
ప్రతిష్టాత్మక ‘ప్రాణి మిత్ర’ అవార్డు
రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ (Anant Ambani) మరో ఘనతను సాధించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్నకుమారుడిగా జంతుప్రేమికుడిగా అనంత్ అంబానీ అందరికీ సుపరిచితమే. జంతు రక్షణ, ప్రధానంగా ఏనుగుల సంరక్షణ కోసం వంతారా (Vantara) అనే సంస్థను స్థాపించారు. అనంత్ అంబానీ ప్రాణప్రదమైన వంతారాకు ప్రతిష్టాత్మక 'ప్రాణి మిత్ర' జాతీయ అవార్డు లభించింది.
'కార్పొరేట్' విభాగంలో జంతు సంక్షేమంలో భారతదేశంలోని అత్యున్నత గౌరవం పురస్కారం 'ప్రాణి మిత్ర' ( Prani Mitra Award ) జాతీయ అవార్డు వంటారా దక్కించుకుంది. వంటారా సంస్థ అయిన రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ (RKTEWT)కు గౌరవం దక్కింది. ఈ అవార్డును భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ సహాయ మంత్రి గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేశారు. దీనికి వంతారా సీఈవో వివాన్ కరణి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జంతు సంక్షేమం పట్ల వంతారా లోతైన నిబద్ధతను నొక్కి చెప్పారు. సంక్షేమ ప్రమాణాలను పెంచడం, భారతదేశ జీవవైవిధ్యాన్ని కాపాడటం వారి లక్ష్యమనన్నారు. "ఈ అవార్డు భారతదేశ జంతువులను రక్షించడానికి, సంరక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన అనేక మంది వ్యక్తులకు నివాళి. వంతారాలో, జంతువులకు సేవ చేయడం అంటే కేవలం డ్యూటీ కాదు - ఇది తమ ధర్మం, సేవ, కరుణ, తమ బాధ్యతలో దృఢమైన నిబద్ధత అన్నారు. భవిష్యత్తరాలకోసం దేశ గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడటం అనే లక్ష్యంలో తాము అలుపెరగకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.
చదవండి : పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్‌గా!
కెరీర్‌లో పీక్‌లో ఉండగానే పెళ్లి, భరించలేని గృహహింస..చివరికి!
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
వంతారా
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. వంతారాలోని ఎలిఫెంట్ కేర్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు ఆసుపత్రికి నిలయంగా ఉంది. 240కి పైగా ఏనుగులకు రక్షణ కల్పిస్తోంది. ఇక్కడ ఏనుగులకు ప్రపంచ స్థాయి పశువైద్య చికిత్స, కరుణా సంరక్షణ లభిస్తుంది. ఇక్కడ అల్లోపతిని ప్రత్యామ్నాయ వైద్యంతో అనుసంధానించే అధునాతన పశువైద్య సంరక్షణను అందిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ కోసం ఆయుర్వేదం మరియు నొప్పి నివారణ కోసం అక్యుపంక్చర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. దీని అత్యాధునిక వైద్య సౌకర్యాలలో ఆర్థరైటిస్ చికిత్స కోసం అధిక పీడన నీటి జెట్‌లతో కూడిన హైడ్రోథెరపీ చెరువు, గాయం నయం కోసం హైపర్‌బారిక్ ఆక్సిజన్ చాంబర్ , పెడిక్యూర్ నిపుణులతో అంకితమైన పాద సంరక్షణ సౌకర్యాలుండటం విశేషం.అలాగే వంతారా అతిపెద్ద ఏనుగు అంబులెన్స్‌ల సముదాయాన్ని నిర్వహిస్తోంది.హైడ్రాలిక్ లిఫ్ట్‌లు, రబ్బరు మ్యాట్ ఫ్లోరింగ్, వాటర్ ట్రఫ్‌లు, షవర్లు , కేర్‌టేకర్ క్యాబిన్‌లున్న 75 కస్టమ్-ఇంజనీరింగ్ వాహనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment