నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేలకుపైగా కళాకారుల ప్రదర్శనలు! | Ayodhya Ram Mandir: Ramotsav 2024 Starts From Today In Ayodhya, Cultural Events Will Continue For 76 Days - Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: నేటి నుంచి రామోత్సవాలు.. 35 వేలకుపైగా కళాకారుల ప్రదర్శనలు!

Published Mon, Jan 8 2024 12:29 PM | Last Updated on Mon, Jan 8 2024 1:25 PM

Ramotsav Starts From Today in Ayodhya - Sakshi

జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో దేశమంతటా పండుగ వాతావరణం నెలకొంది. నేటి (సోమవారం)నుంచి అయోధ్యలో రామోత్సవాలు ‍ప్రారంభమవుతున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ రామోత్సవాలలో మనదేశానికి చెందిన కళాకారులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే 35 వేలకుపైగా కళాకారులు పాల్గొననున్నారు. రామకథా పార్కులో నేటి నుంచి రామకథ ప్రారంభం కానుంది. 

నేటి నుంచి అయోధ్యలోని సరయూ నది ఒడ్డున  హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమయంలో కళాకారులు తమ కళాప్రతిభను ప్రదర్శించనున్నారు. రామోత్సవ్‌లో 35 వేల మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. 

అయోధ్యలో త్వరలో బాలరాముని విగ్రహప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రజలు రామభక్తిలో మునిగిపోయారు. త్వరలో అహ్మదాబాద్‌లో జరిగే కైట్ ఫెస్టివల్‌లో కూడా రామనామం వినిపించనుంది. రాముని చిత్రాలతో కూడిన గాలిపటాలు తయారు చేసి, ఆకాశంలో ఎగురవేస్తున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ స్వయంగా రాముని చిత్రపఠంతో కూడిన గాలిపటాన్ని ఎగురవేయనున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యలో శ్రీరాముణ్ణి కీర్తించనున్న దివ్యాంగ కవి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement