ఐక్యతా విగ్రహ శిల్పి రామ్‌సుతార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | Statue of Unity sculptor Ram Sutar gets Maharashtra Bhushan award | Sakshi
Sakshi News home page

ఐక్యతా విగ్రహ శిల్పి రామ్‌సుతార్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Published Fri, Mar 21 2025 4:44 PM | Last Updated on Fri, Mar 21 2025 4:49 PM

Statue of Unity sculptor Ram Sutar gets Maharashtra Bhushan award

స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించిన రామ్‌ సుతార్‌కు మహారాష్ట్ర భూషణ్‌ అవార్డు 

శాసనసభలో సీఎం ఫడ్నవీస్‌ వెల్లడి  

రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం మహారాష్ట్ర భూషణ్‌ అవార్డుకు ప్రముఖ శిల్పి రామ్‌ సుతార్‌ను ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ గురువారం శాసనసభలో ప్రకటించారు. మార్చి 12న ఆయన తన నేతృత్వంలోని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఫడ్నవీస్‌ తెలియజేశారు. ఈ అవార్డుకింద ఆయనకు రూ.25లక్షల నగదు, మెమెంటో అందజేస్తామని వెల్లడించారు. ‘ఆయనకు ఇప్పుడు వందేళ్ళు. కానీ దాన్ని లెక్కచేయకుండా ముంబైలోని ఇందు మిల్లు స్మారక ప్రాజెక్టులో అంబేద్కర్‌ విగ్రహం రూపకల్పనలో ఆయన నిమగ్నమై ఉన్నారు.’అని ప్రశంసించారు.  

పలు భారీప్రాజెక్టుల రూపశిల్పి  
గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, ఈ ఏడాదితో వందేళ్లు పూర్తిచేసుకున్న రామ్‌సుతార్‌ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్‌ యూనిటీని రూపొందించారు. సుతార్‌ తన కుమారుడు అనిల్‌తో కలిసిస్టాట్యూ ఆఫ్‌ యూనిటీ, అయోధ్యలో రెండు వందల యాభై ఒక్క మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహం, బెంగళూరులో నూటయాభై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం, పూణేలోని మోషిలో వంద అడుగుల ఎత్తైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ విగ్రహం వంటి అనేక ప్రధాన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తో సంబంధం కలిగి ఉన్నారు.గతేడాది మాల్వాన్‌లోని రాజ్‌కోట్‌ కోటలో ముప్పై ఐదు అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ విగ్రహం కూలిపోయి రాష్ట్రంలో భారీ రాజకీయ దుమారం చెలరేగింది. ఆ సంఘటన జరిగిన నాలుగునెలల తరువాత ప్రభుత్వం అరవై అడుగుల కొత్త విగ్రహాన్ని  నిర్మించే కాంట్రాక్టును రామ్‌ సుతార్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది.  

గుజరాత్‌లో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించారు. గత నెలలో 100 ఏళ్లు నిండిన సుతార్, మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందినవారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement