్కసారిగా పమీలాకు చెమటలు పట్టాయి. 'నిన్ను ఓసారి టచ్ చేసి వెళ్లేందుకే నేను ఈ ఇంట్లోకి రహస్యంగా చొరబడ్డాను. మీరు ఒక్కరోజైనా రాకపోతారా అని మీరు ధరించే స్విమ్ సూట్‌ను వేసుకొని మూడు రోజులుగా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను' అని ఆమె చెప్పింది. దాంతో అప్పటికే తన ఇద్దరు బిడ్డలతో వచ్చిన పమీలా ఆ కొత్త మహిళ బహుశా ఓ సైకో ఉంటుందని భయపడి తన సెక్యూరిటీని అలర్ట్ చేసింది. దాంతో వారు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసుల విచారణలో కూడా పమీలాకు హానీ చేయడానికి వచ్చినట్లు రుజువు కాలేదు. కేవలం వెర్రి అభిమానంతోనే ఆమె ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ సంఘటన మాత్రం తనను భయపెట్టిందని, ఇప్పటికీ గుర్తొస్తే భయపడుతుంటానని ఓ మీడియాకు ఓ లేఖ ద్వారా ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. -
లైంగిక వేధింపులపై నటి దారుణ వ్యాఖ్యలు
లాస్ఏంజెలిస్ : 'లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లను క్షమించకూడదు. అలాంటివాళ్లు మనిషి రూపంలో ఉన్న మృగాలంటూ' గతంలో పేర్కొన్న నటి పమేలా అండర్సన్ తాజాగా ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల వివాదాల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌ను తప్పుపట్టని ఈమె, తెలివి తక్కువగా ప్రవర్తించడంతోనే నటీమణులపై వేధింపులు జరిగాయని పమేలా అభిప్రాయపడ్డారు. హోటల్ గదులకు ఒంటరిగా వెళ్తే ఏం జరుగుతుందన్న కనీస జ్ఞానం వారికి లేదా అని ప్రశ్నించారు. నిర్మాత హర్వే వీన్‌స్టీన్ తమను గతంలో లైంగికంగా వేధించాడంటూ ఇటీవల కొందరు ఇండస్ట్రీకి చెందిన దాదాపు 50 మంది మహిళలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నటి పమేలా అండర్సన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. 'బాధిత నటీమణులు కొద్దిగా కామన్ సెన్స్ వాడి ఉంటే వేధింపుల భారిన పడకుండా సులువుగా తప్పించుకునేవారని, కానీ వారు ఆ పని చేయలేదు. హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో తనతో కొందరు అసభ్యంగా ప్రవర్తించాలని చూడగా.. కామన్ సెన్స్ వాడి వేధింపుల నుంచి తప్పించుకున్నాను. ఎవరైనా తనను ఒంటరిగా హోటల్ గదికి రమ్మని పిలిస్తే లౌక్యంగా ఆలోచించి అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిది. ఒకవేళ కచ్చితంగా హీరోయిన్లు ఆ హోటళ్లకు వెళ్లాల్సి వస్తే మరో వ్యక్తిని తనకు తోడుగా తీసుకెళ్తే ఏ సమస్యలు తలెత్తేవి కావని' పేర్కొన్నారు. 'నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లగా అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారంటూ' గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించిన పమేలా అండర్సన్ ఇతర మహిళల విషయంలో మాత్రం ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేయడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. అత్యాచారానికి గురైనవాళ్లు మౌనంగా ఉండకూడదని, న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లి పోరాడాలని పిలుపునిచ్చిన నటి పమేలా.. హార్వే వీన్‌స్టీన్‌పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తగా ఇలా మార్చడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ) ఇటీవల జీవిత కాల నిషేధం విధించింది. -
‘ఆమె ఇడియట్ కాదు.. నాకు చాలా ఇష్టం’
లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ పమీలా ఆండర్సన్ అంటే తనకు చాలా ఇష్టం అని వికిలీక్స్ సంస్థ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే చెప్పారు. వారిద్దరి మధ్య ఏదో రోమాంటికల్ రిలేషన్ ఉందంటూ వస్తున్న ఊహగానాలకు అసాంజే ఈ విషయంతో మరింత స్పష్టతనిచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు ఆమె ఇడియట్ కాదని, చాలా మంచిదని తెలిపారు. ఓ రేడియో ఇంటర్వ్యూలో అసాంజే ఈ విషయాలు చెప్పినట్లు బ్రిటన్ పత్రిక ఒకటి తెలిపింది. తనది ఎంతో ఆకర్షణీయమైన, ఆకట్టుకోగల ఆహార్యం అంటూ కూడా అసాంజే అన్నట్లు ఆ పత్రిక వివరించింది. పమీలా చాలా బలమైన మనస్తత్వం కలిగిన వనిత. ఆమె ఏ మాత్రం ఇడియట్ కాదు. ఈ విషయం చాలామందికి తెలియదు. నేను ఆమెను చాలా ఇష్టపడతాను. ఆమె చాలా గొప్ప స్త్రీ కూడా. ఇంతకంటే ప్రైవేటు విషయాలు నేను చెప్పలేను. చాలా మంది ఆమె స్వేచ్ఛగా స్వతంత్ర్యంగా తిరుగుతుందని అంటుంటారు. కానీ, ఎవరి జీవితాన్ని వారే సజావుగా నడుపుకోవచ్చని చెప్పేందుకు ఆమె ఒక మోడల్ కూడా’ అని అసాంజే చెప్పారు. -
వికీయే సఖియే...
అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం సహజమైన విషయం. అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం అందమైన విషయం. రెండ్రోజుల్లో వాలెంటైన్స్ డే. ఈ సందర్భంగా ఇవాళ మీకో అందమైన విషయం. పమేలా ఆండర్సన్ తెలుసు కదా! 49 ఏళ్ల అమెరికన్ నటి. ఆమె ఇప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి పేరు జులియన్ అసాంజ్. వయసు 45. వికీలీక్స్ హీరో. ప్రేమకు వయసు లేదు కాబట్టి.. ప్రేమలో ఉన్నంత కాలం వీళ్లు అమ్మాయి, అబ్బాయే. ఇదిలా ఉంచితే, లండన్‌లోని ఈక్వెడర్ ఎంబసీలో నాలుగేళ్లుగా తలదాచుకున్న అసాంజ్‌ను చూడ్డానికి పమేలా తరచు అమెరికా నుంచి వచ్చి వెళుతున్నారు. గత నాలుగు నెలల్లో ఐదుసార్లు ఆమె అతడిని కలుసుకున్నారు. అంతవరకు ఎవరూ పట్టిపట్టి చూడలేదు కానీ, వచ్చిన ప్రతిసారీ పమేలా స్పెషల్‌గా డ్రెస్ చేసుకుని రావడం ఓ యాక్టివిస్టు కళ్లల్లో పడింది. యాక్టివిస్టులకు ఒకటే యాక్టివిటీ ఉండదు కదా! అతడి కోసం ఆమె సెక్సీగా డ్రెస్ చేసుకుని వస్తోంది ఏమిటి చెప్మా.. అని ఆరా తీసి, వాళ్లిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని ఊదేశాడు. ఇంతకీ అసాంజ్‌ను పమేలా ఎందుకు కలుస్తున్నట్లు? అది తెలీదు కానీ, ఇద్దరికీ రష్యా అంటే ఇష్టం. అసాంజ్ ఏదైనా ఇష్టంగా తింటుంటే అతడి కళ్లల్లోకి ఇష్టంగా చూస్తూ కూర్చోవడం పమేలాకు ఇష్టం. అతడి కోసం వచ్చే ప్రతిసారీ అతడికి ఇష్టమైన ఫుడ్ ప్యాక్ చేయించుకుని తెస్తుందట పమేలా. ‘వికీలీక్స్’ హీరో జర్నలిస్ట్ జులియన్ అసాంజ్ -
కేరళ సీఎంకు హాలీవుడ్ నటి ఈ మెయిల్
తిరువనంతపురం: బుధవారం(రేపు) జరగబోయే చారిత్రక త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులుగా వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారు చేసిన బొమ్మలని ఉపయెగించాలని బేవాచ్ స్టార్, జంతు హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్ కోరింది. ఈ మేరకు అమె కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కోచ్చి దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్‌కు ఈ మెయిల్ చేసింది. ఏనుగులని గొలుసులతో కట్టేసి, బలవంతంగా ఎండలో తిప్పడం వల్ల అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా అసౌకర్యానికి గురి అవుతారని అందులో పేర్కొంది. నిర్భందించి ఏనుగులని ఉపయోగించడాన్ని భారత్‌తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలిసిందే..అని ముఖ్యమంత్రికి రాసిన లేకలో పమేలా అండర్ సన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పమేలా అండర్ సన్ నుంచి మెయిల్ వచ్చినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది. ముఖ్యమంత్రి తిరువనంతపురం తిరిగి రాగానే ఈ విషయం పై చర్చిస్తామని అధికారులు చెప్పారు. -
ఐస్ బకెట్ చాలెంజ్ ను స్వీకరించను!
ఇప్పుడు సెలబ్రిటీలంతా ఐస్ బకెట్ చాలెంజ్ లో మునిగితేలుతుంటే.. బేవాచ్ స్టార్, జంతువుల హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్ మాత్రం ససేమిరా అంటోంది. అసలు సాహసమంటే.. ఐస్ బకెట్ చాలెంజ్ కాదని తెలిపింది. 'నేను ఈ సవాల్ ను స్వీకరించలేను. అసలు సాహసమంటే నలుగురికి మంచి చేసేదిగా ఉండాలి. వాటికే నా మద్దతు ఉంటుందని' ఆమె స్పష్టం చేసింది. ఐస్ బకెట్ సవాలు విసురుతున్న ఏఎల్ఎస్ అసోసియేషన్‌ను..ముందుగా జంతువులపై చేస్తున్న ప్రయోగాలు ఆపి, మానవాళి బాగు కోసం ఏదైనా సరికొ్త్తగా ఆలోచించాలని తెలిపింది. మానవులకు వచ్చే వ్యాధుల నివారణ కోసం పాటుపడాలని ఏఎల్ఎస్ కు విజ్ఞప్తి చేసింది. అసలు జంతువుల ప్రయోగాలనేవి కేవలం క్రూరత్వంతో కూడున్నవని..నిజమైన మానవాళి అభివృద్ధికోసం పాటు పడే శాస్త్రవేత్తలకు సహకరించండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ ఫేస్ బుక్ పోస్ట్ భారీ షేర్లను నమోదు చేసుకుంది. ఈ అమ్మడు కామెంట్ కు 43 వేల మంది లైక్స్ కొట్టగా, 15 వేల మంది షేర్ చేసుకోవడం గమనార్హం. -
పమేలా పెళ్లి వైరాగ్యం
బేవాచ్ మాజీ స్టార్ పమేలా ఆండర్సన్ పెళ్లి వైరాగ్యం వెల్లడించింది. మధ్య వయస్కురాలైన ఆమె రిక్ సాలొమొన్ను రహస్యంగా ద్వితీయ వివాహం చేసుకుంది. ఆ పెళ్లి రెండు నెలలకే పెటాకులవ్వడంతో ఫేస్బుక్లో పెళ్లి వైరాగ్య పద్యాన్ని అందుకుంది. ప్రేమను ప్రేమించినా సంతోషం దక్కలేదు, అది ఫ్యాషనో, ట్రెడిషనో కాదు, కేవలం రొమాన్స్. డబ్బున్న వాడిని ఎప్పుడూ పెళ్లాడకూడదు, ఇక వ్యభిచారం వల్ల ఉన్న చిన్న ఆత్మను కోల్పోతారు అంటూ పమేలా గోడు వెళ్లబోసుకుంది. -
ఆరేళ్లప్పుడు వేధింపులకు...పన్నెండేళ్లప్పుడు అత్యాచారానికి గురయ్యా!
‘‘లైంగిక వేధింపులు చేసేవాళ్లను క్షమించకూడదు. అలాంటివాళ్లు మనిషి రూపంలో ఉన్న మృగాలు’’ అని ఘాటుగా స్పందించారు పమేలా ఆండర్సన్. ఈ హాలీవుడ్ హాట్ లేడీ ఇటీవల ఓ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఆరేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను పంచుకుంటూ - ‘‘నా చిన్నప్పుడు నన్ను చూసుకోవడానికి ఒకావిడ ఉండేది. మావాళ్లు లేని సమయంలో తను ఏదో చేసేది. నాకేమీ అర్థమయ్యేది కాదు. పెద్దయిన తర్వాతే ఆమె చేష్టలకు అర్థం తెలిసింది. ఇక, పన్నెండేళ్ల వయసులో జరిగిన రెండు ఘోరాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఒకరోజు నా స్నేహితురాలి బోయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. అతని అన్నయ్య ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అదను చూసి అతను నా మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఓ సందర్భంలో కొంతమంది నాపై సామూహిక అత్యాచారం జరిపారు. ఆ వయసులో ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాను... భయపడ్డాను కూడా. ఎక్కడ నన్ను తప్పుపడతారోనని నా సందేహం. కానీ, అప్పుడు మౌనం వహించడం తప్పు అని ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నా. అందుకే, అంటున్నా అత్యాచారానికి గురైనవాళ్లు మౌనంగా ఉండకూడదు. న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లి, పోరాడాలి. సరైన శిక్ష పడేలా చేస్తే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలనుకునేవారి సంఖ్య తగ్గుతుంది’’ అన్నారు పమేలా ఆండర్సన్.