
ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’ కార్యక్రమం
పాల్గొన్న ప్రముఖ మానసిక వైద్యులు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, విశాల్‌రెడ్డి
పిల్లల పెంపకంపై తల్లిదండ్రులకు పలు సలహాలు, సూచనలు
మంచి పాటలు మానసిక ఒత్తిడికి మందులాంటివని వెల్లడి
ముంబై సెంట్రల్: ‘పిల్లల పెంపకమనేది వినోదం కాదు..అదో తపస్సు.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేటికాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు భవిష్యత్తులో ఆదర్శవంతంగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. పిల్లలు కాపీ కొట్టేది ముందుగా తల్లిదండ్రుల్నే..’అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా’’ఇండ్ల విశాల్‌రెడ్డి. ఆదివారం ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలు ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌కు అలవాటు పడకుండా చూడాలనీ, వారిలో సర్వాంగ వికాసానికి తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వారిపై కఠినమైన ఆంక్షలు విధించడం, తల్లిదండ్రుల అభిరుచుల్ని బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం ఆగిపోతుందని హెచ్చరించారు.
మంచి పాటలతో మానిసిక ఉత్తేజం: డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి
కార్యక్రమంలో భాగంగా ‘మనసు పాటలపై మానసిక విశ్లేషణ’అనే అంశంపై సుప్రసిద్ధ మానసిక నిపుణులు డా’’ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించి, సభికుల్ని అలరించారు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మానసిక క్షోభకు గురవుతాడనీ, అలాంటి సమయంలో కుంగిపోకుండా, మోటివేషన్ కలిగించే మధురమైన పాటలు వింటే తాత్కాలికంగా మానసిక ఒత్తిడికి దూరమై నూతన ఉత్తేజాన్ని పొందుతాడని చెప్పారు. ఒక మానసిక వైద్యుడిగా ఇది తాను సాధికారికంగా చెప్పగలననీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనసు పలికే మౌన గీతం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో, మనసు గతి ఇంతే, పాడుతా తీయగా చల్లగా, ఆట గదరా శివా, కలకానిది విలువైనది.’లాంటి పలు పాటల్ని ప్రదర్శిస్తూ, ఆ పాటలు ప్రభావం మనిషి జీవితంపై చూపలగల ప్రభావాన్ని గురించి ఉదాహరణలతో సహా వివరించారు.

తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యం: అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి
ఆంధ్ర మహాసభలో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఆధ్యాతి్మక, మానసిక వికాస, సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనీ, తెలుగువారి ప్ర యోజనాలే తమకు ముఖ్యమని అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరందరికీ ఆంధ్ర మహాసభ తరపున టీ, టిఫిన్‌లు ఏర్పాటుచేశారు. అనంతరం ఇరువురు వైద్యుల్ని మహాసభ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సభకు సాహి త్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్ స్వా గతం పలకగా, ధర్మకర్తల మండలి సభ్యుడు గాలి మురళీధర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. గాలి మురళీధర్ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు సంగం ఏక్‌నాథ్, భోగ సహాదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, తాళ్ళ నరేశ్, సంయుక్త కార్యదర్శులు మచ్చ సుజాత, కటుకం గణేశ్, అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేష్, క్యాతం సువర్ణ, కూచన బాలకిషన్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్‌రావు, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్య దర్శి పిల్లమారపు పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment