mental health
-
అటు ఆందోళన.. ఇటు నిరాశ!
సాక్షి, అమరావతి : దేశంలో కార్పొరేట్ రంగంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్లో మానసిక సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో 15 శాతం మేర మానసిక సమస్యలు పెరిగాయి. ఈ విషయం స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్–2024 నివేదికలో వెల్లడైంది. 2024 జనవరి నుంచి నవంబర్ మధ్య ఉద్యోగులకు నిర్వహించిన 83 వేల కౌన్సెలింగ్ సెషన్స్, 12 వేల ఎలక్టివ్ స్క్రీనింగ్, 42 వేల అసెస్మెంట్ డేటాబేస్ ఆధారంగా పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య సవాళ్లపై చేపట్టిన అధ్యయనం ఆధారంగా నివేదికను విడుదల చేశారు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో 90 శాతం మంది ఆందోళన, 92 శాతం మంది నిరాశ సమస్యలతో సతమతమవుతున్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో నిరాశ 69 శాతం, ఆందోళన 67 శాతం మేర ఉంటోంది. 70 శాతం మందికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణం 2023తో పోలిస్తే గతేడాది పురుష ఉద్యోగుల మానసిక సమస్యల్లో 7 శాతం మేర వృద్ధి నమోదైంది. గతేడాది కౌన్సెలింగ్ తీసుకున్న వారిలో 52 శాతం మహిళలు, 47 శాతం పురుష ఉద్యోగులున్నారు. కాగా, కౌన్సెలింగ్ పొందిన వారిలో 70 శాతం మందికి మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా ఆర్థిక ఇబ్బందులే. అదే మహిళల్లో 60 శాతం మందిలో రిలేషన్షిప్ సంబంధిత సమస్యలున్నట్టు వెల్లడైంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యల కారణంగా ఉద్యోగుల్లో ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నట్టు గుర్తించారు. 2023తో పోలిస్తే 2024లో ఆత్మహత్యల ప్రమాదం 22 శాతం పెరిగింది. -
కోటీశ్వరుడు అవ్వడమే శాపమైంది..!
డబ్బే జీవితంగా బతుకుతుంటారు కొందరూ. అందుకోసం తన పర అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. బంధాలన్నింటిని డబ్బుతోనే చూస్తారు. నిజానికి అదొక స్టాటస్ ఆఫ్ సింబల్. కాస్త డబ్బు పలుకుబడి ఉంటేనే సమాజంలో గౌరవం కూడా. అయితే అదే డబ్బు మనిషికి కొంచెం కూడా మనశ్శాంతిని, నమ్మకమైన వ్యక్తులను ఇవ్వలేదు అనే నిజం తెలిసేలోపే అన్నింటిని కోల్పోతాం. ఏం కావాలో తెలియక మనో వ్యధకు గురవ్వుతాం. అచ్చం అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు ఓ మిలియనీర్. పాపం డబ్బే సర్వం అనుకున్నాడు ఇప్పుడదే అతడికి మనశ్శాంతిని దూరం చేసింది. అసలేం జరిగిందంటే...అమెరికాకు చెందిన జేక్ కాసన్ అనే కాలేజ్ డ్రాపౌట్ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా బతికాడు. సంపదే తనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుందని నమ్మాడు. అందుకోసం అహర్నిశలు కష్టపడి పనిచేశాడు. చిన్న వయసులోనే లాస్ ఏంజిల్స్‌కు చెందిన యాక్సెసరీ బ్రాండ్ MVMT వాచెస్ కంపెనీని స్థాపించాడు. అనతికాలంలోనే కోట్లకు పడగెత్తాడు. 27 ఏళ్ల వయసుకి తన బ్రాండ్‌కి ఉన్న ఇమేజ్ చూసి ఏకంగా రూ. 871 కోట్లకు విక్రయించాడు. మిలియనీర్‌గా మారాలన్న అతడి కల నెరవేరింది. కానీ అదే అతడికి కష్టాలు, కన్నీళ్లని తెచ్చిపెట్టింది. ఎప్పుడైతే కోటీశ్వరుడు అయ్యాడో అక్కడ నుంచి వ్యక్తిగత జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. జస్ట్ 30 ఏళ్లకే వైవాహిక జీవితంలో బ్రేక్‌అప్‌లు, ఏదో లక్ష్యం కోల్పోయినట్లు మనశ్శాంతి లేకపోవడం తదితరాలు చుట్టుముట్టాయి. అయితే అతడికి ఎందరో ప్రాణ స్నేహితులు ఉన్నా.. తన ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయి. ఏదో కావాలన్న ఆరాటం..కానీ ఏం కావాలో తెలియక ఒక విధమైన నైరాశ్యంతో కొట్టుమిట్టాడాడు. చివరికి అదికాస్తా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. "డబ్బే అనందాన్ని ఇస్తుందనుకుని కష్టపడి స్థాపించిన కంపెనీని అమ్మేశాను అదే నేను చేసిన తప్పు. వ్యవస్థాపక ప్రయాణం అత్యంత అమూల్యమైనది. ఒక కంపెనీని స్థాపించి దాన్ని నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టడంలో ఉన్న ఆనందం కిక్కు వేరు. డబ్బులు పోగేసుకోవడంలో లేదనే విషయం గ్రహించేలోపే..వ్యక్తిగతంగా అత్యంత ముఖ్యమైన మనశ్శాంతిని కోల్పోయా". అంటూ విలపిస్తున్నాడు కాసన్. అందుకే మళ్లీ పనిలో పడాలని నిర్ణయించుకుని యూట్యూబ్ చానెల్ పెట్టే ఆలోచన చేస్తున్నాడు. అలాగే తన బ్రాండ్‌కి పెట్టుబడిదారుడిగా ఉండాలని చూస్తున్నాడు. ఇతడి స్టోరీ ఓ గొప్ప విషయాన్ని చాటి చెప్పింది. "డబ్బు వెంట పరిగెడితే మనశ్శాంతి ఉండదు..కష్టపడటంలోనే ఆత్శసంతృప్తి ఉంటుందనే సత్యాన్ని చాటి చెబుతోంది కదూ..!. అయినా అవసరానికి మించిన ధనం కూడా చేటేనేమో..!."(చదవండి: ఎవరీ పూనమ్ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి..!) -
ఆ థెరపీ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!
అమీర్ ఖాన్- రీనా దత్త కూతురుగా ఇరా ఖాన్ సినీ ప్రియులకు సుపరిచితమే. ఆమె‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో కూడా. తన మానసిక ఆర్యోగ్యం(Mental health) గురించి బహిరంగంగానే మాట్లాడుతంటంది. తాను చాలా డిప్రెషన్‌కి గురయ్యానని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చింది కూడా. దేని వల్ల తాను డిప్రెషన్‌కి గురయ్యింది, బయటపడేందుకు తీసుకన్న చికిత్స తన జీవితాన్ని ఎలా మార్చేసిందో సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అమీర్ ఖాన్(Aamir Khan) రీనా దత్తాలు 1986లో వివాహం చేసుకున్నారు. దగ్గర దగ్గర 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2002లో స్వస్తి పలికి విడిపోయారు. ఇక వారి ఇద్దరికి కలిగిన సంతానమే జునైద్ ఖాన్, ఇరా ఖాన్. ఇలా ఈ దంపతులు విడిపోవడం వారి కూతురు ఇరాఖాన్(Ira Khan)పై తీవ్ర ప్రభావమే చూపించింది. నిజానికి తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై గట్టిగానే పడుతుంది. అయితే అది కొందరిలో ఆత్మనూన్యత భావానికి లేదా నిరాశ నిస్ప్రుహలకి దారితీస్తుంది. ఇక్కడ ఇరాఖాన్ కూడా అలానే తీవ్రమైన డిప్రెషన్ బారిన పడింది. తాను ఆ సమస్యతో బాధపడుతన్నానని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. దీన్నుంచి బయటపడేందుకు ఎంతగానో పోరాడింది. అందుకోసం ఆమె తీసుకున్న థెరపీ(Therapy) మెదట తాను ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంగీకరించేలా చేసింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులు బాంధవ్యం గురించి ఓ స్పష్టమైన అవగాహన కలిగించింది. వాళ్లు కేవలం తన తల్లిదండ్రులుగా మాత్రమే చూడకూడదని, వాళ్లూ మనుషులే, తమకంటూ వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. వారి సంతానంగా తాను గౌరవించాలని తెలుసుకుంది ఇరా. అలా తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకుని డిప్రెషన్‌ను జయించే ప్రయత్నం చేశాను. పిల్లలకు వారి పేరెంట్స్‌తో సన్నిహితంగా ఉండమని ఎవ్వరూ చెప్పారు. ఆ పని మనమే చేయాలి. అదే మనకు మనో ధైర్యాన్ని, శక్తిని అందిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. కాగా, ఇటీవలే ఇరాఖాన్ తన ప్రియడు ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేను పెళ్లిచేసుకుని వివాహం బంధంలోకి అడుగు పెట్టింది. (చదవండి: Maha Kumbh 2025: నాగ సాధువుగా తొలి విదేశీయుడు..!) -
మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమా
ప్రస్తుతం మానసిక ఆరోగ్యాన్ని(Mental health) పరిరక్షించుకోవడమనేది సవాలుగా మారుతోంది. శారీరక ఆరోగ్యం(Health)తో సమానంగా దీనికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై అవగాహన పెరుగుతుండటంతో వీటిని సైతం ఇప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా గుర్తిస్తున్నారు. అయితే, ఇందుకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డంకిగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా సంస్థలు తమ పథకాల్లో మానసిక ఆరోగ్య కవరేజీని చేర్చడం ప్రారంభించాయి. దీనితో కౌన్సిలింగ్, థెరపీ, ప్రివెంటివ్ కేర్ వంటి ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయకరంగా ఉంటున్నాయి. ఆరోగ్య బీమా(health insurance) ప్లాన్ ఎంపిక చేసుకునేటప్పుడు, అది అందించే కవరేజీ, ప్రయోజనాల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. అలా పరిశీలించతగిన కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే..సమగ్ర కవరేజీకౌన్సిలింగ్, థెరపీ సెషన్లు వంటి మానసిక ఆరోగ్య సేవలను కవర్ చేసేవిగా పథకాలు ఉండాలి. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులను కలిసే అవకాశాన్ని కల్పించాలి. టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు కూడా ఉండాలి. దీంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లతో ఆన్లైన్లో సంప్రదించేందుకు వీలవుతుంది. అదనంగా, ఔట్‌పేషంట్ డిపార్ట్మెంట్ (ఓపేడీ) కవరేజీ ఉంటే ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా డాక్టర్‌ను సందర్శించవచ్చు, ఇది సమయంతో పాటు డబ్బును కూడా ఆదా చేస్తుంది.వెల్నెస్ ప్రోగ్రాంలుఅనేక బీమా కంపెనీలు ఇప్పుడు తమ పథకాలలో వెల్నెస్ ప్రోగ్రాంలను చేరుస్తున్నాయి. ఇవి మైండ్‌ఫుల్‌నెస్ సెషన్లు, ఒత్తిడిని అధిగమించేందుకు వర్క్‌షాప్‌లు నిర్వహించడం లేదా ఫిట్నెస్పరమైన ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేవిగా ఉంటున్నాయి. ఉచిత యోగా తరగతులు, జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా వెల్నెస్ యాప్(Wellness App)లకు యాక్సెస్ వంటి ప్రయోజనాలను కూడా కొన్ని పథకాలు అందిస్తున్నాయి. హోమ్ హెల్త్‌కేర్ సేవలుదీర్ఘకాలిక సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నవారికి క్లినిక్‌లకు ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. అలాంటి వారికి హోమ్ హెల్త్‌కేర్ ప్రయోజనాలు ఉన్న పాలసీలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇంటి వద్దే సంరక్షణ సేవలను సౌకర్యవంతంగా అందుకునేందుకు ఈ పాలసీలు సహాయపడతాయి. ఇన్సెంటివ్‌లు, రివార్డులుకొన్ని బీమా పథకాలు ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తూ రివార్డులు అందిస్తాయి. ఉదాహరణకు, మీరు రెగ్యులర్ హెల్త్ చెక్–అప్స్ చేయడం లేదా ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా రెన్యువల్‌పై డిస్కౌంట్ పొందవచ్చు. కొన్ని పథకాలు వాకింగ్ లేదా వ్యాయామం మొదలైన వాటికి పాయింట్లు అందిస్తాయి. వీటిని తరువాత రిడీమ్ చేసుకోవచ్చు.వెల్నెస్ ప్రోగ్రాంలుఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు తోడ్పడే వెల్నెస్ ప్రోగ్రాంలు, ప్రివెంటివ్ కేర్లాంటివి అందించే పాలసీ(Policy)లను ఎంచుకోవాలి. డిస్కౌంట్లు, రివార్డులు మొదలైనవి ఇచ్చే పాలసీల వల్ల బీమా వ్యయం తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా అలవడతాయి. డబ్బూ ఆదా అవుతుంది. ఇక టెలిమెడిసిన్, హోమ్ హెల్త్‌కేర్ ఫీచర్లు సత్వరం సేవలను పొందడాన్ని సులభతరం చేస్తాయి.ఇదీ చదవండి: ఫండ్స్ కటాఫ్ సమయం ఎప్పుడు?మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడనేది మరింత పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. చికిత్స చేయకపోవడం వల్ల పలు రకాల పరిస్థితులు రోజువారీ జీవితానికి అడ్డంకులుగా మారతాయి. సంబంధాలను నాశనం చేస్తాయి. అలాగే, ఇతర ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. డాక్టర్లను పదే పదే కలవాల్సి రావడం వల్ల, అలాగే ఎమర్జెన్సీ కవరేజీ అవసరాల వల్ల ఆర్థికంగా కూడా ఇది మరిన్ని ఖర్చులకు దారి తీస్తుంది. కాబట్టి తగినంత కవరేజీ ఉండే పాలసీని ఎంచుకోవడం వల్ల భావోద్వేగాలపరంగానూ, ఆర్థికంగాను సవాళ్లను అధిగమించేందుకు సహాయకరంగా ఉంటుంది. -
భలేవాడివి బాసు!
ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుంటేనే ప్రతిరోజూ ఆనందం ఉంటుంది. అసలే దూరాభారం ప్రయాణాలు, ట్రాఫిక్ చిక్కులు, టార్గెట్లు వంటి కారణాలతో అలిసిపోవడం సహజం.. అయితే మన రోజువారీ ఆరోగ్య పరిస్థితిని ఇలాంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. అన్నింటి కన్నా మనపై ఉన్న బాస్ ప్రవర్తనను బట్టే మన మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం పనిచేసే ప్రాంతం బాగుంటే మానసిక ప్రశాంతత ఉంటుందని మానసిక నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే రోజుకు కనీసం 9 గంటల పాటు ఆఫీస్‌లోనే గడపాల్సి వస్తుంది కాబట్టి.. అక్కడి వాతావరణం బాగుంటేనే మిగతా రోజంతా సులువుగా గడిచిపోతుందని పేర్కొంటున్నారు. పై అధికారి శాడిస్టు అయితే మానసిక ఆరోగ్యంతో పాటు మన పనితనం, భవిష్యత్తు, ఇతరులతో సంబంధాలు కూడా దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ప్రభావం.. ఆఫీస్‌లో బాస్ ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. అది ఉద్యోగిపై స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడూ నెగెటివిటీతో బాస్ మాట్లాడుతుంటే ఉద్యోగుల సొంత తెలివితేటలపైనే అనుమానం వస్తుంటుంది. వారిని వారే తక్కువ అంచనా వేసుకోవడంతో పనితీరు కూడా మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు ఉద్యోగంపై విరక్తి కలిగి రాజీనామా చేసేంత వరకూ వెళ్తుందని పేర్కొంటున్నారు. మోటివేషన్ ఉండాల్సిందే.. పని చేసే ప్రదేశంతో నెగెటివ్ వాతావరణం కన్నా మోటివేషన్ ఉంటే ఉద్యోగులు క్రియాశీలకంగా పనిచేస్తుంటారని, చేసిన పనికి మెచ్చుకోలు లేకపోయినా కనీసం కించపరిచేలా మాట్లాడటం, అందరి ముందు మందలించడం వంటి పనులు చేస్తే మానసిక వేదనకు గురై.. పని తీరు మందగిస్తుందని పేర్కొంటున్నారు. పనిచేసే ప్రదేశంలో ఆరోగ్యకరమైన పోటీతత్వం, స్వతంత్రత, చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు ఉంటే ఉద్యోగులకు మోటివేషన్ వస్తుందని పేర్కొంటున్నారు. అప్పుడు పనితీరులో కూడా మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.ఎలా బయటపడాలి..?కర్కశమైన బాస్ కింద పనిచేసిన వారి మానసిక స్థితిని మళ్లీ తిరిగి పొందొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం కన్నా అక్కడి నుంచి వెళ్లిపోయి వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇక, పాత ఆఫీస్ జ్ఞాపకాలను మర్చిపోయి.. ఆత్మన్యూనత భావం నుంచి బయటపడటం కాస్త కష్టమైనా కూడా సాధించొచ్చని చెబుతున్నారు. మన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుని, మనం గతంలో సాధించిన విజయాలను నెమరువేసుకుంటూ ఉండాలని పేర్కొంటున్నారు. మన మంచి కోరే సహోద్యోగులతో మనం చేసిన పనిపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ ఉండాలని, చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని పూర్తి చేస్తుంటే మళ్లీ మనలో కాని్ఫడెన్స్ పెరుగుతుందంటున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఆత్మ స్థైర్యం సాధించాలని పేర్కొంటున్నారు. ఆఫీస్‌లో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం.. ‘ఎక్కువ కాలం ఇలాంటి వాతావరణంలో పనిచేయడంతో నేర్చుకునే తత్వం తగ్గిపోతుందని, కొత్త విషయాలు రూపకల్పన చేయడం, సృజనాత్మకత పెంచేందుకు దోహదపడే డోపమైన్ తగ్గుముఖం పట్టి.. కారి్టసాల్ స్థాయి పెరిగుతుందని ఢిల్లీకి చెందిన సైకోథెరపిస్టు డాక్టర్ చాందినీ చెబుతున్నారు. అద్భుతంగా ఎలా పని చేయాలా..? అని ఆలోచించడం మానేసి.. తన మీదికి రాకుండా ఏం చేయాలనే దానిపైనే దృష్టి సారిస్తారని ఆమె వివరించారు. ఆఫీస్ వాతావరణం చాలాకాలం పాటు సరిగ్గా లేకుంటే ఉద్యోగులకు వేరే వారితో సంబంధాలు దెబ్బతింటాయని, అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు చేసుకుంటారని, అలాగే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.లీడర్షిప్ ముఖ్యం.. ఆఫీస్ వాతావరణం చెడిపోడానికి కారణాల్లో ప్రధానమైనది లీడర్షిప్ లేకపోవడం. బాస్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయని చెబుతున్నారు. బాస్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోతే తాను చెప్పాలనుకున్న విషయాలు ఉద్యోగులకు వ్యక్తీకరించలేరు. దీంతో ఉద్యోగులకు ఉన్న సమస్యలు నేరుగా చెప్పుకోలేరు. పక్షపాత వైఖరి, అసాధ్యమైన టార్గెట్లు పెట్టడం కూడా వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు. ఒత్తిడితో పాటు ఆందోళన పెరుగుతుందని పేర్కొంటున్నారు. తద్వారా ఆఫీస్ వాతావరణం పూర్తిగా చెడిపోతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఇటీవల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది.అనేక ఆరోగ్య సమస్యలు.. పనిచేసే ప్రదేశంలో బాస్ సపోర్టు ఉంటే ఉద్యోగులు వ్యక్తిగతంగా ఎదుగుదలకు ఉపయోగపడటమే కాకుండా సంస్థ పనితీరు కూడా బాగుంటుంది. ఏం చేసినా తప్పులు వెతకడం, విమర్శలు చేస్తుండటం వల్ల ఒత్తిడి, ఆందోళనకు గురవుతారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆ ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేక, అక్కడే భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితులను ఎవరికీ చెప్పుకోలేక నిద్రలేమి, హృద్రోగ సమస్యలు తలెత్తుతాయి. బాస్ ప్రవర్తనతో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కుదిరితే నేరుగా చెప్పి సమస్యలను పరిష్కరించుకోవాలి. నచ్చిన వారితో కాసేపు ప్రశాతంగా గడిపినా, ఫోన్లో మాట్లాడినా మనసులోని బరువు తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. – డాక్టర్ పి.హరీశ్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ -
భారత్ బాగుండాలంటే.. పని గంటలు తగ్గాల్సిందే!
ఆరోగ్యం ఏమాత్రం చెడిపోకుండా.. అసలు ఎన్ని గంటలు పని చేస్తే సరిపోతుంది?. 7 గంటలా?, 8 గంటలా?, పోనీ 10 గంటలా?.. ఏదో ఒక సందర్భంలో తమను తాము ఉద్యోగులు వేసుకునే ప్రశ్నే ఇది. అయితే అది పనిని, పని ప్రదేశాన్ని బట్టి మారొచ్చనేది నిపుణులు చెప్పే మాట. అలాంటప్పుడు మార్గదర్శకాలు, లేబర్ చట్టాలు ఎందుకు? అనే ప్రశ్న తలెత్తడం సహజమే కదా!.ఆమధ్య కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ అనే యువ చార్టెడ్ అకౌంటెంట్.. పుణేలో ఓ ఎమ్మెన్సీలో చేరిన నాలుగు నెలలకే అనారోగ్యం పాలై చనిపోయింది. పని ఒత్తిడి వల్లే తన కూతురి ప్రాణం పోయిందంటూ సదరు కంపెనీకి, కేంద్రానికి బాధితురాలి తల్లి ఓ లేఖ రాసింది. యూపీలో ఫైనాన్స్ కంపెనీలో పని చేసే తరుణ్ సక్సేనా.. 45 రోజులపాటు విశ్రాంతి తీసుకోకుండా పని చేసి మానసికంగా అలసిపోయాడు. చివరకు టార్గెట్ ఒత్తిళ్లను భరించలేక.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. చైనాలో, మరో దేశంలోనూ ఇలా పని వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు చూశాం. ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు తీవ్రస్థాయిలో పని గంటల గురించి.. పని వాతావరణం గురించి తీవ్ర చర్చ జరుగుతుంది. అసలు ఇలా.. ఉద్యోగులు ఇన్నేసి గంటలు బలవంతంగా పని చేయడం తప్పనిసరేనా? చట్టాలు ఏం చెబుతున్నాయంటే..భారత్‌లో పనిగంటలను నిర్దారించేవి యాజమానులు/ సంస్థలు/కంపెనీలే. కానీ, ఆ గంటల్ని నియంత్రించేందుకు చట్టాలు మాత్రం అమల్లోనే ఉన్నాయి. అవే.. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, షాప్స్ అండ్ ఎస్టాబిష్మెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి.ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం..రోజూ వారీ పని గంటలు: గరిష్టంగా 9 గంటలువారంలో పని గంటలు: గరిష్టంగా 48 గంటలురెస్ట్ బ్రేక్స్: ప్రతీ ఐదు గంటలకు ఆరగంట విరామం కచ్చితంగా తీసుకోవాలిఓవర్ టైం: నిర్ణీత టైం కన్నా ఎక్కువ పని చేస్తే చేసే చెల్లింపు.. ఇది ఆయా కంపెనీల, సంస్థలపై ఆధారపడి ఉంటుందిషాప్స్ అండ్ ఎస్టాబిష్మెంట్స్ యాక్ట్లురోజువారీ పని గంటలు: 8-10 గంటలువారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితం.. ఓటీని కలిపి 50-60 గంటలురెస్ట్ బ్రేక్స్: ఫ్యాక్టరీస్ యాక్ట్ తరహాలోనే తప్పనిసరి విరామంకొత్త లేబర్ చట్టాల ప్రకారం..(అమల్లోకి రావాల్సి ఉంది)రోజువారీ పని గంటలు: 12 గంటలకు పరిమితంవారంలో పని గంటలు: 48 గంటలకు పరిమితంఓవర్ టైం: అన్నిరకాల పరిశ్రమల్లో.. త్రైమాసికానికి 125 గంటలకు పెరిగిన పరిమితి‘దేశంలోని ఉద్యోగులకు పని వేళలను కుదించండి.. ఆ నిబంధనలను కఠినంగా అమలయ్యేలా చూడండి’ తాజా పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కేంద్రానికి చేసిన విజ్ఞప్తి ఇది. ‘‘ఇది అత్యవసరమైన అంశం. గంటల తరబడి పనితో.. ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఒకవైపు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యల బారిన పడుతున్నారు. పని గంటలను పరిమితం చేసే చట్టాలకు ప్రాధాన్యమిస్తూనే.. కఠినంగా వాటిని అమలయ్యేలా చూడాలి’’ అని కార్మిక శాఖ మంత్రి మాన్షుక్ మాండవియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఉద్యోగుల పని గంటలకు సాధారణ మార్గదర్శకాలుఫుల్ టైం వర్క్.. ఎనిమిది గంటలకు మించకుండా వారంలో ఐదు దినాలు.. మొత్తం 40 గంటలు. ఓవర్ టైం.. 40 పని గంటలకు మించి శ్రమిస్తే.. రకరకాల సమస్యలు రావొచ్చు. అందుకే ఓటీ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. పని మధ్యలో.. ఎక్కువ సేపు తదేకంగా పని చేయడం అంత మంచిది కాదు. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం కంపల్సరీ. ఆయా దేశాల జనాభా, ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని వివిధ దేశాల వారపు పని గంటల జాబితాను పరిశీలిస్తే.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలుగా కంబోడియా, మయన్మార్, మెక్సికో, మలేషియా, బంగ్లాదేశ్ లిస్ట్‌లో ప్రముఖంగా ఉన్నాయి. అత్యల్పంగా పని గంటల దేశాలుగా దక్షిణ ఫసిఫిక్ దేశం వనౌతు, కిరిబాటి, మొజాంబిక్, రువాండా, సిరియా ఉన్నాయి.ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలోనే ఎక్కువ పని గంటలు ఉన్న దేశంగా జాబితాలో భారత్ కూడా ఉంది. అందుకు కారణం.. దేశ శ్రామిక శక్తిలో 51 శాతం ఉద్యోగులకు వారానికి 49 పని గంటల విధానం అమలు అవుతోంది కాబట్టి. అలాగే ఆ మధ్య వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. 78 శాతం భారతీయ ఉద్యోగులు పని గంటలతో శారీరకంగా, మానసికంగా అలసటకు గురవుతున్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోసం, పని ప్రాంతాల్లో పరిస్థితులు మానవీయ కోణంలో కొనసాగాలన్నా.. తక్షణ చర్యలు అవసరం అని థూరూర్ లాంటి వాళ్లు చెబుతున్నారు. అందుకు అన్నా సెబాస్టియన్ అకాలమరణా ఉదంతాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. చిన్నవయసులో.. అదీ కొత్తగా ఉద్యోగంలో చేరి మానసికంగా వేదనకు గురైంది ఆమె. అలా.. ఆరోగ్యం చెడగొట్టుకుని ఆస్పత్రిపాలై.. ప్రాణం పొగొట్టుకుంది. దేశ ఎదుగుదలకు శ్రమించే ఇలాంటి యువ నిపుణల బాగోగుల కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఇలాంటి వరుస విషాదాలు.. వ్యవస్థాగత వైఫల్యాలను ప్రతిబింబిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి హద్దులు చెరిపేసి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తాయా?. -
మానసిక ఆరోగ్యం పై నాట్స్ అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ న్యూజెర్సీ విభాగం తాజాగా మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సును, డిమెన్షియాపై సర్వే లను నిర్వహించింది. తొలుత నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల రట్గర్స్ యూనివర్సిటీ క్లినికల్ ఇన్స్టక్టర్, పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ లను సభకు పరిచయం చేశారు. ముఖ్యంగా విద్యార్ధులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్ధుల తల్లిదండ్రులు విద్యార్ధుల మానసిక సమస్యలను ఎలా కనిపెట్టాలి.? ఎలా పరిష్కరించాలి.? ఒత్తిడిని జయించేలా వారికి ఎలా దిశా నిర్దేశం చేయాలనే అంశాలపై ఈ సదస్సు ద్వారా అవగాహన కల్పించారు. నమి న్యూజెర్సీ ప్రోగ్రామ్ మేనేజర్, సమాజ్ స్టేట్ వైడ్ కో ఆర్డినేటర్, మానసిక నిపుణురాలైన శుభ బొలిశెట్టి ఈ సదస్సులో విద్యార్ధులకు, తల్లిదండ్రులకు మానసిక సమస్యలు, వాటి పరిష్కారాలపై చక్కటి అవగాహన కల్పించారు. డిమెన్షియాపై సర్వేకు నాట్స్ మద్దతుఆసియన్ అమెరికన్ డిమెన్షియా బాధితుల సంరక్షణ ఎలా ఉంది..? డిమెన్షియా బాధితులను సంరక్షించే వాళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.? ముఖ్యంగా మానసికంగా వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు.? అనే అంశాలపై చాంబర్లిన్ విశ్వవిద్యాలయం మరియు మెర్సర్ కౌంటీ కమ్యూనిటీ కళాశాలల విజిటింగ్ ప్రొఫెసర్, రట్గర్స్ యూనివర్సిటీ కి చెందిన పీహెచ్డీ విద్యార్ధిని అంజు వాధవన్ సర్వే చేస్తున్నారు. ఇలాంటి సర్వే ద్వారా డిమెన్షియా బాధితులకు, వారి సంరక్షకులు ఎదుర్కొనే సమస్యలపై కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. అందుకే ఈ కార్యక్రమానికి నాట్స్ కూడా తన వంతు మద్దతు, సహకారం అందించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలితో పాటు నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ భీమినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, న్యూ జెర్సీ ఛాప్టర్ జాయింట్ సెక్రటరీ ప్రసాద్ టేకి, రాకేష్ వేలూరు,రామకృష్ణ బోను, సుధ బిందు, నేషనల్ విమెన్ ఎంపవర్మెంట్ టీమ్ సభ్యురాలు శ్రీదేవి జాగర్లమూడి, శ్రీదేవి పులిపాక తదితరులు ఈ సమావేశం నిర్వహణ బాధ్యత వహించారు. తెలుగు లలిత కళాసమితి ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఊటుకూరు, రాణి ఊటుకూరు, పలువురు న్యూ జెర్సీ ఛాప్టర్ కమిటీల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: ఆర్ధిక అక్షరాస్యత పై నాట్స్ అవగాహన సదస్సు) -
ఆందోళనని హ్యాండిల్ చేయడంపై హీరో విక్కీ కౌశల్ సలహాలు!
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ అత్యంత ప్రతిభావంతమైన హీరోల్లో ఒకరు. `యూరి` లాంటి సంచలన మూవీతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనుసులను గెలుచుకున్నాడు. నిజానికి విక్కీ ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్‌ని సంపాదించుకోలేదు. అతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడు. ఆ క్రమంలో ఆందోళన(యాంగ్జయిటీ), అభద్రతభావానికి గురయ్యేవాడనని చెప్పుకొచ్చాడు విక్కీ. అయితే దాన్ని ఏవిధంగా హ్యాండిల్ చేయాలో ఓ సీనియర్ నటుడు తనకు మంచి సలహ ఇచ్చారని అన్నారు. ఇంతకీ ఏంటా సలహా అంటే..నటన, డ్యాన్స్ పరంగా విక్కీ కౌశల్ చాలా టాలెంటెడ్ హీరో. ఏ పని అయినా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కెరీర్లో హీరోగా ఎదుగుతున్న సమయంలో చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ క్రమంలో తాను ఆందోళనకు గురయ్యేవాడనని అన్నారు. అయితే దాన్ని హ్యాండిల్ చేయడంపై ఓ సీనియర్ నటుడు ఇచ్చిన సలహను తూచాతప్పకుండా పాటిస్తానని అన్నారు. అదేంటంటే..ఆందోళనను ఎలా మ్యానేజ్ చేయాలంటే..మనకు ఆందోళన లేదా యాంగ్జయిటీని ఫేస్ చేస్తున్నప్పుడూ దానని మంచి స్నేహితుడిగా మార్చుకుండి. మీరు ఏ విషయమై ఆందోళన చెందుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆందోళన అనేది ఎప్పుడు కలుగుతుందంటే.. ఒక పనిలో సరైన టాలెంట్ లేకపోవడం లేదా ఏదైన బలహీనత కారణంగా ఎదురవ్వుతుంది. కాబట్టి ముందుగా అందులో మంచి నైపుణ్యం సాధించండి ఆటోమేటిగ్గా ఆందోళన మీకు దాసోహం అవుతుందని చెబుతున్నాడు నటుడు విక్కీ. అంతేగాదు ఆందోళనను అధిగమించాలంటే ముందుగా మన బలహీనతల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి, దాంట్లో ప్రావీణ్యం సాధించే యత్నం చేయాలి. అప్పుడు ఆందోళన, ఒత్తిడి వంటివి మన దరిచేరవని అన్నారు . ఇలా మానసిక ఆరోగ్యం గురించి విక్కీ మాట్లాడటం తొలిసారి కాదు. గతంలో ఓ టీవీ షోలో కాలేజ్ టైంలో తాను ఎలా ఆత్యనూన్యతతో బాధపడ్డాడో షేర్ చేసుకున్నారు. అంతేగాదు తన ఫిజికల్ అపీరియన్స్ పట్ల ఎలా ఆందోళన చెందిందే, అవన్నీ తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించడమే గాక తన అభిమానులకు మానసిక ఆరోగ్యంపై స్ప్రుహ కలిగిస్తున్నాడు. (చదవండి: అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!) -
ఐదు కొత్త రైడర్లు.. 60కి పైగా ప్రయోజనాలు: టాటా ఏఐజీ
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్టుల సమగ్రతను పెంచడమే లక్ష్యంగా భారతదేశపు అగ్రగామి సంస్థ టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. కొత్తగా 60 పైగా ప్రయోజనాలను అందించే అయిదు రైడర్లను ఆవిష్కరించింది. వైద్య ఖర్చులు పెరుగుతూ, ఆరోగ్య సంరక్షణ అవసరాలు మారుతున్న నేపథ్యంలో ఆరోగ్యం మీద తలెత్తుతున్న సరికొత్త ఆందోళనలు, జీవన విధానాల్లో మార్పుల సమస్యలను పరిష్కరించేలా ఈ రైడర్లు వ్యక్తిగత అవసరాలకు అనుగణంగా డిజైన్ చేశారు.కస్టమర్లకు వినూత్నమైన, సందర్భోచితమైన సొల్యూషన్స్ అందించడం ద్వారా ఆరోగ్య బీమా రంగంలో పురోగతి సాధించడంపై టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ ఆవిష్కరణలు నిదర్శనంగా నిలుస్తాయి. కంపెనీ ఆవిష్కరించిన కొత్త రైడర్లలో మెంటల్ వెల్బీయంగ్, ఎంపవర్హర్, ఓపీడీ కేర్, క్యాన్కేర్, ఫ్లెక్సీ షీల్డ్ ఉన్నాయి. ఇవి మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, క్యాన్సర్ కేర్ వంటి క్రిటికల్ హెల్త్‌కేర్ అవసరాలను తీర్చేవిగా రూపొందాయి.ఎంపవర్హర్ రైడర్ అనేది మహిళల్లో వంధ్యత్వం, పీసీవోఎస్, ఇతరత్రా జననేంద్రియ సమస్యల్లాంటి వాటికి సమగ్రమైన పరిష్కారం అందించడం లక్ష్యంగా తయారైంది. ఇక మెంటల్ వెల్బీయింగ్ అనేది పరిశ్రమలోనే తొలిసారిగా మెంటల్ హెల్త్ ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ అండ్ రీహాబిలిటేషన్ కవరేజీని అందిస్తుంది. క్యాన్కేర్ రైడర్ అనేది క్యాన్సర్ సంబంధ రక్షణ కల్పిస్తుంది. పెరుగుతున్న వైద్య వ్యయాలు, రోజువారీ ఆరోగ్య ఖర్చుల నుంచి కస్టమర్లకు రక్షణ కల్పించే విధంగా ఓపీడీ కేర్, ఫ్లెక్సీ షీల్డ్ అనేవి ఉంటాయి.మెరుగ్గా క్లెయిమ్స్ ప్రక్రియకస్టమర్ల నమ్మకాన్ని పెంచడానికి కీలకమైన క్లెయిమ్స్ సెటిల్మెంట్ ప్రక్రియను టాటా ఏఐజి గణనీయంగా మెరుగుపరుచుకుంది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 67.7 శాతంగా ఉన్న క్యాష్‌లెస్ క్లెయిమ్స్ వినియోగం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 76.95 శాతానికి పెరిగింది. 96 శాతం క్యాష్‌లెస్ క్లెయిమ్స్ నాలుగు గంటల్లోనే ప్రాసెస్ చేస్తున్నారు. 85 శాతం రీయింబర్స్మెంట్ క్లెయిమ్‌లు అయిదు రోజుల వ్యవధిలోగానే సెటిల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో అంతటా క్యాష్‌లెస్ విధానాన్ని 100% అమలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.కస్టమర్లకు సంతృప్తికరంగా సేవలు అందించడం, సమర్ధమైన పనితీరు విషయాల్లో పరిశ్రమలోనే కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ వేగవంతమైన, నిరాటంకమైన విధంగా సేవలు అందించడంలో టాటా ఏఐజీకి గల నిబద్ధతకు ఈ మెరుగుదలలు నిదర్శనంగా నిలుస్తాయి.నెట్వర్క్ విస్తరణదేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా ఏఐజి తన నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించింది.గడిచిన 18 నెలల్లో 64 శాతం మేర పెంచుకోవడం ద్వారా భారతదేశవ్యాప్తంగా 11,700 పైచిలుకు నెట్వర్క్ హాస్పిటల్స్‌తో టాటా ఏఐజీ తన కార్యకాలాపాలు విస్తరించింది. ముఖ్యంగా సేవలు అంతగా అందని ప్రాంతాల్లో కూడా సర్వీసులను విస్తరించేందుకు కట్టుబడి ఉంది. 5,000 మంది కంటే ఎక్కువ డాక్టర్లు, 3,000 పైగా డయాగ్నోస్టిక్ ప్రొవైడర్లు గల ఓపీడీ నెట్వర్క్ అనేది 10 పైగా భాషల్లో పటిష్టమైన టెలీకన్సల్టేషన్ సర్వీసు మద్దతుతో కస్టమరుకు మరింత సౌకర్యవంతంగా సమగ్రమైన హెల్త్‌కేర్ కవరేజీ అందేలా తోడ్పడుతోంది.ఆరోగ్య బీమా విభాగంలో వేగవంతమైన వృద్ధిని సాధించే దిశగా మా వ్యూహంలో భాగంగా ఈ రైడర్లు ఆవిష్కరించాము. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విస్తరించడంపై మేము మరింతగా దృష్టి పెడుతున్నాం. ఈ ప్రాంతాల్లో హెల్త్‌కేర్ యాక్సెస్, అవగాహన వేగంగా పెరుగుతోంది. మా శాఖల నెట్వర్క్, ఏజంట్లు, హాస్పిటల్ భాగస్వాముల సంఖ్యను పెంచుకోవడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను మరింత మందికి అందుబాటులోకి తేవాలని మేము నిర్దేశించుకున్నాం. ఆరోగ్య బీమా విభాగంలో ఇదే మా వృద్ధి అంచనాలకు తోడ్పడనుందని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & హెడ్-ఏజెన్సీ ప్రతీక్ గుప్తా అన్నారు.220 ప్రాంతాల్లో, 11,700+ ఆస్పత్రుల నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తూనే ఆరోగ్య బీమా రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు టాటా ఏఐజీ కట్టుబడి ఉంది.రైడర్ల ప్రత్యేకతలుఎంపవర్హర్: పీసీవోఎస్, వంధ్యత్వం, గైనకాలజీ అంశాలు, మహిళల్లో వచ్చే క్యాన్సర్లతో పాటు మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు సమగ్రమైన కవరేజీనిచ్చే విధంగా ఈ రైడర్ తయారైంది. సర్వికల్ క్యాన్సర్ టీకాల్లాంటి ప్రివెంటివ్ కేర్ కవరేజీలను కూడా ఇది అందిస్తుంది.మెంటల్ వెల్బీయింగ్: ముందస్తుగానే గుర్తించి, సకాలంలో చికిత్సను అందించడంలో తోడ్పడే విధంగా, పరిశ్రమలోనే తొలిసారిగా ప్రివెంటివ్ మెంటల్ హెల్త్ స్క్రీనింగ్స్, సైకలాజికల్ థెరపీ, రీహ్యాబిలిటేషన్ సర్వీసులు సహా మానసిక ఆరోగ్య సమస్యలకు కవరేజీని అందిస్తుంది.క్యాన్కేర్: నిర్దిష్ట తీవ్రత గల క్యాన్సర్ ఉన్నట్లుగా వైద్యపరీక్షల్లో వెల్లడైన పక్షంలో సమ్ ఇన్సూర్డ్‌ను ఏకమొత్తంగా చెల్లించే విధంగా విస్తృతమైన క్యాన్సర్ కవరేజీని అందిస్తుంది.ఓపీడీ కేర్: డాక్టర్ కన్సల్టేషన్స్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లులు, కంటి చూపు సంరక్షణ వంటి అవుట్పేషంట్ ఖర్చులకు కవరేజీనిస్తుంది. తద్వారా రోజువారీ ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చుకోవడంలో తోడ్పాటు అందిస్తుంది.ఫ్లెక్సీ షీల్డ్: వైద్యపరమైన ద్రవ్యోల్బణం నుంచి పాలసీదార్లకు రక్షణ కల్పించే విధంగా డిజైన్ చేశారు. రిస్టోర్ ఇన్ఫినిటీ+ ద్వారా సమ్ ఇన్సూర్డ్‌ను అపరిమితంగా రిస్టోర్ చేస్తుంది. అలాగే ఇన్ఫ్లేషన్ షీల్డ్ కింద సమ్ ఇన్సూర్డ్ పెంపుదలతో పెరిగే వైద్య వ్యయాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇంటర్నేషనల్ సెకండ్ ఒపీనియన్, ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధి/వ్యాధులకు డే 31 కవరేజీ, ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్ క్యాష్తో పాటు మరెన్నో ప్రీమియం ప్రయోజనాలను అందిస్తుంది. -
మానసిక ఆరోగ్యంతోనే అభివృద్ధి
మానవ సమాజంలో పని అనేది ఒక అంత ర్భాగం. మానవుడు ఆహా రం కోసం చేసే వెదుకు లాట/ వేట మొట్టమొదటి పనిగా చెప్తారు. 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం పని గంటలు, పని ‘సంస్కృతి’లో అనేక మార్పులు తీసుకువచ్చింది. పరిశ్రమలు, కార్మికులు కలసి ఒక సంస్థాగత వ్యవస్థగా ఏర్ప డ్డారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడం, ఇంటర్నెట్ ప్రవేశంతో కొత్తకొత్త ఉద్యోగాల రూపకల్పన జరగడం ప్రారంభమయింది. యాంత్రికీకరణ, కృత్రిమ మేధ అభివృద్ధితో ఇది మరింత కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక మనిషి తన జీవిత కాలంలో సుమారుగా తొంభైవేల నుండి ఒక లక్ష గంటల పాటు పని ప్రదేశంలోఉంటాడని అంచనా. అంటే యుక్త వయసు నుండి రిటైరయ్యే వరకు ఉన్న జీవిత కాలంలో ఇది సుమారు మూడు వంతుల సమయం. ఒక ఉద్యోగస్థుడు తన సహ చరులతో ఇంతకాలం గడపడం వలన వారితో ప్రత్యేక అనుబంధం ఏర్పరుచుకుంటాడు. ఈ బంధాలు, పనిచేసే వాతావరణం, యాజమాన్యంతో ఉండే సంబంధం... ఇవన్నీ ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని చాలావరకు ప్రభావితం చేస్తాయి. కనుకనే ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ‘పని చేసే ప్రదేశంలో మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి’ అనే నినాదంతో ఈ సంవత్సరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపు కుంటోంది. పని ప్రదేశాల్లో ఒత్తిడి అనేది అత్యంత సహజ మైన విషయం. అయితే ఈ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే పలు రకాల శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం ప్రతీ పదిమందిలో ఎనిమిది మంది ఏదో ఒక రకమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నట్లు తేలింది. ప్రతి నలుగురిలో ఒకరు చికిత్స అవసరం అయిన మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా బాధపడే వారిలో కేవలం నలభై శాతం మంది మాత్రమే సరైన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే ఇది ఉద్యోగి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఉత్పాదకతను కూడా తగ్గిస్తుంది. ఇది మిగిలిన ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక ఉద్యోగితో పాటుగా యాజమాన్యాలు / సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద తగిన జాగ్రత్తలు తీసు కోవలసిన అవసరం ఉంది. సరైన సమయపాలన పాటించడం, ఒత్తిడికి గురైనపుడు సహచరుల, యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సహాయం పొందడం; పనికి, వ్యక్తిగత జీవితానికి హద్దులు పెట్టుకొని కొంత సమయం తనకోసం మాత్రమే కేటాయించుకోవడం, వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, పనిలో అప్పుడప్పుడు కొంత విరామం తీసుకోవడం లాంటివి చేయడం ద్వారా ఉద్యోగి ఒత్తిడిని కొంత వరకు తగ్గించవచ్చు. విభిన్న షిఫ్ట్ సిస్టవ్ులో పనిచేసే దంపతులు కలిసి ఉండే సమయం తక్కువ అవడంవల్ల కలిసి క్వాలిటీ టైవ్‌ు గడిపే అవకాశాలు సన్నగిల్లి వీరి మధ్య కొన్ని మనస్పర్థలు, అనుమా నాలు తలెత్తే అవకాశముంది. సమర్థంగా పనిచేసే వారిని యాజమాన్యం ఎప్పటికప్పుడు ప్రోత్సహించి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల వీరిలో మానసిక స్థైర్యం పెంపొందుతుంది. మహిళా ఉద్యోగులు, ఒకవైపు ఇంటి బాధ్యతలు, పిల్లల సంరక్షణ; మరోవైపు ఉద్యోగ బాధ్యతల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. అలాంటి వారి ఎడల సంస్థలు కొన్ని వెసులుబాట్లు ఇస్తే, వీరు ఒత్తిడికి లోను కాకుండా ఉండగలరు. కంపెనీలు కూడా ఈ మధ్య కాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోవ్‌ు’ను ప్రోత్సహించడం వలన ఉద్యో గుల్లో ఉత్పాదకత పెరిగినట్లు గణాంకాలు చెబు తున్నాయి. ప్రతి సంస్థ అర్హత కలిగిన మానసిక వైద్యులు లేదా క్లినికల్ సైకాలజిస్టుల సేవలు తమ ఉద్యోగులకు కల్పించాలి. యోగా, ధ్యానం, ఒత్తిడి గురించి వర్క్‌షాప్స్ వంటి కార్యక్రమాలు తరచుగా తమ సంస్థల్లో జరిగేలా ఏర్పాట్లు చేయాలి. ఒక క్రమ పద్ధతిలో నైపుణ్య పరీక్షలు జరిపి అర్హులైన వారికి ఇంక్రిమెంట్లు, పదోన్న తులు, ఇతర వసతులు కల్పించడం ద్వారా ఉద్యోగస్థుల్లో సంతృప్తి శాతాన్ని పెంచవచ్చు. ఎప్పుడైతే ఉద్యోగస్థులు తమ పనిపట్ల తృప్తితో ఉంటారో వారు మరింత పాజిటివ్ ధృక్పథంతో, సంస్థ అభివృద్ధికి కృషిచేస్తారు. వారు మిగిలిన వారికి ఒక మంచి ఉదాహరణగా నిలిచి, ఒక చక్కని పని సంస్కృతి అనేది సంస్థలో అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలు పని ప్రదేశాల్లో ఉద్యోగుల, కార్మికుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది. జీవితంలోగాని,వృత్తిలో గాని విజయం సాధించాలంటే మనసును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోవడమనేది చాలా ముఖ్యమని అందరూ గుర్తించాలి. డా‘‘ ఇండ్ల రామసుబ్బారెడ్డి వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్యనిపుణులు(రేపు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!
నా వయస్సు 33 సం‘‘లు. నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. కానీ ఒక ఏడాది నుంచి పూర్తిగా మానేశాను. మాంసాహారం అంటే జంతువధ అని, వాటిని చంపడం, రక్తపాతం లాంటి దృశ్యాలు నా మనసులోకి పదే పదే రావడం వాటిని తప్పించడానికి నేను తరచు చేతులు కడగడం ఇల్లంతా శుభ్రం చేయడం, భర్తను పిల్లలను అనవసరంగా కోపగించుకోవడం వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. దయచేసి మీరేదైనా మార్గం చెప్పండి! – ఎ. పార్వతి,హైదరాబాద్జంతువధ గురించి ఆలోచించి, మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిదే. అయితే మీ ఇంట్లో మాంసాహారం వండినప్పుడు, జంతువధ, రక్తపాతం లాంటి దృశ్యాలు మీ మదిలో మెదిలి, వీటి నుండి బయట పడేందుకు, చేతులు అతిగా కడగడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇదంతా పాపంగా భావిస్తూ, ప్రార్థనలు చేస్తూ, మనోవేదనకు గురి కావడం... ఇవన్నీ ‘ఓసీడీ’ అనే ఒక మానసిక వ్యాధి లక్షణాలు. మెదడులోని కొన్ని రసాయనిక పదార్థాల సమతుల్యం లో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి మానసిక రుగ్మత వస్తుంది. ఇదేదో మీ బలహీనత గానీ, తప్పు గానీ కానే కాదు. అలా అని మీరు బాధపడవద్దు.శరీరానికి జబ్బు చేసినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయని గుర్తించండి. ఈ ఒ.సి.డి జబ్బును పూర్తిగా నయం చేసేందుకు మంచి ఔషధాలున్నాయి. వాటితోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్, ‘ఆర్.టి.ఎమ్.ఎస్’అనే ప్రత్యేక అధునాతన పరికరాలతో చికిత్స చేసి, మీ బాధ నుంచి మిమ్మల్ని పూర్తిగా విముక్తులను చేయవచ్చు. మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను వెంటనే కలవండి. ఆల్ ది బెస్ట్.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్ హెల్త్ టిప్స్!
టాలీవుడ్ నటి, గాయని శృతి హాసన్ విలక్షణ నటుడు కమల హాసన్ కూమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ఒకానొక సందర్భంలో శృతి తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోవాలంటే మొదటగా ఏం చేయాలో తెలుసా అంటూ తన అభిప్రాయాలను షేర్ చేసుకుంది. అవేంటంటే..అందరూ మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడేందుకే జంకుతారు. ఇది ముందు పక్కన పెట్టాయాలంటోంది శృతి. ఈ పరిస్థితిని అందరూ ఏదోఒక సందర్భంలో ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగా పరిగణించాలి. అప్పుడే దీనిగురించి బహిరంగంగా మాట్లాడి స్వాంతన పొందే ప్రయత్నం చేయగలుగుతాం, బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతామని చెబుతోంది. నిజానికి మానసికంగా బాధపడుతున్నాను అంటూ.. వెంటనే థెరపిస్టు లేదా కౌన్సలర్ లేదా సైక్రియాట్రిస్ట్ వద్దకు వెళ్లిపోతారు. కానీ అవేమి అవసరం లేదంటోంది శృతి. మన చుట్టు ఉన్నవాళ్లతో లేదా మనకిష్టమైన వ్యక్తులను ఆత్మీయంగా పలకరించడం, వారితో కాసేపు గడపడం వంటివి చేస్తే చాలు మానసిక స్థితి కుదుటపడుతుందని నమ్మకంగా చెబుతోంది. అందుకు ఉదాహారణగా.. మనం ఏదైన జ్వరం రాగానే ఏం చేస్తాం చెప్పండి అంటోంది. మొదటగా.. ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుని వేసుకుని చూస్తారు. తగ్గలేదు అనగానే వైద్యుడిని సంప్రదించే యత్నం చేస్తారు. అలానే దీని విషయంలో కూడా మనంతట మనంగా ఈ మానసిక సమస్యను నయం చేసుకునే యత్నం చేయాలి. అవన్నీ ఫలించని పక్షంలో థెరఫిస్టులను ఆశ్రయించడం మంచిదని చెబుతోంది. అలాగే కొందరూ మెంటల్ స్ట్రెస్ తగ్గేందుకు సినిమాలకు వెళ్లతారు. ఓ మంచి ఫీల్‌తో హ్యాపీగా ఉండేలా చేసుకుంటారు. ఇది కూడా మంచి పద్ధతే అయినా ఒక్కోసారి ఇది కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదని అంటోంది శృతి. చేయాల్సినవి..మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపించగానే దాన్ని పెనుభూతంలా, పెద్ద సమస్యలా చూడొద్దుఆ వ్యాధి మిమ్మల్ని తక్కువగా చేసి చూపించేది కాదు.నలుగురితో కలుపుగోలుగా మెలిగే ప్రయత్నం లేదా మాట్లాడటం వంటివి చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా ప్రియమైన వ్యక్తులతో సమస్యను వివరించి బయటపడేలా మద్దతు తీసుకోండి. దీంతోపాటు మానసిక ఆరోగ్య నిపుణలను సంప్రదించి..ఏం చేస్తే బెటర్ అనేది కూలంకషంగా తెలుసుకుని బయటపడే ప్రయంత్నం చేయండి.నిజానికి మానసికి ఆరోగ్య మొత్తం ఆరోగ్య శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. ఇది బాగుంటేనే ఏ పనైనా సునాయాసంగా చేయగలం. అందరిలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోగలుగుతాం అని చెబుతోంది శృతి.(చదవండి: ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!) -
కలాపోసన
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది. నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు. మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది. కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి. కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ! -
కుర్చీకి అతుక్కుపోతే అంతే సంగతులు
ఏ వయసు వారైనా రోజుకు తగినంత శారీరక శ్రమ చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. చదువు, పనిలో ఎంత బిజీగా ఉన్నా శారీరక శ్రమను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. శరీరాన్ని కాస్త అటూఇటూ కదల్చాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సూచిస్తోంది. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్ కలిసి డైట్రీ గైడెన్స్ ఫర్ ఇండియా పేరిట మెరుగైన ఆరోగ్యం కోసం 17 మార్గదర్శకాలను ఇటీవల వెల్లడించాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక శ్రమ, యోగా, వ్యాయామంపై పలు సిఫార్సులు చేశాయి. – సాక్షి, అమరావతిప్రతి కొద్ది గంటలకు కదలిక ఉత్తమంఎంత బిజీగా ఉన్నా పనిచేసే ప్రదేశాల్లో, ఇతర సందర్భాల్లో కుర్చీకే అతుక్కోపోవడం సరికాదు. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి శరీరాన్ని కదల్చాలని ఐసీఎంఆర్ సూచించింది. పని చేసే ప్రదేశాల్లో స్టాడింగ్ డెస్క్ ఉపయోగించాలి. లేదంటే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిలబడాలి. అదే విధంగా ప్రతి కొన్ని గంటలకు లేచి 5 నుంచి 10 నిమిషాలు అటూఇటూ నడవాలని పేర్కొంది. ఇంట్లో, పని ప్రదేశాల్లో ఫోన్ మాట్లాడేప్పుడు నడుస్తూ ఉండాలి. లిఫ్ట్, ఎలివేటర్‌కు బదులు మెట్లను వినియోగించాలి. టీవీ చూస్తున్నప్పుడు కుర్చీకే పరిమితం కాకూడదు. టీవీల్లో వచ్చే కమర్షియల్ బ్రేక్ సమయంలో లేచి తిరగాలి.30 నుంచి 60 నిమిషాల వ్యాయామం⇒ 19 నుంచి 60 ఏళ్ల వయసు వారు రోజుకు 30 నుంచి 60 నిమిషాల పాటు మితమైన, తీవ్రమైన వ్యాయామం చేయాలి.⇒ వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పనిసరి.⇒ వయసు, ఆరోగ్య స్థితిగతులను పరిగణనలో ఉంచుకుని ఏరోబిక్ ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ వంటి ఇతర శారీరక శ్రమ చేయాలి.⇒ ఇదే తరహాలో 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు కూడా వారం మూడు, అంతకంటే ఎక్కువ రోజులు శారీరక శ్రమను ఐసీఎంఆర్ సూచించింది.⇒ 5–19 ఏళ్ల పిల్లలు, యుక్త వయస్కులకు రోజుకు కనీసం 60 నిమిషాల ఇంటెన్సిటీ యాక్టివిటీని సూచించింది.భారత్‌లో డబ్ల్యూహెచ్‌వో సూచనలు అందుకోలేక పోయిన వారు.. (శాతం)సంపూర్ణ ఆరోగ్యం కోసం దైనందిన జీవనంలో వివిధ కార్యకలాపాలపై సిఫార్సులు ఇలా..లాన్సెట్ అధ్యయనం ఏం చెబుతోందంటే.. భారత్‌లోని 57 శాతం మహిళలు, 42 శాతం మంది పురుషులు ఫిజికల్ ఇనాక్టివ్‌గా ఉంటున్నట్టు తాజాగా ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 195 దేశాల్లోని డేటాను అధ్యయనం చేయగా భారత్ 12వ స్థానంలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 శాతం మంది పెద్దలు అంటే.. దాదాపు 1.8 బిలియన్ల మంది 2022లో ఇనాక్టివ్‌గా ఉంటున్నారు. 2010 నుంచి 2022 మధ్య 5 శాతం మేర ఈ స్థాయి పెరిగినట్టు తేలింది.వారానికి కనీసం 150 నిమిషాలు..ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతీయుల్లో కూడా శారీరక శ్రమ తగ్గిపోతోంది. జీవన శైలి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. -
డిప్రెషన్‌తో బాధపడ్డ నటుడు ఫర్దీన్ ఖాన్: బయటపడాలంటే..?
బాలీవుడ్ నటుడు ఫర్దీన్ ఖాన్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 14 ఏళ్ల విరామం తర్వాత హీరామండితో ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయన వాలీ బిన్ జాయెద్-ఏఐ మహమ్మద్‌గా నటించి మెప్పించాడు. ఇటీవల ఒక ఇంటర్యూలో తన జీవితంలో ఒకనొక దశలో ఎదుర్కొన్న గడ్డు రోజులు గురించి చెప్పుకొచ్చారు. తాను డిప్రెషన్ గురై బాధపడుతుండే వాడనని, దాని నుంచి బయటపడేందుకు ఎంతలా ప్రయత్నించేవాడినో షేర్ చేసుకున్నారు. దాన్ని మరణం, పునరుద్ధానం మధ్య జరిగే ఒక విధమైన యుద్ధంగా అభివర్ణించారు. నిజానికి డిప్రెషన్ అంత భయంకరమైనదా? ఏం చేస్తే ఈజీగా బయటపడగలం..?ఫర్దీన్ తాను కొన్ని రోజు డిప్రెషన్‌తో చాల బాధపడ్డానని అన్నారు. ఆ టైంలో రోజుల ఎంత కఠినంగా అనిపిస్తాయంటే.. ప్రతి నిమిషం ఓ యుగంలా ఉంటుందని చెబుతున్నారు ఫర్దీన్. ఆ క్రమంలో ఒక్కోసారిగా పూర్తిగా నిరాశ, నైరాశ్యంలోకి కూరుకుపోయి, ఒంటిరిగా ఉండేందుకు ఇష్టపడతామని అన్నారు. అయితే తాను ఎందుకిలా బాధపడుతున్నానని గంటలు తరబడి ఆలోచిస్తాను, కానీ బయటపడలేకపోయే వాడినని చెప్పారు. ఒక్కోసారి ఒంటరిగా గదిలో కూర్చొని ఈ డిప్రెషన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుండే వాడనని, ఐతే అదెలా అనేది తెలియక చాలా సతమతమయ్యేవాడనని అన్నారు ఫర్దీన్. చివరికీ ఎలాగైతే దేవుడి దయ వల్ల తన కుటుంబం సహకారంతో ఈ సమస్య నుంచి బయటపడగలిగానని చె ప్పుకొ చ్చారుఎందువల్ల వస్తుందంటే..నిరుత్సాహ పరిచే సంఘటనలు లేదా మనం అనుకున్నట్లు జరగకపోవడం వల్ల లేక తమకు నచ్చనట్లు జరగుతున్నట్లు అనిపించినప్పుడూ ఈ సమస్య ఎదురవ్వుతుంది. కొందరూ లైట్‌గా తీసుకోగలిగితే, మరికొందరూ మాత్రం నాకే ఎందుకు అని మనసుకి తీసుకుంటారో అక్కడ నుంచి ఓ నీడలా వెంటాడేస్తుంది ఈ డిప్రెషన్. ఎంతలా అంటే మంచి జరిగిన విషయం కూడా చెడ్డగా భయపెట్టేదిగా మారి పూర్తిగా డౌన్ చేసేస్తుంది మనిషిని. అందుకే నటుడు ఫర్దీన్ దీన్ని మనసుతో చేసే కఠినమైన యుద్ధంగా అభివర్ణించాడు. దీన్ని నుంచి బయటపడాలనుకునే వ్యక్తికి మరణంతో సాగిస్తున్న యుద్ధంలా ఉంటుంది. ఇక్కడ ఆ వ్యక్తి మనసులో బయటపడాలని ఎంత బలంగా అనుకుంటే అంత ఈజీగా బయటపడి మనుగడ సాగించగలుగుతాడు. లేదంటే అంతే సంగతులు అని చెబుతున్నారు మానసిక నిపుణులు. బయటపడేందు సింపుల్ మార్గాలు..డిప్రెషన్‌కి గురయ్యే బాధితుడు వేదనాభరితంగా చెప్పుకుంటున్న అతని గోడుని ఆశాంతం శ్రద్ధగా వినాలి. ఓపికగా వారి వేదనను అర్థం చేసుకుంటున్నామనే భరోసా అందించాలి. సంకోచించకుండా తమ ఆలోచనలు బయటపెట్టే అవకాశం ఇవ్వాలి. అలాగే వారికి మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహిచడం, వారిని ఈ సమస్య నుంచి బయటపడేలా మోటీవేట్ చేస్తూ సలహాలు, సూచనలు ఇవ్వాలి. వారిని ఒంటిరిగా వదిలేయకుండా మేమున్నామనే మద్దతు, భరోసా ఇవ్వాలి. థెరపీ సెషన్లు తీసుకుంటూ రోజువారీ పనుల్లో నిమగ్నమయ్యేలా చేయాలి. అలాగే దేనివల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారో తెలుసుకుని అందుకు తగ్గరీతిలో సాయం అందించి వారిలో భారం దిగేలా చేసి కుదుటపడనీయాలి. ఇలా చేస్తే తనని ప్రేమించేవాళ్లు, ఆదరించే వాళ్లు ఉన్నారనే ధైర్యంతో ఉండగలుగుతారు. పైగా దీనికి బలవ్వకుండా సులభంగా బయటపడతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
Ishaa Vinod Chopra: నీకు నువ్వే సాయం చేసుకో
‘లెట్ ఈషా హెల్ప్ ఈషా’ అనుకుందామె. 16 ఏళ్ల వయసులో తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని డాక్టర్లు చెప్పాక ఈషా వినోద్ చోప్రా తనకు తనే సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డిజార్డర్‌తో పోరాటం చేస్తూనే స్త్రీల మానసిక సమస్యల పై చైతన్యం కలిగిస్తోంది. దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమార్తె అయిన ఈషా మానసిక సమస్యతో తన పోరాటంపై తాజాగా ‘ఫైండింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ పుస్తకాన్ని వెలువరించింది. అందరూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి.భారతదేశంలో 2023 సంవత్సరంలో జరిగిన అంచనా ప్రకారం 7 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం తక్కువ కాదు. మానసిక సమస్యలు 14 ఏళ్ల వయసు నుంచి కనిపిస్తాయి. 25 ఏళ్ల వయసుకు పూర్తిగా వ్యక్తమవుతాయి. కాబట్టి 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని పరిశీలిస్తూ వారి సమస్యను తల్లిదండ్రులు గుర్తించగలిగితే చాలా వరకూ ఆ పిల్లలకు తమ సమస్య అర్థమయ్యి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. కాని దురదృష్టవశాత్తు ఈ ఎరుక ఉన్న తల్లిదండ్రులు తక్కువ. స్కూల్ టీచర్లు తక్కువ. ‘అందుకే నేను ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌గా నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. అందుకు అవసరమైన కోర్సును కెనడాలో పూర్తి చేసే దశలో ఉన్నాను. పిల్లల మానసిక సమస్యలనే కాదు... పిల్లలు నార్మల్‌గా ఉండి తల్లిదండ్రులు మానసిక సమస్యలతో బాధ పడుతున్నా పిల్లల జీవితం పెను ఒత్తిడికి లోనవుతుంది. స్కూల్ టీచర్లు ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాలి. అయితే స్కూల్ టీచర్లకు అలాంటి ట్రయినింగ్ ఉండటం లేదు’ అంటుంది ఈషా వినోద్ చోప్రా.సుప్రసిద్ధ దర్శకుడు విధు వినోద్ చో్ప్రా, అతని రెండవ భార్య షబ్నమ్ సుఖదేవ్‌ల సంతానం ఈషా. వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. ‘మా తాతగారు (అమ్మ తండ్రి) ఎస్.సుఖదేవ్ గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఆయనకు మానసిక సమస్యలు ఉండేవని తర్వాత తెలిసింది. నా సమస్యకు మూలం అక్కడే ఉండొచ్చు’ అంటుంది ఈషా.➡️బైపోలార్ డిజార్డర్ఉన్నట్టుండి బోలెడంత ఉత్సాహం రావడం, భారీ పనులు సంకల్పించడం, అతిగా మాట్లాడటం, నిద్ర పోలేక పోవడం, అయినప్పటికీ ముఖం తాజాగా ఉండటం... ఇది బైపోలార్ డిజార్డర్‌లో ‘మేనియా’ దశ. మరి కొన్నాళ్లకు హటాత్తుగా దేనిమీదా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత, నిద్ర లేమి, ఏ పనీ సరిగా చేయలేకపోవడం.. ఇది ‘డిప్రెషన్’ దశ. ఈ రెండు దశల మధ్య ఊగిసలాడుతూ మధ్యలో నార్మల్‌గా ఉంటూ మానసికంగా అవస్థ పడే స్థితే ‘బైపోలార్ డిజార్డర్’. ‘నా పదహారవ ఏట డాక్టర్లు దీనిని గుర్తించారు. దీనిని ఎదుర్కొనడానికి సిద్ధమవమన్నారు’ అని తెలిపింది ఈషా.➡️నీకు నువ్వే సాయం చేసుకో‘మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మొదట తమ మీద తాము విశ్వాసం నిలుపుకోవాలి. పెద్ద కొంపలేం మునగలేదు.. నేనూ అందరిలాంటి వ్యక్తినే... ఇది ఉన్నట్టుగానే గుర్తించక నీ పనిలో పడు అని ధైర్యం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైద్య చికిత్సను పూర్తిగా విశ్వసించి డాక్టర్లు చెప్పినట్టు వినాలి. ఇవేవి సరిగా చేయకపోయినా ఇబ్బందిలో పడతాం’ అంటుంది ఈషా. ‘నాకు డిజార్డర్ ఉందని తెలిశాక దాన్ని ఆర్డర్లో పెట్టడానికి నాలోని సృజనాత్మక శక్తులన్నీ వెలికి తీశాను. కథక్ నేర్చుకున్నాను. పెయింటింగ్ నేర్చుకున్నాను. మానసిక సమస్యలకు సంబంధించిన రీసెర్చ్ చేశాను. మానసిక సమస్యల చైతన్యానికై ప్రచార కర్తగా మారాను. ఈ పనులన్నీ నా సమస్యను అదుపు చేయగలిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బైపోలార్ డిజార్డర్ నా జీవితాన్ని ఆర్డర్లో పెట్టుకునే శక్తి నాకు ఇచ్చింది. అందుకే నా అనుభవాల గురించి రాసిన పుస్తకానికి ‘ఫైడింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ అనే పేరు పెట్టాను’ అంటోంది ఈషా.➡️గట్టి బంధాలు‘హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం గట్టి మానవ సంబంధాలు ఉన్నవారు ఎక్కువ ఆయుష్షుతో ఉంటున్నారట. మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లను చూసుకునే తల్లిదండ్రులు, కేర్గివర్లు ఎంత ప్రేమగా ఉంటే పేషంట్లకు అంత ధైర్యం దక్కుతుంది. సాధారణ జీవితంలో కూడా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలే మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ గట్టి బంధాలు ఉండటం లేదు. ఒక మనిషి ఉన్నాడనే ధైర్యమే నేడు కావలసింది. నేను నా మానసిక సమస్యను దాదాపుగా జయించడంలో నా భర్త, నా తోబుట్టువుల మద్దతు చాలా ఉంది’ అని ముగించింది ఈషా. -
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
మాయ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రఖ్యాత ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె చలాకీతనం చూసి రవి ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. ఇద్దరూ కలసి పార్టీలు, పబ్‌లంటూ తిరిగేవారు. పండంటి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మాయ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. బిడ్డను కూడా పట్టించుకోకుండా జిమ్, యోగా అంటూ తిరుగుతోంది. అందంగా కనిపించాలని, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఎక్స్పోజింగ్ డ్రెస్లేస్తోంది. కారణం లేకుండానే ఏడుస్తోంది, అరుస్తోంది, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తోంది. ఆవేశంలో ఆమె ఏమైనా చేసుకుంటే అది తన మెడకు చుట్టుకుంటుందని రవి హడలి పోతున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుల సలహా మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కి వెళ్లారు. ఒక వ్యక్తి సమస్యను అర్థం చేసుకోవాలంటే వారి కుటుంబ, సాంస్కృతిక నేపథ్యం అవసరం. మాయ లేకలేక పుట్టిన పిల్ల. దాంతో ఆమె బాల్యం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆటలు, పాటలు, నాట్యంలో ముందుండేది. ఆమె ఏం చేసినా పేరెంట్స్ కాదనేవారు కాదు. తప్పు చేసినా సంబరంగా చప్పట్లు కొట్టేవారు. దాంతో ఇతరులు మెచ్చుకుంటేనే, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటేనే సెల్ఫ్ వాల్యూ ఉంటుందనే భావన ఆమెలో ఏర్పడింది. మాయతో ఓ గంట మాట్లాడాక ఆమె హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఏ్కఈ)తో బాధపడుతున్నట్లు అర్థమయింది. సైకోడయాగ్నసిస్లోనూ అదే నిర్ధారణైంది. దీనికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ), సైకోడైనమిక్ టెక్నిక్స్ల కలయికగా చికిత్స ఉంటుంది. ఇది మాయ తన సెల్ఫ్ ఇమేజ్ను పెంచుకోవడంలో ఇవి సహాయపడతాయి. ప్రతికూల ఆలోచనా విధానాలను గుర్తించి, సవాలు చేస్తుంది. ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దంపతులు అంగీకారం మేరకు వారానికో సెషన్ షెడ్యూల్ అయింది. ఆరు నెలల్లో మాయ ప్రవర్తనలో ఆశించిన మార్పులు కనిపించాయి. అసలిదేమిటి? వ్యక్తిత్వ లోపాలుగా కనిపించే మానసిక రుగ్మతలను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇవి దాదాపు తొమ్మిదిశాతం మందిలో ఉంటాయి. ఒక శాతం ప్రజల్లో హెచ్పీడీ కనిపిస్తుంది. ఇందులో వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు నాటకీయంగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ఇతరులను మానిప్యులేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇది యుక్తవయస్సులో మొదలవుతుంది. ఎలాగైనా ఆకట్టుకోవాల్సిందే.. నిరంతరం ఇతరుల భరోసా లేదా ఆమోదం అవసరం కావడం ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రవర్తనల్లో మునిగిపోవడం ·అందుకోసం మితిమీరిన భావోద్వేగాలను ప్రదర్శించడం బలహీనత, అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం రూపంపై అతిగా శ్రద్ధ చూపడం, ఎక్స్‌పోజింగ్‌గా ఉండే దుస్తులు ధరించడం లైంగికంగా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఆత్మహత్య బెదిరింపులతో ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడటం అస్థిరమైన మనోభావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు ఎవరూ పట్టించుకోకపోతే నిరాశకు గురవడంమందుల్లేవు, థెరపీనే మార్గం..వ్యక్తిత్వ లోపాలను ఎవరూ గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. దీన్ని తగ్గించే మందులూ లేవు. ముందుగా రుగ్మతను గుర్తించడం, దానికి సైకోథెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం అవసరం. దానికి ముందుగా జీవనశైలిలో మార్పుద్వారా.. కొంతవరకు సంస్కరించుకోవచ్చు. అతి గారాబమూ కారణమే..కొన్ని కుటుంబాలలో హెచ్పీడీ కొనసాగుతుంది. అందుకే దీనికి జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాల్యంలో కుటుంబ సభ్యుడి మరణం, లేదా హింసకు గురికావడం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యక్తిత్వ లోపంలో భాగంగా మారవచ్చు. హద్దులు లేని, అతిగా ఆనందించే పేరెంటింగ్ స్టైల్లో పెరిగిన పిల్లల్లో ఈ డిజార్డర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నాటకీయ, అస్థిర, అనుచిత లైంగిక ప్రవర్తనను ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు. ఎలాగంటే..రోజూ వ్యాయామం చేయడం తిండి, నిద్ర షెడ్యూల్స్ చేసుకోవడం ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి మానుకోవడం మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని పొందడం సైకోథెరపీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది హెచ్పీడీకి ప్రత్యేకించి మందులు లేకపోయినా, దానివల్ల వచ్చే ఆందోళన, నిరాశలను తగ్గించేందుకు మందులు ఉపయోగ పడతాయి యోగా, బయో ఫీడ్‌బ్యాక్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు వ్యక్తిత్వ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా సహాయ పడవచ్చు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీలైనంత త్వరగా వ్యక్తిత్వ రుగ్మతల నుంచి బయటపడవచ్చు.సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!) -
సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
గతేడాది 2023లో మిస్ యూఎస్ఏ విజేతగా ఎంపికైన నోలియా వోయిగ్ట్ సడెన్‌గా తన స్థానం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన కిరీటాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు ఆమె అభిమానులు. మానసిక ఆరోగ్యం కారణంగానే తాను ఈ అత్యున్నత స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది. ఆరోగ్యమే మహా సంపద అని అందువల్ల ముందు తన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది. అలాగే మిస్ యూఎస్ఏగా తన జర్నీ చాలా అర్థవంతంగా సాగిందని చెప్పింది. మిస్ యూఎస్ఏ టైటిల్‌ని గెలుచుకున్న తొలి మెనిజులా అమెరికన్ మహిళ. తాను మిస్ యూఎస్ఏ 2023 టైటిల్‌కు రాజీనామా చేయాలన కఠినమైన నిర్ణయం తీసుకున్నాని వోయిగ్ట్ పేర్కొన్నారు. ఇది నాకు కొత్త అధ్యయనం అని తెలుసని, అందువల్ల స్థిరంగా ఉండేందుకు యత్నిస్తా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్ ప్రతినిధి మాట్లాడుతూ..వోయిగ్ట్ తన విధుల నుంచి తప్పుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం. మా టైటిల్ హోల్డర్లకు ముందు ప్రాధన్యత ఇస్తాం. ఈ సమయంలో ఆమెకు తనకు తానుగా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము గుర్తించాం. తన భాద్యతలకు వారసునిగా చేయడం కోసం చూస్తున్నారని అర్థమయ్యింది.త్వరలో ఆమె కోరుకున్నట్లుగానే కొత్తమిస్ యూఎస్ఏని ప్రకటించడం కూడా జరుగుతుంది. అని అన్నారు. ఇన్‌స్టాగ్రాంలో సంస్థ మోడల్‌కి మద్దతను ఇవ్వడమే గాక ఆమె చేసిన సేవకు ధన్యావాదాలు తెలిపింది. కాగా, హవాయికి చెందిన సవన్నా గాంకీవిచ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఆమె తదుపరి కొత్త యూఎస్ఏ కిరీటాన్ని పొందే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇక వోయిగ్ట్ మిస్ యూఎస్ఏగా డేటింగ్ హింసకు వ్యతిరేకంగా, ఇమ్మిగ్రేషన్ హక్కులు, లాభప్రేక్ష లేని స్మైల్ ట్రైన్‌తో పనిచేయడం వంటి పలు సేవలందించారు. ఈ వేదిక తన కలను సాకారం చేసుకునేలా చేసింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యేలా చేసిందని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది.(చదవండి: సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ) -
ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్!
‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది. స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా ‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది. నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు. ఆహారం– మానసిక అనారోగ్యం! మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం. ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి వార్థక్యం పోంచి ఉంటుంది బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్ -
‘ట్రంప్‌కు భార్య పేరు కూడా గుర్తులేదు’
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉన్న వయసు ప్రభావం, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకు ఇబ్బందిగా మారాయి. ఈ విషయంలో ఆయనను పలువురు నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనపై వయసుకు సంబంధించి వస్తోన్న విమర్శలను మరోసారి తోసిపుచ్చారు. తన ప్రధాన పోటీదారుడైన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ సైతం తప్పులు చేస్తున్నారని తెలిపారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారంటూ వెలుగులోకి వచ్చిన రిపోర్టును ప్రస్తావించారు. విత్ సేథ్ మేయర్స్ షోలో పాల్గొన్న బైడెన్ ట్రంప్‌పై విమర్శలు చేశారు. ‘మీరు అవతలి వ్యక్తి( డొనాల్డ్ ట్రంప్)ని గమనించాలి. ఆయనకు కూడా దాదాపు నా వయసే ఉంటుంది. ఆయన తన భార్య పేరును గుర్తుంచుకోలేరు’ అని బైడెన్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ఆలోచనలన్నీ కూడా కాలం చెల్లినవని అన్నారు. ట్రంప్ తన భార్యను వేరే పేరుతో పిలిచారా? లేదా తన మాజీ సహాయకుల్లో ఒకరిని అలా పిలిచారా? అనే దానిపై స్పష్టత మాత్రం లేదు. అధ్యక్షుడు బైడెన్ వయసు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఓ కీలక రిపోర్టు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 81 ఏళ్ల వయసున్న బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా తగ్గిందని ఆ రిపోర్టు వెల్లడించింది. జీవితంలోని పలు కీలక విషయాలను సైతం ఆయన గుర్తుకు తెచ్చుకోలేకపోయారని పేర్కొంది. తన కుమారుడు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయమూ ఆయనకు గుర్తులేదని తెలిపింది. ఆయన యూఎస్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా గుర్తులేదని పేర్కొంది. అయితే ఆయనపై వెలువడిన ఈ నివేదికను బైడెన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల విమానం మెట్లు ఎక్కుతూ.. అయన తూలిపడిపోబోయారు. గతంలో ఓ వేదికపై ఎటువైపు నుంచి దిగాలో తెలిక తడబడిపోయారు. ఇటువంటి ఘటనులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. అయితే ఈ ఘటనలు అన్నీ.. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఆయనకు, డెమోక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ముఖ్యంగా వీటినే రిపబ్లికన్ పార్టీకి ప్రచారానికి అస్త్రాలుగా ఉపయోగించుకుంటోంది. తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే క్రమంలో బైడెన్.. ట్రంప్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. -
మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎస్ ఛాంగ్సన్ పేర్కొన్నారు. ప్రత్యేక బోర్డ్‌ల ఏర్పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ(ఎస్‌ఎంహెచ్‌ఏ)తో పాటు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజినల్ రివ్యూ బోర్డ్‌ల ఏర్పాటును చేపట్టింది. ఎస్ఎంహెచ్ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లు రిజిస్ట్రర్ చేసుకున్నాయి. మరోవైపు మానసిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్ ఫౌండేషన్‌తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వారిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్ ఇన్ ఏపీ(ఈఏఎస్‌ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్హాన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. -
పిల్లల సైకాలాజికల్ సెషన్స్ ఎక్కడ తీసుకుంటే మంచిది..?
-
బ్రెయిన్ లో ఏ కెమికల్ తేడా ఉన్నాయో చెప్పే టెక్నాలజీ
-
పిల్లల బిహేవియర్ ఇష్యూస్ ని అడ్రస్ చేసే విధానం..!
-
పిల్లల్ని మోనిటర్ చేసే విధానం ఇదే..!
-
ఫీజికల్ హెల్త్ పై మెంటల్ హెల్త్ ప్రభావం...!
-
US presidential election 2024: ట్రంప్ మానసిక స్థితిపై అనుమానాలు: నిక్కీ హేలీ
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు. -
ఎక్కువగా ఏడుస్తున్నారా? హార్ట్ ఎటాక్ రావొచ్చు, జాగ్రత్త!
కొన్ని మానసిక సమస్యలు శారీరక లక్షణాలతో వ్యక్తమవుతాయి. అయితే ప్రతి శారీరక లక్షణమూ మానసిక సమస్య కారణంగా కాకపోవచ్చు. కానీఙో రిపోర్ట్ ప్రకారం ఔట్ పేషెంట్ విభాగానికి వచ్చే బాధితుల్లో 15 శాతం మందికి అవి మానసిక సమస్యలతో వచ్చిన లక్షణాలు కావచ్చేమోనని గణాంకాలు పేర్కొంటున్నాయి. మానసిక సమస్యలు ఇలా శారీరక లక్షణాలతో ఎందుకు కనిపిస్తాయి, అనేకసార్లు చికిత్స తీసుకున్న తర్వాత కూడా పదే పదే లక్షణాలు కనిపిస్తుంటే కొన్నిసార్లు అది మానసికమైన కారణాల వల్ల కావచ్చేమోనని ఎలా అంచనా వేయవచ్చు లాంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. మానసిక సమస్యలు అనేక శారీరక వ్యవస్థలపై తమ ప్రభావాలను చూపవచ్చు. మానసిక సమస్యల కారణంగా కొన్ని శరీరంలో కనిపించే లక్షణాలెలా ఉంటాయో చూద్దాం. జీర్ణవ్యవస్థ పైన... గట్ ఫీలింగ్ అనే మాటను చాలామంది ఉపయోగిస్తుంటారు. ఫీలింగ్స్ మనసుకు సంబంధించిన భావన కదా... మరి జీర్ణవ్యవస్థ అయిన శారీరకమైన అంశంతో దాన్ని ముడిపెట్టడం ఎందుకు అని అనిపించవచ్చు. ఒక చిన్న పరిశీలనతో దీన్ని తెలుసుకోవచ్చు. ‘సెరిటోనిన్’ అనే స్రావం మానసిక ఉద్వేగాలకు కారణమవుతుంది. నిజానికి మానసిక అంశాలకోసం స్రవించడం కంటే... సెరిటోనిన్ అనేది జీర్ణవ్యవస్థలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆందోళన, వ్యాకులత జీర్ణవ్యవస్థలో మార్పులకు దారితీస్తాయి. దాంతో ఎసిడిటీ, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఆకలి వేయకపోవడం, వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ వ్యవస్థపై... మనసుకు తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు అది గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది. తీవ్రమైన దుఃఖం, ఉద్వేగాలు కొందరిలో గుండెజబ్బులకు దారితీస్తాయి. ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో మానసిక సమస్యలు ఉంటే అది మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు రక్తపోటులోనూ తేడాలు రావడం తెలిసిన విషయమే. ఒళ్లునొప్పులు... మానసిక సమస్యలు కొన్నిసార్లు ఒళ్లునొప్పులు, కండరాల నొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. మానసిక సమస్యలకూ, ఒంటినొప్పులకూ సంబంధమేమిటనే కోణంలో పరిశీలించినప్పుడు కొన్ని అంశాలు అబ్బురపరుస్తాయి. ఉదాహరణకు సెరిటోనిన్, అడ్రినలిన్ వంటి రసాయన స్రావాలు మానసిక సమతౌల్యతకు దోహదపడుతుంటాయి. ఈ రసాయనాలను ‘కెమికల్ గేట్స్’గా పరిగణిస్తారు. గేట్ అనేది అనవసరమైన వాటిని రాకుండా నిరోధించడం కోసం అన్నది తెలిసిందే. అలాగే ఈ రసాయన గేట్స్... అనవసరమైన అనేక సెన్సేషన్స్‌ను నివారించి, అవసరమైన వాటినే మెదడుకు చేరవేసేలా చూస్తాయి. కానీ డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు సెరిటోనిన్ వంటి ఈ ద్రవాలు తగ్గడంతో కెమికల్ గేట్స్ తమ కార్యకలాపాలను నిర్వహించలేవు. ఫలితంగా అవసరమైనవే కాకుండా అనవసరమైన సెన్సేషన్లు కూడా ఫిల్టర్ కాకుండా మెదడుకు చేరతాయి. దాంతో డిప్రెషన్ వంటి సమస్యలున్నప్పుడు... కొద్దిపాటి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లు తోచవచ్చు. చిన్న నొప్పి కూడా చాలా ఎక్కువగా అనిపించవచ్చు. ఇలాంటి ఈ పరిణామాన్నే ‘అన్ ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్ సిండ్రోమ్’ అని అంటారు. ఇలాంటప్పుడు దీర్ఘకాలిక వెన్నునొప్పి (క్రానిక్ బ్యాక్ పెయిన్), శరీరంలోని అనేక భాగాల్లో నొప్పులు, మెడనొప్పి, కండరాల నొప్పి వంటివి కలిగే అవకాశముంది. శరీరం లాగే మనసుకూ జబ్బూ.. మన సమాజంలో మానసిన సమస్యలను బయటకు చెప్పుకోలేని సమస్య (స్టిగ్మా)గా చూస్తుంటారు. మానసిక సమస్య అని చెప్పుకోవడం కష్టం కాబట్టి... మనసు వాటిని శారీరక లక్షణాలుగా మార్చి వ్యక్తం చేస్తుంటుంది. అయితే ఇది కాన్షియస్గా జరిగే ప్రక్రియ కాదు. బాధితులకూ / పేషెంట్లకూ ఇలా జరుగుతుందని తెలియదు. అధిక ఒత్తిడి వంటి కొన్ని మానసిక సమస్యలు ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ పనితీరూ తగ్గి అది శారీరక లక్షణాలుగా వ్యక్తమవుతుంది. అందుకే పరీక్షల సమయంలో లేదా పరీక్షలకు ముందు పిల్లల్లో / పెద్దల్లోనూ జ్వరాలు, జీర్ణ సమస్యలు, తలనొప్పి, కడుపునొప్పి, నిద్రలేమి... వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరానికి లాగే మనసుకూ జబ్బు వచ్చే అవకాశముందని గుర్తించి, అది ఏమాత్రం తప్పు కాదని గ్రహించి, తగిన మందులు తీసుకుంటే... ఈ సమస్యలు రావడం తగ్గిపోయి, మాటిమాటికీ డాక్టర్ షాపింగ్ చేస్తూ, డబ్బు, ఆరోగ్యం వృథా చేసుకునే అవస్థలూ తగ్గుతాయి. ∙ -
‘సామాజిక’ దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి
న్యూఢిల్లీ: అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోయేకంటే కాస్తంత సేపు వాటిని పక్కనబెడితే మానసిక ఆరోగ్యంతోపాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రూహర్–యూనివర్సిటీ బూచమ్, జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ► సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆర్యోగం మెరుగవడంతోపాటు వృత్తిజీవితం పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు ► సోషల్‌మీడియాలో ఆన్లైన్లో లేనపుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట ► ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పని చేసిన వాళ్లు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్‌మీడియా పక్కనబెడితే ‘అతిపని’ భావన కొంచెం తగ్గిందట ► పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్లు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు ► రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్‌మీడియాలో గడిపేవారిపై అధ్యయనం చేశారు ► అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా, మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరంపెట్టారు ► ఒక ఏడు రోజుల తర్వాత వారి పనిభారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది? వంటి ప్రశ్నలడిగి విశ్లేíÙంచారు. ► దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వే గాలను ‘సోషల్ మీడియా’ ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది ► కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు. ► వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇవిలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది. -
అనారోగ్యమంటూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారా?
కాంతిమతి ఒక ఐఏఎస్ ఆఫీసర్. మంచి కలెక్టర్‌గా ప్రజల గుర్తింపు పొందింది. ప్రస్తుతం సెక్రెటేరియట్‌లో కీలక స్థానంలో పనిచేస్తోంది. సమర్థమైన అధికారిగా మంత్రుల ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఆమెకు తన ఆరోగ్యం పట్ల విపరీతమైన శ్రద్ధ. ఏ చిన్న సమస్య వచ్చినా తీవ్రంగా ఆందోళన చెందుతుంది. మొహంపై చిన్న మచ్చ కనపడగానే తనకు స్కిన్ క్యాన్సర్ వచ్చిందేమోనని అన్ని పరీక్షలు చేయించుకుంది. అలాంటిదేం లేదని డాక్టర్లు చెప్పినా సమాధానపడలేదు. ఒకరోజు ఓ ముఖ్యమైన మీటింగ్‌లో ఉండగా గుండెలో ఏదో బరువుగా అనిపించింది. అంతే.. తనకు గుండెపోటు వచ్చిందని హడావుడిగా బయల్దేరి ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు చేసి అలాంటిదేమీ లేదని నిర్ధారించినా ఆమె మనసు శాంతించలేదు. మరో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. అక్కడ కూడా అదే మాట చెప్పినా.. డాక్టర్లు ఏదో మిస్ అవుతున్నారంటూ తన లక్షణాల గురించి ఇంటర్నెట్లో విపరీతంగా బ్రౌజ్ చేస్తుండేది. మరోసారి కడుపునొప్పికే నానా హంగామా చేసింది. అత్యవసరమైతే వైద్యులు అందుబాటులో ఉండరని క్యాంప్‌లకు వెళ్లడం మానేసింది. ఇదంతా ఆమె కెరీర్ పై కూడా దుష్ప్రభావం చూపుతోందని భర్త ఆనంద్ చెప్పినా పట్టించుకోవడం లేదు. తన సమస్యను అర్థం చేసుకోవడం లేదంటూ వాదిస్తోంది. దీంతో వాళ్ల మధ్య తరచూ గొడవలవుతున్నాయి. ఈ విషయమై మాట్లాడేందుకు సైకాలజిస్ట్‌ని సంప్రదించారు. వాళ్లతో మాట్లాడిన తర్వాత కాంతిమతి (ఐఏడీ) లేదా హెల్త్ యాంగ్జయిటీతో బాధపడుతోందని అర్థమైంది. చిన్న చిన్న లక్షణాలను కూడా పెద్ద పెద్ద జబ్బులుగా ఊహించుకోవడమే ఈ రుగ్మత ప్రధాన లక్షణం. సైకోడయాగ్నసిస్ ద్వారా ఆమె సమస్యను నిర్ధారించుకున్నాక సైకోథెరపీ ప్రారంభించారు. రెండు నెలల్లోనే ఆమె తన సమస్యను అధిగమించింది. అనారోగ్యం గురించే ఆలోచనలు.. ఐఏడీతో బాధపడుతున్న వ్యక్తులు కాంతిమతిలానే తీవ్రమైన అనారోగ్యం వస్తుందని భయపడుతూ ఉంటారు. ఈ అనారోగ్యం ఒక్కోసారి ఒక్కోటిగా ఉండవచ్చు. దీని లక్షణాలు.. ►జబ్బు బారిన పడతామనే ఆందోళనతో వ్యక్తులను కలవడం, వేరే ప్రాంతాలకు వెళ్లడం మానేయడం. వ్యాధులు, వాటి లక్షణాల గురించి నిరంతరం తెలుసుకోవడం, గుండె వేగం, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రతలను పదే పదే చెక్ చేసుకోవడం.చిన్న లక్షణం కనిపించగానే పెద్ద జబ్బు వచ్చిందని అనుకోవడం. ఉదాహరణకు దగ్గు రాగానే ఊపిరితిత్తుల క్యాన్సర్ అని అనుకోవడ. తన లక్షణాల గురించి ఇతరులతో పంచుకోవడం, భరోసా కోరడం. తన జబ్బేమిటో తెలుసుకునేందుకు పదే పదే వైద్యులను కలవడం.ఏ జబ్బూ లేదని డాక్టర్ చెప్పినా, పరీక్షల్లో తేలినా ఉపశమనం పొందకపోవడం బాల్యానుభవాలూ కారణం.. ఐఏడీకి కచ్చితమైన కారణం స్పష్టంగా లేదు. ఇది సాధారణంగా యుక్తవయస్సులో ప్రారంభమై వయసుతో పాటు తీవ్రతరమవుతుంది. సాధారణంగా ఈ కింది కారకాలు ఐఏడీకి దారితీస్తాయి. ►తమ ఆరోగ్యం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందే తల్లిదండ్రులుంటే పిల్లలకూ ఐఏడీ రావచ్చు · బాల్యంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడితే, ఆ తర్వాత చిన్న లక్షణం కూడా తీవ్రంగా భయపెడుతుంది · విపరీతమైన ఒత్తిడి, యాంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మానసిక ఆరోగ్య సమస్యలు · బాల్యంలో ఫిజికల్, ఎమోషనల్, సెక్సువల్ ఎబ్యూజ్కు గురైనప్పుడు · ఆరోగ్యం విషయంపై నిరంతరం ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడం. ఏం చెయ్యాలి? ►మొదట ఫ్యామిలీ డాక్టర్‌ను కలసి ఎలాంటి జబ్బు లేదనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. వారు చెప్పేది నమ్మాలి. పదే పదే ఇతర డాక్టర్లను కలవడం ఆపేయాలి. ► ఒత్తిడిని అధిగమించేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి. జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్ ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ► శారీరక చురుకుదనం మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపుతుంది. అందువల్ల శారీరకంగా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. ► పనిలో నిమగ్నమవ్వాలి. కుటుంబ, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. ► మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ► ఆందోళన కలిగించే లక్షణాల గురించి డాక్టర్‌తో మాత్రమే మాట్లాడాలి. ► జబ్బుల గురించి, వాటి లక్షణాల గురించి ఇంటర్నెట్లో వెతకడం మానుకోవాలి. అతిగా సమాచారాన్ని సేకరిస్తే అది గందరగోళానికి గురిచేసి ఆందోళన కలిగిస్తుంది. ► అప్పటికీ ఆందోళన తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ► కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) ద్వారా ఆందోళనను తగ్గించుకోవడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. ► బాడీ సెన్సేషన్స్ విషయంలో భయాలను గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలను థెరపీలో తెలుసుకోవాలి. -సైకాలజిస్ట్ విశేష్ - psy.vishesh@gmail.com -
Silent walking: మనతో మనం మాత్రమే
మార్నింగ్ వాక్కు గుంపుగా బయలుదేరుతారు కొందరు. తోడు లేనిదే కదలరు కొందరు. ఒంటరిగా బయలుదేరితే పాటలు వింటూ నడుస్తారు కొందరు. లేదా ఫోన్లు మాట్లాడుతూ ఉభయతారకంగా నడుస్తారు ఇక మనతో మనం ఉండేది ఎప్పుడు? ఇప్పుడు ‘సైలెంట్ వాకింగ్’ ట్రెండింగ్‌లో ఉంది. అంటే ఫోన్లు, సాటి మనుషులు ఎవరూ లేకుండా ఒక్కరే మనతో మనం ఉంటూ నడవడం. దీనివల్ల మానసికంగా, భౌతికంగా ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. ఉదయం ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు రిటైర్డ్ టీచర్ విశ్వనాథం. ఆయన తన అపార్ట్మెంట్లో ఉన్న ముగ్గురు నలుగురితో కలిసి ఉదయాన్నే వాకింగ్‌కు వెళతారు. ఫోన్ తీసుకువెళతారు. ఆ ముగ్గురు నలుగురు కలవగానే ఇక కబుర్లు మొదలు. నవ్వులు, పరిహాసాలు ఎలా ఉన్నా ఎంతలేదన్నా రాజకీయాలు చర్చకు వస్తాయి. ఆ తర్వాత ఇంట్లో సమస్యలు చర్చకు వస్తాయి. ఏవో పాత గొడవలు గుర్తుకు వస్తాయి. చిన్నపాటి వాదనలు జరుగుతాయి. ఈలోపు మెసేజ్‌లు, ఫేస్బుక్ చెకింగు, ఒక ఫోన్ కాల్ ఎవరిదో మాట్లాడటం... ఉదయాన్నే మనసు, శరీరం తేలిక కావాల్సింది పోయి బరువైపోతాయి. ఐ.టి. ఫీల్డ్‌లో పని చేసే అవివాహిత చందన సాయంత్రం ఇల్లు చేరుకుని వాకింగ్‌కు బయలుదేరుతుంది. హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ నడుస్తుంటుంది. ఆ పాటల్లో పూర్తిగా లీనం కాకుండా మెసేజ్‌లు, కాల్సూ వస్తూనే ఉంటాయి. పాటలు కూడా విన్నవే వినడం వల్ల కొత్త అనుభూతి కలగదు. పాటలు వినాలి కాబట్టి వింటున్నానా అనే సందేహం వస్తుంది. గృహిణి సుభాషిణి సాయంత్రం వీలు చూసుకుని ఎలాగో వాకింగ్‌కు బయలుదేరుతుంది. కాని ఆమె వాకింగ్‌కు బయలుదేరిన వెంటనే ఊళ్లో ఉన్న తల్లికి ఫోన్ చేయాలి. అది తల్లి ఆమెతో చేసుకున్న అగ్రిమెంట్. కూతురితో మాట్లాడకపోతే ఆమెకు తోచదు. సుభాషిణి వాకింగ్ మొదలెట్టి తల్లికి కాల్ చేయగానే తల్లి ఏవేవో విషయాలు ఏకరువు పెడుతుంది. కొన్ని ఫిర్యాదులు, కొడుకు మీద అభ్యంతరాలు, ఇంకేవో ఇరుగు పొరుగు గాసిప్... ఎంత లేదన్నా అలజడి కలిగిస్తాయి. ఇదా వాకింగ్ అంటే. ► సైలెంట్ వాకింగ్ విరుగుడు టిక్‌టాక్ ఇన్ఫ్లూయెన్సర్ మాడీ మాయో మొన్నటి సెప్టెంబర్‌లో ఈ ‘సైలెంట్ వాకింగ్’ను ప్రతిపాదించింది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచీలతో సహా అన్ని లంపటాలను వదిలి ఎవరితోనూ వాగుడు పెట్టుకోకుండా హాయిగా మౌనంగా మనతో మనం ఉంటూ నడవడం చాలా బాగుంది అని ఆమె పెట్టిన ఒక పోస్టు ఆమెను ఫాలో అయ్యే యువతకు నచ్చింది. అప్పటి నుంచి సైలెంట్ వాకింగ్ మెల్లమెల్లగా ప్రచారం పొందింది. ► మన గురించి ఆలోచిస్తున్నామా? మన గురించి మనం ఆలోచించుకోవడానికి, మన ఆలోచనలు పదును పెట్టుకోవడానికి, మన లక్ష్యం వైపు దృష్టి నిలపడానికి ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫోన్లు అడ్డం పడుతూనే ఉన్నాయి. ఆఖరుకు నడకలో కూడా ఏదో ఒక అంతరాయం. ఇంటి నుంచి బయటకు వచ్చినా ఇంటి నుంచి ఫోన్ వస్తే ఇక ఇంట్లో ఉన్నట్టే తప్ప బయట ఉన్నట్టు అనిపించదు. ‘సైలెంట్ వాకింగ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి మన ఆలోచనలు మనల్ని వినేలా చేస్తుంది... రెండు ప్రకృతిని విని స్పందించేలా చేస్తుంది’ అని ఒక సైలెంట్ వాకర్ చెప్పింది. మరో స్టూడెంట్ అయితే ‘ఫోన్లు పారేసి హాయిగా అరగంట సేపు నడిస్తే నాకు చాలా స్వేచ్చతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదీగాక నా చదువు మీద దృష్టి నిలుస్తోంది’ అని చెప్పింది. ► వొత్తిడి తగ్గుతుంది భవ బంధాలు తెంచుకున్నట్టుగా ఏ కమ్యూనికేషన్ లేకుండా కనీసం రోజులో 30 నిమిషాలు ఒక రకమైన ఏకాంత సమయం గడపడమే సైలెంట్ వాకింగ్. దీని వల్ల యాంగ్జయిటీ వంటివి తగ్గి మానసికంగా ఒక ప్రశాంతత వస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఐదు నిమిషాలు ఫోన్ కనపడకపోతే కంగారు పడేవారు అరగంట ఫోన్‌ను ఇంట్లో పడేసి బయట పడి నడిస్తే ఆ స్వేచ్ఛ మనసుకు దొరుకుతుంది. ఈ అరగంటలో కొంపలేమీ మునిగిపోవు అని తెలుస్తుంది. మన గుప్పిట్లో ఫోన్ ఉన్నంత సేపు మెడ మీద కత్తి వేళ్లాడుతున్న భావనే... ఎప్పుడు ఎవరు ఏ విధంగా డిస్ట్రబ్ చేస్తారో తెలియదు కదా. ధ్యానంలో కూడా మనల్ని మనం పరిశీలించుకోవడం, ఆలోచనలను పరిశీలించుకోవడం ముఖ్యం అంటారు. సైలెంట్ వాకింగ్‌లో నడుస్తూ అలాంటి పనే చేస్తాం. క్రిక్కిరిసిన జీవితంలో మనవైన ఆలోచనలకు చోటు ఇచ్చి, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ముందుకు పోయేందుకు దోహదం చేసేదే సైలెంట్ వాకింగ్. మౌన మునులుగా మారి రేపటి నుంచి మౌన నడకకు బయలుదేరండి. -
ఒంటరితనం వేధిస్తుందా? మానసిక ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి?
రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) జోడెద్దులా పల్లెల్లో సవారీ చేస్తుండగా.. ఇప్పుడు మానసిక రుగ్మతలూ వెంటాడుతున్నాయి. నిన్నా మొన్నటిదాకా పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ తాజాగా గ్రామీణ ప్రాంతాలకూ తాకడం ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నట్టే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మానసిక ఇబ్బందులతో వస్తున్న వారు ఎక్కువయ్యారని వైద్యులు తెలియజేస్తున్నారు. మెంటల్ హెల్త్ ప్రోగ్రాం స్క్రీనింగ్ పరీక్షల్లో తేలిందని వారు పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో రకరకాల మానసిక రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారు వేలాదిమంది ఉన్నట్టు బయటపడింది. స్క్రిజోఫ్రీనియా, డిప్రెషన్, మూడ్ డిజార్డర్స్ వంటి మానసిక జబ్బులతో సతమతమవుతున్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్టు వెల్లడైంది. స్కిజోఫ్రీనియా..యాంగ్జైటీలే ఎక్కువగా.. స్కిజోఫ్రీనియా (మనో వైకల్యం), యాంగ్జైటీ (ఆందోళన) ఎక్కువ మందిలో ఉన్నాయి. ప్రతి దానికీ డీలా పడిపోవడం, ఏమవుతుందోనని భయం, ఆందోళన వంటి జబ్బులతో సతమతమవుతున్నారు. వైద్యుల వద్దకు చికిత్సకు వెళ్లాలంటే కూడా ఆత్మన్యూనతగా భావిస్తున్నారు. ఇలాంటి మానసిక వ్యాధులు దీర్ఘకాలికంగా ఉండటంతో వృత్తిపరంగానూ ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండోనేషియలో స్కిజోఫ్రెనియా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక మనదేశంలో సుమారు 3 మిలియన్ల కంటే ఎక్కువమంది స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నారు. పనిఒత్తిడి, చిన్నచిన్న విషయాలకే ఆందోళన చెందడం వంటివన్నీ మానిసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. మానసిక రుగ్మతలకు ప్రధాన కారణాలు ► ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నకుటుంబాలు రావడంతో వేధిస్తున్న ఒంటరితనం. ► ఆరు సంవత్సరాల వయసు నుంచే సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉండటం. ► మద్యం, ఇతర మత్తుపదార్థాల వినియోగంతో యువకుల్లో మానసిక రుగ్మతలు పెరగడం. ► ప్రైవేటు లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో విపరీతమైన ఒత్తిడి. ► సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ వంటి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగడం. ► వ్యాయామం లేకపోవడం వల్ల చిన్న వయసులోనే జీవనశైలి జబ్బులకు గురవడం. ► ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో చిన్నారుల్లో మానసిక ఎదుగుదల సరిగా లేకపోవడం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
మానసిక ఒత్తిడి, మందులు వాడినా తగ్గడం లేదా? ఇలా చేయండి
పెరుగుతున్న జనాభాతోపాటు అన్ని రకాల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఏ వ్యాధైనా తొలిదశలో గుర్తించి, సరైన చికిత్స చేయించుకుంటే తగ్గిపోతాయి. మానసిక వ్యాధులు సైతం ఇలాగే తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ.. మానసిక వ్యాధిగ్రస్తులు అందరిలో ఒకరిలా ఉండలేకపోతున్నారు. ఏ విషయమైనా ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు. చిరునవ్వును ఆస్వాదించలేకపోతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురికావడం వల్లే మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని.. దీన్ని అధిగమించడానికి జీవితంలో పాజిటివ్ దృక్పథం పెంచుకుంటూ ఒత్తిడిని జయించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు. మహానుభావుల జీవితమే స్ఫూర్తి.. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు నెట్టేశారు. ఆ స్థానంలో సాధారణ వ్యక్తులుంటే అవమానం తట్టుకోలేకపోయేవారు. కానీ.. గాంధీ వారినే భారతదేశం నుంచి నెట్టేసే వరకు విశ్రమించలేదు. అవమానాన్ని పట్టుదలగా మార్చుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చే వరకు వెనుకడుగు వేయలేదు. అలాగే.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 91 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లు సినిమానే జీవితంగా గడిపారు. సుమారు 40 ఏళ్ల క్రితమే అనారోగ్యానికి గురయ్యారు. తనకు కేన్సర్ ఉందని తెలిసినా.. దానిని జయిస్తానని ధైర్యంగా గడిపారు. నైతిక విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ.. నిత్యం నకడ, మితాహారం, సమయానుకూలంగా నిద్ర, అందరితో స్నేహంగా, సంతోషంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. తాను సంతోషంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలిగితే అంతకు మించింది మరేదీ లేదు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మానసిక వ్యాధులు.. లక్షణాలు మనిషి శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్లకు సంబంధించిన మార్పుల వల్ల మానసిక వ్యాధులు పుట్టుకొస్తాయి. సెరటోనిన్ అనే రసాయన పదార్థం మెదడులోని నాడీ కణాల్లో తగ్గినప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఈ వ్యాధితో బాధ పడేవారు ఎప్పుడూ నిషాతో ఉండటం.. ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డోపమెన్ అనే రసాయన పదార్థం మెదడులోని కొన్ని భాగాల్లో ఎక్కువగా పెరగడంతో స్కిజోఫ్రినియా అనే వ్యాధి వస్తుంది. విచిత్రమైన అనుమానాలు, భయభ్రాంతులు, వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడులో సెరటోనిన్, అడ్రనలిన్ అనే రసాయన పదార్థాల హెచ్చుతగ్గులతో ఆనక్సిటీ వ్యాధి వస్తుంది. ఎసిట్రైల్ కోలిన్ అనే రసాయన పదార్థం తగ్గినప్పుడు మతిమరుపు వస్తుంది. బైపోలార్ డిజార్డన్ అనే వ్యాధికూడా రసాయనాల హెచ్చుతగ్గుల వల్ల వస్తుంటుంది. మంత్రాలు, తాయత్తులతో తగ్గదు మానసిక వ్యాధి వస్తే మంత్రాలు, తాయత్తులు కట్టించుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ విశ్వాసాలు ఎక్కువ. పట్టణాల్లోనూ కొన్నిచోట్ల ఈ సంస్కృతి కనిపిస్తోంది. మానసిక జబ్బులకు శాసీ్త్రయ వైద్యం ఒక్కటే పరిష్కార మార్గం. మందులు వాడినా తగ్గట్లేదు అనే ధోరణి ప్రజల్లో ఉంది. ఒక్కోసారి నెల పట్టొచ్చు. ఆరు నెలలైనా పట్టొచ్చు. కానీ మానసిక ఆరోగ్యానికి ఇదే మంచి మార్గం. ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా.. మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు. వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి. -
మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్!
మానసికంగా బాగుంటేనే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. మెంటల్‌గా బాగుంటేనే మన రోజూవారీ లైఫ్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి మనసే స్ట్రగులైతే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నిలువునా పతనం దిశగా తీసుకువెళ్లి మట్టుబెట్టేంత వరకు వదలదు ఆ మానసిక వ్యాధి. దీన్ని జోక్‌గా తీసుకోవద్దు. ప్రతిమనిషి మానసికంగా బలంగా ఉంటే దేన్నేనా అవలీలగా జయించగలడు అన్నది సత్యం. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక అనారోగ్యం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? తదితరాల గురించే ఈ కథనం.! మానసిక అనారోగ్యామే అని కొట్టి పారేయొద్దు. అది ఓ భయానకమైన వ్యాధి మనిషిని నిలువునా కుంగదీసి చనిపోయేలా ప్రేరేపిస్తుంది. ముందుగానే మేల్కొని బయటపడేందుకు ప్రయత్నించకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మానసికంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకి అనూహ్యంగా పెరుగుతుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా మనిషి అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తోంది. అయినా మానసిక రుగ్మత బారిన పడి మనిషి ఎందుకు విలవిల్లాడుతున్నాడు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఏం చేయలేను అనేంత స్థాయికి దిగజారి నిరాశ నిస్ప్రుహలోకి వెళ్లిపోతున్నాడు. ఎక్కడ ఉంది ఈ లోపం. వ్యవస్థలోనా? మనిషిలోనా ?అంటే.. మనిషి టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో పెడుతున్న పరుగులు తనకు తెలియకుండానే మనసుపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఎదుటి వాడు తనకన్న బెటర్‌గా ఉన్నాడనే అక్కసు, తాను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అన్న నిరాశ, తాను అనుకున్నవి సాధించలేకపోయాను అన్న నిట్టూర్పుతో.. ఢీలా పడి ఈ మానసిక రుగ్మత బారిన ఈజీగా పడి పోతున్నాడు. ఆ తర్వాత దీన్నుంచి బయటపడలేక గుంజుకుపోతున్నాడు. చివరికి తనను తాను అంతం చేసుకునేంత స్థితికి దిగజారిపోతున్నాడు. ఎలా బయటపడాలి..? ముందుకు కెరీర్ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే..దాన్ని వెంటనే మనసులోంచి తీసేయండి. అందరూ అన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించుకోండి. మొక్కలన్నింటి పువ్వులు ఉండవు. పుష్పించిన పూలన్నీ సుగంధాలు వెదజల్లవు. కానీ వాటికి ఉండే ప్రత్యేకత విభిన్నం, పోల్చదగినది కాదు. ఔనా!. సుగంధ భరితం కానీ పువ్వు ఔషధం అవుతుంది. సుగంధం వెద్దజల్లే పువ్వు అత్తరుగా మారతుంది. అలాగే మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనం కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయండి. మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోండి. రికార్డు స్థాయి విజయాలు కాకపోయినా పర్వాలేదు. మీదైనా చిన్ని ప్రపంచంలో మీరు సాధించింది ఎంత చిన్నవైనా అవి గొప్పవే. మీలా మీ స్థాయిలో ఉన్నవాళ్లు ఎవ్వరూ సాధించలేకపోయారు లేదా చేరుకోలేకపోయారు. కనీసం మీరు ప్రయత్నించారు, కొంత అయినా సాధించారు అని మనస్సు పూర్తిగా ఫీలవ్వండి, సంతోషపడండి. పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్ అనే పదం స్మరించండి. అది అన్నింటికీ అసలైన మందు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుంది. మీరు సాధించగలుగుతారు అనేది సత్యం అని చాలా బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పరారే. వియోగం వల్ల వచ్చే మానసిక బాధ.. మనకు నచ్చిన వ్యక్తి లేదా ఆత్మీయుడు మన సొంతం అనే వ్యక్తి కాలవశాత్తు లేదా ప్రమాదవశాత్తు దూరం అయినా మానసికంగ కుంగిపోవద్దు. ఇది సర్వసాధారణం. అందరి జీవితాల్లో జరిగేదే. కొందరికి చిన్నతనంలోనే నా అనేవాళ్లు దూరం అయితే మరికొందరికీ ఓ స్టేజ్‌లో దూరం అవ్వచ్చు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ముందుకు సాగిపోండి. అదే ప్రేమికులు/భార్యభర్తలు విడిపోయినా లేదా చనిపోయినా మీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ తీర్చలేనిది తట్టుకోలేనిది ఒప్పుకుంటాం. కొందరూ మన జీవిత ప్రయాణంలో కొంత వరకే. వారి జ్ఞాపకాలు మన వెంట పదిలంగా ఉంటాయి. గుండె నిండా శ్వాస పీల్చుకుని వారిని గుర్తు చేసుకోండి అలానే ఎందుకు దూరం అయ్యారని బాధపడొద్దు. మీకు తీరని ద్రోహం చేసి నిలువునా మోసం చేసి వెళ్లిపోయారని అస్సలు చింతించొద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇదొక గుణపాఠంగా తీసుకో. నీ స్థాయికి సరిపోని వాడు అని గడ్డిపరకను తీసిపడేసినట్టు పడేయి. నీ మనసు పట్టి పీడుస్తున్న వేదన దూదిపింజలా తేలిక అయిపోతుంది. మనిషి ఎంతో తెలివైన వాడు. అసాధ్యలన్నింటిని సాధించగలుగుతాడు. తనలాంటి సాటి మనుషుల చేతిలో మోసపోయిన, ధగ పడితే మాత్రం తిరిగి లేచి నిలబడలేక విలవిలలాడతాడు. ఎందుకిలా? 'ఓ మనిషి' నీకు మహాశక్తి ఉంది. మెలి పెడుతున్న మనుసును మధించి సరైన మార్గంలో పెట్టి దూసుకుపోవాలి. గమ్మతైన మనసు కథ.. మనల్ని ఎంతో ప్రేమించి మనమే సర్వస్వం అనుకునే వాళ్లని ప్రతి క్షణం స్మరించం. కానీ మనల్ని బాధపెట్టిన వాడిన మన మనసు పదే పదే గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. నీలో నీవే తిట్టుకుంటూ, భోంచేసినా, కూర్చొన్నా, అతడినే గుర్తు తెచ్చుకుంటావు. మనకు ఇష్టం లేకపోతే మనకు నచ్చిన స్వీట్ అయినా పక్కన పెడతాం. అలాంటిది మనకు నచ్చని వ్యక్తి, వేదన పాలు చేసిన వాళ్లను, వాళ్ల తాలుకా గాయాలను ఎందుకు తలుచుకుంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా?. కనీసం ఛీ! వీడు నన్ను ఇంతలా బాధపెట్టాడు గుర్తు తెచ్చుకోవడమే పాపం అని గట్టిగా మీరు అనుకున్నట్లయితే. ఏ మానసిక సమస్య మీ దరిదాపుల్లోకి రాగలదు. జీవితం సాఫీగా సాగితే నీ గొప్పదనం ఉండదు. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుంది. అదే నీ గొప్పతనన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశం. దురదృష్టవంతుడివి కాబట్టి కష్టాలు రాలేదు. నువ్వు తట్టుకోగల సమర్థుడువి కాబట్టే నీకు వచ్చాయి. అవే రాకపోతే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. పైగా నువ్వు గొప్పోడివి అని చూపించుకునే అవకాశం ఉండదు. మిత్రమా! సాధించలేకపోవడంలోనే సాధన ఉంది. కోల్పోవడంలోనే పొందడం ఉంది. ఇదే నిజం! కూల్‌గా ఆలోచించి.. మనో చిత్తాన్ని పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృఢం ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వండి. సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
40లలో ఉన్నారా?.. జీవన సరళిలో ఈ మార్పులు తప్పవ్..!
మనిషి జీవితం 40 ఏళ్ళకి ముందు ఒకలా, ఆ తరువాత మరొకలా ఉంటుంది. బాధ్యతలు పెరగటం వల్ల, శరీర మార్పుల వల్ల, రకరకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతం కావడం మొదలవుతుంది. అందుకే ఆ వయసుకి రాగానే మన జీవన సరళిలో మార్పులు చేయాలి. ఆ మార్పులేమిటో తెలుసుకుని వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాం. జీవన సరళిలో చేసుకోవాల్సిన మార్పులు నాలుగు పదుల వయసు వచ్చేసరికి కండరాల్లో సాంద్రత తగ్గుతూ ఉంటుంది. రక్త సరఫరా కూడా నెమ్మదిస్తుంటుంది కాబట్టి, దినచర్యలో వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అన్నం పరిమాణాన్ని తగ్గించాలి. తాజాఫలాలు ఎక్కువ తీసుకోవాలి. కాల్షియం లెవెల్స్ తీసుకోవడం పెంచండి. కంటిచూపు మందగించకుండా విటమిన్ ఎ, సి ఉండే పదార్థాలు తినాలి. మొబైల్స్, ల్యాప్ టాప్ వాడకం తగ్గించాలి. ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే నీళ్ళు బాగా తాగాలి. వయసు, బరువు, ఎత్తు, బాడి మాస్ ఇండెక్స్ చూసుకోండి. ఫ్యాట్ ఉంటే కరిగించండి. బలహీనంగా ఉంటే బరువు పెంచండి. విటమిన్ ఎ, సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధకశక్తి పెంచుకోవాలి. మెంటల్ హెల్త్ బాగుండాలంటే ప్రశాంతంగా ఉంటూ తగినంత నిద్ర పోవడం అవసరం. (చదవండి: పిల్లల ఎముకలు బలంగా పెరగాలంటే..) -
ఇంటి ప్రేమే అసలు వైద్యం
సమాజంలో టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్ పెరిగిందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆత్మహత్యలు తార్కాణాలుగా నిలుస్తూనే ఉన్నాయి. కాని తల్లిదండ్రులు మేల్కొనడం లేదు. టీనేజ్‌లో ఉన్న పిల్లల మూడ్స్‌ను గమనించి వారిని అక్కున చేర్చుకోవాల్సింది మొదట తల్లిదండ్రులే. వైద్యం మొదలవ్వాల్సింది ఇంటి నుంచే. డిప్రెషన్ సూచనలు కనిపించే పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం. ఏదో భయం. ఆందోళన. తల్లిదండ్రుల అంచనాకు తగినట్టు లేనని భయం. మార్కులు తగినన్ని తేలేకపోతున్నానని భయం. పాఠాలంటే భయం. పరీక్షలంటే భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. స్నేహితులు లేరని భయం. స్నేహితులతో స్నేహం చెడుతుందేమోనని భయం. ఎవరితో చెప్పుకోవాలో తెలియని భయం. ఎవరితోనూ చెప్పుకోలేనేమోనని భయం. టీనేజ్ పిల్లలు ఎదిగీ ఎదగని లేత వయసు పిల్లలు. వారికి అన్నీ సందేహాలే. ఆందోళనలే. మన దేశంలో 13–17 ఏళ్ల మధ్య ఉన్న దాదాపు కోటిమంది టీనేజ్ పిల్లలు డిప్రెషన్ బారిన పడుతున్నారని ఒక అంచన. డిప్రెషన్లో భయం, ఆందోళన ఉంటాయి. ఈ వయసులో మొదలైన డిప్రెషన్ కొందరిని ముప్పైల్లో, నలబైల్లో ప్రవేశించే వరకు వెంటాడుతుంది. కొందరిని జీవితాంతం వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న పిల్లలు చీమను కూడా భూతద్దంలో చూసి భయపడతారు. తమ సమస్యకు సమాధానం లేదేమో, ఎవరి నుంచీ దొరకదేమో అనిపించడమే డిప్రెషన్ అత్యంత ప్రమాదకరమైన స్థితి. సమస్యకు పరిష్కారం చావు అనిపించడం దీని పర్యవసానం. ఇంతవరకూ వచ్చే లోపు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటే వారు ఆ స్థితిని దాటుతారు. లేదంటే అపాయంలో పడతారు. కారణాలు టీనేజ్ పిల్లల్లో డిప్రెషన్, యాంగ్జయిటీ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తేల్చలేము. చదువుకు సంబంధించిన ఒత్తిడి, తల్లిదండ్రులతో బలమైన అనుబంధం మిస్ కావడం, ర్యాంకుల బరువు, భవిష్యత్తుపై బెంగ, రూపం గురించిన చింత, మెదడులో అసమతుల్యత... ఏమైనా కావచ్చు. మనదేశంలోని సీబీఎస్ఈ స్కూళ్లల్లో సర్వే చేస్తే చాలామంది పిల్లలు తమకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరని చెప్పారు. లక్షణాలు ఉత్సాహం చూపకపోవడం, చిరాకు, కోపం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, నిద్ర సరిగా ఉండకపోవడం, అలసట, ధ్యాస లేకపోవడం, సరిగా చదవలేక పోవడం... ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులు, తదుపరి స్కూళ్లు శ్రద్ధ వహించాలి. ► తల్లిదండ్రులు టీనేజ్‌లో ఉన్న పిల్లలతో నిత్యం సంభాషణ జరపాలి. వారితో కూచుని వారు నిస్సంకోచంగా తమ సమస్యలు చెప్పుకోనివ్వాలి. వారు చెప్పేది కొట్టేయకుండా, బదులు తిట్టకుండా అర్థం చేసుకోవాలి. సమస్య మూలాల వరకూ వెళ్లాలి. వారికి చాలా ప్రేమను ఇస్తూ కౌన్సిలింగ్ చేయాలి. రెండు శాతం కంటే తక్కువ మంది పిల్లలకు మందులతో వైద్యం అవసరం కావచ్చు. ► తల్లిదండ్రులు పిల్లల శ్రద్ధ, శక్తిని అంచనా వేస్తూ వారికి లక్ష్యాలు ఇవ్వాలి. వారికి పూర్తిగా ఇష్టం లేని, వారు చేయలేని చదువులో ప్రవేశ పెట్టరాదు. వారు గట్టి స్నేహితులు కలిగి ఉండేలా చూడాలి. ఆ స్నేహితులను ఇంటికి ఆహ్వానించి పిల్లలు వారితో గడిపేలా చేయాలి. పిల్లలను గాయపరిచే మాటలు తల్లిదండ్రులు మాట్లాడటం బొత్తిగా మానుకోవాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. ► స్కూళ్లు విధిగా కౌన్సిలర్లను ఉంచాలి. తరగతి వారీగా, ప్రతి విద్యార్థిని మెంటల్ హెల్త్ విషయంలో అంచనా కట్టాలి. వారి సమస్యను అర్థం చేసుకుని టీచర్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించడమే కాక తల్లిదండ్రులకు సమస్య తెలపాలి. అసలు సమస్య మనదేశంలో దాదాపు 4 వేల మంది సైకియాట్రిస్ట్‌లు, వెయ్యి మంది క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఉన్నారు. వీరంతా పెద్ద ఆస్పత్రుల్లో లేదా సొంత క్లినిక్‌లలో ఉంటారు. టీనేజ్ పిల్లలకు వీరితో యాక్సెస్ ఉండదు. స్కూళ్లల్లో మానసిక సమస్యలు గమనించి భరోసా ఇచ్చే కౌన్సెలర్ల వ్యవస్థ ఇప్పటికీ ఏర్పడలేదు. ప్రభుత్వ బడులలో చదివే పిల్లలకు తమకు మానసికంగా ఇబ్బంది ఉన్నట్టు గ్రహించడం కూడా తెలియదు. కనుక పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే వరకూ వెళుతున్నారు. -
ఒత్తిడి కూడా మంచిదే!.. స్ట్రెస్ పెరిగిపోయిందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అందుకు కారణాలు లేకపోలేదు. జీవనశైలిలో మార్పులు, తినే ఆహారం, మానసిక ఆందోళన, ఆర్థిక ఇబ్బందులు.. తదితర కారణాల వల్ల డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఇలాగే ఒత్తిడిలోనే ఎక్కువ కాలం గడిపేవారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అదుపులో ఉంచుకోకపోతే ఇతర అనారోగ్యాలూ చుట్టుముట్టే ప్రమాదం ఉంది. మరి మానసిక ఒత్తిళ్ల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? అన్నది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నవీన్ నడిమింటి మాటల్లోనే తెలుసుకుందాం. మనసుకు కష్టం కలిగినప్పుడు మెదడు ఎంతో ఒత్తిడికి గురవుతుంది. తక్కువ స్థాయిలో ఉండే ఒత్తిడి ఉద్రిక్తత.. కొన్ని సందర్భాల్లో లాభదాయకంగానే ఉంటుంది. ఉదాహరణకు.. ఒక ప్రాజెక్ట్ లేదా ఏదైనా పనిని నిర్వహిస్తున్నప్పుడు తక్కువ స్థాయిలో కలిగే ఒత్తిడి మనం చేసే పనిని మరింత కేంద్రీకరించి పనిని మరింత, శక్తివంతంగా, ఉత్సాహవంతంగా పూర్తి చేసేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడిలో రెండు రకాలున్నాయి. వాటిలో స్ట్రెస్ (‘అనుకూలవంతమైన ప్రోత్సాహకరమైన ఒత్తిడి’)డిస్ట్రెస్ ‘ప్రతికూలమైన, నిరుత్సాహకరమైన ఒత్తిడి‘( ఛాలెంజ్ మరియు అదనపు బరువు) ఒత్తిడిని తట్టకునేందుకు చాలామంది పొగత్రాగడం, మద్యం సేవించడం, అతిగా తినడం, ఎక్కువ గంటలు నిద్రపోవడం, ఇతరులపై విరుచుకుపడటం, కోపంతో అరిచేయడం వంటివి చేస్తుంటారు. కానీ వీటివల్ల మంచి జరగడం పక్కపపెడితే ఎక్కువగా చెడు జరుగుతుంది. అందుకే స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకునేందుకు డా. నవీన్ నడిమింటి సలహాలు మనసు భారంగా, ఒత్తిడిగా అనిపిస్తే కాసేపు వాకింగ్‌కు వెళ్లండి ప్రకృతి అందాలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేయండి ఒక మంచి స్నేహితుడితో మాట్లాడండి. రిలీఫ్‌గా అనిపిస్తుంది వ్యాయామానికి మించిన పని ఇంకొకటి ఉండదు. జర్నల్ రాయడానికి ప్రయత్నించండి. వెచ్చటి కప్పు కాఫీ, టీ తాగండి. సువాసన వెదజల్లే ఓ కొవ్వొత్తిని వెలిగించండి. మీ పెంపుడు జంతువులతో కాసేపు కాలక్షేపం చేయండి మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ఫన్నీ మూవీస్ చూడండి. గార్డెనింగ్ అలవాటు చేసుకోండి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఏం చేయాలన్నది మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. తీరిక వేళల్లో మీకు సంతోషాన్ని పనులు చేయండి. పియానో వాయించడమో, పాటలు పాడటమో..ఇలా ఏదైనా సరే మీకు నచ్చింది చేయండి. ఇవి చాలా అవసరం... ఆహారాన్ని మెరుగుపరచే గ్రూప్ బి, విటమిన్లు, మెగ్నీషియం చాలా ముఖ్యమైనవి. ఒత్తిడి నుంచి కాపాడుకోవడానికి విటమిన్-సి చాలా అవసరమైనది. విటమిన్ డి శరీర పోషణకు, మెదడుకు సరిపోయినంత స్ధాయిలో ఖనిజాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఐటెమ్స్, అధికంగా ఉప్పు ఉండే పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
దేశంలోనే తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స!
ముంబై: ముంబై వైద్యులు తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స నిర్వహించారు. 2017లో మానసిక ఆరోగ్యచట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి డిప్రెషన్ సర్జరీ ఇదేకావడం విశేషం. ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ గత 26 ఏళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. మహారాష్ట్ర మెంటల్ హెల్త్ బోర్డు అనుమతితో జస్లోక్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్ డాక్టర్ పరేఖ్ దోషి నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించింది. దీనిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) సర్జరీ అని అంటారు. పార్కిన్సన్స్ దగ్గర్నుంచి నరాల వ్యవస్థలో లోపాల కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధులకి డీబీఎస్ శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తారు. -
Hyderabad: మహానగరంలో మానసిక కల్లోలం!
సాక్షి, హైదరాబాద్ : ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో చాలా మందిలో వయసులకు అతీతంగా ఆత్మహత్య ధోరణులు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యంలో వచ్చి న మార్పులపై ఇప్పటివరకు సుమారు 2,500 మంది నగరవాసుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చి నట్లు పేర్కొంది. అయితే సర్వే ఇంకా కొనసాగుతోందని... మరో నెల తర్వాత ఈ అంశంపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని సర్వే బృందానికి నేతృత్వం వహిస్తున్న వారిలో ఒకరైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెడికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ బి.ఆర్.షమన్నా తెలిపారు. దేశంలో కోవిడ్ విజృంభణకు ముందు, తర్వాత అర్బన్ ప్రాంతాల ప్రజల మానసిక ఆరోగ్య పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వచ్చి న నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహిస్తోంది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–పార్ట్ 2 పేరిట హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలలో ఈ అధ్యయనం చేపడుతోంది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ అధ్యయనానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎర్రగడ్డలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లు ఇన్వెస్టిగేటర్లుగా వ్యవహరిస్తున్నాయి. అన్నింటినీ టచ్ చేస్తూ... సాధారణ సర్వేల రీతిలో ఇందులోనూ 75 ప్రశ్నలు ఉన్నప్పటికీ పరిస్థితినిబట్టి మార్పుచేర్పులకు అవకాశం ఇస్తూ మొత్తం 300 ప్రశ్నలు ఉన్నాయి. లాటరీ వ్యసనం, గుర్రపు పందేలు, స్ట్రీమింగ్ వీడియోలతోపాటు ఇంటర్నెట్, మొబైల్ వ్యసనం వంటి అంశాలపై ప్రశ్నలను కూడా చేర్చారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి మానసిక స్థితిని ఎదుర్కొన్నారు వంటి ప్రశ్నలు పొందుపరిచారు. కోవిడ్ తర్వాత ప్రజల మానసిక ఆరోగ్య భారాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. బస్తీల్లో సై...కాలనీల్లో నై.. సర్వే కోసం నగరంలో 60 క్లస్టర్లను గుర్తించగా అందులో 20 మురికివాడల్లోనే ఉన్నాయి. మురికివాడల నివాసితులు అనేక వ్యసనాలతోపాటు ఇతర సమస్యలతో సతమతమవుతున్నా సర్వే ప్రశ్నలకు తక్షణమే సమాధానాలిస్తున్నారని బృంద సభ్యులు అంటున్నారు. అదే సమయంలో కాలనీల్లో నివసించే ప్రజల నుంచి సమాధానాలు పొందడం కఠినంగా ఉందని... తమ ప్రశ్నలకు చాలా మంది ఎదురుప్రశ్నలు వేస్తున్నారని వివరిస్తున్నారు. తమ కోసం సమయం వెచ్చి ంచడానికి తేలికగా ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. టీనేజర్ల నుంచి... సర్వే బృందాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3,600గా తీసుకున్న శాంపిల్ సైజ్‌లో టీనేజర్లు సహా ఆపై వయసుగల వారు ఉన్నారు. వారందరినీ ముఖాముఖి ప్రశ్నించి సమాధానాలు సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని సర్వేకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)కు ఏ రోజుకారోజు అప్లోడ్ చేస్తున్నారు. ఈ సర్వే జూన్ నెలాఖరులోపే పూర్తవుతుందంటున్న పరిశోధకులు... నగరంలో రోహింగ్యాలు, ట్రాన్స్జెండర్ల వంటి వారిని కూడా ప్రత్యేక కేటగిరీగా చేర్చి సర్వే చేయవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అన్ని చోట్లా పూర్తయ్యాకే స్పష్టత... అన్ని నగరాల్లో పూర్తి సర్వే ఫలితాలు వచ్చాకే స్పష్టత వస్తుంది.బెంగళూరు, ముంబైలలో అధ్యయనాలు పూర్తి కావచ్చాయి. చెన్నై, హైదరాబాద్‌లలో దాదాపుగా ఒకేస్థాయిలో ఉన్నాయి. ఢిల్లీ, కోల్‌కతాలలో సర్వేలు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. ఆయా నగరాలకు చెందిన అధ్యయన ఫలితాలు కూడా వచ్చాక ‘నిమ్హాన్స్’వాటిని విశ్లేషించి మరో నెల రోజుల్లోపూర్తి వివరాలు వెల్లడిస్తుందని భావిస్తున్నాం. - ప్రొ. బి.ఆర్.షమన్నా మెడికల్ సైన్సెస్ స్కూల్, హెచ్‌సీయూ -
ప్రమాదం అంచున మనదేశం
మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కొంతమంది తమ ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెడతారు. మరికొందరు ‘నాకేమండీ, ఏ జబ్బూ లేదు’ అని ధీమాగా చెప్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షేమంగా ఉండటమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అలాగే మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం ఉండదని హెచ్చరిస్తోంది. కానీ మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మానసిక సమస్యలగురించి మాట్లాడుకోం. మానసిక సమస్యల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలే అందుకు కారణం. ఒక సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో కలిశారంటే.. పిచ్చి అని ముద్ర వేస్తారేమోననే భయం. ఈ అపోహలను, భయాలను దూరం చేసేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ‘మే’నెలను ‘మెంటల్ హెల్త్ మంత్’గా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మానసిక ఆరోగ్యం స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యమంటే ఒక వ్యక్తి సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా క్షేమంగా ఉండటం. బాలెన్స్డ్ మైండ్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావోద్వేగాల్లో బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మానసిక అనారోగ్యం వస్తుంది. దీర్ఘకాలికంగా కొనసాగే తీవ్రమైన ఒత్తిడి, జీవసంబంధ కారకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు కూడా మానసిక సమస్యలకు కారణమవుతాయి. దాదాపు 250కి పైగా మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫోబియా, ఈటింగ్ డిజార్డర్స్, మానసిక ఒత్తిడి సాధారణ మానసిక రుగ్మతలు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, క్లినికల్ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ, పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటిలో కొన్నిటికి కౌన్సెలింగ్, సైకోథెరపీ సరిపోగా, మరికొన్నిటికి మందులు అవసరమవుతాయి. కానీ అన్నింటినీ ‘పిచ్చి’ అనే పరిగణించడం వల్ల కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. అపోహలను ఎలా ఎదుర్కోవాలి? మానసిక రుగ్మతలను పరిష్కరించుకోవాలంటే ముందుగా వాటి పట్ల ఉన్న అపోహలను ఎదుర్కోవాలి. అందుకోసం మీడియాతో పాటు మనమందరం కృషి చేయాలి. అందుకోసం ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి. మానసిక అనారోగ్యం సర్వసాధారణం. అది మానసిక బలహీనతకు సంకేతం కాదు. గణాంకాలను చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మానసిక రుగ్మత లక్షణాలు కనిపించగానే ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి. మీరూ, మీ సమస్య వేర్వేరు. మీ సమస్యతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవద్దు. మీకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉంటే, ‘నేను బైపోలార్’ అని కాకుండా ‘నాకు బైపోలార్ డిజార్డర్’ ఉంది అని చెప్పండి. మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేనివారి నుంచి మీకు వివక్ష ఎదురుకావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్యను అర్థం చేసుకోలేకపోవడం వారి సమస్యగా పరిగణించండి. మానసిక అనారోగ్యం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు. కాబట్టి దాని గురించి మాట్లాడండి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు దూరమవుతాయి. మానసిక అనారోగ్యాల గురించి సరైన వ్యక్తుల నుంచి, సరైన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారంలో పెట్టండి. మానసిక రుగ్మత లక్షణాలు నిరంతర ప్రతికూల ఆలోచనలు మరణం లేదా ఆత్మహత్య గురించి ఆలోచించడం ఏకాగ్రత లోపం ఎనర్జీ లెవెల్స్‌లో తీవ్ర మార్పులు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవడం నియంత్రించలేని ప్రవర్తన, కోపం, విచారం ఎవరికీ వినిపించని శబ్దాలు వినిపించడం, రూపాలు కనిపించడం ఆత్మహత్యల రాజధానిగా దేశం మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు సాధారణ, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరంలో 2.6 లక్షల ఆత్మహత్య కేసులతో భారతదేశం ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా మారడం బాధాకరమైన విషయం. భారతదేశంలో ప్రతి లక్ష మందికి సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. మానసిక నిపుణుల కొరత దేశవ్యాప్తంగా కేవలం 43 ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. 11,500 మంది సైకియాట్రిస్టులు అవసరంకాగా కేవలం 3800 మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే నాలుగు లక్షల మందికి ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఉన్నారు. 17,250క్లినికల్ సైకాలజిస్టులు అవసరం కాగా కేవలం 900 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, సైకియాట్రిక్ నర్సులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. - సైకాలజిస్ట్ విశేష్ -
జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు
సాక్షి, అమరావతి: మానసిక ప్రశాంతత లేని కొలువుల్లో పనిచేసేది లేదని భారతీయ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోవిడ్–19 తర్వాత ఉద్యోగులు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించారు. అమెరికా ఆధారిత వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ సంస్థ యూకేజీ నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలో 88 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదించింది. ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్‌లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కుటుంబానికే తొలి ప్రాధాన్యం భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్‌తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది. ఒత్తిడి ఇంత పని చేస్తోందా! 33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది. ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్ వర్క్ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్ సుమిత్ దోషి చెప్పారు. -
జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం
మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్‌ఫ్లూయెంజా వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ భారత్‌లో ఇలా.. ►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు ► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. ►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. ►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. ►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. ►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. ►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. – డాక్టర్ బి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
ఇల్లే నయా జిమ్
సాక్షి, అమరావతి: శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి ‘ఫిట్నెస్’ మంత్రం జపిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల ముప్పును తప్పించుకునేందుకు అత్యధికులు వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పట్టణాలు, నగరాలతోపాటు సెమీ అర్బన్, సబ్ అర్బన్ ప్రాంతాల్లోనూ ‘హోమ్ జిమ్’ ట్రెండ్ పెరుగుతోంది. గుండె ఆరోగ్యంపై దృష్టి గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడటం వలన కార్డియోవాస్కులర్ వ్యాయామ పరికరాలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవే మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ట్రెడ్మిల్స్, స్టేషనరీ బైక్‌లు, రోయింగ్ యంత్రాలు, ఎలిప్టికల్స్ ఉన్నాయి. భారత్ టాప్.. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో గత ఏడాది గృహ ఫిట్నెస్ పరికరాల పరిశ్రమ మార్కెట్ విలువ 13,741.23 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆసియన్–పసిఫిక్ దేశాల్లోనే అత్యధిక మార్కెట్ విలువగా నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలు అత్యధికంగా ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. దేశంలో భౌగోళికంగా చూస్తే పశ్చిమ, మధ్య భారతం అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. ఇక్కడ పట్టణీకరణ, పెరుగుతున్న తలసరి ఆదాయం దీనికి కారణంగా తెలుస్తోంది. తూర్పు, దక్షిణ భారత దేశంలోనూ ఫిట్నెస్ మార్కెట్ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వృద్ధి దేశంలో ఇటీవల గృహ వ్యాయామ పరికరాల కొనుగోలులో 45 శాతం ఆన్లైన్ ఆర్డర్లు పెరిగాయి. ముఖ్యంగా ట్రెడ్మిల్స్, ఎక్సర్సైజ్ బైక్‌లు, డంబెల్ సెట్లు, బెంచ్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. సుమారు రూ.1,300–రూ.2,000 ధరలో వివిధ రకాల బరువులు, రాడ్లు, వెయిట్ బార్లు, జిమ్ ఉపకరణాలు లభిస్తున్నాయి. మరోవైపు యోగా మ్యాట్లు, రెసిస్టెన్స్ బ్యాండ్లు, ఫోమ్ రోలర్లు, టమ్మీ ట్రిమ్మర్లు వంటి సులభమైన వ్యాయామ పరికరాల విక్రయం విరివిగా ఉంటోంది. ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గత సంవత్సరం దాదాపు ఏడు రెట్లు పెరిగింది. చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకే పరికరంపై 3కు పైగా వివిధ రకాల వ్యాయామాలు చేసుకునేలా డిజైన్లు చేస్తున్నాయి. ‘స్మార్ట్’గా వాడుతున్నారు ఫిట్నెస్ యాప్‌ల డౌన్లోడ్లు భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగాయి. 2023లో స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్ల వంటి వేరియబుల్ టెక్నాలజీలు సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. దీంతోపాటు ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్/వర్చువల్ ఫిట్నెస్ సెషన్లు పెరగనున్నాయి. ఇంతకు ముందు ఆన్లైన్ శిక్షణ గురించి పెద్దగా అవగాహన లేనివారు కూడా ఇప్పుడు ఆన్లైన్ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండటం విశేషం. ఆసక్తి పెరిగింది కోవిడ్ తర్వాత హోమ్ జిమ్‌లు పెరిగాయి. తక్కువ ధరల్లో వ్యాయామ పరికరాలు వస్తుండటం, ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో చాలామంది స్వయంగా వ్యాయామాలు చేయడం నేర్చుకుంటున్నారు. కొంతమంది మా లాంటి ట్రైనర్స్‌ను పెట్టుకుంటున్నారు. హోమ్ జిమ్ ఇంటిల్లిపాదికి ఎంతగానో ఉపయోగపడుతోంది. – సందీప్, ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ -
మానసిక ఆరోగ్యం మీ గదే మీ మది
చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. కేస్ స్టడీ 1: సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్ ప్లాట్‌ఫామ్ నీట్‌గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది. కేస్ స్టడీ 2: రాజేశ్వరి ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్‌పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్ ఆఫ్. ఇలా రోజు జరగడం అవసరమా? కేస్ స్టడీ 3: సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్‌లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో. రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి. 1. ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్‌గా సర్దుకోవచ్చు. 2. లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్ఫెక్ట్గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత. 3. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది. 4. ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్‌లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్‌గా చేసుకుంటూ రావడమే మంచిది. 5. పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది. -
Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది. ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది. తేలిక భావన మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్‌కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు. డబుల్ బైండ్ ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’ అసమానతకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు. భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!) న్యాయమైన వాటా పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది. -
అటెన్షన్‌గా లేకపోతే టెన్షనే! బయటపడటం కష్టమా? డాక్టర్లు ఏమంటున్నారు?
మారుతున్న కాలానికి అనుగుణంగా మానసిక జబ్బులకు గురవుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వైద్యుల పరిశీలనలతో వెల్లడింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో కలవకపోవడం, పలకరించినా స్పందించకపోతుండటంతో సదరు వ్యక్తులను తీసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలోని సర్వజనాసుపత్రికి మానసిక రుగ్మతలతో వస్తున్న వారిని పరిశీలించగా.. మానసిక ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. సగటున 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తేలింది. చాలా మంది మహిళలు లేదా పురుషులు ఈ రుగ్మతలు ఉన్నట్లు కూడా తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తుండటంతో తీవ్రత పెరిగాక వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో.. మగవాళ్లు ఎందుకు ఎక్కువ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో చిన్న చిన్న శారీరక సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారని తేల్చారు. జలుబు, దగ్గు లాంటివి ఎక్కువ రోజులు వేధించినా వారు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. చిన్న విషయానికే నిరాశ.. వాస్తవానికి చెడు అలవాట్లు ఆడవాళ్లలో చాలా తక్కువ. అయినా సరే నిరాశకు గురై మానసిక ఆందోళన చెందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ (నిరాశ)కు గురవున్నారు. మహిళలు చిన్న చిన్న కుటుంబ విషయాలకు కూడా తీవ్రంగా స్పందించడం, ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటు న్నారని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక.. ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళన చెందుతున్నారనేది వైద్యుల అభిప్రాయం. పట్టించుకోకపోతే ముప్పే.. మానసిక రుగ్మతలను పట్టించుకోకపోయినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటివి పెరిగిపోవడంతో అసిడిటీ, అల్సర్ లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాయదుర్గానికి చెందిన 42 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించారు. అతను పనిచేసే ఆఫీసులో తీవ్ర ఒత్తిడి ఉంది. బాస్ నిత్యం వేధిస్తున్నారన్న భావన నెలకొంది. దీంతో రోజు రోజుకూ మానసికంగా కుంగిపోయి సొంతవూరికి వచ్చేశారని వైద్యులు తేల్చారు. ఉరవకొండకు చెందిన 36 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమి చెప్పినా ఆలకించే స్థితి దాటిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. గత ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో కూతురుకు తక్కువ మార్కులు రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. బాధితులు ఎక్కువవుతున్నారు ఫలానా మానసిక రుగ్మత అందరికీ ఉండాలని లేదు. మగవాళ్లలో స్కిజోఫినియా ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ల విషయంలో డిప్రెషన్ ఎక్కువ. సోషియల్ ఎలిమెంట్స్ అంటే సామాజిక కారణాలు.. కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటివి ఒక కారణం. చిన్న చిన్న సమస్యలకు కూడా కొందరు కుంగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి కౌన్సిలింగ్ కావాలి. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్‌మిషన్ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది ప్రధానంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలకు చదువులో మంచి మార్కులు రాకపోయిన, తమ గోల్ సాధించకపోయిన ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఒత్తిడి ఉంటోంది. అన్ని వయస్సుల వారు ఒత్తిడి బారిన పడుతున్నారు.అలాగే వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆ«ధిపత్యం వంటి ఎన్నో ఒత్తిడికి కారణమవుతున్నాయి. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాం. – డాక్టర్ అనిల్‌కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ మానసిక ఒత్తిడికి చెక్‌పెట్టండిలా... ► కనీసం మనిషి రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ► కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. 45 నిముషాల పాటు వాకింగ్, రన్నింగ్ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ► యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడిని జయించవచ్చు. ► తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, చిరు ధాన్యాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటీన్స్, విటమిన్స్‌తో పాటు మినరల్స్ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. -
శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మెంటల్ హెల్త్ బాలేదని, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై శృతి స్పందించింది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ‘నా ఫ్లూ సమస్య ఇలా మారిందన్నమాట’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. ‘నా వైరల్ ఫివర్ కాస్తా ఇలా మెంటల్ హెల్త్‌గా బయటకు వెళ్లింది. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇలాంటి వాటి వల్లే వారి మానసిక సమస్యలను బయటకు చెప్పుకునేందుకు భయపడేలా చేస్తున్నారు. నా ఆరోగ్యం, మెంటల్ హెల్త్ బాగానే ఉన్నాయి. ఓ సారి వైరల్ ఫివర్ వచ్చింది అంతే. దాన్ని ఇలా చిత్రీకరించారు. బాగా ట్రై చేశారు. మీకూ అలాంటి సమస్యలు ఉంటే గనుక తప్పుకుండ థెరపిస్ట్‌ను కలవండి’ అంటూ శృతి మండిపడింది. కాగా శృతి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తానే స్వయంగా చెప్పినట్లు పలు బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆమె తన మానసిక సమస్యలకు చికిత్స కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాయి. Nice try !! And Thankyou I’m recovering well from my viral fever pic.twitter.com/oxTYevcK1D — shruti haasan (@shrutihaasan) January 12, 2023 -
అనుమానిస్తున్నారని వేరేలా చూడకండి.. అది కూడా ఓ లాంటి జబ్బే..!
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్‌పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్‌తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్‌ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్‌కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్‌షిప్‌ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ∙ శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు ∙కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి ∙పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్ -
టెలి మానస భరతం!
కంచర్ల యాదగిరిరెడ్డి అక్షరాలా.. ఒక లక్ష అరవై నాలుగు వేల ముప్పై మూడు. 2021 సంవత్సరంలో భారత దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇది! కొంచెం అటు ఇటుగా నిమిషానికి ఇద్దరు బలన్మరణానికి పాల్పడుతున్నారన్నమాట!! కుటుంబ సమస్యలు, తీవ్రమైన వ్యాధుల బారిన పడటం ఇందుకు ప్రధాన కారణాలని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నా, సంబంధిత నిపుణులు మాత్రం మానసిక సమస్యలే మూల కారణం అని స్పష్టం చేస్తుండటం గమనార్హం. చికిత్సలో వెనుకంజ.. ఎందుకీ పరిస్థితి? మానసిక సమస్యలంటే కేవలం పిచ్చి మాత్రమేనా? ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు ఏం చేయవచ్చు? అన్న దానిపై ప్రస్తుతం దేశంలో చర్చ కొనసాగుతోంది. భారతదేశం చాలా రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండవచ్చు కానీ, అంతర్జాతీయంగా మానవాభివృద్ధికి సూచికలైన పలు అంశాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉంది. వైద్యంలో, ముఖ్యంగా మానసిక సమస్యలకు చికిత్స విషయంలో మరీ వెనుకంజలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న సైకియాట్రిస్టులు కేవలం 0.3, సైకాలజిస్టులు 0.07 మాత్రమే. ఇంకా చెప్పాలంటే మానసిక సమస్యల చికిత్సకు ఈ దేశంలో దాదాపు అవకాశం లేనట్టే! ఇక నర్సులైతే 0.12, ఆరోగ్య సిబ్బంది 0.07% ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో సుమారు 5–18 శాతాన్ని మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తుంటే భారత్‌లో ఇది 0.05 శాతాన్ని దాటడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి ప్రభావం దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడు తున్న దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 5.6 కోట్ల మనో వ్యాకులత బాధితులు, ఇంకో 4.3 కోట్ల మంది యాంగ్జైటీ రోగుల కారణంగా దేశంలో ఉత్పాదకత గణనీయంగా పడిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది. పనిచేసే సామర్థ్యమున్న 15– 39 ఏళ్ల మధ్య వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. 2012– 2030 మధ్యకాలంలో ఈ నష్టం సుమారు రూ.84 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మార్పు మొదలైంది మానసిక సమస్యలపై దేశం దృష్టి కోణం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇంతకాలం మానసిక సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యలపైనే ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించగా, తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపును పెంచింది. అంతేకాకుండా ఓ మోస్తరు మానసిక సమస్యల పరిష్కారానికి టెలి–మెంటల్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 10న ‘టెలి–మానస్’ పేరుతో భారీ కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు 1–800–91–4416కు లేదా 14416కు ఫోన్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఆధ్వర్యంలో, ఐఐఐటీబీ సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది. 23 టెలి–మానస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా మొత్తం 23 టెలి–మానస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా జిల్లా స్థాయిలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం/ వైద్య కళాశాలల సిబ్బంది ద్వారా కన్సల్టేషన్లు నిర్వహిస్తారు. లేదంటే ఈ– సంజీవని ద్వారా ఆడియో, వీడియో సంప్రదింపులూ జరపవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సెలర్లు అన్నిరకాల మానసిక సమస్యలకు సంబంధించి సాయం అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు ఈ టెలి–మానస్ కార్యక్రమం అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఆయా కేంద్రాల్లోని అత్యవసర సైకియాట్రిక్ సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులోకి వస్తాయి. నిమ్హాన్స్ ఇప్పటికే దాదాపు 900 మంది టెలిమానస్ కౌన్సెలర్లకు శిక్షణ కూడా పూర్తి చేసింది. వ్యాయామం.. నిద్ర.. కీలకం ►రోజూ క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజుల పాటైనా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ►సంతులిత ఆహారం, తగినన్ని నీళ్లు తాగడం కూడా అవసరం. తద్వారా శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుండ టం వల్ల చురుగ్గా ఉంటామన్నమాట. ►కంటినిండా నిద్రపోవాలి. నిద్ర నాణ్యత పెరిగిన కొద్దీ మనిషి మాన సిక ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపించినట్లు 2021 నాటి ఓ సమీక్ష స్పష్టం చేసింది. ►ప్రాణాయామం, ధ్యానం, వెల్నెస్ అప్లికేషన్ల సాయంతో వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం జరగాలి. దినచర్యలను, సంఘటనలను రాసుకోవడం కూడా ఒత్తిడికి దూరం చేస్తుందని అంచనా. ►బంధుమిత్రులతో సత్సంబంధాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్నచూపు తగదు మానసిక సమస్యలను దేశంలో ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారు. బాధితులను హేళన చేయడం, వెకిలి మాటలతో హింసించడం కూడా సర్వసాధారణమవుతుండటం దురదృష్టకరమైన అంశం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఇది మరింత కుంగుబాటుకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ జీవితానికి ఓ సూచిక మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం సంపూర్ణ జీవితానికి ఓ సూచిక అన్నారు ఢిల్లీకి చెందిన మానసిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ విశాల్ ఛబ్రా. పదిహేనేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న ఛబ్రాకు గడచిన నాలుగైదేళ్లుగా కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆయన రోజుకు 10 గంటలు పని చేస్తున్నా 25% మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ‘ఇటీవల కాలంలో మానసిక వ్యాధుల బారినపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువ. పెరిగిపోతున్న పోటీతత్వం, విలాస వంతమైన జీవితాలు కావాలనుకోవడం, పొరుగు వారు లేదా సమీప బంధువులతో పోల్చుకోవడం వంటి వాటితో కుంగిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బతకాలని అనిపించలేదు: దీపిక పదుకునె ‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. నృత్య దర్శకురాలు ఫరాఖాన్‌తో కలిసి దీపిక కొద్దిరోజుల క్రితం ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు. ‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థ్ధం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా. ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది. అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థ్ధకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు. -
ఒత్తిడే శత్రువు.. స్థూలంగా మూడే రకాలు.. ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’
కంచర్ల యాదగిరిరెడ్డి వెర్రి వేయి విధాలు అంటుంటారు. అది ఇది ఒకటి కాకపోయినా మానసిక సమస్యల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు మానసిక సమస్యలు ఫలానా వారికే వస్తాయి. ఫలానా వారికి రావన్న మాటే ఉండదని.. ప్రాంతం, జాతి, స్త్రీ, పురుషులు, వయసు, ఆదాయం వంటి వాటన్నింటికీ అతీతంగా ఎవరికైనా రావొచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని.. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోయేందుకు దోహదపడే అంశాల్లో.. మొట్టమొదట చెప్పుకోవాల్సింది సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లు! మార్కులు బాగా రావాలని పిల్లలను డిమాండ్ చేయడం, మిత్రుడిలా విలాసవంతమైన కారు కొనుక్కోవాలన్న విపరీతమైన తపన వంటివి సామాజిక ఒత్తిళ్ల కోవకు వస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అవసరానికి తగిన డబ్బులు ఉండటం బాగుంటుందిగానీ లేనప్పుడే సమస్య. సమాజంలో ఆర్థికంగా అడుగున ఉన్నవారు మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. 2015లో ఇరాన్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పేదరికంలో, వెలివాడలు లేదా ఊరికి దూరంగా ఉండటం వంటివి మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు అవకాశం కల్పిస్తాయి. మరో అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. బాల్యంలోని అనుభవాలతో.. వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో బాల్యానిది కీలకమైన పాత్ర అని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు విస్పష్టంగా చెప్పాయి. చిన్నతనంలో శారీరక, మానసిక, లైంగిక హింసను ఎదుర్కోవడం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం లేదా విడిపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం వంటివి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అంశాలు కొన్నిసార్లు సైకోటిక్ సమస్యలకు దారితీస్తే.. మరికొన్నిసార్లు పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)కు కారణం కావచ్చని పేర్కొంటున్నాయి. జన్యువుల పాత్ర కూడా.. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబంలో నిర్దిష్ట జన్యువుల్లో మార్పులు కొనసాగుతూంటే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుమార్పులకు మరికొన్ని అంశాలు కూడా తోడైనప్పుడు అవి వ్యాధులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే.. ఏదైనా మానసిక సమస్యకు కారణమయ్యే జన్యువులు మనలో ఉన్నా అది తీవ్రమైన సమస్యగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల విభాగం 2019 నాటి అధ్యయనంలో పేర్కొంది. ఇక ఇలాంటి నిర్దిష్ట జన్యువులు ఉన్నా, లేకున్నా మానసిక సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. ఇదే సమయంలో కేన్సర్, మధుమేహం, తీవ్రమైన నొప్పి వంటి శారీరక సమస్యలు మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చని వివరించింది. స్థూలంగా మూడే.. ముందుగా చెప్పుకున్నట్టు మానసిక సమస్యల సంఖ్య పెద్దదే అయినా.. కొన్ని సాధారణ లక్షణాలున్న వాటన్నింటినీ కలిపి ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’ డిజార్డర్లు అనే మూడు రకాలుగా విభజించారు. ►ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన మానసిక సమస్య యాంగ్జైటీ డిజార్డర్. దీనికి లోనైన బాధితుల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని వస్తువుల విషయంలో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తప్పించుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. యాంగ్జైటీ డిజార్డర్‌లో.. సాధారణ యాంగ్జైటీ డిజార్డర్తోపాటు ప్యానిక్ డిజార్డర్, ఫోబియాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటివి ఉంటాయి. ►మూడ్ డిజార్డర్ల విషయానికి వస్తే.. వీటిని డిప్రెసివ్ లేదా అఫెక్టివ్ వ్యాధులని కూడా పిలుస్తారు. వీటిలో బాధితుల మనోస్థితి తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఆనందం లేదా దుఖం, కోపం వంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. మూడ్ డిజార్డర్లలో.. మనోవ్యాకులత, బైపోలార్ డిజార్డర్, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్లు ఉంటాయి. ►స్కీజోఫ్రీనియా డిజార్డర్ల గురించి చెప్పాలంటే.. కొంచెం సంక్లిష్టమైన మానసిక సమస్యలన్నీ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. సాధారణంగా ఈ రకమైన మానసిక సమస్యలు 16– 30 ఏళ్ల మధ్య వయసు లోనే వృద్ధి చెందుతాయి. ఆలోచనలు కుదురుగా ఉండకపోవడం స్కీజోఫ్రీనియా లక్షణాల్లో ఒకటి. చిత్త భ్రమ, పలవరింత, నిస్పృహ వంటివీ దీని లక్షణాలే. -
‘మతి’తప్పుతోంది! దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే పరేషాన్లో ఉంది..
కంచర్ల యాదగిరిరెడ్డి మీకేమైనా మెంటలా? అని ఎవరైనా అన్నారంటే.. ఒంటికాలిపై లేస్తాం.. చెడామడా తిట్టేస్తాం.. కానీ ఈ భూమ్మీద ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు తెలుసా? భయం, ఒంటరితనం, మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటివన్నీ మానసిక సమస్యలేనని.. తగిన చికిత్స, సాయం అందకపోతే ఇవి శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఎందరికి తెలుసు? మానసిక సమస్యల సంక్షోభం కొత్తేమీకాదుగానీ.. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఇది మరింత జటిలమైపోయింది! నిమిషానికో ఆత్మహత్య, మత్తుమందుల విచ్చలవిడి వాడకంతో లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మానసిక సమస్యల మహాభూతంపై సమగ్ర కథనాలు మీకోసం.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇదో పాత సినిమా డైలాగ్. కానీ మానసిక సమస్యల విషయానికొస్తే దేశం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరువవుతున్న ఈ తరుణంలో అందులో వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు బాధితుల్లో ఎక్కువ మంది పేదదేశాలకు చెందిన వారే కావడం.. వీరిలో 75 శాతం మంది తమ జీవితకాలంలో దీనికి చికిత్స పొందలేని పరిస్థితి ఉండటం గమనార్హం. మానసిక సమస్యల్లో సగం మేర లేత వయసులోనే మనిషిని చుట్టేస్తాయని, స్పష్టంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ల వయసు నుంచే ఈ సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆ ఘర్షణ ప్రభావం ఎందరు పసిమనసులపై పడి ఉంటుందో ఊహించుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకునేదెవరు? భూమ్మీద ఇలాంటి ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, మరికొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా 16 కోట్ల మందికిపైగా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి మానవతా సాయం అందాల్సిన అవసరముందని ఒక అంచనా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యల బారినపడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు 93శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యం కోసం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. వాస్తవానికి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాలు చాలా తక్కువ. ఆరోగ్య బడ్జెట్లో రెండు శాతానికి మించి నిధులు ఈ విభాగంపై ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా రానున్న పదేళ్లలో కేవలం కుంగుబాటు (డిప్రెషన్) అనే మానసిక సమస్యను పరిష్కరించేందుకే బోలెడంత వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మానసిక సమస్య అంటే? మనలో చాలా మందికి అసలు మానసిక సమస్య అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు. బాధపడటం కూడా మానసిక సమస్యేనా? అని కుంగుబాటు, ఆందోళన వంటివాటిని తేలిక చేస్తూంటారు. దీనివల్ల చికిత్సగానీ, మాట సాయం అవసరమనిగానీ గుర్తించని పరిస్థితి నెలకొంటుంది. మానసిక సమస్య అంటే ఏమిటనేది సింపుల్‌గా చెప్పుకోవాలంటే.. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు వస్తే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి. మన మానసిక ఆరోగ్యం దైనందిన జీవితం, ఇతరులతో మన సంబంధాలను మాత్రమేకాదు భౌతిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేయగలదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. మన దైనందిన జీవితం, ఇతరులతో సంబంధాలు, శరీరక సమస్యలు కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు, మంచి ఆహారం, మంచి జీవనశైలి ద్వారా మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నించినట్టే.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎవరూ అతీతులు కారు! మానసిక సమస్యల్లో బోలెడన్ని రకాలున్నాయి. అవి ఫలానా వారికే వస్తాయి. కొందరికి రానే రావు అన్న వెసులుబాటు ఏమీ ఉండదు. వయసు, స్త్రీపురుషులు, ఆదాయం, జాతి వంటి వాటన్నింటికి అతీతంగా ఎవరికైనా మానసిక సమస్యలు రావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు వంటివన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయాలు. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యల లెక్క ఇదీ.. ►35 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య ►8,00,000.. ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపు ►20,63,52,50,00,00,000 రూపాయలు.. మానసిక సమస్యల కారణంగా ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం(ఉత్పాదకత తగ్గడం, అనారోగ్యం వంటి కారణాలతో..) ►రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువగా మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతోంది. ►మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువ! -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్‌రూమ్‌లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
మనసులో అలజడి
మనసు దృఢంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కానీ అదే మనసు కల్లోలమైతే జీవితమే అంధకారమవుతుంది. కోవిడ్ రక్కసి మానసిక అలజడులకూ కారణమైంది. తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది మనో వ్యాకులతకు గురయ్యారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలుచోట్ల జాగృతి కార్యక్రమాలు జరిగాయి. బనశంకరి: కోవిడ్ మహమ్మారి వేటుకు సమాజంలో ఎక్కువమంది బడుగులు, మధ్య తరగతి వారే కాదు సంపన్నులు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయారు. వైరస్ భయం, లాక్డౌన్, ఉద్యోగాలను, ఆప్తులను కోల్పోవడం వంటి ఎన్నో వ్యతిరేకాంశాలతో క్లేశం అనుభవించారు. కర్ణాటకలో కోవిడ్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఏడాదిలో 10 లక్షలు ఉంది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ ఇంకా ఎక్కువమందే మానసిక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లి ఉంటారని ఎన్జీవోల అంచనా. కోవిడ్ సమస్యలతో కుంగుబాటు మానసిక సమస్యలకు కారణాలు అనేకం. కోవిడ్ వల్ల, ఆపై తలెత్తిన ఒంటరితనం ప్రధాన కారణం. ఉద్యోగాలు, వ్యాపారాలను కోల్పోవడం, ప్రేమ వైఫల్యం, జీవితంపై అభద్రత తదితర కారణాలతో ప్రజలు తీవ్రంగా కలత చెందారు. బాధితుల్లో చిన్నపాటి మానసిక సమస్యలు 34 శాతం ఉండగా, మతి చలించడం వంటి తీవ్ర సమస్యకు లోనైనవారు 18.4 శాతం ఉన్నారు. మద్య వ్యసనం, ఓ మోస్తరు మానసిక సమస్యల కేసులు 11.2 శాతం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కౌన్సెలింగ్ సెంటర్లకు వరదలా కాల్స్ కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మానసిక కౌన్సెలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో కాల్స్ వచ్చాయి. 27 లక్షల మందికి పైగా ప్రజలు ఫోన్ చేసి ధైర్యంగా ఉండడానికి సాయం కోరారు. 2020–21 లో 9 లక్షల మంది సంప్రదించగా, ఈ ఏడాది 10 నెలల్లోనే 8.65 లక్షల మంది ఫోన్ చేశారు. దీనిని బట్టి కోవిడ్ తరువాత మానసిక సంఘర్షణ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. కోవిడ్ వేళ టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన మృతుల దృశ్యాలు మహిళలను ఎక్కువగా భయాందోళనకు గురిచేశాయి. బలవన్మరణాల బెడద బలవన్మరణాల బెడద 2021లో దేశవ్యాప్తంగా 1.64 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 18 ఏళ్లలోపు వారు 13,089 మంది ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు 37 వేలమంది ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలో 2021లో 13 వేలమంది ఆత్మహత్య చేసుకోగా, ఈ సమస్య ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు 3వ స్థానంలో ఉంది. నగరంలో 2,292 మంది ఆత్మహత్యకు ఒడిగట్టారు. మానసిక ఆరోగ్యంపై జాగృతి మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో జాగృతం చేయాలి. మానసిక రోగుల పట్ల చిన్నచూపు తగదు అని నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి అన్నారు. మంచి అలవాట్లు ముఖ్యం నిమ్హాన్స్ మానసిక విజ్ఞాన విభాగ అధ్యాపకుడు డాక్టర్ మనోజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ సోయల్ మీడియాను అతిగా వినియోగించిన వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. దీనికి బదులు బయట వాకింగ్, వ్యాయామం చేయడం, అందరితో కలవడం, ఖాళీగా లేకుండా చూసుకోవడం ముఖ్యమని సూచించారు. (చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..) -
మానసిక ఆరోగ్యంపై పెరిగిన దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో రోజువారీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు మారిపోతున్నాయి. శారీరకంగా ధృఢంగా, చురుకుగా ఉండడం (ఫిజికల్ ఫిట్నెస్) కంటే కూడా మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించడం పెరిగింది. సగటు మనిషి జీవనంలోని పలు అంశాలపై మానసిక ఆరోగ్యం చూపే ప్రభావంపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. గత రెండున్నరేళ్ల కరోనా మహమ్మారి ప్రభావిత కాలంలో చోటుచేసుకున్న అనేక మార్పులతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వంటి వాటికి పెరిగిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కొరవడిన వ్యక్తులపై వివిధ సమస్యలు ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయనేది క్రమంగా ప్రపంచానికి తెలిసొస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది నేర్చుకునే గుణం, పనిలో మెరుగైన ఉత్పాదకత, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకోవడంపై ప్రభావం చూపుతున్నట్టు వివిధ పరిశోధనలు, అధ్యయనాల్లో గుర్తించారు. ఈ పరిశీలనల్లో భాగంగా కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జాబ్‌మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉద్యోగులు మానసికస్థితి ఒత్తిళ్లకు గురవుతున్నట్లు గుర్తించారు. 2022 జూన్‌లో డబ్ల్యూహెచ్‌వో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఏదో ఒక రూపంలో మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వెల్లడైంది. సోమవారం ‘వరల్డ్ మెంటల్ హెల్త్‌డే’ సందర్భంగా ఆయా అంశాలు, విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మానసిక ఆరోగ్య పరిరక్షణ అనేది ముఖ్యం.. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యం. గత రెండున్నరేళ్ల కరోనా కాలంలో భవిష్యత్‌పై అనిశ్చితితో అధిక శాతం మంది జీవన ప్రమాణాలు దిగజారడం, తగిన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో చాలా కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో మానసిక ప్రశాంత సాధనతోపాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది. డబ్ల్యూహెచ్‌వో కూడా ‘మెంటల్ వెల్నెస్’పై దృష్టి పెట్టాలని చెబుతోంది. అయితే ప్రభుత్వాలు మన దగ్గర ఇప్పటిదాకా ‘మెంటల్ హెల్త్’పై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కోవిడ్ మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల ప్రభావంతో ఈ దృష్టిలో మార్పు వచ్చింది. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమైన అంశంపై తప్పక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శారీరకంగా ఎదురయ్యే అనేక సమస్యలకు మానసిక అనారోగ్యం కారణమవుతోంది. వాస్తవాలను అంగీకరించే స్థితికి చేరుకుంటే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యంతోనే ఉత్పాదకత పెరగడం, మెరుగైన కుటుంబ సంబంధాలతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగౌతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్‌కాస్ట్! యూత్‌కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానం దానిదే
కోవిడ్ టైమ్‌లో యూత్‌కు సన్నగా పరిచయం అయిన ‘పాడ్‌కాస్ట్’ ఇప్పుడు వారికి ఆత్మీయనేస్తం అయింది. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన చరితకు పాటలు వినడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె పాడ్‌కాస్టింగ్‌లో పాటలు ఒక భాగం మాత్రమే. ‘నాకు పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో ట్రావెల్ చేయడం అంటే కూడా అంతే ఇష్టం. ముసాఫిర్ స్టోరీస్లాంటి ట్రావెల్ పాడ్కాస్ట్ల ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది చరిత. నాగ్‌పుర్‌కు చెందిన భానుకు రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. అయితే ఎవరైనా కబుర్లు చెబుతుంటే, వింటూ వింటూ నిద్రపోతుంటాడు! ఇప్పుడు అతడికి పాడ్‌కాస్ట్ అనేది ఆత్మీయనేస్తం అయింది. ఎన్నో రంగాలకు చెందిన కబుర్లు వింటూ వింటూ నిద్రపోతుంటాడు. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారి నుంచి పాడ్‌కాస్ట్‌కు అమితమైన ఆదరణ లభిస్తున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యూత్‌కు దగ్గరైన పాడ్‌కాస్ట్ జానర్లలో ‘మెంటల్ హెల్త్’ అగ్రస్థానంలో ఉంది. భోపాల్‌కు చెందిన తన్వీకి అకారణ దిగులు. ఎలాంటి సమస్యా లేదు...మరి దిగులెందుకో తెలియదు! స్నేహితుల సలహా మేరకు ‘ది హ్యాపీ టైమ్స్’ ‘ఎమోషనల్ ఫీల్’ ‘బుద్ధిస్ట్ సొల్యూషన్స్ ఫర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్’....మొదలైన పాడ్‌కాస్ట్‌లు వింటూ ఉంది. ఇప్పుడు ఆ అకారణ దిగులు మాయం అయినట్లు చెబుతుంది తన్వీ. యూత్‌కు స్ట్రెస్ బస్టర్‌గా పాడ్‌కాస్టింగ్ ఉపయోగపడుతోంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిష్కారాలు అందిపుచ్చుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సృజనాత్మకంగా స్వీయవ్యక్తీకరణకు పాడ్కాస్టింగ్ను బలమైన వేదికలా ఉపయోగించుకుంటోంది యూత్. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! -
ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. పని ఒత్తిళ్లు ఎక్కువే.. పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్ సూచించింది. -
Health Tips: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? అయితే...
Health Tips In Telugu: సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలిని అలవరుచుకోవాలి. దీనిపై పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యనిపుణులు స్పష్టమైన ఆరోగ్యసూత్రాలను ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించడం వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. ఉండవలసిన దినచర్య ►యోగా చేయడం ►ఏడెనిమిది గంటలకు తగ్గకుండా మంచి నిద్ర ►తొందరగా నిద్ర లేవడం ►జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయడం. ►తోటివారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం. ►దినచర్య, రుతుచర్య పాటించడం, దయతో వ్యవహరించడం. ►పరోపకార గుణం కలిగి ఉండడం. ►ఆధ్యాత్మిక భావాలు ఉంటే పూజ చేసుకోవడం, పవిత్ర గ్రంథాలు పఠించడం ►కుటుంబంతో ఉల్లాసంగా గడపడం. ►రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం. ►అనవసర జోక్యాలు లేకుండా మనసును నియంత్రించడం చేయకూడనివి ►ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, అసలు నిద్ర పోకుండా ఉండడం ►పగటి నిద్ర పోవడం ►శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా అధికంగా కూర్చుని ఉండే జీవన సరళి కలిగి ఉండడం ►అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం ►కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం ►సామాజిక నిబంధనలు, నైతిక విలువలు పాటించక, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం ►అతిగా ఆలోచించడం, ఏవో పాత సంఘటనలని తలచుకుని నిరంతరం బాధపడుతుండడం, ఆందోళన పడటం ►నిరంతరం టీవీ, మొబైల్ చూడటం.. దీనివల్ల సెన్స్ ఆర్గాన్స్పై ఒత్తిడి ►కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం ►అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం చదవండి: Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం తినొద్దు!
ఇటీవలి కాలంలో మానసిక వ్యాధులు అధికం అవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటినుంచి ఎక్కువ గారాబంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదయినా అనుకోని సంఘటనలు ఎదుర్కొనవలసి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.... మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి, ఏయే పదార్థాలు తీసుకోకూడదో చూద్దాం. Foods That Boost Mental Health: ఇవి తీసుకోవాలి ►ఎక్కువ పాలిష్ చేయని బియ్యం ►ముడి పెసలు ►తాజా పాలు ►నెయ్యి ►గోధుమలు ►వెన్న ►బూడిద గుమ్మడికాయ ►పరిశుభ్రమైన ఆహారం ► సీజనల్ పండ్లు, కూరగాయలు ►ద్రాక్ష ►దానిమ్మ ►ఉసిరి ►చేపలు ►కొవ్వు ఎక్కువగా ఉండని మాంసం ►యాపిల్ ►ఆర్గానిక్ ఎగ్స్. మానేయవలసినవి ►కలుషిత ఆహారం అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం ►రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ ►కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం (దీనివల్ల న్యూరోట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది) ►స్మోకింగ్, గుట్కాలు తినడం ►ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం ►ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం ►డీప్ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ►అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్ లాంటివి) ►అతి కష్టంమీద జీర్ణమయ్యే ఆహారం ►బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం ►అధికంగా తినడం, తీసుకున్న ఆహారం అరగకముందే మళ్లీ తినడం ►పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లే.. కానీ ఒంటరిగా ఫీలయ్యా!
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మానసిక రుగ్మతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక అథ్లెట్‌గా మానసిక సమస్యను భరించడం కష్టమని.. అది మనలో ఎంతో ఒత్తిడి నింపుతుందని పేర్కొన్నాడు. అలాంటి అనుభవం నాకు కూడా ఎదురైందని కోహ్లి తెలిపాడు. ఒక దశలో చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లు ఉన్నప్పటికి ఒంటరిగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. కొంత గ్యాప్ తర్వాత ఆసియాకప్ 2022కు సన్నద్ధమవుతున్న కోహ్లి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అథ్లెట్లకు ఉండే మానసిక ఒత్తిడిని ఎలా జయించాలనే దానిపై మాట్లాడాడు. ''సాధారణంగా అథ్లెట్ ఒక ఆటగాడిగా ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. అదే సమయంలో ఉండే ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావితం చూపిస్తోంది. దీనిని దరి చేరనీయకుండా ఉండాలంటే కసరత్తులపై దృష్టి పెట్టాలి. మంచి ఫిట్నెస్ ఉంటే ఆటోమెటిక్‌గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చేయాలనుకుంటున్న పనిపై కూడా శ్రద్ద పెరుగుతుంది. ఈ సందర్భంగా ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. ఒకసారి నేను వెళ్లిన గదిలో నా చుట్టూ ఉన్నవాళ్లంతా నన్ను ప్రేమించేవాళ్లో లేక అండగా నిలబడేవాళ్లు ఉన్నారు. అయినప్పటికి నేను ఒంటరిగా ఫీలయ్యా. ఎవరితో సరిగ్గా కలవలేకపోయాను. కానీ ఆ తర్వాత నాకు నేను సర్దిచెప్పుకొని కలిసిపోయాను. అందుకే మన మూడ్ సరిగా లేకపోయినప్పటికి నిరంతరం అందరితో మంచి రిలేషన్ కొనసాగిస్తూనే ఉండాలి. మీకున్న ఒత్తిడి తొలగించుకోవడానికి ఇదే మంచి మార్గం'' అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత జట్టుకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో తిరిగి మైదానంలో దిగనున్నాడు.ఇటీవల ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న కోహ్లి.. తాజాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్‌తో పాటు... కఠిన వ్యాయామాలు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. చదవండి: జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లి.. వీడియో వైరల్! కింగ్.. ఒక్క సెంచరీ ప్లీజ్! Andre Russell: 'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!' -
టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్‌గా మళ్లీ అతనే..!
టీమిండియా మెంటల్ హెల్త్ కండీషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్ మళ్లీ నియమితుడయ్యాడు. గతంలో పలు సందర్భాల్లో టీమిండియా తరఫున ఈ బాధ్యతలు నిర్వహించిన అప్టన్‌ను ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. అప్టన్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని, అతను విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో జాయిన్ అవుతాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్టన్ 2011లో టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో అప్టన్‌కు నిపుణుడిగా మంచి పేరుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో అప్టన్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమిండియాలో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వీరిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ ఐపీఎల్లో (ద్రవిడ్-రాజస్థాన్ రాయల్స్, అప్టన్-ఢిల్లీ డేర్‌డెవిల్స్) కూడా వివిధ ఫ్రాంచైజీలకు పని చేశారు. చదవండి: 'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్‌కు' -
మాల్ పార్కింగ్‌లో శవమై కనిపించిన టిక్‌టాక్ స్టార్
లాస్ ఏంజెల్స్: అమెరికన్ టిక్‌టాక్ స్టార్ కూపర్ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం(జూన్ 9న) లాస్ ఏంజిల్స్‌లోని మాల్లో పార్కింగ్ లైన్లో శవమై కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అతడు మృతి చెందడానికి కొన్ని గంటల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో బెడ్‌పై సేద తీరుతున్న కూపర్ 'యుక్త వయసులోనే చనిపోతామేమో అని ఎవరు ఆలోచిస్తున్నారు?' అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అతడు నిర్జీవంగా కనిపించడం గమనార్హం. కొంతకాలంగా కూపర్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న టిక్‌టాక్‌లో అతడు ఓ వీడియో షేర్ చేస్తూ.. 'మీ సాదకబాధకాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు తెలుసు, మీరు ఒంటరి కాదు.. మీకు నేనున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇక కూపర్‌కు టిక్‌టాక్‌లో 1.77 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్ బోర్డింగ్ వీడియోలతో పాటు ఫ్యాషన్ వీడియోలను సైతం టిక్‌టాక్‌లో అప్లోడ్ చేసి ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేసేవాడు కూపర్. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లని కబురు.. ఒత్తిడిని దూరం చేసేందుకు ప్లాన్స్!
సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రాంలతో కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోందని.. గతేడాది సుమారు 79 శాతం మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఐటీ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్, సెమినార్లు, మోటివేషనల్ తరగతులు నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. నగరంలో చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఐటీ కంపెనీలు 1500 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం కంపెనీలు ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నియామకాల్లోనూ నయా పద్ధతి.. ► గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీల వెల్లువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతోపాటు.. సమీప భవిష్యత్‌లో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించేందుకు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూలు, పదోన్నతులు అన్నీ వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థుల బయోడేటాలను తనిఖీ చేయనున్నారు. ► వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు,వ్యక్తిత్వాన్ని అంచనా వేయనున్నారు. కాగా కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీలు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంటున్నారు. నగరంలోని కంపెనీలు 54 శాతం మందిని,విదేశీ కంపెనీలు 49 శాతం మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు హైసియా వర్గాలు తెలిపాయి. ► ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ), కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌తో పని విధానం సమూలంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. (క్లిక్: ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం) -
నిద్రలేమి అనారోగ్యాలను తీవ్రతరం చేస్తున్న కోవిడ్!
నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం... దాంతో అనేక అనారోగ్యాలు కలుగుతాయన్నది తెలిసిందే. కానీ నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకితే... దానివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయనీ... పైగా మానసిక అనారోగ్యాలూ కలుగుతాయని తాజాగా నిరూపితమైంది. మంచి ఆరోగ్యం కోసం ఎంతసేపు నిద్రపోవాలన్న అంశం చర్చనీయాంశమైనప్పటికీ... సాధారణంగా యువతీ–యువకులకు కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని, కౌమార బాలబాలికలైతే అంతకంటే మరో గంట ఎక్కువే నిద్రపోవాలనీ... అప్పుడే వారిలో జ్ఞాపకశక్తి, పెరుగుదల ఉంటాయని నిద్ర నిపుణులు చెబుతుంటారు. మామూలుగా ఆరు గంటలు నిద్ర కూడా సరిపోతుందని కొందరు చెబుతుంటారుగానీ... ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి కోవిడ్ సోకినప్పుడు వారిలో చాలామంది మానసిక అనారోగ్యాలకు గురయ్యారని ఇటీవలి కోవిడ్ సోకిన రోగులను పరిశీలించినప్పుడు తెలియవచ్చింది. అంతేకాదు.. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనవేత్తల పరిశీలనలోనూ ఇదే నిజమని తేలింది. ఇలా నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకినప్పుడు వాళ్లలో ఎక్కువ మంది అంటే దాదాపు 75›శాతానికి పైగా మానసిక అనారోగ్యాల బారిన పడ్డారనీ... అందులోనూ డిప్రెషన్‌తో కుంగుబాటుకు లోనైనవారే ఎక్కువనీ, అటు తర్వాత యంగై్జటీ వంటి బాధలకు గురయ్యారని కూడా వైద్యుల పరిశీలనలో తేలింది. సంఖ్యాపరంగా చూస్తే... డిప్రెషన్, యాంగై్జటీల తర్వాత భావోద్వేగాల పరంగానూ, భౌతికంగానూ బాగా అలసటగా ఫీలయ్యేవారు ఎక్కువన్నది నిపుణుల మాట. మానసిక ఆరోగ్యానికి నిద్ర మరింత అవసరమనే అంశం నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యిందంటున్నారు హార్వర్డ్‌కు చెందిన పరిశోధకులు. -
మెంటల్ హెల్త్ యాక్టివిజం
మనసుకు వైద్యం చాలా ముఖ్యం మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం పని చేసే యాక్టివిస్టులు ఉన్నారు. కాని ‘మెంటల్ హెల్త్’ బాగుండాలని పని చేసే యాక్టివిస్టులు తక్కువ. నీరజా బిర్లా– కుమార మంగళం బిర్లా భార్యగా కంటే ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్టు’గా వచ్చే గుర్తింపును ఎక్కువ ఇష్టపడతారు. ‘ఎంపవర్’ అనే సంస్థను స్థాపించి బాలల, మహిళల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్నారామె. ఇటీవల హైదరాబాద్‌లో జరిపిన సర్వేలో ఎమర్జెన్సీ నంబర్లకు కేవలం ఒక శాతం మాత్రమే మానసిక సమస్యలు చెప్పుకునే కాల్స్ వచ్చాయి. అంటే మనసుకు వచ్చిన ఆపదను ఇంకా ధైర్యంగా బయటకు చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నీరజా బిర్లా ఏమంటున్నారో విందాం. ‘నా తొలి కాన్పు జరిగి కూతురు (అనన్యా బిర్లా) పుట్టాక నిజానికి అదొక పండగ వాతావరణంగా ఉండాలి. అదంరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఉన్నారు కూడా. కాని నేను మాత్రం ఎలాగో అయిపోయాను. నా ఒడిలో చందమామలాంటి బిడ్డ ఉన్నా నా మనసు రకరకాలుగా ఉండేది. ఊరికే ఏడుపు వచ్చేది. చాలా నిరాశగా అనిపించేది. చిరాగ్గా ఉండేది. ఇలా ఎందుకుందో నాకు తెలియలేదు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాని చివరకు తెలిసింది అది ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అని! ఇలా చాలామంది స్త్రీలకు అవుతుందని. ఆ సంగతి నాకు ముందే తెలిస్తే నేను ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కొని ఉండేదాన్ని. ధైర్యంగా ఉండేదాన్ని. బహిరంగంగా మాట్లాడేదాన్ని. నాలా ఎంతమంది బాధ పడుతున్నారో అనిపించింది. అప్పటి నుంచి దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఉన్న చైతన్యాన్ని గమనించడం మొదలుపెట్టాను. దాని గురించి ఎవరో పని చేయడం కాదనీ, మనమూ మనకు వీలైన పని చేయవచ్చని ఆరేళ్ల క్రితం ఎంపవర్ సంస్థ స్థాపించాను. పూర్తిగా మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం, సహాయం చేసే సంస్థ ఇది. ఈ సంస్థ వల్ల మంచి జరగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు 51 ఏళ్ల నీరజా బిర్లా. ఎన్నో ఏళ్లు సామాజిక సేవ, విద్య రంగాల్లో పని చేస్తున్న నీరజా బిర్లా ఇప్పుడు పూర్తిగా ‘ఎంపవర్’ (మైండ్ పవర్) సంస్థ ద్వారా చేయాల్సిన పని గురించే శ్రద్ధ పెడుతున్నారు. తనను తాను ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్’గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇద్దరు జర్నలిస్టులు ఆరేళ్ల క్రితం నీరజా బిర్లా ‘ఎంపవర్’ ఆవిర్భావం గురించి ప్రెస్‌మీట్ పెడితే ఇద్దరే జర్నలిస్టులు హాజరయ్యారు. ‘చూడండి... మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఎంత నిర్లక్ష్యం ఉందో. అదొక నిషిద్ధ విషయంగా కూడా ఉంటోంది. ఎవరైనా తమకు మానసిక అనారోగ్యం ఉందంటే పిచ్చి అని సమాజం ముద్ర వేస్తుందనే భయం ఇప్పటికీ పోలేదు. దీని గురించే ఎక్కువగా చైతన్యం కలిగించాలి. జ్వరం వస్తే ఎంత సులభంగా చెప్పుకుంటామో అంత సులభంగా చెప్పుకోగలగాలి. బండి మీద నుంచి కింద పడితే అందరూ పరిగెత్తి వెళ్లి ఎంత సహజంగా సాయం చేస్తారో... ‘‘యాంగ్జయిటీగా ఉంది, పానిక్‌గా ఉంది, డిప్రెషన్‌గా ఉంది’’ అంటే కూడా అంతే సహజంగా సాయం చేసేలా ఉండాలంటారు నీరజ. పిల్లల స్థాయి నుంచి ‘ఎంపవర్’ మొదలెట్టినప్పుడు నీరజ ఆలోచనలు స్కూలు స్థాయి నుంచి మానసిక ఆరోగ్యం గురించి చైతన్యం కలిగిస్తే చాలు అనేంతవరకే ఉన్నాయి. లెక్కల సిలబస్, సైన్స్ సిలబస్ ఉన్నట్టే మానసిక ఆరోగ్యం గురించి కూడా సిలబస్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండాలని ఆమె అనేక స్కూళ్లలో ఆ సిలబస్ పెట్టించారు. అంతే కాదు, పిల్లల కోసమే ప్రత్యేకమైన వర్క్‌షాప్స్ నిర్వహించారు. ‘అసలు అందరి కంటే ఎక్కువగా కౌమార దశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఆ వయసులోనే బాడీ షేమింగ్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్... ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలే అని వారికి తెలిస్తే వారు సులువుగా వాటిని ఎదుర్కొంటారు’ అంటారు నీరజా. అయితే పని కొనసాగే కొద్దీ ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లలు, స్త్రీలు అని కాకుండా అన్ని దశల, వయసుల్లో ఉన్నవారికి అవసరం అనే అవగాహనకు వచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు. ఈమె సాగిస్తున్న ఈ ఉద్యమంలో కుమార్తె అనన్యా బిర్లా కూడా భాగస్వామి అయ్యింది. ఇటీవల జరుగుతున్న డిప్రెషన్ ఆత్మహత్యలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రతి చోటా చర్చలు, చైతన్య శిబిరాల అవసరం తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు, సంస్థలు ఆ దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. నగరాల్లో క్లినిక్‌లు ‘ఎంపవర్’ ఆధ్వర్యంలో నేరుగా వైద్య సహాయం అందించే క్లినిక్‌లను ముంబైలో 3 ఏర్పాటు చేశారు నీరజ.. ఆ తర్వాత కోల్కటా, బెంగళూరు, హైదరాబాద్, గోవా, పిలానీలలో క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. వీరు నేరుగా వైద్య సహాయం అందిస్తే కౌన్సిలర్ల వ్యవస్థను కూడా విస్తృతం చేసుకుంటూ వెళుతున్నారు. ‘మన దేశంలో సమస్య ఏమిటంటే మనకు మానసిక సమస్య ఉందని తెలిశాక వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సైకియాట్రిస్ట్‌లు పెద్దగా అందుబాటులో కూడా ఉండరు. యాంగ్జయిటీ సమస్య ఉన్న మనిషి జీవితంలోని సమస్యలు ఎదుర్కొంటూ యాంగ్జయిటీని కూడా ఎదుర్కొంటూ బతకాల్సి రావడం చాలా కష్టం. కాని మన దగ్గర అలాగే జరుగుతుంటుంది. నడక, వ్యాయామం ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన దగ్గర బలం అంటే శారీరక బలమే. కాని మానసిక బలం ముఖ్యం. శరీరానికి ఎలా వ్యాయామం అవసరమో మనసుకు అంతే వ్యాయామం అవసరం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటారు నీరజ . -
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే ఇలా చేయాలి..!!
-
మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ స్లేటర్‌ను మెంటల్ హెల్త్ ఆసుపత్రికి తరలించారు. మానసిక పరిస్థితి సరిగా లేనందున అతనిపై ఉన్న గృహహింస కేసును కొట్టేస్తున్నట్లు సిడ్నీ లోకల్ కోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 52 ఏళ్ల మైకెల్ స్లేటర్‌పై గతేడాది అక్టోబర్‌లో న్యూసౌత్ వేల్స్ పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు. ఇక తన మాజీ భార్యకు ఫోన్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపించడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో గత డిసెంబర్లో అధికారులు అతనిపై మరిన్ని కేసులు నమోదు చేశారు. అయితే అతని మానసికస్థితి సరిగా లేనందునే ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిబ్రవరిలో అతని తరపు లాయర్ కోర్టుకు తెలిపాడు. తాజాగా మరోసారి మైకెల్ స్లేటర్ కేసు వాదనకు వచ్చింది. కేసును విచారించిన మెజిస్ట్రేట్ రాస్ హడ్సన్ అతని పరిస్థితిపై స్పందించాడు. ''మైకెల్ స్లేటర్ మానసిక పరిస్థితి బాగా లేదని.. ప్రస్తుతం జైలు కంటే రీహాబిలిటేషన్ సెంటర్‌కు పంపించాల్సిన అవసరం ఉంది. మూడు వారాల పాటు మెంటల్ హెల్త్ యూనిట్లో స్లేటర్ చికిత్స తీసుకోనున్నాడు. తక్షణమే అతన్ని మెంటల్ హెల్త్ యూనిట్‌కు తరలించే ఏర్పాట్లు చేయాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా మైకెల్ స్లేటర్ అంతకముందే దాదాపు వంద రోజులపాటు ఆల్కహాల్, మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతూ రీహాబిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నట్లు తేలింది. ఇక 1993-2001 కాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన మైకెల్ స్లేటర్ 74 టెస్టులు, 42 వన్డేలు ఆడాడు. కాగా 74 టెస్టుల్లో 5312 పరుగులు, 42 వన్డేల్లో 987 పరుగులు సాధించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మైకెల్ స్లేటర్ కామెంటేటర్ అవతారం ఎత్తాడు. చదవండి: Yuvraj Singh: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి అతడే సరైనోడు..! IPL 2022: ఫెర్గూసన్‌కు చుక్కలు చూపించాడు.. ఎవరీ శశాంక్ సింగ్? -
గూబ గుయ్యిమంటోంది!
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పట్టణం ఇప్పుడు ప్రపంచ పటంపై ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఎందుకో తెలుసా? అక్కడ పరిమితికి మించి రెండు రెట్లు అధికంగా శబ్ద కాలుష్యం ఉన్నట్లు తేలింది! ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన శబ్ద తీవ్రత కేవలం 55 డెసిబుల్స్(డీబీ) కాగా మొరాదాబాద్‌లో ఇది ఏకంగా 114 ఉంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 119 డెసిబుల్స్‌తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మొరాదాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీలో 83 డీబీ, కోల్‌కతాలో 89 డీబీ శబ్దం కాలుష్యం ఉన్నట్లు ఐరాస పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో శబ్ద కాలుష్యం తీవ్రతను వెల్లడిస్తూ తాజాగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్స్ నివేదికను విడుదల చేశారు. న్యూయార్క్, బ్యాంకాక్ హాంకాంగ్ వంటి నగరాలు జాబితాలో ఉన్నాయి. భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం బెడద దక్షిణాసియాలోనే అధికంగా ఉంది. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లో పరిమితికి మించి నమోదవుతోంది. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శబ్ద తీవ్రత నివాస ప్రాంతాల్లో 55 డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో 70 డీబీ దాకా ఉండొచ్చు. అంతకు మించిన శబ్దాన్ని ఎక్కువ సేపు వింటే వినికిడి శక్తి పోయే ప్రమాదముంది. శబ్ద కాలుష్యం మనుషుల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే వారిలో ప్రతి 10 మందిలో 9 మంది శబ్ద కాలుష్యానికి గురవుతున్నారని నివేదిక వెల్లడించింది. ‘‘హాంకాంగ్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరిది ఇదే పరిస్థితి. యూరప్‌లో అతిపెద్ద నగరాల పౌరుల్లో సగం మంది శబ్ద కాలుష్య బాధితులే’’ అని స్పష్టం చేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనుల కారణంగా కొన్ని సిటీల్లో పక్షులు తమ కూత సమయాన్ని కూడా మార్చుకుంటున్నట్లు నిపుణులు గుర్తించారు. -
ఇకపై నిర్ణయించేది మేమే!
మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఈ ఆధునిక యుగంలో కూడా ఈ స్థాయిలో ఉందా? అపర్ణ ఏర్పాటు చేసిన రెస్పాన్సిబుల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గురించి తెలిసినప్పుడు ఎదురయ్యే సహజమైన సందేహం ఇది. అయితే మహిళల కోసం పోరాడాల్సిన అవసరం ఆధునిక యుగంలోనే ఎక్కువగా ఉందంటోంది అపర్ణా అచరేకర్. ఇరవై ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఆమెకు నేర్పిన వాస్తవం ఇది. మహిళ పట్ల అణచివేత భౌతికంగా తగ్గినట్లు అనిపిస్తుందేమో కానీ మానసికంగా ఎక్కువైందంటోందామె. తమకంటూ ఒక గుర్తింపు, స్వాతంత్య్రం, తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోగలిగిన సమాజం కోసం ఆమె సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అనే కొత్త పాత్రలోకి ఒదిగిపోయారు. ‘ఈవ్ వరల్డ్’ అనే సోషల్ మీడియా వేదికగా ప్రపంచంలోని మహిళలను కలుపుతున్నారు అపర్ణ అచరేకర్. ముంబయికి చెందిన అపర్ణా అచరేకర్ మహిళల కోసం పని చేయాలనే సంకల్పం కలిగిన వెంటనే గత ఏడాది అక్టోబర్ నెలలో ఆచరణలోకి దిగింది. మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన వేదిక అది. ఒకరు మరొకరిని ప్రభావితం చేసుకోగలిగిన అవకాశం ఈ వేదిక ద్వారా లభిస్తోంది. ‘‘ఐడెంటిటీ, ఇండిపెండెన్స్, ఇన్‌క్లూజన్’ అనే మూడు అంశాల ఆధారంగా నిర్మితమైన ఈ వేదిక ద్వారా మహిళలు తాము కోరుకుంటున్న గుర్తింపుతో పరిచయమవుతారు, ఆ స్థానంలో నిలబడడం కోసం పరస్పర సహకరించుకుంటారు, తమ జీవితాలకు అవసరమైన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు. అలాగే మగవాళ్లు నిర్దేశించిన నియమావళిని రూపుమాపడానికి కృషి చేస్తారు. కొత్త నియమావళిని మహిళలే నిర్ణయిస్తారు. మొత్తానికి మహిళలు తమకంటూ ఒక స్పేస్‌ని ఈ వేదిక ద్వారా క్రియేట్ చేసుకోగలుగుతారు’’ అని చెప్తోంది అపర్ణ. అందం కొలతల్లో ఉండదు! ‘‘మన భారతీయ సమాజం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం మహిళ విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంది. ‘ఆడవాళ్లు ఎలా ఉండాలి...’ అనే నియమాలను మగవాళ్లే రూపొందిస్తుంటారు. ఆడవాళ్లు ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. అలాగే మెంటల్ హెల్త్ నుంచి మెన్స్ట్రువల్ టాబూ వరకు మహిళల స్వేచ్ఛను నిరోధించే శక్తిగా ఉంటోంది మగవాళ్ల భావజాలం. వీటికి భిన్నంగా మహిళలు వ్యవహరిస్తే సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడడానికి ఏ మాత్రం సందేహించరు. ‘ఆడవాళ్ల విషయంలో తీర్పులివ్వడానికి మనం ఎవరు?’ అనే ప్రశ్న తమను తాము వేసుకునే మగవాళ్లు ఎందరు? వీటన్నింటికీ చరమగీతం పాడుతూ మహిళలు కొత్త నియమావళిని రూపొందిస్తారు’’ అని ఆశాభావం వ్యక్తం చేసింది అపర్ణ. సోషల్ మీడియా వేదికగా రకరకాల వేధింపులు, సైబర్ బుల్లీయింగ్‌కు గురవుతున్న మహిళలకు తమ భావవ్యక్తీకరణకు ఇది ఒక సురక్షితమైన వేదిక అవుతుంది. ఆడవాళ్లు ఎలా ఉండాలి... ఏం చేయాలో కూడా మగవాళ్లే నిర్ణయిస్తుంటారు. స్త్రీ దేహం ఏ కొలతల్లో ఇమిడిపోతే అందమో, ఏ కొలతలు మీరితే అందవిహీనమో కూడా వాళ్లే స్థిరీకరించేస్తారు. నిజానికి అందం అనే మాటకు అర్థం, నిర్వచనం చెప్పగలిగిన వాళ్లున్నారా? కొలతల్లో ఇమిడిపోవడమే అందం అనే భావజాలాన్ని మహిళలకు తలకెక్కించడమే పెద్ద కుట్ర. -
టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్.. ఎంతో ఉపయోగకరం!
మానసిక వికాసానికి భరోసా ఇస్తుంది కేంద్రం నూతనంగా ప్రకటించిన టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. కరోనా మహమ్మారి వయస్సుతో సంబంధం లేకుండా అందరి మనస్సులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల మానసిక ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన ఆరోగ్య కౌన్సెలింగ్‌ను ప్రజలకు అందించడానికి జాతీయ టెలీమెంటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి 2022–23 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 23 టెలీ–మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల నెట్వర్క్ ద్వారా సేవలు అందుబాటులోకి తెస్తారు. బెంగళూరు లోని నిమ్హాన్స్ నోడల్ సెంటర్‌గా ఉంటుంది. ఇదే నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక మద్దతును అందిస్తుంది అని మంత్రి ప్రకటించారు. కేర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఈ సంజీవని మానసిక సేవలు మార్చి 28, 2020 నుండి (మొదటి 21 రోజుల జాతీయ లాక్డౌన్ విధించిన నాలుగు రోజుల తర్వాత) నిమ్హాన్స్ తన టోల్ ఫ్రీ నంబర్ 080– 46110007 ద్వారా లక్షకు పైగా మానసిక ఆరోగ్య సేవలను అందించింది. కర్నాటకలో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ మానస్ కార్యక్రమాలు 23 సెంటర్ ఆఫ్ ఎక్సె లెన్స్‌ల ద్వారా దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. కేర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా మానసిక ఆరోగ్య సౌకర్యాలు, నిపుణుల వివరాలు, వైద్య రికార్డులు, మానసిక సమస్యలకు అధునాతన సాంకేతికత జోడిం చడం జరుగుతుంది. మానసిక రోగుల నామినేటెడ్ ప్రతినిధుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. అదే విధంగా మనోవేదనలను పరిష్కరించడానికి మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డుతో సమన్వయం చేసుకోవడం ఉంటుంది. మానసిక వికాసానికి భరోసా ఇస్తున్నది టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. కరోనా మహమ్మారితో మారుతున్న జీవన విధానం, వృత్తి, ఉద్యోగాలు మానవాళిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. తద్వారా జీవి తంపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి. చివరకు బలవన్మరణాలకు కూడా దారితీస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా నేటి ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంటూనే స్మార్ట్ మొబైల్స్ రాకతో వారికి దూరంగా గడు పుతున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీక సతమతమవుతూ, తీవ్ర మనోవేదనకు గురవుతున్న వారికి ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కారం దొరికే అవకాశం ఏర్పడుతోంది. – డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అసోసియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ -
మనసు మాట విందాం.. మీకు అండగా మేమున్నాం!
‘నాకు బతకాలని లేదు’ ఒక నిస్సహాయ స్వరం. ఆ స్వరానికి ఓ ఆలంబన కావాలి. ‘ఎందుకలా’ అని చేతి మీద చెయ్యి వేసి అడిగే ఓ ఆత్మీయత కావాలి. ‘నీకేం తక్కువ... నువ్వు సాధించినవి తరచి చూసుకో’ అనే ధైర్యవచనం కావాలి. ‘ఉద్యోగంలో కష్టం వస్తే నీ ప్రాణం తీసుకోవడమా!! కాదు.. కాదు... ఉద్యోగం మారాలి’ అని ప్రత్యామ్నాయం చూపించే భరోసా కావాలి. పరీక్ష ఫెయిల్ అయితే ‘ఉందిగా సెప్టెంబరు’ అనే చమత్కారపు స్నేహం కావాలి. మామూలు రోజుల్లో ఈ ఆత్మీయత, స్నేహం, ధైర్యవచనం, ఆలంబన మన పక్కనే ఉండేవి. అవేవీ సమయానికి అందని వాళ్లు మాత్రమే నిస్సహాయంగా మిగిలేవాళ్లు. గడచిన రెండేళ్లుగా కరోనా ప్రపంచాన్ని కబళించేసింది. ఈ మాత్రపు ఆత్మీయవచనం చెప్పే వాళ్లను దూరం చేసింది. ఐసోలేషన్... ఐసోలేషన్... ఐసోలేషన్. కూరగాయల బండి దగ్గర కనిపించిన పక్కింటి వాళ్లను పలకరించాలంటే భయం. మనిషి కనిపిస్తే మాస్కును సరిచేసుకోవడమే దినచర్య అయింది. ఉద్యోగం ఉంటుందో పోతుందోననే భయం. వర్క్ ఫ్రమ్ హోమ్ వరమా శాపమ తెలియని ఆందోళన. ఇంట్లో ప్రతి పని సొంతంగా చేసుకోవాల్సి రావడంతో చిరాకులు. మనసులో సుడులు తిరుగుతున్న భయాలకు, చిరాకులకు అవుట్లెట్ కూడా ఇంట్లో ఒకరికొకరే అయ్యారు. మనుషులు దగ్గరగా ఉన్నారు, మానసికంగా దూరమయ్యారు. దూరమైన సంగతి కూడా తెలియనంతగా దూరమైపోయారు. స్మార్ట్ఫోన్లకు, సోషల్ మీడియాకు బానిసలైపోయారు. మగవాళ్లలో వీటన్నింటితోపాటు ఆల్కహాలు సేవనం ఎక్కువైంది. వయసు మీరిన పెద్దవాళ్లలో తమకేదైనా జరిగితే అంత్యక్రియలు కొడుకులు, కూతుళ్ల చేతుల మీదుగా సవ్యంగా సాగుతాయో లేదోననే బెంగ. పిల్లల్లో బడి గంట మోగితే పాఠాలు ఎలా చదవాలోననే బెరుకు. ఇన్ని ఆందోళనల మధ్య సాగుతోంది జీవనం. మానసిక స్థితిని అదుపులో పెట్టుకోగలిగిన వాళ్లు సంయమనం తో గడపగలిగారు. ఫ్రస్టేషన్‌ను భరించలేని వాళ్లు అరచి గోల చేసి శాంతించారు. ఆ అరుపులను భరిస్తూ, బాధితులైన బలహీనులు ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ బలిదానాలు ఎక్కువగా అల్పాదాయ వర్గాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. పని దొరక్కపోవడం ఒక కష్టం, ఉన్న నాలుగు రూపాయలు మద్యానికి ఖర్చు చేయడం, తాగిన మత్తులో గొడవలు పడడం, భర్త తన ఆధిపత్య ప్రదర్శన కోసం భార్యను రోడ్డు మీదకు లాక్కు వచ్చి మరీ కొట్టడం... కరోనా కాలంలో కరాళనృత్యం చేసిన కష్టాలు. ఈ గడ్డు పరిస్థితులు జీవితాన్ని అంతం చేసుకునే దారులుగా మాత్రం మారకూడదు, అందుకే శనివారం(8–1–2022) నాడు ‘సైకియాట్రీయట్ డోర్‌స్టెప్’ అనే కార్యక్రమం మొదలు పెట్టాం... అని చెప్తున్నారు రోష్ని వ్యవస్థాపకురాలు శశి. ప్రాణాలను నిలిపే ప్రయత్నమిది ‘‘ఆత్మహత్యలను నివారించడానికి గడచిన 24 ఏళ్లుగా పని చేస్తోంది రోష్ని సంస్థ. ‘నీ బాధ వినడానికి మేమున్నాం’ అంటూ హైదరాబాద్, బేగంపేటలో 1997లో హెల్ప్‌లైన్‌తో మొదలైన రోష్ని ఇప్పటి వరకు 98వేల ఫోన్ కాల్స్‌కు స్పందించింది. ‘తమ సమస్య ఇదీ’ అని బయటకు చెప్పుకోలేని మధ్యతరగతి మహిళలు తమ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఫోన్ చేసి సహాయం కోరుతున్నారు. అలా సహాయం కోరిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ వాళ్లు మానసికంగా దృడంగా మారేవరకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు రోష్ని వాలంటీర్లు. అలాగే పన్నెండేళ్ల కిందట మొదలు పెట్టిన కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా ముఖాముఖి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో వాళ్ల కోసం ఫ్రీ మెంటల్హెల్త్ క్యాంప్‌లు మొదలు పెట్టి 33 వేలకు పైగా పేషెంట్లకు వైద్యం చేశాం. ఇటీవల గణాంకాలు, వార్తా కథనాలను, మాకు వచ్చే ఫోన్ కాల్స్‌ను కలిపి విశ్లేషించుకున్నప్పుడు మా సేవలను మరింత గా విస్తరించి తీరాలని అర్థమైంది. 2020లో ఆత్మహత్యలు విపరీతం గా పెరిగాయి. వీటన్నింటికీ పైకి కనిపించే తక్షణ కారణాలు ఎలా ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ప్రధాన కారణం కోవిడ్ అని చెప్పక తప్పదు. తాము మానసిక వేదనకు లోనవుతున్న విషయాన్ని గ్రహించని వాళ్లే ఎక్కువ, కొందరు గ్రహించినప్పటికీ సైకాలజిస్టును, సైకియాట్రిస్టును సంప్రదించే పరిస్థితులు ఉండడం లేదు. అంతంత ఫీజులు ఇచ్చుకోలేకపోవడం, సైకాలజిస్టు ఎక్కడ ఉంటారో తెలియకపోవడం కూడా కారణమే. కాలనీకి ఒక గైనకాలజిస్టు కనిపిస్తారు, కానీ మన దగ్గర సైకాలజిస్టులు తగినంత మంది లేరు. ఉన్న వాళ్లు కూడా ఈ కాలనీలకు అందుబాటులో లేరు. అందుకే మేమే ఆ సర్వీసుని వాళ్ల ఇంటి ముంగిటకు తీసుకువెళ్తున్నాం. ఈ వైద్యానికి దూరంగా ఉండడానికి ‘పిచ్చి’ అని ముద్ర వేస్తారనే భయం కూడా కారణమే. మానసిక ఆందోళన పిచ్చి కాదని, మానసిక ఆవేదన, ఆందోళన, దిగులు, బెంగ వంటి స్థితిని సరిచేసుకుని జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఆనందకరంగా మార్చుకోవాలని పదే పదే చెప్తున్నాం. సమాజంలో మెంటల్హెల్త్ పట్ల ఉన్న అతిపెద్ద మానసిక అడ్డంకిని ఛేదించడానికి దాట్ల ఫౌండేషన్‌తో కలిసి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం’’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి బిడియం వీడండి గొంతు విప్పండి ‘సైకియాట్రీ యట్ డోర్‌స్టెప్’ వాహనంలో ఒక సైకియాట్రిస్ట్, కౌన్సెలర్, కో ఆర్డినేటర్‌తోపాటు సాధారణ మానసిక సమస్యలకు అవసరమయ్యే మందులు ఉంటాయి. ఈ సర్వీస్‌కంటే ప్రధానంగా వారిని చైతన్యపరచడం పనిగా పెట్టుకున్నాం. ఒంట్లో బాగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ఏ మాత్రం బిడియపడం, అలాగే మనసు బాగాలేనప్పుడు సైకియాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్‌ను సంప్రదించడానికి కూడా ఏ మాత్రం బిడియపడకూడదని చెప్పడం ప్రధాన కర్తవ్యం. – శశి, ‘రోష్ని’ వ్యవస్థాపకురాలు -
ఎవరి జీవితమూ పర్ఫెక్ట్ కాదు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా: సమంత
Samantha Opens Up About Her Mental Health Issues: ‘‘నేను మానసికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ వాటి నుంచి బయటపడగలిగాను. ఈ విషయంలో కొందరు సహాయం చేశారు’’ అన్నారు సమంత. ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు సమంత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘మనం ఒత్తిడితో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. సోషల్ మీడియాతో సహా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ దృష్టి మనపై ఉండటం వల్ల మనల్ని ఆందోళనకు గురి చేసే అంశాలు, మన బలహీనతలు, బాధలు వంటి వాటి గురించి మాట్లాడటం ఇబ్బందిగా మారుతోంది. పర్ఫెక్ట్గా జీవించడం ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. నన్ను నమ్మండి. ఎవరి జీవితమూ పర్ఫెక్ట్గా లేదు. కేవలం గ్లామర్ గురించి మాత్రమే కాదు.. మన జీవితాల్లోని బాధలు, ఇబ్బందికర పరిస్థితులను గురించి నాలాంటి వారు మాట్లాడితే ప్రజలు అంగీకరిస్తారనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎత్తుపల్లాలు ఉంటాయి. నేను కూడా మనసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. నా స్నేహితులు, కౌన్సిలర్స్, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలతో వాటి నుంచి బయటకు రాగలిగాను. అలాగే భవిష్యత్‌లో నా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి స్ట్రాంగ్‌గా ఉన్నాను. ఎందుకంటే నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నాకు తోడున్నారనే నమ్మకం. ఇబ్బందిపడే కన్నా మన మానసిక సమస్యలను ఇతరులతో పంచుకోవడమే ఉత్తమం’’ అని పేర్కొన్నారు. -
చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మూడో వేవ్ మూడో వేవ్ అంటూ కొంతకాలం ఆందోళనతో గడిచిపోయినా...ఆ తర్వాత ఎందుకో కరోనా కాస్త చల్లబడింది. అయితే ఒమిక్రాన్ అనే కొత్త వేరియెంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించడంతో మళ్లీ అలజడి మొదలైంది. పిల్లలపై దీని ప్రభావం పెద్దగా ఉంటుందనే భయాందోళనలు నిపుణుల్లో వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మొదటి వేవ్, రెండో వేవ్‌లో కరోనా చిన్నారులపై అంతగా ప్రభావం చూపలేదు. అయితే ఇప్పుడీ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ పిల్లలపై ఎందుకు ప్రభావం చూపనుందనే ఆందోళనకు డాక్టర్లు కొన్ని దాఖలాలు చూపుతున్నారు. అవి...∙కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి దాన్ని తొలుత 65 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వడం... ఆ తర్వాత ఆ వయోపరిమితిని 45 ఏళ్లకు తగ్గించడం... కొద్దికాలం తర్వాత 18 ఏళ్లకు తగ్గించడంతో ఇప్పటివరకు చురుగ్గా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతా కేవలం 18 ఏళ్లకు పైబడినవారికే పరిమితమైంది. కొన్ని పాశ్చాత్యదేశాల్లో ఫైజర్ వంటి వ్యాక్సిన్లు పిల్లలకూ సురక్షితమని తేలడంతో... అక్కడ 12 ఏళ్లకు పైబడిన పిల్లలకు ఇచ్చినప్పటికీ మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్న పిల్లల సంఖ్య, శాతం ఇప్పటికీ చాలా తక్కువ. ఇక మన దేశంలో నిర్వహించిన పరిశోధనల్లో సైతం మనం రూపొందించిన వ్యాక్సిన్లు చిన్నారుల్లో సురక్షితమని తేలినప్పటికీ... పిల్లలకు వేయాల్సిన మోతాదు, ఎన్ని విడతల్లో ఇవ్వాలి... ఇలాంటి మార్గదర్శకాలేవీ ఇప్పటికీ రూపొందలేదు. దాంతో అధికారికంగా 18 ఏళ్లలోపు పిల్లలంతా వ్యాక్సిన్లు వేయించుకోనివారే. ∙కనుగొన్న వెంటనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఒమిక్రాన్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. డెల్టా విషయంలో అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాతగానీ ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా చెప్పలేదు. కానీ... ఒమిక్రాన్ విషయంలో మాత్రం కేవలం వంద మందికి సోకగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి... వ్యాప్తి (ట్రాన్స్మిటబిలిటీ) : దాని వ్యాప్తి తీరును పరిశీలించినప్పుడు ఒమిక్రాన్ కనుగొన్న దేశాల్లో దాని వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారిలోనూ దీని వ్యాప్తి చురుగ్గా ఉన్నట్లు గమనించిన పరిశోధకులు... ఎలాంటి వ్యాక్సిన్ ఇవ్వని పిల్లల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంటుందేమోనని అనుమానిస్తున్నారు. చిన్నారుల్లో లక్షణాలు / చికిత్స : ఒమిక్రాన్‌లోనూ సాధారణ కరోనా లక్షణాలే ఒమిక్రాన్‌లోనూ కనిపిస్తున్నాయి. జ్వరం, తీవ్రమైన నిస్సత్తువ, నీరసం, అలసట, ఒళ్లునొప్పులు, ఎడతెరిపి లేకుండా దగ్గు, విపరీతమైన తలనొప్పి, గొంతు బొంగురుబోవడం వంటివి పిల్లల్లో కనిపించే లక్షణాలు. దాంతోపాటు పాటు చిన్నారుల ఒంటిపైన ర్యాష్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుండటం విశేషం. ఇక చికిత్స విషయానికి వస్తే... ఇప్పటివరకూ ఇస్తూ వస్తున్న సాధారణ చికిత్సే వీరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లలకు వ్యాక్సినేషన్ : మనదేశంలో పిల్లలకు ఇంకా వ్యాక్సినేషన్‌పై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అయితే పెద్దలకు ఇచ్చిన మోతాదులోనే పిల్లలకు ఇవ్వడం కుదరకపోవచ్చు. పైగా చిన్నారుల వయసును, బరువును బట్టి వారికి ఇవ్వాల్సిన మోతాదును సైతం నిర్ణయించాల్సిన అవసరముంది. ఉదాహరణకు ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వారికీ, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల వారికీ, పన్నెండేళ్ల నుంచి 18 ఏళ్లలోపు వారికి ఏయే మోతాదుల్లో వ్యాక్సిన్ ఇవ్వాలనేదీ శాస్త్రీయంగా నిర్ధారణ చేయాల్సి ఉంది. ఇప్పటికే భారత్‌లో రూపొందిన కోవాక్సిన్, జైడస్ వంటి వ్యాక్సిన్లు పిల్లల విషయంలో సురక్షితమని తేలినప్పటికీ... సరైన మార్గదర్శకాలు రూపొందేవరకు అవి పిల్లలకు లభ్యమయ్యే అవకాశం లేదు. (ప్రస్తుత వ్యాక్సినేషన్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొంటుందా అన్న సందేహం ఉన్నప్పటికీ) చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది. తీవ్రత / విస్తృతి : పిల్లల్లో వ్యాప్తివిస్తృతిపై ఇంకా అధ్యయనాలూ, పరిశీలనలూ జరుగుతున్నప్పటికీ... గతంలో ఆల్ఫా మొదలుకొని డెల్టా వరకు వచ్చిన వేరియెంట్లతో పోలిస్తే... ఒమిక్రానే పిల్లల్లో గణనీయంగా వ్యాప్తిచెందిన దాఖలాలు (డేటా) లభ్యమయ్యాయి. అయితే తీవ్రత విషయంలో ఇంకా డాక్యుమెంటేషన్ ప్రక్రియ జరుగుతోంది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా జరగకపోవడం... పిల్లలకు అంత ప్రమాదకరం కాదని మున్ముందు తేలినా... ఒకవేళ వారికి గనక వస్తే అది పిల్లల నుంచి ఇంట్లోని పెద్దలకూ, వృద్ధులకూ సోకే అవకశం ఉన్నందున... ఈ మేరకు పిల్లలు వ్యాధిని వ్యాప్తిచెందించే వాహకులు (ట్రాన్స్మిటర్స్)గా ఉండగలరనే అభిప్రాయాలు నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి ఇప్పటికి కరోనాతో హాస్పిటల్లో చేరిన చిన్నారుల విషయానికి వస్తే... దక్షిణాఫ్రికా గణాంకాల ఆధారంగా ఒమిక్రాన్‌తో చేరిన పిల్లల సంఖ్యే ఎక్కువనీ, అందునా ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని తేలింది. ఈ అంశం కూడా శాస్త్రవేత్తలు, అధ్యయన వేత్తలు, వైద్యనిపుణులను ఆందోళనలో ముంచెత్తుతోంది. డా. రవీందర్‌రెడ్డి పరిగె, సీనియర్ పీడియాట్రీషియన్ – నియోనేటాలజిస్ట్ -
ఆ సమయంలో ఈ నాలుగూ మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి.. జాగ్రత్త!!
4 Daily Habits People With Depression May Avoid: ప్రస్తుత జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ డిప్రెషన్‌కు గురౌతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు భిన్న కొత్త అలవాట్లకు బానిసవుతున్నారు. ఫలితంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది పరిస్థితి. ముఖ్యంగా ఆ టైంలో ఈ నాలుగింటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి. కొంతమంది అధిక ఒత్తిడిని తట్టుకోవడానికి వైన్, బీర్, రైస్ వైన్ లాంటి ఆల్కహాల్‌కు అడిక్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత జఠిలమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలోని కారకాలు ఒత్తిడిని మరింత పెంచుతాయట. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. డిప్రెషన్‌కు గురైనవారు సిగరేట్స్ కూడా అధికంగా కాల్చుతారు. ఈ సమయంలో ధూమపానం మాత్రమేకాదు, పొగాకు తాలూకు వేటిని కూడా తీసుకోకపోవడం మంచిది, మరికొంత మంది ఒత్తిడిలో అధికంగా ఫుడ్ తినేస్తుంటారు. అందులో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్.. వంటివి కూడా ఆరోగ్యానికి మరింత హాని కలుగజేస్తాయి. కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. సాధారణంగా కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఇతర సప్లిమెంట్లలో కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని సేవిస్తే రాత్రుల్లు నిద్రపట్టక డిప్రెషన్ తాలూకు ఆలోచనలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరేం చెయ్యాలి.. ప్రతి ఉదయం 5 గంటలకు నిద్రలేచి ధ్యానం చేయడం, చిన్న పాటి యోగాసనాలు వేయటం, బుక్స్ చదవడం, చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపటం, డ్రాయింగ్, పెయింటింగ్ లేదా కొత్ర ప్రదేశాలకు వెళ్లటం.. వంటి పనుల ద్వారా మనసును వేరే వాటిపైకి మళ్లించి జీవితాన్ని మరింత ఆనందంగా గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..! -
చిలుకలు ఎగరాలి.. నెమళ్లు పురివిప్పాలి! హాయిగా ఆడుకోనిద్దాం!
‘సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలుకలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అని కథలో వినగానే బాలల మనసు సప్త సముద్రాల అవతలకు చేరుకుంటుంది. వారి ఊహలో మర్రిచెట్టు కనిపిస్తుంది. దాని తొర్రలో ఎర్రముక్కుతో ఉన్న చిలుక. దానిని నులిమితే మాంత్రికుడి ప్రాణం పోతుంది. రాకుమారుడు ఆ సాహసం ఎలా చేస్తాడా అని వారి మనసు ఉత్సుకతతో నిండిపోతుంది. ఇవాళ కూడా బాలల చేతిలో ఒక చిలుక ఉంది. దాని పేరు సెల్‌ఫోన్. అది బాలల గొంతును పట్టుకుని ఉందా... బాలలు దాని గొంతును పట్టుకోబోతారా తేలాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానం విలువైనది. దాని అవసరం ఈ కరోనా సమయంలో విపరీతంగా తెలిసి వచ్చింది. పిల్లలు సెల్ఫోన్లు, లాప్టాప్ల ఆధారంగానే క్లాసులు విన్నారు. కొంతలో కొంతైనా తమ తరగతి స్వభావాన్ని నిలుపుకున్నారు. ఇది సాంకేతిక వల్లే సాధ్యమైంది. అదే సమయంలో ఆ సాంకేతికతే వారి ఊహా జగత్తు గొంతు నులుముతోంది. అనవసర వీడియోలకు, గేమ్‌లకు వారిని లొంగదీస్తోంది. పనికిమాలిన, ఎటువంటి వికాసం ఇవ్వని కాలక్షేపంలో కూరుకుపోయేలా చేస్తోంది. దేశంలో అలక్ష్యానికి గురయ్యే సమూహాలు తాము అలక్ష్యానికి గురవుతున్నామని గొంతెత్తుతాయి. లేదా ప్రభుత్వాలే తమ పాలసీ రీత్యానో వారికి ఓటు ఉంటుందన్న ఎరుక వల్లనో కొన్ని పనులు వారి కొరకు చేస్తాయి. కాని పిల్లలకు ఓటు ఉండదు. వారు ఏదైనా అరిచి చెప్పే వీలూ ఉండదు. దేశంలో వారికి మించిన నిర్లక్ష్యానికి గురయ్యే సమూహం ఉందా?... అందరూ ఆలోచించాలి. తాజా అధ్యయనాల్లో దేశంలో రోజుకు ముప్పైకి పైగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇళ్లల్లో వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి, చదువుకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లు ఎలాంటివో ఎవరు పట్టించుకుంటున్నారు? ‘సాంకేతిక విద్య’ విప్లవం మొదలయ్యే వరకు బాలల వికాసం ఒకలా, ఆ విద్య వల్ల వస్తున్న ఉపాధి తెలిశాక ఆ వికాసం మరోలా మారిపోయింది. ఒకప్పుడు విద్యావిధానం, తల్లిదండ్రులు చదువుతో పాటు ఆటపాటలకు, కళలకు, కథలకు చోటు ఇచ్చేవారు. ‘ఆడుకోండ్రా’ అని అదిలించేవారు. కథల పుస్తకాలు తెచ్చిచ్చేవారు. నేడు ఐదవ తరగతి నుంచే భవిష్యత్తులో తేవలసిన ర్యాంకు గురించి హెచ్చరిస్తున్నారు. ఆటస్థలానికి, లైబ్రరీకి ఏ మాత్రం చోటులేని స్కూళ్లు పిల్లల్ని సిలబస్‌ల పేరుతో తోముతున్నాయి. పిల్లలకు పార్కులు అవసరం అని ప్రభుత్వాలు భావించనప్పుడు ఆటస్థలాలు అవసరం అని విద్యా సంస్థలూ భావించవు. ఇవాళ మున్సిపాల్టీలలో, నగరాలలో ఎన్ని పిల్లల పార్కులు ఉన్నాయో చూస్తే కాంక్రీట్ల మధ్య ఊపిరి పీల్చుకోవడానికి పెనుగులాడుతున్న బాలలు కనిపిస్తారు. పిల్లలు భయం వేస్తే అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్లి దాక్కున్నట్టు వారికి ఆందోళన కలిగితే గతంలో ఏ చందమామనో పట్టుకుని కూచునేవారు. నేడు అన్ని పిల్లల పత్రికలూ మూతపడ్డాయి. వారికి కథలు చెప్పే అమ్మమ్మ, నానమ్మలు, తాతయ్యలు అనేక కారణాల రీత్యా వేరొక చోట్ల జీవిస్తున్నారు. ఒకవేళ వారు ఉన్నా ఫోన్లు, సీరియల్సు వారినీ ఎంగేజ్ చేస్తున్నాయి. పిల్లలతో మాట్లాడటానికి ఎవరికీ సమయం లేదు. పిల్లలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సెల్ఫోన్లు అడ్డు నిలుస్తున్నాయి. వారి ఆందోళనకు ఓదార్పు ఏది? ఎగరని చిలుకలు, పురి విప్పని నెమళ్లు ఉంటే ప్రకృతి ఎంత నిస్సారంగా ఉంటుందో ఆటలాడని, నవ్వని, కథ వినని, వినిపించని, బొమ్మలేయని, పాట పాడని, నృత్యం చేయని పిల్లలు ఉంటే కూడా ప్రకృతి అంతే నిస్సారంగా ఉంటుంది. నవంబర్ 14 (బాలల దినోత్సవం) సందర్భంగా గతంలో తెలుగునాట వెలిగిన బాలల పత్రికల నుంచి ఏరి కూర్చిన సంజీవని పుల్లలతో ఈ సంచికను తీర్చిదిద్దాం. ఇలాంటివి కదా పిల్లలకు కావాలసింది అని అనిపిస్తే అవి ఎందుకు వారికి లేకుండా పోయాయో అందరూ ఆలోచిస్తారని ఆశ. చిలుకలను ఎగురనిద్దాం. నెమళ్లను పురివిప్పనిద్దాం. వారి ఆటస్థలాలను వారికి అప్పజెబుదాం. వారు ఆటలాడుకునే పిరియడ్లను స్కూళ్లలో వెనక్కు తెద్దాం. ర్యాంకులు అవసరమైన చదువులు మాత్రమే ఉండవని చెబుదాం. ఈ ప్రపంచం వారి కోసం ఎన్నో గండభేరుండ పక్షులను సిద్ధం చేసి వీపు మీద ఎక్కించి వారు కోరుకున్న విజయ తీరాలకు చేరుస్తుందని నమ్మకం కలిగిద్దాం. బాలల వికాసమే సమాజ వికాసం. – బాలల దినోత్సవం ప్రత్యేకం చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
క్రయింగ్ రూమ్: రండి... తనివితీరా ఏడ్వండి
Spain Starts Crying Room To Banish Mental Health Taboo మాడ్రిడ్: మన సమాజం ఏడ్చే వారిని బలహీనులుగా భావిస్తుంది. ఒకవేళ ఆడపిల్ల ఏడిస్తే జాలి చూపుతారు.. మగాడు ఏడిస్తే గేలి చేస్తారు. కారణం ఆడవారు సున్నితంగా ఉంటారు.. మగాళ్లు కాస్త ఎక్కువ మరోధైర్యాన్ని కలిగి ఉంటారని భావిస్తారు. అందుకే మగాళ్లు ఏడిస్తే వింతగా చూస్తారు. కానీ ఫీలింగ్స్‌కు ఆడా, మగా తేడా ఉండదు. నవ్వోస్తే నవ్వాలి.. ఏడుపొస్తే ఏడ్వాలి. అలా కాకుండా మన ఫీలింగ్స్‌ని లోపలో అణుచుకుంటే.. ఆ ప్రభావం మన మానసిక ఆరోగ్యం మీద పడుతుంది. ఆ తర్వాత అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది స్పెయిన్ ప్రభుత్వం. తమ దేశ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న స్పెయిన్ తాజాగా దేశంలో క్రయింగ్ రూమ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరికైనా బాధగా అనిపిస్తే.. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. ఈ క్రయింగ్ రూమ్‌కి వచ్చి తనివి తీరా ఏడవచ్చు. మనసులోని భారాన్ని దింపుకోవచ్చు. ఇక్కడ ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కాల్ చేసి మన మాట్లాడుకోవచ్చు. (చదవండి: నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...) ఈ సందర్భంగా ఓ స్వీడిష్ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘చాలా దేశాల్లో ఏడ్వడం, ఇతరుల నుంచి సానుభూతి, సాయం కోరడాన్ని చిన్నతనంగా భావిస్తారు. దీనివల్ల మనసులోని బాధను బయటకు వెల్లడించకుండా.. లోలోన కుమిలిపోతూ.. మానసికంగా కుంగిపోతారు. స్పెయిన్ ప్రభుత్వం ఆలోచన ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. పౌరుల మానసిక ఆరోగ్యం పట్ల స్పెయిన్ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయం’’ అన్నాడు. వారం రోజుల క్రితం స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ప్రత్యేకంగా 100-మిలియన్ యూరోల ($ 116 మిలియన్) మానసిక ఆరోగ్య సంరక్షణ డ్రైవ్‌ను ప్రకటించారు, ఇందులో 24 గంటల సూసైడ్ హెల్ప్‌లైన్ వంటి సేవలు ఉంటాయి. (చదవండి: పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం) "మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం నిషిద్ధం కాదు. ఇది పబ్లిక్ హెల్త్ సమస్య.. దీని గురించి మనం తప్పక మాట్లాడాలి, సమస్యను బయటకు వెల్లడించాలి.. తదనుగుణంగా వ్యవహరించాలి" అని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10 న ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా పెడ్రో శాంచెజ్ మానసిక అనారోగ్యం గురించి మాట్లాడాడు. 2019 లో, స్పెయిన్‌లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇది సహజ కారణాల వల్ల మరణించిన వారి తర్వాత అత్యధికంగా అనగా రెండో స్థానంలో ఆత్మహత్య చేసుకుని మరణించివారే ఉంటున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం, 10 మంది కౌమారదశలో ఉన్న వారిలో ఒకరు మానసిక ఆరోగ్య పరిస్థితితో బాధపడుతుండగా, మొత్తం జనాభాలో 5.8శాంతం మంది ఆందోళనతో బాధపడుతున్నారు. చదవండి: తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని.. -
Mental Health: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..!
‘అతి చేస్తే గతి తప్పుతుంది’ అని పెద్దలు ఊరికే అనరు..! ఏదైనా మితంగానే ఉండాలి. టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపతుందని రకరకాల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు టీనేజర్స్ అతుక్కుపోతున్నారని, దీని వల్ల నష్టం జరుగుతుందనే మాట వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. హానికరమైన కంటెంట్ నుంచి టీనేజర్స్‌ను దూరంగా పెట్టే చర్యలు చేపట్టనుంది. ఉదాహరణకు ఒక టీనేజర్ అదేపనిగా ఏదైనా కంటెంట్ చూస్తున్నాడనుకుందాం, అట్టి కంటెంట్ హానికరమైనదైతే దాన్ని బ్లాక్ చేస్తుంది. అదేపనిగా ఇన్‌స్టాగ్రామ్‌ను యూజ్ చేస్తుంటే ఇక చాలు... టేక్ ఏ బ్రేక్ అని హెచ్చరిస్తుంది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఫేస్‌బుక్‌కు కూడా వర్తిస్తాయా? అనేది ఇంకా తెలియదు. చదవండి: ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా.. -
Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు..
చాలా మందికి అత్యంత ఇష్టమైన పానియం కాఫీ. కొంతమందికైతే కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభంకాదు. ఐతే కాఫీ వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదని కొన్ని పరిశోధనలు వెల్లడించినప్పటికీ.. దీనిని అధికంగా తీసుకుంటే మాత్రం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత జీవనశైలిలో అనేక మంది దీనికి అడిక్ట్ అయ్యారనడంలో సందేహం లేదు. కాఫీ తాగడం మానెయ్యడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనుభవపూర్వకంగా మీరే తెలుసుకుంటారు. వాటిల్లో కొన్ని మీకోసం.. ఎనర్జీ మరింత పెరిగినట్లు అనిపిస్తుంది కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఎనర్జీ బూస్టర్ అని మీరు ఇంతకాలం భావించి ఉండవచ్చు. కానీ దీనిని అధికంగా తీసుకున్నట్లయితే శక్తి హీణత లేదా అలసటకు కారణమవుతుందని మీకు తెలుసా! కాఫీ తీసుకోవడం ఎప్పుడైతే మానేస్తారో.. శరీరానికి నిజంగా శక్తినిచ్చే పోషకాలను గుర్తించగలుగుతారు. అలాగే నిద్ర, స్ట్రెస్ హైడ్రేషన్, పోషకాహారం, యోగాలపై మరింత దృష్టి నిలపగలుగుతారు కూడా. కాబట్టి కాఫీతాగడం మానేస్తే.. రోజుమొత్తానికి అవసరమైన కాఫీకంటే మెరుగైన శక్తిని పొందుకుంటారనడంలో సందేహం లేదు. మంచి నిద్ర వస్తుంది రాత్రిపూట కప్పు కాఫీ తాగడం వల్ల దానిలోని కెఫెన్ మీకు సరిపడినంతగా నిద్రపట్టకుండా చేసి, నిద్రలేమికి కారణమవుతుంది. ఐతే కాఫీ మానేస్తే కెఫెన్ కంటెంట్ లేకపోవడం వల్ల మీరు హాయిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. బరువులో మార్పులు లేకపోవడం కాఫీ తాగే అలవాటును మానుకోవడం వల్ల మీ బరువులో ఎటువంటి తేడా కనిపించదని నిపుణులు చెబుతున్నారు. కొందరు బరువు తగ్గడం లేక పెరగడం వంటివి సంభవిస్తాయేమోనని అనుకుంటారు. ఇది పూర్తిగా అపోహమాత్రమే. కాబట్టి మీరు రిలాక్స్డ్గా ఉండొచ్చు. పైగా మీ శరీరంలో కేలరీల స్థాయిలు తగ్గి, కొన్ని కిలోల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంగ్జైటీ స్థాయిలు తక్కువ కాఫీ తాగిన వెంటనే మీలో యాంగ్జైటీ పెరుగుతుంది. కెఫిన్ కంటెంట్ దీనికి ప్రధాన కారణం. కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తే, కేంద్ర నాడీ వ్యవస్థ, గుండె కండరాల పనితీరును ఉత్తేజపరుస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి కాఫీ తాగే అలవాటు మానుకుంటే ఆందోళన మీ చెంతకు చేరదు. తలనొప్పి, చికాకు నుంచి విముక్తి తలనొప్పి, చిరాకు, అలసట, ఒత్తిడి వంటి లక్షణాలు మీలొ ఎప్పుడైనా కనిపించాయా? సాధారణంగా కాఫీ తాగేవారు తలనొప్పి, అలసటను అనుభవిస్తారు. కానీ కాఫీ అలవాటును మానేసిన కొన్ని రోజుల్లోనే ఈ లక్షణాల నుంచి బయటపడగలుగుతారని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! -
‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’
బెంగళూరు: మనది పురుషాధిక్య సమాజం. ఇక్కడ చాలా మంది మగవారు మహిళ అంటే కేవలం ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం కావాలని భావిస్తారు. వారికంటూ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు ఉండకూడదని భావిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. వీరిలో సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు. స్త్రీ అనగానే వారి నాలుకలు మడతపడతాయి.. మర్యాద వెనక్కి వెళ్తుంది. మహిళలను ఎంత తక్కువ చేసి మాట్లాడితే.. వారికి అంత సంతృప్తి కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్. ఈతరం ఆధునిక భారతీయ మహిళ ఒంటరిగా జీవించాలని ఆశిస్తుంది.. పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.. ఇది మంచి పరిణామం కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు. ఆ వివరాలు.. ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి డాక్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. ఏంటంటే మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు. పిల్లల కోసం సరోగసి విధానాన్ని ఎంచుకుంటున్నారు. మన ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’’ అంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. (చదవండి: ‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’) అంతేకాక ‘‘ప్రస్తుతం మనం విదేశీ సంస్కృతిని అవలంబించడానికి ఉత్సహం చూపుతున్నాం. దానిలో భాగంగా తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అన్నారు. ఆడవారి గురించి మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏ వేదిక మీద ఉన్నారు.. ఏ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఏం మాట్లాడుతున్నారు. ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా చెక్ చేసుకొండి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ #WATCH | ...Today we don't want our parents to live with us. A lot of modern women in India want to stay single. Even if they get married, don't want to give birth. Paradigm shift in our thinking,it's not good: Karnataka Health Min on World Mental Health Day,at NIMHANS, Bengaluru pic.twitter.com/LkX7Ab7Sks — ANI (@ANI) October 10, 2021 -
సైకిల్ ర్యాలితో మానసిక ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు
ఢిల్లీ: మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా దేశ రాజధాని ఢిల్లీలో సైక్లోథాన్ లేదా సైకిల్ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని వీ4ఏ సైక్లింగ్ అండ్ రన్నింగ్ క్లబ్ భాగస్వామ్యంతో ఏడీఆర్‌ఏ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది యువకులు గ్రీన్ టీ షర్ట్స్ ధరించి క్రోన్ ప్లాజా, ఓక్లా తదితర ప్రాంతాల నుంచి కుతిబ్మినార్ వరకు ర్యాలీ చేశారు. ((చదవండి: ‘ఇలా అయితే ఢిల్లీ అంధకారంలోకే’) ఈ సందర్భంగా ఏఆర్‌డీఏ డైరెక్టర్ వెస్టన్ డేవిస్ మాట్లాడుతూ..."ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా స్నేహితులు, కొలిగ్స్ ద్వారా సరికొత్త సమస్యలను తెలుసుకోగలం. అంతేకాదు ఈ సమస్యను ఎలా అధిగమించాలో ప్రజలకు తెలియజేయగలుగుతాం. ఈ కార్యక్రమాల ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవాళ్లకు మా వంతు సాయం అందిచగలుగుతున్నాం" అని చెప్పారు. 2017లో భారతదేశంలో జరిపిన అధ్యయనాల్లో ప్రతి ఏడు గురు భారతీయుల్లో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ సోసైటీలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కొంత వివక్షకు గురవుతున్నట్లు కూడా అధ్యయనాలు వెల్లడించాయి. కోడిడ్-19 మహమ్మారి కారణంగా తమ వాళ్లను కోల్పోవడం లేదా ఉపాధి కోల్పోవడం వంటి తదితర కారణాలతో మానసిక రోగుల సంఖ్య పెరిగిందని అందువల్లే ఈ అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు ఏడీఆర్‌ఏ ఇండియా పేర్కొంది. (చదవండి: "కదిలే టాటుల అద్భుతమైన వీడియో") -
మానసిక ఆరోగ్యం మనకాలపు అవసరం
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్– 19 మహమ్మారి ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల లోనే కాకుండా మానసిక సంక్షోభాన్ని కూడా తెచ్చి పెట్టింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లయిన వైద్య సిబ్బంది, పోలీస్, శానిటేషన్ సిబ్బందితో పాటు ఒంటరిగా జీవించేవారిని మరింత కృంగదీసింది. అభివృద్ధి చెందుతున్న భారత్‌లాంటి దేశాలలో 6–7% ప్రజలు మానసిక వ్యాధులతో సతమతమవు తున్నారు. వారు కోల్పోయే ఆరోగ్యవంతమైన రోజులు మలేరియా, టీబీ, డయేరియా కన్నా ఎక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 రిపోర్టు, ప్రతి నాలుగు కుటుంబాలలో ఒక కుటుంబంలోని సభ్యులు ప్రవ ర్తనా సంబంధిత రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ రుగ్మతలు వీరి విద్య, ఉపాధి మార్గాలను దెబ్బకొట్టడమే కాకుండా, వీరి కుటుంబ సభ్యుల పైన కూడా ప్రభావం చూపుతాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్య పరిరక్షణకు కూడ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనికి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఒక సందర్భం చేసుకోవాలి. ఈ 2021 థీమ్‌ను ‘మెంటల్ హెల్త్ ఇన్ ఆన్ అన్ఈక్వల్ వరల్డ్’గా ప్రకటించారు. మానసిక ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి అసమానతలు ఉండకూడ దని ఈ థీమ్ ముఖ్యోద్దేశం. ఎందుకంటే బాధితుల్లో 75–95 శాతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. వీరంతా వైద్యానికి ఆమడదూరంలో ఉన్నారు. ధనిక దేశాలలోనూ సేవలు ఆశాజనకంగా లేవు. దీనికి కారణం, ‘ఆరోగ్య బడ్జెట్’లోని నిధులలో మానసిక ఆరోగ్య సేవలకు కేటాయించేవి అత్యల్పం కావడం. చాలా కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి, అనేక ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆ తరువాత జరిగిన పలు పరిణామాలకు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాయి. లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక దూరం పాటిస్తూ ఉండటం, ఇంటి నుండి పనులు చేయడం వలన కూడ కొందరిలో డిసోసియేటివ్, సైకోటిక్, హైపోకాండ్రి యాక్ లక్షణాలు కనిపించ డంతో పాటు, ఓసీడీలతో కూడా సతమతవుతున్నారు. మానసిక వైద్యుడిని సంప్రదించడానికి నిరాసక్తతతో పాటు, మానసిక వ్యాధులను ఒక కళంకంగా భావించడం వలన వ్యాధి తీవ్రత పెరిగి ఆత్మహత్యా ప్రయత్నాల వరకు వెళ్ళుతున్నారు. కరోనాను అధిగ మించడం కోసం ఎంచుకున్న లాక్డౌన్ల వలన ఈ మానసిక రుగ్మతలు కౌమారదశ వారిలో అధికంగా బయటపడుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేలా ‘మెంటల్ హెల్త్ డే’ నాడు లోకల్‌గానూ, గ్లోబల్గానూ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. సివిల్ సొసైటీలుగా ఏర్పడి, వారి ప్రాంతంలో మానసిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, వారి గురించి అందుబాటులో ఉండే పీహెచ్సీ, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించే విధంగా అవగాహన కలిగించాలి. మొదట సమస్యను గుర్తించి, దాని గురించి బయట చెప్పుకొనే విధంగా ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 1982లో ‘నేషనల్ మెంటల్ హెల్త్ మిష న్’ను ఏర్పాటు చేసింది. ‘బళ్ళారీ మోడల్’ నమూ నాతో ‘డిస్ట్రిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’ ఆవిష్కరించి మొదట నాలుగు జిల్లాలతో మొదలుపెట్టి వంద జిల్లాలలో అమలు చేయడానికి ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా కమ్యూనిటీ స్థాయి నుండి సమాజం పాత్ర ఉండేలాగ, వ్యాధిని ముందుగా గుర్తించడం, వైద్య సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వడం, పరిశోధన, ప్రజావగాహన కార్యక్రమాలు నిర్వహిం చడం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సొంతం చేసుకొని మానసిక ఆరోగ్య సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలి. డాక్టర్ కడియం కావ్య వ్యాసకర్త పాథాలజీ విభాగ స్పెషలిస్ట్, వర్ధన్నపేట కడియం ఫౌండేషన్ చెయిర్ పర్సన్ (అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం)