crying
-
Priyanka Chopra: కడవల కొద్దీ కన్నీళ్లు వచ్చేస్తాయ్..!
బాలీవుడ్ ప్రసిద్ధ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఫ్యాషన్, నటనల పరంగా సాటిలేరవ్వరూ. తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించి, వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఆమెకు చిన్న సంఘటనకు కూడా కన్నీళ్లు(cry) ధారాళంగా వచ్చేస్తాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పైగా ఆపడం తన తరం కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. నిజానికి ప్రియాంక భావోద్వేగాలను హ్యాండిల్ చేయగలదు. వాటి విషయంలో భయపడదు కానీ, బాధ కలిగించే సంఘటనలు జరిగితే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయని చెబుతోంది. అస్సలు ఇలా ఎందుకు జరుగుతుంది. కొందరూ అస్సలు ఏడుపుని బయటకి వ్యక్తం చెయ్యరు. మరికొందరు మాత్రం కళ్ల కిందే నీళ్ల కుండ పెట్టుకున్నట్లుగా వలవల ఏడ్చేస్తుంటారు ఎందుకని..? అంటే..మన శరీరం భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన మార్గమే ఏడుపు అని చెబుతున్నారు మానసిక నిపుణులు(Psychologist). అయితే కొందరూ అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటివాళ్లు తమ భావోద్వేగాలని ఆపుకోలేరు. దీంతో సులభంగా కనుల నుంచి నీళ్లు కుండపోత వాన వచ్చినట్లుగా వచ్చేస్తుంటాయి ఇలా ఎందకంటే..సున్నితమైన భావ్వోద్వేగం..అధిక సున్నితమై భావోద్వేగ కలవారు చాలా సులభంగా కన్నీళ్లు పెట్టేస్తుకుంటారట. వారి భావోద్వేగాలు ఇట్టే బయటపడిపోతాయట. దీంతో ఇలాంటి వ్యక్తులు తన భావోద్వేగం తగ్గేంత వరకు ఏడుస్తూనే ఉంటారట. ఒత్తిడి కారణంగా..ఒత్తిడి, ఆందోళన కారణంగా మనసు బరువు ఎక్కువైపోయి ఉంటే ఒక్కసారిగా ఏడుపు రూపంలో అది వ్యక్తమవుతుందట. దీన్ని ప్రెషనర్ కుక్కర్‌తో పోల్చి చెప్పొచ్చని అంటున్నారు. అంతేగాదు మనస్తత్వ శాస్త్రవేత్తలు భావోద్వేగాలతో మనసు నిండిపోయినప్పుడూ దాన్ని శరీరం ఏడుపు రూపంలో ఇలా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు. హార్మోన్ల వల్ల...హార్మోన్ల మార్పులు కూడా కన్నీటిని గణనీయంగా ప్రభావితం చేస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో, వ్యక్తులు ఏడుపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు తమ రుతు చక్రాల సమయంలో అధిక భావోద్వేగాలను అనుభవిస్తారు.నిద్ర లేమి, మానసిక ఆరోగ్యంనిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను బలహీనపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యక్తులు చిన్నదానికి కూడా అతిగి రియాక్ట్ అయ్యి కన్నీళ్లు కార్చేస్తారని చెబుతున్నారు. కొందరికి రోజువారీగా ఏడుపు ఏదో రూపంలో వస్తే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.ఏడుపు ఆరోగ్యకరమైనదేనా?భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఏడుపు అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన మార్గం. భావాలను అణచివేయడం కంటే ఏడవడమే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల గుండెల్లో భారం తగ్గి ప్రశాంతంగా ఉంటారట. అయితే, ఏడుపు అధికంగా లేదా అదుపు చేయలేనిదిగా మారితే మాత్రం అతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. సరైన మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని సూచిస్తున్నారు. (చదవండి: -
గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ.. రాజీనామా చేస్తానంటూ..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దళిత బాలిక హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై అయోధ్యకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన గుక్కపెట్టి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ పవన్ పాండే.. అవధేష్‌ను ఊరడిస్తూ కనిపించారు.హత్యకు గురైన బాధిత దళిత బాలిక కుటుంబ సభ్యులను శనివారం అవధేష్ ప్రసాద్(Avadhesh Prasad) కలిశారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అవధేష్ మాట్లాడుతూ ‘లోక్‌సభలో ప్రధాని మోదీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతాను. ఈ విషయంలో న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తాను. మన బిడ్డ గౌరవాన్ని కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఇది దేశంలో అత్యంత బాధాకరమైన ఘటన. यह जघन्य अपराध बेहद दुःखद हैं।अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025అయోధ్యలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై అత్యాచారం జరిపి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్న స్థితిలో కాలువలోకి విసిరేశారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది’ అని చెబుతూ అవధేష్ మీడియా ముందు గుక్కపెట్టి ఏడ్చారు. కాగా అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానా(Milkipur Assembly constituency)నికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ కుమారుడు బరిలో ఉన్నారు. అటువంటి స్థితిలో అవధేష్ రోదిస్తున్న వీడియో వైరల్(Video goes viral) అయ్యింది. దీంతో అతని తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కిపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్టికానున్నాయి. మిల్కిపూర్ సీటును గెలుచుకునేందుకు అటు సమాజ్‌వాదీ పార్టీ, ఇటు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు -
Kolkata: సీఎం మమత చేసిందేమీ లేదు: బాధితురాలి తండ్రి
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా బాధితురాలి తండ్రి పడుతున్న ఆవేదనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో బాధితురాలి తండ్రి సీఎం మమతా బెనర్జీపై పలు ఆరోపణలు చేశారు. అత్యాచార బాధితురాలి తండ్రి రోదిస్తూ ‘ఈ కేసులో సీఎం (మమతా బెనర్జీ) పాత్రపై మాకు సంతృప్తి లేదు. ఆమె ఏ పనీ చేయలేదు. ఈ ఘటనలో డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని మేము మొదటి నుంచి చెబుతున్నాం. ఈ సంవత్సరం దుర్గాపూజను ఎవరూ జరుపుకోరని మేము భావిస్తున్నాం. ఎవరైనా సంబరాలు చేసుకున్నా వారు ఆనందంగా జరుపుకోలేరు. ఎందుకంటే అందరూ బెంగాల్ ప్రజలే, దేశం నా కూతురిని తన కూతురిగా భావిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: సుప్రీం డెడ్‌లైన్ బేఖాతరు.. సమ్మె ఆపని బెంగాల్ డాక్టర్లుకాగా ఈ ఘటనను అనువుగా మలచుకుని కేంద్రం తమపై కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో కొన్ని వామపక్ష పార్టీల ప్రమేయం కూడా ఉందన్నారు. అన్నారు. రాష్ట్ర సచివాలయం నబన్నలో జరిగిన పరిపాలనా సమీక్షా సమావేశంలో మమత మాట్లాడుతూ బాధితురాలి తల్లిదండ్రులకు తాను ఎప్పుడూ డబ్బు ఇవ్వజూపలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. పొరుగు దేశంలో నెలకొన్న గందరగోళాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని, భారత్, బంగ్లాదేశ్‌లు వేర్వేరు దేశాలన్న విషయాన్ని వారు మరిచిపోయారని మమత పేర్కొన్నారు. #WATCH | West Bengal | Kolkata's RG Kar Rape and murder incident | Victim’s father breaks down, says, "...We are not satisfied with the role of the CM (Mamata Banerjee) in the case...She did not do any work...The incident which occurred with my daughter, we have been saying this… pic.twitter.com/u65SQrE2Ma— ANI (@ANI) September 11, 2024 -
టీచర్ వెళ్లిపోతున్నాడని బాధతో ఎక్కెక్కి ఏడ్చిన చిన్నారి
-
సంతాపం.. సగం చేటు!
పుట్టెడు కష్టం వచ్చి శోకసంతాపాల్లో మునిగి ఉన్న వ్యక్తిని, ‘ఊరుకో, దుఃఖించకు!’ అంటే ఊరుకోడు. ఊరుకోలేడు. అనుకోకుండా తీవ్రమైన కష్టాలు ఎదురయినప్పడు మనిషికి సంతాపం, దిగులు, దుఃఖం కలగటం మామూలు విషయమే. కొన్ని పరిమితులలో ఉన్నవరకూ అది మానసిక ఆరోగ్యానికి మంచిది కూడా!అయితే ఘడియకో, గంటకో, రోజుకో, వారానికో ఎలాగోలా దాన్ని అధిగమించాలి. బాధే సౌఖ్యమనే భావన పట్టుకొని, శోకపు ఊబి నుంచి బయటపడే ప్రయాస చేయని దేవదాసు మనసు మీదా, జీవితం మీదా అదుపు కోల్పోయి మరింత శోకం కొని తెచ్చుకొన్నవాడయ్యాడు. సఫల జీవనం కోరేవాడికి సంతోషం సగం బలం. సంతాపం సగం చేటు.సందర్భానికి సరిపడని నవ్వులాగా, దీర్ఘకాలం కొనసాగే సంతాపం కూడా నాలుగందాల చేటు అంటుంది మహాభారతం. ‘సంతాపాత్ భ్రశ్యతే రూపం, సంతాపాత్ భ్రశ్యతే బలమ్’... దీర్ఘ శోకం వల్ల శరీరం చిక్కి, ముఖం నిస్తేజమై, ఆకారం వికారమవుతుంది. సంతాపం వల్ల బలం– అటు మనోబలమూ, ఇటు శరీర బలమూ– క్షీణించటం జరుగుతుంది. ‘సంతాపాత్ భ్రశ్యతే జ్ఞానం, సంతాపాత్ వ్యాధిం బుచ్ఛతి’... దుఃఖం వల్ల వివేచనా, జ్ఞానమూ సన్నగిల్లుతాయి. మితిమీరిన సంతాపం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.శోకించటం వల్ల, కోల్పోయింది తిరిగిరాదు. తిరిగి రావాలంటే కావాల్సింది ప్రయాస. ఆ ప్రయాసకు శోకం ప్రతిబంధకం. శోకం వల్ల, శోకించేవాడికి లాభం శూన్యం. అతడి శత్రువులకు మాత్రం అతడి శోకం ఆనందాన్నిస్తుంది అంటాడు విదురుడు. – ఎం. మారుతి శాస్త్రిఇవి చదవండి: సంగీతానికి ఆ శక్తి ఉందా? -
ఏడవటం ఆరోగ్యానికి మంచిదా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఏడుపు అనేది శరీరం ఎదుర్కొనే సహజ ప్రతిస్పందన. ఈ ఏడుపు వల్ల మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట. దీని కారణంగా మనసు, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తనవితీరా ఏడ్చి బాధను కన్నీటి రూపంలో పోగొట్టుకుంటే..శరీరం, మనసు రెండు బాగుంటాయని చెబుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మనసుకు ఈ ఏడుపు స్వీయ ఉపశమనం అని అంటున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందామా..!భావోద్వేగాల కారణంగా శరీరంలో సహజ ప్రతిస్పందనగా ఏడుపు వస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా ఒత్తిడి హార్మోన్లలను విడుదల చేసి భావోద్వేగ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఈ ఏడుపు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు ఒక రకంగా ఈ ఏడుపు మనకు సానుభూతి చూపించేలా చేసి సామాజికి బంధాలను బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతుంది.ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు..ఇది మనసుకు, శరీరానికి మంచి ఓదార్పునిస్తుంది. ఎందుకంటే..ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది కాబట్టి మనసుకు, దేహానికి తెలియని ఓదార్పుని, స్వాంతనను ఇస్తుంది. ఇది మనసుకు ఒక మంచి రిలీప్ని అందిస్తుంది. కన్నీళ్ల వల్ల ఎండార్ఫిన్ విడుదలవ్వుతాయి. ఇవి శరీరానికి సహజ నొప్పి నివారిణిలా ప్రశాంతతను చేకూరుస్తాయి.అంటే.. ఏడుపు ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్లు శారీరక, మానసిక నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయిని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా నొప్పిని నియంత్రించి విశ్రాంతిని కలుగుచేయడమే గాక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఏడుపు మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరచడంలో ఉపకరిస్తుంది. మంచి నిద్రకు ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నారు. అలా అని నిద్ర కోసం రోజువారీగా ఏడుపుని అలవాటు చేసుకోమని కాదు. బాగా ఏడ్చినప్పుడూ ఆందోళన తగ్గిపో ప్రశాంతంగా నిద్రపోతారని అంటున్నారు. దీనివల్ల మనసు తేలిక పడి భయాందోళనలు తగ్గుతాయి. ఫలితంగా నిద్రకు భంగం ఏర్పడదని నిపుణుల చెబుతున్నారు. ఏడుపు కళ్లను లూబ్రికేట్ చేస్తుంది. ఫలితంగా పొడిబారకుండా ఉండి కార్నియాను తేమగా ఉండేలా చేస్తుంది. అంతేగాదు ఈ ఏడుపు ద్వారా వచ్చే కన్నీళ్లు, దుమ్ము, ఇతర శిథిలాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది కూడా. పైగా అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.పిల్లల్లో ఈ ఏడుపు ఊపిరి పీల్చుకోవడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి శ్వాసనాళాలను శుభ్రపరిచి శ్వాస ద్వారా ఎక్కువ ఆక్సిజన్ని తీసుకునేలా చేయడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. ఎంత మేర ఏడవాలి అంటే..దీనికి ఎలాంటి ప్రమాణం లేదు. ఆయా వ్యక్తుల భావోద్వేగ సామర్థ్యం, కారణాలు, తట్టుకునే పరిస్థితులపై ఆధారపడి ఈ ఏడుపు రావడం అనేది ఉంటుంది. ఒకరి నుంచి మరోకరికి ఈ ఏడుపు వచ్చే విధానం వేరుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైన ఈ ఏడుపు అనేది సహజమైన ఆరోగ్యకర భావోద్వేగ ప్రతిస్పందన. ఇది భావోద్వేగాలు, ఒత్తిడిని విడుదల చేసేందుకు ఉపయోగపడే అద్భుతమైన సాధనం. కొందరూ తరుచుగా ఏడవడంలో ఉపశమనం పొందొచ్చు. మరికొందరూ తమ భావోద్వేగాలను భిన్నంగా వ్యక్తం చేయవచ్చు లేదా వ్యక్తీకరించొచ్చు.(చదవండి: -
Alaska Airlines Boeing 737-9 Max: గాల్లో గజగజ
అది అమెరికాలో ఓరెగాన్‌లోని పోర్ట్లాండ్ విమానాశ్రయం. శుక్రవారం సాయంత్రం 4.52 గంటలు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన అత్యాధునిక బోయింగ్ 737 మాక్స్ 9 విమానం 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కాలిఫోర్నియాలోని ఒంటారియో బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని, చూస్తుండగానే వేగం పుంజుకుని దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. బయల్దేరిన ఆరు నిమిషాలకే విమానం రెక్క వెనక ప్రయాణికుల వరుసను ఆనుకుని ఉన్న కిటికీతో పాటు కొంత భాగం ఉన్నట్టుండి ఊడి గాల్లో కలిసిపోయింది. ఒక ఫ్రిజ్‌ను మించిన పరిమాణంలో పెద్ద రంధ్రం పడింది. దాంతో విపరీతమైన వేగంతో పెను గాలులు లోనికి దూసుకొచ్చాయి. వాటి దెబ్బకు విమానం పిచ్చి పట్టినట్టు అటూ ఇటూ ఊగిపోవడం మొదలుపెట్టింది. లోపల వాయు పీడనం పూర్తిగా తగ్గిపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో వణికిపోయారు. రంధ్రంలోంచి దూసుకొస్తున్న పెను గాలుల వేగానికి ఆ వరుసలోని సీట్లోనే కూర్చున్న ఒక చిన్నారి చిగురుటాకులా వణికిపోయాడు. గాలి విసురుకు అతని షర్టు ఒంటి నుంచి విడివడి అమాంతంగా బయటికి దూసుకెళ్లింది. దాంతో పాటే బాబు కూడా గాల్లోకి లేవడంతో తల్లి పెను కేకలు వేసింది. బలమంతా ఉపయోగించి అతన్ని గట్టిగా కౌగిలించుకుని ఆపింది! ఇంకో ప్రయాణికుని చేతిలోని సెల్ ఫోన్ గాలి విసురుకు శరవేగంగా విమానంలోంచి బయటికి దూసుకెళ్లింది. దాంతో విమానమంతటా హాహాకారాలు చెలరేగాయి. ప్రాణభయంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. సీట్ బెల్టులు పెట్టుకుని సీట్లను గట్టిగా కరుచుకున్నారు. అందరి ప్రాణాలూ అక్షరాలా గాల్లో వేలాడాయి. 10 నిమిషాలకు పైగా నరకం చూసిన అనంతరం విమానాన్ని పైలట్ కల్లోలం మధ్యే అతి కష్టంగా వెనక్కు మళ్లించింది. నిబ్బరంగా కిందికి దించి సాయంత్రం 5.27కు తిరిగి పోర్ట్లాండ్ విమానాశ్రయంలోనే సురక్షితంగా లాండ్ చేసింది. దాంతో బతుకు జీవుడా అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు. అచ్చం హాలీవుడ్ సినిమాను తలపించిన ఈ ప్రమాదం బారి నుంచి కొద్దిపాటి గాయాలు మినహా అంతా సురక్షితంగా బయట పడ్డారు. నరకం అంచులకు వెళ్లొచ్చాం... ప్రమాదం జరిగిన తీరును వివరిస్తూ ప్రయాణికుల్లో పలువురు భయోద్వేగాలకు లోనయ్యారు. ‘‘విమానం వెనక వైపు నుంచి పెద్ద శబ్దం విని్పంచింది. ఏమిటా తిరిగి చూసేలోపే పెను గాలులు విమానమంతటినీ ఈ డ్చి కొట్టడం మొదలైంది’’ అని ఎవాన్ స్మిత్ చెప్పాడు. ‘‘నేను పక్క వరుసలో కూర్చుని ఉన్నాను. చూస్తుండగానే నా కళ్లముందే అటువైపున్న కిటికీతో పాటు దాని చుట్టుపక్కల భాగమంతా ఎవరో బయటి నుంచి లాగేసినట్టుగా ఊడి కొట్టుకుపోయింది. ఆ కిటికీ సీట్లో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది’’ అంటూ జెస్సికా అనే ప్రయాణికురాలు చెప్పు కొచి్చంది. అక్షరాలా నరకం అంచుల దాకా వెళ్లి అదృష్టం కొద్దీ సురక్షితంగా బయట పడ్డామంటూ వణికిపోయింది. ‘‘ఎమర్జెన్సీలో చిక్కుకున్నాం. గాలి పీడనం పూర్తిగా తగ్గిపోయింది. మేం తక్షణం ల్యాండవ్వాలి’’ అని గ్రౌండ్ కంట్రోల్‌ను పైలట్ రిక్వెస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఆ విమానాల నిలిపివేత... ప్రయాణికులకు ఎదురైన భయానక అనుభవాన్ని తలచుకుంటేనే గుండె తరుక్కుపోతోందని అలస్కా ఎయిర్‌లైన్స్ సీఈఓ బెన్ మినికుచి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ప్రమాదం నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు, భద్రతా పరీక్షలు జరిగేదాకా తమ వద్ద ఉన్న మొత్తం 65 బోయింగ్ 737 మాక్స్ 9 రకం విమానాలనూ పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. తనిఖీలకు పూర్తిగా సహకరిస్తామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఈ ఉదంతంపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతోంది. – పోర్ట్‌ల్యాండ్ (అమెరికా) తొలిసారి కాదు.. బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు ప్రమాదాల బారిన పడటం ఇది తొలిసారేమీ కాదు. 2018, 2019ల్లో ఈ రకానికి చెందిన రెండు విమానాలు కూలిపోయి వాటిలో ఉన్నవారంతా దుర్మరణం పాలయ్యారు. దాంతో ప్రపంచమంతటా ఈ విమానాల వాడకాన్ని ఏడాదిన్నర పాటు నిలిపేశారు. కానీ వాటితో పోలిస్తే తాజా ప్రమాదం చాలా భిన్నమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1,300కు పైగా బోయింగ్ 737 మాక్స్ రకం విమానాలు వాడకంలో ఉన్నాయి. వీటిలో మాక్స్ 9 అత్యాధునిక విమానాలు. భారత్‌లోనూ ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు 40కి పైగా బోయింగ్ 737 మాక్స్ 8 రకం విమానాలను దేశీయ రూట్లలో నడుపుతున్నాయి. అమెరికా విమాన ప్రమాదం నేపథ్యంలో వాటన్నింట్లనూ తక్షణం క్షుణ్నంగా భద్రతా తనిఖీలు నిర్వహించాలని డీజీసీఏ ఆదేశించింది. -
విజయకాంత్ మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో!
తమిళస్టార్ నటుడు, డీఎండీకే అధినేత మృతి పట్ల పలువురు సినీతారలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులర్పించారు. తాజాగా విజయ్‌కాంత్ మృతిపట్ల కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో విశాల్ ఏడుస్తున్న వీడియో అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. విశాల్ వీడియోలో మాట్లాడుతూ..' కెప్టెన్ మరణించిన విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఈ వార్త విన్నాక నా కాళ్లు, చేతులు పనిచేయడం లేదు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా. నేను నడిగర్ సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు అండగా నిలిచారు. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్‌కాంత్ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి' అంటూ ఏడుస్తూ పోస్ట్ చేశారు. కాగా.. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ బుధవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో మంగళవారం ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు చెన్నై మియాట్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. -
‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా!
శివరాజ్ సింగ్ చౌహాన్.. మహిళల నుంచి ఎనలేని ఆదరణ పొందిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన సీఎం పదవికి దూరమైనా.. అభిమానుల నుంచి ఆయనకు దక్కుతున్న ప్రేమ, అభిమానంలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రజలు శివరాజ్‌ను ప్రేమగా అన్న, మామ అని పిలుచుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌తో అతని అభిమానులు, మద్దతుదారుల అనుబంధం విడదీయరానిది. ఇటీవల ఆయన విదిశలో తన మద్దతుదారులను, అభిమానులకు కలిసేందుకు వచ్చినప్పుడు భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. వీరిలో మహిళలు అధికంగా ఉండటం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేయడం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తన హయాంలో మహిళల కోసం పలు ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టారు. ఇవే అతనిని మహిళల ఆదరణకు పాత్రుడిని చేశాయి. ఆయన విదిశకు వచ్చినప్పుడు మద్దతుదారులు, అభిమానులు కురిపించిన ప్రేమను చూసిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన దగ్గరకు వచ్చి, రోదిస్తున్న మహిళలతో శివరాజ్ సింగ్..‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మధ్యప్రదేశ్‌లో మీ మధ్యనే ఉంటున్నానని’ వారికి భరోసా ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు శివరాజ్‌సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా ప్రజల ఆదరణ అందుకున్నారు. అయితే డిసెంబర్ 11న నూతన సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెహోర్ జిల్లాలోని బుద్ని నుంచి లక్షకు పైగా ఓట్ల తేడాతో రికార్డు స్థాయి విజయం సాధించారు. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
ఉకో మేడం...కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రేఖ నాయక్
-
మాతృత్వానికే మాయని మచ్చ..పసికందు ఏడుస్తుందని ఓ తల్లి..
పక్షులు దగ్గర నుంచి చిన్న చిన్న కీటకాల వరకు తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుని చూసుకుంటాయి. ఆఖరికి చిన్న కోడి సైతం తన పిల్లల జోలికి వస్తే పులి అయ్యిపోతుంది. అలాంటి ఓ మహాతల్లి పసిబిడ్డ పట్ల వ్యవహరించిని తీరు చూస్తే గగుర్పాటుకు గురవ్వుతారు. ఆమె అసలు తల్లేనా? అన్నంతగా సీరియస్ అవుతారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ తన బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. బిడ్డ ఉలుకుపలుకు లేకుండా శవం మాదిరిగా పడుకుని ఉండటంతో వైద్యులు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ ఆ తల్లి నార్మల్‌గా ఉంది. ఎలాంటి భయాందోళన లేకుండా పసిబిడ్డకు కొంచెం ఒంట్లో నలతగా ఉందని ట్రీట్మెంట్ చేయమని చెప్పి మరీ వైద్యులకు ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చి డాక్టర్లు ఆ పసికందుని పరీక్షించగా ఆల్కహాల్ పట్టించినట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా వైద్యలు నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కన్న బిడ్డకే మద్యం ఇచ్చి చంపాలన చూసిందని ఆరోపణలు చేశారు. సదరు మహిళ హోనెస్టి డీ లా టోర్రేగా గుర్తించారు. ఆ మహిళ రియాల్టో గుండా డ్రైవింగ్ చేస్తుండా పాప ఏడుస్తుందని మద్య పట్టించినట్లు పేర్కొంది. పైగా మద్యం ఇవ్వడంతో ఏడుపు ఆపేసిందని చెబుతోంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అయితే పసికందు పరిస్థితి ఎలా ఉందనేది వైద్యులు బయటకు తెలిజేయలేదు. ఏదిఏమైనా ఇంత ఘోరమైన తల్లులు కూడా ఉన్నారా! అనిపిస్తోంది కదూ. (చదవండి: ఇష్టం అంటే మరీ ఇలానా! ఈ స్ట్రేంజ్ అడిక్షన్ వింటే షాకవ్వాల్సిందే!) -
సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!
Sudha Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రముఖ రచయిత్రిగా, మానవతామూర్తిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఆధునిక కాలంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలలో తన ప్రేమ గురించి వెల్లడించింది. కాగా ఇటీవల ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎప్పుడూ సినిమాలలోని ఎమోషనల్ సీన్లు చూసి కంటతడి పెట్టుకోలేదని, 'అలియా భట్' (Alia Bhatt) నటించిన 'రాజీ' మూవీలో తన నటనకు ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదటి సారి 1958లో సినిమా చూసినట్లు, అప్పటి నుంచి వైజయంతిమాలకు అభిమానిగా మారానని చెప్పింది. ఈ తరం వారిలో 'అలియా భట్' నటనను అభిమానిస్తానని.. ఆమె గ్రేట్ యాక్టర్ అని కొనియాడింది. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, మ్యూజిక్ వంటి వాటని గురించి ఇంట్లో చర్చించుకుంటామని సుధామూర్తి తెలిపారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 190 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా 64 వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి కావడం గమనార్హం. -
ఓ తల్లి కడుపుకోత.. దిక్కులు పిక్కటిల్లిపోయేలా ఆర్తనాదాలు
బతుకు పోరాటంలో ఒకరి కష్టం.. మరొకరికి నేత్రానందం కలిగించడం అంటే ఇదేనేమో!. ఓ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ.. నీటి పాయలో దాని బిడ్డను అటూ ఇటూ కదిలిస్తూ లేపే ప్రయత్నం చేస్తున్న వీడియో ఒకటి నెటిజన్ల గుండెల్ని బద్ధలు చేస్తోంది. అది శాశ్వత నిద్రలోకి జారుకుందని తల్లడిల్లుతుంటే.. ఆ వీడియో మాత్రం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. జీవం లేని గున్న ఏనుగును రెండు కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ నీటిలో వేసి లేపే ప్రయత్నం చేసిందట ఆ తల్లి ఏనుగు. ఎక్కడ.. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు, ఆ గున్నేనుగు ఎలా మరణించిందో కారణం తెలియదుగానీ.. వన్యప్రాణులపై వీడియోలు పోస్ట్ చేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నందా (Susanta Nanda) ద్రవీభవించిన హృదయంతో ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. లే బిడ్డా.. లే అంటూ ఆ ఏనుగు ఘీంకారంతో చేసిన దిక్కులు పిక్కటిల్లిపోయేలా చేసిన ఆర్తనాదాలకు ఫలితం లేకుండా పోయింది. This broke my heart. The calf has died but mother doesn’t give up. Carries the dead baby for two KMs and tries to revive it by placing in water. And the mother’s cries ranting the air😭😭 Via @NANDANPRATIM pic.twitter.com/ufgPsYsRgE — Susanta Nanda (@susantananda3) June 15, 2023 -
క్యూలో నిలబడినా, నిద్రపోయినా.. ఆఖరికి ఏడ్చినా జీతమిస్తారు..!
పని చేస్తే జీతమిస్తారు ఎక్కడైనా. కానీ.. పరుపులపై నిద్రపోవడం.. క్యూలైన్లో నిలబడటం.. శవం దగ్గర ఏడ్వటం లాంటి పనులు చేస్తే కాసుల వర్షం కురుస్తోంది. వివిధ దేశాల్లో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులెన్నో చేసేస్తూ డబ్బులు గడిస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోకండి. అవేంటో చూసేద్దాం పదండి. కార్యాలయం లేదా పనిచేసే చోట నిద్రపోతే ఉద్యోగం ఊడిపోతుంది. కానీ.. బాగా నిద్రపోయే వారికి మాత్రం అక్కడ జీతాలు ఇస్తారు. ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ పేరిట ఇలాంటి ఉద్యోగాలను పరుపుల తయారీ కంపెనీలు, కొన్ని ప్రముఖ హోటళ్లు సైతం ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్లాండ్లోని ఒక హోటల్ ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంది. ఆ హోటల్లోని బెడ్లలో రోజూ ఏదో ఒక బెడ్‌పై పడుకుని అవి సౌకర్యంగా ఉన్నాయా.. లేదా అనేది చెక్ చేసి నివేదిక ఇవ్వడమే ప్రొఫెషనల్ స్లీపర్ పని. ఇందుకోసం వీరికి నెలకు రూ.లక్షల్లో జీతాలిస్తున్నారు. అంతేకాదు.. బెడ్లు, పరుపుల తయారీ కంపెనీలు సైతం వాటి నాణ్యతను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రొఫెషనల్ స్లీపర్స్‌ను నియమించుకుంటున్నాయి. న్యూయార్క్‌లో పరుపులు తయారు చేసే కాస్పెర్ కంపెనీ బిజినెస్ పెంచుకునేందుకు కొత్తగా ఆలోచించి ‘స్లీపర్స్’ కావాలని ఈ మధ్యే ఒక ప్రకటన చేసింది. తమ కంపెనీ పరుపు మీద పడుకుంటే కంటినిండా నిద్రపడుతుందని చెప్పడం ద్వారా మార్కెట్ పెంచుకునేందుకు ‘ప్రొఫెషనల్ స్లీపర్స్’ కోసం వెతుకుతోంది ఆ కంపెనీ. అభ్యర్థులకు ఎక్కువసేపు నిద్రపోవాలనే కోరిక ఉండాలట. చుట్టూ ఏం జరిగినా ఏమీ పట్టనట్టు హాయిగా పడుకోగలగటం ప్రత్యేకత. జాబ్‌లో చేరిన వారు కాస్పెర్ పరుపుల పైపడుకుని బాగా నిద్రపోవడంతోపాటు వారి అనుభవాలను టిక్‌టాక్ వీడియోలు, రీల్స్, సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని ఆ కంపెనీ నిబంధనలు విధించింది. బెంగళూరులోనూ ఉందో కంపెనీ నిద్రపోతే చాలు జీతమిస్తామంటోంది మన దేశంలోని బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్’ సంస్థ. ‘రోజూ రాత్రి 9 గంటలపాటు శుభ్రంగా పడుకోండి. నెలకు రూ.లక్ష జీతం ఇస్తాం’ అంటోంది. అంతేకాదు.. ఈ జాబ్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు కూడా అవకాశం కల్పించింది. ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనే అభ్యర్థులకు బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, ఫిట్నెస్ నిపుణులు పలు సూచనలు కూడా ఇస్తారట. అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి వారందరూ గాఢంగా, ఎక్కువ సేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు. ఇందులో పాల్గొనే వారికి ఏదైనా డిగ్రీ ఉండాలి. బెడ్‌పైకి వెళ్లగానే 10–20 నిమిషాల్లో నిద్రలోకి జారుకునే లక్షణం కలిగి ఉండాలి. క్యూలో నిలబడితే డబ్బిస్తారు క్యూలో గంటల తరబడి నిలబడటం ఎవరికైనా ఇబ్బందే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వయసు పైబడిన వారు, చిన్న పిల్లల తల్లులు, పిల్లలు క్యూలైన్లో నిలబడటం కష్టం. ఇందుకు ప్రత్యామ్నాయంగా అనేక దేశాలు ‘లైన్ స్టాండర్’ పద్ధతిని అనుసరిస్తున్నాయి. లైన్లో మీరు నిలబడలేకపోతే మీకు బదులుగా అక్కడి ఉద్యోగులు నిల్చుంటారు. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఈ తరహా లైన్ స్టాండర్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లో ఫెస్టివల్ ఆఫర్లు ప్రకటించినప్పుడు.. మార్కెట్లో కొత్త ప్రొడక్ట్స్ విడుదలైనప్పుడు వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రయాణికుల్ని తోసేస్తే జీతం పండగలు, పర్వదినాల్లో కిక్కిరిసిన రైలు, బస్సుల్లో జనం గుమ్మాల దగ్గర వేలాడటం చూస్తుంటాం. మెట్రో రైలులో ఇలాంటి పరిస్థితి వస్తే తలుపులు మూసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు విదేశాల్లో ప్రత్యేకంగా ‘పాసింజర్ పుషర్స్’ను నియమిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోతోపాటు వివిధ దేశాల్లోని మెట్రో రైళ్లలో ‘పాసింజర్ పుషర్స్’ డ్యూటీలో చేరుతున్నారు. మెట్రో రైలు లోపలికి ప్రయాణికులను నెట్టేసి రైలు తలుపులు మూసుకునేలా చేయడమే వీరి పని. ఇందుకోసం వారికి నెలకు మన కరెన్సీలో చూస్తే రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు జీతం ఇస్తున్నారు. అక్కడ ఏడిస్తే డబ్బులిస్తారు కొన్ని దేశాల్లో ఎవరైనా చనిపోతే ఏడ్చేందుకు వెళ్లి డబ్బులు సంపాదించుకోవచ్చు. చైనా, ఆఫ్రికా, యూకే వంటి దేశాల్లో మతపరమైన సంప్రదాయంలో ప్రత్యేకంగా దుఃఖితులను నియమించుకుని డబ్బులిస్తారు. వీరంతా ఏడవడంతోపాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా ఓదారుస్తారు. ఇందుకోసం ఒక్కో ఈవెంట్‌కు సుమారు రూ.9 వేల నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తారు. మరిన్ని చిత్రమైన కొలువులున్నాయ్! ఓటీటీ సంస్థలు ప్రత్యేకంగా మూవీ వాచర్లను నియమించుకుంటున్నాయి. సినిమా ప్రసారం కావడానికి ముందే సినిమా ఎలా ఉంది.. రీచింగ్ బాగా ఉంటుందా.. లేదా.. ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనే దానిపై కొందర్ని నియమించుకుని జీతాలిస్తున్నాయి. విడుదలకు ముందే వెబ్ సిరీస్, మూవీలను చూసి సమీక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే రిలీజ్ ఆధారపడి ఉంటుంది. కాగా, ఇంటికి వేసిన రంగు (కలర్) ఎంత సమయంలో ఆరుతుందో చెప్పడానికి ప్రత్యేకంగా రంగుల తయారీ కంపెనీలు పెయింట్ డ్రైయింగ్ వాచర్ పేరిట సిబ్బందిని నియమించుకుంటున్నాయి. పెయింట్ ఎంతసేపట్లో ఆరుతుంది.. చేతికి అంటుకుంటుందా అనే వివరాలతో రిపోర్ట్ తయారు చేసి మేనేజర్లకు ఇవ్వడమే వీరి పని. కాగా.. గోల్ఫ్ గేమ్‌లో కొట్టిన బంతిని దూరం నుంచి తిరిగి తేవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయాన్ని ఆదా చేసేలా బాల్ డ్రైవర్‌ను నియమించుకుని జీతాలిస్తారు. కాగా, చివరకు కండోమ్ తయారీ సంస్థలు వాటిని మార్కెట్లో విడుదల చేయడానికి ముందు సౌకర్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా కండోమ్ టెస్టర్స్ను నియమించుకుంటాయి. వారికి జీతం ఏడాదికి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే.. ఏకంగా రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. -
రామ్ చరణ్‌ను చూసి బోరున ఏడ్చేసిన అభిమాని..!
మెగా హీరో రామ్‌చరణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే ఆస్పత్రిలో ఓ చిట్టి అభిమాని కోరిక తీర్చిన చెర్రీ మరోసారి తన ఉదారత ప్రదర్శించారు. ఇటీవల హైదరాబాద్‌లో అభిమానులతో మీట్ నిర్వహించారు. అయితే సెక్యూరిటీ కారణాలతో కొంతమందిని అనుమతించపోవడం సహజం. కానీ అభిమాన హీరోతో ఫోటో దిగాలని ఎవరికీ ఉండదు చెప్పండి. అలాగే చెర్రీ ఫ్యాన్స్ మీట్ జరుగుతుందని తెలుసుకున్న చిట్టి అభిమాని వేదిక వద్దకు చేరుకున్నాడు. ఫ్యాన్స్ మీట్లో బిజీగా ఉన్న చెర్రీని చూడగానే అభిమాని కన్నీటి పర్యంతమయ్యాడు. అభిమాన హీరోను చూడగానే కన్నీళ్లు తన్నుకొచ్చేశాయేమో గానీ బోరున విలపించాడు. దీంతో అబ్బాయిని రామ్ చరణ్ దగ్గరికీ పిలిచి మరీ వివరాలు ఆరా తీశారు. ఆ తర్వాత సెక్యూరిటీకి అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో చెర్రీ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. దటీజ్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఆర్సీ15లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే కర్నూలు, హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకున్న చిత్రబృందం తదుపరి షెడ్యూల్ కోసం వైజాగ్ చేరుకుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Man with Golden Heart❤️ A little fan Boy of @AlwaysRamCharan garu came to Hyderabad after hearing the news about the fans meet. He felt emotional after seeing him, charan garu enquired about his details & made arrangements to send him back safe.#ManOfMassesRamCharan #RamCharan pic.twitter.com/1EsiNpPa8g — SivaCherry (@sivacherry9) February 13, 2023 -
లైవ్ టీవీ షోలో ఏడ్చేసిన పాక్ మాజీ మంత్రి.. వీడియో వైరల్..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ చౌదరి లైవ్ టీవీ షోలో బోరున విలపించారు. దేశద్రోహం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్‌ను ప్రశ్నించారు. తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు. ఫవాద్‌కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
నాకే ఎందుకు ఇన్ని కష్టాలు.. బోరున ఏడ్చేసిన నటి రాఖీ సావంత్
-
గన్ షాట్: పేద పిల్లలకు ట్యాబ్ లిస్తే భరించలేరా..?
-
ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్‌కే!
'హైపర్ సోషల్' సీఈఓ బ్రాడెన్ వాలెక్ అంటే లింక్డ్ఇన్లో దాదాపు తెలియని వారుండురు. ఈయన గతంలో ఓసారి సంస్థలోని ఉద్యోగులను మూకుమ్మడిగా తొలిగించిన అనంతరం ఏడుస్తున్న పోట్ షేర్ చేయడం వైరల్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ఫోటోనే షేర్ చేశారు. తన గ్రాండ్మా చనిపోయిందని అమ్మ నుంచి మెసేజ్ వచ్చిందని బ్రాడెన్ ఓ పోస్టు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఘటన వర్క్, లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాన్ని తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. తాను హైపర్సోషల్ను ప్రారంభించింది కూడా ఇందుకే అని పేర్కొన్నాడు. హైపర్ సోషల్‌తో వ్యాపారాన్ని సులభంగా చేసుకోవచ్చని, దీని వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని వివరించాడు. బ్రాడెన్ పోస్టుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు, ఇది వెరీ సాడ్ పోస్టు అని ఓ లింక్డ్ఇన్ యూజర్ విమర్శించాడు. సీఈఓ పోస్టు ట్విట్టర్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ ఏడుపు గొట్టు సీఈవో కంపెనీ ప్రచారం కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. చదవండి: ‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా? -
ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి
Heroine Krithi Shetty Crying In Live Interview: 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్‌తో నటించిన 'ది వారియర్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే కాకుండా సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', నితిన్ సరసన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలు చేస్తోంది. కాగా తాజాగా తమిళనాట జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృతిశెట్టి కన్నీళ్లు పెట్టుకుంది. యాంకర్ల ప్రవర్తన చూసి ఇంటర్వ్యూలో ఏడ్చేసింది బేబమ్మ. చదవండి: బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇంటర్వ్యూ జరుగుతుండగా ఇద్దరు యాంకర్లు కృతిశెట్టిని ప్రశ్నలు అడిగేందుకు ఒకరికొకరు పోటీ పడ్డారు. తర్వాత ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ కృతిశెట్టి ఎదుటే గొడవకు దిగారు. అంతేకాకుండా ఒక యాంకర్ మరో యాంకర్‌ను కొట్టాడు. దీంతో ఏం జరుగుతుందో తెలియని బేబమ్మ భయపడిపోయింది. అయితే ఆ తర్వాత అది ప్రాంక్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకుని నవ్వింది కృతిశెట్టి. పైకి నవ్వినా ఆపై దుఃఖం ఆపుకోలేక లైవ్‌లోనే ఏడ్చేసింది. కొద్దిసేపు తర్వాత ఆమెకు సర్దిచెప్పిన యాంకర్లు.. ఎందుకు ఏడ్చారు, ఏమైంది అని ప్రశ్నించారు. దానికి ఎవరైన హార్డ్‌గా మాట్లాడితే తట్టుకోలేను, భయం వేస్తుంది అని చెప్పుకొచ్చింది 18 ఏళ్ల కృతిశెట్టి. అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు, అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝗞𝗿𝗶𝘁𝗵𝗶 𝗦𝗵𝗲𝘁𝘁𝘆 🔵 (@krithi.shetty_shines) -
‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి'
ఈ జిందగీలో ఎన్నో హృదయవిదారక సంఘటనలు, మనసును మెలితిప్పే ఉదంతాలు రోజూ ఎన్నెన్నో చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదరికం, హింస ప్రస్తుత సమాజంలో తారాస్థాయికి చేరుతుంది. పేదరికమే హింసకు కారణమౌతుందనేది అనేకమంది వాదన. ఇది పూర్తిగా నిజం కాదు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చేసే లోపాల కారణంగా కొన్ని సందర్భాల్లో వారే నేరస్తులౌతున్నారు. ఐతే ప్రస్తుతం కొన్ని రకాల సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పిల్లలకు సహాయం చేయడం కోసం తీవ్రంగా కృషిచేస్తున్నాయి. అటువంటి ఓ బాలుడికి సంబంధించిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బాలుడి కథ వింటే మీ కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి. వయొలిన్ వాయిస్తున్న ఇద్దరుముగ్గరు పిల్లలు కనిపించే ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే... వీరిలో ఏడుస్తూ కనిపిస్తున్న పిల్లవాడు బ్రెజిల్‌కు చెందిన వాడు. మృతిచెందిన తమ టీచర్ అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తున్నాడు. అవ్నీష్ షరన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ట్విటర్లో హృదయాన్ని మెలిపెట్టేలా ఏడుస్తూ వయొలిన్ వాయిస్తున్న బాలుడి ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు అతని కన్నీళ్లకు కారణం కూడా తెలుపుతూ.. నేర జీవితం నుంచి బయటకు తెచ్చిన గురువు అంత్యక్రియల్లో వయొలిన్ వాయిస్తూ ఏడుస్తున్న బ్రెజిలియన్ బాలుడు (డీగో ఫ్రాజో టర్కటో) అనే క్యప్షన్‌తో షేర్ చేశాడు. ఈ ఫొటోలో మానవత్వం ప్రపంచంలోనే గట్టిగొంతుకతో మాట్లాడుతోందని కూడా రాశాడు. ఐతే అనతికాలంలో ఈ బాలుడి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాల్లో వైరలయ్యింది. అనేక మంది తమ ఉన్నతమైన అభిప్రాయాలను తెలుపుతూ ఈ ఫొటోకు కామెంట్ల రూపంలో పంపుతున్నారు కూడా. వాళ్లలో ఒకరు ‘మరణించిన తన ఉపాధ్యాయుడి అంత్యక్రియల్లో బ్రెజిల్ చైల్డ్‌కు చెందిన ఈ చిత్రం మన జీవితాల్లో అత్యంత భావోద్వేగ చిత్రాల్లో ఒకట'ని అభివర్ణించారు. మరొకరేమో ‘నిజానికి ఈ భూప్రపంచంలో కేవలం టీచర్లు మాత్రమే మానవత్వాన్ని కాపాడే సామర్ధ్యం కలిగినవారని, తన హృదయం పూర్తిగా బద్ధలైనట్లు అతని కళ్లు చెబుతున్నాయ'ని ఇంకొకరు కామెంట్ చేశారు. చదవండి: ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం! This photo was taken of a Brazilian boy (Diego Frazzo Turkato),playing the violin at the funeral of his teacher who rescued him from the environment of poverty and crime in which he lived. In this image,humanity speaks with the strongest voice in the world. Pic: Marcos Tristao pic.twitter.com/MkWUd5DcBE — Awanish Sharan (@AwanishSharan) December 19, 2021 -
నవ్వొద్దు.. ఏడ్వొద్దు.. తాగొద్దు.. ఉల్లంఘిస్తే ఖతమే!
North Korea Banned Laughing: ఓవైపు నియంత పాలన.. మరోవైపు ఆకలి కేకలతో నిత్యం నరకం అనుభవించే కొరియన్లపై జాలి చూపించడం తప్ప ప్రపంచం చేయగలిగింది ఏం లేదు. ఈ మధ్యే అధ్యక్షుడిగా పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న కిమ్ జోంగ్ ఉన్.. తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు అతనిలోని మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలిచాయి. ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ వర్దంతి వేడుకల్ని శుక్రవారం(డిసెంబర్ 11) నుంచి 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహించాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయించింది. 1994 నుంచి 2011(చనిపోయేవరకు) ఉత్తర కొరియాను పాలించిన నియంతాధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఇల్ చిన్న కొడుకే.. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఈ తరుణంలో వర్ధంతి వేడుకల సందర్భంగా ఉత్తర కొరియాలో విధించిన ఆంక్షల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. సినుయిజు సిటీలోని ఫ్రీ ఏషియా రేడియో నెట్వర్క్ అందించిన కథనం ప్రకారం.. ఈ పదకొండు రోజులు ఏ పౌరుడు సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మద్యం కూడా తాగ కూడదు. ఎవరూ పుట్టినరోజులు జరుపుకోకూడదు. బహిరంగంగా నవ్వడానికి, ఏడవడానికీ వీల్లేదు. ఎటువంటి వేడుకలు చేసుకోవడానికి, వాటిల్లో పాల్గొనకూడదు. చివరికి ఇంట్లో ఎవరైనా చనిపోయినా కన్నీళ్లు పెట్టుకోకూడదు. వర్ధంతి రోజైన శుక్రవారం.. నిత్యావసరాల దుకాణాల ముందు జనాలెవరూ క్యూ కట్టడానికి వీల్లేదు. విషాద దినాల్లో మాజీ అధ్యక్షుడి నివాళి సమావేశానికి అందరూ హాజరవ్వాలి. వీటిని ఎవరు ఉల్లంఘించినా(కిమ్ కుటుంబం, పేషీ తప్ప) వాళ్లు నేరగాళ్ల కిందే లెక్క. శిక్షగా వాళ్లు మళ్లీ కనిపించకుండా పోతారు(అయితే మరణశిక్ష లేదంటే జీవితకాలం బానిస బతుకు). ఈ పదేళ్లలో ఇలాంటి ఉత్తర్వులు జారీ కావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. ఈ ఆదేశాల్ని జనాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదే. ఇందుకోసం వాళ్లను నిద్ర కూడా పోకూడదన్న ఆదేశాలు జారీ చేసిందట కిమ్ కార్యాలయం. కొత్తేం కాదుగా.. - ఈ ఏడాది మొదట్లో కిమ్ కార్యాలయం.. జనాలను టైట్ జీన్స్ వేయకూడదని, స్టయిల్‌గా రెడీ కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. - క్యాపిటలిస్టిక్ లైఫ్‌స్టయిల్ కొరియా యువత మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోందన్న ఉద్దేశంతో పాప్ కల్చర్‌ను బ్యాన్ చేశాడు. - తన స్టయిల్‌ను కాపీ కొట్టకూడదనే ఉద్దేశంతో ఆ తరహా లెదర్ జాకెట్లను నిషేధించాడు. - స్క్విడ్ గేమ్ దక్షిణ కొరియా సిరీస్ కావడంతో.. దానిని సర్క్యులేట్ చేసిన ఓ వ్యక్తిని కాల్చి చంపడంతో పాటు ఓ స్కూల్ ప్రిన్స్‌పాల్, టీచర్, ఐదుగురు పిల్లలకు బానిస శిక్షను అమలు చేశాడు. చదవండి: ఉత్తర కొరియా: కిమ్ వర్సెస్ కిమ్! -
జన్మించి నెల కూడా కాలేదు.. ఏడుస్తోందన్న కోపంతో కన్న తల్లే..
కొచ్చి: శిశువు జన్మించి నెల కూడా కాకుండానే కర్కశంగా చంపేసిందో ఓ తల్లి. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మొదట ఆ శిశువుకి ఆరోగ్యం సరిగాలేని కారణంగానే మరణించిందని అనుకున్నారు, కానీ ఆ తల్లి ప్రవర్తన పై అనుమానం రావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అసలు నిజాలు బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెలలు పూర్తిగా నిండకుండానే జన్మించిన ఆ శిశువు ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉండేది. దీంతో కొన్నిరోజులుగా ఆ శిశువు అనారోగ్యంతో బాధపడుతోంది. ఇక చేసేదేమి లేక ఆ బిడ్డ తల్లి శిశువుని తీసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి, వారి సూచించిన మేరకు పలు పరీక్షలు, మందులు కూడా తీసుకుని ఇంటికి రావడం ఇదే పనిగా మారింది. అయినా ఆ శిశువుకి ఏ మాత్రం అనారోగ్యం తగ్గకపోవడం, మరో పక్క ఏడూస్తూనే ఉండడంతో బిడ్డ మరింతగా ఆరోగ్యం క్షీణించింది. దీంతో మరో సారి ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా ఆ శిశువు తల్లి ఒక ఆశ్రమంలో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ ఆశ్రమం నడుపుతున్న ఫాదర్ జోజి థామస్‌కు శిశువు హఠాత్తుగా మరణించడంతో ఆయనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోస్ట్‌మార్టం తర్వాత, ఒక పోలీసు అధికారి సర్జన్‌తో మాట్లాడగా, పిల్లవాడి తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయని తెలుసుకున్నారు. అనుమానం వచ్చిన పోలీసులు శిశువు తల్లిని విచారించగా... పసికందు తండ్రికి ఇదివరకే పెళ్లయిందని, ఈ విషయం తెలిసినప్పటికీ తాను అతనితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇటీవల ఆ శిశువుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తాను కొంత మానసిక అసౌకర్యానికి గురైనట్లు, చివరికి కోపంతో తానే కొట్టడంతో శిశువు చనిపోయిందని అంగీకరించింది. చదవండి: ఏమైందో..ఏమో? పిల్లలు నిద్రపోతుండగా గ్యాస్ సిలిండర్ బెడ్రూంలోకి తీసుకువచ్చి.. -
మట్టిలో నుంచి పసిబిడ్డ ఏడుపు.. తవ్వి చూస్తే..!!
భోపాల్: మూడు రోజుల పసికందును బతికుండగానే పాతిపెట్టడానికి ఆ తల్లిదండ్రులకు మనసెలా వచ్చిందో! ఐతే విధి చిన్నచూపు చూసినా మృత్యువును జయించి మరీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ పసికూన. వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో బతికున్న మూడురోజున పసిబిడ్డను నది ఒడ్డున మట్టిలో పాతిపెట్టిన ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. గురువారం సాయంత్రం ఝంగర్చక్ గ్రామ సమీప పొలాల్లో పనులు చేసుకునే కొందరు గ్రామస్థులకు పసిబిడ్డ ఏడుపు వినిపించిన ప్రదేశానికి వెళ్లారు. కొంతసమయానికి బిడ్డ ఏడుపు మట్టికింద నుంచి రావడాన్ని గమనించి, మట్టిని జాగ్రత్తగా తొలగించించారు. అనంతరం కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్యర్యపోయారు. కేవలం రోజుల వయసున్న నవజాత శిశువును ఒక సంచిలో చుట్టి బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు. దీంతో వారు బిడ్డను రక్షించి ముంగావలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నట్లు ధృవీకరించారు. ఈ సంఘటనపై సెక్షన్ 317 కింద కేసు ఫైల్చేసి నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టినట్లు ఎస్ఐ సతీష్ గార్గ్ మీడియాకు వెల్లడించారు. చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! -
భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!
ఒక్కోసారి కొంత మంది భక్తిలో పరవశించుపోతూ చేసే కొన్ని పనులు మనకు భయాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి ఆ స్థాయి మరి ఎక్కువగా చేరితే ఇక వారి వింత ప్రవర్తనతో జనాలను విసిగిస్తుంటారు. అయితే అచ్చం అలానే ఇక్కడొక పూజారి చేశాడు. అసలు విషయంలోకెళ్లితే..ఒక పూజారి ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని విచిత్రంగా అభ్యర్థించాడు. ఈ మేరకు అతను తన కృష్ణుడి చిన్ననాటి విగ్రహమైన లడ్డూ గోపాల్ విగ్రహానికి స్నానం చేయిస్తున్నప్పుడు చేయి విరిగిపోయిందని అందువల్ల చికిత్స చేయాలంటూ ఏడుస్తూ అభ్యర్థిస్తాడు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అయితే మొదటగా ఎవరు అతని అభ్యర్థనను పట్టించుకోరు. కానీ కాసేపటికి జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించి పేషంట్ పేరు కృష్ణుడిగా రిజిస్టర్లో నమోదు చేసుకుని. పూజారి సంతృప్తి నిమిత్తం విగ్రహానికి కట్టుకట్టామని తెలిపారు. అయితే పూజారి లేఖ్ సింగ్ అర్జున్ నగర్‌లోని ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో గత 30 ఏళ్లుగా పూజారిగా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
అమ్మో! ఈ రోజు నా పెళ్లి.. ఏడవాలి, మేకప్‌కు ఏం కాదు కదా!
అమ్మాయిలకు తయారవ్వడానికి మించిన పెద్ద పని మరొకటి ఉండదు. అందరిలోనూ అందంగా కనిపించేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అందరికంటే ముందు రెడీ అవ్వడం మొదలు పెట్టినా.. చివరి వరకు కూడా మెరుగులు దిద్దుతూనే ఉంటారు.. జనరల్‌గానే అమ్మాయిలకురెడీ అవ్వడమంటే పిచ్చి.. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఎంతలా తయారవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే పెళ్లి కోసం రెడీ అవుతున్న ఓ పెళ్లి కూతురు తన మేకప్ ఆర్టిస్ట్‌తో చెప్పిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: రిసెప్షన్‌కు వింతైన ఆహ్వానం.. రూ. 7 వేలు తీసుకుని రావాలంటూ ఏకంగా.. అస్మిత అనే యువతి తన పెళ్లి రోజు కావడంతో అందంగా ముస్తాబవుతోంది. ఆమెను మేకప్ ఆర్టిస్ట్ సుందరంగా తీర్చిదిద్దుతున్న సమయంలో పెళ్లికూతురికి ఓ సందేహం వచ్చింది. ‘నేను వేసుకుంది వాటర్ ప్రూఫ్ మస్కరానేనా. ఏడిస్తే మేకప్ చెదిరిపోదు కదా’ అని ప్రశ్నించింది. దీనికి ఆమె అవును అని సమాధానం ఇస్తూ అస్మిత ఏడవాలి కాబట్టి అలా అడుగుతున్నావా అని ప్రశ్నించింది. దీంతో ‘అవును నేను చాలా ఏడ్వాలి’ అని పెళ్లికూతురు క్యూట్‌గా బదులిచ్చింది. అంతేగాక తను చాలా ఏడవాలని, లేకపోతే తన తల్లి కొడుతుందని చెబుతోంది. వరల్డ్ ఆఫ్ బ్రైడ్స్ అనే ఇన్‌స్టా పేజీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. చదవండి: ఫోన్ నాది.. కాదు నాది ఇచ్చేయ్: వైరలవుతోన్న క్యూట్ వీడియో View this post on Instagram A post shared by World of Brides 🧿 (@world_of_brides_) -
పునీత్ అస్తమయం.. శోక సంద్రంలో అభిమానగణం
-
Puneeth Rajkumar: ‘అప్పు’ అస్తమయం.. గుండె పగిలేలా రోదనలు
-
‘అప్పు’ అస్తమయం.. గుండె పగిలేలా రోదనలు
బెంగళూరు: కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరన్న వార్తతో యావత్ సినిమా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాము ఎంతగానో ఆరాధించే నటుడు కానిలోకాలకు వెళ్లిపోయాడని తెలియడంతో అభిమానులు హతాశులయ్యారు. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు.. పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తలచుకుని గుండె పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు. తాముగా ప్రేమగా పిలుచుకునే ‘అప్పు’మరణాన్ని జీర్ణించుకోలేక వేలాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్‌కుమార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వీరాభిమానులు కంటితడి పెట్టారు. అభిమానుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను సముదాయించడం పోలీసులకు సవాల్‌గా మారింది. (పునీత్ రాజ్‌కుమార్ మృతి, షాక్‌లో భారత సినీ పరిశ్రమ) -
క్రయింగ్ రూమ్: రండి... తనివితీరా ఏడ్వండి
Spain Starts Crying Room To Banish Mental Health Taboo మాడ్రిడ్: మన సమాజం ఏడ్చే వారిని బలహీనులుగా భావిస్తుంది. ఒకవేళ ఆడపిల్ల ఏడిస్తే జాలి చూపుతారు.. మగాడు ఏడిస్తే గేలి చేస్తారు. కారణం ఆడవారు సున్నితంగా ఉంటారు.. మగాళ్లు కాస్త ఎక్కువ మరోధైర్యాన్ని కలిగి ఉంటారని భావిస్తారు. అందుకే మగాళ్లు ఏడిస్తే వింతగా చూస్తారు. కానీ ఫీలింగ్స్‌కు ఆడా, మగా తేడా ఉండదు. నవ్వోస్తే నవ్వాలి.. ఏడుపొస్తే ఏడ్వాలి. అలా కాకుండా మన ఫీలింగ్స్‌ని లోపలో అణుచుకుంటే.. ఆ ప్రభావం మన మానసిక ఆరోగ్యం మీద పడుతుంది. ఆ తర్వాత అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అయితే వీటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది స్పెయిన్ ప్రభుత్వం. తమ దేశ ప్రజల మానసిక ఆరోగ్యం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న స్పెయిన్ తాజాగా దేశంలో క్రయింగ్ రూమ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరికైనా బాధగా అనిపిస్తే.. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే.. ఈ క్రయింగ్ రూమ్‌కి వచ్చి తనివి తీరా ఏడవచ్చు. మనసులోని భారాన్ని దింపుకోవచ్చు. ఇక్కడ ఫోన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కాల్ చేసి మన మాట్లాడుకోవచ్చు. (చదవండి: నలభై ఏళ్లనాటి డ్రెస్...మరింత అందంగా.. ఆధునికంగా...) ఈ సందర్భంగా ఓ స్వీడిష్ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘చాలా దేశాల్లో ఏడ్వడం, ఇతరుల నుంచి సానుభూతి, సాయం కోరడాన్ని చిన్నతనంగా భావిస్తారు. దీనివల్ల మనసులోని బాధను బయటకు వెల్లడించకుండా.. లోలోన కుమిలిపోతూ.. మానసికంగా కుంగిపోతారు. స్పెయిన్ ప్రభుత్వం ఆలోచన ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. పౌరుల మానసిక ఆరోగ్యం పట్ల స్పెయిన్ ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రశంసనీయం’’ అన్నాడు. వారం రోజుల క్రితం స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ప్రత్యేకంగా 100-మిలియన్ యూరోల ($ 116 మిలియన్) మానసిక ఆరోగ్య సంరక్షణ డ్రైవ్‌ను ప్రకటించారు, ఇందులో 24 గంటల సూసైడ్ హెల్ప్‌లైన్ వంటి సేవలు ఉంటాయి. (చదవండి: పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం) "మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం నిషిద్ధం కాదు. ఇది పబ్లిక్ హెల్త్ సమస్య.. దీని గురించి మనం తప్పక మాట్లాడాలి, సమస్యను బయటకు వెల్లడించాలి.. తదనుగుణంగా వ్యవహరించాలి" అని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10 న ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా పెడ్రో శాంచెజ్ మానసిక అనారోగ్యం గురించి మాట్లాడాడు. 2019 లో, స్పెయిన్‌లో 3,671 మంది ఆత్మహత్య చేసుకున్నారు, ఇది సహజ కారణాల వల్ల మరణించిన వారి తర్వాత అత్యధికంగా అనగా రెండో స్థానంలో ఆత్మహత్య చేసుకుని మరణించివారే ఉంటున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం, 10 మంది కౌమారదశలో ఉన్న వారిలో ఒకరు మానసిక ఆరోగ్య పరిస్థితితో బాధపడుతుండగా, మొత్తం జనాభాలో 5.8శాంతం మంది ఆందోళనతో బాధపడుతున్నారు. చదవండి: తన చెల్లికి వచ్చిన దుస్థితి మరోకరికి రాకూడదని.. -
Brief Emotion: ఆపరేషన్ టైంలో ఏడ్చినందుకు ఏకంగా రూ.800ల బిల్లు ..!
డాక్టర్ దగ్గరికి వెళ్తే సూది వేస్తాడేమోననే భయంతో ముందే ఏడుపులంకించుకునే వాళ్లు మనలో చాలా మంది ఉన్నారు. అదే సర్జరీ ఐతే నిలువెళ్లా వణికిపోతాం. భయంతో కన్నీళ్లు రానివారు ఉండరేమో! ఐతే డాక్టర్లు ధైర్యం చెప్పి చికిత్స చేయడం పరిపాటి. ఇందుకు భిన్నంగా అమెరికాలోని ఒక హాస్పిటల్ మాత్రం ఆపరేషన్ టైంలో పేషెంట్ ఏడ్చినందుకు ఏకంగా బిల్లు వేశారండి! బిల్లు చూసి నోరెళ్లబెట్టిన సదరు పేషెంట్ తన అనుభవాన్ని ట్విటర్లో పంచుకుంది. ఇక నెటిజన్లు అమెరికా హెల్త్ కేర్ సిస్టంను కామెంట్లరూపంలో ఏకి పారేస్తున్నారు. అసలేంజరిగిందంటే.. మిడ్జ్ అనే మహిళ మోల్ తొలగించేందుకు ప్రైమరీ సర్జరీ ఒకటి చేయించుకుంది. తర్వాత హాస్పిటల్ బిల్లులో అన్ని చార్జీలతోపాటు బ్రీఫ్ ఎమోషన్ పేరుతో అదనంగా రూ.800 (11 డాలర్లు) బిల్లేశారు. అమితాశ్చర్యాలకు గురైన సదరు మహిళ అమెరికా హెల్త్ కేర్ సిస్టంపై అవగాహన పెంచేందుకు బిల్లును ట్విటర్లో షేర్ చేసింది. ఇది అమెరికన్ హెల్త్‌కేర్ సిస్టమ్ ఏవిధంగా ఉందనేది వివరిస్తుందని ఒకరు, ఈ సమయమంతా నేను ఉచితంగానే ఏడ్చానని అనుకున్నాను" అని మరొక యూజర్ సరదాగా కామెంట్ చేశారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! Mole removal: $223 Crying: extra pic.twitter.com/4FpC3w0cXu — Midge (@mxmclain) September 28, 2021 -
అప్పగింతల వేళ వెక్కివెక్కి ఏడ్చిన పెండ్లి పిలగాడు
వివాహ వ్యవస్థకు మన సమాజంలో చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లి వేడుక అంటే మన దగ్గర ఎంత లేదన్నా.. మూడు, నాలుగు రోజలు పాటు కొనసాగుతుంది. ఇక పెళ్లి ఇంట్లో సరదాలు, సందళ్లకు కొదవే ఉండదు. అయితే కాలంతో పాటుగా పెళ్లిలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాల్లో చోటు చేసుకుంటున్న వెరైటీ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. సాధారణంగా పెళ్లి తర్వాత జరిగే అప్పగింతల వేడుకల సమయంలో వధువు ఏడుస్తుంది. కన్నవారిని.. తోబుట్టువులను.. స్నేహితులను వదిలి.. పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్తున్న వేళ.. ఆడపిల్లలు ఏడవడం సహజం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అప్పగింతల వేళ.. వధువు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అందరికి వీడ్కోలు పలుకుతుండగా.. వరుడు మాత్రం.. కన్నీరు పెట్టుకుంటాడు. అది గమనించిన వధువు.. అతడిని తట్టి.. ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. (చదవండి: ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే) కన్నీరు పెడుతున్న పెండ్లి కుమారుడిని చూసి అక్కడున్నవారంతా నవ్వుతారు. ఇక పెళ్లి కుమార్తె అతడిని చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత అతడు కూడా కళ్లు తుడుచుకుని.. నవ్వుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘ఇతగాడికి పెళ్లైన మొదటి రోజునే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అర్థం అయినట్లుంది’’.. ‘‘ఇంత బాగా ఏడ్చే పెళ్లి కుమారుడిని నేను ఇంతవరకు చూడలేదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్: పెళ్లింత.. తుళ్లింత -
రికార్డుల వీరుడు.. చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు
Caeleb Dressel Crying Video: అతనొక ఛాంపియన్. స్విమ్మింగ్‌లో ఎన్నో రికార్డులు.. ఖాతాలో ఎన్నో పతకాలు. కానీ, ఒలింపిక్స్ మాత్రం అతనికి ఒక ఛాలెంజ్. అందుకే కసిగా ప్రాక్టీస్ చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ కొట్టాడు. ఆ ఆనందంలో కన్నీళ్లలో భావోద్వేగంగా ఈత కొట్టేశాడు. కాలెబ్ డ్రెసెల్.. అమెరికన్ ఫ్రీ స్టైల్&బట్టర్ స్విమ్మర్. 24 ఏళ్ల కాబెల్ స్ప్రింట్ ఈవెంట్స్‌లో స్పెషలిస్ట్. పురుషుల స్విమ్మింగ్‌లో సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికన్ కాలెబ్ డ్రెసెల్.. బుధవారం జరిగిన 100 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో గోల్డ్ కొట్టాడు. కేవలం 49.45 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలువడంతోపాటు.. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. తద్వారా 2019లో 49.50 సెకన్లతో ఇంతకు ముందు నెలకొల్పిన ప్రపంచ రికార్డును డ్రెసెల్ తిరగరాయడం విశేషం. అయితే ఇది కాలెబ్‌కు ఫస్ట్ స్వర్ణం(వ్యక్తిగత విభాగంలో) . అందుకే భావోద్వేగం తట్టుకోలేకపోయాడు. ఫ్లోరిడా నుంచి వీడియో ద్వారా తన కుటుంబం తన సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటుండగా చూసి ఆనందం పట్టలేక చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. వెక్కి వెక్కి ఏడ్చేసిన కాబెల్ వీడియో.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ‘గత ఏడాది చాలా కష్టంగా గడిచింది. చాలా సంతోషంగా ఉంది’అని మీడియాతో మాట్లాడాడు కూడా. ఇక రిలేలో అప్పటికే మూడు స్వర్ణాలు సాధించిన కాలెబ్.. బుధవారం ఈవెంట్ మెయిన్ కేటగిరీలో స్వర్ణం సాధించడం విశేషం. ఇక ఆదివారం నాటి ఈవెంట్స్‌తో కలిసి మొత్తం ఐదు స్వర్ణాలు సాధించి.. సింగిల్ ఒలింపిక్‌లో ఈ రికార్డు సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. 50 మీటర్ల ఫఫ్రీ స్టైల్లో 21.7 సెకన్ల రికార్డు టైంతో, అటుపై గంట తర్వాత జరిగిన 4x100 మెడ్లే రిలేలో లో నెగ్గి రెండు స్వర్ణాలు తన ఖాతాలో జమ చేసుకున్నాడు. -
ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?!
‘‘దీనిని నేనెలా ఆపగలను! నాకింకా పదేళ్లే. ఎప్పుడేం జరుగుతుందోనని నాకు భయంగా ఉంటోంది. ఎవరూ ఇలా కాకుండా ఆపలేరా?’’ అని గాజాలోని ఒక పాలస్తీనా బాలిక కన్నీటితో ప్రశ్నిస్తున్న వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. జాతులు సృష్టిస్తున్న విధ్వంసంలో ఛిద్రమౌతున్న బాల్యానికి ప్రతీకలా ఉన్న ఆ బాలిక కన్నీటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారెవరు?! నదీన్ అబ్దెల్ తయూఫ్ పాలస్తీనా బాలిక. గాజాలో ఉంటోంది ఆమె కుటుంబం. గాజాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల్లో నదీన్ కుటుంబానికి తృటిలో మృత్యువు తప్పింది. ఉలిక్కిపడి ఒక్కసారిగా ఇంట్లోంచి బయటికి పరుగెత్తింది నదీన్. అదృష్టం ఆమెను ఎంతసేపు వెన్నంటి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం అంటే.. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, బంధువులు, చుట్టపక్కల ఇళ్లవాళ్లు, స్కూల్ టీచర్లు, స్కూల్లో ఫ్రెండ్స్.. వీళ్లందరితో కలిసి ఉండటం! రోజూ ఒకర్నొకరు చూసుకుంటూ, పలకరించుకుంటూ, సహాయాలు చేసుకుంటూ, సరదాగా నవ్వుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ, టీచర్స్ని డౌట్స్ అడుగుతూ, ఇంటికి ఫ్రెండ్స్‌ని తెచ్చుకుంటూ, ఫ్రెండ్స్ ఇళ్లకు తను వెళుతూ.. ఇవన్నీ అదృష్టాలే. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. ఏ క్షణమైనా గాజాలో బాంబులు పడొచ్చు. అంటే ఏ క్షణమైనా ప్రాణాలను లేదంటే ఆప్తుల్ని కోల్పోవచ్చు. ఐదు రోజుల క్రితం ఇజ్రాయిల్–పాలస్తీనాల మధ్య ఘర్షణ మొదలైంది. ఘర్షణ అనడం చిన్నమాట. యుద్దం అనాలి. గగన తలం నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఇజ్రాయిల్ గాజా మీద వేస్తోందా, గాజా ఇజ్రాయిల్ మీద వేస్తోందా అని కాదు నదీన్ ప్రశ్న! ‘‘దీన్నెవరూ ఆపలేరా? నేను చిన్నదాన్ని. పదేళ్లు నాకు. నేనేం చేయగలను?’’ అని మనసును కలచివేసేలా ఏడుస్తూ అడుగుతోంది. కాస్త జ్ఞానం కలిగినవాళ్లకు అది అడగడంలా అనిపించదు. మరి! నిలదీసినట్లుగా ఉంటుంది. ∙∙ అవును! వీడియో క్లిప్‌లో నదీన్ అలా అడగడం.. ‘మీరు మనుషులేనా?’ అని అడిగినట్లుగానే ఉంటుంది మనసుతో చూడగలిగిన వారెవరికైనా! ‘మిడిల్ ఈస్ట్ ఐ’ అనే మీడియా సంస్థ ప్రతినిధి గాజాలోని శిథిలాల పక్కన నిశ్చేష్టురాలైన నిలుచుని ఉన్న నదీన్ని పలకరించినప్పుడు ఆమె అడిగిన ప్రతి మాటా ఒక శతఘ్ని గర్జించినట్లే ఉంది. ఆమె చెంపలపై జారిన ప్రతి కన్నీటి బిందువు ఉప్పొంగిన ఒక దుఃఖ సముద్రంలానే ఉంది! 1.19 నిముషాల ఆ వీడియో క్లిప్ మే 15 న ట్విట్టర్లో అప్లోడ్ అయితే ఇప్పటి వరకు కోటీ ముప్పై లక్షల మందికి పైగా వీక్షించారు. ‘‘ఎప్పుడూ నాకు ఏదో జరగబోతున్నట్లే ఉంటుంది. ఎందుకో తెలీదు. ఇదంతా చూడండి. ఎలా కుప్పకూలి ఉందో. నేనేమీ చేయలేకపోతున్నాను. పోనీ, నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఈ సమస్యని పరిష్కరించాలనా?! పదేళ్ల పిల్లని. ఏమాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు డాక్టర్ అవాలని ఉంది. లేదా ఇంకేదైనా. నా ప్రజలకు సహాయం చేయాలని ఉంది. ఇలా ఉంటే మరి చేయగలనా? భయమేస్తోంది. కానీ మరీ ఎక్కువగా కాదు. నా ప్రజలకు కోసం ఏదైనా చేయగలను. కానీ ఏం చెయ్యాలి? ఇదిగో ఇలా భవంతులు నిలువునా కూలి ఉండటం చూసి రోజూ ఏడుస్తున్నాను. నాకనిపిస్తుంటుంది. ఇలా జరగడం అవసరమా అని! ఏమిటీ కర్మ అని కూడా. ఇవన్నీ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి? ‘వాళ్లు మనల్ని ద్వేషిస్తారు. అందుకే ఇవన్నీ చేస్తున్నారు’ అని ఇంట్లో అంటున్నారు. మేమంటే వాళ్లకు ఇష్టం ఉండదట. నా చుట్టూ ఉన్న ఈ పిల్లల్ని చూడండి. అంతా పసివాళ్లు. వాళ్లపైన మిస్సయిల్స్ వేసి చంపేస్తారా! అది కరెక్టు కాదు. అది కరెక్టు కాదు’’ అని నదీన్ కన్నీళ్లతో అనడం వీడియోను చూసే వాళ్ల చేత కంట తడి పెట్టించేలా ఉంది. ట్విట్టర్లో నదీన్ మాట్లాడుతున్న క్లిప్‌ను చూసి షెల్లీ నాట్ అనే ఒక తల్లి స్పందించింది. ‘‘నాకు 11 ఏళ్ల కూతురు ఉంది. నదీన్ ముఖంలోని ఆవేదన నా గుండెను బద్దలు చేసింది. పరిస్థితులు ఆమెను వయసుకు మించి పెద్దదాన్ని చేసినట్లుగా అనిపిస్తోంది. ఆమె బాల్యం ఛిద్రమైపోయింది’’ అమె ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచాధినేతలారా ఎక్కడున్నారు? అకస్మాత్తుగా మీ అందరికీ అంధత్వం వచ్చేసిందా?’’ అని ఇంకొకరు.. ‘‘ఈ చిన్నారి మాటల్ని విన్నాక మనుషులుగా మనం విఫలమయ్యాం అనిపించింది’’ ‘‘నా గుండె ముక్కలైపోయింది. ఎంత అవివేకమైన, స్వార్థం నిండిన లోకంలో మనం జీవిస్తున్నాం..’’ అనీ స్పందనలు వచ్చాయి. బ్యారీ మలోన్ అనే ట్విటిజెన్.. ‘‘దేవుడా.. ఆ చిన్నారికి నీ దీవెనలివ్వు’’ అని వేడుకున్నాడు. నదీన్ టీచర్ ఝీద్ కూడా ట్వీట్ చేశారు. ‘‘తను నా స్టూడెంట్. తన చుట్టు పక్కల ఏం జరిగిందో ప్రెస్ అడుగుతుంటే చెబుతోంది. దేవుడి దయవల్ల నదీన్, ఆమె కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. అయితే తనింకా షాక్ నుంచి తేరుకోలేదు’’ అని రాశారు. నదీన్లానే షాక్ నుంచి తేరుకోని బాలలు, మహిళలు, వృద్ధులు గాజాలో ఎంతో మంది ఉండి ఉంటారు. ఇది ఎలా మొదలైనా కానీ, చిన్నారుల హరివిల్లుల లోకంలో నిప్పురవ్వలు కురిపించకుండా అంతమైపోవాలి. మనుషులుగా మనం.. పిల్లల పూలతోటలో తిరిగి మొలకెత్తాలి. Terrified 10 year old girl from Gaza explaining how growing in such conditions is preventing her from having a decent education and environment where she could become a productive person for her community.#PalestinianLivesMatter #GazaUnderAttack pic.twitter.com/5a7tdkFGhN — Hamza Ghammat (@GHHamzaaa) May 18, 2021 -
ఆ సమయం నాకు బ్యాడ్‌లక్.. అందుకే ఏడ్చేశా: పుజారా
ముంబై: చతేశ్వర్ పుజారా.. సమకాలీన క్రికెట్లో అత్యున్నత టెస్టు ఆటగాడిగా ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తన అసాధారణ బ్యాటింగ్‌తో ఎన్నోసార్లు టీమిండియాను గట్టెక్కించాడు. అలాంటి పుజారా తన కెరీర్లోనూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. తన కెరీర్లో అత్యంత క్లిష్టమైన సమయాన్ని ఎలా అధిగమించాననే విషయాన్ని ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ‘నా కెరీర్లో తొలిసారి నేను గాయపడినప్పుడు దాని నుంచి బయట పడటం చాలా కష్టంగా అనిపించింది. ఆ ఇంజ్యురీ నుంచి రికవర్ అవ్వడానికి ఆరు నెలలు పడుతుందని టీమ్ ఫిజియో చెప్పారు. దీంతో నేను చాలా నిరాశ, ఆందోళనకు గురయ్యా. ఏం చేయాలో పాలుపోక ఏడ్చేశా. అప్పుడు నేను నెగిటివ్ మైండ్‌సెట్‌తో ఉన్నా. మళ్లీ క్రికెట్ ఆడగలనా? ఒకవేళ ఆడినా అంతర్జాతీయ స్థాయిలో రాణించగలనా అనే సందేహాలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఒకానొక సమయంలో నా తల్లి దగ్గరకు వెళ్లి ఏడ్చాశా. అయితే నా తల్లి నాకు అండగా నిలబడి.. జీవితంలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుందని.. వాటికి సిద్ధంగా ఉండాలంటూ దైర్యం చెప్పింది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా మద్దతుగా నిలబడ్డారు. దీంతో నా భవిష్యత్తు గురించి ఆలోచించడం ఆపేసి, వర్తమానంపై దృష్టి పెట్టా’ అంటూ పుజారా చెప్పుకొచ్చాడు. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండటానికి యోగా, మెడిటేషన్, ప్రార్థన తనకు చాలా ఉపయోగపడ్డాయని పుజారా వివరించాడు. ఇక టెస్టు క్రికెటర్‌గా తనదైన ముద్ర వేసిన పుజారా ఐపీఎల్లో ఆడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరిలో జరిగిన మినీ ఐపీఎల్ వేలంలో సీఎస్కే రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో సీఎస్కే ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ పుజారాకు అవకాశం రాలేదు. తుది జట్టు పటిష్టంగా ఉండడంతో పుజారా బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ కరోనా సెగ తగలడంతో ఐపీఎల్ 14వ సీజన్ రద్దు అయింది. దీంతో పుజారాకు నిరాశే మిగిలింది. ఐపీఎల్ సీజన్ పూర్తిగా జరిగింటే కనీసం ఒకటి.. రెండు మ్యాచ్‌లైనా ఆడే అవకాశం వచ్చి ఉండేది. ఇక సీఎస్కే గతేడాది ఐపీఎల్ సీజన్‌ను మరిపిస్తూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. చదవండి: అందరూ సేఫ్‌గా వెళ్లాకే నేను ఇంటికి పోతా! -
తనివితీరా ఏడుద్దాం
నవ్వు నాలుగు విధాలా చేటు అని పెద్దలు అంటే ఏడుపు ఎన్నో విధాల రైటు అని ఆధునికులు అంటున్నారు.రోజువారీ పనుల్లో పడి మనంభావోద్వేగాలను అణచేసుకుంటున్నాం.. మరెన్నో మర్చిపోతున్నాం. అలాగే తనివితీరా ఏడవడం కూడా మర్చిపోతున్నాం అంటున్న హెల్తీ క్రైయింగ్ క్లబ్... నగరవాసులకు ఏడవడం నేర్పిస్తోంది. ఏడిస్తే పోయేదేం లేదు అనారోగ్యం తప్ప అని నచ్చచెబుతోంది. సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని గుజరాతి సేవా మండల్ ప్రాంగణంలో ఒక ఆడిటోరియం... కొన్ని రోజుల క్రితం ఓ ఆదివారం దాదాపు 600 మంది పోగయ్యారు. కాసేపటి తర్వాత అందరూ ఒక్కపెట్టున ఏడుపు లంకించుకున్నారు. కాసేపు తనివిదీరా ఏడ్చాక ఒకరివైపు ఒకరు ఆప్యాయంగా చూస్తూ నవ్వుకున్నారు. కాసిన్ని స్నాక్స్ తిని ముచ్చట్లు చెప్పుకుని నిష్క్రమించారు. చూసేవారికి వీరి వ్యవహారం తేడాగా అనిపించవచ్చు గానీ... ఏడవడం రాకపోవడమే తేడా అని వీరు అంటున్నారు తెలంగాణలోని తొలి క్రైయింగ్ క్లబ్ నిర్వాహకులు. నవ్వుతో పాటూ ఏడుపూ ముఖ్యమే... ఆల్వేస్ బీ చీర్‌ఫుల్ లాఫర్ అండ్ క్రైయింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇకపై నెలకోసారి ఇలాగే ఏడుస్తాం అని నిర్వాహకుల ప్రకటించారు. మనసారా నవ్వలేని వారికి నవ్వుల్ని నేర్పేందుకు, నవ్వించేందుకు లాఫర్ క్లబ్స్ ఎలాగైతే పుట్టుకొచ్చాయో... అలాగే క్రైయింగ్ క్లబ్స్ కూడా ఊపిరిపోసుకున్నాయి. లాఫ్టర్ క్లబ్స్ 1990 ప్రాంతం నుంచే మన దేశంలో అడుగుపెట్టి ఇప్పుడు నగరవాసుల జీవితంలో భాగంగా మారిపోయాయి. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా పంచుకోవాలనే సందేశం ఇస్తూ లాఫర్ క్లబ్స్ వస్తే... నిరాశ, నిస్పృహలు కూడా జీవితంలో భాగమేనని పంచుకుంటే పోయేవేనని చెబుతూ ఈ క్రైయింగ్ వ్యాయామాలకు శ్రీకారం చుట్టాం అని సూరత్‌వాసి ఈ క్లబ్స్‌కు శ్రీకారం చుట్టిన కమలేష్ మసాలావాలా అంటున్నారు. ఏడుపు...ఆరోగ్యానికి మదుపు ఈ క్రైయింగ్ అనేది పలు ఆరోగ్యకర లాభాలను అందిస్తుందని వైద్యులు అంటున్నారు. ‘‘ఈ సెషన్ పూర్తయ్యాక మనసుకు చాలా నిశ్చింతగా తేలికగా అనిపించింది. ఈ అనుభవం ప్రపంచం నుంచి నన్ను దూరంగా తీసుకెళ్లింది’’ అని సెషన్లో పాల్గొన్న సత్యరాజ్ చెప్పారు. ‘‘ఏడుపు వల్ల మనసు మాత్రమే కాదు కళ్లు, కన్నీటి వాహికలు శుభ్రపడతాయి. సాధారణ కంటి సమస్యలకు వాడే ఐడ్రాప్స్కి ఇది మేలైన ప్రత్యామ్నాయం. అందుకే కనీసం నెలకు ఒకసారైన తనివిదీరా కళ్లమ్మట నీళ్లు పెట్టుకోమని నేను నన్ను సంప్రదించేవారికి చెబుతుంటా’’ అంటున్నారు అదే సెషన్‌కి హాజరైన ఆప్తమాలజిస్ట్ డా. ఎ. సాయిబాబా గౌడ్. అలాగే... మానసిక వైద్యులు చెబుతున్న ప్రకారం... ఒంటరిగా కంటే... సామూహికంగా తన బాధను అందరితో కలిసి తీర్చుకోవడం వల్ల తమ నష్టాలను,కష్టాల నుంచి సేదతీరడానికి అవకాశం ఎక్కువ. ఇలా...ఏడుస్తారు... ఒక ప్రాంగణంలోకి అందరూ చేరాక... ఓ ఐదు నిమిషాల ధ్యానం తర్వాత ఈ సెషన్ ప్రారంభం అవుతుంది. మొదటగా... ప్రేమించిన వారిని కోల్పోవడం కావచ్చు లేదా ఆఫీసులో వచ్చిన చిన్న సమస్య కావచ్చు.. తమ జీవితంలోని ఏదైనా సరే కష్టం, నష్టాన్ని గుర్తు తెచ్చుకోవాలని హాజరైన వారిని నిర్వాహకులు కోరుతారు. అది నిమిషాల్లోనే కనీసం 20 మంది లీడింగ్ మెంబర్స్ అనేవారు ఏడవడం ప్రారంభిస్తారు. కాసేపట్లోనే ఆ మూడ్ అందర్నీ కమ్మేస్తుంది. కళ్లమ్మట నీరు కారుస్తూ ఉండేవారు కొందరైతే కాస్త గట్టిగానే ఏడుపు లంకించుకునేవారు మరికొందరు. నిర్వాహకుల సూచనలకు అనుగుణంగా నెమ్మదిగా ఒక్కొరొక్కరుగా ఆ మూడ్ నుంచి బయటకు వస్తారు. అందరూ వచ్చాక మరో 5 నిమిషాల పాటు నిశ్చలంగా ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయి కాసేపటికి తేరుకుంటారు. అలా క్రైయింగ్ సెషన్ ముగుస్తుంది. చక్కని వ్యాయామం.. ఈ క్రైయింగ్ అనేది అత్యంత సహజమైన భావోద్వేగం. ఏడవడం అనేది సిగ్గుపడాల్సిన పని కాదు. మనసులో బాధ ఉన్నా పైకి ఏడవలేకపోతేనే సిగ్గుపడాలి. ఏడవడం వల్ల శరీరంతో పాటు మనసుకూ చక్కని వ్యాయామం అందుతుంది. మనమంతా మరచిపోతున్న కన్నీరు పెట్టుకోవడం అనేది సాధన చేసైనా సరే అలవర్చుకోవాలని చెప్పడమే మా క్రైయింగ్ క్లబ్ ఉద్దేశ్యం. –కమలేష్ -
ఉల్లి కిలో రూ.8 : కన్నీరు మున్నీరవుతున్న రైతు
సాక్షి, ముంబై: ఒకవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. మరోవైపు మహారాష్ట్ర ఉల్లి రైతులు పండించిన పంటకు కనీస విలువ లభించక లబోదిబో మంటున్నారు. ఆరుగాలం శ్రమించిన పండించిన పంటకు సరియైన ధర లభించక కన్నీరు మున్నీరవుతున్నాడు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి దర సుమారు రూ.100 పలుకుతోంటే..అహ్మద్ నగర్‌కు చెందిన రైతుకు లభించింది మాత్రం రూ. 8. దీంతో రైతులు తీరని సంక్షోభంలో కూరుకుపోయిన రైతు పొలం నుంచి ఉల్లిపాయను తీసిన కార్మికులకు ఏమి చెల్లించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి? అని బిడ్డల్ని ఎలా పోషించాలంటూ కన్నీరు పెడుతున్న వైనం పలువుర్ని కదిలిస్తోంది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. రైతుల పరిస్థితి వారికి పట్టదని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అటు విపరీతంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలకు దిగింది. ఒక లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయిచింది. దిగుమతి చేసుకున్న ఉల్లిని నవంబర్ 15- డిసెంబర్ 15 మధ్యకాలంలో దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇటీవల ప్రకటించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర పౌరులు తమ తీర్పునిచ్చి పద్దెనిమిది రోజులు గడిచాయి. కానీ బీజేపీ-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి పీఠం ఎవర్ని వరించబోతోందన్న ఉత్కంఠకు ఇంకా తెరపడలేదు. దీంతో రాష్ట్ర రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, కాంగ్రెస్‌తో భారీ మంతనాలు సాగించి చివరకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధ మవుతుండటంతో, మహారాష్ట రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేచినట్టే. This is so heartbreaking! A poor farmer from Ahmednagar, #Maharashtra got a measly Rs 8/kg for his onion produce. He is devastated & doesn't know how he is going to pay labourers or feed his family. This is what the man busy trying to save his CM's chair has done for farmers! pic.twitter.com/Zv8sZHMUkw — Sunil Ahire (@SunilAh64145529) November 10, 2019 -
ఏడుస్తున్నాడని పెదాలను ఫెవీక్విక్‌తో ...
పట్నా : కడుపున పుట్టిన బిడ్డ పట్ల కన్నతల్లే కర్కశంగా వ్యవహరించింది. సాధారణంగా పిల్లలు ఏడుస్తుంటే...ఆపమని అదిలిస్తాం....బెదిరిస్తాం. అప్పటికీ వాళ్లు ఆపకుంటే ’రెండంటిస్తాం’ అని చెబుతాం. అయితే ఆపకుండా ఏడుస్తున్న కొడుకు నోరు మూయించేందుకు .... ఓ తల్లి...ఏకంగా అతగాడి పెదాలకు ఫెవీక్విక్ (గమ్) రాసి, అంటించేసింది. అయితే ఈ విషయాన్ని గమనించిన తండ్రి... కొడుకును ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించడంతో తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంఘటన బిహార్‌లోని చాహాప్రాలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధిత చిన్నారి తండ్రి మాట్లాడుతూ...’పనుండి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బాబు ఏడవడం లేదు. అయితే అతడి నోటి నుంచి నురుగు వస్తోంది. దాంతో ఏం జరిగిందని నా శోభను భార్యను అడిగాను. ఆపకుండా ఒకటే ఏడుస్తున్నాడని, అందుకే కొడుకు ఏడుపు ఆపేందుకు గమ్ రాసినిట్లు చెప్పింది.’ అని పేర్కొన్నాడు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తనివితీరా ఏడవండి
సాక్షి, వెబ్‌డెస్క్ : సుఖ - దుఃఖాల కలయికే జీవితం అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం, బాధ రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. సినిమాలు, ఆటలు, పాటలు, స్నేహితులతో కబుర్లు, విహారయాత్రల్లో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే.. మరికొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికే పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే.. కొంతమంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. ఉబికివస్తోన్న భావోద్వేగాలను అణచుకుంటారే తప్ప.. ఏడవడానికి సాహసించరు. కన్నీళ్లు కార్చడం ఓ పిరికిపంద చర్య అని, ఎవరేమనుకుంటారోనని, అందరి ముందు ఏడవడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధను మర్చిపోయి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నవ్వుతూ ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే, నవ్వడం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... ఏడుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని, దానివల్ల ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏడవండి... బాగా ఏడవండి ఆనందాన్ని నలుగురితో పంచుకొని..బాధను మనలోనే ఉంచుకోవాలంటారు. కానీ ఇది తప్పు అంటున్నారు జపాన్‌కు చెందిన హైస్కూల్ టీచర్ హీదెఫూమీ యోషిదా. ఏడవండి.. బాగా ఏడవండి.. ఏడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. నవ్వడం కంటే ఏడవడం వల్లే ఎక్కువ ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఈ విషయం ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగిందని వెల్లడించారు. వారానికి ఒక్కసారైనా గట్టిగా ఏడవడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఎవరీ హీదెఫూమీ యోషిదా..? హీదెఫూమీ యోషిదా (43) జపాన్‌కు చెందిన టీచర్. గత కొన్నేళ్లుగా ఏడవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఆయన పరిశోధనలు సాగిస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై ఉపన్యాసాలు ఇస్తూ... ఎలా ఏడవాలో అన్న అంశంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ‘నామిదా సెంసోయీ’ (టియర్స్ టీచర్)గా పేరు గాంచిన ఈయన ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు, ఉద్యోగులకు ఏడుపులోని పరమార్థాన్ని వివరించి.. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుంగా 2014లో తోహో యూనివర్సీటీకి చెందిన ప్రొఫెసర్ హితేహో అరితాతో జతకట్టి ‘ఏడవడం వల్ల ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చు’ అనేదానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా యోషిదా ప్రచారం ఓవైపు... ప్రతి కంపెనీలోని ఉద్యోగికి ఒత్తిడి చెకప్ చేయించుకోవాలంటూ జపాన్ ప్రభుత్వం నిబంధన మరోవైపు వెరసి జపాన్‌లో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒత్తిడి తగ్గింపునకు జపాన్ కొత్త ప్రయత్నం సాధారణంగా జపనీయులు కష్టజీవులు. తక్కుత విశ్రాంతి తీసుకొని ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో వారు ఎంతో ఒత్తిడికి కూడా గురవుతుంటారు. ఇక్కడి ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా జపాన్‌లో ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పద్దతిని ప్రవేశపెట్టారు. ఒత్తిడిని తప్పించుకునేందుకు వారు నవ్వుకు బదులు ఏడవడంపై దృష్టిపెట్టారు. ఇక్కడి కంపెనీల్లోని ఉద్యోగులను, స్కూళ్లలోని విద్యార్థులను వారంలో ఒకరోజు ఒక చోటచేర్చి పెద్ద పెట్టున ఏడ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఏడుపుపై శిక్షణ ఇచ్చేందుకు ట్రైనర్లను కూడా నియమిస్తున్నారు. జపాన్‌తో పాటు చాలా దేశాలు ఒత్తిడి తగ్గించడం కోసం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. దక్షిణ కొరియా నంబర్‌వన్... ప్రపంచంలో దాదాపు 90శాతం మంది డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మానసిక అనారోగ్యానికి గురవుతున్న వారిలో సగం శాతం మంది 14 ఏళ్ల వయసు వారే ఉండటం గమనార్హం. వారిలో చాలా మందికి చికిత్స అందటం లేదు.15-29 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంస్థ వెల్లడించింది. కాగా ఒత్తిడిని తగ్గించి ఆత్మహత్యలను నిలువరించేందుకు జపాన్ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే జపాన్‌లోనే సూసైడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2003లో చనిపోయిన వారిలో 38 శాతం మంది ఆత్మహత్యలే చేసుకుని మరణించిన వారేననని సర్వేలో తేలింది. 2017 సంవత్సరంలో దాదాపు 21,321 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ప్రతీ లక్ష మందిలో 16.6శాతం మంది ఆత్మహత్యలు చేసుకొనే చనిపోతున్నారు. ఆత్మహత్య కేసులు ఎక్కువగా నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా (25.8శాతం) మొదటి స్థానంలో, రష్యా (19.3శాతం) రెండో స్థానంలో ఉండగా జపాన్ మూడో స్థానంలో నిలిచింది. కన్నీళ్లు మూడు రకాలు... ఏడవడం వలన కలిగే ప్రయోజనాల గురించి సాగించిన పరిశోధనల్లో దీనివలన సత్ఫలితాలుంటాయిని తేలిందట. మన కంటి నుంచి మూడు రకాలుగా కన్నీళ్లు వస్తాయట. ఒకటి అంసకల్పికంగా వచ్చే కన్నీళ్లు. ఇది ఇతరులు మనకు చికాకు తెప్పిచ్చినప్పుడు వస్తాయి. రెండోది సాధారణం కన్నీళ్లు ఒక్కొసారి అనుకోకుండా మన కంటి నీళ్లు కారుతుంటాయి. ఇవి మన కంటిని తడిగా ఉంచుతాయి. మూడోది ఎమోషనల్ కన్నీళ్లు.. బాధ, ఒత్తిడికి గురైనప్పుడు వస్తాయి. ఇలా వచ్చిన కన్నీళ్లు ఆరోగ్యానికి మంచివట. మన శరీరం నుంచి చెమట రూపంలో మలినాలు ఏవిధంగా బయటకు పోతాయో...ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఏడిస్తే అది గుండెల నుంచి మోయలేని భారాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుందట. అందుకే ఇటీవలి కాలంలో మానసిక వైద్యులు తమ దగ్గరకు వచ్చే రోగులకు... రోదించాలని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ఏడుపు ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి హాయిగా తనివితీరా ఏడిచి ఆరోగ్యంగా ఉండండి. - అంజి శెట్టె, ఇంటర్నెట్ డెస్క్. -
పడవ ప్రమాదం: శోక సంద్రంలో తోటి విద్యార్ధులు
-
సెటైర్.. ఉత్తమ నటుడు ఎవరంటే..
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తానేం సంతోషంగా లేననే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేశారు. పైగా తనకు తాను గరళ కంఠుడిలా అభివర్ణించుకుంటూ శనివారం ఓ సన్మాన కార్యక్రమంలో వేదికపైనే ఆయన కంటతడి పెట్టుకున్నారు కూడా. అయితే ఇదే అదనుగా.. ఈ వ్యవహారంపై బీజేపీ సెటైర్ల వేయటం మొదలుపెట్టింది. ప్రజలను ఆయన పిచ్చోళ్లను చేస్తున్నారంటూ మండిపడుతోంది. ‘మన దేశం ఎంతో మంది ప్రతిభ ఉన్న ఆర్టిస్టులను అందిస్తోంది. నటులు కూడా వారి నటనతో ఆడియన్స్‌ను మైమరిచిపోయేలా చేస్తూ.. ఆకట్టుకుంటున్నారు. ఇదిగో అక్కడ మరో దిగ్గజ నటుడు కుమారస్వామి కూడా ఉన్నారు. తన నటనా పటిమతో ఏకధాటిగా ప్రజలను మూర్ఖులను చేస్తూ వస్తున్నారు... అండ్ ది బెస్ట్ యాక్టింగ్ అవార్డు గోస్ టూ... అంటూ వ్యంగ్యంగా ఓ పోస్టును బీజేపీ ట్విటర్లో పోస్టు చేసింది. పైగా దానికి కుమారస్వామి కంటతడి పెట్టిన వీడియోను జత చేసింది. ఆయన సంతృప్తిగానే ఉన్నారు... ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వంపై కుమారస్వామి సంతృప్తిగానే ఉన్నారని జేడీఎస్ పార్టీ కార్యదర్శి దానిష్ అలీ పేర్కొన్నారు. సీఎం కుమారస్వామి కేవలం భావోద్వేగంతోనే అలా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ అలీ చెప్పుకొచ్చారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. జేడీఎస్ కేవలం 37 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. సీఎం పదవి ఇచ్చి తాము అమృతమే ఇచ్చామనీ, విషం ఇవ్వలేదని కాంగ్రెస్ చెబుతోంది. సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తే మంచిదని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే.. సీఎం కుమారస్వామికి సూచిస్తున్నారు. & the best acting award goes to.. Our country has produced talented actors. Actors who have mesmerised the audience with their brilliant performance, here we have another legendary actor Mr Kumaraswamy, an actor who has constantly fooled common man with his amazing acting skills pic.twitter.com/SNfi9LsAS6 — BJP Karnataka (@BJP4Karnataka) 15 July 2018 -
ఒక్కసారి వచ్చి ఏడ్చిపోరా..?
ఎవరైనా చనిపోతే.. శత్రువుకైనా కన్నీళ్లు వస్తాయి అంటారు.. ఎక్కడైనా ఇది కామన్. అయితే ఆఫ్రికాలోని ఘనాలో ఏడవడం తప్పనిసరి సంప్రదాయం అట. ఎందరు ఏడుస్తున్నారన్న దాన్ని బట్టి చనిపోయిన వ్యక్తిని ఎందరు ప్రేమిస్తున్నారనేది అంచనా వేస్తారట. పైగా ఎంతమంది ఏడిస్తే అంత ప్రెస్టేజీగా భావిస్తారు అక్కడి వారు. కొందరు తమ బంధువులు చనిపోతే ఏడుపు రావట్లేదట. అందుకే డబ్బులు ఇచ్చి మరీ ఏడ్పించుకుంటున్నారట. అందుకు కొందరు మహిళలను నియమించుకుంటున్నారట. ఇప్పుడు అక్కడ అదో బిజినెస్‌గా మారిపోయింది. అలా ఏడ్చేందుకు మహిళలు కావాలంటే అమీ డోక్లీ దగ్గరికి వెళ్లాల్సిందే. ఆమె వారందరికీ బాస్ అన్న మాట. తెలియని వారి దగ్గరికి వెళ్లి ఏడవడం అంటే అంత సులువేం కాదని, అందుకే డబ్బులు తీసుకుని మరీ ఏడుస్తున్నామని అమీ చెబుతోంది. కాస్త పెద్ద కార్యక్రమంగా చేయాలనుకుని ఎక్కువ డబ్బులు ఇస్తే గట్టిగా ఏడుస్తామని, తక్కువ డబ్బులు ఇస్తే చిన్నగా ఏడుస్తామని వివరించింది. ఎంత పిండికి అంత రొట్టె అన్న మాట! -
కన్నీరు పెట్టుకున్న హరితేజ
-
సల్మాన్‌కు శిక్ష.. ఆ బాధ వారికే ఎక్కువ
సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్‌పూర్ కోర్టు ఊహించని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో అభిమానులు కంగుతిన్నారు. అయితే సల్మాన్‌కు జైలు శిక్ష విషయంలో అందరికంటే ఎక్కువగా బాధకు గురైంది సల్మాన్ చెల్లెల్లు అల్విరా, అర్పితా ఖాన్. తీర్పు వెలివడిన వెంటనే వీరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు విరామ సమయంలో కూడా వారు బయటకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నారు. జడ్జి ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సల్మాన్ మాత్రం నేను నిర్దోషినంటూ జడ్జికి పదేపదే విన్నవించుకున్నారు. సల్మాన్ తరుపు లాయర్కూడా ఈ తీర్పుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఐదేళ్లు శిక్ష విధిస్తారని తాము ఊహించలేదని తెలిపారు. ఇప్పటికే బెయిల్ కోసం కోర్టు ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు(శుక్రవారం) విచారణ జరగనుంది. ప్రస్తుతం సల్మాన్ మీద వందల కోట్ల రూపాయల బిజినెస్ ఆధారపడి ఉంది. ఇటీవల రేస్ 3 షూటింగ్ ను పూర్తి చేసిన సల్లూభాయ్ భరత్, దబాంగ్ 3లలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. సల్మాన్‌కు శిక్ష పడటంతో ఈ చిత్రాల భవిష్యత్తు సందిగ్థంలో పడింది. సల్మాన్‌కు బెయిల్ రాకపోతే నిర్మాతలు వందల కోట్ల నష్ట కలుగుతుందంటున్నారు విశ్లేషకులు. -
'పెళ్లే బాబూ.. ఉరెయ్యట్లేదు'.. పెళ్లికొడుకు ఒకటే ఏడుపు
-
పెళ్లికొడుకు వెక్కివెక్కి ఏడుపు.. ఎందుకంటే..
సాక్షి, పట్నా : సాధారణంగా పెళ్లంటే కొందరికి పెద్ద సంబరం. ముందే అనుకొని చేసుకునే పెళ్లిల్లయితే కాస్త చీకు చింత లేకుండా చేసుకుంటారు.. కానీ, అనూహ్యంగా చేసుకోవాల్సి వచ్చిన పెళ్లిళ్లయితే మాత్రం కొందరికి పట్టరాని సంతోషాన్నివ్వగా మరికొందరికి మాత్రం విషాదంగా కనిపిస్తాయి. బిహార్‌లో ఓ యువకుడి జీవితంలోకి మాత్రం అనుకోని, అనుకోకుండా కాకుండా.. ఓ బుల్లెట్‌లాగా పెళ్లి దూసుకొచ్చింది. సరదాగా పెళ్లికి వెళ్లి తిరుగు పయానమైన అతడు పెళ్లికొడుగ్గా మారాల్సి వచ్చింది. బోరుమని ఏడుస్తూ తన పక్కన తెలిసిన వారే లేకుండా తనపైకి ఎక్కుపెట్టిన తుపాకీని చూస్తూ తాళికట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వినోద్ కుమార్ అనే యువకుడు బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడు డిసెంబర్ 3న పట్నాలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు హతియా-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బొకారో నుంచి బయలు దేరాడు. అయితే, సురేంద్ర యాదవ్ (ప్రస్తుతం అతడు బలవంతంగా పెళ్లి చేసుకున్న యువతి సోదరుడు) అనే వ్యక్తి అతడికి ఫోన్ చేసి మోకామాకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లగానే అతడిని కిడ్నాప్ చేసి పండారక్ గ్రామానికి తీసుకెళ్లి తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తామంటూ హెచ్చరించారు. అయితే, తనను విడిచిపెట్టాలని సురేంద్ర ఎంతో బతిమాలుకున్నాడు. అయిన వినకుండా చేయి కూడా చేసుకొని పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి పెళ్లి జరిపించారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అతడు ఏడుస్తూనే ఉన్నాడు. కొంతమంది అయితే, అతడిని ఓదారుస్తూ 'నీకు పెళ్లే చేస్తున్నారు.. ఉరేయడం లేదు' అంటూ ఆ సమయంలో పరాచికాలు కూడా ఆడారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కన్నీరు పెట్టుకున్న క్రికెటర్!
-
మహిళల అరెస్టుతో పసిపిల్లల ఆక్రందనలు
-
చనిపోయిన తల్లిని నిద్రలేపేందుకు....
-
కంగారు పెట్టిన ప్రియాంక!
‘జై గంగాజల్’ షూటింగ్ లొకేషన్ అది. యూనిట్ అంతా కంగారుగా, హడావిడిగా ఉన్నారు. షూటింగ్ అంటేనే కంగారూ, హడావిడీ కామన్. కానీ, ఆ రోజు చిత్రబృందం కంగారుపడటానికి కారణం వేరే ఉంది. చిత్రకథానాయిక ప్రియాంకా చోప్రా నాన్‌స్టాప్‌గా ఏడుస్తున్నారు. అందాల తార ఏడుస్తుంటే ఎవరికి మాత్రం కంగారుగా ఉండదు. ఇంతకీ ప్రియాంక ఎందుకు ఏడ్చారో తెలియాలంటే.. ఈ షూటింగ్ లొకేషన్లో ఏం జరిగిందో చెప్పాలి. ప్రకాశ్ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ పొరపాటు జరిగింది. విలన్ మానవ్ కౌల్, ప్రియాంకల మధ్య ఫైట్ సీన్ అది. విలన్ ప్రియాంకను కొట్టాక వెంటనే ఆమె తిరిగి కొట్టాలి. ప్రియాంక తన చేతి పవర్ ఏంటో చూపించారు. చెంప మీద కొట్టాల్సిన ప్రియాంక ఆ విలన్ గొంతు మీద కొట్టారు. ఆ పంచ్‌కు అతని గొంతు దగ్గర తీవ్రమైన గాయమై, రక్తం కారడం మొదలైంది. బాధతో విలవిలలాడిన అతన్ని చూసి, ప్రియాంక తట్టుకోలేకపోయారు. ఇప్పుడు తెలిసింది కదా? ప్రియాంక ఎందుకు ఏడుస్తున్నారో? ఆమెను ఓదార్చడం యూనిట్ వల్ల కాలేదట. దీని గురించి మానవ్ కౌల్ మాట్లాడుతూ- ‘‘నాకు అలా రక్తం రాగానే ప్రియాంక భరించలేక ఏడ్వడం స్టార్ట్ చేసింది. నేను ఇట్స్ ఓకే... పర్లేదు అని చెప్పినా ఆమె ఊరుకోలేదు’’ అని పేర్కొన్నారు. -
వెబ్‌క్యామ్ ముందు ఏడ్వండి!
పారిస్: నవ్వు నాలుగు విధాల చేటంటారు పెద్దలు. మరి ఏడ్వడం? ఏడిస్తే...ముఖ్యంగా వెక్కి వెక్కి ఏడిస్తే గుండెలో గూడుకట్టుకున్న విషాదం తొలగిపోతుందట. హృదయం తేలిక పడుతుందట. ఒంటరి తనం దూరమవుతుందట. తనువు తాపం తీరిపోతుందట. శరీరంలో కొత్త శక్తి పుట్టుకొచ్చి నూతనోత్సాహం కలుగుతుందట. ఇదీ పారిస్‌కు చెందిన ఓ యువ కళాకారిణి డోరా మౌటోట్ ఫిలాసఫీ. గత కొంతకాలంగా ఒంటరితనాన్ని భరించలేక కంప్యూటర్ వెబ్‌క్యామ్ ముందు పదే పదే ఏడ్చిన డోరా ఇప్పుడు తన కన్నీళ్లను ప్రపంచంతో పంచుకోవడానికి ‘వెబ్‌క్యామ్ టియర్స్’ పేరిట ఏకంగా ఓ ప్రాజెక్ట్‌నే చేపట్టింది. ‘నా కన్నీళ్లను షేర్ చేసుకోవడానికి మీరు కూడా వెబ్‌క్యామ్ ముందు ఒంటరిగా ఏడ్వండి. ఇదేమి నా పిచ్చి కాదు. ఈ సమాజంలో ఏడ్వడానికి ఎందుకు సిగ్గుపడతారు? ఏడ్వడం బలహీనతకు గుర్తనుకుంటున్నారా? అదేమి కాదు. ఈ ప్రపంచంతో మీ కన్నీళ్లను పంచుకోండి. ఆ వీడియో క్లిప్‌లను నాకు పంపించండి’ అని ఆమె ఫేస్బుక్, టంబ్లర్ పేజీల్లో పిలుపునిచ్చింది. అంతే సోషల్ వెబ్సైట్లో ఏడ్వడం అనే కొత్త ట్రెండ్ మొదలైంది. ఇప్పటికే ఆమెకు ఏడ్చే వీడియోలు దాదాపు వంద వచ్చాయట. అలా వచ్చిన వీడియోల క్లిప్పులన్నింటినీ ఓ చోట చేర్చి మళ్లీ సోషల్ మీడియాకు చూపిస్తుందట. ‘ 365 డేస్: ఏ కాటలాగ్ ఆఫ్ టియర్స్’ పేరిట ఏడాది పాటు తన విషాదాన్ని వెళ్లలగక్కిన లారెల్ నకాడేట్ అనే ఆర్టిస్ట్‌ను స్ఫూర్తిగా తీసుకొని తానీ ప్రాజెక్ట్‌ను చేపట్టానని, వెబ్సైట్లలో జననాంగాలను చూసి ఆశ్చర్యపడే రోజులు పోయాయని, ఇకముందు టియర్స్ కూడా కొత్తరకం పోర్నోగ్రఫీ అని వ్యాఖ్యానించారు. -
ఆ తల్లి ఏడుపే గుర్తొస్తుంది!
ఘటన అది 2009, సెప్టెంబర్ నెల, ఒక రోజు స్కూల్‌కి వెళ్లే సరికి ఒక అర్జెంట్ వార్త. ఇన్‌సర్వీస్ ట్రైనింగ్‌కి హైదరాబాద్‌కి వెళ్లాలి- అని చెప్పారు. ఇలాంటివి మాకు అర్జెంట్‌గా చాలా తక్కువ సమయం ఇస్తూ వస్తాయి. సరే మా స్కూల్ నుంచి నేను, ప్రభావతి మేడమ్ బయలుదేరాం. హైదరాబాద్‌లో ట్రైనింగ్ జరిగే ప్రదేశం వివరాలిచ్చారు. కానీ మాకు అదెక్కడ ఉందో తెలియదు. నగరంలో దిగి వెతుక్కోవాల్సిందే అనుకుంటూ బయలుదేరాం. హైదరాబాద్ రైల్వేస్టేషన్లో దిగేసరికి మాలాంటి ఎందరో ఉండక పోతారా అనే ధీమాలో రెలైక్కాం. మా రైలు లేటయ్యేసరికి ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్లెవరూ స్టేషన్లో కనిపించలేదు. ఇక మా పాట్లు మొదలయ్యాయి. ఆటోను పిలిచి ‘రామంతపూర్‌లోని సెయింట్ జాన్స్సెమినరీ’ అని చెప్పాం. ‘లోపలికి పోవాల్నా మేడమ్’ అన్నాడతడు. మాకు మాత్రం ఏం తెలుసు... గేటు నుంచి లోపలకు కిలోమీటరు ఉంటుందని. ఏదో అదృష్టం కొద్దీ లోపలికే బేరమాడుకుని ఆటో ఎక్కాం. సెయింట్ జాన్స్ సెమినరీ గేట్ దగ్గర నుంచి లోపలికి పోతూ ఉంటే చిన్న అడవిలో పోతున్నట్లు ఉంది. చక్కగా తలలూపుతున్న చెట్లు, చల్లటి గాలి... అసలు సిటీ వాతావరణమే లేనట్లు హాయిగా అనిపించింది. దారిలో మాలాంటి టీచర్లు బ్యాగ్‌లు మోసుకుంటూ వెళ్లడం కనిపించింది. దేవుడా! గేటు దగ్గర దిగి ఉంటే మాకూ ఇదే పరిస్థితి అనుకుంటూ సెంటర్‌కు వెళ్లే సరికి అప్పటికే ఆలస్యం అయిపోయిందట. పర్సనల్ రూములు లేవు. కామన్ గదుల్లో సర్దుకోవాలని చెప్పారు. శ్రీకాకుళం, వైజాగ్, నెల్లూరు, రాయలసీమ, ఆదిలాబాద్... మొత్తం ఇరవై మూడు జిల్లాల నుంచి వచ్చిన వారంతా ఉన్నారు. గదిలో పది మంచాలు, టాయిలెట్స్ బయట. ఎవరికి వాళ్లం లోలోపలే ‘ఛ కొంచెం ముందుగా రావల్సింది’ అని తిట్టుకున్నాం. కొంత సేపట్లోనే అందరి పరిచయాలయ్యాయి. రెండు బుజ్జి చందమామలతో కూడా. ఒకరికి ఏడు నెలలు, ఒకరికి ఎనిమిది నెలలు. మరి లేడీ స్టాఫ్‌కి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ వేస్తే ఇలాగే ఉంటుంది. మరీ చంటి పిల్లలైతే అమ్మను అడగరు. కానీ అమ్మను గుర్తు పట్టడం మొదలైతే అమ్మ వెంట రావాల్సిందే మరి. అలాంటి తల్లులు తోడుగా ఒకరు చెల్లిని, మరొకరు అత్తగారిని తెచ్చుకున్నారు. అది రంజాన్ మాసం. వహీదా అత్తగారు రోజా చేస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటే మేము ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లం వంతుల వారీగా బిడ్డను ఆడించేవాళ్లం. రాత్రికి సరదా కబుర్లు, స్కూలు పిల్లల జోక్స్‌తో గడిచిపోయేది. ‘‘వృత్తంలో అన్ని రేఖల కంటే పెద్దది ఏది’’ అని అడిగితే ఓ స్టూడెంట్ ‘భూమధ్య రేఖ’ అన్నదట. ‘ఆహా! ఏం స్టూడెంట్ మీకు! మ్యాథ్స్‌లో సోషల్ కలిపి చెప్పింది’ అని దుర్గ టీచర్ని ఆట పట్టించాం. అది ట్రైనింగ్ మొదలైన మూడో రోజు... మాకు క్లాసు జరుగుతోంది. ఎక్కడి నుంచో చిన్నగా ఏడుపు. చంటి బిడ్డ ఏడుపే. విననట్లే అందరూ రాసుకుంటూన్నారు. పిల్లలను తెచ్చుకున్న తల్లులు మాత్రం ఆదుర్దాగా కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. ఏ తల్లికి బిడ్డ కోసం పాలు పొంగుతున్నాయో ఎవరికి తెలుసు? పరశురామ్ గారు తిరిగి చూసినా ఒప్పుకోరు. అందరూ తల తిప్పకుండా పుస్తకాల్లో తల దూర్చి ఇచ్చిన ప్రాజెక్ట్స్ చూస్తూ ఉన్నాం. సన్నగా మొదలైన ఏడుపు క్రమంగా పెద్దదవుతోంది. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది బిడ్డ. అమ్మ కనిపించే వరకు ఆ ఏడుపాగదు. ఉన్నట్లుంది అనూష మేడమ్ లేచి వెళ్లి పోయింది. పర్మిషన్ అడగాలని కూడా మర్చిపోయిందా క్షణంలో. కన్నీళ్లు చెంపల మీద నుంచి జారిపోతున్నాయి. తుడుచుకోవాలనే ధ్యాస కూడా లేకుండా ఒకటే పరుగు. అందరం పైకి లేచి కిటికీ లో నుంచి తొంగి చూశాం. ఆ క్షణంలో ఎవ్వరికి కూడా క్లాస్‌లో ఉన్నామన్న స్పృహ కలగలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న బిడ్డ ఊపిరి ఆగిపోతుందేమోనన్న ఆందోళన ఒక్కటే. బాబు అమ్మ ఎత్తుకున్నా ఏడుపు ఆపలేదు. బాగా భయపడిపోయినట్లున్నాడు. బిడ్డను ఎత్తుకున్న తర్వాత కానీ అనూష మేడమ్‌కి తాను క్లాసు నుంచి వచ్చేశానని గుర్తుకు రాలేదు. భయంగా క్లాసు వైపు రాబోతుంటే... అందరం ‘మేడమ్, రూముకి తీసుకెళ్లండి’ అని అరిచాం. బాబును గుండెకు హత్తుకుంటూ కొంగు చాటు చేసుకుంటూ గది వైపు వెళ్లి పోయింది. బిడ్డ ఏడుపు తగ్గుముఖం పట్టడంతో అందరిలో రిలీఫ్. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు ఒక్కొక్కరుగా ట్రైనింగ్ ఇన్చార్జ్ దగ్గరకు వెళ్లాం. ‘సార్! పసిబిడ్డల తల్లులకు ట్రైనింగ్ వేయొద్దు’ అని రిక్వెస్ట్ చేశాం. ఆ సంఘటన ఆయన్ను కూడా కదిలించి వేసింది. ‘అలాగే నేను పై వాళ్లకు చెబుతాను’ అని హామీ ఇచ్చారు. మరి ప్రెగ్నెంట్స్ సంగతి? పైగా ఇలాంటి హామీలు ఇవ్వడమే కానీ, అవి అమలు జరగడం ఎప్పుడూ చూడలేదు. అప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్న చంటి బిడ్డల తల్లులను చూసినప్పుడు ఆ రోజు ఆ బిడ్డ ఏడుపు, తల్లి ఏడుపే గుర్తుకు వస్తూ మనసు పిండేసినట్లు ఉంటుంది. - వాయుగుండ్ల శశికళ, టీచర్, సూళ్లూరుపేట -
రోదసిలో ఏడిస్తే.. ఇలా ఉంటుంది!
అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మనుషులపై రకరకాల ప్రభావాలు పడుతుంటాయి. అందులో ఇదొకటి. మామూలుగా మనం భూమిపై ఏడిస్తే కన్నీళ్లు కిందికి రాలిపడతాయి. కానీ రోదసిలో ఏడిస్తే ఇలా ముఖం మీదే గడ్డకట్టుకుపోతాయి! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఏడుపుపై మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని కెనడియన్ వ్యోమగామి, ఐఎస్ఎస్ కమాండర్ క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ ఇలా ప్రదర్శించి చూపారు. ఈ రోదసి ఏడుపును వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచగా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ‘ఏడవమని ఒకరు ఆదేశిస్తే ఎలా ఏడుస్తాం చెప్పండి?’ అంటూ క్రిస్ కంట్లో నీళ్లు పోసుకుని ఇలా కన్నీటి పరీక్ష చూపించారు. సన్నటి ట్యూబ్ కలిగిన వాటర్ ప్యాకెట్ ద్వారా నీటిని కంట్లోకి చిమ్ముకోవడంతో ఇలా నీళ్లు కిందికి రాలకుండా కంటి దగ్గరే ఉండిపోయాయి! -
ఏడవరా కన్నా..!
చిన్నపిల్లలు ఏడిస్తే.. ఏడవద్దురా కన్నా నీకు తాయిలాలు పెడతా అని మురిపించి ఏడుపును మరిపించడం అందరికీ తెలిసిందే. అయితే కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన ఓ పిల్లాడు మాత్రం పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను కలచివేస్తోంది. స్థానిక శ్రీరామ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న రమేష్, లక్ష్మీదేవి దంపతులకు ఇరువురు సంతానం. పెద్ద కుమారుడు అరవింద్(7) పుట్టినప్పటి నుంచి ఏడవకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. వైద్యులు పరీక్షించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెబుతున్నా.. వారి మనసు కుదుటపడటం లేదు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న ఈ పిల్లాడు.. కొట్టినా, తిట్టినా, గిచ్చినా కంట్లో నీటి చుక్క రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రెండో కుమారుడు అఖిల్(5) మాత్రం అందరిలానే ఏడుస్తుండటంతో పెద్ద కుమారుని విషయంలో తల్లిదండ్రులు బెంగ పెట్టుకున్నారు. సాధారణంగా పిల్లల కంట్లో కన్నీరు వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరు.. కానీ ఈ తల్లిదండ్రులు మాత్రం కుమారుడు ఏడిచే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై స్థానిక వైద్యాధికారి చెన్నకేశవులును వివరణ కోరగా బాలుడికి స్వరపేటికలో సమస్య ఉండొచ్చని తెలిపారు. -ప్యాపిలి -
వాళ్లు ఏడిస్తేనే నాకు ఆనందం!
‘‘వెండితెరపై మనం చూసే రెండున్నర గంటల సినిమా నిజం కాదు. కేవలం ఓ కథ. కానీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి, ‘నిజంగా జరుగుతోంది’ అని ఫీలైతే, ఆ సినిమా సక్సెస్ కిందే లెక్క’’ అంటున్నారు కంగనా రనౌత్. క్వీన్, రజ్జో, రివాల్వర్ రాణి.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నారు ఈ బ్యూటీ. పైగా... అన్నీ కథానాయిక పాత్ర ప్రాధాన్యంగా సాగే సినిమాలు కావడంతో కంగన చాలా ఆనందంగా ఉన్నారు. ఓ సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమాలోని పాత్రగా తాను మారిపోతానని చెబుతూ -‘‘కెమెరా ముందుకెళ్లిన తర్వాత నేను కంగన అనే విషయం మర్చిపోతాను. అది ఎలాంటి సన్నివేశం అయినా వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తాను. ఉదాహరణకు... ఏడ్చే సన్నివేశాన్ని తీసుకుందాం. గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చేస్తాను. నేను యాక్ట్ చేసిన చిత్రాల్లో కొన్నింటిని పబ్లిక్ థియేటర్లో చూస్తాను. అప్పుడు ప్రేక్షకుల హావభావాలు క్షుణ్ణంగా గమనిస్తాను. తెరపై నేను ఏడవడం చూసి, థియేటర్లో ప్రేక్షకులు కంట తడిపెట్టుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను నవ్వినప్పుడు వాళ్లూ నవ్వితే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ఇలాంటి ఆనందాలు నాకు చాలానే మిగిలాయి. సో.. నటిగా నేను సక్సెస్ అయినట్లేగా. ఇంకో విషయం ఏంటంటే.. ‘కంగన ఇటు గ్లామరస్ అటు పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న పాత్రలు చేస్తుంది. మనం కూడా అలానే చేయాలి. కేవలం గ్లామర్‌కి పరిమితం అయిపోకూడదు’ అని కొత్త తారలు నన్ను రోల్ మోడల్‌గా తీసుకోవాలన్నది నా ఆకాంక్ష. సినిమాలు ఎంపిక చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటా’’ అని చెప్పారు కంగనా.