కేరళ సీఎంకు హాలీవుడ్ నటి ఈ మెయిల్
తిరువనంతపురం: బుధవారం(రేపు) జరగబోయే చారిత్రక త్రిస్సూర్ పూర్ణమ్ ఉత్సవాలలో ఏనుగులకు బదులుగా వెదురు బొంగు, కాగితపుగుజ్జుతో తయారు చేసిన బొమ్మలని ఉపయెగించాలని బేవాచ్ స్టార్, జంతు హక్కుల ఉద్యమకర్త పమేలా అండర్ సన్ కోరింది. ఈ మేరకు అమె కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, కోచ్చి దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్కు ఈ మెయిల్ చేసింది.
ఏనుగులని గొలుసులతో కట్టేసి, బలవంతంగా ఎండలో తిప్పడం వల్ల అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా అసౌకర్యానికి గురి అవుతారని అందులో పేర్కొంది. నిర్భందించి ఏనుగులని ఉపయోగించడాన్ని భారత్తో పాటూ అంతర్జాతీయంగా ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం మీకు తెలిసిందే..అని ముఖ్యమంత్రికి రాసిన లేకలో పమేలా అండర్ సన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పమేలా అండర్ సన్ నుంచి మెయిల్ వచ్చినట్టు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది. ముఖ్యమంత్రి తిరువనంతపురం తిరిగి రాగానే ఈ విషయం పై చర్చిస్తామని అధికారులు చెప్పారు.