
క్రయింగ్ రూమ్ కాన్సెప్ట్‌ని తీసుకువచ్చిన స్పెయిన్
Spain Starts Crying Room To Banish Mental Health Taboo మాడ్రిడ్: మన సమాజం ఏడ్చే వారిని బలహీనులుగా భావిస్తుంది. ఒకవేళ ఆడపిల్ల ఏడిస్తే జాలి చూపుతారు.. మగాడు ఏడిస్తే గేలి చేస్తారు. కారణం ఆడవారు సున్నితంగా ఉంటారు.. మగాళ్లు కాస్త ఎక్కువ మరోధైర్యాన్ని కలిగి ఉంటారని భావిస్తారు. అందుకే మగాళ్లు ఏడిస్తే వింతగా చూస్తారు. కానీ ఫీలింగ్స్‌కు ఆడా, మగా తేడా ఉండదు. నవ్వోస్తే నవ్వాలి.. ఏడుపొస్తే ఏడ్వాలి. అలా కాకుండా మన ఫీలింగ్స్‌ని లోపలో అణుచుకుంటే.. ఆ ప్రభావం మన మానసిక ఆరోగ్యం మీద పడుతుంది. ఆ తర్వాత అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి.
అయితే వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది స్పెయిన్ ప్రభుత్వం. తమ దేశ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న స్పెయిన్ తాజాగా దేశంలో క్రయింగ్ రూమ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరికైనా బాధగా అనిపిస్తే.. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. ఈ క్రయింగ్ రూమ్‌కి వచ్చి తనివి తీరా ఏడవచ్చు. మనసులోని భారాన్ని దింపుకోవచ్చు. ఇక్కడ ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కాల్ చేసి మన మాట్లాడుకోవచ్చు.
(చదవండి: నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...)
ఈ సందర్భంగా ఓ స్వీడిష్ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘చాలా దేశాల్లో ఏడ్వడం, ఇతరుల నుంచి సానుభూతి, సాయం కోరడాన్ని చిన్నతనంగా భావిస్తారు. దీనివల్ల మనసులోని బాధను బయటకు వెల్లడించకుండా.. లోలోన కుమిలిపోతూ.. మానసికంగా కుంగిపోతారు. స్పెయిన్ ప్రభుత్వం ఆలోచన ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. పౌరుల మానసిక ఆరోగ్యం పట్ల స్పెయిన్ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయం’’ అన్నాడు.
వారం రోజుల క్రితం స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ప్రత్యేకంగా 100-మిలియన్ యూరోల ($ 116 మిలియన్) మానసిక ఆరోగ్య సంరక్షణ డ్రైవ్‌ను ప్రకటించారు, ఇందులో 24 గంటల సూసైడ్ హెల్ప్‌లైన్ వంటి సేవలు ఉంటాయి.
(చదవండి: పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం)
"మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం నిషిద్ధం కాదు. ఇది పబ్లిక్ హెల్త్ సమస్య.. దీని గురించి మనం తప్పక మాట్లాడాలి, సమస్యను బయటకు వెల్లడించాలి.. తదనుగుణంగా వ్యవహరించాలి" అని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10 న ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా పెడ్రో శాంచెజ్ మానసిక అనారోగ్యం గురించి మాట్లాడాడు.
2019 లో, స్పెయిన్‌లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇది సహజ కారణాల వల్ల మరణించిన వారి తర్వాత అత్యధికంగా అనగా రెండో స్థానంలో ఆత్మహత్య చేసుకుని మరణించివారే ఉంటున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం, 10 మంది కౌమారదశలో ఉన్న వారిలో ఒకరు మానసిక ఆరోగ్య పరిస్థితితో బాధపడుతుండగా, మొత్తం జనాభాలో 5.8శాంతం మంది ఆందోళనతో బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment