perfamence
-
నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేలకుపైగా కళాకారుల ప్రదర్శనలు!
జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకుపైగా కళాకారులు పాల్గొననున్నారు. రామకథా పార్కులో నేటి నుంచి రామకథ ప్రారంభం కానుంది. నేటి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నారు. రామోత్సవ్లో 35 వేల మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్లో కూడా రామనామం వినిపించనుంది. రాముని చిత్రాలతో కూడిన గాలిపటాలు తయారు చేసి, ఆకాశంలో ఎగురవేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి -
సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!
Sudha Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రముఖ రచయిత్రిగా, మానవతామూర్తిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఆధునిక కాలంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గత కొన్ని రోజులకు ముందు జరిగిన ఒక ఇంటర్వ్యూలలో తన ప్రేమ గురించి వెల్లడించింది. కాగా ఇటీవల ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి ఎప్పుడూ సినిమాలలోని ఎమోషనల్ సీన్లు చూసి కంటతడి పెట్టుకోలేదని, 'అలియా భట్' (Alia Bhatt) నటించిన 'రాజీ' మూవీలో తన నటనకు ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చింది. మొదటి సారి 1958లో సినిమా చూసినట్లు, అప్పటి నుంచి వైజయంతిమాలకు అభిమానిగా మారానని చెప్పింది. ఈ తరం వారిలో 'అలియా భట్' నటనను అభిమానిస్తానని.. ఆమె గ్రేట్ యాక్టర్ అని కొనియాడింది. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) అప్పుడప్పుడు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, మ్యూజిక్ వంటి వాటని గురించి ఇంట్లో చర్చించుకుంటామని సుధామూర్తి తెలిపారు. 2018లో విడుదలైన రాజీ సినిమాలో అలియా భట్ ఇండియా కోసం గూఢచారి పాత్రలో గొప్పగా నటించింది. ఈ మూవీ ఏకంగా రూ. 190 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా 64 వ ఫిలింఫేర్ అవార్డులలో ఏకంగా 5 అవార్డులను సొంతం చేసుకుంది. ఇందులో ఉత్తమ నటి పురస్కారం ఒకటి కావడం గమనార్హం. -
ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. సుల్తానాబాద్‌లో విద్యార్థులు ఇండియా చిత్రపటంలా నిలిచారు. ధర్మారంలో సాయిమణికంఠ, బ్రిలియంట్ మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ గీతాలపై నృత్యాలు చేశారు. కాల్వశ్రీరాంపూర్ అల్ఫోర్స్, గర్రెపెల్లి పాఠశాలల్లో విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. -
జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా
ఖమ్మం స్పోర్ట్స్: హైదరాబాద్‌లో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు చక్కని ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. అండర్–17 బాలుర విభాగంలో భరత్ రింక్–1లో ప్రథమస్థానం, రోడ్లో –1లో ద్వితీయస్థానంలో నిలిచాడు. భూషణ్ రింక్–4 విభాగంలో ద్వితీయస్థానం, రింక్–5లో తృతీయస్థానం, రోడ్–2లోనూ తృతీయస్థానంలో నిలిచాడు. అండర్–17 విభాగంలో భరత్, భూషణ్ జాతీయ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. విశాలాక్షి రింక్–1లో తృతీయస్థానం, హరిచంద్ర ప్రసాద్ రింక్–1లో తృతీయస్థానంలో నిలినట్లు సర్దార్ పటేల్ స్టేడియం స్కేటింగ్ శిక్షకుడు కె.సురేష్ తెలిపారు.