![Sudha Murthy Had cry when she watched Alia Bhatt Raazi movie - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/24/Sudha-Murthy-Had-cry-when-she-watched-Alia-Bhatt.jpg.webp?itok=WWy9zmVR)
Sudha Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రముఖ రచయిత్రిగా, మానవతామూర్తిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఆధునిక కాలంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలలో తన ప్రేమ గురించి వెల్లడించింది. కాగా ఇటీవల ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజానికి ఎప్పుడూ సినిమాలలోని ఎమోషనల్ సీన్లు చూసి కంటతడి పెట్టుకోలేదని, 'అలియా భట్' (Alia Bhatt) నటించిన 'రాజీ' మూవీలో తన నటనకు ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదటి సారి 1958లో సినిమా చూసినట్లు, అప్పటి నుంచి వైజయంతిమాలకు అభిమానిగా మారానని చెప్పింది. ఈ తరం వారిలో 'అలియా భట్' నటనను అభిమానిస్తానని.. ఆమె గ్రేట్ యాక్టర్ అని కొనియాడింది.
(ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!)
అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, మ్యూజిక్ వంటి వాటని గురించి ఇంట్లో చర్చించుకుంటామని సుధామూర్తి తెలిపారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 190 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా 64 వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment